గిరిజనుల్లో వెనుకబాటు తనం పారదోలాలి
ముందుకు నడిపించడమే ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆదివాసీ దినం ప్రకటించిన ఉద్దేశమని జిల్లా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ మోనటరింగ్ కమిటీ సభ్యుడు ఎన్.స్టాలిన్‌బాబు అన్నారు. మంగళవారం తిమ్మాపురంలోని ఆంధ్రాయూనివర్శిటీ క్యాంపస్‌లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సంద
కాకినాడ రూరల్ : గిరిజనుల్లో వెనుకబాటు తనాన్ని పారదోలి వారిలో చైతన్యాన్ని నింపి సమాజంలో అన్ని వర్గాలతో సమానంగా ముందుకు నడిపించడమే ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆదివాసీ దినం ప్రకటించిన ఉద్దేశమని జిల్లా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ మోనటరింగ్ కమిటీ సభ్యుడు ఎన్.స్టాలిన్‌బాబు అన్నారు. మంగళవారం తిమ్మాపురంలోని ఆంధ్రాయూనివర్శిటీ క్యాంపస్‌లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. గిరి పుత్రిక పథకం ద్వారా ఎస్టీ వర్గాల వివాహానికి రూ.50 వేలు, ఎస్టీ గర్భిణి మహిళలకు పౌష్టికాహార కిట్లు, సామాజిక పింఛన్ల ద్వారా కార్పొరేట్ స్కూళ్లలోనూ ఇంటర్ విద్య కోసం విద్యార్థికి రూ.70 వేలు సహాయం ప్రభుత్వం అందిస్తోందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కేంపస్ ప్రత్యేకాధికారి వై.సోమలత మాట్లాడుతూ భారతదేశంలో సుమారు 700 గిరిజన జాతులు ఉన్నాయని అన్నారు. జిల్లా నీటి నిర్వహణ ఏజెన్సీ పీడీ ఎ.నాగేశ్వరరావు మాట్లాడుతూ 90 దేశాల్లో ఆదివాసీలు ఉన్నారని, 15 శాతం ఉన్న గిరిజనులంతా పేదరికంలో మగ్గుతున్నారన్నారు. గిరిజన సంస్కృతిని ప్రతిబింబిస్తూ విద్యార్థులు చేసిన నృత్యాలు సభికులను ఆకర్షించాయి. క్యాంపస్ మాజీ స్పెషల్ ఆఫీసర్ పి.అరుణ్‌కుమార్, మహారాష్ట్ర బ్యాంకు చీఫ్ మేనేజర్ ఆర్.రామచంద్ర, అధ్యాపకులు కుబేరుడు, టి.అశోక్ తదితరులు పాల్గొన్నారు.