ధరిత్రికి పూర్వవైభవం తెద్దాం
ధరిత్రికి పూర్వవైభవం తెద్దాం
Published Sat, Apr 22 2017 10:47 PM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM
పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి రామయ్య
పెద్దాపురం: ప్రతి ఒక్కరితో మొక్కలు నాటించి ధరిత్రికి పూర్వ వైభవం తీసుకువద్దామని వృక్ష రక్షకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి రామయ్య అన్నారు. ధరిత్రి పరిరక్షణలో భాగంగా కోటి మొక్కలు నాటి రామయ్య అందరికీ ఆదర్శంగా నిలిచారు. పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో డైరెక్టర్ సిహెచ్.విజయ్ ప్రకాష్ అ«ధ్యక్షతన శనివారం ధరిత్రీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు మాదిరిగా నేటి మొక్కలే రేపటి వృక్షాలన్నారు. ప్రతి విద్యార్థీ మొక్కలు నాటి ప్రాణవాయువును సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విజయ్‌ప్రకాష్ మాట్లాడుతూ రామయ్య విద్యలో అంతంత మాత్రమైనప్పటికీ కోటి మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. అనంతరం రామయ్య దంపతులను ఘనంగా సన్మానించారు. ఒడిస్సీ నృత్య కళాకారిణి రాధాగోపాల్ వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాఠశాల డీన్ రాజేశ్వరి, ఆధ్యాపక బృందం, లైజాన్ ఆఫీసర్ ఎం. సతీష్, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement