day
-
Rajasthan Day: 19 రాచరిక రాష్ట్రాలు కలగలిస్తే..
నేడు(మార్చి 30) రాజస్థాన్ దినోత్సవం(Rajasthan Day). రాజస్థాన్ ఏర్పడి ఈరోజుకు 76 ఏళ్లు పూర్తయ్యాయి. 1949, మార్చి 30న రాజస్థాన్ ఒక రాష్ట్రంగా ఏర్పాటయ్యింది. ఈ రాష్ట్రంలోని అందమైన కోటలు, ప్రత్యేక సంస్కృతి, చరిత్ర ఎంతో ఆసక్తిగొలుపుతాయి. దేశంలో విస్తీర్ణం పరంగా ఈ రాష్ట్రం అతిపెద్దది. నేటి రాజస్థాన్‌ను ఒకప్పుడు ‘రాజపుతన’ అని పిలిచేవారు. అంటే రాజపుత్రుల దేశం అని అర్థం.1949లో మార్చి 30న 19 రాచరిక రాష్ట్రాలతో పాటు మూడు ప్రదేశాలను కలిపి ‘రాజస్థాన్’ను స్థాపించారు. ఈ రాచరిక రాష్ట్రాల ఏకీకరణ ఏడు దశల్లో పూర్తయిన తర్వాత దీనికి ‘రాజస్థాన్’ అనే పేరుపెట్టారు. రాజస్థాన్ రాష్ట్రం ఎనిమిదేళ్ల, ఏడు నెలల, 14 రోజుల్లో మొత్తం ఏడు దశల్లో ఏర్పడింది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక దేశ ఏకీకరణ ప్రక్రియ(Integration process) జరుగుతున్నప్పుడు, పలు సంస్థానాల రాజులు దేశంలో విలీనానికి నిరాకరించారు. కానీ దేశంలోని అన్ని సంస్థానాలను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ నేపధ్యంలోనే రాజస్థాన్‌లోని అన్ని రాచరిక రాష్ట్రాల ఏకీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. 1949లో పలు రాచరిక రాష్ట్రాలు, చిన్న రాజ్యాలు కలగలపడంతో రాజస్థాన్ పెద్ద రాష్ట్రంగా అవతరించింది. ఈ ఏకీకరణ ఘనత భారత ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు దక్కుతుంది. రాజస్థాన్ దినోత్సవం నాడు రాష్ట్ర వ్యాప్తంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ ప్రదర్శనలు నిర్వహిస్తారు.ఇది కూడా చదవండి: నాగ్‌పూర్ చేరుకున్న ప్రధాని మోదీ.. సంఘ్ కార్యాలయం సందర్శన -
World Piano Day: తొలి పియానోను ఎక్కడ భద్రపరిచారు?
నేడు (మార్చి 29).. ప్రపంచ పియానో దినోత్సవం(World Piano Day). పియానోను సంగీత కచేరీలలో ఉపయోగిస్తుంటారు. ఈ వాయిద్య పరికరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. పియానోకు సంబంధించిన విషయాలు చాలామందికి తెలియవు. పియానో దినోత్సవం సందర్భంగా ఈ సంగీత పరికరానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.పియానోను తొలిసారిగా 1709లో ఇటలీకి చెందిన హార్ప్సికార్డ్ తయారీదారు బార్టోలోమియో డి ఫ్రాన్సిస్కో క్రిస్టోఫోరీ కనుగొన్నారు. ఆయన రూపొందించిన పియానోలలో ఒకటి న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్(Metropolitan Museum of Art)లో భద్రపరిచారు. పియానో అనేది పియానోఫోర్ట్ అనే పదానికి సంక్షిప్త రూపం. పియానో అంటే మృదువైన, ఫోర్డ్ అంటే బిగ్గరగా.. దీని అర్థం ఏమిటంటే ఈ రెండు రకాల శబ్ధాలను పియానోపై పలికించవచ్చు.తొలినాళ్లలో పియానోలు చాలా ఖరీదైనవిగా ఉండేవి. వీటిని దాదాపు ఒక శతాబ్దం పాటు ఒక నిర్దిష్ట తరగతికి చెందినవారు మాత్రమే కొనుగోలు చేయగలిగేవారు. నూతన పియానోను దాని కొత్త వాతావరణానికి, మారుతున్న రుతువులకు అనుగుణంగా ట్యూన్ చేయాల్సి ఉంటుంది. దీనిని ఏడాదికి రెండుసార్లు ట్యూనింగ్(Tuning) చేస్తారు. పియానోలో మొత్తం 88 నలుపు రంగు, తెలుపు రంగు కీలు ఉంటాయి. పియానో క్లిష్టమైన వాయిద్య పరికరం. దీనిలో 12 వేలకు పైగా విడి భాగాలు ఉంటాయి.ప్రపంచంలో అతిపెద్ద పియానో 1.4 టన్నుల బరువు, 5.7 మీటర్ల పొడవు కలిగివుంది. దీనిని న్యూజిలాండ్ పియానో ట్యూనర్ అడ్రియన్ మాన్ రూపొందించారు. పియానో రెండు విధాలుగా ధ్వనిని అందిస్తుంది. మొదటిది బిగ్గరగా, రెండవది మెల్లగా ఉంటుంది. ఈ రెండు శబ్దాలు సరైన క్రమంలో ఉత్పత్తి అయినప్పుడు, శ్రావ్యమైన సంగీతం వినిపిస్తుంది. పియోనాను కీబోర్డ్ ఆధారంగా రూపొందిస్తుంటారు. దీనిలో ఏదైనా కీని గట్టిగా నొక్కితే పెద్ద శబ్దం వస్తుంది, అదే కీని మెల్లగా నొక్కినప్పుడు మృదువైన శబ్దం వస్తుంది.ఇది కూడా చదవండి: ‘ప్రధాని మోదీ తెలివైన వ్యక్తి’.. భారత్ సుంకాలపై స్పందించిన ట్రంప్ -
తీవ్రమైన పగటి కలలతో విసిగిపోయారా? నియంత్రణ ఎలా?
డాక్టరు గారూ! నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. నాకీ మధ్య పగటి కలలు ఎక్కువగా వస్తున్నాయి. క్లాసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, నడుస్తున్నా, ఏ పనిలో ఉన్నా, ఏవేవో పగటి కలలు వస్తున్నాయి. కలెక్టర్‌ను చూస్తే కలెక్టర్ అయినట్లు, పోలీస్ అఫీసర్‌ను చూస్తే ఎస్.పి. ని అయినట్లు, సినిమాలో హీరోయిన్ను చూస్తే నేను కూడా హీరోయిన్ అయినట్లు, ఇలా రకరకాలుగా పగటి కలలు, ఊహలు వస్తున్నాయి. ఆటోలో బస్సులో వెళుతున్నప్పుడు ఇవి మరీ ఎక్కువగా వస్తున్నాయి. అలా వచ్చినప్పుడల్లా చాలా హాయిగా ఉంటుంది. దాంట్లోంచి బయట పడగానే అయ్యో! ఇది నిజం కాదా అని చాలా బాధ కలుగుతుంది. క్లాసులో ఇలా కలలు రావడం వల్ల చదువు కూడా దెబ్బతింటోంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అని ఆందోళనగా ఉంది. ఈ ఊహల్లోంచి బయట పడే మార్గం చెప్పండి – ప్రణీత, మహబూబ్ నగర్ఇలా కలలు, పగటి కలలు కనడం మనిషికి చాలా సహజం. ఈ ప్రపంచంలో అసలు కలలు–పగటి కలలు ఎప్పుడో ఒకసారి కనని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇలా పగటి కలలు... అంటే ‘డే డ్రీమింగ్’ యుక్త వయసులో చాలా సహజం. మానసిక ఒత్తిడికి, ఆందోళనకు గురైనవారు, ‘ఎ.డి.హెచ్.డి.’ అంటే నిలకడ, ఏకాగ్రత లేకుండా ఓవర్ యాక్టివ్‌గా ఉండేవారిలో కూడా ఈ పగటి కలలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. మనం అనుకున్నవన్నీ నిజ జీవితంలో సాధించలేనప్పుడు, కొంత సేపైనా ఊహాలోకంలో విహరించి, నిజజీవితంలో పొందలేనివి ఇలా ఊహల్లోనైనా పొంది మనిషి తృప్తి పొందాలనుకుంటాడు. ఎడారిలాంటి మన జీవితాలకు పగటి కలలు ఒక ‘ఒయాసిస్’ లాగా పనిచేస్తాయి. అసంతృప్తితో ఉన్న మనసుకు ఈ పగటికలలు కొంత ఊరట కలిగించి, మన బాధలకు సమస్యలకు ఒక ‘ఔట్లెట్’ లాగా పనిచేసి మనల్ని సంతృప్తి పరుస్తాయి. మరికొందరికి పగటికలలు, వారిలో ‘క్రియేటివిటీ’ పెరిగేందుకు, జీవిత సమస్యలనుండి కొన్ని పరిష్కారాలు పొందేందుకు కూడా తోడ్పడతాయి. చదవండి: మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్ మహిళ వీడియో వైరల్ఒకే ఒక్క శ్వాసతో రికార్డ్: భారతీయ మత్స్య కన్య సక్సెస్ స్టోరీ!కానీ ‘అతి సర్వత్రా వర్జయేత్!’ అన్నట్లు ఏదైనా అతిగా ఉంటేనే ఇబ్బంది. వాస్తవాన్ని పూర్తిగా మరచి, పగలంతా పగటి కలల్లో, విహరించడమనేది అంత మంచిది కాదు. దీనివల్ల మీ చదువు, ఇతర పనులు దెబ్బతింటాయి. మీరు మీ జీవిత గమ్యాలను ప్రతిరోజు స్మరించుకుంటూ, వాటిని సాధించేందుకు, మీ శక్తియుక్తులను పూర్తిగా వినియోగించండి. ఏకాగ్రత నిగ్రహ శక్తి, పెంచుకునేందుకు సరైన నిద్ర, ధ్యానం, ప్రాణాయామం, మైండ్‌ఫుల్‌నెస్, ఉపయోగపడతాయి. మీకిష్టమైన వేరే వ్యాపకాలపై ధ్యాస పెట్టండి. జీవితంలో పగటి కలలు ఒక భాగమే తప్ప పగటి కలలే జీవితం కారాదు! -
World Saree Day 2024: సెలబ్రిటీల బ్యూటిఫుల్ శారీ లుక్స్
-
ప్రపంచ చీరల దినోత్సవం
సాక్షి, సిటీబ్యూరో: చీర కట్టుకునే సంస్కృతి 5 వేల ఏళ్ల నుంచి కొనసాగుతోందని ఫ్లో (ఎఫ్ఎల్ఓ) హైదరాబాద్ చైర్పర్సన్ ప్రియా గజ్దర్ అన్నారు. శుక్రవారం ఫిక్కీ (ఎఫ్ఐసీసీఐ) లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ చీరల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ చీర కట్టు అనేది ప్రపంచం ఉన్నంత కాలం కొనసాగుతుందని అన్నారు. ఏటా డిసెంబర్ 21న శారీ దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ‘ది సారీ– సిక్స్ యార్డ్స్ ఆఫ్ సస్టైనబుల్ హెరిటేజ్’ అనే అంశంపై చర్చ నిర్వహించారు. -
డిసెంబరు 21.. రాత్రి 16 గంటలు.. పగలు 8 గంటలు
శీతాకాలం.. పగటి కాలం తక్కువ..రాత్రి పొద్దు ఎక్కువ అంటారు. అయితే డిసెంబర్ 21 రాత్రిపూట మనం ఒక వింతను చూడబోతున్నాం. ఆరోజు సుదీర్ఘమైన రాత్రి కాలం రానుంది. ఆరోజు ఏకంగా 16 గంటపాటు రాత్రి సమయం ఉండనుంది. అయితే పగటి వేళ 8 గంటలు మాత్రమే ఉంటుంది. ఇలా జరగడాన్ని శీతాకాలపు అయనాంతం(వింటర్ సోల్స్టైస్) అంటారు.శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజున సూర్యుని నుండి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ కాలం ఉంటుంది. శీతాకాలపు అయనాంతం ఏర్పడిన రోజున భూమి దాని ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా 2024, డిసెంబరు 21న ఈ ఏడాదిలో అత్యంత తక్కువ పగలు, సుదీర్ఘమైన రాత్రి ఏర్పడుతుంది. భూమి దాని అక్షం మీద తిరిగే సమయంలో దక్షిణ అర్ధగోళంలో భూమి నుండి సూర్యుడి దూరం గరిష్టంగా ఉన్న రోజున అయనాంతం వస్తుంది. ఇది శీతాకాలంలో ఏర్పడుతున్నందున దీనిని శీతాకాలపు అయనాంతం అని అంటారు.శీతాకాలపు అయనాంతం ఏర్పడే తేదీ ప్రతీయేటా మారుతుంటుంది. అయితే అది డిసెంబర్ 20- 23 తేదీల మధ్యనే వస్తుంటుంది. డిసెంబర్ 21న భూమికి సూర్యునికి గరిష్ట దూరం ఉండటం వల్ల సూర్యకిరణాలు ఆలస్యంగా భూమిని చేరుతాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల కూడా కనిపిస్తుంది. వివిధ దేశాల్లో శీతాకాలపు అయనాంతం(వింటర్ సోల్స్టైస్) రోజున ఉత్సవాలు జరుపుకుంటారు. చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలలో, బౌద్ధమతంలోని యిన్, యాంగ్ శాఖకు చెందిన ప్రజలు శీతాకాలపు అయనాంతం ఐక్యత, శ్రేయస్సును అందించే రోజుగా భావిస్తారు.శీతాకాలపు అయనాంతంపై వివిధ దేశాల్లో వేర్వేరు నమ్మకాలున్నాయి. శీతాకాలపు అయనాంతం వచ్చినప్పుడు ఉత్తర భారతదేశంలో శ్రీ కృష్ణునికి నైవేద్యం సమర్పించి, గీతా పారాయణం చేస్తారు. రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో పుష్యమాస పండుగ ను జరుపుకుంటారు. సూర్యుని ఉత్తరాయణం ప్రక్రియ శీతాకాలపు అయనాంతం నుండి మొదలవుతుంది. అందుకే భారతదేశంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.ఇది కూడా చదవండి: బిష్ణోయ్ గ్యాంగ్‌లో మేడం మాయ.. చేసే పని ఇదే.. -
Pollution Control Day: భోపాల్ గ్యాస్ లీకేజీ విషాదాన్ని గుర్తు చేస్తూ..
ఈరోజు (డిసెంబర్ 2) జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం. 1984, డిసెంబర్ రెండున జరిగిన భోపాల్ గ్యాస్ లీకేజీ విషాదాన్ని గుర్తు చేస్తూ, అటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో 1984లో యూనియన్ కార్బైడ్ కర్మాగారం నుండి విడుదలైన విషపూరిత వాయువు వేలాది మంది ప్రాణాలను బలిగొంది.పెరుగుతున్న కాలుష్యం వల్ల కలిగే సమస్యలపై అవగాహన కల్పించేందుకు కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. కాలుష్య ఉద్గారాల పెరుగుదల ఒక్క భారతదేశం మాత్రమే ఎదుర్కొంటున్న సమస్య కాదు. ప్రపంచమంతా కాలుష్య నియంత్రణ దిశగా పోరాడుతోంది. కాలుష్య నిర్మూలన అనేది ఏ ఒక్కరి వల్లనో, ఏ ఒక్క ప్రభుత్వం వల్లనో అయ్యే పని కాదు. ప్రపంచంలోని అన్ని దేశాలతోపాటు ప్రతిఒక్కరూ తగిన చర్యలను తీసుకుంటేనే కాలుష్యం అనేది అదుపులోకి వస్తుంది.పర్యావరణానికి హాని కలిగించేది ఏదైనా కాలుష్యమనే చెప్పుకోవచ్చు. మనుషులు భరించలేని ధ్వనులను ధ్వని కాలుష్యం అని, ఫ్యాక్టరీలు, వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలను గాలి కాలుష్యం అని, పరిశ్రమల వ్యర్థ జలాలు, మురుగు నీటిని నదులు, కాలువల్లోకి మళ్లించడం ద్వారా ఏర్పడేదాన్ని నీటి కాలుష్యంగా చెప్పుకోవచ్చు. ప్రజలకు కాలుష్యంపై అవగాహన కల్పించడం జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవ లక్ష్యం. కాలుష్యం తగ్గినప్పుడు భూమి వేడెక్కకుండా ఉంటుంది. దీంతో అన్ని జీవరాశులు, మానవులు తమ మనుగడను సాగించగలుగుతాయి.రద్దీ నగరాల్లో వాహనాలను సరి-బేసి విధానాలతో నడిపించడం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, వ్యర్థజలాల నిర్వాహణ తదితర కార్యక్రమాలు కాలుష్యాన్ని నియంత్రించేందుకు దోహపదపడతాయి. ఇదేవిధంగా ఘన వ్యర్థాలను శుద్ధి చేసి, నిర్వహించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు. క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం ప్రాజెక్ట్ ద్వారా పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించవచ్చు.ఇది కూడా చదవండి: నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం -
World Kindness Day 2024 : హృదయాన్ని కదిలించే వీడియోలు!
ప్రపంచ దయ దినోత్సవాన్ని (World Kindness Day ) ఏటా నవంబర్ 13న జరుపుకుంటారు. వ్యక్తులుగా ఒకరిపట్ల ఒకరు, తమ పట్ల , వారి చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల దయ చూపేలా ప్రోత్సహించడం దీని ఉద్దేశం. మానవులుగా పుట్టినందుకు ప్రతి ఒక్కరూ, తోటివారితోపాటు ఈ ప్రకృతి, జంతువుల పట్ల ప్రేమతో, దయతో కృతజ్ఞతగా ఉండడంలోని ప్రాధాన్యతను గుర్తించే రోజు ప్రపంచ దయ దినోత్సవం. చుట్టూ ఉన్న సమాజం పట్ల దయతో ఉండటం మనుషులుగా మనందరి ప్రాథమిక లక్షణం,ప్రపంచ దయ దినోత్సవం: చరిత్రవరల్డ్ కైండ్‌నెస్ డేని 1998లో వరల్డ్ కైండ్‌నెస్ మూవ్మెంట్ ప్రారంభించింది. సామరస్య ప్రపంచాన్ని సృష్టించడంలో దయ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం లక్ష్యం. 1997లో జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన మొదటి ప్రపంచ దయ ఉద్యమ సదస్సు తర్వాత ప్రపంచ దయ ఉద్యమం ఏర్పడింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్‌గా మారాయి.మనసు అందరికీ ఉంటుందికానీ అది గొప్పగా కొందరికి మాత్రమే ఉంటుంది..❤️✨#WorldKindnessDay2024 pic.twitter.com/MwM1NRPexm— Do Something For 👉Better Society ✊ (@ChitraR09535143) November 13, 2024 It is called true happiness which gives peace to the heart and smile to the faces. In fact, the beauty of nature lies in its precious creations, animals and birds. Make your contribution in protecting nature, environment, animals, birds and creatures.#WorldKindnessDay2024 pic.twitter.com/kpXDNaRRZ8— Munesh Kumar Ghunawat (@GhunawatMunesh) November 13, 2024 -
National Candy Day: మిఠాయి పుట్టుక వెనుక..
మిఠాయిలను ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. స్వీట్స్‌ను చూడగానే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ నోరూరుతుంది. మరి ఇలాంటి మిఠాయిల గొప్పదనాన్ని గుర్తు చేసుకునేందుకు ఒక రోజు ఉందని మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతి సంవత్సరం నవంబర్ 4న జాతీయ మిఠాయి దినోత్సవం జరుపుకుంటారు. ఇది తీపిని ఇష్టపడేవారు తియ్యని వేడుక చేసుకునే రోజు. ఈ రోజు ఉద్దేశ్యం స్వీట్లను ఆస్వాదిస్తూ, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, తీపి పదార్థాలపై మనకున్న ప్రేమను వ్యక్తపరడచడం. ఈ రోజున వివిధ రకాల క్యాండీలను రుచి చూడటమే కాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి వేడుక చేసుకుంటుంటారు.మిఠాయి కథ భారతదేశంలోనే మొదలయ్యింది. ప్రాచీన భారతీయులు చెరకు రసాన్ని ఉడికించి, అచ్చులుగా పోసేవారు. వీటిని ముక్కలుగా చేసి దానిని ‘ఖండ’ అని పిలిచేవారు. దీనినే చరిత్రకారులు తొలి మిఠాయిగా అభివర్ణించారు. పురాతన చైనా, మధ్యప్రాచ్యం, ఈజిప్ట్, గ్రీస్, రోమ్లలో తేనెతో మిఠాయిలు తయారు చేసేవారు. పారిశ్రామిక విప్లవానికి ముందు మిఠాయిని జీర్ణవ్యవస్థను మెరుగుపరడచానికి, గొంతు సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి ఔషధంగా ఉపయోగించేవారు.18వ శతాబ్దంలో క్యాండీ.. ఫ్రాన్స్ బ్రిటన్ నుంచి అమెరికాకు వచ్చింది. వంటలలో నైపుణ్యం కలిగినవారు చక్కెరతో మిఠాయిలు చేసేవారు. 1830వ దశకంలో పారిశ్రామిక విప్లవం కొనసాగుతున్న సమయంలో మిఠాయి సంపన్నులకే కాకుండా అందరికీ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల క్యాండీలు అందుబాటులో ఉన్నాయి. మనదేశంలో చాలామంది ఏదైనా మంచి పనిని ప్రారంభించే ముందు మిఠాయి తింటుంటారు. ఇలా చేయడం వలన తాము అనుకున్న పనులు సఫలమవుతాయని భావిస్తుంటారు.ఇది కూడా చదవండి: 2025.. ప్రపంచం అంతానికి ఆరంభం: బాబా వంగా కాలజ్ఞానం -
Halloween Day: ఈ దెయ్యాల ఉత్సవం దేనికి జరుపుతారో తెలుసా?
హాలోవీన్ డే అంటే దెయ్యాల ఉత్సవం. గతంలో ఈ పండుగ గురించి భారతీయులకు పెద్దగా తెలియదు. అయితే కాలానుగుణంగా ఈ విదేశీ పండుగ మనదేశంలోనూ అక్కడక్కడా జరుపుకుంటున్నారు.ప్రతియేటా అక్టోబర్ 31న హాలోవీన్ డే జరుపుకుంటారు. పాశ్చాత్య దేశాలో ప్రజలు దెయ్యాల వేషం వేసుకుని ఈ పండుగ చేసుకుంటారు. అతీంద్రియ శక్తులతో ఈ పండుగకు ముడిపెడతారు. ఈ హాలోవీన్ పండుగ ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారిపోయింది. ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాల్లోనే కాకుండా మరికొన్ని పట్టణాల్లో కూడా హాలోవీన్ పార్టీలు నిర్వహిస్తున్నారు.కొన్ని చోట్ల పాఠశాలల్లో ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ హాలోవీన్ పండుగ వెనుక అనేక ఆసక్తికర అంశాలున్నాయి. ఈ పండుగకు రెండు వేల సంవత్సరాలకు మించిన చరిత్ర ఉంది. ఈ ఉత్సవం ఐర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, నార్తర్న్ ఫ్రాన్స్ మొదలైన దేశాల్లో ప్రారంభమైనట్లు చెబుతారు. ఈ పండుగను సంహైన్ అని కూడా పిలుస్తారు.సాధారణంగా సినిమాల్లో, సీరియల్స్‌లో హాలోవీన్‌ను పౌర్ణమి నాడు వచ్చినట్లు చూపిస్తారు. అయితే, హాలోవీన్ సమయంలో పౌర్ణమి చాలా అరుదుగా వస్తుంది. 2020లో పౌర్ణమి నాడు హాలోవీన్ వచ్చింది. తదుపరి హాలోవీన్ పౌర్ణమి రాత్రి కోసం చాలా సంవత్సరం వేచి ఉండాలి. హాలోవీన్ రోజున, పిల్లలు వివిధ రకాల దుస్తులు ధరించి సమీపంలోని ఇళ్లకు వెళతారు. క్యాండీలను పంచిపెడతారు.ఈ ఆచారం ప్రారంభమైన నాటి రోజుల్లో రాత్రి సమయంలో దెయ్యాలు భూమిపై సంచరిస్తాయని నమ్మేవారు. ఈ కారణంగా ప్రజలు ఇళ్ల వెలుపల ఆహారాన్ని ఉంచడం మొదలుపెట్టారు. దీని తరువాత, చర్చిలలో ప్రార్థన చేసే అలవాటు ప్రారంభమైంది. క్రమంగా పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకోవడం ప్రారంభించారు.హాలోవీన్ రోజున నలుపు ,నారింజ రంగులతో అలంకరించుకుంటారు. నారింజ రంగు శక్తికి చిహ్నంగా భావిస్తారు. ఈ రంగు శరదృతువును సూచిస్తుంది. నలుపు రంగు అనేది భయానికి, మరణానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇది శీతాకాలాన్ని సూచిస్తుంది. ఈ రెండు రంగులు రుతువులలో మార్పులు, జీవితం ,మరణాన్ని సూచిస్తాయి. ఇది కూడా చదవండి: పిల్లల చేత దివిటీలు ఎందుకు కొట్టిస్తారంటే.. -
Internet Day: మొదటి ఎలక్ట్రానిక్ సందేశం చేరిందిలా..
ఈ రోజు (అక్టోబర్ 29) అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం. ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగానికున్న ప్రాధాన్యతను గుర్తు చేసుకునేందుకే అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1969, అక్టోబర్ 29న ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్‌కు మొదటి ఎలక్ట్రానిక్ సందేశాన్ని పంపారు. నాడు ఇంటర్నెట్ను అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్(ఆర్పానెట్) అని పిలిచేవారు.ఇంటర్నెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను కనెక్ట్ చేసింది. ఎటువంటి సమాచారాన్నయినా తక్షణమే అందుకునేలా చేసింది. వివిధ రంగాలలో వినూత్న ఆవిష్కరణలకు నాంది పలికింది. మొదటి ఎలక్ట్రానిక్ సందేశాన్ని 1969లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన చార్లెస్ .. స్టాన్ఫోర్డ్ పరిశోధనా సంస్థకు పంపారు. ఇది గ్లోబల్ నెట్వర్క్ అభివృద్ధికి పునాది వేసింది. అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా 2005 నుంచి అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని జరపుకుంటున్నారు.అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం సందర్భంగా, ఇంటర్నెట్ చరిత్రకు సంబంధించిన అంశాలను వివిధ పత్రికల్లో ప్రచురిస్తుంటారు. టెక్ ఔత్సాహికులు ఈరోజున కొత్త ఆన్లైన్ పరికరాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కొందరు వర్చువల్ సెమినార్లు ఏర్పాటు చేస్తారు. నేడు పాఠశాలలలో పాటు వివిధ సంస్థలలో డిజిటల్ అక్షరాస్యత, సైబర్ భద్రత, ఇంటర్నెట్ భవిష్యత్తుపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.ఇది కూడా చదవండి: రతన్ టాటా గౌరవార్థం: లండన్‌లో.. -
World Students Day: అబ్ధుల్ కలాం స్ఫూర్తిగా..
విద్యార్థి దశలో నేర్చుకున్న అంశాల ఆధారంగానే పిల్లలు ఉత్తమ పౌరులుగా రూపొందుతారు. మనిషి జీవితంలో విద్యార్థి దశ అత్యంత కీలకమైనది. ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని ప్రతియేటా అక్టోబర్ 15న నిర్వహిస్తుంటారు.ఈరోజు (అక్టోబర్ 15) దేశ మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి. ఆ మహనీయుని గౌరవార్థం ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అబ్దుల్ కలాం విద్యార్థులకు స్ఫూర్తిదాయకునిగా నిలిచారు. ఆయన విద్యారంగంలో ప్రశంసనీయమైన కృషి చేశారు. డాక్టర్ ఏపీ జె కలాం ప్రజా రాష్ట్రపతిగా గుర్తింపు పొందారు.ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రత్యేక థీమ్‌తో జరుపుకుంటారు. ఈ సంవత్సరం (2024) థీమ్ 'విద్యార్థుల భవిష్యత్తు కోసం సంపూర్ణ విద్య'. విద్యను కేవలం అకడమిక్ అచీవ్మెంట్లకే పరిమితం చేయకుండా, విద్యార్థుల సమగ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టడమే లక్ష్యంగా ఈ ఏడాది ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2010 (అబ్దుల్ కలాం 79వ జయంతి) నుంచి ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. ఆయన 2002, జూలై 18న దేశానికి 11వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.ప్రపంచ విద్యార్థుల దినోత్సవం రోజున కలాం సాధించిన విజయాలు, విద్యార్థులకు అందించిన స్ఫూర్తిని గుర్తుచేసుకుంటారు. కలాం 2002 నుండి 2007 వరకు దేశానికి 11వ రాష్ట్రపతిగా ఉన్నారు. తన పదవీకాలంలో ఆయన విద్యార్థులు, యువతపై తనకున్న ప్రేమ, ఆప్యాయతలను వివిధ కార్యక్రమాల్లో వ్యక్తం చేశారు. కలాం అందించిన స్ఫూర్తిదాయకమైన మాటలు ఇప్పటికీ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.ఇది కూడా చదవండి: చేతులు కడుక్కుందాం..ఆరోగ్యంగా ఉందాం..! -
World Standards Day: ప్రమాణాల ప్రాధాన్యత తెలిపేందుకు..
మనం కొనుగోలు చేసే లేదా వినియోగించే ఏ వస్తువుకైనా నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి. వస్తు ప్రమాణీకరణకున్న ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, ప్రతి సంవత్సరం అక్టోబరు 14న ప్రపంచ ప్రమాణాల దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజున ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్(ఐఎస్ఓ)తో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ప్రమాణాల ప్రయోజనాల గురించి అవగాహన కల్పించేందుకు నిపుణులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొని పలు సూచనలు, సలహాలు అందజేస్తుంటారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రామాణీకరణ ప్రాముఖ్యత గురించి వినియోగదారులకు అవగాహన పెంచడమే ఈ దినోత్సవాన్ని జరుపుకోవడంలోని ముఖ్య ఉద్దేశ్యం. తొలిసారిగా ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని 1970లో నిర్వహించారు. ప్రామాణీకరణను సులభతరం చేయడానికి అంతర్జాతీయ సంస్థను రూపొందించాలని నిర్ణయించిన 25 దేశాల ప్రతినిధులు 1956లో సమావేశమయ్యారు. ఈ నేపధ్యంలోనే 1847లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్(ఐఎస్ఓ)ఏర్పాటయ్యింది.సామాజిక అసమతుల్యతలను పరిష్కరించడం, స్థిరమైన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం లాంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఐఎస్ఓ ఏర్పాటయ్యింది. ఇక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే.. భారతదేశంలో ప్రామాణీకరణ కార్యకలాపాలను సామరస్యపూర్వకంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో 1947 సంవత్సరంలో దీనిని స్థాపించారు. 1986లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్ ద్వారా ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ పేరును బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌గా మార్చారు. ఈ సంస్థ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖల పరిధిలో పని చేస్తుంది.ఇది కూడా చదవండి: ఓలా.. అలా కుదరదు.. రిఫండ్ ఇవ్వాల్సిందే! -
World Post Day 2024: ప్రపంచ కమ్యూనికేషన్ విప్లవంలో..
ఒకటిన్నర శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా పోస్టల్ వ్యవస్థ మనుగడ సాగిస్తోంది. ప్రజల దైనందిన జీవితంలో పోస్టల్ రంగానికున్న పాత్ర, ప్రపంచ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో పోస్టల్ వ్యవస్థ సహకారంపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 9న ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటారు.1874లో స్విట్జర్లాండ్‌లో ప్రారంభమైన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (యూపీయూ) వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ పోస్టల్ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ప్రపంచ కమ్యూనికేషన్ విప్లవంలో యూపీయూ కీలక పాత్ర పోషించింది. ప్రపంచ తపాలా దినోత్సవం 1969లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పోస్టల్ సేవల ప్రాముఖ్యతను తెలియజెప్పేందుకు అక్టోబర్ 9న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి.యూపీయూ స్థాపించి ఈ సంవత్సరానికి 150 ఏళ్లు పూర్తవుతుంది. ప్రపంచ తపాలా దినోత్సవం ప్రారంభమైనది మొదలు కమ్యూనికేషన్లు, వాణిజ్యం, అభివృద్ధిలో పోస్టల్ సేవల ప్రాముఖ్యత మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఈ-కామర్స్, లాజిస్టిక్స్, ఆర్థిక సేవల విషయంలో పోస్టల్ వ్యవస్థ ప్రముఖమైనదిగా మారింది.ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా వ్యవస్థగా భారతదేశం గుర్తింపు పొందింది. 1774లో వారెన్ హేస్టింగ్స్ కలకత్తాలో జనరల్ పోస్టాఫీసును ప్రారంభించారు. 1837లో కలకత్తా, మద్రాస్, బాంబేలలో తపాలా సేవలను ఆలిండియా సర్వీసుల్లో చేర్చారు. 1852లో మనదేశంలో తొలిసారిగా సింథ్డాక్ అనే తపాలా బిళ్లను విడుదలచేశారు. పూర్తి కథనం: స్మార్ట్‌గా పోస్టల్ సేవలు -
Cotton Day : పత్తి ఉత్పత్తుల ప్రాముఖ్యత తెలిపేందుకు..
పురాతన కాలం నుంచి పత్తిని దుస్తుల తయారీతోపాటు వివిధ ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో పత్తికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించేందుకు ప్రపంచ పత్తి దినోత్సవాన్ని తొలిసారిగా 2019లో ప్రపంచ ఆహార సంస్థ, అంతర్జాతీయ పత్తి సలహా కమిటీలు సంయుక్తంగా నిర్వహించాయి.ప్రతి సంవత్సరం అక్టోబర్ 7న ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జరుపుకుంటారు. పత్తిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తుంటారు. పత్తి ఉత్పత్తి కోట్లాది మందికి ఉపాధిని అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పత్తి ఉత్పత్తి రంగంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడం ప్రపంచ పత్తి దినోత్సవ లక్ష్యం. పత్తిని ఫైబర్ దుస్తుల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. ఆహార పదార్థాల తయారీలో కూడా పత్తిని వినియోగిస్తారు.2019లో సహజ ఫైబర్ పత్తి ఉత్పత్తి, వాణిజ్యం, ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని అక్టోబర్ ఏడున ప్రపంచ పత్తి దినోత్సవం నిర్వహించడం మొదలుపెట్టారు. ప్రపంచ పత్తి దినోత్సవం సందర్భంగా పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పత్తి ఉత్పత్తికి సంబంధించిన పలు విషయాలను చర్చించేదుకు పరిశోధకులు, రైతులు, బడా వ్యాపారవేత్తలు ఒక చోట సమావేశం అవుతుంటారు. ఇది కూడా చదవండి: నవరాత్రి సందడిలో కారు ప్రమాదం.. 12 మందికి గాయాలు -
Translation Day: ప్రపంచాన్ని మరింత దగ్గర చేస్తూ..
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఒకరితో ఒకరు కనెక్ట్ కావడానికి, పరస్పరం కమ్యూనికేట్ చేసుకునేందుకు అనువాదం అనేది ఒక ముఖ్యమైన సాధనం. అనువాదకుల కీలక పాత్రను గుర్తిస్తూ, సెప్టెంబర్ 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున అనువాదకుల, భాషావేత్తల కృషి, అంకితభావాన్ని గుర్తిస్తూ, పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.బైబిల్‌ను లాటిన్లోకి అనువదించిన సెయింట్ జెరోమ్ జ్ఞాపకార్థం ప్రతీ ఏటా సెప్టెంబర్ 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. సెయింట్ జెరోమ్‌ను అనువాదకుల పోషకునిగా పరిగణిస్తారు. ఈయన బైబిల్‌ను లాటిన్లోకి అనువదించగా, దానిని వల్గేట్ అని పిలుస్తారు. ఈ అనువాద రచన ఆయన పాండిత్యానికి, భాషా జ్ఞానానికి నిదర్శనమని చెబుతారు. సెయింట్ జెరోమ్‌ను గుర్తుచేసుకుంటూ అనువాద దినోత్సవాన్ని జరుపుకోవడాన్ని అంతర్జాతీయ అనువాదకుల సమాఖ్య (ఎప్ఐటీ) ప్రారంభించింది.ఈ సంస్థ 1953లో స్థాపితమయ్యింది. 1991 నుంచి వారు ఈ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాలని ప్రతిపాదించారు. దీనిని 2017లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధికారికంగా గుర్తించింది. అనువాదకులు ప్రపంచ శాంతి, సహకారంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఆలోచనలు, భావజాలాలు, సంస్కృతుల మార్పిడికి అనువాదం వారధిగా పనిచేస్తుంది. సాహిత్యం, సైన్స్, వ్యాపారం, రాజకీయ రంగాలలో అనువాదం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.ప్రపంచ వాణిజ్యం, దౌత్యం, శాస్త్రీయ పరిశోధనలు సజావుగా సాగాలంటే అనువాదకులు సహాయం అవసరమవుతుంది. వివిధ భాషలలో రాసిన సమాచారాన్ని అర్థం చేసుకునేందుకు, కమ్యూనికేట్ చేయడానికి అనువాదకులు ఉపయోగపడతారు. అనువాదం అనేది లేకుంటే ప్రముఖ రచయితలు షేక్స్పియర్, టాల్‌స్టాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రేమ్‌చంద్ తదితరుల రచనలు ప్రపంచానికి తెలిసేవి కావనడంతో సందేహం లేదు. ఇది కూడా చదవండి: మద్యం మాఫియా దాడి.. ఆరుగురు పోలీసులకు గాయాలు -
National Daughter’s Day 2024: వందే భారత్‌ను పరుగులు పెట్టిస్తున్న రితికా టిర్కీ
జంషెడ్పూర్: నేడు (సెప్టెంబర్ 22) జాతీయ కుమార్తెల దినోత్సవం. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడమే ఈ దినోత్సవ లక్ష్యం. అంతేకాదు కూతుళ్లు కొడుకుల కంటే ఏమాత్రం తక్కువ కాదన్న సందేశాన్ని అందించేందుకే ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన రితికా టిర్కీ టాటా-పట్నా వందే భారత్‌ను నడిపి తాము పురుషులకు ఏ మాత్రం తీసిపోమని నిరూపించారు.జంషెడ్‌పూర్‌లోని జుగ్సలై నివాసి రితికా టిర్కీ(27) టాటా-పట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడిపి వందేభారత్‌ను నడిపిన దేశంలోనే తొలి మహిళా లోకో పైలట్‌గా గుర్తింపు పొందారు. రితికా తండ్రి లూటియా భగత్ రిటైర్డ్ ఫారెస్ట్ గార్డు. వెనుకబడిన గిరిజన కుటుంబానికి చెందినప్పటికీ రితిక చదువులో ఎంతో ప్రతిభ చూపారు. రాంచీలో పాఠశాల విద్యను పూర్తి చేశాక,మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ అందుకున్నారు. 2019లో రైల్వేలో లోకో పైలట్‌గా నియమితురాలయ్యారు. మొదట చంద్రపురలో పోస్ట్ అయిన ఆమె ఆ తర్వాత 2021లో టాటానగర్‌కు బదిలీ అయ్యారు. రితికా భర్త బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారి.రితికా మీడియాతో మాట్లాడుతూ కూతుళ్లు.. కుమారులతో సమానమేనని, వారు ఏ రంగంలోనూ వెనుకబడరని తెలిపారు. లోకో పైలట్‌గా రైలు నడపడం సవాలుతో కూడుకున్న పని అని, అయితే దీనినే కెరీర్‌గా మార్చుకుని ఈరోజు ఈ స్థానాన్ని సంపాదించానన్నారు. వందేభారత్ రైలును నడిపిన మొదటి మహిళా లోకో పైలట్‌గా గుర్తింపు పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహిళలు, యువతులకు అనేక అవకాశాలు అందించేందుకు ప్రపంచం తలుపులు తెరిచిందన్నారు. ఇది కూడా చదవండి: ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..! -
World Rose Day 2024: క్యాన్సర్‌ను జయించాలని కోరుకుంటూ..
రోజ్ డే అనగానే ఎవరికైనా సరే ప్రేమ జంటలకు సంబంధించిన వాలంటైన్స్ వీక్ గుర్తుకువస్తుంది. అయితే ప్రపంచ రోజ్ డేకు ఒక ప్రత్యేకత ఉంది. సెప్టెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రోజ్‌డే జరుపుకుంటారు. ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై మరింతగా అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు.క్యాన్సర్ రోగులకు అంకితం చేసిన నేటి రోజున క్యాన్సర్ బాధితులకు గులాబీలను అందజేసి, వారిలో మానసిక ధైర్యాన్ని కల్పిస్తారు. ప్రపంచ గులాబీ దినోత్సవం ఎప్పుడు ప్రారంభమయ్యింది? దీనివెనుక ఎవరు ఉన్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.కెనడాకు చెందిన మెలిండా అనే బాలిక జ్ఞాపకార్థం ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. 12 ఏళ్ల వయసుకే బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆ చిన్నారికి వైద్యులు ఎలాంటి వైద్య సహాయం అందించలేకపోయారు. ఆ చిన్నారి ఇక రెండు వారాలు మాత్రమే జీవించి ఉంటుందని తేల్చిచెప్పారు. అయితే మెలిండా ఎంతో ధైర్యంతో ఆరు నెలల పాటు క్యాన్సర్‌తో పోరాడింది. ఈ సమయంలో ఆ చిన్నారి ఇతర క్యాన్సర్ బాధితులతో గడిపింది. తోటి బాధితులు ఆమెకు కవితలు, కథలు చెబుతూ ఆమెను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించారు.ఆరు నెలల పాటు క్యాన్సర్‌తో పోరాడిన ఆ చిన్నారి సెప్టెంబర్‌లో మృతి చెందింది. దీని తరువాత ప్రపంచ గులాబీ దినోత్సవాన్ని జరుపుకునే సంప్రదాయం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం ఈ ప్రపంచ గులాబీ దినోత్సవాన్ని సెప్టెంబర్ నెలలో నాల్గవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ఈ రోజున కేన్సర్ బాధితులకు గులాబీ పూలు అందించి, వారికి ధైర్యం చెబుతూ ప్రపంచమంతా వారికి అండగా నిలుస్తుందనే సందేశాన్ని తెలియజేస్తారు. గులాబీని ప్రేమ, ఆనందాలకు గుర్తుగా పరిగణిస్తారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న వారెవరైనా మీకు తెలిస్తే, మీరు కూడా వారికి గులాబీని అందించి ధైర్యాన్ని చెప్పండి.ఇది కూడా చదవండి: టీనేజ్‌లో ముఖ్యం.. మానసిక ఆరోగ్యం -
World Gratitude Day: నేనెవరికి థ్యాంక్స్ చెప్తానంటే
థాంక్యూ అమ్మమ్మా!నేను ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పలనుకుని చెప్పలేకపోయింది మా అమ్మమ్మకే. తన ప్రవర్తన ద్వారా మాకు ఒక జీవన విధానాన్ని నేర్పించిందామె. ముఖ్యంగా జీవన సహచరుడితో ఎలా నడుచుకోవాలో, ఎవరితో ఎలా మెలగాలో, కొట్టకుండా... తిట్టకుండానే పిల్లలను క్రమశిక్షణతో ఎలా పెంచాలో మా అమ్మమ్మ మా అందరితో మెలిగిన తీరు నుంచే మేము నేర్చుకున్నాం. పోదుపు పాఠాల సంగతి సరేసరి. మేమందరం చిన్నప్పుడు మా ప్రతి సెలవులకూ మా అమ్మమ్మ వాళ్లింటికే వెళ్లేవాళ్లం. తన పిల్లలతో΄ాటు మమ్మల్ని అందరినీ చదువుల వైపు, ఉద్యోగాల వైపు ముఖ్యంగా నిజాయితీతో కష్టపడి పనిచేయాలనే తలంపు వైపు, కుల మతాలకు తావులేని ఆదర్శాలవైపు తమ జీవన విధానంతోనే మళ్లించిన మా అమ్మమ్మ, తాతయ్యలు శ్రీమతి వావిలాల సీతాదేవి, వెంకటేశ్వర్లు గార్లకు కృతజ్ఞతలు ఎలా చెప్పలో మాకు అప్పట్లో తెలియలేదు. ఇప్పుడు తెలిసినా, చెప్పడానికి భౌతికంగా వారు మా మధ్య లేదు. అయితేనేం, మా జ్ఞాపకాలలో పదిలంగా ఉన్న మా అమ్మమ్మ, తాతయ్యలకు ఈ రోజున గుండెలనిండుగా థాంక్స్ చెప్పుకునే అవకాశం మాకు కల్పించిన సాక్షికి కూడా థాంక్స్.– తెల్కపల్లి ఇందిరా ప్రియదర్శిని, కంభం మా వారికే నా థాంక్స్నేను థాంక్స్ చెప్పేది ముందుగా మా వారికే. ఎందుకంటే కుటుంబ పరిస్థితుల రీత్యా పెళ్లయ్యే సమయానికి నేను అతి కష్టం మీద డిగ్రీ పూర్తి చేయగలిగాను. అయితే ఇంకా చదువుకోవాలని ఉందన్న నా మనసు గ్రహించింది మా వారు జేవీఎస్ రామారావు గారే. ఇంటిలో పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, నేను చదువుకునేందుకు ఎంతగానో ప్రోత్సహించారు. ఆయనతో΄ాటు మా అత్తగారు, మా మామగారు, వదినగారు కూడా చదువుకుని ఉద్యోగం చేయడంలో ఎంతగానో సహకరించారు. ఇప్పుడు నేను మూడు పీజీలు, రెండు డిగ్రీలు, రెండు డిపామాలు, ఎం.ఈడీ. చేసి ఉద్యోగం చేస్తూ కూడా మరికొద్దికాలంలోనే పీహెచ్డీ కూడా పూర్తి చేయబోతున్నానంటే అందుకు మా వారి ప్రోత్సాహ సహకారాలే కారణం. అందుకే మా వారికే నా ధన్యవాదాలు. – డి.ఎల్. అనూరాధ, భద్రాద్రి కొత్తగూడెంతండ్రి తర్వాత తండ్రి లాంటి...నేను నా జీవితంలో నా తల్లిదండ్రుల తర్వాత అంతగా రుణ పడిన ఏకైక వ్యక్తి మా మేనమామ కొన్నూరు సత్యారెడ్డిగారే. నా చిన్నప్పుడు నా సోదరుడి అనారోగ్య పరిస్థితుల్లో, నా తల్లిదండ్రులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటే వారికి అండగా ఉంటూ, నన్ను గుండెలపై పెట్టి పెంచుకున్న ఆ రోజులను నేను ఎప్పటికీ మరచిపోలేను. ఆయన ప్రేమతో పెట్టిన గోరుముద్దలతో పెరిగిన ఈ దేహం పడిపోయే వరకూ ఆయన పేరు కాపాడుకుంటూ నిలబడే ఉంటుంది. నన్ను పెంచి పెద్ద చేసి, విలువలు నేర్పి, ఇంతవాణ్ణి చేసిన నా మేనమామకు సాక్షి పత్రిక వేదికగా కృతజ్ఞతలు తెలుపుతున్నందుకు సంతోషిస్తున్నాను. – లంకల అన్వేశ్వర్ రెడ్డి, కుమార లింగం పల్లి, మహబూబ్‌నగర్ జిల్లా -
National Forest Martyrs Day: అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి
న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 11న జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశంలోని అడవులు, వన్యప్రాణులను రక్షించడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరుల త్యాగాన్ని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ రోజున మానవాళి మనుగడలో అడవుల పాత్ర, అడవులను రక్షించాల్సిన అవసరం గురించి అవగాహన పెంచడానికి దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, విద్యా సంస్థలు ఈరోజు ప్రత్యక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. 2013 సెప్టెంబరు 11 నుంచి మొదటిసారిగా పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దేశంలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవడం ప్రారంభించింది. ఈ రోజున జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ప్రత్యేక కారణముంది. 1730, సెప్టెంబర్ 11న రాజస్థాన్‌లోని ఖేజర్లీ గ్రామంలో మారణకాండ జరిగింది. మార్వార్ రాజ్యంలో చెట్లను రక్షించడానికి బిష్ణోయ్ కమ్యూనిటీ సభ్యులు తమ ప్రాణాలను త్యాగం చేసిన రోజు ఇది. అప్పటి జోధ్‌పూర్ మహారాజు అభయ్ సింగ్ కొత్త రాజభవనాన్ని నిర్మిస్తున్నాడు. దాని కోసం అతనికి ఖేజ్రీ కలప అవసరమైంది. దీంతో రాజస్థాన్‌లోని థార్ జిల్లాలోని ఖేజ్రీ గ్రామంలోని ఖేజ్రీ చెట్లను నరికివేయాలని మహారాజు ఆదేశించాడు. రాజు ఆజ్ఞను విష్ణోయ్ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది.ఖేజ్రీ చెట్లు బిష్ణోయిల జీవనోపాధికి ఒక ముఖ్యమైన వనరు. ఈ చెట్లను నరికివేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిష్ణోయ్ మహిళ అమృతా దేవి, ఆమె ముగ్గురు కుమార్తెలు ఖేజ్రీ చెట్లను కావలించుకుని వాటిని నరకకుండా అడ్డుకున్నారు.అమృతా దేవితో పాటు ఆమె కుమార్తెల సాహసోపేతమైన చర్య గురించి అందరికీ తెలిసింది. దీంతో గ్రామస్తులంతా చెట్లను నరికేవారిని అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో బిష్ణోయిలు- మహారాజు సైనికుల మధ్య కొట్లాట జరిగింది. సైనికులు భయంకరమైన మారణకాండను కొనసాగించారు. చెట్లను రక్షించే ప్రయత్నంలో 363 మందికి పైగా బిష్ణోయిలు కన్నుమూశారు. -
National Watermelon Day: ప్రయోజనాలే కాదు.. చరిత్ర కూడా గొప్పదే..
జాతీయ పుచ్చకాయ(వాటర్ మిలన్) దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 3న జరుపుకుంటారు. పుచ్చకాయలో 92శాతం మేరకు నీరు ఉంటుంది. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటానికి పుచ్చకాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పంట సాగు 2000 బీసీ నుండి కొనసాగుతోంది. పుచ్చకాయ చరిత్రపుచ్చకాయ మొదటి పంటను సుమారు 5,000 సంవత్సరాల క్రితం ఈజిప్టులో పండిచారని చరిత్ర చెబుతోంది. 12వ ఈజిప్షియన్ రాజవంశీయులు తిరుగాడిన ప్రదేశాలలో పుచ్చకాయ, దాని గింజల జాడలను కనుగొన్నారు. కింగ్ టుటన్‌ఖామెన్ సమాధిలోనూ పుచ్చకాయ ఆనవాళ్లు కనిపించాయి. పురాతన ఈజిప్షియన్ శాసనాలలో వివిధ రకాల పుచ్చకాయల పెయింటింగ్‌లు కనిపించాయి.ఆఫ్రికాలోని కలహరి ఎడారిలో ప్రయాణించే వ్యాపారులకు పుచ్చకాయ విత్తనాలను విక్రయించినట్లు తెలుస్తోంది. పుచ్చకాయ సాగు ఆఫ్రికా అంతటా చేశారని తెలుస్తోంది. ఆ తర్వాత ఇది మధ్యధరా దేశాలకు, ఐరోపాలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. తొమ్మిదవ శతాబ్దం చివరి నాటికి, చైనాతో పాటు మిగిలిన ఆసియా దేశాలలో పుచ్చకాయను విరివిగా సాగు చేయడం మొదలుపెట్టారు.జాన్ మరియాని రాసిన ‘ది డిక్షనరీ ఆఫ్ అమెరికన్ ఫుడ్ అండ్ డ్రింక్’ లోని వివరాల ప్రకారం పుచ్చకాయ అనే పదం 1615లో ఆంగ్ల నిఘంటువులో కనిపించింది. యునైటెడ్ స్టేట్స్లో 300కు మించిన రకాల పుచ్చకాయలను పండిస్తున్నారు.ఆరోగ్య ప్రయోజనాలుపుచ్చకాయలో 92శాతం మేరకు నీరు ఉంటుంది . కేలరీలు తక్కువ పరిణామంలో ఉంటాయి. ఈ పండు నిర్జలీకరణాన్ని నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్లో ఈ జ్యూసీ ఫ్రూట్‌ని చేర్చుకోవాలి. పుచ్చకాయ గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. పుచ్చకాయలో హీట్ స్ట్రోక్‌ను నిరోధించే ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. పుచ్చకాయ జ్యూస్ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. -
మద్రాసు @385
దక్షిణాది రాష్ట్రాలలోని ప్రముఖ నగరాలలో చెన్నై ఒకటి. ఈ నగరం భిన్న సంస్కృతులకు ప్రతిబింబంగా నిలుస్తుంది. భారతీయతకు చిహ్నంగానూ ఈ నగరం పేరొందింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 22న ‘మద్రాస్ డే’ నిర్వహిస్తుంటారు.తమిళనాడు రాజధాని మద్రాసును ఇప్పుడు చెన్నై అని పిలుస్తున్నారు. మద్రాసు ఏర్పడి నేటికి( 2024, ఆగస్టు 22) 385 ఏళ్లు పూర్తయ్యాయి. 1639 ఆగస్టు 22న తమిళనాడు రాజధాని మద్రాసుకి బ్రిటీష్ ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ పునాది రాయి వేసింది. అప్పట్లో దీనిని ‘మద్రాసు’ అని పిలిచేవారు. దాదాపు 70 లక్షల జనాభా కలిగిన ఈ నగరం ప్రపంచంలోనే 31వ అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందింది. అయితే చరిత్రకారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నగరం రెండు వేల ఏళ్ల క్రితం నాటిది.రెండవ శతాబ్దంలో ఈ ప్రాంతం చోళ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. తోడై మండల ప్రావిన్స్‌లో మద్రాసు పట్టణం అనే చిన్న గ్రామం ఉండేది. 1639 ఆగస్టు 22న సెయింట్ ఫోర్ట్ జార్జ్ నిర్మాణంతో ఆధునిక మద్రాస్ ఉనికిలోకి వచ్చింది. దీని తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ చుట్టుపక్కల ఉన్న చిన్న గ్రామాలను కూడా మద్రాసులో విలీనం చేసింది. 1639లో ఈస్ట్ ఇండియా కంపెనీ కోరమాండల్ తీరంలోని చంద్రగిరిలో విజయనగర రాజు పెద వెంకట రాయల నుంచి కొంత భూమిని కొనుగోలు చేసింది. ఈ నేలపైనే ఆధునిక మద్రాసు పుట్టింది. ఇది వలస కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారింది. నాటి రోజుల్లో బ్రిటీష్‌వారు మద్రాసు గ్రామాన్ని ఆ పక్కనే ఉన్న చెన్నపట్టణాన్ని కలిపి మద్రాసుగా పిలుస్తూ వచ్చారు. అయితే నాటి రోజుల్లో స్థానికులు మద్రాసును చెన్న పట్టణం లేదా చెన్నపురి అని పిలిచేవారు. ఈ నేపధ్యంలోనే 1996 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం మద్రాసును అధికారికంగా ‘చెన్నై’గా మార్చింది.ప్రతి సంవత్సరం ఆగస్టు 22న తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ‘మద్రాస్ డే’ను నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. 1939లో మద్రాసు చరిత్రపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో చరిత్రకారులు, ప్రొఫెసర్లు సభ్యులుగా ఉన్నారు. 2004 నుంచి ‘చెన్నై హెరిటేజ్ ఫౌండేషన్’ మద్రాసు దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది. చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించేందుకే ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. -
పంద్రాగస్టు: తెలుసుకోవలసిన 10 విషయాలు
భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమానికి మహాత్మా గాంధీ నాయకత్వం వహించారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం లభించింది. భారత స్వాతంత్య్రానికి సంబంధించిన 10 ఆసక్తిక అంశాలు..1. స్వాతంత్య్రం వచ్చిన రోజున మహాత్మా గాంధీ ఢిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్‌లోని నోఖాలీలో ఉన్నారు. అక్కడ హిందువులు- ముస్లింల మధ్య నెలకొన్న మతపరమైన హింసను నియంత్రించేందుకు నిరాహార దీక్ష చేపట్టారు.2. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వస్తుందని తెలియగానే జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్‌లు మహాత్మా గాంధీకి ఒక లేఖ పంపారు. ఆ లేఖలో ‘ఆగస్టు 15వ తేదీ మన దేశ తొలి స్వాతంత్య్ర దినోత్సవం. జాతిపితగా ఉత్సవాల్లో పాల్గొని మీ ఆశీస్సులు అందించండి’ అని రాశారు.3. అయితే దీనికి సమాధానంగా గాంధీజీ ‘కలకత్తాలో హిందువులు- ముస్లిములు పరస్పరం ఘర్షణ పడుతున్నప్పుడు నేను సంబరాలు చేసుకోవడానికి ఎలా వస్తాను? ఈ అల్లర్లను అదుపు చేయడానికి నేను నా జీవితాన్ని త్యాగం చేస్తాను’ అంటూ ఒక లేఖ ద్వారా సమాధానం పంపారు.4. ఆగస్ట్ 14న అర్ధరాత్రి వైస్రాయ్ లాడ్జ్ (ప్రస్తుత రాష్ట్రపతి భవన్) నుండి జవహర్లాల్ నెహ్రూ ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ అనే చారిత్రాత్మక ప్రసంగం చేశారు. అప్పటికి నెహ్రూ ప్రధాని కాలేదు. ప్రపంచం మొత్తం ఈ ప్రసంగాన్ని విన్నది.5. ఆగస్ట్ 15, 1947న లార్డ్ మౌంట్ బాటన్ తన కార్యాలయంలో పనిచేశారు. మధ్యాహ్నం నెహ్రూ తన మంత్రివర్గం జాబితాను అతనికి అందించారు. తరువాత ఇండియా గేట్ సమీపంలోని ప్రిన్సెస్ గార్డెన్లో జరిగిన సమావేశంలో ప్రసంగించారు.6. ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం నాడు భారత ప్రధాని ఎర్రకోట నుండి జెండాను ఎగురవేస్తారు. కానీ ఇది ఆగస్ట్ 15, 1947 న జరగలేదు. లోక్‌సభ సెక్రటేరియట్ పరిశోధనా పత్రంలోని వివరాల ప్రకారం నెహ్రూ 1947 ఆగస్టు 16న ఎర్రకోటపై జెండాను ఎగురవేశారు.7. అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ప్రెస్ సెక్రటరీ క్యాంప్‌బెల్ జాన్సన్ తెలిపిన వివరాల ప్రకారం జపాన్ మిత్రరాజ్యాల దళాలకు లొంగిపోయిన రెండవ వార్షికోత్సవం ఆగస్టు 15న జరగబోతోంది. ఆ రోజున భారతదేశానికి విముక్తి కల్పించడానికి బ్రిటీషర్లు నిర్ణయం తీసుకున్నారు.8. భారతదేశం- పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ 1947, ఆగస్టు 15 నాటికి నిర్ణయం కాలేదు. ఆగస్టు 17న రాడ్‌క్లిఫ్ లైన్ ప్రకటన ద్వారా దీనిని నిర్ణయించారు.9. భారతదేశం 1947, ఆగష్టు 15న స్వాతంత్య్రం పొందింది. కానీ జాతీయ గీతం రూపొందలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లోనే ‘జన గణ మన’ రాశారు. ఈ జాతీయ గీతానికి 1950లో రూపకల్పన జరిగింది.10. ఆగస్టు 15న మరో మూడు దేశాలకు కూడా స్వాతంత్య్రం లభించింది. దక్షిణ కొరియాకు 1945 ఆగష్టు 15న జపాన్ నుండి స్వాతంత్య్రం లభించింది. బహ్రెయిన్ 1971 ఆగష్టు 15న బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందింది. కాంగో 1960, ఆగస్టు 15న ఫ్రాన్స్ నుండి స్వాతంత్య్రం పొందింది. -
www.. ప్రపంచ గతిని మార్చిన 3 అక్షరాలు!
ముప్ఫై ఐదేళ్ల క్రితం కనుక్కొన్న మూడు అక్షరాలు ప్రపంచ గతిని మార్చేశాయి. ఆ మూడు అక్షరాలు లేకుంటే ప్రపంచాన్ని నడిపిస్తున్న ఇంటర్నెట్ లేదు. ఆ మూడు అక్షరాలు www. అదే వరల్డ్ వైడ్ వెబ్. నేడు (ఆగస్ట్ 1) ఈ వరల్డ్ వైడ్ వెబ్ దినోత్సవం. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం..ఇదీ www చరిత్రఇంటర్నెట్ అనేది కంప్యూటర్లను కలిపే నెట్వర్క్ అయితే వరల్డ్ వైడ్ వెబ్ అనేది పబ్లిక్ వెబ్ పేజీలను కలిపే వ్యవస్థ. ఇది నేడు ప్రపంచాన్ని శాసించే వేలాది ఇతర ఆవిష్కరణల సృష్టికి దారితీసింది. అయితే, వరల్డ్ వైడ్ వెబ్ జనాల దృష్టికి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. 1989లో టిమ్ బెర్నర్స్-లీ అనే ఆయన దీన్ని WWW అనే దాన్ని రూపొందించారు. బెల్జియన్ ఇన్ఫర్మేటిక్స్ ఇంజనీర్, కంప్యూటర్ సైంటిస్ట్ రాబర్ట్ కైలియాయు మరింత మెరుగుపరిచారు. వారిద్దరూ కలిసి హైపర్‌టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ (HTTP)ని అభివృద్ధి చేశారు. దాన్ని 1992లో ఆవిష్కరించారు. అనేక ఇతర గొప్ప సాంకేతికతల మాదిరిగానే WWW అనేది మొదట్లో సాధారణ ప్రజల కోసం రూపొందించింది కాదు. భౌతిక శాస్త్రవేత్తలు సమాచారాన్ని పంచుకోవడం కోసం దీన్ని రూపొందించారు. తర్వాత సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.ఇందులో మొదటి ఫోటో 1992లో బెర్నర్స్-లీ అప్లోడ్ చేశారు. 1990ల మధ్య నాటికి మిలియన్ల మంది క్రియాశీల వినియోగదారులను కూడగట్టుకోవడం ద్వారా ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కమ్యూనికేషన్ మాధ్యమంగా నిరూపించుకుంది. 21వ శతాబ్దం నాటికి, వెబ్ వినియోగం కంప్యూటర్లతోపాటు స్మార్ట్ఫోన్లకు కూడా మారింది. నేడు, వరల్డ్ వైడ్ వెబ్‌ను గేమింగ్ పరికరాలు, సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వాచ్‌ల ద్వారా కూడా యాక్సెస్ చేస్తున్నారు. 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మందికి పైగా వరల్డ్ వైడ్ వెబ్ యాక్టివ్ యూజర్లున్నారు. -
నేడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం
రాహుల్‌గాంధీ రాజకీయాల్ని మరచిపోతారు.. సచిన్టెండూల్కర్ బ్యాటింగ్‌కు బదులు ఈటింగ్‌కి జై కొడతారు.. హైదరాబాద్ బిర్యానీ అంటే సెలబ్రిటీలకే సెలబ్రిటీ. శతాబ్దాల నాటి బిర్యానీ ఎప్పటికప్పుడు నగరాన్ని రుచుల విశ్వంలో రారాజుగా నిలబెడుతూనే ఉంది. నేడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం.. ఈ సందర్భంగా లొట్టలేస్తూ నెమరేసుకుందాం..మన బిర్యానీ..కహానీ..దేశంలో అత్యధికంగా జనం ఆస్వాదిస్తోన్న ఆహారం బిర్యానీయే. అయితే అలా ఆర్డర్ ఇస్తున్న ప్రతి ఐదు బిర్యానీల్లో ఒకటి మనదేనట. ఆ విధంగా చూస్తే భాగ్యనగరం దేశానికి బిర్యానీ క్యాపిటల్‌గా మారిందన్నమాటే. దేశవ్యాప్తంగా సెకనుకు సగటున 2.5 బిర్యానీలు హాంఫట్ అవుతున్నాయట. గతేడాది నగరంలో 13 మిలియన్ల బిర్యానీలు స్విగ్గీ సర్వ్ చేసింది. అంటే అక్షరాలా కోటి 30లక్షలు.. నగరంలోని 1700కు పైగా రెస్టారెంట్లలో కేవలం ఒక్క స్విగ్గీ ద్వారా అమ్ముడవుతున్న బిర్యానీల సంఖ్యే ఇది. ఇక ఇతరత్రా మార్గాల ద్వారా జరిగే విక్రయాలను కలుపుకుంటే చెప్పనక్కర్లేదు. నగరంలో అమ్ముడయ్యే బిర్యానీల్లో తొలిస్థానం చికెన్ బిర్యానీ కాగా, రెండో స్థానం వెజ్ బిర్యానీ కావడం మరో విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో చికెన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీలు ఉన్నాయి. తాజాగా టేస్ట్ అట్లాస్ నిర్వహించిన ఓ అధ్యయనంలో అత్యుత్తమ రుచుల్లో మన బిర్యానీ 6వ స్థానంలో నిలిచింది. బిర్యానీ అనే పదం పర్షియన్ భాషలోని బిరింజ్ నుంచి పుట్టింది. దీని అర్థం రైస్. బిర్యానీ మన దేశానికి 1398లో పరిచయం అయ్యిందట. హైదరాబాద్ నిజామ్స్, లక్నో నవాబులు బిరియానీ అంటే లొట్టలేసేవారట. మొఘలుల కాలంలో తరచూ యుద్ధాల్లో పాల్గొనే సైనికుల కోసం చేసిన ప్రత్యేక వంటకం ఇది. సైనికుల శక్తి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని మటన్, బియ్యం సమపాళ్లలో మేళవించి చెక్కల మంట మీద మసాలాలు, కుంకుమ పువ్వు దీనిలో కలిపి వండేవారట. నగరాన్ని పాలించిన నిజామ్ ఉల్ మల్్క.. బిర్యానీ విస్తరణ చరిత్రలో చెక్కుచెదరని పేరు తెచ్చుకున్నారు. స్థానిక వంటకాల శైలులను ఒకటొకటిగా కలుపుకుంటూ ఎన్నో కొత్త రుచులను అద్దుకుంది బిర్యానీ. ఇందులో నిజామ్స్ సృష్టించిన కచ్చి గోస్త్ బిర్యానీ ఒకటి. ఇటీవల మన దేశపు అగ్రగామి చెఫ్ సంజీవ్‌కపూర్ సైతం తన అభిమాన బిర్యానీ హైదరాబాద్‌లో పుట్టిన కచ్చి గోస్త్ బిర్యానీ గురించి చెప్పడం విశేషం. సిటీలో టాప్ బిర్యానీ సెంటర్లు ఇవే... ఏళ్ల నాటి నుంచి చారి్మనార్‌కు సమీపంలోని షాబాద్ హోటల్ బిర్యానీకి ఫేమస్. అదే క్రమంలో పాతబస్తీలోని దారుల్íÙఫాలోని నయాబ్, బంజారాహిల్స్‌లోని బిర్యానీ వాలా, హైదర్‌గూడలోని కేఫ్ బహార్, సికింద్రాబాద్‌లోని పారడైజ్, నారాయణగూడలోని మెహ్ఫిల్, టోలిచౌకిలోని షాగౌస్, ఫలుక్‌నుమా ప్యాలెస్‌లోని అదా, క్రాస్‌రోడ్స్‌లోని బావర్చి, పాతబస్తీలోని పిస్తా హౌజ్, పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్... తదితర పేర్లు నగరంలోని బిర్యానీప్రియులకు నిత్య స్మరణీయం. ఇవన్నీ దశాబ్దాలుగా బిర్యానీ ఫేవరెట్స్ కాగా.. ఇటీవలి కాలంలో మరికొన్ని రెస్టారెంట్స్ అత్యాధునిక హంగులతో రుచికరమైన బిర్యానీలను వడ్డిస్తున్నాయి. బహురూపాల్లో...⇒ బిర్యానీని సాధారణంగా హండి లేదా కుండలో వండడం అనేది ఏళ్లనాటి సంప్రదాయం. కానీ కుండలోనే వడ్డిస్తూ, పార్సిల్స్ కూడా అందిస్తున్నారు. ఆ తర్వాత డబ్బా బిర్యానీ వచి్చంది. ఇది కాంపాక్ట్ కంటైనర్‌లో అందించడం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని మారేడు మిల్లి బొంగులో బిర్యానీకి ఫేమస్. వెదురు బొంగుల్లో వండిన బిర్యానీని అలాగే వడ్డిస్తూ టేక్ అవే ఇస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని స్పైసీ వెన్యూ రెస్టారెంట్లో ఎంఎల్ఏ పొట్లం బిర్యానీ పేరుతో ఆమ్లెట్లో చుట్టి వడ్డిస్తూ పార్సిల్స్ చేస్తున్నారు. ⇒ కొత్తగా బకెట్ బిర్యానీ వచి్చంది. ఎరుపు, తెలుపు, బ్లూ.. ఇలా అనేక రంగుల బిర్యానీ బకెట్లు నగరవాలుకు కలర్‌ఫుల్ ట్రీట్ అందుబాటులోకి తెచ్చాయి. నగరంలోని ఓ రెస్టారెంట్లో బిర్యానీ–ఇన్–ఏ–వాటర్–వెస్సల్ కూడా రానుందని అంటున్నారు. అంతే కాదు కోన్‌లో బిర్యానీ, పిజ్జాలో బిర్యానీ, సమోసాలో బిర్యానీ, బిర్యానీ సుషీ రోల్స్, బిర్యానీ ఫ్లేవర్ ఐస్ క్రీం వంటివి ఆన్ ద వే అట.చవులూరించే వెరైటీలు... చికెన్, మటన్, వెజిటబుల్స్.. జోడించిన బిర్యానీలు ఓ వైపు లీడ్ చేస్తుండగా, నగరంలో ఉలవచారు బిర్యానీ, క్లాసిక్ హైదరాబాదీ బిర్యానీ, రిచ్ అండ్ క్రీమీ లక్నోవి బిర్యానీ. టాంగీ, ఫ్లేవర్ఫుల్ బాంబే బిర్యానీ వంటివి విభిన్న రకాల మేళవింపులతో అందుబాటులోకి వచ్చాయి. చైనీస్– ఆధారిత ఫ్రైడ్ రైస్ బిర్యానీ లేదా మెక్సికన్–ప్రేరేపిత బురిటో బిర్యానీ ఫ్యూజన్ బిర్యానీ... ఇలా ఫుడ్ లవర్స్‌కి పదుల సంఖ్యలో ఎంపిక అవకాశాలు అందిస్తున్నారు.మండీ వచి్చనా... ట్రెండీ మనదే..నగరంలోని బార్కాస్ ప్రాంతంలో పేరొందిన మండీ...బిర్యానీకి గట్టి పోటీ ఇస్తుందని అంచనా. అరబ్బుల వంటకమైన మండీ.. నగరంలో వేగంగా విస్తరించింది. అలా దాదాపు ఎనిమిదేళ్ల నుంచీ మండీ హవా మొదలైంది. అయితే ఇప్పటికీ బిర్యానీకి దరిదాపుల్లో కూడా రాలేకపోయిందంటే.. దటీజ్ హైదరాబాద్ బిర్యానీ అంటున్నారు సిటీ ఫుడ్ ఇండస్ట్రీ వర్గాలు. పొట్లం బిర్యానీ స్పెషల్బిర్యానీ రుచి, నాణ్యతతో పాటు కంటైనర్స్ కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వెరైటీ కంటైనర్స్‌లో వడ్డించడం, పార్సిల్ చేయడం ద్వారా ఫుడ్ లవర్స్‌ని అట్రాక్ట్ చేస్తున్నారు. అయితే ఏదేమైనా ఫుడ్ క్వాలిటీ, టేస్ట్ ముఖ్యం. మా రెస్టారెంట్ స్పెషల్‌గా పొట్లం బిర్యానీ అందిస్తున్నాం. ఆమ్లెట్లో చుట్టిన బిర్యానీని సిటీలో ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులోకి తెచ్చాం. – సంపత్, ద స్పైసీ వెన్యూ రెస్టారెంట్హైదరాబాద్ ఆవకాయతో.. అమెరికాలో బిర్యానీ..నగరవాసులు అనేకమంది విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు. అక్కడ తెలుగువాళ్లు అధికంగా నివసించే చోట కూడా హైదరాబాద్ బిర్యానీ హల్చల్ చేస్తోంది. ‘మన ఇండియన్స్‌తో పాటు అమెరికన్లు కూడా హైదరాబాద్ బిర్యానీని బాగా ఇష్టపడతారు’ అంటూ చెప్పారు నగరంలోని మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన నగే‹Ù, సాయిప్రసాద్. ఈ బావా, బావమరుదులు ఇద్దరూ అమెరికాకు వలస వెళ్లి అక్కడ బావర్చి బిర్యానీ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ రెస్టారెంట్లో అందించే ఆవకాయ బిర్యానీ అక్కడ పాప్యులర్. దీని కోసం సునీత బంధువులు మల్కాజ్‌గిరిలో భారీ ఎత్తున ఆవకాయ పచ్చడి తయారు చేసి అమెరికాకు పంపిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకూ... థియేటర్లలో షోస్ టైమింగ్స్లాగే నగరంలోనూ బిర్యానీ దొరికే వేళలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. నైట్‌లైఫ్‌తో పాటే మిడ్నైట్ బిర్యానీలు కూడా పుట్టుకొచ్చేశాయి. అబిడ్స్‌లోని గ్రాండ్ హోటల్ అర్ధరాత్రి బిర్యానీ విందుకు చిరునామాగానూ, అలాగే చాదర్‌ఘాట్ మిడ్నైట్ బిర్యానీలకు కేరాఫ్‌గా మారాయి. కొన్ని స్టార్ హోటల్స్ బిర్యానీ ప్రియులకు అర్ధరాత్రుళ్లు తలుపులు తెరుస్తున్నాయి. అలాగే తెల్లవారుజామున 4 గంటలకే వేడివేడి బిర్యానీని అందించే ట్రెండ్ ఇటీవలే ఊపందుకుంటోంది. మాదాపూర్, గచ్చి»ౌలి, బోరబండ, వివేకానందనగర్.. ప్రాంతాల్లో సందడి కనిపిస్తోంది. కాల్ సెంటర్లు, మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు నైట్ షిఫ్ట్‌ను ఈ బిర్యానీతో ముగించడానికి అలవాటు పడుతున్నారు.వుడ్ ఫైర్‌పై వండే కేటరర్.. సూపర్..నగరానికి చెందిన మహరాజ్ కేటరర్స్, ఎస్కె కేటరర్స్, ఎలిగెన్స్.. తదితర సంస్థలు వుడ్ ఫైర్ మీద వండి కేటరింగ్ చేస్తున్నారు. పెళ్లిళ్లు, వేడుకల్లో వీరి బిర్యానీలకు డిమాండ్ ఉంది. అలాగే హోటల్స్ విషయానికి వస్తే..బావర్చి, పంజాగుట్టలోని మెరిడియన్, ఫైవ్‌స్టార్ హోటల్ మారియట్‌లో బిదిరి అనే హైదరాబాద్ స్పెషల్ రెస్టారెంట్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఆస్టోరియా, పిస్తా హౌజ్‌లోని సాఫ్రాని బిర్యానీలు నా ఛాయిస్. –జుబైర్ అలీ, ఫుడ్ బ్లాగర్ -
హైదరాబాద్ అంతా చుట్టేసిన హీరోయిన్ నభా నటేశ్ (ఫొటోలు)
-
సమ్మిళిత అభివృద్ధికి సహకార నమూనా!
‘సమాజంలో ప్రతి ఒక్కరి కోసం మెరుగైన ప్రపంచాన్ని సహకార సంఘాలు నిర్మిస్తాయి...’ ఇదీ ఈ ఏడాది అంతర్జాతీయ సహకార దినోత్సవ నినాదం! జూలై మొదటి శనివారం నాడు సహకార దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీ. ఈ జూలై 6న సహకార దినోత్సవ సంబురం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కోట్లాది సహకారులు రకరకాల కార్యక్రమాల ద్వారా సరికొత్త ఆశలతో సహకార స్ఫూర్తిని మరోసారి చాటడానికి సమాయత్తమవుతున్నారు.మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహకార శాఖను ఏర్పాటు చేసి అనేక సంస్కరణలు చేపట్టిన తర్వాత మన దేశంలో సహకార వ్యవస్థలో కొత్త కదలిక మొదలైంది. అంతకుముందు నుంచే రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సహకార శాఖలు ఉన్నప్పటికీ కేంద్రం స్థాయిలో వ్యవసాయ శాఖలో ఒక విభాగంగానే సహకార పాలన ఉంటూ వచ్చింది.అనాదిగా రైతులకు రుణాలు ఇచ్చే సొసైటీలుగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు (పీఏసీఎస్‌లు) రైతుల ఆర్థిక సేవలకే పరిమితం కాకుండా ఇతర ప్రజల అవసరాలను కూడా తీర్చే వ్యాపార సంస్థగా ఉండాలని భావించి కేంద్ర సహకార శాఖ పీఏసీఎస్ లకు సరికొత్త బైలాస్‌ను నిర్దేశించటం ఒక కీలక పరిణామం. ఈ సేవలన్నీ పారదర్శకంగా అందించటం కోసం పీఏసీఎస్ లన్నిటినీ కంప్యూటరీకరించే పని జరుగుతోంది.పీఏసీఎస్‌ల తర్వాత సంఖ్యాపరంగా పాడి రైతుల సొసైటీలు, మహిళా సహకార సంఘాలు (ఉదా: లిజ్జత్ పాపడ్‌ను ఉత్పత్తి చేసే మహిళా సొసైటీ), చేనేత కార్మికుల సొసైటీలు, మత్స్యకారుల సొసైటీలు, గృహనిర్మాణ సొసైటీలు, ఉద్యోగుల సొసైటీలు, ప్రత్యేకించి కార్మికుల సొసైటీలు (ఉదా: కేరళలో ప్రసిద్ధమైన ఉరులుంగల్ నిర్మాణ కార్మికుల సొసైటీ) సైతం గతంలోనే ఏర్పాటు కావటం మనకు తెలిసిందే.గుజరాత్లో ఏర్పడిన చిన్న పిల్లల పొదుపు సహకార సంఘం పెద్ద హిట్ అయ్యింది. ఆధునిక కాలానికి అనుగుణంగా సరికొత్త వర్గాలు విలక్షణమైన సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అర్బన్ ప్రాంతాల్లో చిన్నపాటి ఎలక్ట్రానిక్ వస్తువులకు రిపేర్లు చేసే పనివారి సహకార సంఘం కూడా ఏర్పాటైంది. ఈ–కామర్స్ సంస్థల్లో వస్తువులు పంపిణీ చేసే గిగ్‌వర్కర్ల సహకార సంస్థలు సైతం ఏర్పాటవుతున్నాయి.ఆయుర్దాయం పెరుగుతున్న కొద్దీ గ్రామాల్లో, పట్టణాల్లో వయోవృద్ధుల జనాభా పెరుగుతోంది. పిల్లలు చదువులు/ ఉద్యోగాలు/ వ్యాపారాల కోసం దేశ విదేశాలకు వెళ్లిపోవటంతో గ్రామాలు/ పట్టణాలు/ నగరాల్లో వృద్ధులే మిగిలిపోతున్నారు. కొందరు వృద్ధాశ్రమాల్లో చేరుతున్నా ఇళ్లు వదిలి వెళ్లలేక, అక్కడే ఉండలేక పండుటాకులు నానా అగచాట్లు పడుతున్నారు.వీరి ప్రత్యేక ఆహార, వైద్య, సామాజిక అవసరాలు తీర్చే ప్రత్యేక సహకార సంఘాలు ఇప్పటికే కేరళ వంటి రాష్ట్రాల్లో విశేష సేవలు అందిస్తున్నాయి. ప్రత్యేకంగా కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసుకొని ఉమ్మడిగా భోజన ఏర్పాట్లు చేసుకోవటం దగ్గరి నుంచి.. ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేసుకునే వరకు సభ్యులైన వృద్ధులకు అనేక సేవలు అందిస్తున్నాయి ఈ సొసైటీలు. తెలుగు రాష్ట్రాల్లోనూ వృద్ధుల సహకార సంఘాల అవసరం ఎంతో ఉంది.గుజరాత్లో సహకార వ్యవస్థతో గట్టి సంబంధం ఉన్న అమిత్ షా కేంద్ర సహకార మంత్రిగా ఇటీవలే రెండోసారి బాధ్యతలు చేపట్టారు. సహకార వ్యాపారాన్ని దేశ విదేశాల్లో కొత్త పుంతలు తొక్కించాలన్నది తమ లక్ష్యమని మోదీ, అమిత్‌షా చెబుతున్నారు. సహకార రంగంలో ఢిల్లీ నుంచి తేదలచిన మార్పులన్నిటినీ క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది రాష్ట్ర సహకార శాఖలు. రాష్ట్రస్థాయిలో సహకార వ్యవస్థ చురుగ్గా పనిచేయాలంటే సలహా మండళ్లు కీలకం. వాటి జాడ లేకుండా పోయింది.సాచివేత ధోరణి, అవినీతి, మితిమీరిన రాజకీయ జోక్యం, జవాబుదారీతనం లోపించటం వంటి జాడ్యాలతో కునారిల్లుతున్న సహకార శాఖల్లో కొత్తగా సహకార స్ఫూర్తి వెల్లివిరియాలంటే రాష్ట్ర స్థాయిలోనూ సంస్కరణలు తేవాలి. అప్పుడే ‘సహకార నమూనా’ మేలైన సమ్మిళిత అభివృద్ధి మార్గంగా నిలుస్తుంది. వాతావరణ మార్పుల గడ్డు కాలంలో సహకార అభివృద్ధి నమూనా కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్ట్ -
మహిళా సాధికారత థీమ్‌తో యోగా డే
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతియేటా జూన్ 21న నిర్వహిస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా యునైటెడ్ కింగ్డమ్ (యుకె)లోని భారత హైకమిషన్ ట్రఫాల్గర్ స్క్వేర్‌లో యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి మాట్లాడుతూ ఈ ఏడాది మహిళా సాధికారత థీమ్‌తో యోగా డేను నిర్వహించనున్నామని తెలిపారు. గత ఏడాది జరిగిన యోగా కార్యక్రమంలో 700 మందికి పైగా జనం పాల్గొన్నారని, వివిధ సంఘాల సభ్యులు కూడా హాజరయ్యారన్నారు. అదేవిధంగా ఈసారి కూడా అధిక సంఖ్యలో జనం యోగా కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు.యోగా అన్ని వర్గాల వారినీ కలుపుతుందని, అందరికీ ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ తెలిపారన్నారు. ఈ ఏడాది జరిగే యోగా కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొననున్నారన్నారు. బ్రిటిష్ పౌరుడు ఇందర్‌పాల్ ఓహ్రీ చందేల్ మాట్లాడుతూ యోగా అనేది మన వారసత్వంలో భాగమని, దానితో మనం కనెక్ట్ కావడం అందరికీ ముఖ్యమన్నారు. ఈ ఏడాది జరిగే యోగా దినోత్సవంలో భారత బధిర క్రికెట్ జట్టు సభ్యులు పాల్గొనబోతున్నారని అన్నారు. 2015 నుండి ప్రతీయేటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. -
Global Wind Day 2024: గాలి ‘పవర్’ అప్పుడే తెలిసింది!
ప్రతి సంవత్సరం జూన్ 15న జరుపుకునే గ్లోబల్ విండ్ డే, పవన శక్తి ప్రాముఖ్యత, భూగోళాన్ని మార్చే దాని శక్తి గురించి అవగాహన పెంచుతుంది. ఇది పవన శక్తిని స్థిరమైన, పునరుత్పాదక శక్తి వనరుగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించే ప్రయత్నం.భారత్‌లో ఇంధన పొదుపు శాఖ ఆధ్వర్యంలో ఏటా విభిన్న థీమ్ తో గ్లోబల్ విండ్ డేను నిర్వహిస్తారు. ఈ ఏడాది థీమ్ ఇంకా తెలియరాలేదు. గ్లోబల్ విండ్ ఎనర్జీ డే చరిత్ర, ప్రాముఖ్యత, ఇతర ఆసక్తికర విషయాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.పవన విద్యుత్ చరిత్ర ఇదీ..విండ్ ఎనర్జీ చరిత్ర వేలాది సంవత్సరాల క్రితం నాటిది. ఈజిప్టులోని నైలు నదిపై పడవలను నడపడానికి తొలిసారిగా విండ్ మిల్స్ ఉపయోగించారు. తరువాత చైనాలో పవన శక్తిని అభివృద్ధి చేశారు. ఇక్కడ గాలితో నడిచే నీటి పంపులను క్రీస్తుపూర్వం 200లో కనుగొన్నారు. క్రీ.శ. 1వ శతాబ్దంలో అలెగ్జాండ్రియాకు చెందిన హెరాన్ విండ్ వీల్ ను సృష్టించాడు.విండ్ మిల్స్ అనతి కాలంలోనే ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రజాదరణ పొందిన పరికరంగా మారింది. వాటి ఉపయోగం చివరికి 1800ల చివరలో, 1900ల ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్ కు వ్యాపించింది. పశ్చిమ అమెరికాలో వేలాది నీటి పంపులు, చిన్న విండ్ టర్బైన్లను ఏర్పాటు చేసిన హోమ్ స్టెడర్లు, వ్యవసాయదారులు దీనిని చేశారు. 1970 లలో చమురు కొరత కారణంగా పవన విద్యుత్ అభివృద్ధికి అత్యంత ఆవశ్యకత ఏర్పడింది. ఇది చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి పునరుత్పాదక శక్తి వనరులను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడానికి దారితీసింది.46,422 మెగావాట్ల సామర్థ్యంభారత పునరుత్పాదక ఇంధన రంగంలో గణనీయమైన పురోగతిని ప్రదర్శిస్తూ కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) తన తాజా డేటాను ఆవిష్కరించింది. 2024 మే 31 నాటికి సంచిత భౌతిక పురోగతి నివేదిక సౌర, పవన విద్యుత్ వ్యవస్థాపన రంగాలలో గణనీయమైన పురోగతిని హైలైట్ చేస్తుంది. ఒక్క మే నెలలోనే భారత్ 3,007.28 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడించింది. ఈ గణనీయమైన పెరుగుదలకు ప్రధానంగా రెండు ప్రధాన కారణాలు. అవి పవన శక్తి, సౌర శక్తి. పవన విద్యుదుత్పత్తి 535.96 మెగావాట్లు పెరగడంతో మొత్తం సామర్థ్యం 46,422.47 మెగావాట్లకు చేరింది. -
Celebrity Siblings: సినీ ఇండస్ట్రీలో సత్తా చాటిన అన్నదమ్ములు (ఫోటోలు)
-
National Brother's Day 2024 : బంధానికే అందం అపూర్వ సహోదరులు
-
ఎలుగుబంట్లలో రకాలెన్ని? ఏ ఎలుగుబంటి ప్రమాదకరం?
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 23న ‘వరల్డ్ బేర్ డే’ అంటే ప్రపంచ ఎలుగుబంటి దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎలుగుబంట్ల జీవన విధానంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు. ఎలుగుబంటి దినోత్సవాన్ని తొలిసారిగా 1992లో నిర్వహించారు. ఎలుగుబంట్ల దుస్థితిపై అవగాహన కల్పించేందుకు దీనిని ప్రారంభించారు. ప్రపంచ ఎలుగుబంటి దినోత్సవాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఎలుగుబంట్ల అభయారణ్యాన్ని సందర్శించడం, ఎలుగుబంటి పాత్ర ఉన్న సినిమా చూడటం, ఎలుగుబంటి వివరాలు కలిగిన పుస్తకాన్ని చదవడం లాంటి కార్యకలాపాలు చేస్తారు. ఎలుగుబంట్లు క్షీరద జాతికి చెందినవి. ఇవి మాంసాహార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఎలుగుబంటి జాతులు ప్రధానంగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా ఐరోపాలలో కనిపిస్తాయి. గోధుమ లేదా నలుపు రంగులో ఇవి ఉంటాయి. స్వచ్ఛమైన తెలుపు రంగులో పోలార్ ఎలుగుబంట్లు ఉంటాయి. ఎలుగుబంటి ఒంటరి జంతువు. ఎలుగుబంట్లు శీతాకాలంలో ఎక్కువసేపు నిద్రావస్థలో ఉంటాయి. ఈ కాలంలో అవి గుహలలో ఆశ్రయం పొందుతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎనిమిది రకాల ఎలుగుబంట్లు ఉన్నాయి. అమెరికన్ బ్లాక్ బేర్ అమెరికన్ బ్లాక్ బేర్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా కనిపించే ఎలుగుబంటి జాతి. ఈ రకమైన ఎలుగుబంటి ఎక్కువగా ఉత్తర అమెరికాలోని అటవీ, పర్వత ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది మధ్యస్థ పరిమాణంతో ఉంటుంది. దట్టమైన నల్లని బొచ్చుతో శారీరకంగా చాలా బలంగా ఉంటుంది. ఆసియన్ బ్లాక్ బేర్ దాని పేరులో సూచించినట్లుగా ఇది ఆసియాలో కనిపించే ఎలుగుబంటి జాతి. ఇది భారతదేశం, కొరియా, ఈశాన్య చైనా, రష్యా, జపాన్, తైవాన్లలో కనిపిస్తుంది. దీనిని మూన్ బేర్ అని కూడా అంటారు. స్పెక్టాక్లెడ్ బేర్ ఇది ఛాతీ పైభాగంలో లేత గోధుమరంగు రంగును కలిగి ఉంటుంది. దీని ఆకారంలో కళ్లకు అద్దాలు పెట్టుకున్నట్లు కనిపిస్తున్నందున దీనిని స్పెక్టాక్లెడ్ బేర్ అని అంటారు. దీనిని ఆండియన్ బేర్, పర్వత ప్రాంత ఎలుగుబంటి అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ట్రెమార్క్టోస్ ఆర్నాటస్. ఇది దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. మధ్యస్థ పరిమాణంలో ఉంటుంది. ఇవి చెట్లపై ఎక్కువ సమయం గడుపుతాయి. ఇవి ఒంటరిగా తిరుగుతాయి. జెయింట్ పాండా జెయింట్ పాండా ఎలుగుబంటికి కళ్ళ చుట్టూ నల్లటి గుర్తులు కనిపిస్తాయి. నలుపు, తెలుపు రంగుల మృదువైన బొచ్చుతో కూడిన శరీరంతో విభిన్నంగా కనిపిస్తాయి. జెయింట్ పాండా బేర్ దక్షిణ మధ్య చైనాలో కనిపిస్తుంది. జెయింట్ పాండాకు రెండు ఉపజాతులు ఉన్నాయి. సన్ బేర్ ఎలుగుబంటి జాతులలో సన్ బేర్ చిన్నగా కనిపిస్తుంది. ఇది ఆగ్నేయాసియాలోని ఉష్ణమండల వర్షారణ్యాలలో ఉంటుంది. తేనెను విపరీతంగా ఇష్టపడే దీనిని హనీ బేర్ అని కూడా పిలుస్తారు. దాని మెడపై ప్రత్యేకమైన గుర్రపుడెక్క ఆకారంలో ఆరెంజ్ రంగు గుర్తు ఉంటుంది. సన్ ఎలుగుబంటికి రెండు ఉపజాతులు ఉన్నాయి. ఇవి అన్ని రకాల ఎలుగుబంట్లలో అత్యంత ప్రమాదకరమైనవని చెబుతారు. స్లాత్ బేర్ స్లాత్ బేర్ శాస్త్రీయ నామం మెలుర్సస్ ఉర్సినస్. ఇది ప్రధానంగా భారతదేశం, నేపాల్, శ్రీలంకలో కనిపిస్తుంది. దీని పొడవాటి దిగువ పెదవి కారణంగా దీనిని లాబియేట్ బేర్ అని కూడా అంటారు. ఈ రకమైన ఎలుగుబంట్ల చెవులు పొడవాటి జుట్టును కలిగి ఉంటాయి. ఈ ఎలుగుబంట్లు జంటగా తిరుగుతాయి. బ్రౌన్ బేర్ బ్రౌన్ బేర్ భారీ పరిమాణం కలిగిన ఎలుగుబంటి జాతి. దీనిని గ్రిజ్లీ బేర్ అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ఉర్సస్ ఆర్క్టోస్. ఉత్తర యురేషియా, ఉత్తర అమెరికాలో ఇవి కనిపిస్తాయి. బ్రౌన్ బేర్ ఉపజాతులు అనేకం ఉన్నాయి. వీటి మెడ వెనుక భాగంలో పొడవైన మందపాటి బొచ్చు ఉంటుంది. బ్రౌన్ బేర్ అనేక యూరోపియన్ దేశాలకు జాతీయ జంతువు. పోలార్ బేర్ పోలార్ బేర్ అనేది భారీ పరిమాణం కలిగిన ఎలుగుబంటి జాతి. దీని శాస్త్రీయ నామం ఉర్సస్ మారిటిమస్. ఇది ప్రధానంగా ఆర్కిటిక్ సర్కిల్ చుట్టూ కనిపిస్తుంది. దీనికి తెల్లటి బొచ్చు కింద నల్లని చర్మం ఉంటుంది. దీనికి రెండు ఉపజాతులు. అవి అమెరికన్ పోలార్ బేర్, సైబీరియన్ పోలార్ బేర్. సముద్రపు మంచు ఘనీభవించిన శీతాకాలంలో ఈ ధృవపు ఎలుగుబంట్లు మరింత చురుకుగా ఉంటాయి. ప్రాణాలు తీస్తున్న ఎలుగుబంట్లు గత రెండు దశాబ్దాలో స్లాత్ ఎలుగుబంట్లు వేలాది మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఇవి మన దేశంలో వందల మందిని చంపాయి. భారత ప్రభుత్వం అధికారికంగా ఎలుగుబంట్ల దాడులను లెక్కించనప్పటికీ, స్లాత్ ఎలుగుబంటి మన దేశంలోని అత్యంత ప్రాణాంతక జంతువులలో ఒకటని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇతర రకాల ఎలుగుబంటి కంటే ఈ స్లాత్ ఎలుగుబంటి మనుషులపై అధికంగా దాడులు చేస్తోంది. మరోవైపు మనదేశంలో ఈ రకపు ఎలుగుబంట్ల సంఖ్య పెరుగుతున్న కారణంగా అవి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మన దేశంలోని అడవులలో కేవలం 10 శాతం మాత్రమే ఎలుగుబంట్లకు అనువైనవిగా ఉన్నాయి. ఎవరైనా ఈ అడవుల్లోకి ప్రవేశించినప్పుడు లేదా అవి (ఎలుగుబంట్లు) ఆహారం, నీటి కోసం మానవ నివాసాలలోకి ప్రవేశించినప్పుడు అవి మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఆగ్రాలో ఎలుగుబంట్ల రక్షిత కేంద్రం యూపీలోని ఆగ్రాలో ప్రపంచంలోనే అతిపెద్ద రక్షిత బేర్ సెంటర్ ఉంది. ఇక్కడ 100 ఎలుగుబంట్లు ఉన్నాయి. 20 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో వీటి సంఖ్య 500కు పైగానే ఉండేది. వైల్డ్‌లైఫ్ ఎస్ఏఓస్కు చెందినప్రత్యేక బృందం ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్లో ఎలుగుబంట్లను సంరక్షిస్తోంది. తాజ్ సిటీలోని సుర్ సరోవర్ ప్రాంతంలో ఈ బేర్ కన్జర్వేషన్ సెంటర్ ఉంది. 1995లో స్థాపితమైన వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్.. ఎలుగుబంట్లతో కొందరు ఫీట్స్ చేయించడాన్ని అరికట్టేందుకు ఉద్యమించింది. యూపీలోని ‘కలందర్’ తెగ ప్రజలు ఎలుగుబంటి పిల్లలను వేటాడి, వాటి చేత గారడీ చేయించేవారు. ఈ వ్యవహారాలను వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్ అరికట్టింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం జంతువులను హింసించడం చట్టవిరుద్ధం. వైల్డ్‌లైఫ్ సంస్థ ఇప్పటివరకూ 628 ఎలుగుబంట్లను రక్షించింది. ఈ సంస్థ నాలుగు ఎలుగుబంట్ల పునరావాస కేంద్రాలను నిర్వహిస్తోంది. వీటిలో ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్ ప్రముఖమైనది. ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్ సహ వ్యవస్థాపకుడు కార్తీక్ సత్యనారాయణ మాట్లాడుతూ ఎలుగుబంట్లకు తాము ఉదయం వేళ పండ్లు, సాయంత్రం గంజి అందిస్తామన్నారు. వాటికి పలువిధాలుగా ఉపయోగపడేలా ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశామన్నారు. -
భారత్‌తో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు పాక్ యత్నం!
పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టింది. ప్రధానిగా షాబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. షాబాజ్ అధికారం చేపట్టిన తర్వాత భారత్‌తో దౌత్య సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ తమ జాతీయ దినోత్సవాన్ని ఈనెల 28న భారత రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించాలని నిర్ణయించింది. కోవిడ్ -19 మహమ్మారితో పాటు ఇరు దేశాల మధ్య క్షీణిస్తున్న సంబంధాల కారణంగా నాలుగేళ్ల విరామం తర్వాత పాక్ తమ జాతీయ దినోత్సవాన్ని ఢిల్లీలో జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. 1940లో లాహోర్ తీర్మానాన్ని ముస్లిం లీగ్ ఆమోదించింది. దీనికి గుర్తుగా సాధారణంగా మార్చి 23న పాకిస్తాన్ జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఈసారి దీనిని మార్చి 28న నిర్వహించేందు సన్నాహాలు చేస్తున్నారు. 1940, మార్చి 22 నుండి మార్చి 24 వరకు లాహోర్‌లో జరిగిన సమావేశాల్లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్.. లాహోర్ తీర్మానాన్ని ఆమోదించింది. దీనిలో భారతదేశంలోని ముస్లింల కోసం అధికారికంగా స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అయితే ఈ ప్రతిపాదనలో ఎక్కడా ‘పాకిస్తాన్’ అనే పదాన్ని ప్రస్తావించలేదు. లాహోర్ తీర్మానాన్ని ఆమోదించిన తేదీని పాకిస్తాన్ తమ జాతీయ దినోత్సవంగా జరుపుకుంటుంది. 1956 మార్చి 23న పాక్ అధికారికంగా తన మొదటి రాజ్యాంగాన్ని ఆమోదించింది. దీంతో పాకిస్తాన్ డొమినియన్‌ను ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్‌గా మారింది. 1960- 1968 మధ్య కాలంలో ఈ తీర్మానం ఆమోదం పొందిన స్థలంలో మినార్-ఎ-పాకిస్తాన్ నిర్మితమయ్యింది. దీనిపై తీర్మానానికి సంబంధించిన వివరాలు చెక్కారు. పాకిస్తాన్ తమ జాతీయ దినోత్సవాన్ని న్యూ ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీ కాంప్లెక్స్‌లో మార్చి 28న జరుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో విదేశీ దౌత్యవేత్తలు, భారతీయులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల జాతీయ గీతాలు ఆలపించనున్నారు. అనంతరం పాకిస్తాన్ హైకమిషనర్, ముఖ్య అతిథి ప్రసంగాలు చేయనున్నారు. -
యూపీలో మళ్లీ కరోనా కలకలం
ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో ఏడుగురికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఒకే రోజు ఏడుగురికి కరోనా నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖలో కలకలం చెలరేగింది. రాజ్‌నగర్, వసుంధర, వైశాలి, సాహిబాబాద్‌లలో ఈ కరోనా కేసులను గుర్తించారు. ప్రస్తుతం గాజియాబాద్‌లో మొత్తం తొమ్మదిమంది కరోనా బాధితులు ఉన్నారు. వారిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. రాజ్‌నగర్‌లో నివసిస్తున్న 53 ఏళ్ల వ్యక్తి, అతని 26 ఏళ్ల కుమారుడు దగ్గు, జలుబుతో బాధపడుతూ, కోవిడ్ పరీక్ష చేయించుకున్నారని సీఎంఓ డాక్టర్ భవతోష్ శంఖధర్ తెలిపారు. వీరికి కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యింది. ఇదేవిధంగా వైశాలికి చెందిన 23 ఏళ్ల యువకుడు, సాహిబాబాద్‌కు చెంది 65 ఏళ్ల వృద్ధుడు, వసుంధరలో నివసిస్తున్న ఒక మహిళతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు కరోనా పాజిటివ్‌గా తేలారు. 2020 ప్రారంభం నుండి గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మందికి పైగా జనం కరోనా వైరస్ బారిన పడగా, 5.3 లక్షల మందికి పైగా మృతిచెందడం గమనార్హం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ఇప్పటివరకు ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పైగా ఉంది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం. దేశంలో కోవిడ్-19 నివారణకు 220.67 కోట్ల డోస్‌ల టీకాలు అందించారు. -
యుద్ధం కన్న అనాథలు
ప్రపంచంలో ఎంతో మంది ఒక పూట తిండి కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో మరెంతో మంది కన్న ప్రేమను కోల్పోయి తల్లడిల్లుతున్నారు. – మదర్ థెరెసా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లు. ఇరువైపులా ఎంతో మంది మరణించారు. రష్యా దాడులు తట్టుకోలేక ఉక్రెయిన్ నుంచి లక్షలాది మంది వలసపోయారు. అటు పాలస్తీనాలో ఇజ్రాయెల్ దాడులతోనూ లక్షలాది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. అంతా యుద్ధ నష్టం గురించి, ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడుకుంటుంటే.. అభంశుభం ఎరుగని ఎందరో చిన్నారులు యుద్ధం మిగిల్చిన అనాథలుగా భవిష్యత్తు ఏమిటో తెలియని దుస్థితిలో పడిపోయారు. జనవరి 6న (శనివారం) ప్రపంచ యుద్ధ సంక్షుభిత అనాథ పిల్లల దినోత్సవం (వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్) నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేక కథనం.. నేను ఎందుకిలా అయ్యానో తెలియదు ఈ చిత్రంలోని అమ్మాయి పేరు మసిక. వయసు పన్నెండేళ్లు. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్సీ)లో జరుగుతున్న అంతర్యుద్ధంలో తిరుగుబాటుదారులు ఆమె కళ్ల ముందే తల్లిదండ్రులను కాల్చి చంపేశారు. ఎవరూ దిక్కులేక తన స్నేహితురాలి తల్లితో కలసి జీవిస్తోంది. నాటి ఘటనను తలచుకుని కుమిలిపోతూ.. తినేందుకు తిండి, సరైన రక్షణ లేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ‘‘అసలు వాళ్లెవరో, ఎందుకోసం ఇలా చేస్తున్నారో, మా అమ్మానాన్నను ఎందుకు చంపేశారో, నేను ఎందుకిలా బతకాల్సి వస్తోందో నాకు తెలియదు..’’ అంటూ మసిక ఆవేదన వ్యక్తం చేస్తోంది. అమ్మానాన్నను కోల్పోయి.. ఈ చిన్నారి పేరు కరీనా. వయసు ఏడేళ్లు. ఉక్రెయిన్‌లోని చెర్నిగివ్ ప్రాంతంలోని ఓ గ్రామం. రష్యా యుద్ధం మొదలుపెట్టాక తమ ఊరిని విడిచిపోతున్న సమయంలో.. జరిగిన బాంబు దాడిలో కరీనా తల్లిదండ్రులు చనిపోయారు. ఇప్పుడు ఉక్రెయిన్‌లోని కీవ్ నగరంలో తమ బంధువుల ఇంట్లో ఉంటోంది. తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ, బాంబు దాడిలో అయిన గాయాలతో బాధపడుతూ గడుపుతోంది. ప్రపంచ యుద్ధాలతో ముమ్మరమై.. ► రెండు ప్రపంచ యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అనాథ చిన్నారులను మిగిల్చాయి. అధికారిక అంచనాల ప్రకారమే.. అప్పట్లో పోలాండ్‌లో 3 లక్షలు, యుగోస్లే్లవియాలో 2 లక్షల మంది పిల్లలు అనాథలయ్యారు. ► ‘యూనిసెఫ్ (ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పిల్లల అత్యవసర నిధి)’ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సంక్షుభిత ప్రాంతాల్లో 25 కోట్ల మందికిపైగా చిన్నారులు కనీస అవసరాలైన ఆహారం, మంచినీరు, నిలువనీడ లేక అవస్థ పడుతున్నారు. ఇందులో సుమారు 14 కోట్ల మంది తండ్రినిగానీ, తల్లిదండ్రులు ఇద్దరినీగానీ కోల్పోయి అనాథలుగా బతుకీడుస్తున్నారు. ► అనాథలుగా మారినవారిలో సుమారు 6 కోట్ల మంది ఆసియా దేశాల్లో, 5 కోట్లకుపైగా ఆఫ్రికా, మరో కోటిన్నర మందికిపైగా లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంత దేశాల్లో ఉన్నారు. ► యుద్ధాలు, తిరుగుబాట్లతో అట్టుడుకుతున్న మధ్య ప్రాచ్యం, ఆసియా, దక్షిణ అమెరికా దేశాల్లో.. ముఖ్యంగా సిరియా, ఇరాక్, అఫ్గానిస్తాన్ వంటి దేశాల్లో.. ఆఫ్రికా ఖండంలోని సూడాన్, కాంగో, ఉగాండా, సోమాలియా వంటి దేశాల్లో అనాథ పిల్లల సమస్య పెరుగుతోంది. ఇలాంటి చోట్ల చాలా మంది చిన్నారులు తిరుగుబాటు దళాల్లో సైనికులుగా తుపాకులు చేతబట్టాల్సి వస్తోంది. ► సూడాన్‌లో అయితే ప్రతి వంద మంది చిన్నారుల్లో పది మంది అనాథాశ్రమాల్లో, వీధుల్లో బతుకు వెళ్లదీస్తున్నారు. ► ఇటీవల ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ దాడికి ప్రతిగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడటంతో.. వేల మంది మరణించారు. లక్షలాది మంది వలసపోయారు. ఈ యుద్ధంలో నూ పెద్ద సంఖ్యలో చిన్నారులు అనాథలయ్యారు. ఏనాటి యుద్ధమైనా.. పిల్లలూ సమిధలే.. ఏ పిల్లలకైనా తల్లిదండ్రులే అన్నీ. చదువు కోసమో.. ఉద్యోగం కోసమో దూరంగా ఉంటున్నా..తల్లడిల్లేది వారి గురించే. అమ్మ ఒడికి, నాన్న చెంతకు చేరితేనే సాంత్వన. అలాంటి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోతే.. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోతే.. ఆ బాధ వర్ణనాతీతం. అలాంటిది అస్తిత్వం కోసమో, అన్నం కోసమో, ఆక్రమణ కోసమో.. మానవ నాగరికత మొదలైన నాటి నుంచీ జరుగుతున్న యుద్ధాల్లో ఎందరో పిల్లలు అనాథలుగా మారుతున్నారు. తమ వారంటూ ఉన్న బంధువుల మధ్య పెరుగుతున్నవారు కొందరు.. ఏతోడూ లేకుండా కునారిల్లిపోతున్నవారు మరికొందరు. సరైనదారిలో పడ్డవారు మంచి జీవితం గడపగలిగితే..‘దారి తప్పిన’వారి బతుకులు ఆగమైపోతున్నాయి. ఉక్రెయిన్‌లో రెండేళ్లుగా పిల్లల గోస రష్యా–ఉక్రెయిన్ ఒకప్పుడు ఒకే సోవియట్ యూనియన్‌లో భాగం. అందుకే ఇరు దేశాల మధ్య రాకపోకలూ, సంబంధ బాంధవ్యాలూ సాధారణమే. కానీ ఇరు దేశాల మధ్య పొరపొచ్చాలు, యుద్ధంతో ఇరువైపులా ఉండిపోయిన మరోదేశపు కుటుంబాలు ఆగమైపోయాయి. మరణించిన, వలస వెళ్లినవారి పిల్లలు, సైనికులు బలవంతంగా తల్లిదండ్రుల నుంచి విడదీసినవారు.. ఇలా ఎందరో చిన్నారులు అనాథలుగా మారారు. ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన ‘కిడ్సేవ్’ అనే స్వచ్ఛంద సంస్థ తమ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేసింది. ఉక్రెయిన్‌కు మిలటరీ సాయమేకాదు.. యుద్ధంతో అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరింది. బలవంతంగా క్యాంపులకు చిన్నారులు 2022 ఫిబ్రవరి చివరివారం నాటికి ఉక్రెయిన్‌లో అనాథ పిల్లల సంఖ్య లక్ష వరకు ఉండగా.. ఆ తర్వాత ఈ సంఖ్య మరింతగా పెరిగింది. కానీ సంక్షుభిత పరిస్థితుల్లో లెక్కలు తేల్చేదెలాగని, వేల మంది చిన్నారులు క్యాంపుల్లో మగ్గుతున్నారని అమెరికాకు చెందిన కాన్ఫ్లిక్ట్ అబ్జర్వేటరీ సంస్థ గతంలోనే పేర్కొంది. మరోవైపు రష్యా తమ దేశంలోని సుమారు 14 వేల ఉక్రెయిన్ కుటుంబాల పిల్లలను తల్లిదండ్రుల నుంచి బలవంతంగా విడదీసి క్యాంపులకు తరలించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో యూరప్‌లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన యూదు చిన్నారులు వీరు. వారికి కొత్త జీవితం అందించడం కోసం 1921లో అమెరికాలోని న్యూయార్క్‌కు తరలించినప్పుడు హార్బర్లో తీసిన ఫొటో ఇది. ఫ్రెంచ్ ఆర్గనైజేషన్ చొరవతో..ప్రత్యేక రోజుగా.. ఫ్రాన్స్‌కు చెందిన ‘ఎస్ఓఎస్ ఎన్ఫాంట్స్ ఎన్ డెట్రెసెస్’ స్వచ్ఛంద సంస్థ చొరవతో యూనిసెఫ్ ఏటా జనవరి 6న ‘వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్ డే’గా నిర్వహిస్తోంది.యుద్ధాలు, తిరుగుబాట్ల కారణంగా అనాథలుగా మారుతున్న చిన్నారులు.. వారు శారీరకంగా, మానసికంగా తీవ్ర దుస్థితిని ఎదుర్కొంటున్న అంశంపై అవగాహన కల్పించడం, వారిని ఆదుకోవడం లక్ష్యంగా చర్యలు చేపట్టడమే దీని లక్ష్యం. అనాథలను ఆశ్రమాల్లో చేర్చడంతోపాటు చదువుకోవడానికి, సాధారణ జీవితం గడపడానికి తోడ్పడాలని స్వచ్ఛంద సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. -
‘టీమిండియా గెలిచేవరకూ మెతుకు ముట్టం’
ఈరోజు చారిత్రాత్మక రోజు. నేడు ప్రపంచకప్-2023 ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియాల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. 2003 తర్వాత ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో ఈ ఇరు జట్లు తలపడనున్నాయి. టీమ్ ఇండియా విజయం కోసం దేశవ్యాప్తంగా పలు చోట్ల ప్రార్థనలు, పూజలు నిర్వహిస్తున్నారు. నేటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలవాలని కోరుతూ మసీదులు, చర్చిలు, దేవాలయాలు, గురుద్వారాలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరుగుతున్నాయి. కంగారూలతో పోరుకు టీమ్ ఇండియా సైన్యం సిద్ధమైంది. గ్రాండ్ ఫైనల్‌ను వీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు స్టేడియంనకు తరలివస్తున్నారు. భారతదేశంలోని ప్రతిచోటా టీమ్ ఇండియా విజయం కోసం పూజలు చేస్తున్నారు. వారణాసిలోని విశ్వేశ్వరుని మొదలుకొని ఉజ్జయినిలోని మహాకాళీశ్వరుని వరకూ అందరు దేవుళ్లు భారత్ టీమ్‌ను ఆశీర్వదించాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. ఈ నేపధ్యంలో ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫ్ఫర్‌నగర్‌లో పదిమంది యువకులు భారత్ గెలిచేవరకూ తాము మెతుకు కూడా ముట్టబోమంటూ కఠిన ఉపవాస దీక్షకుదిగారు. శివచౌక్కు చేరుకున్న ఈ యువకులు అక్కడి శివాలయంలో పూజలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ‘భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచేవరకూ తాము మెతుకు కూడా ముట్టుకోబోమని, ఒక వేళ భారత్ పరాజయం పాలయితే ఇక తమ జీవితంలో ఎప్పటికీ క్రికెట్ చూడబోమని ప్రతిజ్ఞ చేశారు. ఇది కూడా చదవండి: అహ్మదాబాద్‌లో పర్యాటకుల రద్దీ -
అక్షరాస్యతలో దేశం ఎక్కడుంది? ఎదురవుతున్న ఆటంకాలేమిటి?
విద్యాభివృద్ధితోనే ఏ దేశమైనా సమగ్రాభివృద్ధి చెందుతునేది అక్షర సత్యం. అభివృద్ధి చెందిన దేశాలను పరిశీలిస్తే ఇది ముమ్మాటికీ నిజమనిపిస్తుంది. విద్యకుగల ప్రాధాన్యతను గుర్తించిన ప్రపంచంలోని దేశాలన్నీ తమ దేశాలలో విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. దేశప్రజలంతా విద్యావంతులు కావాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక మన భారతదేశం విషయానికొస్తే నవంబరు 11న(నేడు) జాతీయ విద్యాదినోత్సవం జరుపుకుంటారు. భారతదేశం అక్షరాస్యత విషయంలో ఘనమైన చరిత్రను కలిగివుంది. ప్రపంచంలోనే ఎంతో పేరొందిన నలంద, తక్షశిల, విక్రమశిల లాంటి పురాతన విశ్వవిద్యాలయాలు ఇందుకు ఉదాహరణగా నిలిచాయి. చాణక్య, కాళిదాసు, రవీంద్రనాథ్ ఠాగూర్, రామానుజన్, అమర్త్య సేన్ తదితర పండితులు, రచయితలు, కవులు, ఆలోచనాపరులను భారతదేశం ప్రపంచానికి అందించింది. స్వతంత్ర భారతదేశ మొదటి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 11 న దేశంలో జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2008 నుంచి జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది. నవంబరు 11న దేశంలోని విద్యా సంస్థలు సెమినార్లు నిర్వహించడంతో పాటు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తాయి. అక్షరాస్యత ప్రాముఖ్యత అందరికీ తెలిసేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తాయి. స్వతంత్ర భారతావనిలో విద్యావ్యవస్థకు పునాదులు పడటం మొదలుకొని, ఈ రంగంలో నేడున్న స్థితిగతులు.. ఇందుకు నాటి విద్యాశాఖ మంత్రి ఆజాద్ అందించిన సహకారాన్ని ఈ రోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలో అక్షరాస్యత వాస్తవాలు ప్రపంచంలోని 135 దేశాలలో మహిళల అక్షరాస్యత రేటులో భారతదేశం 123వ స్థానంలో ఉంది. దేశంలో 60 లక్షల మంది పిల్లలు బడి బయట అంటే చదవుకు దూరంగా ఉన్నారు. దేశంలో ప్రతి 50 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. దేశంలో వయోజన అక్షరాస్యత రేటు 63%. ప్రపంచంలో అత్యధికంగా 287 మిలియన్ల(ఒక మిలియన్ అంటే 10 లక్షలు) నిరక్షరాస్యులైన వయోజనులకు నిలయంగా భారతదేశం ఉంది భారతదేశంలో బడి బయట ఉన్న పిల్లల్లో 47.78% మంది బాలికలే కావడం విశేషం. 1950లలో 10 మంది భారతీయుల్లో కేవలం ఇద్దరు మాత్రమే అక్షరాస్యులు. 2022నాటి విద్యా గణాంకాలు దేశంలో విద్యాభివృద్ధికి సూచికగా నిలిచాయి. 2018లో దేశంలో అక్షరాస్యత రేటు 74.4%కి చేరింది. దీనిని చూస్తే దేశంలో అక్షరాస్యుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలుస్తుంది. దేశంలో అక్షరాస్యత రేటు లింగం, ప్రాంతం, సామాజిక పరిస్థితులను అనుసరించి మారుతుంటుంది. 2018 నాటికి పురుషుల అక్షరాస్యత రేటు 82.4శాతం, స్త్రీల అక్షరాస్యత రేటు 65.8శాతం. అక్షరాస్యత రేటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో విభిన్నంగా కనిపిస్తుంది. కేరళలో అక్షరాస్యత రేటు 96.2 శాతం. ఇది దేశంలోనే అత్యధికం. ఆంధ్రప్రదేశ్‌లో అత్యల్ప అక్షరాస్యత రేటు నమోదయ్యింది. ఇది 66.4శాతంగా ఉంది. ప్రభుత్వ విధానాలు, సామాజిక ఉద్యమాలు, ఆర్థికాభివృద్ధి, సాంకేతిక పురోగతి తదితరాలతో దేశంలో అక్షరాస్యత రేటు పెరుగుతూ వస్తోంది. దేశంలో అక్షరాస్యత శాతం పెరిగేందుకు దోహదపడిన ప్రభుత్వ కార్యక్రమాలిలా ఉన్నాయి. జాతీయ అక్షరాస్యత మిషన్: ఇది 1988లో ప్రారంభమయ్యింది. ఇది వయోజనులకు ప్రాథమిక విద్యను అందించడం, జీవన నైపుణ్యాలను మెరుగుపరచడం ద్వారా వారిలో నిరక్షరాస్యతను నిర్మూలించడం లక్ష్యంగా పనిచేస్తోంది. సర్వశిక్షా అభియాన్: 2001లో ప్రారంభమయ్యింది. ఇది 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించడం లక్ష్యంగా ముందుకు సాగుతోంది. విద్యా హక్కు చట్టం: దీనిని 2009లో రూపొందించారు. ఇది 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి విద్యను ప్రాథమిక హక్కుగా పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత , నిర్బంధ విద్యను తప్పనిసరి చేశారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్: 2009లో ప్రారంభమయ్యింది. ఇది 14 నుండి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులందరికీ మాధ్యమిక విద్యను అందించడంతో పాటు విద్యా నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా ముందుకు సాగుతోంది. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్: 2015లో ఇది ప్రారంభమయ్యింది. ఇంటర్నెట్ ద్వారా దేశ పౌరులలో డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ విద్యావిధానం ప్రారంభమయ్యింది. అక్షరాస్యతాభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్లు దేశఅక్షరాస్యతలో లింగ అంతరం కనిపిస్తోంది. ఇది బాలికలు, మహిళలు విద్య, సాధికారతను పొందకుండా అడ్డుపడుతోంది. ఈ అంతరానికి పలు సామాజిక నమ్మకాలు, ఆచారాలు కారణంగా నిలుస్తున్నాయి. అక్షరాస్యతలో ప్రాంతీయ అసమానత.. ఇది వివిధ రాష్ట్రాలు-ప్రాంతాల మధ్య వనరులు, అవకాశాల అసమాన పంపిణీని ప్రతిబింబిస్తుంది. భవిష్యత్‌లో ఈ సవాళ్లు అధిగమించి భారత్ అక్షరాస్యత విషయంలో మరింత ముందుకు సాగుతుందని ఆశిద్దాం! ఇది కూడా చదవండి: గ్రీన్ టపాసులూ హానికరమే? అధ్యయనంలో ఏం తేలింది? -
సిటీ ఓటేస్తదా.. టూరేస్తదా..
అసలే అర్బన్ ఓటర్ల నిరాసక్తత... దానికి తోడు వారాంతపు సెలవులు.. వెరసి అర్బన్ ఓటింగ్ శాతంపై ప్రభావం చూపుతుందా? అనే ఆందోళన రాజకీయ పార్టీల నేతల్లో వ్యక్తమవుతోంది. చాలా నియోజకవర్గాల్లో అర్బన్ ఓటింగ్ బాగా పుంజుకున్న నేపథ్యంలో లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందన్న చర్చ జరుగుతోంది. సాక్షి, హైదరాబాద్: సాధారణంగా కార్పొరేట్ ఐటీ ఉద్యోగులు వారాంతపు సెలవుల్ని రకరకాలుగా ప్లాన్ చేస్తుంటారు. ఏ మాత్రం అవకాశం దొరికినా సొంతూర్లకు , హాలిడే టూర్స్‌కి చెక్కేస్తుంటారు. ఈ నేపధ్యంలో పోలింగ్ తేదీ నవంబరు 30 గురువారం కావడంతో శుక్రవారం ఒక్కరోజు సెలవు పెడితే...4రోజుల పాటు లాంగ్ వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేయవచ్చు కదా అనే ఆలోచన వారిలో వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు ఇదే విషయం రాజకీయ పార్టీల్లో టెన్షన్ పుట్టిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో పట్టణీకరణ జోరు కొనసాగుతోన్న నేపధ్యంలో కొన్ని ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందని ఎన్నికల సంఘం గణాంకాలు తెలియజేస్తున్నాయి. పటాన్ చెరు...ఓటర్ల జోరు... గత 2018తో తాజా 2023 మధ్య చూస్తే.. పటాన్ చెరులో ఓటర్ల సంఖ్యలో అత్యధికంగా 35శాతం వృద్ధి నమోదైంది. అదే సమయంలో ఓటర్ల సంఖ్యాపరంగా చూస్తే అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గంగా శేరిలింగంపల్లి తన స్థానాన్ని నిలుపుకుంది. ఐటీ పరిశ్రమకు చిరునామాకు తోడుగా.. ఇటీవల వేగవంతమైన హౌసింగ్ బూమ్ కారణంగా హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలోని శేరిలింగంపల్లిలో గతంలో 5,75,542 లక్షల మంది ఓటర్లు ఉండగా అది 21.2శాతం పెరిగి 6,98,079 లక్షలకి చేరింది. ఇది రాష్ట్ర వ్యాప్త సగటు అయిన 13.15శాతంపెరుగుదలతో చాలా ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగానూ... పట్టణ ఓటర్ల పెరుగుదల హైదరా బాద్ పశ్చిమ ప్రాంతాలకే పరిమితం కాలేదు. నకిరేకల్ (ఎస్సీ) 28శాతం, ఆసిఫాబాద్ (ఎస్టీ) 20, కామారెడ్డి 19, కరీంనగర్ 19, నిజామాబాద్ (అర్బన్) 18శాతంతో ఓటర్లు భారీగా పెరిగారు. తెలంగాణ లోని పాత పట్టణ కేంద్రాలైన ఖమ్మం 15, వరంగల్ పశి్చమ 15, వరంగల్ తూర్పు 16శాతం ఓటర్ల సంఖ్య పెరిగింది. గ్రేటర్ పరిధిలో స్వల్పమే... ఇందుకు భిన్నంగా హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య స్వల్పంగా మాత్రమే పెరిగింది. నాంపల్లి, మలక్‌పేట్, ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, సనత్‌నగర్‌లో ఓటరు సంఖ్య పెరుగుదల శాతం సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. రిజర్వుడ్ నియోజకవర్గాలుగా ఉన్న అశ్వారావుపేట, భద్రాచలం, వైరా, మధిర, స్టేషన్ ఘనపూర్ కూడా సింగిల్ డిజిట్ వృద్ధిని మాత్రమే నమోదు చేశాయి. ఇక అత్యల్పంగా ఓటర్ల వృద్ధి నమోదైన ప్రాంతం మెదక్‌లోని దుబ్బాక. ఈ నియోజకవర్గంలో కేవలం 2% ఓటర్లు మాత్రమే పెరిగారు. పట్టణ ఓటర్లు ఏం చేస్తారో ఓటింగ్ ఉదాసీనత’కు పేరొందిన పట్టణ ఓటర్ల సంఖ్య పెరగడంతో నేతల్లో ఒకింత ఆందోళన పెరి గింది. శని, ఆదివారాలు సెలవు ఉన్న ప్రైవేట్ కంపెనీల్లోని సిబ్బంది ఓటింగ్ రోజైన గురువారం కూడా కలిపి లాంగ్ వీకెండ్లో భాగం చేసుకుంటే మాత్రం అది కచ్చితంగా ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
అతిపిన్న వయసులోనే రికార్డులు, అవార్డులు
సాక్షి, అనకాపల్లి: అంతర్జాతీయ బాలికల దినోత్సవం రోజున జన్మించిన అనకాపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన లాస్విక ఆర్య అతి పిన్న వయస్సులోనే అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 6 నెలల వయస్సులో ‘వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో, 9 నెలల వయస్సులో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘మెమొరి ఆఫ్ జీకే అవార్డు’ బంగారు పతకం, ప్రశంసాపత్రాలు సాధించి అందరి మన్ననలు పొందుతోంది. జాతిపిత మహాత్మాగాంధీ, స్వాతంత్య్ర సమరయోధులతో పాటు ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, దేశంలో గల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫొటోలను గుర్తిస్తుంది. 1 నుంచి 20 వరకూ స్క్వెర్స్‌ను గుర్తించి ‘ మెమొరీ ఆఫ్ జనరల్ నాలెడ్జ్’ విభాగంలో ‘చాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సంపాదించింది. అక్టోబర్ మొదటి వారంలో ‘లిటిల్ చాంప్–2023’’ ప్రశంసా పత్రాలు, ట్రోఫీ, బ్యాడ్జ్, మెడల్‌ను అందించారు. ఈ ఏడాది జూలైలో ‘ఇండియన్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డు’లో కూడా చిన్నారి స్థానం పొందింది. 9 నెలల వయస్సులో 4 నిమిషాల వ్యవధిలో 24 మానవ శరీర భాగాలు గుర్తించడంతో ‘మాక్సిమమ్ బాడి పార్ట్స్ ఐడెంటిఫైడ్ బై ఏ ఇన్‌ఫ్యాంట్’గా ప్రశంసాపత్రంతో పురస్కారాన్ని పొందింది. గతేడాది అక్టోబర్ 11న జన్మించిన లాస్విక ఆర్య ఏడాది కూడా పూర్తి కాకుండానే సాధిస్తున్న విజయాల పట్ల మంత్రి గుడివాడ అమర్నాథ్ హర్షం తెలిపారు. తాను పుట్టిన ప్రపంచ బాలికల దినోత్సవానికి ఎక్కడా తీసిపోకుండా తాను సాధించిన విజయాలతో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. -
సెలవైనా ఠంఛన్‌గా పింఛన్
సాక్షి, అమరావతి: సెలవు రోజైనా ప్రభుత్వం ఠంఛన్‌గా అవ్వాతాతలకు పింఛన్లు పంపిణీ చేసింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి రాష్ట్రవ్యాప్తంగా 51,37,566 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళ, వివిధ రకాల చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.1,415.64 కోట్ల మొత్తాన్ని అందజేశారు. అక్టోబరు ఒకటో తేదీ నుంచి పంపిణీకిగాను 65,78,854 మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం మొత్తం రూ.1,813.60 కోట్ల విడుదల చేసింది. ఒకటో తేదీ ఆదివారం సెలవు అయినా.. సాయంత్రానికి 78.09 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయినట్టు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. మిగిలిన వారి కోసం ఐదోతేదీ వరకు వలంటీర్ల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. -
5,58,883 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన వచ్చింది. ఒక్క రోజే రికార్డు స్థాయిలో 5,58,883 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో కోర్టులో పెండింగ్ కేసులు 5,45,704 కాగా, ప్రీ లిటిగేషన్ కేసులు 13,179 ఉన్నాయి. మొత్తం రూ.180.10 కోట్ల పరిహారాన్ని అందించినట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.శ్యామ్ కోషి, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ టి.వినోద్ కుమార్ సూచనలతో ఈ కార్యక్రమం విజయవంతమైందని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో జస్టిస్ శ్యామ్ కోషితో చెక్కులను కూడా అందజేసినట్లు తెలిపారు. హైకోర్టులో 404 కేసులు.. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ వినోద్ కుమార్ సూచనలతో నిర్వహించిన లోక్ అదాలత్‌లో హైకోర్టులోని 404 కేసులు పరిష్కారమయ్యాయి. అత్యదికంగా 204 మోటారు వాహనాల కేసులు, 71 కార్మికుల పరిహార వివాదానికి చెందినవి ఉన్నాయి. రూ.15 కోట్ల పరిహారాన్ని ప్రకటించారని, 1,100 మంది లబ్ధి పొందారని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎం.శాంతివర్ధని తెలిపారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జి.వి.సీతాపతి, జస్టిస్ చల్లా కోదండరాం ఈ కేసులను పరిష్కరించారని వెల్లడించారు. -
ఆ రాష్ట్రంలో స్వాతంత్య్ర వేడుకల్లేవ్!
దేశం మొత్తం(ఆ రాష్ట్రం మినహాయించి) అంగరంగ వైభవంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటోంది. కానీ, పరిస్థితులు ఆ రాష్ట్రాన్ని జెండా పండుగకు దూరంగా ఉంచేశాయి. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన ఎర్రకోట ప్రసంగంలోనూ ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపిలేని కుంభవృష్టితో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జాతీయ రహదారులు సైతం మూతపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో వివిధ ప్రమాద ఘటనల్లో 55 మంది మరణించారు. ఈ పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై తన ప్రసంగంలో ఈ అంశాన్ని గుర్తు చేశారు. ఇటీవల దేశంలో విపత్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయని అన్నారు. ఊహించని స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని చెప్పారు. బాధితుల పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విపత్తు నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తాయని అన్నారు. Visual of Pandoh Himachal Pradesh right now pic.twitter.com/KQ2Tn9sz9B — Go Himachal (@GoHimachal_) August 14, 2023 రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో ప్రమాద ఘటనలు జరిగాయని సీఎం సుఖ్విందర్ సింగ్ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోలాన్, సిమ్లా, మండి, హమిర్పూర్ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన విపత్తు నిర్వహణ పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. చంఢీగర్-సిమ్లా జాతీయ రహదారితో సహా ప్రధాన రహదారులు మూతపడ్డాయని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో విపత్తులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా స్పందించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించామని చెప్పారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మొదట ఏడుగురు మరణించారు. శివమందిర్ కూలిపోయిన ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోచోట కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో 17 మంది కాపాడామని సిమ్లా ఎస్పీ సంజీవ్ కుమార్ తెలిపారు. That has happened in #Himachal to build a 4 Lane road the Govt. Bulldoze houses, shops, bussiness establishment in the name of development but In this Himalayan Ranges. But now Nature is taking revenge. The Roads are crumbling down. Location NH 5 , Solan India pic.twitter.com/hQii08aoTl — Ravi Rana (@RaviRRana) August 11, 2023 కాగా.. మరో రెండు రోజులు హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఇదీ చదవండి: వీడియో: జెండా ఎగరేసి సొమ్మసిల్లిపడిపోయిన ఆరోగ్యశాఖ మంత్రి -
చనిపోయినా బతికుందాం!
మట్టిలో కలిసిపోయే గుండె ఇంకో మనిషిని బతికించగలదు. మంటల్లో కాలిపోయే కళ్లు మరో బతుకులో వెలుగు నింపగలవు. ఆయువు తీరిన దేహం మరొకరి ఆయుష్షు రేఖను పెంచగలదు. ఇందుకు ఒకటే దారి.. అదే అవయవదానం. అంపశయ్యపై ఉన్న వారి తలరాత మార్చాలన్నా.. చావు అంచుల్లో నించున్న వారిని తిరిగి బతుకు దారిలోకి తీసుకురావాలన్నా ఇదొక్కటే మార్గం. నేడు అవయవదాన దినోత్సవం. చనిపోయాక శరీర భాగాలను వృధా చేయడం కంటే మరో మనిషి కోసం వినియోగించడం మాధవ సేవ అని చెప్పే రోజు. అపోహలు వీడి ఓ చైతన్య కాగడాను ఊరూరా వెలిగించాల్సిన తేదీ. ఇచ్ఛాపురం రూరల్: మనిషి చనిపోయాక దేహంతో పాటే అవయవాలన్నీ మట్టిలో కలిసిపోతాయి. లేదా చితిలో కాలి బూడిదవుతాయి. అవే అవయవాలను దానం చేస్తే ఎన్నో కుటుంబాల్లో చిరునవ్వులు నింపవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారణ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. బ్రెయిన్ డెడ్ కేసు అంటే మనిషి పూర్తిగా చనిపోయినట్లే లెక్క. సాధారణ మరణాల్లో నేత్రాలను తీసుకుంటారు. నమోదు ఇలా అవయవ దానం చేయాలనుకునే వారు ముందుగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తమకు తెలిసినవారందరికీ సమాచారం అందివ్వాలి. దీని వల్ల అతను చనిపోయాక అవయవ దానం చేసేందుకు వీలు కలుగుతుంది. జీవన్‌దాన్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టగా, రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ కేంద్రంగా 2015 నుంచి తమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా బ్రెయిన్‌డెడ్ కేసుల నుంచి అవయవాలు సేకరిస్తారు. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జీవన్‌దాన్ డాట్ జీవోవి డాట్ ఇన్’ వెబ్ సైట్లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్నవారికి ప్రభుత్వం ఆర్గాన్ డోనార్ కార్డును అందజేస్తుంది. సజీవమూర్తి కిరణ్‌చంద్ సోంపేట పట్టణం గీతా మందిరం కాలనీకి చెందిన మల్లారెడ్డి మోహన్, గిరిజా కల్యా ణిల ఒక్కగానొక్క కుమారుడు కిరణ్‌చంద్(16) జిల్లా వాసుల్లో నింపిన స్ఫూర్తి అనన్యసామాన్యం. 2023 ఏప్రిల్ 15న పదో తరగతి ఆఖరి పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న కిరణ్‌చంద్ అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్రమైన తలనొప్పి, జ్వరంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అయితే మెదడులో సమస్య వచ్చిందని, వెంటనే విశాఖపట్నం వెళ్లాలని వైద్యులు సూచించడంతో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి రాగోలు జెమ్స్ ఆస్పత్రికి మార్చారు. వారం రోజుల అనంతరం పరిస్థితి విషమించడంతో వైద్యులు, ఆర్గాన్ డొనేషన్ సమన్వయకర్తలు తల్లిదండ్రులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. గుండె, కిడ్నీలు, లివర్, కళ్లను దానం చేసి మరికొందరి బతుకుల్లో వెలుగులు నింపారు. 8 మంది జీవితాల్లో ‘చంద్ర’కాంతులు జి.సిగడాం మండలం మధుపాం గ్రామానికి చెందిన పట్నాన చంద్రకళ(32) సీఎఫ్‌గా పనిచేసేవారు. ఈ ఏడాది మే 30న తలనొప్పితో బాధపడుతూ శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను విశాఖ విమ్స్ ఆస్పత్రికి తరలించారు. చంద్రకళ తలలో నరాలు చిట్లిపోయి రక్తస్రావం అయినట్లు గుర్తించారు. దీంతో బ్రెయిన్‌డెడ్ అయిందని, ఈమె అవయవాలను ఇతరులకు దానం చేసి వారి జీవితాలకు నూతన వెలుగులు ప్రసాదించాలని వైద్యులు కుటుంబ సభ్యులకు సూచించారు. భర్త శివను, ఇద్దరు కుమార్తెలను ఒప్పించడంతో జూన్ 1న అవయవదానం చేసి ఎనిమిది మంది జీవితాల్లో వెలుగులు నింపారు. -
గణనీయంగా పెరిగిన పులుల సంఖ్య
తిరుపతి మంగళం/ మార్కాపురం: ఏపీలో పెద్దపులుల సంరక్షణ, సంఖ్య పెరగడంలో అటవీశాఖ గణనీయమైన వృద్ధి సాధిస్తోందని రాష్ట్ర అటవీ, విద్యుత్తు, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో గ్లోబల్ టైగర్స్ డే శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఏపీలోని నల్లమల అడవుల్లో గత సంవత్సరం జరిగిన గణనలో 74 పెద్దపులులు ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. ఈ సంవత్సరం వాటి సంఖ్య 80కి చేరినట్టు తేలిందన్నారు.నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాజెక్టు కింద పులుల సంరక్షణ పనులను అటవీశాఖ సమర్థంగా నిర్వహిస్తోందని అభినందించారు. పులుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోందని, అంతరించిపోతున్నాయన్నది ద్రుష్పచారమేనని చెప్పారు. రాబోయే రోజుల్లో నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకు ప్రత్యేకంగా కారిడార్ అభివృద్ధి చేసి, టైగర్ రిజర్వు పరిధిని విస్తరించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. తద్వారా అటవీ రక్షణ, పులుల సంరక్షణ సులభతరం అవుతుందన్నారు. అనంతరం పులుల సంరక్షణపై నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జూ ప్రవేశంలో ప్రత్యేకంగా వన్యప్రాణుల సంరక్షణపై స్టాళ్లను ఏర్పాటు చేశారు. పులుల సంరక్షణపై ఫొటో గ్యాలరీ నిర్వహించారు. కార్యక్రమంలో తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, ఏపీ పీసీసీఎఫ్ మధుసూదన్ రెడ్డి, అడిషనల్ పీసీసీఎఫ్ శాంతిప్రియపాండే, సీసీఎఫ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. నల్లమలలో 80 పెద్ద పులులు నల్లమల అటవీ ప్రాంతంలో మొత్తం 80 పెద్ద పులులు ఉన్నట్లు ప్రకాశం జిల్లా మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ తెలిపారు. శనివారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అధికారికంగా పులుల సంఖ్యను విడుదల చేశారు. ఎన్ఎస్టీఆర్– తిరుపతి కారిడార్ (నాగార్జున సాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం) వరకూ ఇవి ఉన్నట్లు తెలిపారు. -
జస్ట్ పోజింగ్...ఆనంద్ మహీంద్రా హనీమూన్ పిక్ వైరల్
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో యాక్టివ్ ప్రెజెన్స్‌కు పేరుగాంచిన పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి ఒక ఆసక్తికరమైన ఫోటో షేర్ చేశారు. ఇంటర్నేషనల్ చెస్ డేని గుర్తు చేసుకుంటూ శుక్రవారం ఒక త్రోబాక్ ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. తాను చదరంగంతో పోజులిచ్చిన సమయాన్ని గుర్తు చేసుకున్న మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఈ రోజుల్లో, ఆన్లైన్ ద్వారా తన చెస్ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నట్లు వెల్లడించారు. (నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు) ఈ సందర్బంగా టెక్‌మహీంద్రా గ్లోబల్ చెస్ లీగ్-2023 గురించి ప్రస్తావించారు,ప్రపంచంలోనే తొలి, అతిపెద్ద అధికారిక ఫ్రాంచైజ్ చెస్ లీగ్. వాస్తవానికి ఇంటర్నేషనల్ చెస్ డే నాడు దీన్ని పోస్ట్ చేసి ఉండాల్సింది. ఈ కార్యక్రమం లైవ్‌లో చదరంగం ఆడతారా అని చాలా తరచుగా అడిగారు.. అందుకే నా జ్ఞాపకాల ఆల్బమ్‌ని పరిశీలిస్తుండగా, ఆగ్రాలో ఉన్నప్పటి ఈ ఫోటో దొరికింది అంటూ పేర్కొన్నారు. (Suchita Oswal Jain: 22ఏళ్లకే కంపెనీ పగ్గాలు, వేల కోట్ల సామ్రాజ్యం, 30వేలమందికి ఉపాధి) అన్నట్టు అది రోబోటిక్ బోర్డ్ కాదు, తన భార్య కెమెరా కోసం ఇచ్చిన పోజు! అని సరదాగా పేర్కొన్నారు. అలాగే ఇప్పుడు ఆన్లైన్లో నైపుణ్యాలను పెంచు కోవడానికి ప్రయత్నిస్తున్నా. అప్పట్లో తన ఒపెనింగ్ డీ4తో ఉండేదని ఇపుడు దానికి బదులుగా ఇపుడు స్టాండర్ట్ స్టెప్ e4తో గేమ్ స్టార్ట్ చేశానంటూ రాసుకొచ్చారు మహీంద్రా. ఈ ఫోటో ఎప్పటిలాగనే వేలకొద్దీ లైక్‌లు, కామెంట్లను సొంత చేసుకుంది. అలాగే "బెటర్ లేట్ నేనెవర్! హ్యాపీ లేటెడ్ #ఇంటర్నేషనల్ చెస్ డే! మీ హనీమూన్ చదరంగం ఫోజు, అద్భుతంగా ఉంది. మీ ప్రతి కదలిక మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుంది!" ఒక అభిమాని వ్యాఖ్యానించారు. "ఇది అద్భుతంగా ఉంది! వావ్.. స్ఫూర్తిదాయకం," అని మరొకరు రాశారు. -
ఫంక్షన్ ఏదైనా అటెన్షన్ బిర్యానీదే
● ● జిల్లాలో 20 రకాలకుపైగా బిర్యానీలు లభ్యం ● నిమిషానికి పది బిర్యానీలు ఆర్డర్ పెట్టి తింటున్న వైనం ● శ్రీకాకుళం: బారసాల నుంచి దశ ది న కర్మల వరకు, పుట్టిన రోజు నుంచి పెళ్లిళ్ల వరకు ఫంక్షన్ ఏదైనా అటెన్షన్ అంతా బిర్యానీలదే. ఈ వంటకం ఎంతబాగా కుదిరితే కార్యం అంత చక్కగా జరిగినట్టు. అందులోనూ హైదరాబాదీ బిర్యానీ అంటే సిక్కోలు వాసులు లొట్టలేసుకుని తింటున్నారు. ఒకప్పుడంటే ఈ బిర్యానీ దొరకడం కష్టంగా ఉండేది గానీ.. ఇప్పుడు దాదాపు అన్ని ఊళ్లలోనూ బిర్యానీ సెంటర్లు కనిపిస్తున్నాయి. జిల్లాలో దాదాపు 20 రకాల బిర్యానీలు దొరుకుతున్నాయి. నేడు ప్రపంచ బిర్యానీ దినోత్సవం. వెజ్ అయినా.. నాన్‌వెజ్ అయినా.. ఎర్రటి మాంసం ముక్కలు కనిపిస్తే నే బిర్యానీ మజా ఇస్తుందనుకుంటే పొరపాటే.. పుట్టగొడుగుల నుంచి పన్నీరు వరకు, ఆవకాయ నుంచి గోంగూర వరకు పలు రకాల బిర్యానీలు చికెను, మటను బిర్యానీలకు గట్టి పోటీ ఇస్తున్నా యి. ఇటీవలే ప్లాంట్‌బేస్డ్ చికెన్, మటన్ పేరిట బిర్యానీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి శాకాహారమే. మాంసాహార విషయానికి వస్తే హైదరాబాదీ దమ్బిర్యానీతో పాటు పొట్లం బిర్యానీ, మటన్, ప్రాన్ బిర్యానీలంటూ రకరకాలు నోరూరిస్తున్నాయి. రూ.100 నుంచి రూ.700లకు పైబడి బిర్యానీ ధర ఉంది. జిల్లాలో నిమిషానికి 10 బిర్యానీలు ఆన్లైన్ ఆర్డర్లు వస్తున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. హైదరాబాద్ బిర్యానీకే ఆదరణ ఎన్నో రకాలు బిర్యానీలు ఉన్నా హైదరాబాద్ దమ్ బిర్యానీకి ఉన్న ఆదరణ ప్రత్యేకం. అన్ని బిర్యానీల్లో యాభై శాతం ఇవే వెళ్తాయి. వెజ్, నాన్ వెజ్ల బిర్యానీలలో దమ్కే ప్రథమస్థానం. – తపన్‌కుమార్, బాబూరావు,చెఫ్‌లు బిర్యానీ అంటే ఎంతో ఇష్టం ప్రతి వారం చివర్లో బిర్యానీ తప్పక తింటాను. బిర్యానీ అంటే అంత ఇష్టం. ఆహార ప్రియు ల అభిరుచి మేరకు తయారీ దారులు కూడా రకరకాల రుచులను అందుబాటులోకి తెస్తున్నారు. ఇది మావంటి వారికి సంతోషం. – ఇప్పిలి సురేష్, శ్రీకాకుళం -
యోగానంద నుంచి అయ్యంగార్ వరకూ.. యోగాకు గుర్తింపునిచ్చిన గురువులు వీరే..
ఈ రోజు ప్రపంచ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. యోగా చేయడం వలన కలిగే లాభాల గురించి తెలియజేయడమే యోగా దినోత్సవం ఉద్దేశం. యోగ విధానాలను మనదేశానికి చెందిన రుషులు, మునులు రూపొందించారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా సూత్రాలను అనుసరించడం ఎంతో అవసరమని వారు తెలియజేశారు. యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిన ప్రముఖ గురువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పరమహంస యోగానంద పరమహంస యోగానంద తన పుస్తకం ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి’ కారణంగా సుపరిచితులయ్యారు. మెడిటేషన్, యోగా విధానాలను ఆయన ప్రపంచవ్యాప్తం చేశారు. ఇంతేకాదు పరమహంస యోగానంద యోగాకు సంబంధించిన తొలి గురువులలో ప్రముఖునిగా పేరొందారు. ఆయన తన జీవితంలోని అధిక భాగాన్ని అమెరికాలోనే గడిపారు. తిరుమలాయ్ కృష్ణమాచార్య ఈయన ‘ఆధునిక యోగ పితాచార్యులు’గా గుర్తింపు పొందారు. హఠయోగను మరింత విస్తృతంగా ప్రచారం చేశారు. ఈయన అనేక ఆయుర్వేద విషయాలను కూడా ప్రపంచానికి తెలియజెప్పారు. ధీరేంద్ర బ్రహ్మచారి ధీరేంద్ర బ్రహ్మచారి దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి యోగా గురువుగా పేరొందారు. ఈయన దూరదర్శన్ ద్వారా యోగాకు ప్రాచుర్యం కల్పించేందుకు ప్రయత్నించారు. దీనికితోడు ధీరేంద్ర బ్రహ్మచారి ఢిల్లీలోని స్కూళ్లు, కాలేజీలలో యోగా క్లాసులు నిర్వహించేందుకు నడుంబిగించారు. ఈయన యోగాకు సంబంధించి హిందీ, ఆంగ్లభాషల్లో అనేక గ్రంథాలు రాశారు. జమ్ములో ధీరేంద్ర బ్రహ్మచారి ఆశ్రమం ఉంది. కృష్ణ పట్టాభి జోయిస్ ఈయన కూడా ప్రముఖ యోగా గురువుగా పేరొందారు. 1915 జూలై 26న జన్మించిన ఆయన 2009లో కన్నుమూశారు. ఈయన అష్టాంగ యోగ సాధనకు అమితమైన ప్రాచుర్యాన్ని కల్పించారు. ఇతని వద్ద శిష్యరికం చేసిన పలువురు ప్రస్తుతం పలు ప్రాంతాల్లో యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. బీకేఎస్ అయ్యంగార్ బీకేఎస్ అయ్యింగార్ యోగా ప్రపంచంలో ఎంతో పేరు పొందారు. ‘అయ్యంగార్ యోగా’ పేరుతో ఒక స్కూలును నెలకొల్పారు. ఈ స్కూలు ద్వారా ఆయన లెక్కలేనంతమందికి యోగా శిక్షణ అందించారు. 2004లో టైమ్స్ మ్యాగజైన్ బీకేఎస్ అయ్యంగార్ పేరును ప్రపంచంలోని 100 మంది ప్రతిభావంతుల జాబితాలో చేర్చింది. మహర్షి మహేష్ యోగి మహర్షి మహేష్ యోగి బోధించే ‘ట్రాన్స్‌డెంటల్ మెడిటేషన్’ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపుపొందింది. పలువురు సెలబ్రిటీలు ఈయన బోధించిన యోగ విధానాలను అనుసరిస్తుంటారు. ఇది కూడా చదవండి: అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త..హోటళ్లు ఆడ్వాన్ బుకింగ్ చేస్తే.. -
రక్త సారథులు.. ప్రాణ వారధులు
మదనపల్లె సిటీ : రక్తం ఎంత విలువైందో అందరికీ తెలిసిందే. ఒక యూనిట్ రక్తంతో ఒకరి ప్రాణాలే కాపాడొచ్చు. అత్యవసర సమయంలోనే కాదు... పలువురు వ్యాధిగ్రస్తులకు పక్షం రోజులకోసారి రక్తం ఎక్కించాల్సిందే. లేకపోతే వారి ప్రాణాలకే ప్రమాదం. కరోనా సమయంలో తలసేమియా, సికల్‌సెల్ వ్యాధిగ్రస్తులు, గర్భిణులకు ఒక యూనిట్ దొరకడం ఎంత కష్టంగా మారిందో చూశాం. ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతి మూడు, ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చుని వైద్యనిపుణులు చెబుతూనే ఉన్నారు. అయినా చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. రక్తమిస్తే అనారోగ్యం పాలవుతామని అపోహ పడుతున్నారు. దీంతో రక్తనిల్వల కొరత ఎప్పుడూ ఏర్పడుతూనే ఉంది. బ్లడ్‌బ్యాంకు నిర్వాహకులు శిబిరాల నిర్వహణ, దాతల కోసం తరచూ పలు సంస్థలను కోరుతూనే ఉన్నారు. అయినా స్పందన అంతంత మాత్రమే లభిస్తోంది. కొంత మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి వారు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. బుధవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఇవ్వడమే కాదు.. ఇప్పిస్తారు రక్తం ఇవ్వడమే కాదు. అవగాహన కల్పించి ఇతరులతో ఇప్పించడం కూడా గొప్ప విషయమే. ఈ విషయంలో రెండో కోవకు చెందుతారు అబూబకర్‌సిద్దిక్. మదనపల్లె పట్టణంలో హెల్పింగ్‌మైండ్స్ సంస్థను ఏర్పాటు చేశారు. తరచూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారు. అంతే కాకుండా అత్యవసర సమయంలో ఎవరైనా ఫోన్ చేస్తే వారికి రక్తం ఇస్తారు. ఇప్పటి రకు 38 సార్లు రక్తదానం చేశారు. సంస్థ తరఫున పదేళ్లలో సుమారు 18 వేల మందితో రక్తదానం చేయించారు. చిరు వ్యాపారి.. రక్తదానంలో మేటి మదనపల్లె పట్టణానికి చెందిన హర్షద్‌అలీ చిరు వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. స్నేహితుడు అనారోగ్యం పాలవడంతో ఓ గ్రూపు రక్తం అవసరం కావడంతో దొరకపోవడం వల్ల ఇబ్బందులు పడ్డాడు. అప్పటి నుంచి రక్తంతో ఎవరూ ఇబ్బందులు పడకూడదని రక్తదానం చేస్తున్నారు. ఇప్పటి వరకు 44 సార్లు రక్తదానం చేశారు. ఆపద వస్తే .. వాలిపోతాడు స్వర్ణకారుడిగా పని చేస్తూ స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నాడు మదనపల్లె పట్టణానికి చెందిన ఢంకనాచారి. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసే తృప్తిలో ఎక్కడా ఉండదని నమ్మిన యువకుడు. బ్లడ్ బ్యాంకులో తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. అత్యవసరమైతే ఫోన్ చేస్తే చాలు రక్తదానం చేస్తున్నాడు. ఇప్పటి వరకు 45 సార్లు రక్తదానం చేసి అందరి మన్ననలు పొందాడు. చదువుకుంటూ.. రక్తదాతగా మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన పుష్ప తిరుపతిలో ఫుడ్ టెక్నాలజీ కోర్సు చదువుతోంది. రక్తదానం చేయడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చునని తెలుసుకుంది. ఎవరికికై నా ఆపద వస్తే చాలు రక్తదానం చేస్తుంది. ఇప్పటి వరకు ఆరు సార్లు రక్తదానం చేసింది. రక్తదానం చేయడమే కాకుండా సహ విద్యార్థినులకు రక్తదానం గురించి అవగాహన కల్పిస్తుంది. స్ఫూర్తి ప్రదాత శివాజీ డిగ్రీ చదువుతూ రక్తదానం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన శివాజి. వివేకా ఆశయ ఫౌండేషన్ తరచూ నిర్వహించే రక్తదాన శిబిరాలు ఏర్పాటులో సహాయ, సహకారాలు అందిస్తున్నాడు. ఇప్పటి వరకు 11 సార్లు రక్తదానం చేశారు. రక్తదానం గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చూస్తూ.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన శివ. ఉద్యోగం చేస్తూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తే స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు సార్లు రక్తదానం చేశారు. -
మహిళల ఘన విజయం: విత్తనం పరిరక్షణకు‘చిరు’యత్నం
‘ఇంటర్నేషనల్ సీడ్ డే’... ఇలాంటి ఓ రోజు ఉందా! ఉంది... అయితే ప్రచారమే పెద్దగా ఉండదు. ఇది గ్లామర్ మార్కెట్ వస్తువు కాకపోవడమే కారణం. ఈ రోజును రైతు మహిళలు నిర్వహించారు. ‘చిరు’సాగు చేసి కళ్లాల్లో రాశులు పోసిన చేతులవి. విత్తనాన్ని కాపాడాలనే ముందుచూపున్న చేతలవి. రాగి ముద్ద స్టార్ హోటల్ మెనూలో కనిపిస్తోంది. స్మార్ట్‌గా ఆర్డర్ చేస్తే అందమైన ప్యాక్‌తో ఇంటిముందు వాలుతోంది. అలాగే సజ్జ ఇడ్లీ, ఊదల దోసె, కొర్రల కర్డ్ మీల్, జొన్న రొట్టె, మిల్లెట్ చపాతీ, మిల్లెట్ పొంగలి... ఇలా బ్రేక్ ఫాస్ట్ సెంటర్లు కొత్త రూపుదిద్దుకున్నాయి. ఎక్కడో మారుమూల గ్రామాల్లో నీటి వసతి లేని నేలను నమ్ముకుని బతికే వాళ్ల ఆకలి తీర్చిన చిరుధాన్యాలు ఇప్పుడు బెంజ్‌కారులో బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్లే సంపన్నుల టేబుల్ మీదకు చేరాయి. ఒకప్పుడు చిన్న చూపుకు గురైన చిరుధాన్యాలు నేడు సిరిధాన్యాలుగా మన దైనందిన జీవితంలో ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. వీటి వెనుక నిరుపేద మహిళల శ్రమ ఉంది. పాతికేళ్లుగా ఈ నిరుపేద మహిళలు చిరుధాన్యాలతోనే జీవించారు, చిరుధాన్యాల పరిరక్షణ కోసమే జీవించారు. సేంద్రియ సేద్యంతో చిరుధాన్యాల జీవాన్ని నిలిపారు. అంతర్జాతీయ విత్తన దినోత్సవం (ఏప్రిల్ 26) సందర్భంగా బుధవారం వీరంతా మెదక్ జిల్లా, జహీరాబాద్ మండలం, పస్తాపూర్‌లో తమ దగ్గరున్న పంటల విత్తనాలను సగర్వంగా ప్రదర్శించారు. హైబ్రీడ్ వంగడాల మాయలో పడకుండా మన విత్తనాలను మనం కాపాడుకోవాలని ఒట్టు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ బోర్డు సభ్యులు రుక్మిణీరావు సాక్షితో పంచుకున్న వివరాలివి. ఈ నేల... ఈ విత్తనం... మన సొంతం ‘‘చిరుధాన్యాల పట్ల అవగాహన కోసం ఈ ఏడాదిని ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్’ నిర్వహించుకుంటున్నాం. ఈ ఏడాది సీడ్ డే రోజున మేము చిరుధాన్యాల విత్తనాల పరిరక్షణ, ప్రదర్శన నిర్వహించాం. పస్తాపూర్ కేంద్రంగా జరిగిన ఈ కార్యక్రమంలో 26 పరిసర గ్రామాల నుంచి వందకు పైగా మహిళలు వారు పండించి, పరిరక్షించిన విత్తనాలను తీసుకువచ్చారు. చిరుధాన్యాలతోపాటు పప్పుధాన్యాలు, నూనె గింజల విత్తనాలు మొత్తం యాభైకి పైగా పంటల విత్తనాలకు ఈ ప్రదర్శన వేదికైంది. ఇవన్నీ సేంద్రియ సేద్యంలో పండించినవే. ఆహారం –ఆకలి! ఆహారం మన ఆకలి తీర్చాలి, దేహానికి శక్తినివ్వాలి. ‘వరి అన్నం తిని పొలానికి వెళ్తే పని మొదలు పెట్టిన గంట సేపటికే మళ్లీ ఆకలవుతుంది. రొట్టె తిని వెళ్తే ఎక్కువ సేపు పని చేసుకోగలుగుతున్నాం. అందుకే మేము కొర్రలు, జొన్నలు తింటున్నాం’ అని ఈ మహిళలు చెప్పిన మాటలను తోసిపుచ్చలేదు సైంటిస్టులు. వారి అనుభవం నుంచి పరిశోధన మొదలు పెట్టారు. అందుకే మిల్లెట్స్‌లో దాగి ఉన్న శక్తిని ప్రపంచ వేదికల మీద ప్రదర్శించగలిగారు. అలాగే ఈ మహిళలు విదేశాల్లో రైతు సదస్సులకు హాజరై తమ అనుభవాలను వారితో పంచుకున్నారు. భూగోళం ఎదుర్కొంటున్న మరో విపత్తు క్లైమేట్ చేంజ్. ఈ పంటలైతే వాతావరణ ఒడిదొడుకులను ఎదుర్కుని పంటనిస్తాయి. పదిహేను రోజులు నీరు అందకపోయినప్పటికీ జీవాన్ని నిలుపుకుని ఉంటాయి. చిరుధాన్యాలకు గాను మన ముందున్న బాధ్యత ఈ విత్తనాలను కాపాడుకోవడం. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి మీద హక్కులను కార్పొరేట్ సంస్థలు తన్నుకుపోకుండా చూసుకోవాలి. అవసరమైతే ఉద్యమించాలి. ఇదే మనం డీడీఎస్ స్థాపకులు మిల్లెట్ మ్యాన్ పీవీ సతీశ్‌గారికి ఇచ్చే నివాళి’’ అన్నారు రుక్మిణీరావు. చిరుధాన్యాలను పండించడంలో ముందడుగు వేసేశాం. ఇక మన ముందున్న బాధ్యత ఈ విత్తనాలను కాపాడుకోవడం. ఈ విత్తనాల మీద పూర్తి హక్కులు ఈ పేద రైతు మహిళలవే. – రుక్మిణీరావు, బోర్డు సభ్యులు, దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ – వాకా మంజులారెడ్డి -
ఈ రోజు మీ నీడ మిమ్మల్ని వదిలి వెళ్లిపోతుంది.. నేడు 'జీరో షాడో డే'
సూర్యుడు ఒక నిర్దిష్ట బిందువుకి చేరుకున్నప్పుడూ నీడలు అదృశ్యమవుతాయి. ఈ అరుదైన ఘటన సంవత్సరానికి ఒకసారి కనువిందు జరుగుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో రెండు సార్లు సంభవిస్తుంది. సరిగ్గా సూర్యుడు భూమధ్య రేఖ పైన ఉన్నప్పుడూ సూర్యకిరణాలు భూమి ఉపరితలంపై లంబంగా పడతాయి. దీంతో పగటిపూట కొద్దిసేపు నీడలు కనిపించవు. దీన్ని ప్రపంచంలోని కొన్ని ఉష్ణమండల ప్రాంతాల్లో గమనించవచ్చు. ఈ మేరకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మంగళవారం కోరమంగళ క్యాంపస్‌లో ఈ అరుదైన దృగ్విషయానికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సరిగ్గా మధ్యాహ్నం 12.17 గంటలకు సూరుడు నడినెత్తిపై ఉండగా ఇది జరగుతుందని, లంబంగా పడే కిరణాలు ఎటువంటి నీడను ఉత్పత్తి చేయవని బెంగళూరు అమెచ్యూర్ ఖగోళ శాస్త్రవేత్తల సంఘం ట్వీట్లో తెలిపింది. జీరో షాడో అనేది.. భూమి అక్ష సంబంధ వంపు ఫలితంగా ఇలాంటి అరుదైన ఘటన సంభవిస్తుందని స్పష్టం చేసింది. సూర్యుని స్థానం ఏడాది పోడవునా మారుతుందని. సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడూ అక్ష సంబంధం మారినప్పుడల్లా.. సూర్యని స్థానం మారి వేరు వేరు నీడలు ఏర్పడతాయని పేర్కొంది. అందువల్లే ఏడాది పొడవున వేర్వేరు నీడలు ఏర్పడతాయని తెలిపింది. సూర్యకిరణాలు వసంత రుతువు నుంచి శరదృతువు మధ్య సమయంలో భూమధ్యరేఖ వెంబడి 90 డిగ్రీల కోణంలో సూర్యకిరణాలు భూమిని తాకుతాయని ఫలితంగా నీడలు ఉండవని వివరించింది బెంగళూరు ఆస్ట్రోఫిజిక్స్ ఇన్స్టిట్యూట్. ఈ జీరో డేకి గుర్తుగా ఆస్టోఫిజిక్స్ ఇన్స్టిట్యూట్ మంగళవారం కోర మంగళ క్యాంపస్‌లో ఈ ఖగోళ అద్భుతాన్నిప్రజలు తెలియజేసేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. (చదవండి: ఓ తల్లి కిరాత చర్య..ప్రెగ్నెంట్ అని తెలియక పసికందుని..) -
రోజుకు 24 గంటలు కదా! కానీ, అప్పట్లో 19 గంటలే! ఆసక్తికర అధ్యయనం
ఎంతకూ రోజు గడవడం లేదని ఎప్పుడైనా అనిపించిందా? ఒంటరిగా ఉన్నప్పుడో.. చేసేందుకు పనేమీ లేకపోయినప్పుడో... 24 గంటలు గడిచేదెప్పుడబ్బా అని ఒక్కసారైనా అనిపించి ఉంటుంది! మరి రోజులో కేవలం 19 గంటలే ఉంటే? అదెలా అంటారా? అయితే కచ్చితంగా ఇది చదవాల్సిందే... భూమ్మీద రోజు నిడివి ఎన్నడూ స్థిరంగా లేదట. కోటానుకోట్ల ఏళ్ల కింద ఇప్పటి కంటే కనీసం ఆరు గంటలు తక్కువగా ఉండేదట! అంటే అప్పట్లో భూ భ్రమణానికి, అంటే తన చుట్టు తాను ఒకసారి తిరిగేందుకు 19 గంటలు మాత్రమే పట్టేదని చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనపూర్వకంగా చెబుతున్నారు. మరిప్పుడు రోజుకు 24 గంటలు ఎందుకైనట్టు? భూమి నిర్మాణం గురించి కొంచెం తెలుసుకుంటే దీనికి సమాధానమూ తెలుస్తుంది. భూమి ఉల్లిపాయ మాదిరిగా పొరలుగా ఉంటుందని, ఈ పొరల సంఖ్య నాలుగని చిన్నప్పుడే చదువుకున్నాం. మనముండేది క్రస్ట్ అని పిలిచే పై పొరలో. దీనికింద మాంటెల్, ఔటర్ కోర్, చివరగా భూమి మధ్య భాగంలో ఇన్నర్ కోర్ ఉంటాయి. ఇన్నర్ కోర్ సుమారు 1,220 కిలోమీటర్ల పొడవుంటుంది. ఇది దాదాపుగా ఘనస్థితిలో ఉన్న ఇనుప ముద్ద. ఇది తిరిగే వేగం, పద్ధతుల్లో వచ్చే తేడాలను బట్టి రోజు తాలూకు నిడివిలోనూ హెచ్చుతగ్గులు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్నర్ కోర్‌పైన ద్రవ స్థితిలో ఉండే ఔటర్ కోర్ ఉంటుంది. ఇది సృష్టించే అయస్కాంత క్షేత్రాన్ని బట్టి ఇన్నర్ కోర్ వేగం, దిశ ఆధారపడి ఉంటాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే కోట్ల ఏళ్లుగా ఇన్నర్ కోర్ దిశ, వేగం తగ్గుతూ వస్తున్నాయి. దీని ప్రభావం వల్ల రోజు నిడివీ పెరుగుతూ వస్తోంది. ఆ లెక్కన 140 కోట్ల ఏళ్ల క్రితం భూ భ్రమణానికి 19 గంటలే పట్టేదని అంచనా. అధ్యయనం చేసిందిలా... భూమి లోపలి పొరలన్నీ వేటికవే వేర్వేరు దిశ, వేగాల్లో తిరుగుతూంటాయి. కొన్ని కదలికలు అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరిస్తే ఇంకొన్ని పొరల గురుత్వాకర్షణ శక్తి ఆ క్షేత్ర ప్రభావాన్ని తగ్గిస్తూంటుంది. కచ్చితంగా ఎలా జరుగుతుందో తెలుసుకోవడం కష్టం కాబట్టి శాస్త్రవేత్తలు పరోక్ష పద్ధతుల ద్వారా భూమి లోపలి పొరల్లో ఏం జరుగుతోందో పరిశీలిస్తూంటారు. భూకంప తరంగాలు అన్ని పొరల ద్వారా ప్రయాణించగలవు. పొర మారినప్పుడల్లా వాటి వేగంలో మార్పులు వస్తూంటాయి. వాటి ఆధారంగానే ఆ ప్రాంతంలో ఏ రకమైన ఖనిజాలున్నాయి, ఉష్ణోగ్రత, సాంద్రత ఎంత వంటి వివరాలు తెలుస్తూంటాయి. అలాగే భూమి ఇన్నర్ కోర్ వేగం, దిశల్లో వచ్చిన మార్పులు కూడా! పెకింగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు కొన్ని వేల భూకంపాల వివరాలను సేకరించి పరిశీలించారు. 1960ల నుంచి ఇప్పటిదాకా భూమి ఇన్నర్ కోర్‌ను దాటుకుంటూ వెళ్లిన భూకంప తరంగాల తీరును విశ్లేషించినప్పుడు ఆసక్తికరమైన అంశం బయటపడింది. 2009కి ముందు ఈ తరంగాలు ఇన్నర్ కోర్ గుండా వెళ్లేందుకు పట్టిన సమయంతో పాటు ఆ తరంగాల రూపురేఖల్లోనూ గణనీయమైన మార్పులొచ్చాయి. ఇక 2009లో భూకంప తరంగాల ప్రభావం ఇన్నర్ కోర్‌పై దాదాపు లేకుండా పోయింది. అంటే 2009లో ఇన్నర్ కోర్ కూడా భూమితో సమాన వేగంతో తిరుగుతున్నట్లు అంచనా కట్టారు. 2009 తర్వాత భూమి కంటే తక్కువ వేగంతో తిరుగుతున్నట్టు భూకంపాల తరంగాల పరిశీలనలో వెల్లడైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ 70 ఏళ్లకోసారి రివర్స్ ఈ అధ్యయనం ప్రకారం ఇన్నర్ కోర్ తిరిగే దిశ 70 ఏళ్లకోసారి మారుతూంటుంది. అలా చివరిసారి 1970 ప్రాంతంలో మారిందట. రోజు నిడివి, భూ అయస్కాంత క్షేత్రాల ద్వారా ఇది నిర్ధారౖణెంది కూడా. ఇలా ఇన్నర్ కోర్ తిరిగే దిశ, వేగంలో మార్పుల వల్ల భూ భ్రమణానికి పట్టే సమయంలోనూ తేడాలొచ్చినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్నర్ కోర్ వేగం తగ్గినప్పుడు మాంటెల్ తాలూకూ గురుత్వాకర్షణ శక్తి పెరుగుతుందని, ఫలితంగా భూ భ్రమణ వేగం తగ్గుతుందని తెలిపారు. దీనివల్ల రోజు నిడివి పెరుగుతుందన్నమాట. ఎంతో తెలుసా? ఏడాదికి సెకనులో 74,000వ వంతు! అలా 140 కోట్ల ఏళ్ల క్రితం 19 గంటలుండే రోజు నిడివి ఇప్పుడు 24 గంటలకు పెరిగిందని వివరించారు. అన్నట్టూ, భూమి ఇన్నర్ కోర్ ఆరేళ్ల సమయంలో ఒక మైలు దూరం అటు ఇటూ లోలకం మాదిరిగా ఊగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
వైజాగ్ లో ఘనంగా ముగిసిన నేవీ డే వేడుకలు
-
ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు
-
షుగర్ వ్యాధికి జాగ్రత్తలే ఔషధం
అరసవల్లి: మధుమేహంగా పిలిచే షుగర్వ్యాధి.. తీపి పదార్ధాలు ఎక్కువ తినే వారిలో వస్తుందని ఇప్పటికీ చాలా మంది నమ్మకం. ఈ వ్యాధి రావడానికి కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ మానసిక ఒత్తిడి, ఊబకాయం, వ్యాయా యం చేయకపోవడం, ఆహార నియంత్రణ లేకపోవడం వంటివి సమస్యగా పరిణమిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు చేసిన పరీక్షల్లో మాత్రమే చాలా మందికి షుగర్ వ్యాధి బయటపడుతోంది. ఈలోపే నష్టం జరిగిపోతోంది. కరోనా బాధితుల్లో ఎక్కువ మందికి షుగర్.. జిల్లాలో 1,34,303 మందికి కోవిడ్ పాజిటివ్ బారినపడ్డారు. కరోనా సోకిన తర్వాత ఎక్కువ శాతం మందికి షుగర్ వ్యాధి సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. అప్పటికే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉన్నవారు కోవిడ్ నుంచి సులభంగానే బయటపడ్డారు. నియంత్రణ లేని వారు ఐసీయూలో చేరారని, కొందరు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలో 49560 మంది షుగర్ వ్యాధి బారిన పడినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతోంది. 15 శాతం కేసులు పెరిగాయి.. జిల్లా జనాభాలో ఒకప్పుడు 8 శాతంగా ఉన్న షుగర్ వ్యాధిగ్రస్తులు..ఇప్పుడు కరోనా తర్వాత 15 శాతం మంది పెరిగారు. ఆహారంలో కార్బోహైడ్రేడ్, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, పీచు కలిగిన పదార్థాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పని వ్యాయామం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గి బరువు పెరగకుండా సహాయం చేస్తుంది. – డాక్టర్ కెల్లి చిన్నబాబు, షుగర్ వ్యాధి నిపుణుడు స్టెరాయిడ్స్ వాడితే ప్రమాదం షుగర్ వ్యాధి ఉన్నవారు స్టెరాయిడ్స్ మందులు వాడకూడదు. ఇవి వాడితే శరీరంలో ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కోవిడ్ బాధితులు స్టెరాయిడ్స్ అధికంగా వాడటం వల్ల వారిలో షుగర్ మరింతగా పెరిగింది. పరిమిత మోతాదులో వాడితే ఏ మందూ హానిచేయదు. – డాక్టర్ ఎం.మనోజ్, ద్వారకామయి హాస్పిటల్ -
అంతర్జాతీయ టైగర్ డే-ఫొటో ఎగ్జిబిషన్ (ఫొటోలు)
-
ఒక రోజు.. ‘ముందుగా’ ముగిసింది
న్యూయార్క్: భూమి తన చుట్టూ తాను తిరుగుతూ 24 గంటల్లో ఒక రోజును పూర్తిచేస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే గత నెల 29వ తేదీన 24 గంటలకు 1.59 మిల్లీ సెకన్ల ముందుగానే ఒక భ్రమణాన్ని పూర్తిచేసింది. అంటే కాస్త వేగంగా తిరిగి పుడమి కొత్త రికార్డును సృష్టించిందన్నమాట. దీంతో అతి తక్కువ రోజు( వన్ డే)గా జూన్ 29వ తేదీ నిలిచిపోనుంది. ఇలాంటి ఘటన మళ్లీ కొద్దిరోజుల వ్యవధిలోనే పునరావృతమవడం గమనార్హ ఈ నెల 26వ తేదీ ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. ఆ రోజున భూమి 1.50 మిల్లీ సెకన్ల ముందుగానే ఒక భ్రమణాన్ని పూర్తిచేసింది. సెకన్లో వెయ్యో వంతు కాలాన్ని మిల్లీ సెకన్‌గా లెక్కిస్తారు. భూమి తన భ్రమణ వేగాన్ని అత్యంత స్వల్పంగా పెంచిందని పరిశోధకులు వాదిస్తున్నారు. వారి వాదనకు బలం చేకూర్చే ఘటన 2021 ఏడాదిలో జరిగింది. ఆ ఏడాది ఒక నెల తక్కువ సమయంలో ముగిసిందని తేలింది. ఇలా జరగడం 1960ల దశకం తర్వాత ఇదే తొలిసారి కావడం ప్రస్తావనార్హం. అత్యంత తక్కువ సమయంలో రోజు ముగిసిన తేదీ కూడా అదే ఏడాదిలో నమోదవడం విశేషం. అదే ఏడాది జులై 19వ తేదీన 1.47 మిల్లీ సెకన్ల ముందుగానే భూమి ఒక చుట్టు చుట్టేసింది. -
మేం ఆడితే లోకమే ఆడదా...
