
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'హిట్-3'. హిట్ సిరీస్‌లో వస్తోన్న మూడో చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో నాని సరసన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. నాని బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదల చేయగా యూట్యూబ్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.
విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో హిట్-3 టీజర్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి దాదాపు 21 మిలియన్లకు పైగా వీక్షణలు సాధించింది. ఈ చిత్రంలో నాని మునుపెన్నడు కనిపించని పాత్రలో నటించారు. టీజర్‌లో సన్నివేశాలు చూస్తేనే ఆ విషయం అర్థమవుతోంది. ఇంతకుముందెన్నడు చేయని మోస్ట్ వయొలెంట్ పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ చిత్రంలో నాని.. అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో అభిమానులను అలరించనున్నారు.
అయితే ఇటీవల విడుదలైన విజయ్ దేవరకొండ మూవీకి 24 గంటల్లోనే 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఎన్టీఆర్ వాయిస్ అందించిన ఈ టీజర్‌కు ఇప్పటి వరకు 15 మిలియన్ల వీక్షణలు సాధించింది. కానీ నాని మూవీ హిట్-3 టీజర్ కేవలం 24 గంటల్లోనే కింగ్‌డమ్ వ్యూస్ రికార్డ్‌ను అధిగమించింది. దీంతో హీరో నాని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వేసవి కానుకగా మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment