Sri
-
Funday Story: బాలిశెట్టి అహం..!
బాలిశెట్టి.. కిరాణా కొట్టు వ్యాపారి. నిత్యావసర సరుకులు బియ్యం, బెల్లం, పప్పు, ఉప్పు, చింతపండు వంటివి అమ్మేవాడు. వ్యాపారం బాగా సాగటంతో చేతికింద పనివాడిని పెట్టుకోవాలని అనుకున్నాడు. పక్క గ్రామంలో ఉండే నర్సయ్య పనికి కుదిరాడు. బాలిశెట్టికి తన కింద పనిచేసేవారంటే చులకన ఎక్కువ. తన ముందు వాళ్లు దేనికీ సరితూగరనీ, ఎందుకూ పనికిరారనే అహంతో ఉండేవాడు. నర్సయ్యది కష్టపడి పనిచేసే స్వభావం. దుకాణం తెరిచినప్పటి నుండి మూసేవరకు బాలిశెట్టి చెప్పే రకరకాల పనులన్నిటినీ కాదనకుండా చేసేవాడు. దుకాణంలో దుమ్ము దులపడం, సరుకులు పొట్లాలు, మూటలు కట్టడం చేసేవాడు. అతనికి ఏమాత్రం విరామం దొరికినా.. పప్పులు, బియ్యంలో ఉండే రాళ్లు ఏరమని పురమాయించేవాడు బాలిశెట్టి. ఎంతపని చేసినా తృప్తి ఉండేది కాదు. పని వేళలు ముగిసి నర్సయ్య ఇంటికి వెళ్లబోతుంటే ఉల్లిగడ్డల బస్తాను కరణం గారింట్లోనో, బియ్యం బస్తాను మునసబు గారింట్లోనో వేసి పొమ్మనేవాడు. ఇంటికి ఆలస్యం అవుతుంది, మరునాడు వేస్తానంటే కించపరుస్తూ, వెక్కిరిస్తూ మాట్లాడేవాడు. బాలిశెట్టి కూతురు పెళ్ళీడు కొచ్చింది. చదువుకున్న పిల్ల కావటంతో మంచి సంబంధం కుదిరింది. నర్సయ్యను దుకాణం పనులతోపాటు, పెళ్ళి పనులకూ తిప్పుకోవటం మొదలుపెట్టాడు. దాంతో ఏ అర్ధరాత్రో ఇంటికి చేరేవాడు నర్సయ్య. ఇంట్లోవాళ్ళు బాలిశెట్టి దగ్గర పని మానేయమని ఒత్తిడి చేశారు. పెళ్ళికి మూడురోజుల ముందు బాలిశెట్టి ఇంట్లో దొంగలు పడి ఉన్న నగలు, నగదు దోచుకుపోయారు. కూతురు పెళ్లి ఆగిపోతుందని బాలిశెట్టి భయపడి నర్సయ్యకు చెప్పుకుని భోరున ఏడ్చాడు. ‘అయ్యా! మీరేం కంగారు పడకండి. మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి ఖర్చులు నేను సర్దుతాను’ అన్నాడు నర్సయ్య. ఆమాటకు బాలిశెట్టి ఆశ్చర్యపోయాడు. నర్సయ్యకు తన ఊరిలో పదిహేను ఎకరాల మాగాణి, ఇరవై ఎకరాల మామిడితోట, సొంత ఇల్లు ఉంది. ఇప్పుడు కొడుకు వ్యవసాయం పనులు చూసుకుంటున్నాడు. అతనికి ఇంట్లో కూర్చోని విశ్రాంతి తీసుకోవటం ఇష్టంలేకనే బాలిశెట్టి వద్ద పనిలో చేరాడని తెలిసింది. తన కూతురు పెళ్లికి నగదు సహాయం చేశాడు నర్సయ్య. ఆనాటి నుండి ఇతరులను తక్కువ అంచనా వేయటం, చులకనగా చూడటం మానేశాడు బాలిశెట్టి. — తేజశ్రీ -
తిరుమల బ్రహ్మోత్సవాలు : సింహ వాహనం పై శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)
-
నేడు శ్రీనివాస సేతు ప్రారంభం
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమ, మంగళవారాల్లో తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి తిరుపతి చేరుకుంటారు. తిరుపతిలోని నాలుగు దిక్కులను కలుపుతూ యాత్రికులు నేరుగా తిరుమల వెళ్లేందుకు అత్యాధునిక రీతిలో నిర్మిం చిన శ్రీనివాస సేతు (ఫ్లైఓవర్) ప్రారంబోత్సవం, ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ వర్చువల్ ప్రారంభోత్సవం, టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ (తిరుపతి–చెన్నై జాతీయ రహదారిలోని వడమాలపేట వద్ద 307 ఎకరాల్లో 3,518 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు) కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సీఎం జగన్ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత తిరుమల చేరుకుని వకుళమాత రెస్ట్ హౌస్, రచన రెస్ట్ హౌస్‌లు ప్రారంభిస్తారు. బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని శ్రీవారికి పట్టువ్రస్తాలు సమర్పిస్తారు. అనంతరం పెద్ద శేష వాహనం సేవలో పాల్గొని, రాత్రికి పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. నీటి పథకాలకు ప్రారంబో త్సవం మంగళవారం ఉదయం 6.20 గంటలకు శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్న అనంతరం కర్నూలు జిల్లా ఓర్వకల్లు చేరుకుంటారు. అక్కడి నుంచి కృష్ణగిరి మండలం లక్కసాగరం చేరుకుంటారు. అక్కడ డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలకు తాగు, సాగు నీరందించే లక్ష్యంతో చేపట్టిన 68 చెరువులను కృష్ణా జలాలతో నింపే పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నంద్యాల జిల్లా డోన్‌కు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు. -
జై సేన విజయం సాధించాలి
శ్రీకాంత్, సునీల్, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్, కార్తికేయ ప్రధాన తారాగణంగా వి. సముద్ర దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘జై సేన’. వి. విజయలక్ష్మీ సమర్పణలో వి. సాయి అరుణ్‌కుమార్ నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా బాగుంది. శ్రీకాంత్‌గారితో పాటు కొంతమంది కుర్రాళ్లు నటించారు. సునీల్‌ది స్పెషల్ రోల్. ఈ సినిమా విజయం సాధించాలి. సముద్ర ఇంకా మంచి సినిమాలు చేయాలి’’ అన్నారు. ‘‘శ్రీకాంత్, సునీల్ పాత్రలు హైలైట్‌గా ఉంటాయి. నలుగురు యువహీరోలు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. వారి పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది’’ అన్నారు సముద్ర. ‘‘త్వరలోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు సహ–నిర్మాత పి. శిరీష్ రెడ్డి. -
రైతుని కాపాడండి
‘‘సింహరాశి, శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఎవడైతే నాకేంటి, అధినేత వంటి పలు హిట్ చిత్రాలు తీసిన వి.సముద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జై సేన... ది పవర్ అఫ్ యూత్’. శ్రీకాంత్, సునీల్, శ్రీ ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రవీణ్, కార్తికేయ, హరీష్, అభిరామ్‌లు హీరోలుగా పరిచయమవుతున్నారు. శివ మహాతేజ ఫిలిమ్స్‌పై సాయి అరుణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్యాచ్ వర్క్ మినహా పూర్తయింది. సముద్ర మాట్లాడుతూ– ‘‘దేశానికి వెన్నెముక అయిన రైతుని కాపాడండి అంటూ ప్రభుత్వంతో, రాజకీయ నాయకులతో విద్యార్థులు చేసే యుద్ధమే ఈ సినిమా. మంచి సందేశం ఉన్న ఈ చిత్రం నాకు మరో హిట్ అవుతుంది. ఇందులో ఇద్దరు ప్రముఖ హీరోలు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను త్వరలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకి కెమెరా: వాసు, మ్యూజిక్: ఎస్ఆర్ రవిశంకర్, సహ నిర్మాతలు: శిరీష్ రెడ్డి, శ్రీనివాస్. -
‘శ్రీ’ పద్ధతిలో దిగుబడి ఘనం
సాక్షి,జగిత్యాల అగ్రికల్చర్: వరి పంటను రకరకాల పద్ధతుల్లో సాగు చేస్తున్నప్పటికీ ‘శ్రీ’ పద్ధతిలో వరిని సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ఇంగ్లిష్‌లో ‘శ్రీ’ అంటే ఎస్ఆర్ఐ (సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్). ఈ పద్ధతిని 1983లో మడగాస్కర్‌లో అభివృద్ధి చేశారు. శ్రీ పద్ధతిలో వరిని సాగు చేస్తే ఖర్చు లేకుండా ఎలా దిగుబడులు సాధించవచ్చనే విషయాల గురించి జగిత్యాలకు చెందిన క్రిషి సంస్థ ప్రతినిధి నర్సింగరావు(94410 35869) వివరించారు. ఎలాంటి నేలలు అనుకూలమంటే.. శ్రీ పద్ధతిలో సాగు చేయడానికి చౌడు నేలలు పనికి రావు. నీరు బాగా ఇంకే భూములు, చదునుగా ఉండే భూములు అనుకూలం. నీరు పెట్టినప్పుడు అవి పొలమంతా సమానంగా పారాలి. పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగను వరినాట్ల కంటే 40 రోజుల ముందు విత్తుకొని, పూతకొచ్చే సమయానికి నీరు పెట్టి ట్రాక్టర్‌తో దమ్ము చేయాలి. 10 రోజులు మురిగిన తర్వాత నాట్లు వేయడానికి నేలను సిద్ధం చేసుకోవాలి. అలాగే 2500 కిలోల నాడెప్ కంపోస్టు వేయాలి. నాటే రోజు 125 కిలోల ఘన జీవామృతం వేయాలి. 30 రోజుల తర్వాత 125 కిలోల ఘన జీవామృతం వేయాలి. 45, 60 రోజులకొకసారి 200 లీటర్ల ద్రవజీవామృతాన్ని పారించాలి. నారును ఎలా పెంచాలంటే.. శ్రీ పద్ధతిలో 8 నుంచి 12 రోజుల నారును నాటుతారు. ఒక ఎకరానికి కావాల్సిన నారుకు 400 చదరపు అడుగుల నారుమడి కావాలి. నారుమడి తయారు చేసేటప్పుడు.. ఒకటవ పొరలో ఒక అంగుళం బాగా చివికిని పశువుల ఎరువు, 2వ పొరలో ఒకటిన్నర అంగుళాల మట్టి, 3వ పొరలో ఒక అంగుళం బాగా చివికిని పశువుల ఎరువు, 4వ పొరలో రెండున్నర అంగుళాల మట్టి.. ఇలా పొరలన్నింటినీ బాగా కలపాలి. నారుమడి చుట్టు కాలువ తీయాలి. వరి విత్తనాన్ని 12 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత గోనెసంచిలో పోసి 24 గంటల పాటు గాలి తగలకుండా ఉంచాలి. మొలకెత్తిన 2 కిలోల విత్తనాలకు 100 గ్రాముల అజోస్పైరిల్లంతో విత్తన శుద్ది చేయాలి. ఈ విత్తనాన్ని నారుమడిలో చల్లాలి. అలా చల్లిన విత్తనంపై వరి గడ్డి కప్పి ఉదయం, సాయంత్రం నీరు పోయాలి. దీనివల్ల విత్తనం ఎండకు, వానకు నేరుగా గురికాకుండా ఉంటుంది. పక్షులు తినకుండా ఉంటాయి. ప్రధాన పొలం తయారీ పొలం దున్నడంలో మామూలు పద్ధతికి, శ్రీ పద్ధతికి ఏమి తేడా లేదు. పొలం చదునుగా ఉండాలి. నాట్లు వేసేటప్పుడు నీరు అసలు ఉండకూడదు. వరుసకు, వరుసకు, మొక్కకు మొక్కకు మధ్య 25 సెం.మీ. ఉండే విధంగా నాటాలి. చదరపు మీటర్‌కు 16 మొక్కలు పడతాయి. మొక్క బతుకుతుందో.. లేదో అనుకుంటే ఒక్కో చోట 2 మొక్కలు నాటవచ్చు. జంబు చేసిన పొలంలో మార్కర్‌ను ఉపయోగించి నాటాలి. వరిలో ప్రతి 2 మీటర్లకు 200 సెంమీ వెడల్పుతో కాలి బాటలను వదలాలి. వరి మొక్కలను పైపైన వేర్లు ఉండే విధంగా నాటాలి. నాటు వేయడానికి ఎకరానికి 10 మంది కూలీలు అవసరమవుతారు. కలుపు, నీటి యాజమాన్యం శ్రీ పద్ధతిలో నీరు ఎక్కువగా నిల్వ ఉండకపోవడం వల్ల కలుపు ఎక్కువగా ఉంటుంది. కలుపును చేతితో తీయడానికి బదులు దానిని భూమిలోకి కలిపి వేసేలా, కోనోవీడర్ పరికరాన్ని ఉపయోగించాలి. కలుపు పచ్చిరొట్టలా పనికొస్తుంది. నాటు వేసిన 10 రోజులకు మొదటి కలుపు తీయాలి. తర్వాత 10 రోజులకు ఒకసారి చొప్పున 5 సార్ల వరకు తీయాలి. పం టలో రెండు వైపులా వీడర్ నడిపితే కలుపు సమస్య చాల వరకు పరిష్కారమవుతుంది. ఇలా కలుపు తీయడం వల్ల వరి మొక్కల వేర్లు గాలి పోసుకుని బలంగా పెరుగుతాయి. పిలకలు బాగా పెడతాయి. భూమి, వాతావరణాన్ని బట్టి ఎన్ని రోజులకు ఒక తడి ఇవ్వాలో రైతులు నిర్ణయించుకోవాలి. ఒక రోజు ముందు పలుచగా నీరు పెట్టి వీడర్ నడపాలి. వరి పంట పొట్టదశకు వచ్చి నప్పటి నుంచి ఒక అంగుళం మేర నీరు నిలబెట్టాలి. గింజ 70 శాతం గట్టిపడే వరకు పొ లంలో నీరు పెట్టి ఆ తర్వాత తీసివేయాలి. పురుగులు, తెగుళ్ల యాజమాన్యం ఈ పద్ధతిలో పురుగులు, తెగుళ్ల బెడద సహజంగా తక్కువగా ఉంటుంది. ముందుజాగ్రత్తగా వరి నాటిన 10 రోజులకు నీమాస్త్రం, 30 రోజులకు బ్రహ్మాస్త్రం, 45 రోజులకు అగ్నిస్త్రం పిచికారి చేయడం వల్ల అన్ని రకాల పురుగులను నివారించొచ్చు. రసాయన ఎరువులు, కలుపు మందులు, పురుగుమందులు ఏవీ వాడరాదు. -
మనసే మందిరం
సీనియర్ నటి రాజశ్రీ అనగానే ఎన్టీఆర్‌తో చేసిన ‘గోపాలుడు భూపాలుడు’, అక్కినేనితో చేసిన ‘గోవుల గోపన్న’,కాంతారావుతో చేసిన ‘ప్రతిజ్ఞాపాలన’, శోభన్‌బాబుతో చేసిన ‘సత్తెకాలపు సత్తయ్య’ వంటి ఎన్నో హిట్ సినిమాలు జ్ఞప్తికి వస్తాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 200లకు పైగా చిత్రాల్లో నటించారామె. జానపద, పౌరాణిక సినిమాల్లో భక్తికి సంబంధించిన అనేక సన్నివేశాల్లో, పాటల్లో నటించారు. చెన్నైలో ఉంటున్న రాజశ్రీ ‘నేను– నా దైవం’ గురించి... మీకు ఆధ్యాత్మికత ఎలా పరిచయం అయ్యింది? నా పేరులోనే ఆధ్యాత్మికత ఉందండీ. నా అసలు పేరు ‘కుసుమ కుమారి’. మా అమ్మకు బెంగాల్లో చాలా ప్రముఖంగా వాసికెక్కి తెలుగు నాట కూడా చాలామందికి ఆరాధ్యనీయమైన కుసుమ హరనాథ్ బాబా అంటే విశ్వాసం ఎక్కువ. ‘ద్వేషానికి మించిన పాపం లేదు’ అని బోధించిన బాబా ఆయన. ఆయన పట్ల ఆరాధనతో నాకు కుసుమ కుమారి అనే పేరు పెట్టింది. పేరు ప్రభావమో ఏమో నాకు ఏ ఆధ్యాత్మిక ధోరణి పట్ల ప్రేమే ఉంది తప్ప ద్వేషం లేదు. మా ఇంట్లో అందరు దేవుళ్లకు పూజలు చేసేవాళ్లం. వేంకటేశ్వరస్వామిని ఇలవేల్పుగా కొలిచేవాళ్లం. ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా తిరుమలకు వెళ్లి శ్రీవారికి కల్యాణం జరిపించేవాళ్లం. ఇక నా సినిమా ప్రయాణం అయితే శివాలయం నుంచే మొదలైంది. అదెలా? మేము చెన్నైలోనే ఉండేవాళ్లం. మా ఊరి నుంచి బంధువులొస్తే ఏవీఎం స్టూడియోలో సినిమా షూటింగ్ చూడటం కోసం వెళ్లాను. అపుడు నా వయసు పదేళ్లు. దండాయుధపాణి అనే డ్యాన్స్ మాస్టర్, నటి జమున, ఏవీఎం చెట్టియార్ కూర్చుని పిల్లల చేత డ్యాన్స్ చేయిస్తూ సెలెక్షన్స్ చేస్తున్నారు. జమునగారు నన్ను గమనించి, ఈ పిల్ల బాగుంటుంది అని చూపారు. శివాలయం సెట్లో శివలింగం ముందు డ్యాన్స్ చేయడం నా తొలి పాత్ర. ఆ సినిమా పేరు ‘నాగదేవతై’. అంటే, దేవతామూర్తుల పాత్రలూ వేశారన్నమాట. తమిళం ‘ఆదిపరాశక్తి’లో లక్ష్మీ, తెలుగు ‘భక్తశబరి’లో సీతగా వేశాను. దైవ పాత్రలు వేసినప్పుడు మాంసాహారం తినను. మహిళగా కొన్ని దినాల్లో దైవ పాత్రల షూటింగ్‌కు వెళ్లేదాన్ని కాదు. శివుని కంఠాభరణమైన పాములతోనే నృత్యం చేశారని మీ గురించి తెలిసినవారు చెబుతుంటారు, నిజమేనా ? నిజమే. ‘స్వర్ణగౌరి’ అనే సినిమాలో కృష్ణకుమారి, కాంతారావు హీరో హీరోయిన్లు. నేను నాగ కన్యగా వేషం వేశాను. నాగలోకం సెట్లో షూటింగ్. 18 ఏళ్ల వయసులో ఉన్న నేను షూటింగ్ విరామంలో నిద్రపోతుంటే లేపి మగత నిద్రలో ఉన్న నా రెండు చేతులకు పాములు అందించి డైలాగ్...డైలాగ్...అని డైరెక్టర్ కేకలు పెట్టారు. భయంతో డైలాగ్‌లు మర్చిపోయి నోటమాటరాలేదు. వదిలితే అవి జారిపోతాయి. అలా వాటితో యాక్ట్ చేశాను. అలాగే ‘అదృష్ట దేవత’ సినిమాలో నాగలోకం సెట్లో చాలా పాములు తీసుకువచ్చి నేను డ్యాన్స్ చేస్తుంటే పైకి విసిరారు. పౌర్ణమి రోజున పాములకు పళ్లు వస్తాయట. అవి నాపైకి పడగ విసిరేవి. అయినా భయం లేకుండా చేశాను. భయం గురించిన ప్రస్తావన వచ్చింది. అసలు భయం లేని జీవితం గడపాలంటే దైవ సహాయం అవసరం అంటారా? తప్పక అవసరం. చాలామంది దైవ భక్తి అంటే ‘మాకలాంటి నమ్మకాలు ఏవీ లేవండి’ అని.. ఏవేవో కథలు చెబుతుంటారు. . కాని కష్టం వచ్చినప్పుడు, ఓ సవాలు ఎదురైనప్పుడు ప్రతి మనిషికీ ఒక నిస్సహాయ పరిస్థితి వస్తుంది. సాటి మనిషి ఆదరణ ఎంత లభించినా అంతకు మించిన శక్తి కావాల్సి వస్తుంది. ఆ శక్తిని దైవం అంటారో ప్రకృతి అంటారో ఎవరి ఇష్టం వారిది. కుటుంబాన్ని బట్టి ఆధ్యాత్మిక అలవాట్లు ఉంటాయి. పుట్టిపెరిగిన వాతావరణం ఎంతో ప్రభావం చూపుతుంది. నాకు తెలిసినంత వరకు నాస్తికుల్లోనూ అంతర్లీనంగా భక్తి ఉంటుంది. అయితే కొందరు దాన్ని శాస్త్ర, సాంకేతిక శక్తి అనుకుంటారు. ఆ సాంకేతిక శక్తిలో కూడా శక్తి ఉంది కదా. ఆధ్యాత్మిక మార్గానికి మతం ఏ మేరకు సాయపడగలదు? ప్రతి మనిషి గమ్యం లౌకిక విషయాల నుంచి, ఇహ లోకపు మాయ నుంచి విముక్తం కావడం. దానికి మతం ఒక సోపానం. ప్రపంచంలో అనేక మతాలున్నాయి. అవన్నీ ఈ గమ్యానికి చేర్చే సోపానాలే. ఎవరు ఏ సోపానమైనా తీసుకోవచ్చు. నేను జన్మతః హిందువును కావచ్చు. కాని ఆధ్యాత్మిక సాక్షాత్కారం కోసం ఒక్క హిందూ మతం పైనే ఆధారపడాల్సిన అవసరం లేకపోవచ్చు. ఇస్లాం, క్రైస్తవంలో ఉన్న మంచి విషయాలను కూడా మనం గ్రహించవచ్చు. పాటించవచ్చు. నేను అలాగే పాటించాను కూడా. ఇస్లాం, క్రిస్టియానిటీతో కూడా మీకు పరిచయం ఉన్నట్టుంది.. నేను ఐదు భాషల్లో నటించాను. నేను వేసిన పాత్రలు, షూటింగ్‌లకు వెళ్లిన ప్రాంతాలు అనేకానేక సంస్కృతులను, మత భావాలను పరిచయం చేశాయి. అనేక మలయాళ సినిమాల్లో క్రైస్తవ, ముస్లిం పాత్రలు పోషించాను. క్రైస్తవులైన మలయాళ నిర్మాతలతో కలిసి ఆ సమయంలో కేరళలోని అనేక చర్చిలకు వెళ్లేదాన్ని. చాలా ప్రశాంతత కలిగేది. ‘ప్రేమజీవులు’ తెలుగు సినిమాలో నేను పోషించిన క్రైస్తవ పాత్ర నన్ను ఎంతో ప్రభావితం చేసింది. మా బాబును బీసెంట్ నగర్‌లోని సెయింట్ జాన్స్ స్కూల్లో చేర్చడం వల్ల అక్కడి సెయింట్ థామస్ చర్చి అలవడి ప్రార్థనలు చేసేదాన్ని. అలాగే ప్రసిద్ధ నాగూర్ దర్గాకు అనేక సార్లు డబ్బు ఎంఓ చేసేదాన్ని. నాగూర్ దర్గాలో నిద్రచేస్తే దోషాలు పోతాయని అంటారు. నేనూ నమ్ముతాను. చెన్నై మౌంట్‌రోడ్డులోని దర్గాకు, ట్రిప్లికేన్‌లోని బడా దర్గాకు వెళ్లేదాన్ని. పళని మురుగన్‌కు కూడా తరచు డబ్బులు పంపేదాన్ని. భక్తురాలిగా మీ జీవితంలో దైవానికి సంబంధించి మరిచిపోలేని అనుభవం..? ఒకసారి షూటింగ్ నిమిత్తం నేను, కాంతారావు, రాజబాబు విమానంలో వెళుతున్నాం. అదే విమానంలో సత్యసాయిబాబా ఉన్నారు. ప్రార్థించడమేగానీ ఆయనను చూడటం అదే మొదటిసారి. ఆ అనుభూతి ఎంతో గొప్పగా అనిపించింది. ఆయన చెన్నైకు వచ్చినప్పుడు నేను దర్శనానికి వెళ్లి ఎంతో వెనుకాల నిలబడ్డాను. ముందు వరుసలో ఉంటే బాబాను బాగా దర్శించుకోవచ్చని అనుకున్నాను. నా మనసులో మాట విన్నట్లుగా అందరికీ విభూతి ఇస్తూ వెనుక వైపున్న నాకు కూడా ఇచ్చి బాబా వెళ్లిపోయారు. ధ్యానం గురించి కూడా మీకు పరిచయం ఉందని తెలిసింది. దైవ ప్రార్ధనలో ఎలాంటి నియమాలు పాటించాలంటారు? నిష్ట, నియమాలతో గంటలు గంటలు దేవుడి ముందు కూర్చోవడం కాదు. ఒక సెకండ్ అయినా ఏకాగ్రతతో దేవుణ్ణి ప్రార్థిస్తే చాలు. గుడికి వెళ్లడం అంటే.. అక్కడి స్థల మహాత్మ్యం కోసమే. మనసులోనే దైవాన్ని చూడగలగాలి. నటిగా బిజీగా ఉండే సమయంలో మీలోని ఆధ్యాత్మిక హృదయాన్ని ఎలా సంతృప్తిపరిచేవారు.? షూటింగ్ సెట్లో విరామాల్లో రామకోటి లాగా ఓం నమో శ్రీ వేంకటేశాయ, తెలుగులో ఓం సాయిరాం అని రాసేదాన్ని. ఆ పుస్తకాలను తిరుమలకు వెళ్లినపుడు హుండీలో వేసేదాన్ని. సహనటులు ఏంది లెక్కలు రాస్తున్నావా అని అడిగేవారు. దేవుడు ప్రత్యక్షమైతే ఏం వరం కోరుకుంటారు? అమ్మో..!! దేవుడు ప్రత్యక్షమైతే మాటలు వస్తాయా?!! మనకు ఏమి కావాలో దేవుడికి తెలియదా! దేవుడిని కోరుకోడానికి. దేవుడిని చూడటమే అదృష్టం. అంతకంటే ఇంకేమికావాలి. అన్నమైనా, సంపదైనా మనకు ఎంత ప్రాప్తం ఉంటే అంతే లభిస్తుంది. ఇంకా ఇంకా కావాలని ఆశించడం వల్ల ప్రయోజనం లేదు. సర్వేజనః సుఖినోభవంతు అని ప్రార్థిస్తాను. – కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై రాజశ్రీ పశ్చిమగోదావరిలోని ఏలూరులో పుట్టి చెన్నై చిత్రసీమలో మెరిశారు. దక్షిణ భారతదేశ చిత్రపరిశ్రమలో 1956 నుంచి 1979 వరకు నటిగా రాణించారు. బాలనటిగా చిత్రరంగ ప్రవేశం చేసిన రాజశ్రీ ఆ తర్వాత అగ్రకథానాయకులైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కాంతారావు వంటి ప్రముఖ తారాగణంతో కలిసి పనిచేశారు. కాంతారావు–రాజశ్రీ నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద అఖండ విజయం సాధించాయి. తెలుగులో 76 సినిమాలలో నటించిన రాజశ్రీ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలలోనూ నటిగా గుర్తింపు పొందారు. -
ధరిత్రికి పూర్వవైభవం తెద్దాం
పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి రామయ్య పెద్దాపురం: ప్రతి ఒక్కరితో మొక్కలు నాటించి ధరిత్రికి పూర్వ వైభవం తీసుకువద్దామని వృక్ష రక్షకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి రామయ్య అన్నారు. ధరిత్రి పరిరక్షణలో భాగంగా కోటి మొక్కలు నాటి రామయ్య అందరికీ ఆదర్శంగా నిలిచారు. పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో డైరెక్టర్ సిహెచ్.విజయ్ ప్రకాష్ అ«ధ్యక్షతన శనివారం ధరిత్రీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు మాదిరిగా నేటి మొక్కలే రేపటి వృక్షాలన్నారు. ప్రతి విద్యార్థీ మొక్కలు నాటి ప్రాణవాయువును సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విజయ్‌ప్రకాష్ మాట్లాడుతూ రామయ్య విద్యలో అంతంత మాత్రమైనప్పటికీ కోటి మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. అనంతరం రామయ్య దంపతులను ఘనంగా సన్మానించారు. ఒడిస్సీ నృత్య కళాకారిణి రాధాగోపాల్ వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాఠశాల డీన్ రాజేశ్వరి, ఆధ్యాపక బృందం, లైజాన్ ఆఫీసర్ ఎం. సతీష్, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. -
మక్కీకి మక్కీ కాపీ!
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్లుక్! ‘‘కలిసొచ్చిన కాలానికి నడిసొచ్చే కొడుకు పుడ్తడు అని అంటరుకదా... అగో అట్లనే అయితున్నది’’ సైకిల్ దిగి స్టాండేసి చాయ్ హోటళ్లకు ఒచ్చుకుంట అన్నడు యాదగిరి. ‘సామెత మంచిగనే చెప్పినవ్గనీ... అసలు ముచ్చట ఏందో చెప్పు...’ చాయ్ సప్పరిచ్చుకుంట అడిగిండు నర్సింగ్. ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు సారు మస్తు బిజీ అయిండు. అమరావతి గురించి సోచాయించి యించి ఏం సుదరాయిస్తలేదు. ఏం చెయ్యాల్నో తెల్వక ఏదో ఒకటి చెయ్యాలె కదాని వాళ్ల బాబును మంత్రిని చేసిండు’’ అన్నడు యాదగిరి. ‘‘చెంద్రబాబు సారు ఇప్పుడు కొడుకును మంత్రిని చేసిండుగనీ... కేసీఆర్ అయితే కేటీఆర్‌ను మొదట్లనే మంత్రిని చేసి, ఐటి, పంచాయితీరాజ్ శాఖ ఇచ్చిండు’’ అన్నడు నర్సింగ్. ‘‘వాళ్ల బాబుకు కూడా అవే శాఖలు ఇచ్చిండు చంద్రబాబు’’ అని గొప్ప పోయిండు యాదగిరి.‘‘అరె యాదగిరి! అంటే అన్ననంటరు గనీ. ఇంకెవరు దొరకలేదా బాబుకు. కేసీఆరే దొరికిండా?’’ అని గదమాయించిండు నర్సింగ్. ‘‘ఏమైందిరా? ఏం చేసిండు చెంద్రబాబు ?’’ లేసి నిల్చున్నడు యాదగిరి. ‘‘ఏం చేసుడేంది? కేసీఆర్‌ను మక్కీకి మక్కి కాపీ కొడుతున్నడు. కేసీఆర్ ఎట్ల చేస్తే అట్ల చేస్తున్నడు... ఇదేం పద్దతి?’’ గయ్యిమన్నడు నర్సింగ్. ‘చంద్రబాబు కాపీ కొడుతున్నడా? ఏం కొట్టిండు చెప్పు?’’ నిలదీసిండు యాదగరి. ‘‘కేటీఆర్‌ది ఐటి శాఖ కావట్టి చినబాబుకు కూడా ఐటీ శాఖ ఇచ్చిండు. ఇంతకంటే ఇంకేం కావాలె?’’ అన్నడు నర్సింగ్. ‘‘అట్లకాదురా... కేటీఆర్ లెక్క విదేశాలకు పోయి పెట్టుబడులు తీసుకొస్త అన్నడేమో చినబాబు. అందుకే ఆయనకుగా శాఖ ఇచ్చిండ్లేమో’’ జేబులో నుంచి బీడీ తీసి నోట్లో పెట్టకున్నడు యాదగిరి. ‘‘మరట్లయితే కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలిసి మంత్రి అయిండు... మరి చినబాబు ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయలే?’’ సల్లారిపోయిన చాయ్ తాగుకుంటూ యాదగిరిని కొచ్చన్ చేసిండు నర్సింగ్. ‘‘ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా అని కాదు. మంత్రి అయిండా లేదా అన్నదే సూడాలె’’ లాపాయింట్ లేవదీసిండు యాదగిరి. ‘‘అయితే కేటీఆర్ ఎట్ల చేస్తే చినబాబు అట్ల చేస్తడా...?’’ రెట్టించి అడిగిండు నర్సింగ్.‘‘ఆయనకేమన్న భయమా?’’ అన్నడు యాదగిరి. ‘‘లంచం అడుగుతే చెప్పుతోని కొట్టుర్రి అన్నడు కేటీఆర్. చినబాబును అట్ల అనుమను సూద్దాం’’ సవాల్ చేసిండు నర్సింగ్. ‘‘చినబాబు ఇప్పుడే మంత్రి అయిండు. ఇసొంటి పెద్ద పెద్ద మాటలంటే గా పార్టీ లీడర్లు చానమంది బాధపడ్తరు’’ అని సైకిలెక్కాడు యాదగిరి. – ఓరుగల్లు శ్రీ -
నగరం నాకు రిలీఫ్ ఇచ్చింది
‘నగరం’ కథ విన్నప్పుడే, ఆ కాన్సెప్ట్‌కి కనెక్ట్ అయిపోయా. వాస్తవానికి దగ్గరగా ఉన్న కథ కావడంతో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు’’ అని సందీప్ కిషన్ అన్నారు. సందీప్ కిషన్, రెజీనా, శ్రీ, మధుసూదన్ ముఖ్య పాత్రల్లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ‘నగరం’ ఈరోజు విడుదలవుతోంది. సందీప్ కిషన్ మాట్లాడుతూ – ‘‘ప్రతి మనిషిలో మంచీ, చెడూ ఉంటాయి.. వారిలోని మంచితనం కరెక్ట్ టైమ్‌కి బయటపడితే బాగుంటుంది’ అన్నదే ‘నగరం’ కథ. ఈ యూనిట్ అంతా కొత్తవారే. సినిమాపై ఉన్న ప్యాషన్‌తో ఉద్యోగాలు వదులుకుని మరీ తీశారు. ఒక మంచి డైరెక్టర్ నా చిత్రం ద్వారా పరిచయమవుతున్నందుకు గర్వంగా ఉంది. నా గత చిత్రాలు ‘రన్, ఒక్క అమ్మాయి తప్ప’ సరిగ్గా ఆడలేదు. దాంతో నాపై నాకే డౌట్ వేసింది. నేను సరైన కథలను ఎంచుకుంటున్నానా? అని. ‘నగరం’ ప్రివ్యూ చూసిన తెలుగు, తమిళ పరిశ్రమ పెద్దలు ‘చాలా బాగుంది’ అని అభినందిస్తుంటే రిలీఫ్ అనిపించింది. -
యువత ఆలోచనలకు అద్దం పట్టే 'అమీర్‌పేట లో'
కథలో కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు చిన్న సినిమాలకు కూడా పెద్ద విజయాలు కట్టబెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ నమ్మకంతోనే కొత్త ఆలోచనలతో యువతరాన్ని ఆకట్టుకునే కథా కథనాలతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. అదే బాటలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అమీర్‌పేటలో. ఈ తరం యువత ఆలోచనలు, ఆశయాలే కథా వస్తువుగా తెరకెక్కిన ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు యువతకు సందేశాన్ని అందిస్తుంది. కథ విషయానికి వస్తే.. అమీర్‌పేట హాస్టల్లో ఉండే వివేక్(శ్రీ), లిబుగా చెప్పుకునే లింగబాబు, చిట్టి, వెంకట్రావులు పెద్ద పెద్ద ఆశయాలతో సిటీకి వస్తారు. వెంకట్రావుకు ఎలాగైన తన ఊరి వారి ముందు ఇంగ్లీష్ లో మాట్లాడాలన్నదే ఆశయం. చిట్టీ, లిబులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాధించాలి, వివేక్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా ప్రూవ్ చేసుకోవాలని కలలు కంటుంటాడు. ఇలా ఉన్నత ఆశయాలు ఉన్న ఈ యువత.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరు ఎలా విజయం సాధించారు అన్నదే సినిమా కథ. యూత్‌ను అలరించే ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే నేటి యువతరం చెడు స్నేహాం వల్ల ఎలాంటి తప్పటడుగులు వేస్తోందో చూపించారు. అదే సమయంలో ఓ మంచి స్నేహితుడు దొరికితే అప్పటి వరకు చెడ్డ దారిలో నడిచిన వారుకూడా ఎలా మంచి మార్గంలోకి వస్తారో వినోదాత్మకంగా చూపించారు. ముఖ్యంగా మినిమమ్ బడ్జెట్‌తో యూత్ ఫుల్ కథా కథనాలతో సినిమాను తెరకెక్కించిన శ్రీ ఆకట్టుకున్నాడు. హీరోగానూ, దర్శకుడిగాను మంచి మార్కులు సాధించాడు. ఇతర పాత్రల్లో నటించిన వారు కొత్త వారే అయినా తమ పరిథి మేరకు పరవాలేదనిపించారు. ఫస్ట్‌హాప్ అంతా యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌ను ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించాడు. అయితే ఎమోషనల్ సీన్స్ కాస్త సాగదీసినట్టుగా ఉన్నాయి. కథా పరంగా రొటీన్‌గా అనిపించే అమీర్‌పేటలో యూత్‌కు మాత్రం బాగానే కనెక్ట్ అవుతోంది. -
అమీర్‌పేట జీవితాలతో...
హైదరాబాద్‌లో అమీర్‌పేట అంటే తెలియనివారు ఉండరు. ఎంతోమంది విద్యార్థుల జీవితాలు ఈ ప్రాంతంతో ముడిపడి ఉంటాయి. ఆ నేపథ్యంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘అమీర్‌పేటలో’. శ్రీ హీరోగా నటించి, దర్శకత్వం వహించారు. అశ్విని కథానాయిక. పద్మశ్రీ క్రియేషన్స్ పతాకంపై యామిని బ్రదర్స్ సమర్పణలో మహేశ్ మందలపు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీ మాట్లాడుతూ-‘‘అమీర్‌పేట అంటే మనకు ఎన్నో విషయాలు గుర్తుకొస్తాయి. అక్కడి జీవితాలను చూపిస్తూనే, మంచి కథను ప్రేక్షకులకు అందిస్తున్నాం. వినోదంతో పాటు భావోద్వేగ అంశాలు ఉన్నాయి. కుటుంబం మొత్తం కలిసి చూసేలా మా చిత్రం ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం కోసం శ్రీ ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు. ఈ చిత్రం నిర్మాణంలో వంశీ, శ్రీకాంత్, ప్రవీణ్‌ల సహకారం మరచిపోలేను’’ అని నిర్మాత చెప్పారు. అశ్విని, సహ నిర్మాత యామిని వంశీకృష్ణ, సంగీత దర్శకుడు మురళి తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీపై నిర్లక్ష్యం తగదు
9న కలెక్టరేట్ల వద్ద ధర్నాలను విజయవంతం చేయాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేణు గొర్రిపూడి(కరప) : పేదలకు అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ విమర్శించారు. మండలంలోని గొర్రిపూడిలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పేదలకోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ పథకంగా మార్చేస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు అన్ని కలెక్టరేట్ల వద్ద ఈనెల 9న ధర్నాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ల వద్దకు తరలివచ్చి, ధర్నాలను విజయవంతం చేయాలన్నారు. కేంద్రప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో పెద్దనోట్లు రద్దు చేసిందని, గ్రామీణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నారు. నల్లధనం బయట పెట్టటానికే పెద్దనోట్లు రద్దుచేశామని ప్రధాని నరేంద్రమోదీ చెప్పుకుంటున్నారేకానీ దానివల్ల మధ్యతరగతి ప్రజలకే ఇబ్బందులు ఎక్కువయ్యాయన్నారు. బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతుండటం వల్ల గ్రామాల్లో కూలీలకు పనులు ఉండటంలేదని, రైతులు పొలాల్లో పనులు చేయించుకోలేక పోతున్నారన్నారు. పుట్టలో ఉన్న పామును పట్టుకోవాలేకానీ, పాముకోసం పుట్టనే తగలపెట్టడం భావ్యంకాదన్నారు. నల్లకుబేరుల జాబితా ఉన్నప్పుడు వాళ్లను పట్టుకోవాలేకానీ, ప్రజలందరినీ వేధించడం తగదన్నారు. అంతకుముందు ఆయన గ్రామంలో వల్లీదేవసేన సమేత సుబ్రమణ్యస్వామిని దర్శించుకున్నారు. -
రమణీయం.. రామ పట్టాభిషేకం..
కమనీయం.. భీమేశుని కల్యాణం ∙ లోకహితం కోసమే : గాడ్ వెదురుపాక (రాయవరం) : వెదురుపాక విజయదుర్గా పీఠంలో బుధవారం అటు భద్రాద్రి, ఇటు ద్రాక్షారామల ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది. పీఠం 44వ వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం పలు పూజలు, అభిషేకాలను పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) సమక్షంలో నిర్వహించారు. భద్రాచలం నుంచి వచ్చిన వేదపండితులు తిరుమడిళై ఆళ్వార్, చక్రవర్తి మోహిత్స్వామిల ఆధ్వర్యంలో అక్కడి ఆలయంలో నిర్వహించే మాదిరిగా శ్రీరామ సామ్రాజ్య పాదుకా పట్టాభిషేకాన్ని నిర్వహించారు. పాదుకలు, రాజముద్రిక, రాజదండకం, నందక, ఛత్రచామర, ఆభరణాల సమర్పణ, నదీజలాలు, తీర్థాలు, చతుస్సముద్ర జలాలతో అభిషేకం, మంగళశాసనం తదితర పూజలను నిర్వహించారు. ఆలయ పురోహితులు శ్రీరాముని పాలనను, సామ్రాజ్య పాదుకా పట్టాభిషేక ఘట్టాలను వివరించిన తీరు భక్తులను ఆకట్టుకుంది. కాగా రాత్రి ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఉత్సవమూర్తుల కల్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీతం, వస్త్రదానం, మహాసంకల్పం తదితర పూజలను నిర్వహించారు. పీఠం వార్షికోత్సవాల సందర్భంగా లోక కల్యాణ ం కోసమే కల్యాణాలు నిర్వహిస్తున్నట్టు గాడ్ చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణ సమితి రీజనల్ కో ఆర్డినేటర్ కందర్ప హనుమాన్, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కోట సునీల్‌కుమార్, కుతుకులూరు సర్పంచ్ సత్తి సూర్యబ్రహ్మానందరెడ్డి, మహోపాధ్యాయ డాక్టర్ విశ్వనాథ గో పాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సం స్కృత భాషా వికాసానికి కృషి చేసి రాష్ట్రప తి పురస్కారాన్ని పొందిన విశ్వనాథను గాడ్ సమక్షంలో ఘనంగా సత్కరించారు. పీఠం అడ్మినిస్ట్రేటర్ వి.వి.బాపిరాజు, పీఆ ర్వో వాడ్రేవు వేణుగోపాల్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. -
'సాహసం సేయరా డింభకా' స్టిల్స్
-
'శ్రీ'కి స్వరనీరాజనం
-
'జగమంత కుటుంబం' పాటను ’శ్రీ’నే పాడారు.
-
అణిముత్యాలాంటి పాటలకు మ్యూజిక్
-
సంగీత దర్శకుడు శ్రీ ఆరోగ్య పరిస్థితి విషమం
హైదరాబాద్: ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు చక్రవర్తి తనయుడు, యువ సంగీత దర్శకుడు శ్రీ అనారోగ్యంతో గురువారం రాత్రి కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. శ్రీ పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీ తెలుగులో 'గాయం, అమ్మోరు' తో పాటు దాదాపు 20 చిత్రాలకు సంగీతం అందించారు. ఆయన పనిచేసిన చిత్రాల్లో అనగనగా ఒకరోజు, సింధూరం తదితర చిత్రాలు మంచి ప్రజాదరణ పొందాయి. శ్రీ సంగీతం అందించటంతో పాటు ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా పనిచేశారు. 2005లో విడుదలైన 'చక్రం' సినిమాలోని 'జగమంత కుటుంబం మాది..' పాటను పాడారు. శ్రీ ఎక్కువగా కృష్ణవంశీ చిత్రాలకు పనిచేశారు. ఈ యువ సంగీత దర్శకుడు తాజాగా గోపీచంద్ సాహసం చిత్రానికి పనిచేశారు. -
'నారి నారి శ్రీ మురారి' స్టిల్స్
-
నేను లవ్ గురూని..!
‘‘ఇందులో నేను లవ్‌గురుగా కనిపిస్తాను. చిలిపి సరదాల దృశ్యరూపంగా అనిపించే అల్లరి ప్రేమికుల కథ ఇది’’ అని శ్రీ అన్నారు. కృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీ, హరిప్రియ జంటగా డి.రాజేంద్రప్రసాద్‌వర్మ నిర్మించిన చిత్రం ‘గలాట’. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీ విలేకరులతో ముచ్చటించారు. ‘కొత్త దర్శకులతో ఇక చేయకూడదు అనుకున్నాను. కానీ... అద్భుతమైన కథ చెప్పి నన్ను ఒప్పించాడు దర్శకుడు కృష్ణ. ఎంత బాగా చెప్పాడో, అంతకు తగ్గ బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చాడు. బామ్మకు నచ్చే లక్షణాలున్న అమ్మాయిని వెతుక్కుంటూ ముంబయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ కుర్రాడికి వెతకబోయే తీగ కాలికి తగిలినట్లు తనకు కావాల్సిన లక్షణాలన్నీ ఉన్న ఓ అమ్మాయి గుళ్లో పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఓ మంత్రి వల్ల సమస్యల్లో పడిన ఆ అమ్మాయిని హీరో ఎలా కాపాడి, తనదాన్ని చేసుకున్నాడు? అనేది ఈ సినిమా కథాంశం. కుటుంబ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి వల్గారిటీ లేకుండా దర్శకుడు ఈ సినిమాను మలిచాడు. జంధ్యాలగారి సినిమా చూస్తున్న ఫీల్ కలిగిస్తుందీ సినిమా’’ అని చెప్పారు. సునీల్ కశ్యప్ శ్రావ్యమైన బాణీలిచ్చారని, కృష్ణ నటించిన ‘గూఢచారి 116’లోని ‘నువ్వునా ముందుంటే..’ పాటను ఏ మాత్రం మార్చకుండా యథాతథంగా పెట్టామని శ్రీ తెలిపారు. ‘ఈ రోజుల్లో, బస్టాప్’ చిత్రాలకు పనిచేసిన కిరణ్ దర్శకత్వంలో ‘సాహసం సేయరా డింభకా’ చిత్రం చేయనున్నట్లు ఆయన చెప్పారు. -
గలాట మూవీ ఆడియో లాంచ్
-
తమాషా సినిమా ప్రారంభోత్సవం
‘ఈరోజుల్లో’ ఫేం శ్రీ, నీలం ఉపాధ్యాయ, సునీత మార్షియా ప్రధాన పాత్రధారులుగా శ్రీనివాస్ బల్లా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తమాషా’. ఎం.విజయవర్దన్‌రావు, శివారెడ్డి నీలపు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి రమణ గోగుల కెమెరా స్విచాన్ చేయగా, శ్రీకాంత్ అడ్డాల క్లాప్ ఇచ్చారు. అనిల్‌కుమార్ యాదవ్ గౌరవ దర్శకత్వం వహించారు. -
ప్రేమ గలాటా
‘ఈరోజుల్లో’ ఫేం శ్రీ, హరిప్రియ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘గలాటా’. కృష్ణ దర్శకుడు. రాజేంద్రప్రసాద్‌వర్మ నిర్మాత. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు చెబుతూ -‘‘వినోదాత్మకంగా సాగే ప్రేమకథ ఇది. ఇందులో శ్రీ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది’’ అని తెలిపారు. ‘‘తొలి షెడ్యూల్లో హీరోహీరోయిన్లతో పాటు అలీ, ఇతర పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. త్వరలోనే మలి షెడ్యూల్‌ని ప్రారంభిస్తాం’’ అని నిర్మాత తెలిపారు. సాయికుమార్, నాగబాబు, అలీ, అన్నపూర్ణమ్మ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: ఫిరోజ్ ఖాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీతేజ నడింపల్లి. -
ప్రేమ, వినోదం జతకడితే...
శ్రీ, హరిప్రియ జంటగా క్రియేటివ్ పిక్సల్స్ పతాకంపై రాజేంద్రప్రసాద్ వర్మ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి కె.అచ్చిరెడ్డి క్లాప్ ఇవ్వగా, ఎస్వీ కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ప్రేమ నేపథ్యంలో రూపొందుతోన్న పూర్తి వినోదాత్మక చిత్రమిదని దర్శకుడు చెప్పారు. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, హైదరాబాద్, వైజాగ్ల్లో తొలి షెడ్యూల్ పూర్తి చేస్తామని నిర్మాత తెలిపారు. అలీ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: ఫిరోజ్‌ఖాన్, పాటలు: కృష్ణచైతన్య. -
అమీర్‌పేటలో ఏం జరిగింది?
శ్రీ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అమీర్ పేటలో...’. మోనిక కథానాయిక. మహేష్ నిర్మాత. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహూ ర్తపు దృశ్యానికి విజయశ్రీ కెమెరా స్విచాన్ చేయగా, సీహెచ్ నాగేశ్వరరావు క్లాప్ ఇచ్చారు. ‘‘చదువులో ‘సున్నా’ కంటే తక్కువ మార్కులు ఉండవు. ‘వంద’ కంటే ఎక్కువ మార్కులు ఉండవు. కానీ జీవితం అనే చదువులో మనిషి వేసే ప్రతి అడుగు అతణ్ణి ‘సున్నా’ కంటే తక్కువ చేయొచ్చు, ‘వంద’ కంటే ఎక్కువ చేయొచ్చు అని తెలిపే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, వచ్చే నెల 12 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తామని, జనవరిలో సినిమాను విడుదల చేస్తామని శ్రీ తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: వెంకటేష్ యువ, సంగీతం: మురళి లియోన్. -
సెలైంట్‌గా ఉంటూనే కడుపుబ్బా నవ్విస్తా అంటున్న శ్రీ
‘ఈ రోజుల్లో’ ఫేం శ్రీ కథానాయకునిగా రూపొందించిన చిత్రం ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’. సుప్రజ కథానాయిక. సాజిద్ ఖురేషి దర్శకుడు. సోహైల్ అన్సారీ నిర్మాత. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం హైదరాబాద్‌లో శ్రీ మాట్లాడుతూ -‘‘తమిళంలో హిట్టయిన ‘నడువుల కొంజెం పక్కత్తినె కానుం’ చిత్రం సీడీ ఇచ్చి నన్ను చూడమన్నారు దర్శకుడు ఖురేషి. నాకు తమిళం రాదు. అందుకే నా కుటుంబ సభ్యుల్ని చూడమన్నాను. వారందరీకీ సినిమా బాగా నచ్చేసింది. దాంతో ఈ సినిమాకి ఓకే చెప్పా. ఈ పాత్ర పోషిస్తున్నప్పుడే అందులోంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టేది. ఇందులో నేను మెమరీలాస్ పేషెంట్‌ని. సెలైంట్‌గా ఉంటూ అందర్నీ కడుపుబ్బా నవ్విస్తా. నటునిగా నా సామర్థ్యాన్ని పెంచే పాత్ర ఇది. ఈ తమిళ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టు చక్కగా మార్చారు దర్శకుడు ఖురేషీ. రీమేక్ ఇలాక్కూడా చేయొచ్చా అనిపించేలా ఉంటుందీ సినిమా. తప్పకుండా అందరినీ నచ్చుతుందని నా నమ్మకం’’ అన్నారు. ‘‘యువతరం మాత్రమే కాకుండా కుటుంబ ప్రేక్షకులకు కూడా నచ్చేలా సినిమా ఉంటుంది. దర్శకుడు కావాలనే నా కలను నిజం చేసిందీ సినిమా. శ్రీ ఎంతో కష్టపడి ఈ పాత్ర చేశాడు. తెలుగమ్మాయి సుప్రజ ఈ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయం అవుతోంది. 200 థియేటర్లలో రంజాన్ పండుగ సందర్భంగా నా సినిమా విడుదల కావడం ఆనందంగా ఉంది’’ అని దర్శకుడు చెప్పారు.