-
Promise Day 2022: ప్రామిస్ డే స్పెషల్
-
ఆమెకు ప్రామిస్ చేస్తావా
మాట ఇవ్వడం.. ఒట్టు వేయడం... ప్రమాణం చేయడం... ప్రేమలో ఇవి అతి సులభం. అతి కష్టం. ఇవ్వడం సులభం. నిలబెట్టుకోవడం కష్టం. అబ్బాయి అమ్మాయి ప్రేమలోనే కాదు భార్యాభర్తల ప్రేమలో స్నేహితుల ప్రేమలో కూడా ఒకరి కోసం ఒకరు మాట ఇవ్వడం అవసరం. వాలెంటైన్ వీక్ నడుస్తోంది. ఇవాళ ప్రామిస్ డే. నేడు స్త్రీలు, యువతులు పురుషుల నుంచి కోరే ప్రామిస్‌లు ఏమిటి? పురుషులు ఆ మాత్రం ప్రామిస్ చేయలేరా? ప్రేమను నిలుపుకోలేరా? చాలా సినిమాల్లో, నవలల్లో ఒకటి చూస్తుంటాం. అమ్మాయి అబ్బాయిని ‘స్మోక్ చేయనని నాకు మాట ఇవ్వు’ అని అడుగుతూ ఉంటుంది. అబ్బాయి మాట ఇస్తాడు. అమ్మాయి సంతోషిస్తుంది. అమ్మాయిలు అబ్బాయిల నుంచి ప్రామిస్‌లు అడుగుతారు. దేనికి? వారి మంచికి. తద్వారా తమ మంచికి. తద్వారా ఇద్దరి మధ్య నిలవాల్సిన సుదీర్ఘ అనుబంధానికి. ఇవాళ తాము ప్రేమలో ఉన్న అబ్బాయిలతో అడిగే ప్రామిస్‌లు ఏమిటో తెలుసా? ► రాష్‌గా డ్రైవ్ చేయకు. ► డ్రింక్ చేసి డ్రైవ్ చేయకు. ► ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకు. ► కెరీర్ మీద ఫోకస్ పెడతానని మాట ఇవ్వు. ► నీ ఫ్రెండ్స్ నీ మంచితనాన్ని మిస్ యూజ్ చేసేలా చూడనని మాటివ్వు ► పొదుపు చేస్తానని చెప్పు ► ఫేస్బుక్లో ఎక్కువ సేపు ఉండనని మాటివ్వు ► గతంలోని నీ చేదు జ్ఞాపకాలన్నీ మర్చిపోతానని మాటివ్వు అమ్మాయిల ప్రపంచానికి అబ్బాయిల ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది. అబ్బాయిల ప్రపంచంలో తాను కోరుకునే అమ్మాయి కూడా ఉంటుంది. కాని అమ్మాయిల ప్రపంచంలో అబ్బాయి మాత్రమే ఉంటాడు. ప్రేమికుడు అయినా భర్త అయినా జీవన భాగస్వామి అయినా. అందుకే అమ్మాయిలు చిన్న చిన్నవే అయినా ఎన్నటికీ తప్పని ప్రామిస్‌లు కోరుకుంటారు. ► నా పుట్టినరోజు, మొదటగా పరిచయం అయిన రోజు, ఎంగేజ్మెంట్ రోజు, పెళ్లిరోజు... ఇలా నాకు సంబంధించిన ముఖ్యమైన రోజులన్నీ గుర్తు పెట్టుకోవాలి. ► నీ తల్లిదండ్రులను నేను గౌరవిస్తాను. నా తల్లిదండ్రులను నువ్వు గౌరవించాలి. ► నువ్వు ఎల్లప్పుడూ నా పట్ల నిజాయితీగా ఉంటూ నా కోసమే ఉండాలి. ► సమస్యలను ఇద్దరం కలిసి ఎదుర్కొనేలా ఉండాలి. ► నేను ఊహించని సమయాల్లో కానుకలు ఇస్తూ నన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచాలి. ► నాకు చంద్రుణ్ణి తెస్తాను, డ్యూప్లెక్స్ కట్టిస్తాను అనే అబద్ధపు ప్రామిస్‌లు వద్దు. నువ్వు ఎంత చేయగలవో అది చేస్తానని ప్రామిస్ చెయ్. ► నా నుంచి నాకు తెలియాల్సిన విషయాలేవీ దాచొద్దు. ► నన్ను నీ జీవితం లో అతి ముఖ్యమైన మనిషిగా చూడాలి. గమనించి చూస్తే ఈ ప్రామిస్లన్నీ ప్రేమను, బంధాన్ని దృఢతరం చేసేవే. కాలం చాలా సుదీర్ఘమైనది. అది అనూహ్యమైన పరీక్షలు పెడుతుంటుంది. అబ్బాయి అమ్మాయి లేదా భార్యాభర్తలు ప్రతి రోజూ దగ్గరగా ఉండకపోవచ్చు. వృత్తి రీత్యా, ఉపాధి రీత్యా కొన్నాళ్లు దూరం ఉండాల్సి రావచ్చు. కాని ఇరువురూ కోరుకునేది మనం ఎంత దూరమైనా ఎప్పటికీ విడిపోము అనే ప్రామిస్నే. అమ్మాయి/భార్య అడక్క ముందే ‘నేను నువ్వూ దూరంగా ఉన్నాం. కాని మనం ఎప్పటికీ దగ్గరగా ఉంటామని నేడు నీకు ప్రామిస్ చేస్తున్నాను’ అని చెప్తే ఆ అనుభూతి వేరు. ‘నేను భోజనం చేసేశాను’ అని మనసు కు చెప్పుకున్నంత మాత్రాన నిజంగా భోజనం చేయకపోతే ఎలా కడుపు నిండదో ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని మనసులో అనుకున్నంత మాత్రాన ఆ ప్రేమ పెరగదు. పండదు. నోటితో చెప్పాలి. అందుకు ఈ ‘హ్యాపీ ప్రామిస్ డే’ లాంటి సందర్భాలు ఉపయోగపడతాయి. ‘మన నవ్వులు, సరదాలు, కోపతాపాలు, చిరాకులు, పరాకులు, కన్నీళ్లు, సంతోష సమయాలు, కలిసి ఉన్న ప్రతి క్షణం నాకు గుర్తే. నా పక్కన నువ్వు ఉన్నందుకు నాకెంతో సంతోషం. ఇలా ఎప్పుడూ నువ్వు నా పక్కనే ఉండేలా నేను మసలుకుంటాను. సంతోషంగా ఉంచుతాను’ అని ప్రామిస్ చేస్తే నోరు తెరిచి చెప్తే చెప్పినందుకు ఆ ప్రామిస్ ను నిభాయించాల్సిన కమిట్మెంట్ ఏర్పడుతుంది... విన్నందుకు ఆమెకు నిలదీసే హక్కూ వస్తుంది. ‘నేను ఎప్పటికీ నీవాడినే’ అని పురుషుడు చేసే ప్రామిస్ స్త్రీ ఎన్నిసార్లయినా వినడానికి ఇష్టపడుతుంది. ‘నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను’ అనే మాట కూడా. నిజానికి హ్యాపీ ప్రామిస్ డే రోజు పురుషుడి నుంచి స్త్రీ ఆశించే తప్పనిసరి ఒట్టు ఏమిటంటే ‘మన జీవితంలో ఉన్న ప్రస్తుత స్థితిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మనం ఈ స్థితి నుంచి ఇంకా మంచి స్థితికి వెళ్లేందుకు కలిసి పని చేద్దాం. నిరాశ, నిస్పృహలు, ఫిర్యాదులు, నిందించుకోవడాలు లేకుండా అవగాహనతో మరింత బాగా ఉండేందుకు ఏం చేయాలో చేద్దాం. నీ సలహాను నేను గౌరవిస్తాను. నా ఆలోచనను నువ్వు డిస్కస్ చెయ్. మంచి చెడ్డలు ఇద్దరం పంచుకుందాం’’. ఈ ప్రామిస్ పురుషుడు చేస్తే ఆ ప్రేమ, ఆ బంధం తప్పక ముందుకు సాగుతాయి. వృత్తి రీత్యా, ఉపాధి రీత్యా కొన్నాళ్లు దూరం ఉండాల్సి రావచ్చు. కాని ఇరువురూ కోరుకునేది మనం ఎంత దూరమైనా ఎప్పటికీ విడిపోము అనే ప్రామిస్నే. అమ్మాయి/భార్య అడక్క ముందే ‘నేను నువ్వూ దూరంగా ఉన్నాం. కాని మనం ఎప్పటికీ దగ్గరగా ఉంటామని నేడు నీకు ప్రామిస్ చేస్తున్నాను’ అని చెప్తే ఆ అనుభూతి వేరు. హ్యాపీ ప్రామిస్ డే. -
Chocolate Day 2022: స్వీటెస్ట్ డే.. ‘చాక్లెట్ డే’
-
వాలెంటైన్స్ డే వీక్: స్వీటెస్ట్ డే.. ‘చాక్లెట్ డే’
ఏడు రోజుల వాలంటైన్స్ డే వీక్ జోరుగా..హుషారుగా సాగుతోంది. పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైన వాలంటైన్స్ డే క్రమంగా విశ్వవ్యాపితమైంది. ఎక్కడ చూసినా... వాలెంటైన్స్ సందడి. ప్రేమ కోసం, ప్రేమ కొరకు ,ప్రేమతో అంటూ లవ్‌బర్డ్స్ ప్రేమికుల దినోత్సవాన్ని ఎంజాయ్ చేస్తారు.. మరి ఈరోజు స్పెషల్ ఏంటి? ‘ప్రేమ’ అటే మ్యాజిక్.. అదో మాయ. మాటల్లో వర్ణించలేని తీయని అనుభూతి. అందుకే వాలెంటైన్స్ డే వీక్‌లో చాకోలెట్ డే చాలా ఇంపార్టెంట్. ఫిబ్రవరి 9న అత్యంత మధురంగా జరుపుకునేదే చాకొలెట్ డే. అలాంటి స్వీటెస్ట్ డే కోసం ప్రేమజంటలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. పెళ్లికి ముందు గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్‌తో ప్రేమలో పడితే.. పెళ్లి తరవాత తన జీవిత భాగస్వామితో ఈ చాక్లెట్ డే ఎంజాయ్ చేయవచ్చు. ప్రేమ భావన తరువాత మన మనసును ఆహ్లాదంగా, తీపి చేసేవి చాకోలెట్లే! మరి అలాంటి చాకొలెట్స్ను ప్రేమించిన వ్యక్తికి షేర్ చేయకుండా ఎలా ఉంటారు. నో. వే ..కదా.. రకరకాల ప్రేమ చాక్లెట్లు, డార్క్ చాకోలెట్లు.. అబ్బో.. చాలానే మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వాటిలో మీ టేస్ట్‌కు తగ్గట్టుఎంచుకుని మీ వాలెంటైన్ స్వీట్ మూడ్‌లోకి తీసుకెళ్లండి. చాక్లెట్ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు. చిన్న పిల్లల దగ్గరనుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఇష్టపడతారు. అంతే కాదు ప్రేమికులు ఎక్కువగా ఇచ్చుకునే గిప్ట్ కూడా చాక్లెట్ అనే చెప్పుకోవాలి. అసలు చాక్లెట్ చూడగానే మనసు తేలికపడుతుంది. చాక్లెట్ తింటే డిప్రెషన్ హుష్ కాకి అవుతుంది. మనసు ఉత్సాహంగా ప్రశాంతంగా మారిపోయి మెదడు పనితీరునీ మెరుగు పరుస్తుందట. సో.. అలిగి కోపంతో రగిలిపోతున్న ప్రేయసినీ లేదా ప్రియుడిని చాకొలెట్ ఇచ్చి కూల్ చేసేయండి.. బీపీని కంట్రోల్ చేయడానికి చాక్లెట్ దివ్య ఔషధమని చాలా స్టడీస్ చెప్పాయి. ఖరీదైన గిప్ట్స్ ఇవ్వలేని ఆనందాన్ని ఒక చిన్న చాక్లెట్‌తో పొందవచ్చు. హ్యాపీ చాక్లెట్ డే.. ఫిబ్రవరి 14న వచ్చే వాలంటైన్స్ డే రోజు ప్రేమజంటలు ఫుల్బీజీ. అసలు 7 రోజుల వాలంటైన్స్ వీక్ సందడి షురూ అవుతుంది. రోజ్ డేతో మొదలైన వాలెంటైన్స్ వీక్ కిస్ డే తో ముగుస్తుంది. చివరిగా ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే గాసెలబ్రేట్గా చేసుకుంటారు. -
Celebrate Your Unique Talent Day: టాలెంట్ అంటే ఏంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: టాలెంట్ ఉండాలే కానీ మన క్రియేటివిటీని ఎక్కడైనా నిరూపించుకోవచ్చు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు అన్నట్టు టాలెంట్, ప్రతిభ లేదా దిమాక్ ఇవి వుంటే చాలు మనకు మనమే తోపులం. మిగతావారితో పోలిస్తే ప్రత్యేకమైన ప్రతిభతో డిఫరెంట్‌గా ఉండాలి. మనలో ఉన్న టాలెంట్‌ని వెలికి తీసి ఔరా అనిపించుకోవాలి. నవంబర్ 24 టాలెంట్ డే సందర్భంగా సెలబ్రేట్ యువర్ యూనిక్ టాలెంట్ డే అంటోంది సాక్షి. ఇది మీకు తెలుసా? టాలెంట్ అంటే ఒకప్పుడు బరువుకి మెజర్‌మెంట్‌గా వాడేవారు.అలాగే పనికి విలువ ఇవ్వడానికి ఇది ఒక మార్గంగా కూడా ఉపయోగించారు.. ప్రాచీన గ్రీస్‌లో టాలెంట్ అంటే దాదాపు 55 పౌండ్లు లేదా 25 కిలోగ్రాముల వెండికి సమానమట. -
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డే: ఆసక్తికర విషయాలు
-
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డే: ఆసక్తికర విషయాలు
సాక్షి, హైదరాబాద్: 22 నిమిషాలు పాటు ఊపిరి బిగబట్టిన స్టిగ్ సెవెరిన్సెన్ గురించి మీకు తెలుసా? తమలపాకుల్లాంటి తన చేతులతో విస్తరాకు మడిచినట్టు ఇనుప పెనాన్ని మడత పెట్టేసిన వైనాన్ని మీరెపుడైనా చూశారా. ఒక్క నిముషంలో 10కి పైగా యాపిల్స్‌ను గిన్సిస్ రికార్డు సృష్టించిన భామ గురించి మీకు తెలుసా? అవును ఇవన్నీ ప్రపంచ రికార్డులే. ఇలాంటి క్రేజీ విషయాలతోపాటు, ఎన్నో ఆసక్తికర విషయాలను రికార్డు చేసేదే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. ప్రపంచంలో ఇంతకముందెవ్వరూ చేయని అత్యుత్తమ పనికి, లేదా సాహసానికి లభించే గుర్తింపే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. ఇలాంటి అరుదైన రికార్డ్ సాధించాలని చాలా మంది డ్రీమ్ అయితే దీనికి కూడా ఒక రోజుంది తెలుసా. ప్రతి సంవత్సరంలాగానే ఈ ఏడాది నవంబర్ 17న గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డే జరుపుకుంటారు. ప్రపంచం నలుమూలల నుంచి అరుదైన సంఘటనలను, సన్నివేశాలను ఇది రికార్డు చేస్తుంది. ఇ లాంటి రికార్డులన్నీ "గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్" లేదా జీ డబ్ల్యు ఆర్ అనే బుక్‌లో నిక్షిప్తం చేస్తారు. ఈ బుక్ 100కి పైగా దేశాల్లో, 23 భాషలలో ప్రచురితమవుతుంది. మొదటిసారిగా నవంబర్ 19, 2004న జరుపుకోగా ఆ తరువాత నవంరు17కి మారింది ప్రపంచ రికార్డులను తెలుసుకోవడంతో పాటు, ఇప్పటికే ఉన్న ఆ రికార్డులను బ్రేక్ చేయాలనుకుంటున్న ఔత్సాహికులను ప్రోత్సహించేలా ఈ దినోత్సవాన్ని ఏటా జరుపుకుంటారు. (లాంగెస్ట్ కిస్.. గురక వీరుడు ఇంట్రస్టింగ్ వరల్డ్ రికార్డులు ) నవంబర్ 10, 1951న, గిన్నిస్ బ్రూవరీస్ మేనేజింగ్ డైరెక్టర్, సర్ హ్యూ బీవర్, ఐర్లాండ్‌లోని షూటింగ్ పార్టీలో యూరప్‌లో అత్యంత వేగవంతమైన పక్షి ఏదబ్బా అని ఆలోచన మెదడును తొలిచేసింది. దీనికి సంబంధించి తెలుసుకునేందుకు ఎలాంటి పుస్తకం అందుబాటులో లేదని గుర్తించాడు. ప్రపంచవ్యాప్తంగా సాధించిన రికార్డులను తెలుసుకునేందుకు ఒక పుస్తకం అవసరమని కూడా అతను గ్రహించాడు. ఈ ఆలోచన క్రిస్టోఫర్ చాటవే అనే ఆయన్ని కూడా ఆకర్షించింది. చాటవే సిఫారసు మేరకు ఆగష్టు 1954లో, నోరిస్ ,అతని రాస్ మెక్విర్టర్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను సంకలనం చేసేందుకు నియమితులయ్యారు. 198 పేజీలతో 1000 కాపీల మొదటి ఎడిషన్ ఆగస్టు 27, 1955న మార్కెట్లోకి వచ్చింది. (ఈ సమంత టాలెంట్ తెలిస్తే...‘నోరెళ్ల’ బెడతారు) బ్రిటన్‌లో రికార్డు అమ్మకాలను సాధించింది. 1956లో అమెరికాలో ముద్రితమై 70,000 కాపీలు అమ్ముడయ్యాయి. ఆ తరువాత 1976లో అమెరికాలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌లో ఈ అద్భుతమైన జి.డబ్ల్యూ.ఆర్. రికార్డులను ప్రదర్శించేందుకు వీలుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మ్యూజియాన్ని ప్రారంభించారు. డాగ్ అతిపొడవైన నాలుక 30 సెకన్లలో రికార్డు సిట్ డౌన్ ఫుట్‌బాల్ క్రాస్ఓవర్లు 30వేలకుపైగా పాటలుపాడిన గాన గంధర్వుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, అతితక్కువ కాలములో 750 సినిమాలకి పైగా సినిమాలలో నటించిన హాస్య నటుడు బ్రహ్మానందం, ఎక్కువ సినిమాలకి దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు విజయనిర్మల గిన్నీస్ ప్రపంచ రికార్డులు సాధించిన గొప్పవారిలో నిలిచిన సినీ ప్రముఖులు. అలాగే 172 రోజుల్లో ఏడు ఖండాలలోని ఏడు అత్యున్నత పర్వతాలను అధిరోహించిన పర్వతారోహకుడు దివంగత మల్లి మస్తాన్‌బాబు కూడా నిలవడం విశేషం. అతిపొడవైన మీసం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రపంచ రికార్డులను ఇది నమోదు చేస్తుంది. ఇందులో మానవులు సాధించిన ఘనవిజయాలు మాత్రమే కాదు ప్రకృతిలో జరిగే విపరీతాలను ఇది పరగణనలోకి తీసుకుంటుంది. మరింకెందుకు ఆలస్యం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాలి అనే మీ కల సాకారం కోసం ఈ రోజునుంచే ప్రయత్నాలు మొదలు పెట్టండి. -
పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా? అయితే ఇవి పంపండి
National Mango Day 2021 Special Story సాక్షి, వెబ్‌డెస్క్: గత వేసవి ఆరంభం... బెంగాల్ ఎన్నికలు... ప్రధానీ మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీల మధ్య హోరాహోరీ పోరు. రాజకీయ ఎత్తులు, వ్యక్తిగత విమర్శలతో ఢీ అంటే ఢీ అన్నారు. ఎన్నికలు ముగిశాయి. గతాన్ని పక్కన పెట్టి ప్రధాని మోదీకి బుట్టెడు మామిడి పళ్లు పంపి స్నేహ హస్తం చాచారు మమత. కేంద్ర , రాష్ట్రాల మధ్య సంబంధాలు చక్కదిద్దారు. అవును నోరు తీపి చేయ్యడమే కాదు ఇద్దరి మధ్య స్నేహ పూర్వక సంబంధాలు నెరపడంలో కూడా మామిడి పళ్లు కీలకమే, వేల ఏళ్ల క్రితమే క్రీస్తు పూర్వం ఐదు వేల ఏళ్ల కిందట జంబూ ద్వీపంలో విరివిగా కాసిన మామిడి కాయలు ఆ తర్వాత ఇక్కడ కనిపించకుండా పోయాయి. తిరిగి క్రీస్తు శకం ఐదు వందల ఏళ్ల తర్వాత మరోసారి ఇండియాకు చేరుకున్నాయి. అంతే మళ్లీ మాయమయ్యేది లేదన్నట్టుగా దేశమంతటా విస్తరించాయి. వేల రకాలుగా విరగ కాస్తున్నాయి. ప్రతీ ఇంటిని పలకరిస్తూ.. తియ్యటి అనుభూతిని పంచుతున్నాయి. జులై 22న ఇండియాలో అత్యధికంగా కాసే పళ్లలో మామిడి పళ్లది ప్రత్యేక స్థానం. ప్రపంచం మొత్తం కాసే మామిడిలో సగానికి పైగా ఇండియాలోనే కాస్తున్నాయి. అందుకే మామిడి మన జాతీయ ఫలంగా గుర్తింపు పొందింది. ఇండియానే కాదు పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ జాతీయ ఫలం కూడా మామిడినే. మామిడి పళ్ల అనుభూతిని ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకునేందుకు 1987లో జులై 22న ఢిల్లీలో నేషనల్ మ్యాంగో డేని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతీ ఏటా జులై 22న జాతీయ మామిడి పళ్ల దినోత్సవాన్ని జరపడం ఆనవాయితీగా వస్తోంది. స్నేహ హస్తం భారతీయ జీవన విధానంలో మామిడి పళ్లకి ప్రత్యేక స్థానం ఉంది. తమ స్నేహాన్ని తెలిపేందుకు బుట్టలో మామిడి పళ్లు పంపడం ఇక్కడ ఆనవాయితీ. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి మామిడి పళ్లు పంపారు. అదే విధంగా బంగ్లాదేశ్ ప్రధాని నుంచి ప్రతీ ఏడు భారత్, పాక్ ప్రధానులకు మామిడి పళ్ల బుట్టలు వస్తుంటాయి. మనదగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తన ఫామ్‌హౌజ్‌లో పండిన మామిడి కాయలను స్నేహితులకు పంపడం రివాజు. మామిడి @ 1000 మామిడి పళ్లకు ఉన్న డిమాండ్ చూసి నేల నలుమూలల వెరైటీ మామిడి పళ్లను పండించే వారు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌కి చెందిన నూర్జహాన్ మామిడి పళ్లు అయితే ఒక్కొక్కటి వెయ్యి రూపాయలకు పైగానే ధర పలుకుతుంటాయి. మన దగ్గర బంగినపల్లి, తోతాపూరి, ఆల్ఫోన్సో, సింధ్రీ, రసాలు వంటివి ఫేమస్. విటమిన్ సీ కరోనా విపత్తు వచ్చిన తర్వాత విటమిన్ సీ ట్యాబెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కానీ రోజుకు ఓ మామిడి పండు తింటే చాలు మన శరీరానికి అవసరమైన సీ విటమిన్ సహాజ పద్దతిలో శరీరానికి అందుతుంది. లో షుగర్ మ్యాంగో పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని అల్లాహార్‌లోని ఎంహెచ్ పన్వర్ ఫార్మ్స్ అనే ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండే మామిడి రకాలను పండిస్తున్నారు. ఇందులో సింధ్రీ, చౌన్సా వంటి రకాల్లో 12 నుంచి 15శాతం చక్కెర ఉండగా, పన్వర్ ఫార్మ్‌లో కొన్ని రకాలు కేవలం 4 నుంచి 5శాతం చక్కెర స్థాయిని కలిగి ఉన్నాయి. కీట్ రకంలో అత్యల్ప చక్కెర స్థాయి 4.7 శాతం వరకు ఉంది. సోనారో, గ్లెన్ చక్కెర స్థాయి వరుసగా 5.6శాతం, 6శాతం వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మామిడిపండ్లు పాకిస్తాన్ మార్కెట్లలో కిలో రూ.150కు లభిస్తున్నాయి. నూజివీడు స్పెషల్ నూజివీడు మామిడి ఖండాంతరాలకు వెళ్లి అక్కడి వారికి తన రుచి చూపిస్తోంది. దీంతో ఎగుమతిదారులు వీటి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. రైతుల నుంచి నాణ్యమైన బంగినపల్లి మామిడిని టన్ను రూ, 50 వేలకు కొనుగోలు చేసి సింగపూర్, సౌత్ కొరియా, ఒమన్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పచ్చళ్లు చివరగా మామిడి కాయలు తినడానికే కాదు పచ్చళ్లుగా, ఊరగాయలుగా కూడా ఫేమస్. తెలుగు లోగిళ్లలో మామిడి ఊరగాయ లేని ఇళ్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇక ఆంధ్రా అవకాయ అయితే ఎల్లలు దాటి మరీ ఫేమస్ అయిపోయింది. -
వీరే... ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ !
వెబ్‌డెస్క్: జగడ జగడ జగడం చేసేస్తాం.. రగడ రగడ రగడం దున్నేస్తాం... ఎగుడుదిగుడు గగనం మేమేరా పిడుగులం అంటూ యూత్‌ని వర్ణించాడు ఓ సినీ కవి. నిజమే ! ఆ యుత్‌లో ఉన్న ఎనర్జీకి స్కిల్‌ను జోడించి వారి భవిష్యత్తుతో పాటు మానవాళి మనుగడకు కొత్త బాటలు వేయడం లక్క్ష్యంగా ప్రతీ ఏడు జులై 15న వరల్డ్ యూత్ స్కిల్ డేను నిర్వహిస్తున్నారు. వరల్డ్ యూత్ స్కిల్ డే ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి 2014 డిసెంబరు 18న తీర్మాణించింది. దీని ప్రకారం మొదటిసారి 2015లో జులై 15న తొలిసారి ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య ఉద్దేశం యువతకు సరైన శిక్షణ ఇచ్చి వారిలో నైపుణ్యం పెంచడం ద్వారా భవిష్యతత్తులో వారు ఎంట్రప్యూనర్లుగా, ఉద్యోగస్తులుగా రూపొందించడం వరల్డ్ యూత్ స్కిల్ డే ముఖ్య ఉద్దేశం. ఈ విషయానికి సంబంధించి ప్రజా ప్రతినిథులు, యాజమాన్యాలు, ఉద్యోగస్తులు, నైపుణ్యం కలిగిన యువత అందరినీ ఒకతాటిపైకి తెచ్చి భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేయడం ప్రధానంగా ఈ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈసారి కరోనా తర్వాత యువతలో మిగిలి ఉన్న నైపుణ్యాలు అనే థీమ్‌తో ఈసారి వరల్డ్ యూత్ స్కిల్ డేను నిర్వహిస్తున్నారు. కోవిడ్ ఇబ్బందులు ఎదుర్కొవడంలో యువత చూపించిన నైపుణ్యాలు అనే అంశం ప్రధానంగా ఈసారి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తీవ్ర ఒత్తిడి కరోనా రక్కసి దాడికి తీవ్రంగా గురయ్యారు యువత. సమాజంలో అన్ని వర్గాలపైన కరోనా ప్రభావం ఉన్నా.. 15 నుంచి 24 ఏళ్లలోపు వారు చాలా ప్రభావానికి లోనయ్యారు. మానసికంగానే కాకుండా కెరీర్ పరంగా కూడా ఇక్కట్లను ఎదుర్కొన్నారు. ఇటు చిన్న వాళ్లలా ఉండలేక అటు పెద్ద వాళ్లతో పోటీ పడలేక నలిగిపోయారు. ఐక్యరాజ్య సమితి గణాంకాలు సైతం ఇదే విషయాన్ని పట్టి చూపుతున్నాయి. కరోనా కల్లోలం కరోనా కారణంగా గడిచిన ఇంచు మించు ఏడాదిగా పాఠశాలలు పాక్షికంగా లేదా పూర్తిగా మూత పడి ఉన్నాయి. 2021 జూన్ వరకు 19 దేశాల్లో ఏడాదిగా పాఠశాలలు తెరుచుకోలేదు. పాఠశాలలు మూత పడటం వల్ల 15.7 కోట్ల మంది యువత నష్టపోతుండగా పాక్షింగా మూతపడటం వల్ల 76.8 కోట్ల మంది నష్టపోతున్నట్టు ఐక్యరాజ్య సమితి నివేదికలు తెలియజేస్తున్నాయి. - 15 నుంచి 24 ఏళ్లలోపు వయస్సు వారు కరోనా వల్ల తలెత్తిన పరిస్థితులకు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు - 2020లో కరోనా సంక్షోభం కారణంగా 8.7 శాతం యూత్ ఉద్యోగాలు కోల్పోయారు. ఇదే సమయంలో 25 ప్లస్ వయస్సు వారు 3.7 శాతమే ఉద్యోగాలు కోల్పోయారు. - యువతలో మగవారితో పోల్చినప్పుడు అమ్మాయిలే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
మరో 30 ఏళ్లలో సముద్రంలో చేపల కంటే ఇవే ఎక్కువట!
వెబ్‌డెస్క్: అణుయుద్ధాలు, కరోనా వైరస్ల కంటే ప్రమాదకరంగా చాప కింద నీరులా ప్రపంచాన్ని చుట్టేస్తోన్న మరో ప్రమాదకారి ప్లాస్టిక్. ప్రస్తుతం ప్రతీ రోజు భూమిపై పోగవుతున్న ప్లాస్టిక్‌ను కంట్రోల్ చేయకపోతే 2050 నాటికి సముద్రంలో ఉన్న చేపల బరువు కంటే ఎక్కువ ప్లాస్టిక్ చెత్త అక్కడ పోగు పడిపోతుందని అంతర్జాతీయ నివేదికలు తేల్చి చెబుతున్నాయి. జులై 12న పేపర్ బ్యాగులపై అవగాహన పెంచడానికి ప్రపంచ వ్యాప్తంగా జులై 12న పేపర్ బ్యాగ్ డే నిర్వహిస్తున్నాయి. పర్యవరణానికి హానీకరంగా మారిన ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో పేపర్ బ్యాగులు వాడాటాన్ని ప్రోత్సహించడం పేపర్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. 1952లో అమెరికాలో 1852లో తొలిసారి పేపర్ బ్యాగులను తయారు చేసే యంత్రాన్ని కనిపెట్టారు. ఆ తర్వాత కాలంలో పేపర్ బ్యాగులు ప్రపంచం మొత్తం విపరీతంగా అమ్ముడయ్యాయి. సరిగ్గా వందేళ్ల తర్వాత వచ్చిన ప్లాస్టిక్ బ్యాగులు పేపర్ బ్యాగుల స్థానానికి ఎసరు పెట్టాయి ఇక 80వ దశకంలో వచ్చిన యూజ్ అండ్ త్రో బ్యాగులైతే పర్యవరనానికే ప్రమాదకరంగా మారాయి. ప్లాస్టిక్ భూతం 1950 నుంచి ఇప్పటి వరకు 830 బిలిమన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. ఇందులో 60 శాతం ప్లాస్టిక్ అంటే 500 బిలియన్ టన్నులు రీసైకిల్ చేయడానికి అనువుగా లేదు. అంటే 70 ఏళ్లలో 500 బిలియన్ టన్నుల ప్టాస్టిక్ భూతాన్ని భూమిపై పడేశాం. మనకు ప్రమాదమే సముద్రంలో పోగవుతున్న చెత్తను చేపలు తినేస్తున్నాయి, ఆ చేపలు మనం ఆహారంగా తీసుకోవడం వల్ల హర్మోన్స్ సమతుల్యత దెబ్బ తింటోంది. వీటికి తోడు ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ కారణంగా డ్రైనేజీలు మూసుకుపోయి వరద సమస్యలు కూడా తలెత్తున్నాయి. ప్లాస్టిక్‌ను కాల్చేయడం వల్ల కర్బణ ఉద్గారాలు పెరిగి భూతాపం సమస్య ఎదురువుతోంది. ఇలా ప్లాస్టిక్‌తో ఎలా ఉన్నా ఇబ్బందులే ఉన్నాయి. అందుకే పేపర్ బ్యాగులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కట్టడి చేయాల్సిందే ప్లాస్టిక్ నియంత్రణ విషయంలో అన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయం ఉంది. అయితే ప్లాస్టిక్ కట్టడి విషయంలో చాలా దేశాలు ఉదాసీన వైఖరినే అవలంభిస్తున్నాయి. ప్లాస్టిక్ విషయలో కఠినంగా ఉన్న దేశాల వివరాలు కెనడా భూమ్మీద ఉన్న తాగునీటిలో నాలుగో వంతు స్వచ్ఛమైన నీరు కెనడాలో ఉంది. ప్లాస్టిక్ కారణంగా జలవనరులకు తలెత్తుతున్న ఇబ్బందులు గుర్తించిన కెనడా జాగ్రత్త పడుతోంది. 2030 నాటికి పూర్తిగా ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ తయారీని నిషేధించింది. స్ట్రాలు, బ్యాగులు, కవర్లు, బాటిళ్లు, ఫుడ్ ప్లేట్స్, చెంచాలు ఇలా వన్ టైం యూజ్ ప్లాస్టిక్ నిషేధం విధించింది. రువాండ రువాండలో జరిగిన అంతర్యుద్ధం 1994లో ముగిసిన వెంటనే వ్యవసాయంపై ఆ దేశం దృష్టి సారించింది. అయితే అసలే వర్షాలు తక్కువగా ఉండే ఆ దేశంలో ప్లాస్టిక్ కారణంగా సాగు దిగుబడికి జరుగుతున్న నష్టాన్ని గుర్తించింది. 2004లో ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. అంతటితో ఆగకుండా క్రమం తప్పకుండా ప్లాస్టిక్ నిషేధంపై భారీ ఎత్తున ప్రచారం నిర్వహించింది. ప్లాస్టిక్‌ను ఉపయోగించకుండా ఉండటం వారి జీవన విధానంలో ఓ భాగం అయ్యేలా చర్యలు తీసుకుంది. ఇప్పుడు ప్లాస్టిక్‌ను అతి తక్కువగా వినియోగించే దేశాల్లో ఒకటిగా నిలిచింది. కెన్యా ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా అత్యంత కఠినమైన చర్యలు తీసుకున్న దేశంగా కెన్యా చరిత్రలో నిలిచిపోయింది. ప్లాస్టిక్ తయారు చేసినా, అమ్మినా, ఉపయోగించినా సరే నాలుగేళ్ల జైలు శిక్ష లేదా 40,000 డాలర్లు జరిమానాగా విధిస్తూ చట్టాన్ని అమలు చేసింది. ఈ చట్టం దెబ్బకు ఆ దేశంలో ప్లాస్టిక్ వినియోగం 80 శాతం మేరకు తగ్గిపోయింది. పేపర్ బ్యాగుల వినియోగం పెరిగింది. ఫ్రాన్స్ 2040 నాటికి దేశాన్ని ప్లాస్టిక్ ఫ్రీగా మార్చేందుకు అనుగుణంగా ఫ్రాన్స్ పటిష్టమైన కార్యచరణతో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా 2016లో టేక్ అవే, ఫుడ్ వేర్, కర్ట్లరీ ఐటమ్స్‌లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. 2020లో టేబుల్ వేర్కి ఉపయోగించే ఐటమ్స్‌లో ప్లాస్టిక్ వినియోగాన్ని 50 శాతంలోపు పరిమితం చేసి, వాటి స్థానంలో భూమిలో కలిసిపోయే మెటీరియల్‌తో తయారైన వస్తువులు ఉపయోగించాలనే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని 2022 నాటికి పూర్తిగా తగ్గించాలని నిర్ణయించారు. ఇలా ఒక క్రమపద్దతిలో ప్లాస్టిక్‌కి చెక్ ఫ్రాన్స్ పెడుతోంది. ఇండియా 2022 నాటికి యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలంటూ 2017లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఆచరణలో అది అమలు కావడం లేదు. మన దగ్గర మార్కెట్లోకి వస్తున్న ప్లాస్టిక్‌లో 80 శాతం తిరిగి సముద్రంలోకి చేరుతుంది. ప్లాస్టిక్ నియంత్రణ, డిస్పోజల్‌కు సరైన పద్దతులు అమలు చేయకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. -
‘ప్లాస్టిక్’ పరిష్కారం ఇదే!
వెబ్‌డెస్క్: న్యూ క్లియర్ వెపన్స్, గ్లోబల్ వార్మింగ్ స్థాయిలో ప్రపంచాన్ని భయపెడుతున్న మరో పెద్ద అంశం ప్లాస్టిక్. పర్యావరణ సమతుల్యత ప్లాస్టిక్ బ్యాగ్‌లతో దెబ్బతింటోంది. ముఖ్యంగా జంతువులు, పక్షులు ప్లాస్టిక్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. దీంతో ప్లాస్టిక్‌పై అవగాహన కల్పించేందుకు జులై 3న ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ డేని నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్.. ప్రమాదాలు నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకం తప్పనిసరి అవసరంగా మారింది. అయితే ప్లాస్టిక్‌తో ఉన్న అతి పెద్ద ప్రమాదం వాటి మన్నిక కాలం. ప్లాస్టిక్ బ్యాగులు సహజ పద్దతిలో తిరిగి భూమిలో కలిసి పోవాలంటే 100 నుంచి 500 ఏళ్ల సమయం పడుతుంది. అప్పటి వరకు అది భూమి మీద అలాగే ఉంటుంది. అంతేకాదు ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా నాలాలు మూసుకుపోయి... వరదలకు కూడా కారణం అవుతోంది. ప్రమాదంలో పశువుల ప్రాణాలు పెద్దపెద్ద నగరాలన్నీ సముద్ర తీరాల చుట్టే వెలిశాయి. ఈ నగరాల్లో ఉత్పత్తి అవుతున్న చెత్త కారణంగా సముద్ర జీవుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఇక పల్లె నుంచి మెట్రో సిటీ వరకు చెత్త కుప్పల్లో పేరుకు పోతున ప్లాస్టిక్‌ని తిని పశువులు మృత్యువాత పడుతున్నాయి. మొదట యూరప్‌లో ప్లాస్టిక్ బ్యాగులకు బదులు ఏకో ఫ్రెండ్లీ బ్యాగులు వాడాలనే ప్రచారం మొదట యూరప్‌లో మొదలైంది. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమాలు, ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలు మొదలయ్యాయి. ‘ఏకో’ ధర తగ్గాలి ఎకో ఫ్రెండ్లీ బ్యాగులు వాడాలంటూ భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నా... క్షేత్రస్థాయిలో ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో ఏకో ఫ్రెండ్లీ బ్యాగులు ఉన్నా .. వాటి ఖరీదు ఎక్కువగా ఉండటంతో చాలా మంది తిరిగి ప్లాస్టిక్ బ్యాగుల వైపుకే మొగ్గు చూపుతున్నారు. కార్పొరేట్ బాధ్యత ప్లాస్టిక్ వాడకం తగ్గించడంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. స్టార్టప్‌లు ఈ దిశగా పని చేయాల్సి ఉంది. కార్పొరేట్ కంపెనీలు, భారీ వాణిజ్య సంస్థలు తమ వంతు బాధ్యతగా ప్లాస్టిక్ పరిశోధనలకు దన్నుగా నిలవాల్సిన సమయం వచ్చింది. వ్యాపారంలో కోట్లు గడిస్తున్న సంస్థలు ఇప్పటి వరకు ప్లాస్టిక్ నివారణపై పెద్దగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. బడా సంస్థలు ప్లాస్టిక్‌పై దృష్టి సారించి... నూతన ఆవిష్కరణలకు ఊతం ఇస్తే మార్పులు త్వరగా వచ్చేందుకు ఆస్కారం ఉంది. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం మన్నిక ఉండేలా ఏకో ఫ్రెండ్లీ బ్యాగులు మార్కెట్లోకి తేవడం ద్వారా ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించవచ్చు. చదవండి : అంతరిక్షంలో అద్భుతం.. తొలిసారిగా -
నాన్న.. ప్రతీ బిడ్డను వెంటాడే ఓ ఎమోషన్
కని పెంచేది అమ్మ. అవసరాలను తీర్చేది నాన్న. నడకలో ప్రతీ అడుగు ముందుండే వ్యక్తి నాన్నే. నాన్నంటే ప్రతీ బిడ్డకు తప్పు చేస్తే దండిస్తాడనే ఒక భయం. కానీ, ఎలాంటి ఆపదలోనైనా అండగా ఉండే ధైర్యం కూడా. స్వార్థం లేని తల్లిదండ్రుల ప్రేమకు.. ప్రతీరోజూ రుణం తీర్చుకున్నా తప్పులేదు. కానీ, ప్రత్యేకంగా ఒకరోజు గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో జూన్ మూడో ఆదివారాన్ని ‘ఫాదర్స్ డే’గా జరుపుతున్నారు. అలా ఈ జూన్ 20 ‘నాన్నకు ప్రేమతో..’ అంకితమైంది. యూరప్ నుంచి యూరోపియన్, అమెరికన్ చర్చి సంస్కృతుల్లో పూర్వీకులకు గౌరవించుకోవడమనే సంప్రదాయం ఉండేది. ఇందుకోసం మధ్యయుగకాలంలో సెయింట్ జోసెఫ్స్ డే(మార్చి 19న) నిర్వహించేవాళ్లు. ప్రపంచంలో మదర్స్ డే సంబురాలు మొదలయ్యాక. తండ్రులకు అలాంటి ఒకరోజు ఉండాలనే ఆలోచన నుంచి ఫాదర్స్‌డే పుట్టింది. దీనివెనకాల ఓ కథ ప్రచారంలో ఉంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఫాదర్స్ డే కథ.. అమెరికా నుంచి పుట్టిందనే కథనం ఒకటి వినిపిస్తుంటుంది. సేవలకు గుర్తింపుగా సొనోరా స్మార్ట్ డొడ్డ్ అనే యువతి తన తండ్రి సేవలకు గుర్తింపుగా.. ఆయన పుట్టినరోజును ఫాదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంది. ఆ అమ్మాయి టీనేజీలో ఉన్నప్పుడు తల్లి చనిపోయింది. సోనొరా తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్ మిలిటరీలో పని చేస్తాడు. తల్లిని పొగొట్టుకున్న సొనోరా, తండ్రి జాక్సన్‌తో కలిసి ఐదుగురు తమ్ముళ్లను పెంచి పెద్ద చేస్తుంది. తమ కోసం సుఖాలు త్యాగం చేసిన ఆ తండ్రిని సొనోరా సన్మానించి గౌరవిస్తుంది. తండ్రి పడ్డ శ్రమకు గుర్తుగా ఆమె.. ఆయన పుట్టినరోజు జూన్5ను ఫాదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంది. అలా ఒక తండ్రి త్యాగానికి బిడ్డ ఇచ్చిన గౌరవాన్ని ప్రపంచం మెచ్చుకుంది. తండ్రికి గౌరవంగా ఒకరోజు ఉంటే తప్పులేదని అంగీకరించింది. మూడో ఆదివారం అప్పటికే అమెరికాలో అమలులో ఉన్న జులై 5వ తేదీని.. ముందుకు జరిపింది. అలా జూన్ 5న ఫాదర్స్ డే మొదలైంది. చివరకు 1972లో ప్రెసిడెంట్ నిక్సన్.. ఏటా జూన్ మాసంలో మూడో ఆదివారాన్ని ‘ఫాదర్స్ డే’గా ప్రకటిస్తూ అధికార పత్రంపై సంతకం చేశాడు. 111 దేశాలు పాటిస్తున్న ఈ రోజును అనధికారికంగానే ఫాదర్స్ డేగా నిర్వహించుకుంటున్నాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం సంవత్సరంలో.. వేర్వేరు రోజుల్లో ఫాదర్స్ డేను జరుపుతున్నాయి. రష్యా, బెలారుస్లు ఫిబ్రవరి 23న ఫాదర్స్ డే గౌరవ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటాయి. అక్కడ మాత్రం ఇక ఒక సంవత్సరం చివర్లో ఫాదర్స్ డేను నిర్వహించేది బల్గేరియా(డిసెంబర్ 26). మనతో సహా చాలావరకు దేశాలు మాత్రం జూన్ మూడో ఆదివారంరోజునే ఫాదర్స్ డేగా స్వీకరించాయి. కొన్ని దేశాల్లో ఫాదర్స్ డే సెలవు రోజుకాగా.. మరికొన్ని దేశాల్లో అప్రకటిత సెలవుగా కొనసాగుతోంది. ఏమివ్వగలం ? నిరంతర శ్రామికుడిగా పేరున్న తండ్రికి.. ఆయన్ని గౌరవించుకునే రోజున ఏం ఇవ్వగలం? వాట్సాప్‌లో స్టేటస్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఫొటో, ఫేస్బుక్లో పోస్ట్తోనో, కాస్ట్లీ గిఫ్ట్‌లతో సంతోషపెట్టగలమేమో. కానీ, ఆ నిస్వార్థమైన ప్రేమను మాత్రం వెలకట్టలేం. అందుకే ఆ తండ్రి స్పర్శను.. అపారమైన ప్రేమను గుర్తు చేసుకుని సంతోషంగా గడుపుదాం. -
జాతీయ బాలికా దినోత్సవం స్పెషల్ ఫోటోలు
-
ఈ రోజు ప్రత్యేకతేంటో తెలుసా?
2021 సంవత్సరంలో ఈ రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే!.. 21వ శతాబ్ధంలో.. 21వ సంవత్సరంలో వచ్చిన 21వ రోజు ఇది. 1846లో ఇదే రోజున చార్లెస్ డికెన్స్ ‘డైలీ న్యూస్’ మొదటి ఎడిషన్ విడుదలైంది. 1950లో ప్రముఖ నవల ‘ అనిమల్ ఫార్మ్’ రచయిత జార్జ్ ఆర్వెల్ మరణించారు. వీటితో పాటు.. ► నేషనల్ హగ్గింగ్ డే ► నేషనల్ హగ్ యువర్ పప్పీ డే ► ఉమెన్స్ హెల్దీ వేయిట్ డే కూడా ఈ రోజే. అంతేకాకుండా.. ఈ సంవత్సరానికి కూడా ఓ ప్రత్యేక ఉంది. శుక్రవారంతో మొదలై.. శుక్రవారంతో ముగిసే లీపు సంవత్సరం ఇది. 2010 సంవత్సరాన్ని పోలిన ఈ సంవత్సరం క్యాలెండర్ 2027, 2100లో మాత్రమే మళ్లీ పునరావృతమవుతుంది. ఈ రోజు ప్రత్యేకతను అందరికీ తెలియజేస్తూ కొందరు నెటిజన్లు ట్వీట్లు చేసేస్తున్నారు. ‘‘ మన జీవితంలో ఈ రోజు చాలా ప్రత్యేకమైనది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఓ అడుగు ముందుకు వేసి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. Wishing everyone A very special n historical day of our life... Today is the *21st Day* of *21st Year* of the *21st Century*. ❣️ HAVE A NICE DAY ❣️ — लाखन सिंह बोहरा (@singhlakhan) January 21, 2021 *An unique Day of our life* Today is the 21st day of the 21st year of the 21st century. — Naresh Gera (@gerank) January 21, 2021 -
నవ్వండి బాస్.. మహా అయితే తిరిగి నవ్వుతారు
సాక్షి, విశాఖపట్నం: విశ్వ శ్రేయః హాస్యః అని ఓ సంస్కృత వాక్యం ఉంది. అంటే.. ప్రపంచ శ్రేయస్సు కోరేది ఏదైనా ఉందంటే అది కేవలం నవ్వు మాత్రమే. ఒకరినొకరు ద్వేషించుకునే బదులు నవ్వుతూ పలకరించుకుంటే అసలు యుద్ధాలే రావంటారు అరిస్టాటిల్. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా.. మీరు మనస్ఫూర్తిగా నవ్వుతున్నారా..? అంతలా ఆలోచిస్తున్నారేంటి.? అలా బిక్కమొహమేసుకొని చిరాగ్గా ఉండకుండా కాస్తా నవ్వండి. నవ్వుతూ ఈ కథనం చదివేయండి.. నవ్వులనేవి మంచి మనసుకు చిరునామాలు. ఒక మనిషి ఎంత సంతోషంగా ఉన్నాడో తెలుసుకోవాలంటే వారి నవ్వును కొలమానంగా తీసుకోవచ్చంటారు వైద్య నిపుణులు. ఉదయాన్నే లేచినవెంటనే.. అద్దం చూస్తూ.. చిరునవ్వు నవి్వతే చాలు. ఆరోజంతా ఎంతో ప్రశాంతంగా సాగిపోతుంది. మనసును విశ్రాంతపరుస్తూ.. కొత్తలోకంలో విహరింపజేసేలా చేస్తుంది. ఒత్తిడి, కోపం, నొప్పులకు దివ్యౌషధంలాంటిదని వైద్యులు ధ్రువీకరించారు. నవి్వనప్పుడు విడుదలయ్యే హార్మోనులు మీలో చిరాకును దూరం చేస్తాయి. దీని వల్ల వునం ఆరోగ్యంగా జీవించగలం. జీవితంలో మిమ్మల్ని స్థిరంగా ఉండేటట్లుగా సహాయపడుతూ.. పాజిటివ్ ఆలోచనలతో జీవించేలా ప్రోత్సహిస్తుంది. మీ బాధల్ని తగ్గించి ఎంకరేజ్ చేస్తూ.. గాజువాకకు చెందిన శ్రీకర్.. కోట్ల రూపాయలు సంపాదించినా ఎప్పుడూ జీవితంలో ఏదో పోగొట్టుకున్నవాడిలా కనిపిస్తుంటాడు. ఇంట్లో వాళ్ల సలహా మేరకు డాక్టర్ దగ్గరకు వెళ్లి తన సమస్య చెప్పుకున్నాడు. బీపీ, సుగర్ ఇలా వ్యాధుల చిట్టా చెప్పుకొచ్చాడు. మొత్తం విన్న డాక్టర్ శ్రీకర్ని కాసేపు తీక్షణంగా చూసి మందులు రాసిచ్చారు. హాస్పిటల్ బయటకు వచ్చి మందులు కొందామని చీటీ చూడగా... అందులో.. రోజూ మూడు పూటలు మనసారా నవ్వుతూ ఉండండి అని రాసి ఉంది. అప్పటి నుంచి అది ఫాలో అయిపోయాడు శ్రీకర్. సరిగ్గా నెల తర్వాత చూస్తే బీపీ, సుగర్ కంట్రోల్లోకి వచ్చాయి. ముఖారవిందం మారిపోయింది. ఇప్పుడు శ్రీకర్ హాయిగా ఉన్నాడు. ఎందుకంటే.... నవ్వు.. మనిషి అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది. నవ్వు.. వ్యక్తి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. నవ్వు.. ఒత్తిడిని జయిస్తుంది. నవ్వు.. ఆహ్లాదాన్ని పంచుతుంది. నవ్వు.. శరీరానికి కావాల్సిన శక్తినందిస్తుంది. ఇంతటి మహత్తర శక్తి ఒక్క చిరునవ్వుకే సాధ్యం. సంగీతానికి రాళ్లు కరిగించే శక్తి ఉందో లేదో తెలీదు కానీ.. నవ్వుకు మాత్రం వ్యా«ధులు నయమవుతాయన్న నిజం శాస్త్రీయంగా నిరూపితమైంది. అలాంటి నవ్వుకు ఉన్న శక్తిని తెలిపే రోజే స్మైల్ పవర్ డే. నవ్వడం ఒక భోగం... నవ్వు భౌతిక, మానసిక, భావోద్వేగ, సమతుల్యతకు సహాయకారి. నవ్వు వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది. దీనివల్ల శరీరంలో అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. కేలరీలు కరిగించి ఆరోగ్యంగా జీవించేందుకు సహాయపడుతుంది. మరికొన్ని పరిశోధనలు డయాబెటిక్ పేషెంట్స్‌లో సుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసే శక్తి నవ్వుకు ఉంటుందని నిరూపించాయి. స్మైల్ సైకాలజీ ప్రకారం స్మైల్ సైకాలజీ ప్రకారం చూస్తే.. రోజువారీ మనలోని శక్తిని మార్చే గుణం నవ్వులో ఉంటుంది. రోజూ ఉదయాన్నే గంటసేపు నవి్వతే.. ఆ రోజంతా మనకు కావాల్సిన శక్తిని అందిస్తుంది. కొత్త స్నేహాల్ని పరిచయం చేస్తుంది. మనలో ని శక్తి సామర్థ్యాల్ని మరింత ఇనుమడింపజేస్తుంది. సక్సెస్‌కు చిరునామాగా నవ్వు ని లుస్తుందని సైకాలజిస్టులు చెబుతుంటారు. చాక్లెట్‌కు మె దడు పనితీరుని చురుకుదనంగా మార్చే శక్తి ఉంటుంది. అలాంటి చాక్లెట్ బార్లు 2,000 తింటే.. మెదడు ఎంతటి చు రుకుదనంగా మారుతుందో.. ఒక్క నవ్వు అంతటి చురుకుదనాన్ని ఇస్తుందని బ్రిటిష్ పరిశోధకుల పరిశోధనల్లో తేలింది. శరీర శోభను పెంచే శక్తి నవ్వుకే.. ►నవ్వు మానవ జీవితానికి పలువిధాల శోభనిస్తుంది. చిరునవ్వుతో ముఖంలోని దాదాపు 150 కండరాలు కదిలించగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ►అనేక రుగ్మతల్ని రూపుమాపగలిగే శక్తి నవ్వుకి ఉందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కొన్ని రకాల వ్యాధుల్ని నవ్వుతోనే నయం చేసుకోవచ్చు. అనవసరంగా మందులు వాడాల్సిన పని లేకుండా వ్యాధులు తగ్గే అవకాశాలు నవ్వుతోనే సాధ్యం. ►మానసిక ఒత్తిడి కలిగించే హార్మోన్ల స్థాయిని నవ్వు తగ్గిస్తుంది. ►మనం నవి్వనప్పుడు అంటువ్యాధుల్ని నిర్మూలించే కణాలు మరింత చురుగ్గా పనిచేస్తాయి. ఏబీ ఇమ్యునోగ్లోబిన్స్ని కూడా నవ్వు వృద్ధి చేస్తుంది. ఈ ఇమ్యునోగ్లోబిన్స్ వృద్ధి చెందితే.. శరీరంలోని చెడు బ్యాక్టీరియా, వైరస్‌ను నాశనం చేసి శ్వాసకోశాన్ని కాపాడుతుంది. ►సహజంగా నొప్పి తగ్గించే ఎండారి్పన్ను నవ్వు పెంచుతుంది. ఆర్థరైటిస్, స్పాండిలైటిస్ కండరాలకు సంబంధించిన నొప్పులు, మైగ్రేన్ ఉద్రిక్తతకు సంబంధించిన తలనొప్పుల్ని తగ్గించేందుకు ఈ ఎండార్ఫిన్ ఎంతగానో దోహదపడుతుంది. ►ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగవుతుంది. బ్రాంకైటిస్, ఉబ్బసం ఉన్నవారికి నవ్వు వైద్యుడిగా సహాయపడుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి రక్తంలో ప్రాణవాయువు స్థానాన్ని పెంచుతుంది. ►మానసిక ఒత్తిడిని తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ►పది నిమిషాల పాటు నవి్వన తర్వాత చెక్ చేస్తే.. బీపీ పేషెంట్లో రక్తపోటు తగ్గుముఖం పట్టినట్టు పరిశోధనలు తెలిపాయి. ►మనసారా రోజూ నవ్వుకోండి. మీ ముఖంలో ఎలాంటి వృద్ధాప్య ఛాయలు కనిపించవు. మన ముఖ కండరాల్ని టోన్ చెయ్యడంతో పాటు ముఖ కవళికల్ని మెరుగుపరచడంలో నవ్వు కీలక పాత్ర పోషిస్తుంది. మీరెప్పుడైనా పొట్ట చెక్కలయ్యేలా నవ్వినప్పుడు మన ముఖం ఎర్రబడటాన్ని గమనించారు. దీనికి కారణం రక్త సరఫరా వేగవంతం కావడమే. ఇలా రక్త ప్రసరణ వేగవంతమైతే.. ముఖ చర్మానికి పోషణ లభించి మెరుపు సంతరించుకుంటుంది. ఈ సీక్రెట్‌ను తెలుసుకునే.. చాలా మంది నవ్వుతూ ఉంటారు. ఇంత పవర్ నవ్వులో ఉన్నప్పుడు ఈ వార్తని కూడా సీరియస్‌గా చదువుతారెందుకు.. ఇప్పటి నుంచే నవ్వుతూ.. నవ్విస్తూ.. హాయిగా ఆరోగ్యంగా జీవించండి. ఒత్తిడి దూరం.. గంటల తరబడి చదువుతున్నప్పుడు మానసిక ఒత్తిడికి గురవుతుంటాను. ఆ సమయంలో ఒక్క అరగంట సేపు కామెడీ షోలు చూస్తుంటా. అంతే ఒత్తిడి మొత్తం మాయమైపోయి రిలాక్స్‌గా మారిపోతుంటా. ఇంట్లో అంతా ఇదే ఫాలో అవుతున్నాం. – శైలజ, పీజీ విద్యార్థిని కామెడీ షోలకు ప్రాధాన్యం... నవ్వు ఆరోగ్యానికి మంచిదని ఎప్పుడో చదివాను. అప్పటి నుంచి కామెడీషోలు, సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటాను. క్లాసులు విన్నాక.. కాసేపు ఫ్రెండ్స్ అంతా కూర్చొని ఎవరికి తెలిసిన జోకుల్ని చెప్పుకుంటూ నవ్వుకుంటాం. – బండారు స్వరాజ్యం, బీటెక్ విద్యార్థిని నవ్వే ఆయుధం... ఎదుటి వారు ఏ విషయంలోనైనా కోపంగా మాట్లాడితే.. వారికి నేను చిరునవ్వుతోనే సమాధానం చెబుతుంటాను. దీంతో.. వారు కూల్ అయిపోతారు. నాపై కోపాన్ని మరిచిపోయి ఫ్రెండ్స్ అయిపోతారు. నా స్మైల్ నా పవర్ అని చాలా మంది చెబుతుంటారు. – తమ్మినేని దర్శిని,డిగ్రీ విద్యార్థిని లాఫర్ థెరపీ మంచిదే... మా దగ్గరికి చాలా మంది వివిధ రకాల నొప్పులతో బాధపడుతూ వస్తుంటారు. వాళ్లందరికీ ఫిజియోథెరపీ చేశాక ఇంటికి వెళ్లి అరగంట పాటు నవ్వమని సలహా ఇస్తుంటాను.లాఫర్ థెరపీతో ఎలాంటి నొప్పులనైనా మాయం చెయ్యొచ్చు. – ఎస్.స్వాతి, ఫిజియోథెరపిస్ట్ -
వినరా వినరా నరుడా
‘వినదగు నెవ్వరు సెప్పిన’ అన్నాడు సుమతీ శతకకారుడు. ఇప్పుడు అందరూ చేస్తున్నది అదే. ఎవరు ఏం చెప్పినా వింటున్నారు. అయితే తర్వాతి లైను ఒకటి ఉంది. ‘వినినంతనే వేగపడక వివరింపతగున్’... విన్న వెంటనే వేగంగా ఒక అభిప్రాయానికి రావొద్దని, విన్న దానిలో మంచి ఏదో చెడు ఏదో తేల్చుకుని, విశ్లేషించుకుని, అజా పజా చూసుకొని, సరైన దారిలో వెళ్లేవాడే నీతిపరుడు అని ఈ పద్యం చెబుతుంది. సరైన మాట పలకడం ఎంత ముఖ్యమో సరైన మాట వినడం, చెవికెక్కించుకోవడం అంతే ముఖ్యం. ఏ నీటి కోసం ముంత పట్టుకుంటే ఆ నీరే దొరుకుతాయన్నట్టు చెప్పుడు మాటలకు చెవిని విడిచి పెడితే ఆ మాటలే చెవి దాకా వస్తాయి. రామాయణంలో మందర మాటలను కైక చెవికెక్కించుకుంది. దాని వల్ల ఒక నష్టం. లంకలో రావణుడు విభీషణుడి మాటలు చెవినెక్కించుకోలేదు. అదొక నష్టం. చెవికి చేరిన మాటను పుటం పెట్టి తీసుకోవడంలోనే మన విజ్ఞత, లౌక్యం, బతుకు సజావుతనం ఉంటాయి. అంతఃపుర కాంతలు ఇందరు ఉండగా సైరంధ్రీ పై మక్కువ ఏలరా అని కీచకుణ్ణి అతడి సోదరి హెచ్చరిస్తుంది. వినలేదు. ఐదు ఊళ్లు వదిలి పెట్టు... గొడవ ఆగుతుంది అని కృష్ణుడు మాటవరస ప్రతిపాదన చేస్తే దుర్యోధనుడు చెవికేసుకోలేదు. చెవి శుభ్రంగా ఉండి ఉంటే కీచకుడు బతికేవాడు. దుర్యోధనుడు ఆ ప్రతిపాదన కాకపోతే మరో ప్రతిపాదన చేసి నష్టనివారణ చేసుకుని ఉండేవాడు. యుద్ధంలో, దొమ్మీలో, అల్లర్లలో రణగొణ ధ్వనులు అధికం. సత్యం పలుచనైపోతుంది. దాని డెసిబల్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే చాలా అప్రమత్తంగా ఉండాలి. ‘అశ్వత్థామ హతః’ అని వినపడ్డాక ఆ తర్వాత లో గొంతుకతో పలికిన ‘కుంజరః’ను కూడా ద్రోణుడు సరిగా విని ఉంటే చనిపోయింది తన కొడుకు అశ్వత్థామ కాదని, ఆ పేరుతో ఉన్న ఏనుగు అని తెలుసుకొని ప్రాణాలు కాపాడుకుని ఉండేవాడు. జనుల చెవి ఎప్పుడూ మాయలో పడుతూనే ఉంటుంది. చెడు శబ్దాల ఊబిలోకి దిగుతూనే ఉంటుంది. వారికి మంచి చెప్పడానికి మహాత్ములు, ప్రవక్తలు దిగి రావడాన్నే పనిగా పెట్టుకున్నారు. కొందరు గుడి గోపురం ఎక్కి మరీ చెప్పారు. కొందరు ఊరు వాడలు తిరిగి చెప్పారు. చెడు చెవి ఉన్నవారంతా ఈ మంచి వినిపించడానికి వచ్చిన వారిని పరీక్షలు పెట్టారు. రాళ్లతో కొట్టారు. కడకు కొందరి ప్రాణాలే తీశారు. కాని వారు ఒక్కసారి పలికిన మంచి శతాబ్దాలు గడిచిపోయినా వినబడుతూనే ఉంటుంది. మంచిని వినిపించాలి అనే సంకల్పానికి ఉన్న శక్తి అది. మనం నిద్రపోయేటప్పుడు ఇవాళ ఏ మంచి మాట ఎవరికి వినిపించాం అని ఆలోచిస్తే ఎంత మంచి ఆవరణంలో మనం ఉంటున్నామో అర్థమవుతుంది. శారీరక బధిరత్వానికి వైద్యం ఉంది. మానసిక బధిరత్వానికి లేదు. ప్రేమను వినకుండా పగను వినేవారు, స్నేహాన్ని వినకుండా ద్వేషాన్ని వినేవారు, శాంతిని వినకుండా యుద్ధాన్ని వినేవారు, ఐకమత్యాన్ని వినకుండా విభజన తత్వాన్ని వినేవారు, మానవత్వాన్ని వినకుండా మతాన్ని వినేవారు, క్షమను వినకుండా శిక్షను వినేవారు నిజమైన, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నామని చెప్పలేము. చేతులు, కాళ్లు మెదడుకు దూరంగా ఉంటాయి. గుండె కూడా మెదడుకు దూరమే ఉంటుంది. చెవే చాలా దగ్గర. ఇది నింపుకునే జాలి, కరుణ, ఆర్ద్రత మెదడులోకి త్వరగా చేరి మనల్ని దయామూర్తులను చేస్తాయి. వినలేకపోయే వారి మీద జోకులు వేయడానికి మించిన కుసంస్కారం లేదు. ‘చెవిటి మాలోకం’, ‘సౌండ్ ఇంజనీర్’... ఈ పేర్లు పెట్టడం నవ్వు వచ్చే విషయం ఏ మాత్రం కాదు. నిజానికి వారు అదృష్టవంతులు. ‘వాడెంత వీడెంత’, ‘వాడి సంగతి చూస్తా’, ‘ఫలానా వాళ్లని చంపేయాలి’, ‘ఆమెను ఏం చేస్తానో చూడు’, ‘వాడు తక్కువ నేను ఎక్కువ’, ‘పో.. వెళ్లి చంపు’ లాంటి మాటలు వాళ్ల చెవికి వినిపించవు. ఆ మేరకు వాళ్లు చెడుకు దూరంగా ఉన్నారు. ఈ మాటలను సంపూర్ణంగా వినగలిగే గ్రహణశక్తి ఉన్నా అవి వినక్కర్లేని వివేచనతో ఉండటమే ఇప్పుడు కావలసింది. చెవికి మంచి ఆహారం ఇవ్వడం అవసరమని గ్రహించండి. ఒక పాట వినిపించండి. సితార్ కచ్చేరిలో మునకలేసేలా చేయండి. ఒక భక్తి గీతానికి పరవశం కానివ్వండి. ఒక ప్రార్థనలో నిమగ్నం అవనివ్వండి. ఒక ఆత్మీయుని పలకరింపుతో తబ్బిబ్బు కానివ్వండి. ఒక మంచి పని చేశాక ఎదుటివారు ‘కృతజ్ఞతలు’ అని చెబుతుంటే ఆ మాటను మూడు పూటలా మాత్రలా మింగించండి. చెవి ఆరోగ్యం అంటే సమాజ ఆరోగ్యం. దేశ ఆరోగ్యం. చెడు శబ్దాల స్వచ్ఛభారత్ చేసి మంచి మాటల సమోన్నత భారత్‌గా మలచడమే ఇప్పుడు మన విధి. -
నేడు మానవ అకమ రవాణా వ్యతిరేక దినం
-
అధిక జనాభాను నియంత్రించాలి
బెల్లంపల్లి: అధిక జనాభాను నియంత్రించాలని బెల్లంపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జంగం నిత్యకళ్యాణ్ అన్నారు. బుధవారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక బజారు ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జనాభాను అదుపులో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జనాభా పెరగడం వల్ల వనరుల సమస్య ఉత్పన్నమవుతుందన్నారు. అనంతరం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ నిర్వాహకులు సిరికొండ ఆంజనేయరావు, ఎస్.నర్శింగం, కె.సత్యనారాయణ, రాజన్న, నారాయణరావు, వెంకట రమణారెడ్డి, రాజయ్య, కె.నర్సయ్య, దుర్గా ప్రసాద్, వి.సంతోష్, పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శంకర్ పాల్గొన్నారు. -
జావా.. నాటి హవా !
విజయవాడ స్పోర్ట్స్: ఒకప్పుడు పెద్దవాళ్లు ఆఫీషియల్‌గా వాడే బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ అయితే... 1987కు ముందువరకు కుర్రకారు బైక్ ఏదంటే జావా మోటార్ సైకిలే. 1929లో చెకోస్లేవియాలో తయారైన ఈ జావా మోటారు సైకిల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు. రోడ్డుపైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ సింహం అయితే...జవా మోటార్ సైకిల్ పులి అనేవాళ్లు. ఇప్పటికీ దీనికున్న క్రేజీ ఏమాత్రం తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. బీటింగ్‌కు మారుపేరు జావానే. టుస్ట్రోక్ ఇంజిన్ ఇది. 350 సీసీ, 250 సీసీ బైక్‌లు ఉన్నాయి. బండి స్టార్ట్ చేయడానికి కిక్ రాడ్డే గేర్ రాడ్ ఉన్న బైక్ ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఒక్క జావా బైక్ మాత్రమే. పూర్తిగా ఎగ్ షేప్‌గా ఏ ఒక్క పార్టు బయటకు కనిపించకుండా ఉండే బైక్ జావా బైక్. ఇప్పటికీ రోడ్డుపై ఎన్ని వందల బైక్‌లు వెళ్లినా...ఒక జావా బైక్ చాలు తన ఉనికిని చాటుకోవడానికి. పాత సినిమాల్లో హీరోలు వాడిన బైక్ ఇది. 1980 తరువాత జావా బైక్‌ని కొంతమార్పులు చేసి యజ్డీ బైక్‌గా పేరు మార్చారు. ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాలకు పైగా ఈ బైక్ ఏలింది. పాత బులెట్ మాదిరిగానే ఎన్ని సంవత్సరాలు బండి అయినా సరే మళ్లీ దానిని కొత్త బైక్‌గా తయారు చేసుకునే వీలున్న బైక్ ఇది. బండి ఎంత పాతదయితే అంత క్రేజ్ ఉంది. దేశవ్యాప్తంగా జావా క్లబ్‌లు దేశవ్యాప్తంగా జావా క్లబ్‌లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జులై 8న ఇంటర్నేషనల్ ‘జావా డే’ ని నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న జవా క్లబ్‌లు వరల్డ్ జావా డేని నిర్వహిస్తున్నాయి. విజయవాడలో కూడా ‘బీటింగ్ హార్ట్స్ జావా’ క్లబ్ ఉంది. ఆ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 8 ఎనిమిది గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి క్లబ్ సభ్యులంతా తమ బైక్‌లపై రైడ్ చేయనున్నారు. జావా బైక్‌ల బీటింగ్‌తో కనులవిందు చేయనున్నారు. -
ఘనంగా ఆవిర్భావ దినోత్సవం
గరిడేపల్లి : మండలంలోని గడ్డిపల్లిలో గురువారం గడ్డిపల్లి మిల్లు హమాలీ యూనియన్ ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం తమదేనన్నారు. కార్మికుల సంక్షేమమే సంఘం ధ్యేయమన్నారు. కార్యక్రమంలో మండల సంఘం అధ్యక్షుడు గుండు గుర్వయ్యగౌడ్, ఎంపీటీసీ సుందరి నాగేశ్వరరావు, బెల్లంకొండ గుర్వయ్యగౌడ్, సలిగంటి జానయ్య, ముక్కంటి వెంకన్న, సంపత్, తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మూడు కోట్లకు పైగా సభ్యత్వం గాల్లో పని చేస్తున్న కార్మికులు మూడు కోట్లకు పైబడి సభ్యత్వం కలిగి ఐఎన్టీయూసీ అతిపెద్ద యూనియన్‌గా కొనసాగుతుందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్నగౌడ్ అన్నారు. గురువారం మండలంలోని వేములూరు ప్రాజెక్ట్‌పై నిర్మించిన ఎన్‌ఏటీఎల్ పవర్‌ప్లాంట్ ఐఎన్టీయూసీ కార్మికులతో కలిసి 71వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొని కేక్ కట్ చేసి జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చ లిగంటి జానయ్య, నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు గురవ య్య, కరుణాకర్‌రెడ్డి, కోటేష్, ముక్కంటి, రామ్మూర్తి, కోటిరెడ్డి, వెంకటేశ్వర్లు, శంకర్‌రెడ్డి, సైదిరెడ్డి, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘ఇరిగేషన్ డే’గా విద్యాసాగర్‌రావు జన్మదినం
సాక్షి, హైదరాబాద్: నీటి పారుదలరంగ నిపుణుడు, ప్రభుత్వ సలహాదారు దివంగత ఆర్.విద్యాసాగర్‌రావు పుట్టినరోజు నవంబర్ 14ను తెలంగాణ ‘ఇరిగేషన్ డే’గా ప్రకటించాలని రాష్ట్ర ఇంజనీర్ల జేఏసీ, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్లు సంయుక్తంగా ప్రభుత్వాన్ని కోరాయి. విద్యాసాగర్‌రావు కన్న కలలను సాకారం చేసే దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశాయి. ఆదివారం విద్యాసాగర్‌రావు ప్రథమ వర్ధంతి సందర్భంగా జలసౌధ ప్రాంగణంలో ఇంజనీర్లు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సమావేశానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌తో పాటు సీఈలు సునీల్, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేతో పాటు ఇంజనీర్ల జేఏసీ నాయకులు వెంకటేశం, మోహన్‌సింగ్, వెంకటరమణారెడ్డి, సల్లా విజయ్‌కుమార్, చక్రధర్, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు శ్యాంప్రసాద్‌రెడ్డి, రాంరెడ్డి, ముత్యంరెడ్డి, రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యనాథన్ మాట్లాడుతూ, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాకోసం విద్యాసాగర్‌రావు తీవ్రంగా తపించేవారని, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన సందర్భంలో తాను ఆయనతో సుదీర్ఘంగా చర్చించినట్టు చెప్పారు. ఆయనిచ్చిన విలువైన సూచనల ఆధారంగా కోర్టుల్లో పిటిషన్లు వేశామని గుర్తు చేశారు. తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి ప్రసంగిస్తూ విద్యాసాగర్‌రావును వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా అభివర్ణించారు. డిండి ఎత్తిపోతల పథకానికి విద్యాసాగర్‌రావు పేరు పెట్టినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సీఈ సునీల్ మాట్లాడుతూ, డిండి ప్రాజెక్టుని అనుకున్న సమయానికి పూర్తిచేసి నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండకు సాగునీరు, తాగునీరు అందిస్తామన్నారు. శ్రీధర్‌రావు దేశ్‌పాండే మాట్లాడుతూ, విద్యాసాగర్‌రావు ఆశయ సాధనకు పునరంకిత మవుతామని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అన్ని ప్రాజెక్టులని సకాలంలో పూర్తి చేసి తెలంగాణని కోటి ఎకరాల మాగాణంగా మార్చే కృషిలో పాలుపంచుకుంటామన్నారు. -
మే 4న డైరెక్టర్స్ డే
మే 4... దర్శకరత్న డా. దాసరి నారాయణరావు పుట్టినరోజు. నూట యాభైకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆయనది. దాసరి భౌతికంగా దూరమైనా తాను అందించిన చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోతారు. మే 4న ఆయన జయంతిని పురస్కరించుకుని ఆ రోజుని ‘డైరెక్టర్స్ డే’గా ప్రకటించింది తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం. ‘‘స్వర్గీయ దాసరి నారాయణరావుగారి జయంతి సందర్భంగా మే 4న ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్లో వేడుక నిర్వహించనున్నాం. తెలుగు దర్శకుల సంఘం సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు’’ అని దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ తెలిపారు. -
ఘనంగా ఆటా డే వేడుకలు
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మరో వేడుకకు సిద్ధమైంది. అమెరికాలోని తెలుగు వారందరిని ఏకం చేయుటకు, తెలుగు సంస్కృతిని చాటిచెప్పెందుకు అమెరికన్ తెలుగు కన్వెన్షన్ వేడుకలను మే 31, జూన్ 1, 2 తేదీల్లో డల్లాస్ లో నిర్వహిస్తున్నట్లు సభ నిర్వాహాకులు తెలిపారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ ఆటా డే నష్వీల్లే’ ను ఏప్రీల్ 21న నిర్వహించారు. ఈ వేడుకలకు 100 మంది అతిధులు హాజరైయారు. ఈ కార్యక్రమంలో యాక్టర్ భానుశ్రీ ఆటలు, పాటలు, ఉత్తేజభరితమైన సంగీతాన్ని, నృత్యాన్ని ప్రదర్శించి అందరిని అలరించారు. ఆటా టీం హాస్యభరిత చర్చలతో, ఉత్సహాభరితంగా సాగింది. వేడుకల అనంతరం అతిథులకు నష్వేల్లీ నుంచి పారడైస్ బీర్యానీతో రుచికరమైన విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలు ఆటా ప్రాంతీయ కో ఆర్డీనేటర్ నరేంద్ర రెడ్డి నూకల, రామకృష్ణా రెడ్డి ( కమ్యూనిటి చైర్), సుశీల్ చంద్రా ( స్టాండింగ్ కమిటి, కో-చైర్), కిషోర్ రెడ్డి గుడూర్, ఆధ్వర్యంలో జరిగాయి. వేడుకల నిర్వాహాణకు 25 వేల డాలర్లు విరాళాలు సేకరించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు, కరుణాకర్ అసిరెడ్డి, అనిల్ బోడిరెడ్డి, వెబ్ కమ్యూనిటీ చైర్మన్ ఉమేష్ ముత్యాల, తిరుపతిరెడ్డి యర్రంరెడ్డి, వివిధ ప్రాంతాల నుంచి తెలుగు ప్రముఖులు, ప్రతినిధులు హజరయ్యారు. -
కరెంటు ఫుల్...నీళ్లు నిల్
కొండనాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిందన్న విధంగా తయారైంది అన్నదాతల పరిస్థితి. నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టును మినహాయిస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతాంగానికి విద్యుతే ప్రాణాధారం. ప్రభుత్వం ఇప్పుడు 24గంటల ఉచిత నిరంతర విద్యుత్ ఇస్తున్నా ఆయకట్టేతర ప్రాంతాలకు చెందిన రైతులు ఏమాత్రం సంతోషంగా లేరు. విద్యుత్‌ను అవసరాల మేరకే సక్రమంగా ఎలా వినియోగించుకోవాలో రైతులను చైతన్య పరచడంలో విద్యుత్‌శాఖ పూర్తిగా విఫలమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతుల విద్యుత్ మోటార్లు ఆగకుండా నడుస్తుండడంతో భూగర్భ జలమట్టం అంతకంతకూ పడిపోతోంది. ఫలితంగా బోర్లు వట్టిపోయి, పంటలు ఎండుతున్నాయి. దీంతో రైతులు బోరుమంటున్నారు. పైన ఫొటో చూడండి.. పశువులు మేస్తున్న ఎండిన పంట నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం సర్వారంలోనిది. ఈ గ్రామంలో 350 ఎకరాల్లో ఈ సీజన్లో వరి సాగు చేశారు. సీజన్ ప్రారంభంలో డీ–40 కాల్వ ద్వారా నీరు విడుదల చేయడంతో రైతులు వరి పంటలను సాగు చేశారు. అయితే కాల్వ ద్వారా నీటి విడుదల నిలిచిపోవడంతో పరిస్థితి తారుమారు అయ్యింది. భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటిపోయాయి. బోర్లలో నీరు రాకపోవడంతో సాగు చేసిన వరి చేలు ఎండి పోతున్నాయి. మరో నెల రోజుల్లో పంటలు చేతికి వచ్చే సమయంలో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ గ్రామంలో 200 ఎకరాల వరకు వరి ప్రస్తుతం పూర్తిగా ఎండి పోయింది. దీంతో కొంతమంది రైతులు కొత్తగా బోర్లు వేసి ఫలితం లేక చేతులు కాల్చుకుంటున్నారు. చేసేది లేక పశువులను మేపుతున్నారు. సాక్షిప్రతినిధి, నల్లగొండ: వానాకాలం అంతగా కలిసి రాకపోవడంతో యాసంగి పంటపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి పూర్తిస్థాయిలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తుండడంతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. కరెంటు ఫుల్‌గా ఉన్నా, సరిపడా నీరందక కళ్లముందే పంటలు ఎండిపోతుంటే రైతులు బోరుమంటున్నారు. నల్లగొండ జిల్లాలో గత ఏడాది ఫిబ్రవరిలో 10.91 మీటర్లపైనే నీరందగా, వినియోగం విచ్చలవిడిగా పెరగడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి భూగర్భజలమట్టం 11.30 మీటర్ల లోతుకు పడిపోయింది. నెల రోజుల్లో యాదాద్రి జిల్లా పరిధిలో రెండు మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. ఆటో స్టార్టర్లతో నడుస్తున్న మోటార్లు కాలిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో పంటను కాపాడుకోవాలనే తపనతో రైతులు విచ్చలవిడిగా బోర్లు వేస్తున్నారు. పెరిగిన సాగు విస్తీర్ణం.. విద్యుత్ వినియోగం గత యాసంగి సీజన్ కంటే ఈ సీజన్లో సాగు విస్తీర్ణం, విద్యుత్ వినియోగం పెరిగిపోయాయి. సాగర్, మూసీ ఆయకట్టును మినహాయిస్తే ఉమ్మడి జిల్లాలో భూగర్భజలంపై ఆధారపడే రైతులే ఎక్కువ. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో 3.87లక్షల పైచిలుకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్క నల్లగొండ పరిధిలోనే గత ఏడాది ఫిబ్రవరిలో 297 మిలియన్ యూనిట్లు విద్యుత్‌ను వినియోగిస్తే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా 466 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అదేస్థాయిలో సాగు విస్తీర్ణం కూడా పెరిగిపోయింది. నల్లగొండలో గతేడాది యాసంగిలో 57వేల హెక్టార్లలో సాగు చేస్తే, ఈ సారి 74వేల హెక్టార్లకు పెరిగిపోయింది. సూర్యాపేట జిల్లాలో గతేడాది 74వేల హెక్టార్లలో సాగుచేయగా, ఈ సారి 80వేల హెక్టార్లకు పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ యాసంగిలో 25వేల హెక్టార్లలో వరి సాగైంది. దీంతో నిరంతరం విద్యుత్ వాడుతున్న ఫలితంగా బోర్లు వట్టిపోయి పంటలు ఎండిపోతున్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి, తిరుమలగిరి, అర్వపల్లి, నూతనకల్, నాగారం, మద్దిరాల మండలాల పరిధిలో 7240 ఎకరాల్లో వరిపంట సాగు చేయగా ఇప్పటికే 50 శాతం పొలాలు ఎండిపోయాయి. తమ పంటలు ఎండిపోవడానికి కారణం 24గంటల విద్యుత్ అని రైతులు వాపోతున్నారు. 24 గంటల విద్యుత్ వద్దని రైతులు గ్రామాల్లో రాస్తారోకో, ధర్నాలు చేస్తున్న విషయం విదితమే. రెండెకరాలు పూర్తిగా ఎండిపోయింది మాకున్న రెండు ఎకరాల్లో యాసంగిలో వరి సాగు చేశాం. ఉన్న రెండు బోర్లు నెల రోజుల్లో వట్టిపోయాయి. 20 రోజుల క్రితం కొత్తగా రూ.50 వేలు ఖర్చు పెట్టి రెండు బోర్లు వేయించినా చుక్క నీరు రాలేదు. మొత్తం రెండెకరాలు పూర్తిగా ఎండిపోయింది. దీంతో పశువులను మేపుతున్నాం. పెట్టిన పెట్టుబడి పోగా మరో రూ.70 వేల వరకు అప్పు మిగిలింది. – మల్లేపల్లి సైదమ్మ, సర్వారం, తిప్పర్తి మండలం 12గంటలు ఇస్తే చాలు ప్రభుత్వం 24 గంటలు నిరంతరాయంగా కరెంట్ ఇస్తుండడంతో బోర్లు ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు తగ్గి బోర్లు సన్నని ధారగా పోస్తున్నాయి. నాటు పెట్టిన పొలాలు ఎండిపోతున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్రంలో 12 గంటల కరెంట్ విడుతల వారీగా ఇస్తేచాలు. వ్యవసాయం చేయగలం. నీటి వసతి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో 24 గంటలు ఇచ్చుకుంటే సరిపోతుంది. – గంగేశ్వర్, రైతు, అడ్డగూడూరు ఆటోస్టార్టర్లు తొలగించుకోమని చెప్పాం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న నాటి నుంచే రైతులు ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించుకోమని చెబుతున్నాం. ఎవరికి వారు స్వచ్ఛందంగా తొలగించుకోవాలి. అవసరం మేరకు విద్యుత్ వాడుకుని ఆ తర్వాత రైతులు తమతంటతాముగానే స్టార్టర్లు బంద్ చేసుకుంటున్నారు. భూగర్భజలాలు అడుగంటుతున్నాయని రైతుల నుంచి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. 24 గంటల విద్యుత్ సరఫరా విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కొద్దిరోజుల నుంచి జిల్లాలో విద్యుత్ వాడకం పెరిగింది. ప్రతీ రోజూ నల్లగొండ జిల్లాలో 29.86 మిలియన్ యూనిట్లు వినియోగిస్తున్నారు. వాస్తవానికి జిల్లా కోటా 18.30 మిలియన్ యూనిట్లు మాత్రమే. – కృష్ణయ్య, విద్యుత్ శాఖ, ఎస్ఈ, నల్లగొండ -
మూడో సోమవారం
మాధవ్ శింగరాజు జనవరి నెలలోని మూడో సోమవారం అంటే అమెరికన్లలో చాలామందికి ఇష్టం ఉండదు! ‘ద మోస్ట్ డిప్రెసింగ్ డే ఆఫ్ ద ఇయర్’గా వాళ్లు ఫీలౌతారు. అప్పటికి క్రిస్మస్, న్యూ ఇయర్ అయిపోయి ఉంటాయి. ఆ రెండు రోజుల కోసం చేసిన అప్పులేవైనా ఉంటే అవి మిగిలి ఉంటాయి. కొత్త సంవత్సరపు తీర్మానాలు ఈ రెండు వారాల్లో బ్రేక్ అయి ఉంటాయి. అవన్నీ అలా ఉంచండి.. క్రిస్మస్‌లా, న్యూ ఇయర్‌లా.. ఎదురుచూడ్డానికి దగ్గర్లో ఇంకే పండుగలూ ఉండవు. అందుకని జనవరి మూడో సోమవారాన్ని ‘బ్లూ మండే’ అంటాడు క్లిఫ్ ఆర్నల్ అనే సైకాలజిస్టు. అంటే దిగుళ్ల సోమవారం అని. మనుషుల్లో స్ట్రెస్ లెవల్స్ పెరగడం మొదలయ్యే రోజట అది. ‘ఇ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్’ లాంటి లెక్కలేవో ఆయనకు ఉన్నాయి. ఆ లెక్కల్ని పక్కన పెడితే, అమెరికాలో ఇవాళ నేషనల్ హాలిడే! నేషనల్ హాలిడే ఎందుకంటే ఇవాళ అక్కడ ‘మార్టిన్ లూథర్ కింగ్ డే’. అమెరికాలో నల్లజాతి హక్కుల కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ని గుర్తు చేయడం కోసం (గుర్తు చేయడానికి, గుర్తు చేసుకోడానికి తేడా ఉంది) యేటా ప్రతి మూడో సోమవారం ‘మార్టిన్ లూథర్ కింగ్ డే’ని జరుపుతోంది అమెరికా. (జరపడానికి, జరుపుకోడానికి తేడా ఉంది). ఈ ఏడాది మార్టిన్ డే, మార్టిన్ బర్త్‌డే రెండూ ఒకేరోజు వచ్చాయి. జనవరి 15 మార్టిన్ బర్త్‌డే. మరి మార్టిన్ బర్త్‌డే నే, మార్టిన్ డే గా ప్రకటించవచ్చు కదా! ప్రకటించవచ్చు కానీ, ఎందుకనో అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ జనవరిలో వచ్చే మూడో సోమవారాన్ని ‘మార్టిన్ లూథర్ డే’ పేరిట జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. 1983లో ఆయన ఆ హాలిడే బిల్లు మీద సంతకం చేస్తే, 1986 జనవరి మూడో సోమవారం తొలిసారిగా అమెరికాలో హాలిడే అమల్లోకి వచ్చింది. అయితే అమెరికాలోని మెజారిటీ రాష్ట్రాలు ‘మార్టిన్ లూథర్ డే’ ని గుర్తించలేదు! కొన్ని రాష్ట్రాలైతే, లూథర్ డే అని కాకుండా, ఇంకేదైనా పేరు పెడితేనే గుర్తిస్తాం అని పట్టుపట్టి కూర్చున్నాయి! 2000 నాటికి గానీ అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నీ కలసి ‘మార్టిన్ లూథర్ డే’ని నేషనల్ హాలిడేగా అంగీకరించలేకపోయాయి. బిల్లు మీద సంతకం పెట్టడానికి ముందు రొనాల్డ్ రీగన్ మనసు కూడా అందుకు అంగీకరించలేదు! మనసొప్పక, నల్లవాళ్లను నొప్పించలేక సంతకం పెట్టేశారు. ‘ది మోస్ట్ డిప్రెసింగ్ డే ఆఫ్ ది ఇయర్‌గా’ జనవరిలో వచ్చే మూడో సోమవారాన్ని బలపరచడానికి ‘మార్టిన్ డే’ని కూడా ఒక కారణంగా చూపే తెల్ల అమెరికన్లు కూడా అక్కడ లేకపోలేదు. కనీస హక్కుల్ని సైతం పొందలేక.. డేస్, ఇయర్స్ మాత్రమే కాదు.. పుట్టినప్పట్నుంచీ డిప్రెసింగ్ లైఫ్‌నే గడుపుతున్న నల్లజాతి అమెరికన్ పౌరుల హక్కుల కోసం పోరాడిన ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ని అమెరికన్ జాతీయులు ఈ మాత్రంగానైనా అంగీకరించడానికి చాలా సమయమే పట్టింది. ‘‘ఓ రోజు వస్తుంది. ఆ రోజు అమెరికాలో నల్లవారందరికీ స్వేచ్ఛ, తెల్లవారందరితో సమానత్వం అనే నా కల నిజమౌతుంది’’ అన్నారు మార్టిన్.. ‘ఐ హ్యావ్ ఎ డ్రీమ్’ అనే ప్రసంగంలో. మొన్న శుక్రవారం నాడు వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్.. ‘మార్టిన్ డే’ ఉద్ఘోషణ (ప్రొక్లమేషన్) మీద లాంఛనంగా సంతకం పెట్టిన రెండు రోజులకే, ఆఫ్రికా దేశాల పౌరులను ఉద్దేశించి ‘షిట్హోల్స్’ అనడం చూస్తుంటే, మార్టిన్ కల పూర్తిగా నిజం ఫలించిందా అన్న సందేహం కలుగుతుంది. మనసులో చీకటిని పెట్టుకుని ఎన్ని దీపాలను వెలిగిస్తే మాత్రం ఏమిటి? మనిషి మీద గౌరవం లేకుండా ఎన్ని ‘డే’లు జరిపితే మాత్రం ఏముంది? -
పేదల సంక్షేమమే థ్యేయం
మంత్రి కిమిడి కాకినాడ రూరల్: దేశం, రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతోందని రాష్ట్ర విద్యుత్తు శాఖామంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కిమిడి కళావెంకటరావు ఉద్ఘాటించారు. మంగళవారం ఏపీఎస్పీ థర్డ్ బెటాలియన్ మైదానంలో ఏర్పాటు చేసిన 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. విడిపోయిన రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు తీసుకువెళ్లడానికి ప్రజలు ఎంతో సహకరిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులందరూ సహకరించి రాష్ట్రాన్ని ప్రగతి పథకంలో నడిపించడానికి సహకరించాలని కిమిడి కోరారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు., 90 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ముందుగా జాతీయ జెండాను ఎగురువేసి జెండా వందనం చేశారు. ఏఆర్ ఫ్లటూన్, ఎన్సీసీ తదితర దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రిజర్వు దళాలు ప్రదర్శించిన సంప్రదాయ కవాతును తిలకించారు. ఈ సందర్భంగా డీఆర్డీఏ ద్వారా 4,828 మహిళా సంఘాలకు రూ. 124 కోట్లు బ్యాంక్ లింకేజీ, స్త్రీ నిధి ద్వారా 2017 మంది సభ్యులకు రూ.25 కోట్ల 22 లక్షల మొత్తాన్ని రుణాలుగా మంత్రి అందించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బ్యాంక్ లింకేజీ, సబ్సిడీ కలిపి 25 యూనిట్లకు రూ.42 కోట్ల 67 లక్షలు, ఎన్ఎస్ఎఫ్డీసీ ఆరు యూనిట్లకు రూ. 14 కోట్లు లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ ద్వారా 10 ట్రై సైకిళ్లు, ఆరు వీల్ చైర్లు, ఏడుగురికి కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా కోటి రూపాయలు విలువైన ఒక్కొక్కటి రూ. 10 లక్షలు విలువ గల 10 స్కార్పియో, టాటా జిస్ట్ తదితర వాహనాలను 9 మంది ఎస్సీ, ఒకటి ఎస్టీ లబ్ధిదారులకు అందించారు. సాంఘిక సంక్షేమ శాఖ చే కులాంతర వివాహాలు చేసుకున్న 84 జంటలకు ఒక్కొక్కరికి రూ. 50 వేలు చొప్పున రూ. 42 లక్షలు అందజేశారు. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు... విద్యాశాఖచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆహూతులను ఎంతగానో అలరించాయి. వీరిలో ప్రగతి ఇంగ్లిషు మీడియం స్కూల్ విద్యార్థులచే ప్రదర్శించిన స్వాగతం, స్వాగతం పాటకు, సెయింట్ అన్స్ గరల్స్ హైస్కూల్ విద్యార్థులచే ప్రదర్శించిన నృత్య రూపకం, ఆదిత్యా ఇంగ్లిషు మీడియం, శ్రీనగర్ విద్యార్థులచే ప్రదర్శించిన నృత్య రూపకాలకు మంత్రి కిమిడి జ్ఞాపికలను అందజేశారు. శకటాల ప్రదర్శన... శకటాల ప్రదర్శనలో దేవాదాయశాఖ అన్నవరం, వ్యవసాయశాఖ, పౌరసరఫరాల శాఖ, విద్యాశాఖ–సర్వశిక్షా అభియాన్, అటవీ శాఖ, సాంఘిక సంక్షేమ–ఎస్సీ కార్పొరేషన్, సమీకృత గిరిజనాభివృద్ధి, పర్యాటక, మత్స్య, వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, డీఆర్డీఏ, వెలుగు శాఖలు నిర్వహించే కార్యక్రమాల అంశాలతో శకటాల ద్వారా ప్రదర్శనలు నిర్వహిచారు. పౌర సరఫరాల శకటానికి ప్రథమ స్థానం, వ్యవసాయశాఖకు ద్వితీయ, అటవీశాఖకు తృతీయ బహుమతిని మంత్రి కిమిడి, జాయింట్ కలెక్టర్ మల్లికార్జునలు అందజేశారు. మార్చ్ ఫాస్ట్‌లో ఏఆర్ ప్లటూన్ మొదటి స్థానం, ఎన్సీసీ బాలికల విభాగానికి రెండో, బాలుర విభాగానికి మూడో స్థానం లభించిందిం. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు చోడేపల్లి హనుమంతరావును మంత్రి కిమిడి, కలెక్టర్ కార్తికేయమిశ్రా, ఎస్సీ విశాల్గున్నిలు సన్మానించారు. స్టాల్స్‌ను సందర్శించిన మంత్రి... జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, గ్రామీణ ఉపాధి హామీ పథకం, డ్వామా, విద్యాశాఖ తదితర శాఖలతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి కళా సందర్శించి తిలకించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జేసీ ఎ.మల్లికార్జున, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, డీఆర్ఓ ఎం.జితేంద్ర, ఆర్డీఓ ఎల్.రఘుబాబు, స్టేట్ ఫుడ్ కమిషన్ సభ్యుడు ఎన్. శ్రీనివాస్‌లతోపాటు వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
గిరిజనుల అభివృద్ధి బాటలు
ఆదివాసీ దినోత్సవంలో కలెక్టర్ మిశ్రా రంపచోడవరం : గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపి వారిని అభివృద్ధి బాటలో పయనించేందుకు కృషి చేస్తామని, ఇందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నట్టు కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో బుధవారం పీఎంఆర్సీ ఆవరణలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన నిరుద్యోగ యువతకు స్దానికంగా స్టడీ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వినియోగించుకుని ఐదు వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. టీఎస్పీ ని«ధులు సక్రమంగా వినియోగిస్తూ, జీఓ నెం.3 ద్వారా స్థానిక గిరిజనులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. గిరిజన సంఘాలు అధికారులకు తోడ్పాటును అందించాలని కోరారు. ఎమ్మెల్సీ టి.రత్నాబాయి మాట్లాడుతూ గిరిజనులు హక్కుల పరిరక్షణకు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. జూనియర్ కళాశాల నుంచి ప్రదర్శన స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు, గిరిజనులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కొమ్ము డ్యాన్సు, రేలా పాటలతో ర్యాలీ పీఎంఆర్సీ వరకు సాగింది. కలెక్టర్, పీఓ ఏఎస్ దినేష్‌కుమార్ అడ్డాకులతో చేసిన టోపీలు పెట్టారు. పీఎంఆర్సీ వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను కలెక్టర్ సందర్శించారు.ఈ కార్యక్రమంగా కేవీకే ద్వారా 30 కుట్టుమిషన్లు, రూ.1.50 కోట్ల బ్యాంక్ లింకేజ్, రబ్బరు విభాగం ద్వారా పవర్ టిల్లర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబురమేష్, ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు పత్తిగుళ్ల భారతి, ఆర్డీఓ రామ్మోహనరావు, ఏపీఓ నాయుడు, సర్పంచి వై.నిరంజనీదేవి, మాజీ సర్పంచి మంగా బొజ్జయ్య, ఎంపీటీసీ కారుకోడి పూజా, ఏజెన్సీలోని ఏడు గిరిజన తెగలకు చెందిన పెద్దలు పాల్గొన్నారు. -
శతమానం భవతి..
