
బహుమతులు అందిస్తున్న నిత్యకళ్యాణం
బెల్లంపల్లి: అధిక జనాభాను నియంత్రించాలని బెల్లంపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జంగం నిత్యకళ్యాణ్ అన్నారు. బుధవారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక బజారు ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జనాభాను అదుపులో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జనాభా పెరగడం వల్ల వనరుల సమస్య ఉత్పన్నమవుతుందన్నారు.
అనంతరం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ నిర్వాహకులు సిరికొండ ఆంజనేయరావు, ఎస్.నర్శింగం, కె.సత్యనారాయణ, రాజన్న, నారాయణరావు, వెంకట రమణారెడ్డి, రాజయ్య, కె.నర్సయ్య, దుర్గా ప్రసాద్, వి.సంతోష్, పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శంకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment