ప్రేమ గలాటా
‘ఈరోజుల్లో’ ఫేం శ్రీ, హరిప్రియ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘గలాటా’. కృష్ణ దర్శకుడు. రాజేంద్రప్రసాద్‌వర్మ నిర్మాత. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు చెబుతూ -‘‘వినోదాత్మకంగా సాగే ప్రేమకథ ఇది.
ఇందులో శ్రీ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది’’ అని తెలిపారు. ‘‘తొలి షెడ్యూల్‌లో హీరోహీరోయిన్లతో పాటు అలీ, ఇతర పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. త్వరలోనే మలి షెడ్యూల్‌ని ప్రారంభిస్తాం’’ అని నిర్మాత తెలిపారు.
సాయికుమార్, నాగబాబు, అలీ, అన్నపూర్ణమ్మ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: ఫిరోజ్ ఖాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీతేజ నడింపల్లి.