నామినేషన్లతో ఊపందుకున్న సందడి ఒక్కరోజులో వంద నామినేషన్లు వైఎస్సార్ సీపీ, ‘దేశం’సహా దాఖలు నేడు నామినేషన్ల దాఖలకు చివరి తేదీ కాకినాడ : కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల సందడి జోరందుకుంది. మూడో రోజైన బుధవారం ఒక్కరోజులో దాదాపు వంద మంది నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎంతోపాటు అనేక మంది స్వతంత్ర అభ్యర్థులూ నామినేషన్లు వేశారు. మొదటి రెండు రోజుల్లో 12 నామినేషన్లు దాఖలు కాగా, మూడో రోజు దాఖలైన వంద నామినేషన్లతో 112కు చేరాయి. బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్సీపీ నుంచి 41, టీడీపీ తరఫున 33, స్వతంత్య్ర అభ్యర్థులు 14 మంది, కాంగ్రెస్ ముగ్గురు, బీజేపీ నుంచి ఆరు, సీపీఐ నుంచి రెండు, సీపీఎం నుంచి ఒక్కో నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా డివిజన్ల నుంచి కొంతమంది సభ్యులు అట్టహాసంగా బయలుదేరి నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్ సీపీ నుంచి 41 మంది 1వ డివిజన్ : వాసిరెడ్డి అవినాష్భగవాన్, వాసిరెడ్డి సుజాత, 2వ డివిజన్ : పాటి వెంకటసూర్యనారాయణ, 5వ డివిజన్ : వీరంరెడ్డి వెంకటలక్ష్మి, 6వ డివిజన్ : అమలదాసు చిరంజీవి, 13వ డివిజన్ : బొక్కా వెంకటరమణ, 15వ డివిజన్ : బలగం వెంకటేష్ 16వ డివిజన్ : కోనాడ ప్రకాశరావు, 18వ డివిజన్ : కోనాడ సత్యనారాయణ 19వ డివిజన్ : సిద్ధాంతపు రాజు, గళ్ల రాజేంద్రప్రసాద్, పి.భాస్కరరావు 20వ డివిజన్ : పిసంగి మోహనరావు, 24వ డివిజన్ : లంక సంజీవ్‌కుమార్ 26వ డివిజన్ : మత్సా లోకేష్‌వర్మ, 27వ డివిజన్ : వాసిపల్లి వెంకటరమణమ్మ, మన్యం కృష్ణవేణి, 28వ డివిజన్ : వాసిరెడ్డి వరలక్ష్మి, గుండా సత్యవతి 29వ డివిజన్ : సిరియాల చంద్రరావు 32వ డివిజన్ : కోడెల యెల్లయ్యమ్మ, చల్లా మరణ, రోకళ్ల సత్యనారాయణ, కొయ్యా రమణ, చిల్లా లక్ష్మి, కొయ్యా సత్యానందం, చిల్లా శివాజీ, పిల్లా సుదర్శన్ 33వ డివిజన్ : బోర అరుణ 36వ డివిజన్ :బెజవాడ దుర్గాదేవి 37వ డివిజన్ : దండుప్రోలు గంగా, ఓలేటి సుభ ప్రసన్న, 38వ డివిజన్ : గంటగోగుల రామచంద్రజ్యోతి 39వ డివిజన్ : బాదం గంగారత్నం 41వ డివిజన్ : పెద్దిరెడ్డి రామలక్ష్మి 44వ డివిజన్ : వెలిశెట్టి మాధురిదేవి 46వ డివిజన్ : ర్యాలి రాంబాబు, ర్యాలి రాఘవేంద్ర, తిరుమలశెట్టి లక్ష్మీకాంత్ 49వ డివిజన్ : కడియాల కనకలక్ష్మి -
మన్యం.. దైన్యం
కొండల మధ్య గ్రామాలు వెళ్లే దారి లేని పరిస్థితి పల్లెల్లో కనీస వసతుల్లేవు వైద్యం, తాగునీటికి తీవ్ర ఇక్కట్లు నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఏటా గిరిజన సంక్షేమానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ.. గిరిజనుల బతుకులు మెరుగు పడడం లేదు. కనీస వసతులు లేని పల్లెల్లో గిరిజనులు జీవిస్తున్నారు. సకాలంలో వైద్యం అందక గిరిజనులు మృత్యువాత పడుతున్న దుర్భర స్థితిలో మన్యంలో నెలకొంది. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ లక్ష్యాలు సాధించలేక చతికిలపడింది. గ్రామాలకు రోడ్లు, తాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు శ్రద్ధే చూపడం లేదు. రంపచోడవరం : ఏజెన్సీలో ప్రాజెక్టు నిర్మాణం కారణంగా గిరిజనులు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరిపోతున్నారు. పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించకపోవడం గిరిజనులకు శాపంగా మారింది. ఏజెన్సీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా నాలుగు మండలాలకు చెందిన గిరిజనులు నిర్వాసితులవుతున్నారు. గతంలో భూపతిపాలెం, ముసురుమిల్లి, సూరంపాలెం ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా నిర్వాసితులైన గిరిజనులకు ఉపాధి చూపలేదు. ప్యాకేజీ ద్వారా వచ్చి సొమ్ము ఖర్చు చేసుకున్న వారు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. చట్టాల అమల్లో నిర్లక్ష్యం ఏజెన్సీ కోసం చేసిన ప్రత్యేక చట్టాల అమల్లో నిర్లక్ష్యం గిరిజనుల జీవితాలు అణగారిపోతున్నాయి. అటవీ హక్కుల చట్టం ప్రకారం కొండపోడు సాగు చేసుకుంటున్న వారు పట్టాలు పొందలేకపోయారు. ప్రధానంగా పోడు, వ్యవసాయంపై ఆధారపడి జీవించే గిరిజనులకు ప్రభుత్వ ప్రోత్సాహం లభించడం లేదు. పీసా కమిటీల ప్రమేయం లేకుండానే అభివృద్ధి పనులను బినామీ కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. ఏజెన్సీలో వెనుకబడిన తెగగా గుర్తించిన పీటీజీల (కొండరెడ్డి గిరిజనులు) అభివృద్ధిని పట్టించుకునే వారే లేరు. ఐటీడీఏ అమలు చేసే పథకాల లబ్ధి వారికి చేరడంలేదు. ఏజెన్సీలో అనారోగ్యం, పౌష్టికాహార లోపం వల్లే 30 వరకు మాతా శిశు మరణాలు సంభవించాయి. నేటికీ ఐటీడీఏ పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందించే దిశగా చర్యలు తీసుకోలేకపోయింది. ఉపాధికి ఏదీ ఊతం? గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టలేకపోయారు. పనుల కోసం గిరిజనులు వలస పోతున్నారు. ఏజెన్సీలో అపారమైన అవకాశాలు ఉన్నా చిన్న తరహా పరిశ్రమలు స్థాపించలేకపోతున్నారు. గిరిజన యువతకు శిక్షణ ఇచ్చి బయట ప్రాంతాలకు పంపిస్తున్న అక్కడ ఇమడలేక తిరిగి వస్తున్నారు. ఐటీడీఏ లెక్కల్లో మాత్రం గిరిజన యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి చూపినట్టు లెక్కలు రాసుకుంటున్నారు. వైద్య సేవలు అంతంత మాత్రమే.. ఏజెన్సీలో వైద్య సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. పీహెచ్‌సీల్లో వైద్యులు, క్షేత్ర స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో వైద్య సేవలు అందడం లేదు. చాపరాయి సంఘటనలో 18 వరకు గిరిజనులు జ్వరాలు బారిన పడి చనిపోతేనే గాని వైద్య సేవలపై దృష్టి పెట్టలేకపోయారు. వందల గ్రామాలను కలిపే రహదారులు ఆధ్వానంగా ఉన్నాయి. కొన్ని గ్రామాలకు అసలు రహదారి సౌకర్యమే లేదు. కొండవాగులపై వంతెనల నిర్మాణం అవసరాన్ని గుర్తించడం లేదు. -
రాగాల పల్లకిలో..
పనీ–పాటా అన్నారు. దైనందిన జీవితం సక్రమంగా నడవడానికి పని ఎంత ముఖ్యమో, ఒత్తిడి నుంచి సేదతీరడానికి పాట కూడా అంతే ముఖ్యం. కావేరీ జలాలు సేవిస్తే సంగీతం, గోదావరి జలాలు సేవిస్తే సాహిత్యం అబ్బుతాయన్నది నిన్నటి మాట. గోదావరి కెరటాలతో సంగీతం కూడా వినిపిస్తుందని చాటిచెప్పే సంస్థలు ఇప్పుడు కన్ను తెరుచుకుంటున్నాయి. ఔత్సాహిక గాయకులకు తమ ప్రతిభను వ్యక్తం చేయడానికి నెలనెలా కార్యక్రమాలు నిర్వహించే సంస్థలకు నేడు లోటు లేదు. నేడు అంతర్జాతీయ సంగీత దినోత్సవం సందర్భంగా ఇటువంటి సంస్థలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. - రాజమహేంద్రవరం కల్చరల్ ఆయన పాటకు షష్టిపూర్తి దాటింది. అరవై ఏళ్లకు పైగా ఆయన పాడుతూనే ఉన్నాడు. ఆ పాటకు నేటికీ విరామం లేదు. సప్తతి దాటిన జిత్‌మోహన్ మిత్రా విద్యార్థి దశ నుంచి పాటలు సాధన చేశారు. నటుడిగా మారి సినిమాల్లో డబుల్ సెంచరీ దాటినా, పాటే ఆయన తొలి ప్రాధాన్యమైంది. జిత్ మోహన్ మిత్రా ఆర్కెస్ట్రా స్థాపించి, ఏటా సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలుగు, హిందీ పాటలు రెంటినీ ఆయన గళం వినిపిస్తూనే ఉంది. సంప్రదాయ సంగీతానికి పెన్నిధి శ్రీసద్గురు సన్నిధి. ‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః...’ అన్నారు పెద్దలు. శిశువులు, పశువులేకాదు, విష సర్పాలు సైతం సంగీతానికి వశులవుతాయి. సంగీతంలో డిప్లమో చేసిన శిష్టు మధుసూదనరావు యువతలో అంతర్లీనంగా ప్రతిభ ఉన్న కళాకారులు తగిన వేదిక అందుబాటులో లేకపోవడం వల్ల గుర్తింపు పొందలేకపోతున్నారని గ్రహించారు. 2012లో యువసంగీత కళాకారులను ప్రోత్సహించడానికి శ్రీసద్గురు సన్నిధి స్థాపించారు. ప్రతినెలా రెండో ఆదివారం గోదావరి గట్టున ఉన్న త్యాగరాజ నారాయణదాస సేవాసమితి ఆవరణలో లబ్ధప్రతిష్ఠులైన గాయకులతోపాటు, కొత్తవారికీ సంస్థ నిర్వహించే శాస్త్రీయ సంగీత కార్యక్రమాల్లో అవకాశం కల్పిస్తున్నారు. రాయుడు ఆర్కెస్ట్రా.. రాయుడు చంద్రకుమార్ ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. సంగీతమన్నా, అమరగాయకుడు ఘంటసాల పాటలన్నా ఆయనకు అమితప్రేమ. గోదావరి గట్టుపై ఘంటసాల విగ్రహ వ్యవస్థాపకుడు రాయుడు చంద్రకుమార్. ఔత్సాహిక గాయకులను ప్రోత్సహించడానికి రాయుడు ఆర్కెస్ట్రా స్థాపించి, ఏటా అనేక వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎందరో డాక్టర్లు రాయుడు ఆర్కెస్ట్రా వేదికపై సింగర్లయ్యారు. 40మంది గాయకులతో ఒకే వేదికపై 40 ఘంటసాల పాటలను, 40 గీతాశ్లోకాలను ఆలపించిన సంఘటన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదైంది. యువతకు శిక్షణనిస్తూ.. కేంద్రప్రభుత్వ సంస్థలో పని చేస్తున్న ఉడతా జయలక్ష్మికి చిన్నతనం నుంచి సంగీతం ఆరో ప్రాణం. ఇంటివద్దనే కర్ణాటక సంగీతం నేర్చుకున్న జయలక్ష్మి ఆసక్తి ఉన్న కళాకారులకు శిక్షణ ఇస్తున్నారు. సంగీత కార్యక్రమాలు నిర్వహించేవారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. మెలోడీ ప్రధానంగా ఉన్న మంచి సంగీతానికి ప్రాధాన్యం లభించాలని ఆమె కోరుకుంటున్నారు. సంగీతలహరి నెలనెలా సంగీత కార్యక్రమాలు నిర్వహించే సంగీతలహరి సంస్థ దానవాయిపేట పాండురంగస్వామి ఆలయంలో ఔత్సాహిక గాయనీగాయకులకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాలు కలగచేస్తోంది. ప్రముఖ మృదంగ విద్వాంసుడు వరదా కమలాకరరావు తనయుడు యోగీష్ సంస్థకు పూర్వ అధ్యక్షుడు. ఏటా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న సంస్థ ఇది. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత సభ మంగళంపల్లి బాలమురళికి వీరాభిమాని సాగి శ్రీరామచంద్రమూర్తి ఏటా బాలమురళి పుట్టినరోజున నగరంలో సంగీత కార్యక్రమాలను నిర్వహించి, ప్రముఖ సంగీత విద్వాంసులను ఘనంగా సత్కరించేవారు. బాలమురళీకృష్ణ సంగీతసభను ఆయన స్థాపించారు. తొలిసారిగా ఈ ఏడాది బాలమురళీకృష్ణ ‘జయంతిని’ జులై ఆరో తేదీన నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీత్యాగరాజ నారాయణదాస సేవాసమితి 1952లో బుగ్గా పాపయ్యశాస్త్రి స్థాపించిన త్యాగరాజ నారాయణ దాస సేవాసమితి ప్రస్తుతం గోదావరి గట్టున ఉంది. ఏటా సమితి నిర్వాహకులు దక్షిణాది అగ్రసంగీత కళాకారులను ఆహ్వానించి, నేటి వరకు క్రమం తప్పకుండా సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. -
ఇదీ సాంకేతి‘కథ’
విరివిగా పెరుగుతున్న టెక్నాలజీ.. జీవన విధానంలో వినూత్న మార్పులు సామాజిక అంశాల విస్మరణతో పక్కదారి పడుతున్న వినియోగం సాంకేతిక సమస్యలతో సామాన్యులు సతమతం నేడు జాతీయ టెక్నాలజీ డే అరచేతిలోనే అంతర్జాలం.. అన్నీ కొనుగోళ్లు ఆన్లైన్లోనే.. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా.. సినిమా, బస్, రైలు టికెట్లు కొనుగోలు చేయాలన్నా అంతా టెక్నాలజీతో ప్రస్తుతం ముడిపడి ఉంది. బిల్లుల చెల్లింపులు, ధ్రువీకరణ పత్రాలు పొందడం, నెట్ బ్యాంకింగ్, ఏటీఎంల నుంచి నగదు తీసుకోవడం, నగదు రహిత లావాదేవీలు ఇలా ప్రతి విషయానికి ప్రస్తుతం టెక్నాలజీయే ఆధారం. ఆధునిక సమాజంలో మానవుల అవసరార్థం శాస్త్రవేత్తల ప్రయోగాలతో అద్భుతమైన లోకాన్ని వీక్షిస్తున్నామంటే దీనంతటికీ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానమే కారణం. అయితే టెక్నాలజీ వినియోగంలో సామాజికాంశాలు, మానవీయ విలువలను పాటించకపోవడంతో అనేక నష్టాలు జరుగుతున్నాయి. నేరుగా ప్రభుత్వాలే టెక్నాలజీని వినియోగించి ప్రజాప్రయోజనాల్లో కోత విధిస్తుండడంపై సర్వత్రా విమర్శలువెల్లువెత్తుతున్నాయి. నేడు జాతీయ టెక్నాలజీ డే సందర్భంగా క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలపై ప్రత్యేక కథనం.. - కపిలేశ్వరపురం(మండపేట) * రాజమండ్రి పరిసరాల్లో షూటింగ్ కోసం వచ్చిన యువ హీరో రామ్‌చరణ్, హీరోయిన్ సమంత, డైరెక్టర్ సుకుమార్ సెల్ సిగ్నల్స్ లేక అల్లాడిపోయారు. *కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి గ్రామానికి చెందిన ఓ ఉపాధి కూలీ 23 నెలలుగా కూలి డబ్బులు తీసుకోలేని పరిస్థితి... ఈ పరిణామాలను ప్రభావితం చేసే అంశాలన్నీ టెక్నాలజీకి సంబంధించినవే. జాతీయ టెక్నాలజీ డే నేపథ్యమిదీ.. జాతీయ టెక్నాలజీ డే ను 1999 మే 11 నుంచి జరుపుకోవడం ప్రారంభించారు. 1998 మే 11న ఇండియన్ ఆర్మీ రాజస్థాన్‌లోని పోక్రాన్‌లో మూడు అణు బాంబులను ప్రయోగించి ప్రపంచంలో అణు సామర్థ్యం కలిగిన ఆరో దేశంగా గుర్తింపు సాధించింది. అదే రోజున బెంగళూరులో హంస 3 ఇన్డైజినస్ హైర్క్రాఫ్ట్ను మొదటి సారి పరీక్షించింది. అదే రోజు త్రిశూల్ మిస్సైల్‌ను కూడా ప్రయోగించింది. ఈ కారణంగా మే 11న జాతీయ టెక్నాలజీ డే జరుపుకోవడం ప్రారంభమైంది. కొత్త బంగారు లోకాన్ని సృష్టించిన టెక్నాలజీ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మేధావుల కృషి ఫలితంగా కొత్త బంగారు లోకం సృష్టించిందని చెప్పొచ్చు. మానవ అవసరాలు తీర్చేవి. సమాజాన్ని అధ్యయనం చేసే సాధనాలు, నేరుగా వీక్షించే సదుపాయాలు, ఆహార అలవాట్లు ఇలా అన్నింటిలో టెక్నాలజీ కారణంగా మార్పులు చోటు చేసుకున్నవి. ప్రస్తుత విద్యా విధానంలో సాంకేతిక విద్యకే ప్రాధాన్యం ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు ఇలా.. కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి గ్రామానికి చెందిన వాసంశెట్టి అనంతలక్ష్మి అనే ఉపాధి కూలీ 23 నెలలుగా కూలి డబ్బులు తీసుకోలేని పరిస్థితి. ఆమె చేతి వేలి ముద్రలు అరిగిపోవడం, కంటి సమస్య తలెత్తడంతో జీతం ఇవ్వడంలేదు. ప్రత్యామ్నాయం చూపైనా డబ్బులివ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఏం చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. ప్రభుత్వ పథ«కాల్లో లబ్ధి పొందాలంటే ఆధార్‌కు అనుసంధానం కావాలంటూ విధించిన నిబంధన కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ ప్రక్రియ హడావుడిగా జరగడం, తప్పులు తడకగా ఉండడంతో పింఛన్లు, రేషన్ కార్డులను పొందలేకపోతున్నారు. సర్వర్ డౌన్.. జిల్లాలోని 64 మండలాల్లో 2,642 రేషన్ షాపులు ద్వారా తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ, అన్నయోజన కార్డులు సుమారు 16,11,494 ఉన్నాయి. సర్వర్ డౌన్ కారణంగా రేషన్ తీసుకోవడంలో తరచూ తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. స్కాలర్షిప్లు పొందడంలో సమస్యలు.. జిల్లాలో సుమారు ఆరు వేల మంది విద్యార్థులు చేతి వేలి ముద్రలు పడకపోవడం, ఇతర సాంకేతిక కారణాల వల్ల రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్పులను పొందడంలో సమస్యలెదుర్కొంటున్నారు. జిల్లాలోని 1069 ఈ పంచాయతీ గ్రామాల్లో 476 గ్రామాల్లో మాత్రమే జనన మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. సిబ్బంది లేకపోవడం, సాంకేతిక కారణాల వల్ల మీ సేవలను ఆశ్రయించాల్సి వస్తోంది. చార్జీల మోత.. సాఫ్ట్వేర్ సమస్యలు కారణంగా ఆర్టీసీలో నగదు రహిత విధానం పూర్తిస్థాయిలో అమలు జరగడంలేదు. సుమారు 70 ఈ పోస్ యంత్రాలను ఏర్పాటు చేసినా పనిచేస్తున్నవి కేవలం 35 మాత్రమే. నగదు రహిత లావాదేవీల పేరుతో క్రెడిట్ కార్డు వినియోగంపై రెండు, డెబిట్ కార్డు వినియోగంపై ఒక శాతం చార్జీలు మోపుతున్నారు. ఆధార్ సర్వర్‌లో సాంకేతిక సమస్య కారణంగా ఈ నెల ఎనిమిదో తేదీన పూర్తిగా, తొమ్మిదిన మూడు గంటల వరకూ కాకినాడ, రాజమండ్రి రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని 32 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లావాదేవీలు నిలిచిపోయాయి. తరచూ ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. సాంకేతిక అభివృద్ధికి పాలకులు చేస్తున్న కృషి అంతంత మాత్రమే తిరుపతిలో నిర్వహించిన 104వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు సాంకేతిక అభివృద్ధిపైనే ఎక్కువగానే మాట్లాడారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ నోబెల్ బహుమతి పొందిన వారికి రూ.వంద కోట్లు బహుమతి ఇస్తానని అన్నారు. దేశంలో నాలుగో పారిశ్రామిక విప్లవం నడుస్తుందని, మేకిన్ ఇండియాను స్ఫూర్తిగా తీసుకుని మేక్ ఇన్ ఏపీగా మార్చేందుకు కృషి చేస్తున్నానన్నారు. ఇన్ని మాటలు చెప్పిన సీఎం సాంకేతిక ప్రగతికి చేసిన కృషి అంతంతమాత్రమేనని చెప్పొచ్చు. రామచంద్రపురం పట్టణంలో ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేసి 12,500 ఇళ్లకు రూ.149కే టీవీ, నెట్ అందిస్తానని చెప్పినా ఇప్పటి వరకూ ఆ దిశగా కృషి చేయలేదు. తిరుపతి సదస్సులో జిల్లా నుంచి 16 ప్రాజెక్టులు ప్రదర్శించిన విద్యార్థులకు ఏ విధమైన ప్రయోజనాలను కల్పించలేదు. జిల్లాలో 3,338 ప్రాథమిక, 387 ప్రాథమికోన్నత, 559 ఉన్నత పాఠశాలలున్నాయి. వాటిలో తగిన విధంగా ల్యాబ్‌లు, సిబ్బంది లేరు. సమస్యలన్నీ సామాన్యులకే.. టెక్నాలజీ వినియోగం వల్ల రేషన్‌లో పది శాతం, పెన్షన్లలో ఐదు శాతం, స్కాలర్‌షిప్‌లలో 20 శాతం నిధులు ఆదా అయ్యాయని సీఎం చంద్రబాబు ఓ సందర్భంగా ప్రకటించారు. దీనిని బట్టి సాంకేతిక కారణాలతో పేద, మధ్య తరగతి ప్రజలు పథకాల లబ్ధిలో ఎలా దూరమవుతున్నారో అర్థమవుతుంది. నగదు కష్టాలు నేటికీ వెంటాడుతూనే ఉన్నాయి. సంపన్నులు నల్లధనాన్ని చట్టబద్ధం చేసుకున్నారు. టెక్నాలజీ మానవ మేధస్సు నుంచి ఉత్పన్నమైంది. అది కచ్చితంగా ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చేదిగా ఉండాలి. ఆ దిశగా ప్రభుత్వాధినేతలు ఆలోచన చేసి సామాన్యులకు సైతం సాయమందించేలా కృషి చేయాల్సి ఉంది. -
ధరిత్రికి పూర్వవైభవం తెద్దాం
పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి రామయ్య పెద్దాపురం: ప్రతి ఒక్కరితో మొక్కలు నాటించి ధరిత్రికి పూర్వ వైభవం తీసుకువద్దామని వృక్ష రక్షకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి రామయ్య అన్నారు. ధరిత్రి పరిరక్షణలో భాగంగా కోటి మొక్కలు నాటి రామయ్య అందరికీ ఆదర్శంగా నిలిచారు. పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో డైరెక్టర్ సిహెచ్.విజయ్ ప్రకాష్ అ«ధ్యక్షతన శనివారం ధరిత్రీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు మాదిరిగా నేటి మొక్కలే రేపటి వృక్షాలన్నారు. ప్రతి విద్యార్థీ మొక్కలు నాటి ప్రాణవాయువును సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విజయ్‌ప్రకాష్ మాట్లాడుతూ రామయ్య విద్యలో అంతంత మాత్రమైనప్పటికీ కోటి మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. అనంతరం రామయ్య దంపతులను ఘనంగా సన్మానించారు. ఒడిస్సీ నృత్య కళాకారిణి రాధాగోపాల్ వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాఠశాల డీన్ రాజేశ్వరి, ఆధ్యాపక బృందం, లైజాన్ ఆఫీసర్ ఎం. సతీష్, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. -
రేపు తెలుగు నాటక రంగ దినోత్సవం
కాకినాడ కల్చరల్ : స్థానిక దంటు కళాక్షేత్రంలో ది యంగ్మె¯Œ్స హ్యాపీ క్లబ్ ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఆదివారం సాయంత్రం తెలుగు నాటక రంగ దినోత్సవ సభ నిర్వహించనున్నట్టు క్లబ్ నిర్వాహకులు తెలిపారు. ఈ సభలో ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత, ప్రయోక్త, గాయకుడు కెర్ల వెంకటేశ్వరరావు(విశాఖపట్టణం)కు క్లబ్ వ్యవస్థాపకుడు స్వర్గీయ దంటు సూర్యారావు స్మారక జీవితకాల నట పురస్కారం ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ హాజరవుతారని తెలిపారు. -
ఆరోగ్యం కోసం వ్యాయామం
కాకినాడ వైద్యం : సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ వ్యాయామంతో పాటూ పౌష్టికాహారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మానసిక కుంగుబాటుపై మాట్లాడుకుందామంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుçపందుకుని కుటుంబ సభ్యులందరూ కూర్చొని చర్చించుకోవాలన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో పని ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఎదురవుతోన్న ఒత్తిడులతో పలు రకాల మానసిక రుగ్మతలకు గురవుతున్నారన్నారు. మానసిక,శారీరక రుగ్మతల బారి నుంచి బయటపడేందుకు ఒకరికొకరు పరస్పరం మాట్లాడుకోవడం ద్వారా అనారోగ్యాల సమస్యను అధిగమించవచ్చన్నారు. ఒక క్రమ పద్ధతిలో ఆహారం తీసుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యానికి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని కోరారు. మంచి ఆరోగ్యం కోసం తగినంత విశ్రాంతి, నిద్ర తప్పనిసరన్నారు. ఆత్మన్యూనతా భావంతో బాధపడేవారికి కౌన్సిలింగ్ ఎంతగానో దోహదపడుతుందని జాయింట్ కలెక్టర్–2 రాధాకృష్ణమూర్తి తెలిపారు. జన్యుపర, రసాయన కారణాలతో ఆత్మన్యూనత భావం రావచ్చని డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రయ్య తెలిపారు. యోగా,«« ధ్యానంతో పని ఒత్తిడి, ఆందోళనల నుంచి బయటపడొచ్చన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డిసుబ్రహ్మణ్యం తెలిపారు. ముత్తానగర్‌లో సీహెచ్‌సీలో శుక్రవారం ప్రపంచ ఆరోగ్యదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్యకేంద్రాన్ని సీఎం చంద్రబాబు విజయవాడలో ప్రారంభించారు. ఇక్కడ రెడ్డి సుబ్రహ్మణ్యంతోపాటూ జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్, సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఈ–యుపీహెచ్‌సీలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలో ఉన్న ఈ–యుపీహెచ్సీల్లో ప్రతిభ కనబరచిన కిర్లంపూడి, నగరం పీహెచ్‌సీలకు, నగరం, బలబద్రపురం సబ్సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బందికి ఏపీ శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావులు బహుమతులు పంపిణీ చేశారు. చంద్రన్న బీమాపై సమీక్ష కాకినాడ సిటీ : అలసత్వం లేకుండా బీమా క్లైమ్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో చంద్రన్న బీమా అమలుపై జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రాంతాల వారీగా సమీక్షిస్తూ గిరిజన ప్రాంతంలో 72 క్లైమ్లు పెండింగ్‌లో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రన్న బీమా అమలు తేదీ 2016 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు 4,417 మరణాలు కాల్ సెంటర్లో నమోదయ్యాయని డీఆర్డీఏ పీడీ మల్లిబాబు వివరించారు. వీటిలో 48 పాలసీలు అర్హత లేనివిగా పరిగణించి మిగిలిన 4,369 రిజిస్టర్ చేశామన్నారు. 3,951 క్లైమ్లు ఇన్సూరెన్స్ కంపెనీకి ఆన్లైన్లో అప్లోడ్ చేశామని తెలిపారు. మిగిలిన 415 క్లైమ్ల్లో 93 యాక్సిడెంటల్, 322 నార్మల్ క్లైమ్లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. బీమా విషయంలో జిల్లా 8వ స్థానంలో ఉందని ప్రథమ స్ధానంలోకి తీసుకురావాలని ఆదేశించారు. డిజిధన్ మేళాలపై సమీక్ష కాకినాడ సిటీ : జిల్లా వ్యాప్తంగా అంబేడ్కర్ జయంతిని పురసరించుకుని డిజిధన్మేళాల నిర్వహణ కార్యాచరణపై శుక్రవారం కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా అధికారులు, బ్యాంకర్లతో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ సమీక్షించారు. 14వ తేదీ మధ్యాహ్నం 2గంటల నుంచి డిజిధన్ మేళాలను నిర్వహించాలని, సాయంత్రం 4గంటలకు ప్రధానమంత్రి ప్రసంగం లైవ్‌టెలీకాస్ట్ జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహణకు అనువైన ఆడిటోరియం గుర్తించాలని, సభాస్థలి వద్ద బ్యాంకులు, నగదురహిత లావాదేవీలు నిర్వహిస్తున్న ప్రభుత్వ శాఖలు ప్రజలకు అవగాహన కల్పించే స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎల్డీఎం సుబ్రహ్మణ్యం, డీఆర్డీఏ పీడీ మల్లిబాబు, ఆర్డీవో రఘుబాబు, డీఎస్వో రవికిరణ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పోస్ట్ పెయిడ్ యూజర్స్‌కి ఐడియా సూపర్ ఆఫర్
న్యూఢిల్లీ: దేశీయ టెలికాం సంస్థ ఐడియా సెల్యులర్ శుక్రవారం కొత్త ఆఫర్ ప్రకటించింది. పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్లను పరిచయం చేసింది. దీని ప్రకారం 4జీ మొబైల్ వినియోగదారులకు రోజుకి 1జీబీ 4జీ డాటాను అందించనుంది. లిమిటెడ్ రెంటెడ్ ప్లాన్స్‌లో ప్రీ పెయిడ్ వినియోగదారులందరికీ ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నట్టు చెప్పింది. కొత్త ఐడియా ప్యాక్స్ రూ.199 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త పథకం ప్రకారం రూ.499 ఆ పైన ప్లాన్‌లో రూ.300 విలువైన డేటా సేవలు ఉచితమని కంపెనీ చెబుతోంది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం రూ.349- రూ.498లమధ్య రెంటల్ ప్లాన్ లో రూ.50 డిస్కౌంట్. అలాగే రూ.149-రూ.349 రెంటల్ ప్లాన్‌పై సబ్‌స్క్రైబ్ అయిన ఖాతాదారులకు రూ.100 డిస్కౌంట్ అందించనున్నట్టు తెలిపింది. రూ. 300 యాడ్ ఆన్ ప్యాక్‌తో రోజుకు 1 జీబీ చొప్పున నెల రోజుల పాటు 4జీ డేటాను అందించనున్నట్లు తెలిపింది. రూ. 349 లేదా అంతకంటే ఎక్కువ రెంటల్ ఉన్న పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు రూ. 50 అదనంగా చెల్లించి మూడు నెలలపాటు ఈ ఆఫర్‌ను పొందొచ్చని ఐడియా స్పష్టం చేసింది. అలాగే మూడు నెలల తరువాత మార్చి 2018 వరకు ఈ డిస్కౌంట్ ఆఫర్ పొందాలంటే రూ.199-రూ.349మధ్యప్లాన్లో అదనంగా రూ. 200, రూ.349- రూ.498 మధ్య ప్లాన్‌లో అదనంగా రూ.50 చెల్లిస్తే సరిపోతుందని ఐడియా తెలిపింది. ఏప్రిల్ 30, 2017 వరకు దీని సబ్స్క్రిప్షన్ అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్ 4జీ హ్యాండ్సెట్లకు మాత్రమే. పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు ఈ తరహా భారీప్రయోజనాల ఆఫర్ అందుబాటులోకి తీసుకు రావడం ఇదే ప్రథమమని ఐడియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్తెలిపారు. -
రోజుకి 2 జీబీ డేటా..ఎక్కడ..ఏ కంపెనీ?
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ఎంటిఎన్ఎల్ కూడా టారిఫ్ వార్ లోకి ప్రవేశించింది. తాజాగా సంస్థ దేశీయ టెలికాం దిగ్గజాల కంటే చవక ధరలో డేటా సేవలను అందించనుంది. ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే కొత్త ప్లాన్స్‌ను ప్రకటించింది. ఎంటీఎన్ఎల్ 31 వ వార్షికోత్సవం సందర్భంగా ఖాతాదారులకు తక్కువ ధరకే డాటా సేవలను అందించనుంది. ఎంటిఎన్ఎల్ వినియోగదారుల కోసం 28 రోజుల వాటిడిటీతో రూ.319 ల రీచార్జ్ పై 2 జీబీ 3జీబీ డేటాను, కోసం దాని నెట్వర్క్ లోపల అపరిమిత కాలింగ్ ఆఫర్ అందిస్తోంది. ఇతర నెట్‌వర్క్‌లకు 25 నిమిషాల ఫ్రీ కాలింగ్ సదుపాయం, ఆ తర్వాత నిమిషానికి 25 పైసలు వసూలు చేయనుంది. దేశీయ టెలికాం మేజర్లు బీఎస్ఎన్ఎల్, భారతి ఎయిర్టెల్, జియో టారిఫ్ ప్లాన్లకంటే తక్కువకే ఈ డేటా సేవలను అందిస్తోంది. అయితే ఢిల్లీ ముంబై మొబైల్ వినియోగదారులకు ప్రస్తుతం ఈ ప్లాన్ అందుబాటులో ఉన్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమోషనల్ ఆఫర్ 90 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటుందని పేర్కొంది. -
ప్రగతికి ఇంధనం..శాస్త్ర విజ్ఞానమే
-మానవాళి దశ, దిశలను మార్చిన ఆవిష్కరణలు -పాఠశాల నుంచే ప్రయోగాసక్తి వికసించాలి -నేడు జాతీయ సైన్స్ దినోత్సవం రాయవరం : మస్తిష్కాన్ని కదిలించాలి. మెదడులో రక్తం ఉరకలెత్తాలి. కళ్లు నిశితంగా పరిశీలించాలి. మనసులో జిజ్ఞాస మొదలవ్వాలి. నవతరాన్ని ఆసక్తి నుంచి ఒక ఆశయం దిశగా నడిపించాలి. ఇంతటి శక్తి కేవలం సైన్స్‌కు మాత్రమే ఉంది. విఖ్యాత భారతీయ శాస్త్రవేత్త సీవీ రామన్ తన ఆవిష్కరణ రామన్ ఎఫెక్ట్‌ను ఫిబ్రవరి 28న కనుగొన్నారు. ఏటా ఆ రోజునే జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో శాస్త్ర పరిశోధనల పట్ల జిజ్ఞాస పెరిగేలా చేయాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ప్రశ్నలే పురోగతికి నాంది ‘ఏమిటి? ఎందుకు? ఎలా?’ అనే ప్రశ్నలు ఎన్నో విప్లవాత్మక మార్పులకు, ప్రయోగాలకు, మానవ జీవనశైలిని మార్చడానికి దోహదపడ్డాయి. నేటి విద్యార్థుల్లో పరిశీలన, పరిశోధనాసక్తి తగ్గిపోతున్నాయి. పుస్తకాలతో కుస్తీ పడుతూ, మార్కుల వేటలో తీరిక లేని వారిగా మారిపోతున్నారు. విద్యార్థుల్లో పరిశోధనాసక్తిని పెంపొందించేందుకు ప్రతి పాఠశాల ప్రయోగశాలగా మారాలి. ప్రతి అంశాన్నీ అనుభవ పూర్వకంగా చిన్నారులకు వివరించాలి. విని తెలుసుకున్న వాటి కంటే ప్రత్యక్షంగా, అనుభవ పూర్వకంగా తెలుసుకోవడం చిన్నారుల మెదడుల్లో చెరగని ముద్ర వేస్తుంది. శాస్త్ర అంశాలను సులభంగా వారి మనసుల్లో నాటుకోవడానికి సహకరిస్తుంది. అరకొర వసతులు పాఠశాల స్థాయి నుంచి సైన్స్ బోధనలో పరికరాల వినియోగం తక్కువగా ఉంటుంది. దీని వల్ల ఉన్నత తరగతులకు వెళ్లిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. గత కొన్నేళ్లుగా సర్వశిక్షాభియాన్ ద్వారా పాఠశాలల్లో సైన్స్ పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరవుతున్నా.. అవి పూర్తి స్థాయిలో సరిపోవడం లేదనే విమర్శలున్నాయి. ఈ విమర్శలు నిజమేనన్నట్లుగా చాలా పాఠశాలల్లోని ప్రయోగశాలల్లో అరకొర వసతులున్నాయి. జిల్లాలో 3,300 ప్రాథమిక, 414 ప్రాథమికోన్నత, 548 వరకు ఉన్నత పాఠశాలలున్నాయి. చాలా పాఠశాలల్లో ప్రయోగాలకు ఉండాల్సిన కనీస సౌకర్యాలు కూడా ఉండక పోవడం శోచనీయమని పలువురు పేర్కొంటున్నారు. చాలా మంది విద్యార్థులకు ప్రయోగశాలలో వినియోగించే పరికరాల పేర్లు కూడా తెలియక పోవడాన్ని బట్టి ప్రయోగాలు ఏ స్థాయిలో నిర్వహిస్తున్నారో అర్థమవుతుంది. పాఠశాలల్లో ప్రయోగాలు చేయడానికి రసాయన పదార్థాలు, పరికరాలు పూర్తి స్థాయిలో ఉండక పోవడం, ల్యాబ్‌కు ప్రత్యేకించి గదులు లేక పోవడం విచారించదగ్గ విషయంగా పలువురు పేర్కొంటున్నారు. ఈ మూడు లక్షణాలూ ప్రధానం.. బోధన, అభ్యసనం, పరిశోధన ఉపాధ్యాయులకు, పరిశోధకులకు ఉండవలసిన మూడు ప్రధాన లక్షణాలు. బోధన ద్వారా తెలిసిన అంశాలను ఇతరులకు చెప్పడం, అభ్యసనం ద్వారా నూతన జ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పరిశోధన ద్వారా నూతన ఆవిష్కరణలకు ప్రాణం పోయడం జరుగుతుంది. వీటిలో ప్రధానమైనది పరిశోధన. ఈ రంగంలో రాణించాలనుకునే వారికి ప్రత్యేక శిక్షణ ఎంతో అవసరం. సందేహాల నుంచి సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయాలి. నూతన ఆవిష్కరణలకు బీజం వేయాలి. సాంకేతిక రంగంలో అభివృద్ధి సాధించినా..వైజ్ఞానికపరంగా అభివృద్ధి చెందడం లేదని పలువురు భావిస్తున్నారు. 1930లో సర్ సీవీ రామన్ నోబెల్ బహుమతి పొందిన తర్వాత తిరిగి దేశంలో సైన్స్ రంగంలో భారతీయులకు నోబెల్ బహుమతి లభించక పోవడం బాధాకరమని పలువురు సైన్స్ అభిమానులు భావిస్తున్నారు. ఏడాదికి రూ.100 కోట్లు ఇస్తే.. నోబెల్ బహుమతి సాధించిన విద్యార్థులకు ఏడాదికి రూ.100 కోట్లు ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. అయితే నోబెల్ బహుమతి సాధించిన తర్వాత ఇవ్వడం కాదని, ఏడాదికి రూ.100 కోట్లు ఇస్తే పాఠశాలల్లో ల్యాబ్స్ ఎంతో అభివృద్ధి చెందుతాయని ఉపాధ్యాయ సంఘ నేతలు పేర్కొంటున్నారు. అప్పుడు ఎంతో మంది శాస్త్రవేత్తలు తయారవుతారన్నది నిర్వివాదాంశమని పేర్కొంటున్నారు. శాస్త్రీయ దృక్పథం పెంచాలి.. సైన్స్ ప్రధాన ఉద్దేశం మూఢ నమ్మకాలను పారదోలి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించడం. సమాజంలో నిత్యం ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను చూపడం. – కె.శ్రీకృష్ణసాయి, జనవిజ్ఞాన వేదిక సైన్స్ అండ్ టెక్నాలజీ జిల్లా కన్వీనర్ (26ఎండీపీ126ఎ) చిన్నతనం నుంచే ఆసక్తిని పెంచాలి.. విద్యార్థి దశ నుంచే సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించాలి. ముఖ్యంగా చిన్న చిన్న ప్రయోగాలను విద్యార్థులతో చేయిస్తే వారిలో పరిశోధన పట్ల మక్కువ పెరుగుతుంది. ప్రశ్నించేతత్వమే పరిశోధనలకు పునాది. – కేసరి శ్రీనివాసరావు, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త పాఠశాల ప్రయోగశాల కావాలి.. ప్రతి వ్యక్తి జీవనానికీ అవసరమైన పునాది పాఠశాలలోనే ప్రారంభమవుతుంది. ఈ దశ నుంచే ప్రతి విద్యార్థినీ భవిష్యత్ ఆవిష్కరణలు చేసేలా ప్రయోగాల వైపు నడిపించడానికి ఉపాధ్యాయులు, అధ్యాపకులు కృషి చేయాలి. – జి.వసంత్‌కుమార్, జిల్లా సైన్స్ అధికారి -
వార్షిక సందడి సరే..నిధుల మాటేమిటి?
వార్షికోత్సవాలు నిర్వహించాలని ఆదేశాలు నిధులు ఇవ్వని సర్వశిక్షాఅభియాన్ రాయవరం (మండపేట) : ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని ప్రజాప్రతినిధులు, అధికారులు సూచిస్తున్నారు. అందులో భాగంగానే ప్రైవేటు పాఠశాలల మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలల్లో వార్షికోత్సవాలను నిర్వహించాలని ఆదేశాలు ఇస్తున్నారు. వార్షికోత్సవాలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఉండే నైపుణ్యాలను వెలికి తీయడంతో పాటు పాఠశాలలకు విద్యార్థులను ఆకర్షించడం దీని ఉద్దేశం. అయితే వార్షికోత్సవాలకు తగినన్ని నిధులు మంజూరు చేయకుండా ఎలా నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ప్రారంభమైన సందడి ప్రస్తుత విద్యా సంవత్సరం మార్చి 20తో ముగుస్తున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో వార్షికోత్సవాలను ఫిబ్రవరిలోనే ముగించాలని అధికారులు సూచిస్తున్నారు. అందుకనుగుణంగా వార్షికోత్సవాలను నిర్వహించేందుకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రజాప్రతినిధులను, పూర్వ విద్యార్థులను ఆహ్వానించాలి. విద్యార్థుల తల్లిదండ్రులను, మండల స్థాయి అధికారులను, ప్రైవేటు స్కూళ్లకి వెళ్లి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించాలి. విద్యార్థులకు వక్తృత్వం, వ్యాసరచన, క్విజ్, చిత్రలేఖనం వంటి పోటీలతో పాటు ఆటల పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేయాలి. వార్షికోత్సవంలో పాఠశాల ప్రగతిని ఉపాధ్యాయులు వివరిస్తే, విద్యార్థుల అనుభవాలు వివరించాల్సి ఉంటుంది. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆహుతుల సమక్షంలో ప్రదర్శించాలి. అలాగే ఆయా పాఠశాలల్లో చదివి ఉన్నత ఉద్యోగాలు, పదవుల్లో, మంచి స్థితిలో ఉన్న వారిని, దాతలను ఆహ్వానించి సత్కరించాలి. నిర్వహణ ఎలా.. ఎంత తక్కువలో నిర్వహించాలన్నా వార్షికోత్సవానికి రూ.వేలల్లోనే ఖర్చవుతుందన్నది బహిరంగ రహస్యం. పాఠశాల వార్షికోత్సవాలకు సర్వశిక్షాఅభియాన్ గతేడాది 50లోపు విద్యార్థులున్న పాఠశాలకు రూ.500, 50-100లోపు విద్యార్థులున్న పాఠశాలలకు రూ.800 వంతున విడుదల చేసింది. ఈ ఏడాది కూడా వార్షికోత్సవాలకు నిధులు మంజూరు చేస్తారని భావించినా ఇప్పటి వరకు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం ఉన్న ఖర్చుల దృష్ట్యా పాఠశాలకు రూ.2 వేల వంతున విడుదల చేస్తే వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. జిల్లాలో 3,300 ప్రాథమిక, 414 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో వార్షికోత్సవాల సందడి నెలకొంది. చర్యలు తీసుకుంటాం.. పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికి తీయాలి. పాఠశాలల వార్షికోత్సవాలకు నిధులు మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. - మేకా శేషగిరి, పీవో, సర్వశిక్షాఅభియాన్, కాకినాడ -
అమ్మ భాషకు ఊపిరిపోద్దాం
నన్నయలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రాజ రాజనరేంద్రనగర్ (రాజానగరం) : జన్మనిచ్చిన తల్లిని, మాటలు నేర్పిన మాతృ భాషను ప్రతి ఒక్కరూ జీవితాంతం గుర్తుంచుకోవాలని, అవే మన మనుగడకు మార్గాలవుతాయని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం. ముత్యాలునాయుడు అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉభయ గోదావరి జిల్లాల కవులు, రచయితల సాహిత్య సమ్మేళనాన్ని మంగళవారం ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అమ్మ భాష గొప్పదనం, అమ్మ భాష కమ్మదనం తెలుగు భాషకు ఉందంటూ ఎందరో కవులు లిఖించిన వర్ణణలను ఉటంకిస్తూ ప్రపంచ భాషలో ఆ మాధుర్యం ఒక్క తెలుగులోనే దొరుకుతుందన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స’గా వర్ధిల్లిన మాతృభాష అంతరించిపోతున్న భాషల్లో చేరడం నిజంగా దురదృష్టకరమన్నారు. మాతృభాష పరిరక్షణకు కవులు, రచయితలు తమ కలాలను, గళాలను విప్పాల్సి ఉందని విశిష్ట అతిథి స్పెయిన్ రచయిత, ప్రీలాన్స్ జర్నలిస్టు ఫోటోగ్రాఫర్ అశోక్ బీర అన్నారు. పాశ్చాత్య దేశాలలో మాతృభాషలకు అధిక ప్రాధాన్యం ఇస్తారని, వారి విద్యా బోధన ఆయా భాషల్లోనే జరుగుతుందన్నారు. మరో విశిష్ట అతిథి, సీనియర్ జర్నలిస్టు యడవల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పత్రికలు కూడా ఆంగ్ల పదాలకు తగ్గించి, తెలుగు పదాల వాడకం పెంచాలన్నారు. పాలన, బోధన, జనజీవన రంగాలలో తెలుగు భాషను కచ్చితంగా అమలు చేయాలని తెలుగు భాష రక్షణ వేధిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అన్నారు. తెలుగు భాషకు సీపీ బ్రౌన్ చేసిన కృషిని నన్నయ రిజిస్ట్రార్ ఆచార్య ఎ.నరసింహరావు గుర్తు›చేశారు. అమ్మ, అమ్మ భాషను మరిచిపోతే సమాజం మనుగడను కూడా కోల్పోతుందని సదస్సు సంచాలకులు డాక్టర్ తరపట్ల సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. అమలాపురం, కాకినాడ, రాజోలు, రామచంద్రాపురం, పాలకొల్లు, భీమవరంలలో కూడా సదస్సులు నిర్వహిస్తామన్నారు. తీర్మానాలు.. ప్రాథమిక స్థాయి నుంచి తెలుగులో విద్యా బోధన జరగాలని, పాఠశాల నుంచి కళాశాల వరకు విధిగా తెలుగు భాషను అమలు చేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో సదస్సు కోకన్వీనర్ డాక్టర్ ఆర్. జానకీరావు, కోఆర్డినేటర్స్ డాక్టర్ నిట్టల కిరణ్‌చంద్ర, డాక్టర్ పి.లక్ష్మీనారాయణ, డాక్టర్ డి.లక్ష్మీనరసమ్మ, డాక్టర్ జి.ఎలీషాబాబు, విద్యార్థులతోపాటు కళాసాహితీ, రమ్య సాహితీ, నన్నయ వాజ్మయపీఠం, స్ఫూర్తి, కళాస్రవంతి, సీపీ బ్రౌన్ సేవాసమితి, సహృదయ సాహితీ, దళిత చైతన్య వేదిక, వంటి 16 సాహితీ సంస్థలు పాల్గొన్నాయి. ఆయా రంగాలలో పేరుగడించిన స్పెయిన్ రచయిత, ప్రీలాన్స్ జర్నలిస్టు ఫొటోగ్రాఫర్ అశోక్ బీర, సీనియర్ జర్నలిస్టు యడవల్లి శ్రీనివాస్, తెలుగు భాష రక్షణ వేధిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తిమండ ప్రతాప్‌లను సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. రసరమ్యంగా సాగిన కవి సమ్మేళనం అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో డాక్టర్ కడిమళ్ల శతావధాని, గిడ్డి సుబ్బారావు, జోరశర్మ, దడ్డ దైవెజ, వీడుల శిరీష, డాక్టర్ గిరినాయుడు, గడల, డాక్టర్ రెంటాల, ఎంఆర్వి సత్యనారాయణమూర్తి, గనార, గరికిపాటి మాస్టారు, మద్దల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. మాతృభాష పరిరక్షణపై జరుగుతున్న సదస్సులు, పర్యావరణం, నగదు రహిత లావాదేవీలు, ఆడపిల్లలపై జరుగుతున్న అరాచకాలు తదితర అంశాలపై విమర్శలు, ఎత్తిపొడుపులు, పొగడ్తలు ఇలా తమదైన శైలిలో కవులు వ్యంగ, హాస్య, చమత్కార భాణాలను వదులుతూ ఆద్యంతం ఆకట్టుకున్నారు. -
ఆర్ట్స్ కళాశాల తొలి గ్రాడ్యుయేషన్ డే
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : ఆర్ట్స్ కళాశాల తొలి గ్రాడ్యుయేష¯ŒS డే త్వరలో జరగనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి చెంది 164 ఏⶠ్ల చరిత్రగల కళాశాల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది ప్రముఖులను తయారుచేసిందని, ఈ కళాశాలలో మరికొద్ది రోజుల్లో ఈ దినోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.డేవిడ్కుమార్స్వామి మంగళవారం తెలిపారు. ఆదికవి నన్నయ వర్సిటీ నుంచి మొదటి, రెండో బ్యాచ్‌గా డిగ్రీ పట్టా పొందే విద్యార్థులకు పట్టాల పంపిణీ జరుగుతుందన్నారు. అలాగే 2012–13 విద్యా సంవత్సరంలో ప్రవేశం పొంది 2015లో డిగ్రీ పూర్తిచేసిన వారు, 2013–14లో డిగ్రీ ప్రవేశం పొంది 2016లో డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు దీనికి దరఖాస్తుచేసుకోవాలన్నారు. దరఖాస్తులను డబ్లు్యడబ్లు్యడబ్లు్య.జీసీఆర్జేవై.ఏసీ.ఇ¯ŒS అనే వెబ్సైట్ నుంచి డౌ¯ŒSలోడ్ చేసుకోవాలన్నారు. పూర్తిచేసిన దరఖాస్తులను ఈ నెల 22వ తేదీలోగా అందజేయాలన్నారు. -
జిల్లా అభివృద్ధికి పునరంకితం కావాలి
గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ అరుణ్‌కుమార్ కాకినాడ సిటీ : సమైక్యత, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో 68వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాస్థాయి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్, ఎన్సీసీ దళాలు నిర్వహించిన సంప్రదాయ కవాతును తిలకించి, గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ఈ ఏడాది కొత్తగా మూడు వేల ఎకరాల ఉద్యాన భూములకు మైక్రో ఇరిగేషన్ వసతులను విస్తరిస్తున్నామని తెలిపారు. కోడిగుడ్ల ఉత్పత్తిలో జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా, సాలీనా 2 లక్షల టన్నుల ఉత్పత్తులతో రాష్ట్ర మత్స్యరంగంలో నాల్గో స్థానంలో నిలిచిందన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలకు ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.81 కోట్లు వడ్డీ రాయితీ జమ చేశామని, రుణమాఫీ పథకం రెండో విడతగా రూ.258 కోట్ల పెట్టుబడి నిధిని 8 లక్షల 60 వేల మంది సభ్యులకు పసుపు–కుంకుమలుగా పంపిణీ చేశామన్నారు. ప్రతిష్టాత్మక పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరు పరిధిలో 67 వేల హెక్టార్లు, పిఠాపురం బ్రాంచి కాలువ పరిధిలో 20 వేల హెక్టార్లు ఆయకట్టు స్థిరీకరణలోకి రానుందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.367 కోట్ల వ్యయంతో కోటి 39 లక్షల మందికి ఉపాధి కల్పించామన్నారు. ఎన్.టి.ఆర్. గృహ నిర్మాణ పథకం కింద 24 వేల గృహాలు నిర్మాణం, 17 వేల ఇళ్ళకు మరమ్మతులు చేపట్టామన్నారు. రానున్న రెండేళ్ళలో 600 పాఠశాలల్లో 1200 డిజిటల్ తరగతి గదులు ప్రారంభిస్తున్నామని, 370 ఆదర్శ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన ప్రవేశపెట్టామన్నారు.ఈ సంవత్సరం 96 కోట్ల నిధులతో షెడ్యూల్డ్ కులాలకు, రూ.6.62 కోట్ల నిధులతో షెడ్యూల్డ్ తెగలకు, రూ.44 కోట్ల నిధులతో విభిన్న ప్రతిభావంతులకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా రూ.162 కోట్ల నిధులతో రక్షిత తాగునీటి పథకాల నిర్మాణం, రూ.485 కోట్ల నిధులతో ఆర్అండ్బి రహదారుల అభివృద్ధి, రూ.325 కోట్ల నిధులతో పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధి, రూ.126 కోట్ల నిధులతో విద్యుత్ సరఫరా విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో వినూత్నంగా చేపట్టిన అంశాలు జిల్లాలో నగదు రహిత లావాదేవీల విస్తరణ, పర్యాటక అభివృద్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎన్.రవిప్రకాష్, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం వేడుకలకు హాజరైన స్వాతంత్య్ర సమరయోధుడు 98 ఏళ్ళ చోడిపల్లి హనుమంతరావును జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్, జెడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు ఘనంగా సత్కరించారు. సంక్షేమాలు, ఆస్తుల పంపిణీ... గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా ఆరు ప్రభుత్వశాఖల ఆధ్వర్యంలో 1,788 మంది లబ్ధిదారులకు రూ.55 కోట్ల 30 లక్షలు విలువైన ఆస్తులు, ఉపకరణాలను కలెక్టర్ పంపిణీ చేశారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ సమగ్రత పెల్లుబికింది. దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే నృత్యాలు, దేశభక్తిని ప్రబోధించే గీతాలు, జిల్లా ప్రగతిని చాటిచెప్పే శకటాలు, ఒళ్లు గగుర్పొడిచే సాహస నృత్యాలు, ఆహుతులను కట్టిపడేశాయి. వివిధ శాఖలు, సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లు సందడితో గురువారం జిల్లా కేంద్రం కాకినాడ పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన 68వ గణతంత్ర వేడుకలు కనువిందు చేశాయి. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగిన ఈ ఉత్సవాల్లో జిల్లాలోని వివిధ పాఠశాలకు చెందిన రెండు వేల మంది విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. వేడుకల్లో 8 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని తమ నృత్యప్రదర్శనలతో అలరించారు. భరత ఖండమే నాదేశం.. అంటూ కాకినాడ ఎంఎస్ఎన్ ఎయిడెడ్ హైస్కూల్ జగన్నాథపురం, గణతంత్రానికి శుభోదయం.. అంటూ జెడ్పీహెచ్ తూరంగి పేట, వందేమాతరం... అంటూ జెడ్పీహెచ్ పవర, ఇండియా వాలే..అంటూ ఉమామనోవికాసం కేంద్రం మానసిక దివ్యాంగులు, సత్యమేవజయతే.. అంటూ జెడ్పీహెచ్ ఇంద్రపాలెం, క్విట్ ఇండియా.. అంటూ సెయింటాన్ ఎయిడెడ్ స్కూల్ జగన్నాథపురం, జయహో.. అంటూ నారాయణ ఇంగ్లిష్ మీడియం స్కూల్ రామారావుపేట, మేరాభారత్ మహా.. అంటూ గమ్యం స్కూల్ జి.మామిడాడ విద్యార్ధినీ,విద్యార్ధులు నృత్యప్రదర్శనలు ఇచ్చారు. -
ప్రశాంతంగా రెండో రోజు దేహదారుఢ్య పరీక్షలు
కాకినాడ క్రైం : పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి శారీరక దేహదారుఢ్య పరీక్షలు బుధవారం రెండోరోజు కాకినాడ పోలీస్ పెరేడ్ మైదానంలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో ప్రశాంతంగా జరిగాయి. తొలిరోజు నిర్వహించిన శారీరక పరీక్షల్లో 407 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ఏఎస్పీ తెలిపారు. రెండో రోజు జరిగిన పోటీలకు వెయ్యి మంది హాజరు కావాల్సి ఉండగా, 708 మంది పాల్గొన్నారన్నారు. ఈ పరీక్షలకు వచ్చే అభ్యర్థులు తప్పనిసరిగా నెట్లో డౌన్లోడ్ చేసుకున్న స్టేజ్–1, స్టేజ్–2 ఫార్మేట్లను వెంట తీసుకురావాలని ఆదేశించారు. వాటిని వెంట తీసుకురాకపోవడం వల్ల ఒరిజినల్ పత్రాల వెరిఫికేషన్ ప్రక్రియ జాప్యం అవుతుందన్నారు. తొలిరోజు ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ మెజర్మెంట్ విభాగాల్లో నిర్వహించిన ఈవెంట్లలో జరిగిన జాప్యాన్ని పరిగణన లోకి తీసుకోకుండా రెండోరోజు ఎటువంటి జాప్యం జరక్కుండా జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిర్ణీత సమయంలో దేహదారుఢ్య పరీక్షలు జరగడంతో అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు. -
వనసీమకు నవవసంతంలా
పొదల మాటున మాటేసి లంఘించి, కబళించే పెద్దపులుల్లా.. కారణం తెలీకుండానే ప్రాణాల్ని గాలిలో కలిపేస్తున్న వ్యాధులు; కనీస పోషకాహారం కూడా అందని దుస్థితి; ‘పోలవరం’ కోసం చేసిన త్యాగాలతో శాపగ్రస్తమైన బతుకులు.. ఇదీ జిల్లాలో విలీనమైన మండలాల్లో అడవిబిడ్డల దయనీయ జీవనచిత్రం. వారి ఆక్రందనతో కొండకోనలు మార్మోగుతున్నా.. అభివృద్ధి అంటే సింగపూర్ తరహా నగర నిర్మాణమేనని నమ్మించజూసే పాలకుల చెవికి వినిపించడం లేదు. అలాంటి తరుణంలో.. కీకారణ్యాన్ని చీల్చుకువచ్చిన ఆశల పొద్దుపొడుపులా వైఎస్సార్ సీపీ అధినేత జగన్ పర్యటన.. గిరిజనుల మోముల్లో కొత్త వెలుగును నింపింది. సమస్యల కార్చిచ్చులో వేగుతున్న వారికి ఆయన తొలకరి వానలా కనిపించారు. ‘కలకాలం ఉండవులే కన్నీళ్లు.. కలతైనా, నలతైనా కొన్నాళ్లే’ అన్న కొండంత భరోసా కల్పించారు. జగన్ పర్యటన అరణ్యాన్ని జనారణ్యంగా మార్చింది. జిల్లాలోని పార్టీ శ్రేణుల్లో.. వానాకాలపు కొండవాగులా.. ఉత్సాహం పరవళ్లు తొక్కేలా చేసింది. మన్యసీమలో రెండురోజుల పర్యటనతో గిరిజనులకు భరోసానిచ్చిన వైఎస్సార్సీపీ అధినేత అడవిబిడ్డల సమస్యలు క్షుణ్నంగా తెలుసుకున్న జగన్ కన్నీళ్లు తుడిచి, రేపటిపై కొత్త ఆశలు రేకెత్తించిన జననేత దూరాభారాల్ని ఖాతరు చేయక రేఖపల్లి సభకు పోటెత్తిన జనం జిల్లాలో పార్టీ శ్రేణుల్లో పరవళ్లు తొక్కిన ఉత్సాహం సాక్షి, రాజమహేంద్రవరం : పచ్చని మన్యసీమలలో ఆనందం పరవళ్లు తొక్కింది. పోలవరం ప్రాజెక్టుతో నిరాశ్రయులవుతున్న విలీన మండలాల గిరిజనులు, అంతుచిక్కని వ్యాధులతో మృత్యువాత పడుతున్న అడవి బిడ్డల మోముల్లో తమకు భరోసాగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారన్న కొండంత నమ్మకం కనిపించింది. జిల్లా పర్యటనలో చివరిదైన రెండో రోజు గురువారం జగన్ ఏజెన్సీలోని గూడేలు, గ్రామాలను సందర్శించారు. రోడ్డు పొడవునా తన కోసం వేచి ఉన్న అడవి బిడ్డలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలు తెలుకుని, పరిష్కారానికి భరోసా ఇస్తూ ముందుకు సాగారు. గురువారం ఉదయం మారేడుమిల్లి అటవీశాఖ అతిథి గృహంలో తనను కలిసేందుకు వచ్చిన ప్రజలు, విద్యార్థులతో ఫొటోలు దిగిన జగన్ వారిలో ఆనందాన్ని నింపారు. జగన్‌తో కరచాలనం చేసి, ఫొటోలు దిగిన గిరిజన విద్యార్థులు కేరింతలు కొట్టారు. అక్కడ నుంచి చింతూరుకు చేరుకున్న జగన్‌కు లక్కవరం జంక్షన్ వద్ద గిరిజనులు భారీ సంఖ్యలో ఎదురేగి ఘనస్వాగతం పలికారు. చింతూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు తమ సమ్యలను జగన్‌కు చెప్పుకుని ఊరట పొందారు. దారి పొడవునా తనను చూసేందుకు వచ్చిన వారిని పలకరించేందుకు జగన్ వాహనం ఆపి మరీ వారి వద్దకు వెళ్లి పలకరించారు. చిన్నారులను ముద్దాడి జగన్ వారి పట్ల తన ఆపేక్షను చాటారు. కూనవరంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాల వేసి నివాళులర్పించినప్పడు ప్రజలు కరతాళధ్వనులు చేసి సంక్షేమ విధాతపై తమ గుండెళ్లో చెక్కుచెదరని అభిమానాన్ని చాటుకున్నారు. శబరి బ్రిడ్జిపై జనఝరి వీఆర్ పురం మండలం రేఖపల్లి బహిరంగ సభకు జగన్‌ను ఆహ్వానించేందుకు పోలవరం నిర్వాసిత గ్రామాల ప్రజలు శబరి బ్రిడ్జి వద్దకు పోటెత్తారు. అరకిలోమీటర ు ఉన్న ఆ వంతెనపై ఇసుక వేస్తే రాలనంతగా జనం గూమిగూడారు. గిరిజన సాంప్రదాయ నృత్యాలు, కొమ్ము కోయ నృత్యంతో గిరిజన మహిళలు, పురుషులు జననేతకు సాదర స్వాగతం పలికారు. పలువురు మహిళలు వైఎస్ చిత్రపటాన్ని చేతపట్టుకుని జగన్ కోసం ఎదురు చూశారు. మహిళలు జగన్‌కు హారతినిచ్చి తిలకం దిద్దారు. బహిరంగసభకైతే జనం వరద వేళ అఖండగోదావరిలా పోటెత్తారు. ఏజెన్సీ నలుమూలల నుంచి వెల్లువెత్తిన గిరిజనమే కాక.. జిల్లావ్యాప్తంగా వివిధ మండలాల నుంచి తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులతో సభాస్థలి ఇసుకవేస్తే రాలనట్టు కనిపించింది. అక్కున చేర్చుకున్న పండుటాకులు బ్రిడ్జి నుంచి అశేష జనవాహిని జగన్ వెంట నడుస్తూ రేఖపల్లి చేరుకున్నారు. దారిపొడవునా వృద్ధులు, పిల్లలను పలకరిస్తూ జగన్ ముందుకు కదిలారు. ‘మాకు నీవే అండ’ అంటూ వృద్ధులు జగన్‌ను ఆప్యాయంగా హత్తుకున్నారు. నిర్వాసితులతో జరిగిన ముఖాముఖిలో తమ సమస్యల పరిష్కారానికి జగన్ భరోసా ఇవ్వడంతో ముంపుబాధితుల మోముల్లో కొత్త ఆశలు చిగురించాయి. అనంతరం గ్రామ కూడలిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించేటప్పుడు జనం జేజేలు పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతి పలుకూ పంచదార పలుకులా.. బహిరంగ సభ నాలుగు గంటలు ఆలస్యమైనా కొండకోనల్లో నుంచి వచ్చిన గిరిజనం ఆద్యంతం జగన్ ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించింది. కూనవరం, చింతూరు, ఎటపాక, వీఆర్‌పురం మండలాల నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని గిరిజన గూడేల నుంచి గిరిబిడ్డలు తరలివచ్చారు. రవాణా సౌకర్యంలేని తమ గూడేలకు రాత్రయితే వెళ్లేందుకు వీలుపడదని, అడవిదారుల్లో చలి బాధిస్తుందని తెలిసినా సాయంత్రం 5.30 గంటలకు జగన్ వెళ్లే వరకు కదలని గిరిజనుల్లో ఆయన పట్ల అచంచల విశ్వాసం కనిపించింది. తమను పట్టి పీడించే సమస్యలన్నింటికీ ఆయన విరుగుడన్న గురి వారి మోముల్లో మెరుపులా వ్యాపించింది. భారీ బందోబస్తు జగన్ పర్యటన నేపథ్యంలో ఏజెన్సీలో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. మారేడుమిల్లి నుంచి కూనవరం వరకు సీఆర్ఫీఎఫ్, స్పెషల్ పార్టీ బలగాలు పహారా కాశాయి. స్థానిక పోలీసులు జగన్ కాన్వాయ్ వెంట పరుగులు తీస్తూ, కరచాలనం కోసం తోసుకు వస్తున్న ప్రజలను అదుపు చేస్తూ పర్యటన సాఫీగా సాగేలా కృషి చేశారు. -
సాయుధ దళాల సేవలు జాతి మరువదు
జేసీ సత్యనారాయణ కాకినాడ క్రైం: దేశ భద్రత కోసం సాయుధ దళాలు చేస్తున్న వీరోచిత సేవలు జాతి ఎన్నటికీ మరువదని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.సత్యనారాయణ తెలిపారు. సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని çపురస్కరించుకుని జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ జెడ్పీ సెంటర్లో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద çపూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశరక్షణలో ఎంతోమంది వీరజవానులు తమ ప్రాణాలనుసైతం పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారన్నారు. ప్రజల కోసం, దేశం కోసం పనిచేస్తున్న సాయుధ దళాలు, అమర జవానుల కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం అందరూ తోడ్పాటునందించాలని కోరారు. ప్రజలు ఇచ్చే విరాళాలు దేశరక్షణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, మాజీ సైనికులు, వితంతువుల సంక్షేమం కోసం వెచ్చిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా సాయుధ దళాల సిబ్బంది, కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం విద్యార్థులు, సిబ్బంది జోలె పట్టి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఎయిర్‌ఫోర్స్ అధికారి కపుల్ ఎస్కే యాదవ్, కేడెడ్ సార్జంట్ ఎస్.సాయిచరణ్రాజ్, కాకినాడ ఆర్డీవో అంబేడ్కర్, విశ్రాంత సైనికోద్యోగుల హెల్ప్‌లైన్ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఏ.శంకరరావు, ఏ. సూర్యారావు, ఉపాధ్యక్షుడు ప్రసాద్, సంయుక్త కార్యదర్శి ఎస్.రామారావు, కోశాధికారి బి.శంకర్ పాల్గొన్నారు. -
పుస్తకం...వెన్నంటి వచ్చే నేస్తం
కష్టాల్లో ఓ దారుస్తుంది ఆత్మీయతను పంచుతుంది నేటితో ముగియనున్న పుస్తక సంబరాలు రాజమహేంద్రవరం కల్చరల్ : పుస్తకం... ప్రతి ఒక్కరికి వెన్నంటి వచ్చే నేస్తం. ఓ మంచి పుస్తకం కష్ట సమయంలో ఓదారుస్తుంది. మనసుకు సాంత్వన చేకూరుస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆత్మీయతను పంచుతుంది. ఆనంద సమయంలో మరింత ఆహ్లాదం కలిగిస్తుంది. అలాంటి అద్భుత పుస్తకాల సమాహారంగా రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బుక్ ఎగ్జిబిషన్ పుస్తక ప్రియుల మదిని దోచుకుంటోంది. నవ్యాంధ్ర పుస్తక సంబరాలు ఆదివారంతో ముగియనున్నాయి. మొదట్లో అంతంత మాత్రంగానే సందర్శకులు ఈ ప్రదర్శనను తిలకించినా, రెండు రోజులుగా వీరి సంఖ్య పెరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఆదివారం మరింతగా పుస్తకాల అమ్మకాలు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక ప్రాచీన సాహిత్యాలు... మైదానంలోని 20, 21, 22, 23, 24 నంబరు స్టాళ్లలో ఉన్న ఎమెస్కోలో వైవిధ్యభరితమైన పుస్తకాలు ఉన్నాయి. పి.వి.నరసింహారావు ‘లోపలి మనిషి’, టంగుటూరి ప్రకాశం ‘స్వీయచరిత్ర,’, నారా చంద్రబాబు నాయుడి ‘మనసులో మాట’ ఇక్కడ పది శాతం డిసౌంట్లో లభిస్తున్నాయి. కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీమహాస్వామి ఉపదేశాలు ‘అమృతవాణి’ పేరిట లభిస్తున్నాయి. దాశరథి, గాలిబ్ గీతాలు, బి.వి.ఎస్.రామారావు గోదావరి కథలు, అడవి బాపిరాజు నవలలు, వడ్డెర చండీదాస్ హిమజ్వాల, శ్రీశ్రీ అనంతం కథలు, అమరావతి కథలు, బాలసాహిత్యం..ఇలా ఎన్నో ఎన్నో పుస్తకాలు, ప్రాచీన, ఆధునిక సాహిత్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. విప్లవ శంఖం ఇదిగో.. నవ్యాంధ్ర సంబరాలు, స్టాల్ నంబరు 70, ‘విరసం’ స్టాలులో విప్లవ, వామ పక్షభావాలకు చెందిన సాహితీ గ్రంథాలు లభిస్తున్నాయి. దిగంబర కవులు, రావిశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావుల రచనలు ఇక్కడ ఉన్నాయి. కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నిర్వహించిన ప్రబుద్ధాంధ్ర పత్రికలను గ్రంథరూపంలో ఇక్కడ చూడవచ్చు. డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఈ సంకలనానికి సంపాదకత్వం వహించారు. నేటికీ పుస్తకాలపై ఆసక్తి పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో అన్ని రంగాలు అంతో, ఇంతో దెబ్బతిన్నాయి. పుస్తకాల పట్ల పాఠకుల్లో నేటికీ ఆసక్తి ఉంది. ఈ స్టాళ్ళను సందర్శించడం వల్లఏ పుస్తకం ఎక్కడ లభిస్తుంది అన్న విషయంపై అవగాహన కలుగుతుంది. - జి.జనార్దన్, ఎమెస్కో నిర్వాహకుడు ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేవు నవ్యాంధ్ర పుస్తక సంబరాలలో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. కారణాలు అందరికీ తెలిసినవే. తరుచుగా ఇటువంటి ప్రదర్శనలను నిర్వహించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. - అరసవిల్లి కృష్ణ, విరసం కార్యవర్గ సభ్యుడు -
మత్స్యకారుల సంక్షేమం వైఎస్సార్ సీపీ లక్ష్యం
వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి ఘనంగా ప్రపంచ మత్స్యకార దినోత్సవం ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) : మత్స్యకారుల అభ్యున్నతి, సంక్షేమం వైఎస్సార్ సీపీ లక్ష్యమని ఆ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తెలిపారు. స్థానిక వాటర్ వర్క్సు ఇసుక ర్యాంపు వద్ద వివిధ మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవంలో ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడారు. కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో గతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రూ.40 లక్షల విలువైన వస్తువులను అందజేశారని తెలిపారు. కోరుకొండ మండలంలో మత్స్యకారులు మృతి చెందినప్పుడు రూ.7 లక్షల ఆర్థిక సాయం అందించారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నగర కో-ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ జాంపేట మార్కెట్లో దళారుల వ్యవస్థ లేకుండా మత్స్యకారులకు అవకాశం కల్పించాలని సూచించారు. ఇతర ఇసుక ర్యాంపులలో కూడా మత్స్యకారులకు అవకాశం కల్పించాలని కోరారు. నగర మేయర్ పంతం రజనిశేషసాయి మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కల్లుగీత, చేనేత కార్మికుల మాదిరిగా మత్స్యకారులకు కూడా 55 ఏళ్లకే ఫించను మంజూరు చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ చంద్రన్న బీమా పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మత్స్యకారులు మద్యం వ్యసనానికి దూరంగా ఉండాలని క్రైం డీఎస్పీ త్రినాథరావు సూచించారు. మత్స్యకార సంఘాల అధ్యక్షులు వెలమ లక్ష్మణరావు, లక్ష్మీ ,ప్రభాకరరావు మత్స్యకారులు సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ ప్రజాప్రతినిధులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోదావరిలో లక్ష చేప, రొయ్య పిల్లలను వదిలారు. అనంతరం మత్స్యకారులకు వస్త్రదానం చేశారు. గోదావరి మాత ఫిషర్ మెన్ సంఘం, శ్రీ గోదావరి బెస్త సేండ్ అండ్ క్వారీ బోట్స్ మెన్ కో-ఆపరేటివ్ సొసైటీ, గోదావరి మాత సేండ్ అండ్ క్వారీ మహిళామత్స్య సహకారం సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఇన్నమూరి రాంబాబు, పొలసానపల్లి హనుమంతరావు, యజ్జరపు మరిడయ్య, మన కోసం సమాచార హక్కుచట్టం అధ్యక్షుడు తొంటెపు హరికృష్ణ, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రీనివాస్, న్యాయవాది వల్లూరి సురేష్, మత్స్యశాఖాధికారులు రామకృష్ణ, రమేష్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ గోపి, బండారు కోదండం తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ని నోట్లు రెడీ అవుతున్నాయో తెలుసా?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దుతో ప్రత్నామ్నాయ నగదును ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు మూడు ప్రింటింగ్ ప్రెస్ ల ద్వారా రోజుకి మిలియన్ల కొద్దీ కరెన్సీని ముద్రిస్తోంది. తద్వారా తగినంత కరెన్సీ నోట్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. ప్రధానంగా బీఆర్బీఎన్ఎంపీఎల్ (భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రయివేట్ లిమిటెడ్ ) ద్వారా (18లైన్లు) సుమారు 4కోట్లు( 40 మిలియన్ల)రూ.2 వేల నోట్లను ముద్రిస్తోంది. అలాగే బీఎన్పీ దివస్ (బ్యాంక్ నోట్ ప్రెస్ ప్రింటింగ్ ప్రెస్ (3లైన్లు) లో 90 లక్షల రూ.500 నోట్లను రడీ చేస్తున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. అలాగే నాసిక్ ప్రెస్ లోని నాలుగు లైన్ల ద్వారా సుమారు కోటి 80 లక్షల( (18మిలియన్లు) కరెన్సీ నోట్లను ముదిస్తున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నాసిక్ లోని ప్రెస్ (1లైన్) ద్వారా రోజుకు ముఖ్యంగా 50 లక్షల రూ. 20 రూపాయల నోట్ల ను ముద్రిస్తోంది. అలాగే (2లైన్లు) కోటి(10 మిలియన్ల) రూ.100 నోట్లును ముద్రిస్తోంది. తగినంత కరెన్సీ నోట్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భరోసా ఇచ్చింది. కాగా పెద్ద నోట్ల రద్దు తర్వాత వరుసగా తొమ్మిదో రోజుకూడా ప్రజల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు రద్దుచేసిన రూ. 500, రూ.1000 నోట్ల మార్పిడి పరిమితిని గురువారం రూ2వేలకు కుదించింది ప్రభుత్వం. మరోవైపు పార్లమెంట్ లో ప్రతిపక్షాల నిరసనల సెగ రేగిన సంగతి తెలిసిందే. -
నొప్పిని మరపించి..రోగికి ధైర్యాన్నిచ్చి..
శస్త్రచికిత్సలో మత్తుదే కీలకపాత్ర నేడు ప్రపంచ మత్తువైద్యుల దినోత్సవం కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : ఆపరేషన్ అనగానే రోగికి గుర్తొచ్చేది విపరీతమైన బాధ. దాన్ని పోగొట్టే ఆపరేషన్ థియేటర్లో శస్త్రచికిత్స విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించేది మత్తువైద్యులు. వారు లేని వైద్యచికిత్స అన్నదే అసలు ఊహించుకోలేనిది. అమెరికాలో ఒక రోగికి దవడలోని కణితి తొలగించే పక్రియలో మెసచూస్ట్స్ జనరల్ ఆసుపత్రిలో చరిత్రలో తొలిసారిగా 16 అక్టోబర్ 1846లో ‘ఈథర్’ అనే మత్తుమందును ఉపయోగించి శస్త్రచికిత్స చేశారు. అప్పటినుంచి ఆ రోజును ప్రపంచ మత్తువైద్యుల దినోత్సవంగా జరుపుకొంటున్నారు. బాధ లేకుండా.. మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ పూర్తిచేయడమే కాదు తర్వాత బాధ లేకుండా చూడడం మత్తు వైద్యుల బాధ్యత. అయితే.. మత్తు మందు ఇస్తే శాశ్వత కోమాలోకి వెళ్లిపోతామని, నడుం నొప్పి వస్తుందని, తర్వాత పనిచేసుకోలేని విధానం ఏర్పడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అవన్నీ కేవలం అపోహలేనని మత్తువైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ పదుల సంఖ్యలో శస్త్రచికిత్సలు, ఆపరేషన్ థియేటర్లో గంటల తరబడి పనిచేయడం కారణంగా వారు పలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. అవగాహన కార్యక్రమాలు రోగుల్లో మత్తుమందుపై ఉన్న అపోహ లు పొగొట్టేందుకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ, సుగర్, గుండెవ్యాధులు, అస్తమా, రొంప, దగ్గు, నోటిలో కట్టుడుపళ్లు, వదులు పళ్లు ఉన్నా వైద్యులకు తప్పనిసరిగా తెలియజేయాలి. జిల్లాలో అన్ని ఆస్పత్రుల్లో 200 మంది మత్తు వైద్యులు నిత్యం సేవలందిస్తున్నారు. వీరం తా రోజుకి 700 పైగా శస్త్రచికిత్సల్లో పాల్గొంటారు. ప్రాథమిక చికిత్సపై.. ప్రపంచ మత్తువైద్యుల దినోత్సవం సందర్బంగా జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా> రాజమహేంద్రవరంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్తీయలాజిస్ట్, ఐఐఈఎమ్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఆ సంస్థ స్టేట్ సెక్రటరీ డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ రెడ్డి ప్రసాద్, డాక్టర్ బ్రహ్మాజీలు పోలీస్ సిబ్బందికి ప్రాథమిక చికిత్సలో అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో చేయాల్సిన వైద్యం, సత్వర చర్యలను వివరించారు. -
రెండున సీవైఎఫ్ వార్షికోత్సవం
రాజమహేంద్రవరం రూరల్ రాజమహేంద్రవరంలోని ఆనంద్ రీజెన్సీ పందిరిహాల్లో అక్టోబర్ రెండున సాయంత్రం ఐదు గంటలకు క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్(సీవైఎఫ్) 19వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్టు సంస్థ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు రెవరెండ్ బీహెచ్‌వీ మూర్తిరాజు తెలిపారు. హౌసింగ్‌బోర్డు కాలనీలోని కర్మెల్ ప్రేయర్ సెంటర్లో సీవైఎఫ్ రాజమహేంద్రవరం డివిజన్ సమావేశం చైర్మన్ పి.రాజు అధ్యక్షతన శనివారం జరిగింది. మూర్తిరాజు మాట్లాడుతూ సీవైఎఫ్ ఆధ్వర్యంలో 18 ఏళ్లుగా సాంఘిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. సీవైఎఫ్ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం బైబిల్ టెస్టు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీవైఎఫ్ ఇంటర్నేషనల్ బోర్డు రెవరెండ్ మిస్సా విజయ్‌కుమార్, సీహెచ్ శామ్యూల్‌విక్టర్, దడాల విల్సన్, విలియమ్స్, డేవిడ్, వివిధ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కొబ్బరిలో కుదేలు
నేడు అంతర్జాతీయ కొబ్బరి దినోత్సవం అమలాపురం/ అంబాజీపేట : జిల్లా వ్యాప్తంగా 1.25 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. సుమారు లక్ష మంది రైతులు, మూడు వేల మంది వ్యాపారులు, ఐదు వేల మంది కార్మికులు, మరో పది వేల మంది కూలీలు కొబ్బరిపై ఆధారపడి ప్రత్యక్షంగా జీవనోపాధి పొందుతున్నారు. రెండు నెలల క్రితం వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.మూడు వేల వరకు పడిపోవడంతో రికార్డు స్థాయిలో రైతులు దిగుబడి సాధించినా నష్టాలు చవిచూస్తున్నారు. ప్రస్తుతం ధర రూ.3,500 నుంచి రూ.3,800 వరకు ఉన్నా కొనేవారు లేక రైతులు ఇళ్ల వద్ద.. తోటల్లో.. కళ్లాల్లో వేలాదిగా కొబ్బరి నిల్వలు పేరుకుపోయాయి. రాష్ట్రంలోని కొబ్బరి వ్యాపార కేంద్రం మన జిల్లాలోని అంబాజీపేటలో ఉంది. ఏడాదిలో ఇక్కడి కొబ్బరి వ్యాపార లావాదేవీలు రూ.400 కోట్లకు పైగా ఉంటాయని అంచనా. ఇంతటి కీలకమైన కొబ్బరి పంట ప్రస్తుతం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పక్కనే ఉన్న కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కొబ్బరి రైతులకు ఆయా ప్రభుత్వాలు, కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీడీబీ), పరిశోధనా కేంద్రాల నుంచి అందుతున్న సహాయ సహకారాలు... రాయితీల్లో పదో వంతు కూడా మన రైతులకు అందడం లేదు. రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర, కృష్ణా, చిత్తూరులో విస్తారంగా కొబ్బరి సాగు జరుగుతున్నందున కొబ్బరి అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. అందుకు ‘పంచ’ విధానాలు అమలు చేయాలని, తమకు వాటిని ఆందుబాటులోకి తీసుకురావాలని కొబ్బరి రైతులకు కోరుతున్నారు. -
అఖండ జ్యోతి మన వెలుగు
నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా... అచ్చ తెనుగు వింటే జుంటి తేనెధారలు జుర్రుకున్నంత మధురంగా ఉంటుంది. తర తరాల మన సాంస్కృతిక ప్రగతికి పట్టుగొమ్మ తెలుగు మన అమ్మభాష. వేల ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగు భాషకు ప్రాచీన హోదా గుర్తింపు ఒక లాంఛనమే. ఎందుకంటే ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’గా పేరుగాంచిన తెలుగు భాష ప్రపంచ మేధావులు మెచ్చిన అజంత భాష. ఏక వాక్యం మహా కావ్యం అన్న పద్ధతిలో బహుభాషా పండితుడు శ్రీ కష్ణదేవరాయలు ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని ఇచ్చిన కితాబు తెలుగు భాష ఔన్నత్యం భూదిగంతాలకు వ్యాపించేట్టు చేసింది. వ్యవహార భాషా ఉద్యమానికి ఆద్యుడు గిడుగు వెంకట రమణ మూర్తి జయంతి సందర్భంగా ఆగస్టు 29వ తేదీని ‘తెలుగు భాషా దినోత్సవం’గా ఆచరిస్తున్నాం. విశాఖ–కల్చరల్ : తొలి అడుగు గిడుగు ఇతిహాసాలు, పురాణాలు, ప్రామాణిక గ్రంథాలు కేవలం పండితులకు మాత్రమే అర్థమయ్యే దేవ భాష (దేవ నాగర లిపి)గా సంస్కృతానికి పెద్ద పీట వేసిన రోజుల్లో ఒక నిశ్శబ్ధ విప్లవం పుట్టింది. గ్రాంధికం స్థాయి నుంచి సామాన్యులకు సులభంగా అర్థమయ్యే విధంగా వ్యవహార భాషా ఉద్యమానికి భాషను నడిపించిన నాథుడు, ఉద్యమానికి ఆద్యుడు గిడుగు రామ్మూర్తి. తెలుగు వాడుక భాష ఉద్యమానికి పితామహుడు.పండితులకు అర్థమయ్యే గ్రాంధిక భాషలో ఉండే ప్రబంధ సాహిత్యమే సాహిత్యం అనుకునే రోజుల్ని ఆయన తిరగరాశారు. తెలుగు వచనాన్ని వాడుకభాషలోకి తీసుకొచ్చినlమహానీయుడయ్యాడు. గ్రాంధికం నుంచి వాడుక భాష వరకూ ... మనస్సులోని భావనను బహిర్గతపరచే సాధనం భాష. స్పష్టమైన ఉచ్ఛారణతో అభిప్రాయాన్ని ఎదుటివ్యక్తికి అర్థమయ్యేట్లు చెప్పగలగటమే భాషకు సార్ధకత. దాన్ని ప్రయోగాత్మకంగా రుజవు చేసి గిడుగు రామ్మూర్తి విజయం సాధించారు. భారత దేశం భిన్న సంస్కతులు, వేష, భాషలకు ఆలవాలమైనట్టే మన తెలుగు భాషకూ వేర్వేరు రూపాలున్నాయి. వ్యవహారిక భాషకు పట్టం గట్టిన రచనలు ఇబ్బడిముబ్బడిగా వచ్చి భాషను సుసంపన్నం చేశాయి. ఆ క్రమం నుంచే మాండలికాలలో రచనలు, లిపి లేని అనుబంధ భాషా కవితోద్యమాలు తెలుగుదనాన్ని సమున్నత శిఖరాలవైపు పయనింపజేశాయి. సాహితీచరిత్రలో ఎందరో మహారధులు సాహితీ చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ‘కన్యాశుల్కం’ నాటకం రాసిన గురజాడ అప్పారావు మొదలు తెలుగు భాషకు సంబంధించిన నవీన పోకడలకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. నవలా సాహిత్యం అగ్రతాంబూలం అందుకునే రోజుల్లో వాస్తవికతకు అద్దం పట్టే రచనలతో సమాజాన్ని కుదిపేసిన గుడిపాటి వెంకటా చలం (చలం) ఈ విశాఖ సాగర తీరం నుంచి పాఠక లోకానికి ‘ప్రేమలేఖలు’ రాసి మనసు గెలుచుకున్నాడు. గ్రాంధిక భాషాభిమానం తగ్గుముఖం పట్టాక వ్యవహార భాషోద్యమం ఊపందుకున్నాక తెలుగు సాహిత్యంలో పైరగాలి తెమ్మెరలా చెవుల్ని కమ్మేసే కమ్మటి లలిత సంగీతమై హత్తుకుంది. ఆ తరహా సాహిత్యానికి వెండితెర వేదికైంది. విప్లవ సాహిత్యం, ప్రేమ సాహిత్యం అన్న పరిధుల్ని చెరిపేసి సాహిత్యానికి అవధులు లేవని చాటి చెప్పిన మహా కవి శ్రీశ్రీ, ఆరుద్ర, అనువాద సాహిత్యానికి వన్నెలద్దిన మహనీయుడు ‘రాజశ్రీ’ ఈ ప్రాంతానికి చెందిన వారే కావడం గమనార్హం. ఓ పక్క ఫక్తు సంగీతం, మరోపక్క అద్భుతమైన సాహిత్యం సమపాళ్లలో సృజించిన బాలాంత్రపు రజనీకాంతరావు తెలుగు భాషా వికాసానికి చేసిన కషి మరువలేనిది. వ్యవహార భాషలో కవిత్వాన్ని అరటి పండు ఒలిచిపెట్టినంత సులభంగా రచించిన అబ్బూరి వరద రాజేశ్వరరావు, ఆ వరసలోనే ఆయన తమ్ముడు గోపాలకష్ణ గణనీయమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఉత్తరాంధ్ర మాండలికానికి రాచఠీవి ఆపాదించిన మహా రచయిత ‘రావి శాస్త్రి’ తెలుగు నాట నాటక కళ ప్రయోగాలకు విశాఖపట్నం పెట్టింది పేరు. ఆధునిక నాటక రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్రలు పదిలపరచుకున్న గొల్లపూడి మారుతీరావు రచనలకు ప్రాకారం శ్రీకారం విశాఖ నగరమే. నాటకం, సినిమా అన్న తేడా లేకుండా తన కలం పాళీ నుంచి అద్భుతమైన సంభాషణలు, రసపట్టులో సాగే సమకాలీన కథలకు జీవం పోసిన కాశీ విశ్వనాథ్ తెలుగు భాషా వికాసానికి చేసిన సేవలు అనితర సాధ్యం. వ్యంగబాణాలు వేయడంలో అందెవేసిన చేయి పతంజలి. సంగీతం, సాహిత్యం రెంటినీ మేళవించి సంగీత నవావధానం ప్రక్రియతో భాషాభిమానులకు కొత్త ఇంధనం నింపే మీగడ రామలింగస్వామి ప్రయోగాలు తెలుగు జాతికి తరగని ఆస్తులు. తెలుగుకు తెగులెందుకంటే... ప్రాథమిక విద్యాస్థాయి బోధకులలో భాషాపండితులు ఉండడం లేదు. పరభాషా పదాలను విచ్చలవిడిగా వినియోగించడం, ప్రభుత్వ స్థాయిలోనే వివిధ పథకాలకు ఇంగ్లిష్‌లో పేర్లు పెట్టడం, తెలుగు భాషను పిల్లలకు చేరువ చేసేలా తెలుగులో కొత్త కృత్రిమ సచేతమైన వ్యక్తలు(యానమేషన్ చార్టర్)కార్యక్రమం నిర్వహించాలి. ప్రభుత్వ కార్యకలాపాల్లో తెలుగుకి ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఈ స్థితిని చక్కదిద్దడానికి వ్యక్తులు, సంస్థలు కృషి మరింత పెరగాలి. తేటతెలుగు మాటల అల్లిక కరువైపోతుంది. స్వరమాధుర్యం కరువైపోతుంది. తెలుగు భాషలో మాట్లాడే వారే తక్కువైపోతున్నారు. ఆధునిక పోకడల పేరుతో మాతృభాష స్వరూప స్వభావాలను, రూపురేఖలను మార్చేస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే వర్ణ, పద, వాక్య స్థాయిలలో పరభాషా పదాలు ఎక్కువై, వ్యాకరణం మాత్రమే తెలుగులో ఉండే స్థితి వచ్చింది. సారస్వత వేదికలకు కల్ప తరువు తెలుగు భాషకు పూర్వ వైభవం తేవాలన్న మొక్కవోని దీక్షతో ఆహర్నిశలూ శ్రమిస్తూ సాహితీ సజనకు అంకితమయ్యే సారస్వత వేదికలకు విశాఖ ఆది నుంచి కల్పతరువే. విశాఖ సాహితి, సహదయ సాహితి, మొజాయిక్, సాహిత్య సురభి, వంటి ఎన్నో సంస్థలు సాహితీ సజనకు గీటురాయి వంటి చర్చోపచర్చలు చేపట్టి నేటి తరాలకు వేగుచుక్కల్లా వ్యవహరిస్తున్నాయి. తెలుగు రచయితల వేదిక విశాఖ సాహితి, మొజాయిక్ సాహిత్య సంస్థలు తెలుగు రచయితల వేదికగా నిలుస్తున్నాయి. తెలుగు భాషా సాహిత్యాలు వికాసమే లక్ష్యంగా తెలుగు రచయితల వేదికగా నిలుస్తున్నాయి. కథారచన, కవితారచన, సాహిత్య విమర్శల జల్లుకు వేదికగా నిలుస్తోంది. ముఖ్యంగా మొజాయిక్ సాహిత్య సంస్థ రచయితల కల్పతరువుగాను, అనువాద సాహిత్యాల వేదికగా నిలుస్తోంది. తెలుగు భాష పరిరక్షణ చట్టాన్ని అమలు పరచాలి నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్ని శిలాఫలకాలు తెలుగులోనే ఉండాలి. తెలుగు భాష పరిరక్షణ చట్టాన్ని సంపూర్ణంగా అమలు పరచాలి. తెలుగు పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు పరచాలి. గత ఏడాది గిడుగు రామూర్తి పంతులుగారి పుట్టిన రోజు సందర్భంగా నాలుగో తరగతి నుంచి డిగ్రీ వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులో బోధిస్తామని చేసిన వాగ్దానాలు, చట్టాలు సంపూర్ణంగా అమలు చేయాలి. – డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సాహితీవేత్త తెలుగు భాష ఔన్నత్యం చాటాలి తెలుగు భాష జ్ఞానాన్ని, ఔన్నత్యాన్ని వెలుగెత్తి చాటాలి. వ్యవహారిక భాషకు ప్రాధాన్యం ఇవ్వాలి. తెలుగు వ్యవహారిక భాషోద్యమకారుడైన గిడుగు రామ్మూర్తి సేవలను గుర్తించాలి. వెయ్యేళ్ల సాహిత్యం ఉన్న భాషగా తెలుగును గుర్తించాలి. భవిష్యత్తు తరాలకు తెలుగుదనం బోధించే విధంగా విద్యామాధ్యమాల్లో తెలుగు ప్రాథమిక బోధన వాడాలి. ఒకటి నుంచి డిగ్రీ, సాంకేతిక విద్య, ఎంబీఏ వంటి పోస్టుగ్రాడ్యుయేట్ చదువుల వరకు తెలుగు భాషను కచ్చితంగా అమలు పరచాలి. భాషా అభివద్ధి, నైపుణ్యతకు ప్రభుత్వ చిత్తశుద్ధి వహించాలి. –రామతీర్ధ, మొజాయిక్ వ్యవస్థాపక కార్యదర్శి, సాహిత్య విమర్శకుడు ఆదివారం–తెలుగువారం ‘ఆదివారం–తెలుగువారం’అనే నినాదం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ఆహార వ్యవహారాలన్నీ తెలుగులోనే నిర్వహించే ఒరవడికి శ్రీకారం చుట్టాలి. దీని కోసం మూడు రోజులపాటు ఒక నిర్దుష్ట లక్ష్యసాధన కోసం 29 నుంచి మూడు రోజుల పాటు తెలుగు దీక్ష పేరుతో యజ్ఞం చేస్తున్నాను. ‘తెలుగు దండు’పేరుతో లక్ష సంతకాలు సేకరిస్తున్నాం. భావ సారూప్యం కలిగిన భాషాభిమానులతో ఏర్పడిన తెలుగు దండులో భాషాభిమానులంతా సభ్యులుగా చేరి తెలుగు భాషాభివద్ధికి కషి చేయాలి. –పరవస్తు ఫణిశయన సూరి, పరవస్తు పద్యపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు భాషా పరిరక్షణలో భాగస్వాములు కావాలి ప్రపంచీకరణ మోజులో తెలుగు జాతి తన ఉనికి, అస్తిత్వం కోల్పోతుందేమోనన్న దిగులు తొలిచేస్తోంది. దాన్నుంచి మన తెలుగు జాతి త్వరగా బయటపడాలి. లేకపోతే మన మాతృభాష ‘మృత’భాషల జాబితాలో చేరిపోయే ప్రమాదం పొంచి ఉంది. యునెస్కో చేసిన పిడుగులాంటి హెచ్చరిక నిజం కాకూడదని త్రికరణ శుద్ధితో కోరుకొంటున్నా. ఆగస్టు 29న వ్యవహారిక భాషా ఉద్యమానికి ఆద్యుడైన గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా మాతృభాషాదినోత్సవం రోజున ఈ మహా క్రతువు చేపడుతున్నాం. ఒక వేలు పిడికిలి కాదు..ఒక చెట్టు వనం కాదు’ కాబట్టి తెలుగు వారందరూ ఇందులో భాగస్వాములు కావాలి. –సాహితీ రత్నాకర డాక్టర్ డి.వి.సూర్యారావు, సాహిత్య విమర్శకుడు -
జనగామకు చీకటి రోజు
మా గొంతు కోయకండి ఆరు మండలాలతో రెవెన్యూ డివిజనా? ఈ ప్రాంత ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలి జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి నేటినుంచి ఆమరణ దీక్ష.. అన్ని పార్టీల మద్దతు జనగామ : నూతన జిల్లాల ముసాయిదా ప్రకటనతో జనగామలో చీకట్లు కమ్ముకున్నాయని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి అన్నారు. పట్టణంలోని జూబ్లీ గార్డెన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, పోకల లింగయ్య, నాగారపు వెంకట్‌తో కలిసి మాట్లాడారు. జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకటించి, సంబురాలు చేసుకోమంటున్న సీఎం కేసీఆర్, జనగామ ప్రజలు ఏం చేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో ముఖ్యభూమిక పోషించినందుకే ఈ శిక్ష వేశారా అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని, శాస్త్రీయ పద్ధతిలో జిల్లాలను చేస్తామని ప్రకటించిన సీఎం, ఏకపక్షంగా డ్రాఫ్ట్‌ను ప్రకటించడం సిగ్గుచేటన్నారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్లోనూ రెవెన్యూ డివిజన్ పరిధిలో కలిపిన మండలాల జాబితాలో జనగామ పేరు గల్లంతు చేశారని విమర్శించారు. జనగామ కో సం పది మండలాల ప్రజలు ఉద్యమాలు చే స్తుంటే, వద్దంటున్న హన్మకొండ, నిర్మల్ జిల్లాలను చేయడమేంటని ప్రశ్నించారు. సిద్దిపేట, అర్భన్ రెండు మండలాలు చూపించిన ప్రభుత్వం, జనగామ మున్సిపాలిటీ, రూరల్‌ను ఒకే మండలంగా గుర్తించడంలో ఆంతర్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ స్థాయికి దిగజార్చారు.. పది మండలాలతో రెవెన్యూ డివిజన్‌గా కొనసాగుతున్న జనగామకు ఆరు మండలాలను మాత్రమే కేటాయించి, గ్రామపంచాయతీ స్థాయికి దిగజార్చారని దశమంతరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేటి నుంచి ఆమరణ దీక్ష.. నూతన జిల్లాల ముసాయిదాలో జనగామకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నేటి నుంచి ఆమరణ దీక్ష చేపడతానని దశమంతరెడ్డి ప్రకటించారు. అన్ని పార్టీలు పూర్తి మద్దతు ప్రకటించాయని తెలిపారు. జనగామ జిల్లా ప్రకటించేవరకూ దశల వారీగా ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు తీగల సిద్దూగౌడ్, ఆలేటి సిద్దిరాములు, సత్యం, కాసుల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఘనంగా అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం
జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రక్తదానం,ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు మానసిక వికలాంగుల కేంద్రంలో పండ్లు పంపిణీ ఖమ్మం కల్చరల్ : నగరంలోని స్వర్ణభారతి కళ్యాణమండపంలో శుక్రవారం అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఫోటోగ్రఫీ జిల్లా కమిటీ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జెడ్పీచైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఏఎస్పీ సాయిక్రిష్ణలు హాజరరయి మాట్లాడుతూ తమ నైపుణ్యతను మారుతున్న కాలానికి అనుగుణంగా తీర్చిదిద్దుకొని ముందుకు ఫోటోగ్రాఫర్లు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ ఫోటోగ్రాఫర్లను సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఫోటోఎగ్జిబిషన్,రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు. సుమారు వందమందికి పైగా ఫోటోగ్రాఫర్లు తమ రక్తదాన్ని దానం చేశారు.కార్యక్రమంలో సామాజిక వేత్త అన్నం శ్రీనివాసరావు, సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల నరసింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దేవర నాగరాజు, శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ పి. నాగేంద్రబాబు, శేషగిరి పాల్గొన్నారు. -
దృశ్యకావ్యం
ఎన్నో భావాలు.. మరెన్నో అనుభూతులు సరదాలు..సరసాలు బాల్యంలో చిరునవ్వులు వద్ధాప్యంలో బొసినవ్వులు ప్రేమకావ్యాలు...సుందరదశ్యాలు పదహణాల పడుచు అందాలు నూనూగమీసాల చిలిపితనాలు కష్టాలు..కన్నీళ్లు ఇవన్నీ జస్ట్ వన్ క్లిక్.. ఆ క్లిక్‌లో కిక్ ఎక్కించే ఫ్లాష్బ్యాక్లుంటాయి. జస్ట్ ఫీల్... నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ డే . -
స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు
గోదావరిఖని : స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ఆర్జీ–1 పరిధిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వివిధ పాఠశాలల విద్యార్థులు, ఎస్అండ్పీసీ గార్డులు, సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యే కార్యక్రమంలో ఆర్జీ–1 సీజీఎం సీహెచ్.వెంకటేశ్వర్రావు జెండా ఆవిష్కరణ చేస్తారు. ఇందుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. స్టేడియంలో జరుగుతున్న పనులను ఎస్‌ఓటూ సీజీఎం సుధాకర్‌రెడ్డి, సివిల్ డీజీఎం సూర్యనారాయణ, ఎస్ఎస్ఓ జాకీర్ హుస్సేన్ శనివారం పర్యవేక్షించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు, ఎస్అండ్పీసీ సెక్యూరిటీగార్డులు మార్చ్ఫాస్ట్ రిహార్సల్ చేయగా అధికారులు పరిశీలించారు. గతేడాది కన్నా భిన్నంగా ఈసారి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. -
ఏనుగుల సంరక్షణ మన బాధ్యత
ఆరిలోవ: ఏనుగుల సంరక్షణ బాధ్యత మనందరిపైన ఉందని జూ పార్కు క్యూరేటర్ బి.విజయ్‌కుమార్ తెలిపారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని శుక్రవారం జూ పార్కులో అధికారులు నిర్వహించారు. పర్యావరణ మార్గదర్శి వైశాఖి సంస్థ, శ్రీప్రకాస్ విద్యార్థులతో కలసి జూ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఇక్కడ రాము అనే ఏనుగును అలంకరించారు. దాని మెడలో గంట కట్టి, కుంకుమతో నామాలు, బొట్లు పెట్టారు. జూలో ఏనుగుల ఎన్‌క్లోజర్ వద్ద విద్యార్థులతో ర్యాలీ చేపట్టి జూ బయోస్కోప్ వరకు సాగించారు. ఏనుగులను సంరక్షించాలని, అంతరించిపోతున్న వాటి జాతిని పరిరక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం జూ బయోస్కోప్‌లో ఏనుగులపై లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం క్యూరేటర్ విజయ్‌కుమార్ విద్యార్థులకు ఏనుగుల గురించి అవగాహన కల్పించారు. థాయ్‌లాండ్‌కు చెందిన ఎలిఫెంట్ రీ ఇంట్రొడక్షన్ ఫౌండేషన్ అనే సంస్థ ఏనుగుల పరిరక్షణ దినోత్సవాన్ని 2012, ఆగస్టు 12న ప్రారంభించిందన్నారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవంగా జరుపుతున్నారన్నారు. అడవుల్లో ఏనుగుల సంఖ్య బాగా తగ్గిపోతోందన్నారు. భూమిపై అతిపెద్ద జంతువైన ఏనుగు జాతి అంతరించిపోతుంటే రాబోవు తరాలవారికి దాని జాడ తెలయకుండాపోతుందన్నారు. ఏనుగుల్లో ఆసియా ఖండపు ఏనుగులు మరింత అంతరించిపోయే దశకు చేరాయన్నారు. ఏనుగుల దంతాలను ప్రపంచ వ్యాప్తంగా అలంకరణ వస్తువుగా వినియోగిస్తుండటంతో వాటికి మంచి గిరాకీ ఉందన్నారు. దీంతో లాబాపేక్షతో కొందరు వాటి దంతాల కోసం ఏనుగులను చంపేస్తున్నారన్నారు. గడిచిన 50 ఏళ్లలో ఆసియాలో 13 దేశాలలో 70 శాతం ఏనుగులు తగ్గిపోయాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ రిసోర్స్(ఐయూసీఎన్) నివేదికలో వెల్లyì ంచిందన్నారు. దీని రిపోర్టు ప్రకారం మన దేశంలో కూడా 50 శాతం ఏనుగులు తగ్గిపోయాయని వివరించారు. అందుకే ప్రతి ఒక్కరూ ఏనుగుల గురిచి తెలుసుకొని వాటి సంరక్షణకు కషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జూ అసిస్టెంట్ క్యూరేటర్లు మషాది, పి.వి రమణ, ఫారెస్టర్లు రమణ, సత్యం పర్యావరణ మార్గదర్శి ప్రతినిధులు జె.రాజేశ్వరి, జి.దేవిప్రసాద్, జూ లవర్స్ ప్రతినిధులు ఆర్.మనోహర్, జె.లిఖిత, రవితేజ , శ్రీప్రకాష్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
గిరిజనుల్లో వెనుకబాటు తనం పారదోలాలి
కాకినాడ రూరల్ : గిరిజనుల్లో వెనుకబాటు తనాన్ని పారదోలి వారిలో చైతన్యాన్ని నింపి సమాజంలో అన్ని వర్గాలతో సమానంగా ముందుకు నడిపించడమే ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆదివాసీ దినం ప్రకటించిన ఉద్దేశమని జిల్లా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ మోనటరింగ్ కమిటీ సభ్యుడు ఎన్.స్టాలిన్‌బాబు అన్నారు. మంగళవారం తిమ్మాపురంలోని ఆంధ్రాయూనివర్శిటీ క్యాంపస్‌లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. గిరి పుత్రిక పథకం ద్వారా ఎస్టీ వర్గాల వివాహానికి రూ.50 వేలు, ఎస్టీ గర్భిణి మహిళలకు పౌష్టికాహార కిట్లు, సామాజిక పింఛన్ల ద్వారా కార్పొరేట్ స్కూళ్లలోనూ ఇంటర్ విద్య కోసం విద్యార్థికి రూ.70 వేలు సహాయం ప్రభుత్వం అందిస్తోందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కేంపస్ ప్రత్యేకాధికారి వై.సోమలత మాట్లాడుతూ భారతదేశంలో సుమారు 700 గిరిజన జాతులు ఉన్నాయని అన్నారు. జిల్లా నీటి నిర్వహణ ఏజెన్సీ పీడీ ఎ.నాగేశ్వరరావు మాట్లాడుతూ 90 దేశాల్లో ఆదివాసీలు ఉన్నారని, 15 శాతం ఉన్న గిరిజనులంతా పేదరికంలో మగ్గుతున్నారన్నారు. గిరిజన సంస్కృతిని ప్రతిబింబిస్తూ విద్యార్థులు చేసిన నృత్యాలు సభికులను ఆకర్షించాయి. క్యాంపస్ మాజీ స్పెషల్ ఆఫీసర్ పి.అరుణ్‌కుమార్, మహారాష్ట్ర బ్యాంకు చీఫ్ మేనేజర్ ఆర్.రామచంద్ర, అధ్యాపకులు కుబేరుడు, టి.అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
పుష్కర స్నానం.. పునీతం
-
సంక్షోభంలో చేనేత రంగం
చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిల్లలమర్రి నాగేశ్వరరావు పట్టణంలో ఘనంగా చేనేత దినోత్సవం మంగళగిరి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోందని రాష్ట్ర చేనేత కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు పిల్లలమర్రి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని రాష్ట్ర చేనేత కార్మిక సంఘ కార్యాలయంలో చేనేత జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సదస్సులో నాగేశ్వరరావు మాట్లాడారు. పరిశ్రమను రక్షించేందుకు ప్రయత్నాలు చేయని పాలకులు, దాన్ని నాశనం చేసేందుకు విదేశీ వస్త్రాలను దిగుమతి చేస్తున్నారని మండిపడ్డారు. మరమగ్గాలు రంగ ప్రవేశం చేయడంతో చేనేత కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు మర్రి సాంబశివరావు, బత్తూరి మోహనరావు, రావుల శివారెడ్డి, చిన్ని తిరుపతయ్య, జాలాది జాన్‌బాబు, గంజి శ్రీనివాసరావు, ఉడతా వెంకటేశ్వర్లు, నందం బ్రహ్మేశ్వరావు, గంజి వెంకయ్య, కొల్లి కిషోర్, మానం శ్రీను తదితరలు పాల్గొన్నారు. మార్కెట్ సెంటర్లో.. ఏరియా చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం పాలకులకు మంచి బుద్ది ప్రసాదించాలని మహాత్ముడి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకష్ణ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేనేత కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానాన్ని నెరవేర్చకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కౌతారపు వెంకటేశ్వరావు, డోకిపర్తి రామారావు, చిట్టేల సీతారామాంజనేయులు, కారంపూడి అంకమ్మరావు, జంజనం శివభవన్నారాయణ, ఉద్దంటి తిరుమలస్వామి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో.. బీజేపీ కార్యాలయంలో అంతర్జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం చేనేత వస్త్రదుకాణాలు, మగ్గాల వద్దకు వెళ్లి పరిశీలించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ హ్యాండ్లూమ్ బోర్డు సభ్యుడు జగ్గారపు శ్రీనివాసరావు, నాయకులు జగ్గారపు రామ్మోహనరావు, సానా చౌడయ్య తదితరులు పాల్గొన్నారు. వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో.. స్థానిక షరాఫ్ బజార్‌లోని కార్యాలయంలో వస్త్ర ఉత్పత్తి సంఘం ఆధ్వర్యంలో చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చేనేత కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆప్కో మాజీ చైర్మన్ మురుగుడు హనుమంతరావు, మున్సిపల్ చైర్పర్సన్ గంజి చిరంజీవి, సంఘం నాయకులు జొన్నాదుల వరప్రసాదరావు (గాంధీ), మురుగుడు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆశల మగ్గంపై నేతన్న కన్నీరు
జిల్లాలో నష్టాల్లో 39 చేనేత సంఘాలు సంఘాలకు రుణ మాఫీ లేనట్టేనా! నేడు జాతీయ చేనేత దినోత్సవం విదేశీ వస్త్రాలు బహిష్కరించి మగ్గంపై తయారు చేసే ఉత్పత్తులనే ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుతున్నాయి. వ్యవసాయం తర్వాత అతి పెద్ద ఉపాధి రంగమైన చేనేత పరిశ్రమ నేడు మనుగడ సాగించలేని దుస్థితిలో ఉంది. ఉపాధి కరువవ్వడంతో ప్రత్యామ్నాయ మార్గాలవైపు నేతన్నలు వలస పోతున్నారు. – అమలాపురం రూరల్ ఓవైపు ఆన్లైన్ మార్కెటింగ్ అంటూ దూసుకుపోతుంటే, చేనేత రంగం మాత్రం ఆప్కోను నమ్ముకుని నష్టాల్లోకి వెళ్లిపోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆప్కో విభజన ఇంకా జరగకపోవడం చేనేత సంఘాలకు శాపంగా మారింది. జిల్లాలో 50 చేనేత సంఘాల్లో సుమారు రూ.7 కోట్ల విలువైన ఉత్పత్తుల నిల్వలు పేరుకుపోయాయి. కార్మికులకు పనుల్లేక పస్తులుంటుంటే, సంఘాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఇప్పటికే రూ.12 కోట్ల వరకు నష్టాల్లో ఉన్న సంఘాలు, ఆప్కో దెబ్బతో మరింత కుదేలవుతున్నాయి. ప్రభుత్వం బడ్జెట్లో ఈ రంగానికి అరకొర నిధులు కేటాయించడంతో దీని మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఆప్కో విలీనం జరగలేదు రాష్ట్ర విడిపోయి రెండేళ్లయినా ఆప్కో విలీనం జరగడం లేదు. ఉమ్మడిగా ఉండడం వల్ల చేనేత సంఘాలకు సహకారం అందడం లేదు. 1976లో చేనేత సంఘాలకు మాతృసంస్థగా ఆప్కో ఆవిర్భావమైంది. చేనేత సంఘాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంతో పాటు ఆర్థికంగా చేయూతనిచ్చేది. నిర్లక్ష్య విధానాలతో ఈ సంస్థ కాలక్రమంలో రూ.130 కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. దీనితో అన్ని జిల్లాల్లోని సంఘాలు నష్టపోయాయి. చేనేత కార్మికుల స్థితిగతులపై హ్యాండ్లూమ్ అధికారులు సర్వే చేసి, వారికి చేయూతనివ్వాల్సి ఉంది. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పనుల్లేక చేనేతలు మాస్టర్ వీవర్స్ వద్ద తక్కువ జీతాలకు పనిచేయాల్సి వస్తోంది. సంఘాలకు రుణమాఫీ హుళక్కేనా! గత ఎన్నికల సమయంలో చేనేత రుణాలు మాఫీ చేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్ల తర్వాత వ్యక్తిగత రుణాలను మాఫీ చేస్తున్నారు. ఆదివారం ధర్మవరం సభలో ముఖ్యమంత్రి రుణమాఫీపై ప్రకటన చేయనున్నారు. జిల్లాలో కార్మికుల వ్యక్తిగత రుణాలు సుమారు రూ.10 కోట్ల వరకు రుణమాఫీ జరగనుంది. ఇప్పటి వరకు చేనేత సంఘాలకు రూ.12 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉంది. కోనసీమలోని 11 సంఘాల్లో కె.జగన్నాథపురం మాత్రమే రూ.7 లక్షల లాభాల్లో ఉంది. మిగిలిన 10 సంఘాలు నష్టాల్లో ఉన్నాయి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేనేత సంఘాలకు రూ.325 కోట్ల రుణమాఫీ ప్రకటించగా, ఆయన మరణానంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రూ.160 కోట్ల మేర రుణమాఫీ చేసింది. సంఘాలతో పాటు కార్మికుల వ్యక్తిగత రుణాలు కూడా అప్పట్లో మాఫీ అయ్యాయి. 39 శాతం రిబేటు ఏమైంది? ఎన్నికల ప్రచార సమయంలో పెద్దాపురం నియోజకవర్గంలో జరిగిన సభలో చేనేత వస్త్రాలపై 39 శాతం రిబేటు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికీ ఆ హామీ అమలుకు నోచుకోలేదు. చేనేత సంఘాల్లో పేరుకుపోయిన రూ.7 కోట్ల విలువైన ఉత్పత్తులు అమ్మాలంటే రిబేటు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ పథకం రూ.15 వేల నుంచి రూ.37,500కు పెంచారు. అది అమలుకు నోచుకోలేదు. కార్మికులు అనారోగ్యానికి గురైతే ఈ పథకంలో ఆర్థిక సాయం లభించేది. ఇది అమలులోకి రాకపోవడంతో చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. -
స్నేహం ఓ సుమం.. ఇగరదులే సుగంధం..
‘చెలిమి..జీవితాన్ని సుసంపన్నం చేసే కలిమి’ అన్నాడో కవి. ‘స్నేహం..రుతువేదైనా వాడని సుమం’ అన్నాడింకో కవి. స్నేహితుల దినోత్సవాన్ని (ఆదివారం) పురస్కరించుకుని స్థానిక నర్సరీ రైతులు ఫ్రెండ్‌షిప్‌డే శుభాకాంక్షలు అందంగా తెలియజేశారు. స్థానిక పల్లవెంకన్న నర్సరీలో మొక్కలు, పువ్వులతో ఏర్పాటు చేసిన కూర్పు ఇది. ప్రతివారూ స్నేహభావంతో మెలగాలని కాంక్షిస్తూ దీన్ని ఏర్పాటు చేసినట్లు నర్సరీ డైరెక్టర్ పల్ల వెంకటేష్, రైతులు సత్తిబాబు, సుబ్రహ్మణ్యం, గణపతి తెలిపారు. – కడియం -
16వ రోజు @ 824మంది
కొనసాగిన కానిస్టేబుల్ శారీరక దారుఢ్య పరీక్షలు ఖమ్మంక్రైం: పోలీస్ కానిస్టేబుల్ ఎంపికల్లో భాగంగా ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఖమ్మంలో నిర్వహిస్తున్న శారీరక సామర్థ్య పరీక్షలు 16వ రోజైన మంగళవారం కొనసాగాయి. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఎస్పీ షానవాజ్‌ఖాసీం పర్యవేక్షణలో ప్రక్రియను నిర్వహించారు. మొత్తం 1200మంది అభ్యర్థులకు గాను 824మంది హాజరయ్యారు. బయోమెట్రిక్, అభ్యర్థుల ఆదార్‌కార్డు, సర్టిఫికెట్లను పరిశీలించి, ఎత్తులో అర్హత సాధించిన వారిని 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, షార్ట్‌పుట్ పోటీలకు అనుమతించారు. మహిళా అభ్యర్థులకు ప్రత్యేకంగా ఈవెంట్లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌బ్రాంచి డీఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీలు రాంరెడ్డి, నరేందర్‌రావు, వీరేశ్వరరావు, సాయిశ్రీ, సురేష్‌కుమార్, రాజేష్, ఏఆర్ డీఎస్పీలు సంజీవ్, మాణిక్‌రాజ్, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
ఖమ్మం సిటీ: ఈ నెల 9న ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగరావు అన్నారు. నగరంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ నేతల ప్రోత్సాహంతో పోలీసులు, అటవీ అధికారులు కలిసి తమ పార్టీ కార్యకర్తలకు.. గిరిజనుల చెందిన నిలువెత్తున పెరిగిన పంట చేలను ట్రాక్టర్లతో దున్నించారని విమర్శించారు. టేకులపల్లి మండలం వాగొట్టుగూడెంలో మహిళలపై దాడి చేసి, సృహ కోల్పోయేలా కొట్టి 100 ఎకరాలలో పంట దున్నారని అన్నారు. ఇల్లందు ఏరియాలో ఎమ్మెల్యే, డీఎస్పీ కలిసి పేదలపై, గిరిజనులపై కక్షపూరితంగా దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఇల్లందు ఏరియాలో పోలీసు రాజ్యాన్ని డీఎస్పీ సాగిస్తున్నారని అరోపించారు. గిరిజనులు, పేదలపై దాడులను నిరసిస్తూ ఈ నెల 8,9 తేదీలలో రాష్ట్రవ్యాపితంగా నిరసన చేపట్టనున్నట్టు చెప్పారు. సమావేశంలో నాయకులు రాయల చంద్రశేఖర్‌రావు, వెంకటేశ్వర్లు, ఆవుల వెంకటేశ్వర్లు, రామయ్య, అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఏఈఎల్సీ వ్యవస్థాపక దినోత్సవం
గుంటూరు ఈస్ట్: క్రీస్తు అందరికీ దేవుడని, ఆయన మార్గంలో నడిచి ఆదర్శప్రాయుడైన ఎఈఎల్‌సీ వ్యవస్థాపకులు డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ అయ్యర్ జీవితాన్ని అందరు ఆదర్శంగా తీసుకోవాలని నాగపూర్‌కు చెందిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియా అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ పిసీసింగ్ ప్రవచించారు. ఆంధ్రా ఇవాంజిలికల్ లూథరన్ చర్చ్ 175 వ వ్యవస్థాపక ఉత్సవాలు శనివారం గుంటగ్రౌండ్స్‌లో ఘనంగా ప్రారంభించారు. తొలుత లాడ్జి సెంటర్లోని ఎఈఎల్‌సీ ప్రధాన కార్యాలయం నుంచి భారీ ఊరేగింపుతో గుంటగ్రౌండ్స్కు చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో రెవరెండ్ డాక్టర్ పీసీసింగ్ సందేశమిస్తూ ఈ ఉత్సవాలు అందరిలో సేవాస్ఫూర్తిని కలిగించగలవని ఆకాక్షించారు. ఎఈఎల్‌సీ మోడరేట్ బిషప్ రెవరెండ్ డాక్టర్ కెఎఫ్ పరదేశీబాబు ప్రసంగిస్తూ ఫెడరిక్ అయ్యర్ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించేలా జీవించాలని, సమాజానికి సేవ చేయాలని పిలుపు నిచ్చారు. తొలుత అతిధులు పావురాలను ఎగరవేసి ఉత్సవాలను ప్రారంభించారు. క్వాయర్లు భక్తి రంజకంగా గీతాలు ఆలపించారు. బిషప్ జేసుదాస్ ప్రత్యేక ప్రార్థన చేసారు. నరసరావుపేటలోని ఎఈఎల్‌సీ అంధుల పాఠశాలల విద్యార్థులు, ప్రదర్శించిన భక్తి రంజకమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నాగపూర్‌కు చెందిన ఎన్సీసీఐ ప్రధాన కార్యదర్శి రెవరెండ్ డాక్టర్ రోగర్ గైక్వాడ్, యూఎస్ నుంచి∙విచ్చేసిన సౌత్ ఏషియన్ ఈఎల్సీఎ ప్రతినిధి డాక్టర్ పి.చంద్రన్ పాల్ మార్టిన్ పాల్గొన్నారు. -
గౌతమ్స్ ది చైల్డ్‌లో ఘనంగా కలర్స్ డే
తిరుపతి రూరల్ : స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్డులోని గౌతమ్స్ ది చైల్డ్ స్కూల్లో శనివారం కలర్స్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. తరగతుల వారీగా విద్యార్థులు వివిధ రంగుల దుస్తుల్లో మురిసిపోయారు. క్యారెట్, ఆపిల్, సన్‌ఫ్లవర్, రోజా, మల్లి, పండ్లు, పూల ఆకారంలో మాస్క్‌లు ధరించి సందడి చేశారు. స్కూల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, క్యాంపస్ ఇన్చార్జ్ మాధురి పాల్గొన్నారు. -
ఒకేరోజు లక్ష మెుక్కలు..
మిర్యాలగూడ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగాచేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడలో మహా హరితహారం నిర్వహించడానికి సర్వం సిద్ధమైంది. పట్టణంలో ఒకేరోజు లక్ష మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని అన్ని కాలనీలలో ఉదయం 11 గంటల ఒకేసారి ఉద్యమంలా హరితహారం కార్యక్రమం నిర్వహించడానికి వారం రోజుల క్రితమే గుంతలు తీయడంతోపాటు మొక్కలు పంపిణీ చేశారు. అంతే కాకుండా మున్సిపాలిటీ నుంచి మెప్మా ఆధ్వర్యంలో ప్రచారం సైతం నిర్వహించారు. ఉదయం 10:30 రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు హాజరు కానున్నారు. అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై వై జంక్షన్ వద్ద అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహల వద్ద, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం వద్ద, తెలంగాణ అమరవీరు ల స్థూపం వద్ద మొక్క లు నాటనున్నారు. ఇండోర్ స్టేడియం ప్రారంభం స్థానిక ఎన్ఎస్పీ క్యాం పులో నిర్మాణం పూర్తయిన ఇండోర్ స్టేడియా న్ని మంత్రి జగదీశ్‌రెడ్డి ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. స్టేడియం నిర్మాణానికి గాను సహకరించిన దాతలు అనిరెడ్డి వీరారెడ్డి, సమ్మిడి వీరారెడ్డిలను మంత్రి సన్మానిస్తారు. ఉదయం 11గంటలకు బహిరంగసభ హరితహారం కార్యక్రమంలో భాగంగా లక్ష మొక్కలు నాటే కార్యక్రమం అనంతర స్థానిక ఎన్ఎస్పీ క్యాంపులో ఉదయం 11:30 గంటలకు బహిరంగసభ నిర్వహించనున్నారు. బహిరంసభకు అన్ని వర్గాల ప్రజలు హాజరయ్యే విధంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు చేపట్టారు. పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆశవర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల ప్రతినిధులు హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టారు. -
సిబ్బందికి కొత్త సౌకర్యం...
షాంఘై ః ఉద్యోగులనుంచి అధిక పనిని పొందాలంటే ఒక్కో కంపెనీ ఒక్కో సౌకర్యం కల్పిస్తుంటుంది. కొందరు ప్రత్యేక బోనస్ లు, ఇంక్రిమెంట్లు, టూర్లు, ఔటింగ్ ఇలా వారికి అప్పుడప్పుడు ఒత్తిడిని తగ్గించే కార్యక్రమాలను ఏర్పాటు చేసి, వారితో పని చేయించుకుంటాయి. కానీ ఓ చైనా కంపెనీ మాత్రం తన సంస్థలోని ఉద్యోగులు ఒత్తిడి లేకుండా చక్కగా పనిచేసేందుకు భిన్నంగా ఆలోచించింది. వారు తమ పెంపుడు జంతువులతోపాటు ఆఫీసులకు వచ్చే సౌకర్యం కల్పించింది. చైనా షాంఘై లోని ఇంటర్నెట్ మార్కెటింగ్ కంపెనీ తమ ఉద్యోగులు ఒత్తిడి లేకుండా పని చేసేందుకు కొత్త సౌకర్యాన్ని కల్పించింది. సిబ్బంది తమతోపాటు పెంపుడు జంతువుల్ని కూడా ఆఫీసుకు తెచ్చుకునే ఏర్పాటు చేసింది. వారిని ప్రోత్సహించేందుకు కల్పించిన కొత్త సౌకర్యంతో అద్భుత ఫలితాలు సాధించడంతోపాటు, సిబ్బంది హాయిగా, ఆనందంగా పనిచేయగల్గుతున్నట్లు యాజమాన్యం చెప్తోంది. కార్యాలయంలో పోటీ, డిమాండ్ సిబ్బందిని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తోందని, అది వారి పనిపై ప్రభావం చూపిస్తుందని భయపడ్డ కంపెనీ అధిపతి జావో కాంగ్ చాంగ్.. వారు ఒత్తిడినుంచీ ఎలా రిలాక్స్ అవ్వగలరో పరిశోధించాడు. ముందుగా వారి ప్రొఫైల్స్ అధ్యయనం చేసి ఎక్కువశాతం ఉద్యోగుల ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నట్లు గమనించాడు. వాటిని తెచ్చుకొని మరీ ఆఫీసుకు రావచ్చంటూ ('బ్రింగ్ యువర్ పెట్ వర్క్ డే' ) ప్రత్యేక సౌకర్యాన్ని ప్రకటించాడు. యజమాని తీసుకున్న నిర్ణయం భారీ విజయాన్ని సాధించింది. ఉద్యోగులంతా ఎంతో రిలాక్స్ గా ఉండటంతోపాటు, ఒకరికొకరు సహాయ పడుతూ ఉత్సాహంగా టీమ్ వర్క్ చేస్తున్నారు. నేనుకూడా పెట్ లవర్ అని, పెంపుడు జంతువులను ఎక్కువ సమయం ఒంటరిగా వదిలి వచ్చిన తర్వాత పొందే ఆందోళన ఎంతటిదో తనకు స్వానుభవం ఉందని, అందుకే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త ఏర్పాటు చేసినట్లు జావో చెప్తున్నాడు. సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని వివరించగా.. వారు ఆహ్వానించారని, కంపెనీ ఉత్పాదకత పెంచడంలో అదో అనధికారిక విధానంగా అమలు చేసినట్లు జావో వివరించాడు. ప్రస్తుతానికి పెట్స్.. సిబ్బందితోపాటు ఆఫీసులోనే తిరుగుతూ ఉంటాయని, భవిష్యత్తులో అవి ఆడుకునేందుకు, నిద్రపోయేందుకు వీలుగా ప్రత్యేక సౌకర్యాలను కల్పించే యోచనలో ఉన్నట్లు తెలిపాడు. జావో కాంగ్ చాంగ్ నూతన ఆలోచన విజయవంతమవ్వడంతో ఇప్పుడు ఇతర స్టార్ట్ అప్ కంపెనీలు సైతం అటుగా దృష్టి సారిస్తున్నాయి. -
ఐదేళ్ళ బాలికే ఆధారం!
'కుంచమంత కూతురుంటే మంచం మీదే కూడు' అన్న సామెత ఆ బాలిక విషయంలో సరిగ్గా సరిపోతుంది. అంధుడైన తన తండ్రి.. కొబ్బరి తోటల్లో పనికి వెళ్ళేందుకు ప్రతిరోజూ దారి చూపించే ఆ చిన్నారి.. ఎందరికో స్ఫూర్తిదాయకమౌతోంది. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన మూడు నిమిషాల నిడివి ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఫిలిప్పీన్స్ కు చెందిన ఐదేళ్ళ బాలిక జెన్నీ, కాలికి చెప్పుల్లేకుండా తన అంధ తండ్రి పెపె నెల్సన్ కు పనిలో సహాయపడటం ఇప్పుడు ఫేస్ బుక్ లో లక్షలమందిని ఆకట్టుకుంటోంది. ఆ చిన్న ప్రాణానికి తండ్రిపై ఉన్న ప్రేమను, బాధ్యతను తెలియజేస్తోంది. కొబ్బరి తోటల్లో తండ్రి పనికి సాయ పడటమే కాదు... ఆప్యాయంగా ఆహారం తినిపించడం, నీళ్ళు అందించడం ప్రతి మనసునూ కదిలింపజేస్తోంది. కూతురి సహకారంతో నెల్సన్ ప్రతిరోజూ సుమారు 60 కొబ్బరి చెట్లు ఎక్కగల్గుతున్నాడు. అందుకుగాను అతడికి అందే 6 డాలర్ల వేతనం.. ఇప్పుడా కుటుంబానికి తిండికి లోటు లేకుండా చేస్తోంది. ప్రతి గుండెనూ కదిలిస్తున్న ఆ వీడియోను ఫేస్ బుక్ లోని తన పేజీలో రూబీ కెప్యూన్స్ పబ్బిలాన్.. జూన్ 10వ తేదీన పోస్ట్ చేసింది. అప్పట్నుంచీ లక్షలమంది తిలకించడమే కాదు.. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో కథనంగా మారింది. మనసును కదిలించే వీడియోను తిలకించిన ఎంతోమంది వినియోగదారులు సహాయక సంస్థల ద్వారా వారికి తగిన సహకారం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఏబీఎస్ సీబీఎన్ ఫౌండేషన్ ఆ తండ్రీ కూతుళ్ళను కలిసింది. రెటినల్ డిటాచ్ మెంట్, రెటినిటిస్ పిగ్మెంటోసా తో బాధపడుతున్న నెల్సన్ కు తగిన ట్రైనింగ్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. త్వరలో నెల్సన్, జెన్నీలు మంచి వాతావరణంలో స్థిరపడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యోగా!
మైసూరుః అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. స్వామీ వివేకానంద యూత్ మూవ్ మెంట్ (ఎస్వీవైఎమ్) ఆధ్వర్యంలో మైసూరులోని మెట్ గల్లీ మురికి వాడలో ఉండే ప్రభుత్వ హయ్యర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకోసం శనివారం ప్రత్యేకంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. మైసూరులో ఎస్వీవైఎమ్ ఆధ్వర్యంలో జరిగిన యోగా కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులకోసం ప్రత్యేకంగా యోగా తరగతులను నిర్వహించారు. 15 సంవత్సరాల యోగా శిక్షణలో అనుభవం ఉన్న రామన్న.. వారికి యోగాలో శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమానికి స్థానిక వీల్ రోటరీ క్లబ్ సారధ్యం వహించగా, కార్యక్రమంలో పాల్తొన్నవారికి హోటల్ గ్రాండ్ మెర్క్యూర్.. పండ్ల రసాలు, పానీయాలను ఉచితంగా అందించింది. శరీరానికి, మెదడుకు మధ్య సమన్వయాన్ని కుదిర్చి, సమతుల్యతకు సహకరించే యోగాను ప్రతి వ్యక్తి చేయాల్సిన అవసరం ఉందని, యోగా ఆరోగ్యవంతమైన జీవనానికి కూడ ఎంతో సహకరిస్తుందని కార్యక్రమ నిర్వాహకులు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరిగిన రెండవ ప్రపంచ యోగా దినోత్సవాన్నిగతవారం ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలు వివిధ ఆసనాలతో ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. -
'ఆమె' జీవితంలో ఓరోజు!
న్యూఢిల్లీః పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ అన్న ఓ సినీకవి మాటలు ఆమె అక్షరాలా పాటించింది. భర్తకు ఉద్యోగం లేకపోయినా కుటుంబ పోషణకోసం తానే నడుం బిగించింది. ఇంటి పనులతో పాటు నాలుగు రాళ్ళు సంపాదించాలనుకున్న ఆమె... ఉద్యోగం కోసం వేచి చూడకుండా ఆర్నెల్లు కష్టపడి కారు డ్రైవింగ్ నేర్చుకుంది. ఇప్పుడు ఎంతో అనుభవం ఉన్న ఓ ప్రైవేట్ డ్రైవర్ గా స్థిరపడి, ఎందరో మహిళల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపుతోంది. భారత రాజధాని నగరం ఢిల్లీకి చెందిన సోనియా ఓ ప్రైవేట్ కారు డ్రైవర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తోంది. ఆమె ఒక రోజు జీవితంపై తీసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇతరులపై ఆధారపడకుండా తనకాళ్ళపై తాను నిలబడేందుకు సోనియా చేసిన ప్రయత్నంలో విజయం సాధించి మహిళా లోకానికే స్ఫూర్తిగా నిలుస్తోంది. తిండికి లేకపోయినా కోడలు కోడలుగానే తప్పించి, డ్రైవర్ గా ఉండకూడదన్నఅత్తింటివారి అడ్డంకులను అధిగమించి, ఆత్మవిశ్వాసంతో సోనియా అడుగు ముందుకేసింది. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఇద్దరు పిల్లలకు తల్లిగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు... తాను కలలుగన్న పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దుతోంది. -
అవి.. ఎప్పుడూ, ఎక్కడా వాడకూడదు!
న్యూఢిల్లీః కంప్యూటర్ల కాలంలో పాస్ వర్డ్స్ కు ప్రాధాన్యత భారీ పెరిగిపోయింది. ఎటువంటి వ్యక్తిగత వివరాలను భద్రపరుచుకోవాలన్నా అందుకు పాస్ వర్డ్స్ ప్రధాన పాత్ర వహిస్తాయి. అందుకే పెట్టుకున్న పాస్ వర్డ్ ఎవ్వరికీ తెలియకుండా కూడ చూసుకోవాలి. బ్యాంకులు, ఇతర వ్యాపార సంస్థలు పాస్ వర్డ్ వివరాలు ఎవ్వరికీ షేర్ చేయొద్దంటూ ఒక్కోసారి హెచ్చరికలు కూడ జారీ చేస్తుంటాయి. అంతటి ప్రాధాన్యత ఉన్న పాస్ వర్డ్స్ కు కూడ ఒక 'డే' ఉందని మీకు తెలుసా? 'పాస్ వర్డ్స్ డే' సందర్భంగా సైబర్ భద్రతా నిపుణులు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలోనూ, డిజిటల్ జీవితంలోనూ కూడ ముఖ్యమైన విషయాలు కొన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది. భద్రతా, గోప్యతా వంటి విషయాలు పాటించడాన్ని అశ్రద్ధ చేస్తే ఒక్కోసారి ఎన్నో నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా పాస్ వర్డ్స్ విషయంలో అటువంటి భద్రత, గోప్యత ఎంతో అవసరం. కానీ ఈ విషయంలో చాలా మంది విఫలం అవుతుంటారు. సులభంగా గుర్తుండేదో, వరుస నెంబర్లో, స్వంత పేర్లనో వాడేస్తుంటారు. కానీ పాస్ వర్డ్ క్రియేట్ చేసుకునేవారు ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. పాస్ వర్డ్ కొత్తగా పెట్టుకునేవారు పదాలు, అక్షరాల్లో తప్పనిసరిగా కొన్ని సంఖ్యలను కలసి ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా సొంత పేర్లు, పుట్టిన తేదీలు, ఇంతకు ముందు వాడిన పేర్లు, కారు నెంబర్లు వంటివి ఎట్టిపరిస్థితుల్లోనూ పాస్ వర్డ్స్ గా వాడొద్దని సలహా ఇస్తున్నారు. అంతేకాదు ఇతరులు ఊహించగలిగే పదాలు, సంఖ్యలను కూడ వాడకూడదు. 123456 వంటి పాస్ వర్డ్స్ సైబర్ నేరగాళ్ళు ఈజీగా ఊహించగల్గుతారని, సామాజిక మాధ్యమాల ఆధారంగా వాటిని చోరాసురులు టార్గెట్ చేస్తారని చెప్తున్నారు. పాస్ వర్డ్స్ లో కొన్నిసార్లు వారిచ్చే ప్రశ్నలకు సులభమైన సమాధానాలు ఇవ్వడంతో కూడ వ్యక్తిగత డేటాను చోరీ చేయగల్గుతారని భద్రతా సంస్థలు చెప్తున్నాయి. అంతేకాక వెబ్ ప్రపంచంలో ఏదో ఒక ఆధారంతో ఆయా వివరాలను తెలుసుకోగల్గుతారని, తరచుగా పాస్ వర్డ్స్ మార్చుకుంటుండటం వల్ల హ్యాక్ చేసే అవకాశం ఉండదని చెప్తున్నారు. ముఖ్యంగా ఒకే పాస్ వర్డ్ ను అన్ని వెబ్ సైట్లలో వాడటం మానుకోవాలని చెప్తున్నారు. హ్యాకర్స్ , సైబర్ క్రమినల్స్ ఆట కట్టించాలంటే ఎవరికి వారు పాస్ వర్డ్స్ విషయంలో శ్రద్ధతోపాటు, జాగ్రత్తలు వహించాలని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడంవల్ల సైబర్ నేరాలను అరికట్టేందుకు అధికారులకు సహకరించినవారవుతారని అంటున్నారు. ముఖ్యంగా ప్రపంచంలో వాడేందుకు పనికిరాని, వాడ కూడని 25 చెత్త పాస్ వర్డ్స్ జాబితాను కూడ.. పాస్ వర్డ్స్ డే సందర్భంగా సైబర్ భద్రతా నిపుణులు వెల్లడించారు. అవేమిటో చూద్దాం... -
'ఫూల్స్ డే' సినీ సందడి!
శుక్రవారాలు, పండుగలు, వేసవి సెలవులు, పబ్లిక్ హాలీడేస్ వంటి వాటినే సినిమా రిలీజ్ కు ముహూర్తాలుగా భావించే సినీ నిర్మాతలు... ఇటీవల ఫూల్స్ డేను కూడ మంచి ముహూర్తంగా ఎంచుకున్నారు. మార్చి నెలతో దాదాపుగా విద్యార్థుల పరీక్షలు పూర్తయి, ఏప్రిల్ నెల నుంచి వేసవి సెలవులు ఇస్తారు. ఈ మధ్యకాలంలో వచ్చే ఏప్రిల్ ఫస్ట్ ఫూల్స్ డే ను కూడా సినిమాల విడుదలకు వాడేసుకుంటున్నారు. ఈసారి ఫూల్స్ డే స్సెషల్ సినిమాల సందడి ఏమిటో ఓసారి చూద్దాం. వేసవి సెలవుల్లో సినీస్టార్లు, యంగ్ హీరోలు తమ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ ఫస్ట్ నాడు ఆరు తెలుగు సినిమాలు, మూడు తమిళ్ డబ్బింగ్ సినిమాలు, రెండు హిందీ, రెండు ఇంగ్లీష్ సినిమాలతో అభిమానులను అమితంగా అలరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నారా రోహిత్ నటించిన 'సావిత్రి', మంచు మనోజ్ 'అటాక్', '7టు4', ఆర్తీ ఆగర్వాల్ చివరి సినిమా 'ఆమె ఎవరు?', 'పిడుగు', 'రహదారి' మొదలైన ఆరు తెలుగు సినిమాలు, శర్వానంద్ నటించిన రాజాధిరాజ, నాగార్జున హిట్ టైటిల్ తో ధనుష్ హీరోగా 'మాస్', నన్ను వదిలి నీవు పోలేవు వంటి తమిళ డబ్బింగ్ సినిమాలు, కీ అండ్ కా, మా పాస్ హిందీ చిత్రాలు, కుంగ్ ఫూ పాండా 3, ది డైవర్జెంట్ సిరీస్ లోని అలెజియంట్ ఇంగ్లీష్ సినిమాలు ఫూల్స్ డే కి రిలీజ్ కాబోతున్నాయి. క్లాస్ టచ్ ఉన్న టైటిల్ సావిత్రి తోపాటు ఆకట్టుకునే పోస్టర్లు, ఆనందింపజేస్తున్న ట్రైలర్ తో దర్శకుడు పవన్ సాదినేని సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండగా... రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా వస్తున్న అటాక్ కూడ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఆర్తీ అగర్వాల్ చివరి సినిమా మార్కుతో వస్తున ఆమె ఎవరు?, తమిళంలో ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న ధనుష్ సినిమా మాస్ (మారి), మాస్ ప్రేక్షకులను, పెద్దలను కూడ ఆకట్టుకునే నన్ను వదిలి నీవు పోలేవులే సినిమాలు ఏప్రిల్ ఫస్ట్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. గత కొంతకాలంగా యంగ్ హీరోల సినిమాలు హిట్ కొట్టి, మంచి లాభాలు తెచ్చిపెడుతున్న నేపథ్యంలో శర్వానంద్ రాజాధిరాజా తమిళ్ వర్షన్ ను డైరెక్ట్ డీవీడీలుగా థియేటర్లలో ప్రత్యేకంగా రిలీజ్ చేసేందుకు తెలుగు పంపిణీదారులు ఉత్సుకత చూపిస్తున్నారు. ఇకపోతే మరిన్ని తెలుగు సినిమాలు ఇదే వారంలో విడుదలయ్యేందుకు సిద్ధమౌతుండగా ఇటీవల ప్రేక్షకులను మెప్పించిన నాగార్జున 'ఊపిరి'కి వీటిలో ఏదైనా పోటీ పడతాయా లేవా అన్నది మాత్రం అభిమానులు నిర్ణయించాల్సిందే. -
కార్న్ ఫ్లోర్ తినకుంటే కోమాలోకి...
ఆ చిన్నారిని ప్రాణాంతక వ్యాధి పీడిస్తోంది. ఆ వింత వ్యాధి అతడిని రోజురోజుకూ చావుకు దగ్గర చేస్తోంది. తమ బిడ్డకు సంక్రమించిన వ్యాధికి మందులు లేకపోవడంతో తల్లిదండ్రులు అనుక్షణం ఆందోళనకు గురౌతున్నారు. బిడ్డ ప్రాణాలు రక్షించుకోడానికి లక్షల్లో డబ్బు ఖర్చు చేస్తున్నారు. లండన్ కు చెందిన ఆరేళ్ల జార్జి మొర్రిసన్ ను అరుదైన గ్లికోజెన్ స్టోరేజ్ వ్యాధి (GSD) వేధిస్తోంది. అయితే ఆ కొత్తరకం వ్యాధికి ఇప్పటిదాకా మందులే లేకపోవడంతో వైద్యులు ప్రత్యామ్నాయంగా కార్న్ ఫ్లోర్ ఇవ్వాలని సూచించారు. ప్రతిరోజూ సుమారు ఓ బాక్స్ కార్న్ ఫ్లోర్ తినకుంటే ఆ బాలుడు కోమాలోకి వెళ్ళిపోతున్నాడు. జార్జి మొర్రిసన్ కు ఎనిమిది నెలల వయసున్నపుడే వైద్యులకు కూడా అంతు చిక్కని ఓ వింత వ్యాధి సోకింది. ప్రాణాంతకమైన ఆ వ్యాధికి మందుల్లేకపోవడంతో కార్న్ ఫ్లోర్ వినియోగిస్తున్నారు. రోజుకో కార్న్ ఫ్లోర్ డబ్బా తినకపోతే చిన్నారి చనిపోయే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్పారు. లండన్ లోని మిగతా పిల్లల్లో మరెక్కడా కనిపించని ప్రాణాంతక గ్లైకోజెన్ లోపంతో మొర్రిసన్ బాధపడుతున్నాడు. రాత్రి సమయంతో సహా ప్రతి మూడు గంటలకు ఓసారి కార్న్ ఫ్లోర్ తినిపిస్తూ ఆ బాలుడ్ని ప్రమాదానికి దూరంగా ఉంచాల్సి వస్తోంది. ఎనిమిదేళ్ళు దాటని పసివాడు కావడంతో అన్నిరకాల పరీక్షలు చేసే అవకాశం లేదు. అందుకే అతడి లోపానికి ఫార్మసిస్టులు ప్రత్యామ్నాయాలను అందిస్తున్నారు. ఇప్పటిదాకా బ్రిటిష్ నేషనల్ ఫార్ములరీ జాబితాలోని మందుల్లో ఎక్కడా కార్న్ ఫ్లోర్ ను వాడే పద్ధతి అమల్లో లేదు. అయితే ఓ ఫార్మాసూటికల్ రిఫరెన్స్ పుస్తకంలో ఉన్న సలహాల మేరకు బాలుడి లోపానికి కార్న్ ఫ్లోర్ ను వాడుతున్నారు. తమ బిడ్డకు వచ్చిన వ్యాధికి మందులు లేకపోవడంతో జార్జి తల్లిదండ్రులు సామ్, పెటె మొర్రిసన్ లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మిగిలిన పిల్లల్లా తమ చిన్నారికి మందులు ఎందుకు ఇవ్వరంటూ నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ను వాళ్లు ప్రశ్నిస్తున్నారు. కార్న్ ఫ్లోర్ వాడే పద్ధతి ఎంతో కష్టంగా ఉండటంతోపాటు ఖర్చు కూడ ఎక్కువగా ఉందని, దానికి బదులుగా మందులు సూచించమని ఎన్ హెచ్ ఎస్ ను కోరుతున్నారు. జార్జికి కేవలం ఎనిమిది నెలల వయసున్నపుడే ఈ వ్యాధి ఉన్నట్లుగా వైద్యులు నిర్థారించారని, అప్పట్నుంచీ మందుల్లేకుండా పిల్లాడి ప్రాణాలు కాపాడుకోవడం ఎంతో కష్టంగా మారిందని సామ్ ఆవేదన చెందుతున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వింత వ్యాధికి మందు కనిపెట్టాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో తాము ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమౌతున్నట్లు చెప్తున్నాడు. ఇప్పటికే భారీ మొత్తంలో ఖర్చు కావడంతో ఇకపై జార్జికి వైద్య సహాయంకోసం స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించే ప్రయత్నంలో ఉన్నాడు. -
ఆకర్షించినన 'మహిళా' మ్యూజిక్ బ్యాండ్
-
'రిపబ్లిక్ డే'కు పరేడ్ గ్రౌండ్లో ఎర్పాట్లు
-
నేడు జాతీయ బాలికా దినోత్సవం
-
ఢిల్లీలో ఆర్మీడే ఉత్సవాలు
-
ఫ్రజానేత స్పర్శతో బాధిత కుటుంబాల్లో ఆనందం
-
స్ఫూర్తిదాత.. విద్యాప్రదాత.. చాయ్ వాలా!
పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ అన్నారు. అనుకున్నది సాధించాలన్న తపన, బలమైన కోరిక ఉండాలే గానీ అందుకు వయసు, డబ్బు, చదువుతో సంబంధం ఉండదని నిరూపించాడా వృద్ధుడు. ఒడిషాకు చెందిన డి. ప్రకాశ్ రావు చాయ్‌వాలాగా జీవితాన్ని కొనసాగిస్తూనే విద్యా ప్రదాతగా... స్ఫూర్తిదాతగా నిలుస్తున్నాడు. మురికివాడల్లో పిల్లలు విద్యకు దూరం కాకూడదన్నదే ప్రకాష్ ఆకాంక్ష.. అందుకే చాయ్ వాలాగా ఉంటూ విద్యాప్రదాతగా మారాడు. కపటం లేని, సంతోషకరమైన జీవితం గడపడంతో పాటు.. తాను చదువుకు దూరమైన పరిస్థితి మరెవ్వరికీ రాకూడదనుకున్నాడు. చిన్నతనంలో చదువుపై అత్యంత మక్కువ చూపిస్తున్నా తండ్రి స్కూల్లో చేర్పించకపోవడంతో ఏమాత్రం చదువుకోలేకపోయాడు. తనకు ఎంతగానో ఇష్టమైన చదువు మురికివాడల్లోని పిల్లలకు దూరం కాకూడదన్నదే ధ్యేయంగా నడుం బిగించాడు. ప్రకాష్‌ను.. అతడి తండ్రి ఓ చాయ్ దుకాణంలో చేర్పించాడు. 1976 నుంచే ప్రకాష్ రావు టీ దుకాణంలో పనిచేస్తున్నాడు. కానీ అతడిలో చదువు నేర్చుకోవాలన్న తపన చావలేదు. స్కూలు చదువునైనా పూర్తి చేయాలన్నఅతడి కోరిక.. పట్టుదల అతడ్ని ఓ పాఠశాల నడిపించే స్థాయికి చేర్చింది. ఉదయం చాయ్ దుకాణంలో పనిచేస్తూనే ఆ డబ్బుతో నర్సరీ నుంచి మూడో తరగతి వరకూ ఉండే 70 మంది పేద పిల్లలతో పాఠశాల నడుపుతున్నాడు. మూడో క్లాస్ తర్వాత తన స్కూలునుంచి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వాళ్లు చదువుకు దూరం కాకుండా తనవంతు కృషి చేస్తున్నాడు. పిల్లలకు చదువు చెప్పించడంతో పాటు వారిలో బలహీనంగా ఉన్నవారిని గుర్తించి వారికి బిస్కెట్లు, పాలు అందిస్తున్నాడు. ప్రకాష్ రావుకు ఇద్దరు కుమార్తెలు. వారిద్దరూ కూడా తన స్కూల్లోనే మూడోతరగతి వరకూ చదివారని చెబుతుంటే అతడి కళ్లు మెరుస్తాయి. తాను చదువు చెప్పలేకపోయినా, అనుకున్నది సాధించాడు. చాయ్ వాలా స్ఫూర్తిదాయక జీవనంపై మరిన్ని వివరాలు కింది వీడియోలో చూడొచ్చు. -
కావాలి... ‘విజయ’ దశమి
నేడు దక్షిణాఫ్రికాతో నాలుగో వన్డే భారత్‌కు చావోరేవో సిరీస్‌పై సఫారీల దృష్టి దేశమంతా నేడు పండగ. గొప్ప విజయాన్ని ఆస్వాదించే సంబరం. మరి క్రికెట్ ను ఆరాధించే అభిమానుల సంగతేంటి..? దక్షిణాఫ్రికా జట్టు మన గడ్డపై అడుగుపెట్టిన దగ్గర్నించి భారత క్రికెటర్లు విజయం కోసం ఆపసోపాలు పడుతున్నారు. ఇక ఇప్పుడు అసలు సమయం వచ్చేసింది. చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితి ఎదురైంది. మరి ఈ పండగ పూటైనా మన హీరోలు చెలరేగుతారా..? అభిమానులకు విజయ దశమిని మిగులుస్తారా... లేక మరో పరాభవాన్ని రుచి చూపిస్తారా..? చెన్నై: దక్షిణాఫ్రికా చేతిలో టి20 సిరీస్ కోల్పోయిన భారత్, వన్డే సిరీస్ కూడా చేజారకుండా ఉండాలంటే రెట్టింపు శ్రమించాల్సిన పరిస్థితిలో నిలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-2తో వెనుకబడిన ధోని సేన చావోరేవోలాంటి పోరుకు సిద్ధమైంది. నేడు (గురువారం) ఇక్కడి చిదంబరం స్టేడియంలో జరిగే నాలుగో వన్డేలో భారత్ జట్టు సఫారీలతో తలపడుతుంది. మూడు మ్యాచ్‌లలోనూ బ్యాటింగ్ వైఫల్యమే భారత్‌ను దెబ్బతీయడంతో ఈ సారైనా మన లైనప్ నిలబడుతుందా అనేది చూడాలి. మరో వైపు ప్రధాన ఆటగాడు డుమిని దూరం కావడంతో దక్షిణాఫ్రికా ఒక్కసారిగా బలహీనంగా మారింది. ముగ్గురు స్పిన్నర్లతోనే: ఎట్టకేలకు గత మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఫామ్‌లోకి వచ్చినా భారత్ విజయానికి ఆ ప్రదర్శన సరిపోలేదు. తనకిష్టమైన మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రాణించిన కోహ్లి, దీనిని కొనసాగించాల్సి ఉంది. రోహిత్ ఫామ్ అద్భుతంగా కొనసాగుతుండగా, ఓపెనింగ్ సహచరుడు ధావన్ 3 ఇన్నింగ్స్‌లలో కలిపి 59 పరుగులు మాత్రమే చేయగలగడం జట్టు శుభారంభాన్ని దెబ్బ తీస్తోంది. అందరికి మించి 3, 0, 0 పరుగులు చేసిన రైనా కోలుకోవడానికి ఇంతకంటే మంచి వేదిక ఉండదు. తనకు సొంత మైదానంతో సమానమైన చేపాక్‌లో చెలరేగడం భారత్‌కు ఎంతో అవసరం. గతంతో పోలిస్తే ధోని బ్యాటింగ్ శైలి మారింది. ఇండోర్ వన్డేలో అతని అద్భుత ఇన్నింగ్స్ జట్టును గెలిపించినా... గత మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో అతి జాగ్రత్తగా ఆడి ఒత్తిడి పెంచుకోవడం ధోనినుంచి ఊహించలేనిది. అతను మరోసారి నాలుగో స్థానంలోనే బరిలోకి దిగాలని భావిస్తుండగా... రహానే పరిస్థితి మాత్రం గందరగోళంగా తయారైంది. రెండు అర్ధ సెంచరీల తర్వాత ఆరో స్థానంలో చివర్లో వేగంగా ఆడలేక విఫలమైన రహానేను ఈ సారి ఎక్కడ ఆడిస్తారో చూడాలి. బౌలింగ్‌లో మన స్పిన్నర్లు ముగ్గురూ హర్భజన్, అక్షర్, మిశ్రా రాణించారు కాబట్టి మరోసారి స్పిన్‌ను నమ్ముకోవచ్చు. పేసర్ అరవింద్‌కు తొలి వన్డే ఆడే అవకాశం ఉంది. మోరిస్‌కు చాన్స్: టి20ల్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన డుమిని వన్డేల్లోనూ కీలక పాత్ర పోషించాడు. రాజ్‌కోట్‌లో మధ్య ఓవర్లలో అతని స్పిన్ బౌలింగ్ వల్లే భారత్ ఓడిందనేది స్పష్టం. అయితే గాయంతో డుమిని దూరం కావడం సఫారీలకు పెద్ద దెబ్బ. అతని స్థానంలో ఎంపికైన ఎల్గర్, బుధవారం ఉదయమే జట్టుతో చేరడంతో మ్యాచ్‌లో ఆడే అవకాశాలు తక్కువ. కాబట్టి బౌలింగ్ ఆల్‌రౌండర్ మోరిస్ లేదా కొత్త బ్యాట్స్‌మన్ జోండోలలో ఒకరిని ఎంపిక చేయాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. అయితే ఎవరు వచ్చినా డుమిని స్పిన్ బలాన్ని మాత్రం ఆ జట్టు కోల్పోతుంది. ఫలితంగా బెహర్దీన్ ఎక్కువ ఓవర్లు వేయాల్సి రావడం భారత్‌కు లాభించే అంశం. ప్రధాన పేసర్లు స్టెయిన్, మోర్కెల్, రబడ రాణిస్తే ఆ జట్టుకు ఇబ్బంది ఉండదు. తాహిర్ కూడా బాగానే ప్రభావం చూపిస్తున్నాడు. అయితే గత మ్యాచ్‌లో చిన్న గాయానికి గురైన మోర్కెల్ కోలుకోకపోతే అబాట్ జట్టులోకి వస్తాడు. ఇక బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా వచ్చి ఫర్వాలేదనిపించిన మిల్లర్ మరింత మెరుగ్గా రాణించాల్సి ఉంది. డివిలియర్స్, డు ప్లెసిస్ ఫామ్‌లో ఉండగా, ఆమ్లా వైఫల్యంపై జట్టు ఆందోళన పడుతోంది. బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగానే కనిపిస్తున్నా...ఇక్కడి వికెట్‌పై స్పిన్‌ను ఎలా ఎదుర్కొంటారనేదానిపైనే సఫారీల సిరీస్ అవకాశాలు నిలిచి ఉంటాయి. జట్ల వివరాలు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, రహానే, అక్షర్, హర్భజన్, మిశ్రా, భువనేశ్వర్, అరవింద్. దక్షిణాఫ్రికా: డివిలియర్స్ (కెప్టెన్), ఆమ్లా, డి కాక్, డు ప్లెసిస్, బెహర్దీన్, మిల్లర్, మోరిస్, స్టెయిన్, రబడ, తాహిర్, మోర్కెల్/అబాట్. ఎలాగైనా మేం ఈ మ్యాచ్ గెలవాల్సిందే. పరిస్థితులను మార్చగల సత్తా ఈ జట్టుకు ఉంది. గత మూడు మ్యాచ్‌లతో పోలిస్తే మేం మరింత తెలివిగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. మా స్పిన్నర్లు సింగిల్స్ ఇవ్వకుండా కట్టడి చేస్తే వారిపై ఒత్తిడి పెరుగుతుంది. అటాకింగ్ చేస్తూ కొన్ని పరుగులు ఇచ్చినా వికెట్ దక్కితే మ్యాచ్ దిశ మారుతుంది. కాబట్టి ఏం చేసినా జట్టు విజయం కోసమే. పోలీసు కేసుతో మ్యాచ్‌కు సంబంధం లేదు. మిశ్రా ఈ వన్డేకు అందుబాటులోనే ఉన్నాడు. -హర్భజన్ సింగ్ మేం టి20 సిరీస్ గెలిచినా ఇవాళ వన్డే కూడా గెలుస్తామని అతి విశ్వాసంతో లేము. ఒక్క రోజులో పరిస్థితి తలకిందులు కావచ్చు. కాబట్టి మేం వంద శాతం శ్రమిస్తాం. అయితే విదేశాల్లో బాగా ఆడాలని మేం గట్టి పట్టుదలతో ఇక్కడికి వచ్చాం. ఫలితాలు అన్నీ అనుకూలంగా రావడం సంతోషం. సిరీస్ గెలిచే అవకాశాన్ని పోగొట్టుకోం. ఆధిక్యంలో ఉన్నాం కాబట్టి మాపై ఒత్తిడి లేదు. భారత్‌కు వచ్చి రెండు వారాలు దాటింది కాబట్టి చెన్నైలో వేడి గురించి ఆందోళన లేదు. ఇక్కడి పిచ్‌లపై నిలకడగా వికెట్లు తీయలేకపోయినా మా పేసర్లే మా ప్రధానం బలం. -స్టెయిన్ -
ఐర్లాండ్‌పై జింబాబ్వే గెలుపు
హరారే: ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో జింబాబ్వే 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 219 పరుగులు చేసింది. గ్యారీ విల్సన్ (88 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు ), ఎడ్ జాయ్స్ (88 బంతుల్లో 53; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం జింబాబ్వే 49 ఓవర్లలో 8 వికెట్లకు 222 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సికందర్ రజా (72 బంతుల్లో 60 నాటౌట్; 4 ఫోర్లు), క్రెయిగ్ ఇర్విన్ (78 బంతుల్లో 60; 5 ఫోర్లు) జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్‌తో వెలింగ్టన్ మసకద్జా అరంగేట్రం చేశాడు. ఫలితంగా హామిల్టన్, విన్స్టన్ మసకద్జాల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడిన మూడో సోదరుడయ్యాడు. జింబాబ్వే తరఫున ముగ్గురు సోదరులు ఆడిన ఘనత ఈ కుటుంబానిదే కావడం విశేషం. మూడు వన్డేల సిరీస్‌లో జింబాబ్వే 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాతి మ్యాచ్ ఆదివారం జరుగుతుంది. -
నేడు ప్రిమెచ్యూర్ బేబీస్ డే
-
రెండో రోజు ప్రశాంతం
జగిత్యాల జోన్, న్యూస్‌లైన్ :జగిత్యాల మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థా నంలో నిర్వహిస్తున్న బీఎస్సీ అగ్రికల్చర్ వెబ్‌కౌన్సెలింగ్ మంగళవారం ప్రశాంతంగా జరిగింది. రెండో రోజు కౌన్సెలింగ్‌కు 32 మంది మాత్రమే హాజరయ్యూరు. ఇందులో వ్యవసాయ కోర్సులతోపాటు వెటర్నరీ, హార్టికల్చర్ కోర్సులకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో నోటిఫికేషన్లో ఇచ్చినట్లుగా ఉదయం, సాయంత్రం అని చూడకుండా ఎవరూ ముందువస్తే వారిని లోనికి అనుమతించారు. బుధవారం బీసీ(డి), బీసీ(ఇ), ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీల విద్యార్థులకు ఫార్మర్, నాన్ఫార్మర్ కోటా కింద, నోటిఫికేషన్లో ఇచ్చిన ర్యాంకుల మేరకు కౌన్సెలింగ్ జరగనుంది. రైతుల కోటాకు లేనిపోని నిబంధనలు..రైతుల కోటాకు వ్యవసాయ విశ్వవిద్యాలయం లేనిపోని నిబంధనలు పెట్టడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రైతు కోటా కింద సీట్లు పొందే విద్యార్థులకు తండ్రి లేదా తల్లి లేదా విద్యార్థి పేరు మీద మూడెకరాలకు తక్కువ కాకుండా భూమి ఉండాలి. దీనికి తోడు నాలుగేళ్లపాటు గ్రామీణ ప్రాంతాల్లో చదవాలనే నిబంధనతో చాలా మంది విద్యార్థులు రైతుల కోటా కిందకు రావడంలేదు. దీంతో కౌన్సెలింగ్ కేంద్రంలో నిర్వాహకులు, విద్యార్థుల తల్లిదండ్రులతో వాగ్వావాదం జరుగుతోంది. మంగళవారం ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన ఓ విద్యార్థినికి మూడెకరాలకు పైగా భూమి ఉన్నప్పటికీ ఎస్సెస్సీ వరకు పట్టణ ప్రాంతంలో చదవడంతో రైతుల కోటా వర్తించలేదు. లేనిపోని నిబంధనలు పెట్టి, విద్యార్థుల జీవితాలతో అడుకుంటున్నారని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రస్తుత రోజుల్లో అందరూ పట్టణ ప్రాంతాల్లోనే చదువుకుంటున్నారని, ఈ నిబంధన మార్చాలని వారు కోరారు. యూనివర్సిటీ నిబంధనల మేరకే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు వెబ్కన్వీనర్ కిషన్ రెడ్డి, కోకన్వీనర్ తిప్పేస్వామి చెప్పారు. అగ్రిసెట్‌లో 100లోపు ర్యాంకుల వారికి కౌన్సెలింగ్ రెండేళ్ల వ్యవసాయ పాలిటెక్నిక్ చదివి, నాలుగేళ్ల బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో చేరేందుకు నిర్వహించిన అగ్రి సెట్ ప్రవేశపరీక్షలో 100 లోపు ర్యాంకు సాధించిన వారు ఈ నెల 12న హైదరాబాద్‌లోని హోంసైన్స్ కాలేజీ-సైఫాబాద్‌లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. సీడ్ టెక్నాలజీలో 50 లోపు ర్యాంకు సాధించిన వారు సైతం హాజరుకావచ్చు. -
3వ రోజుకు చేరిన ఏపీ ఎన్జీవోల సమ్మె