సాక్షి, బెల్లంపల్లి(ఆదిలాబాద్) : మంత్రాల నెపంతో వేధిస్తున్నారని మండలంలోని పెద్దలంబాడి తండా గ్రామానికి చెందిన దరావత్ కళావతి అనే యువతి మంగళవారం పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామానికి చెందిన దరా వత్ చత్రునాయక్, వెంకుబాయి దంపతులు, వారి కుమారుడు కిరణ్‌కు మంత్రాలు చేస్తున్నారంటూ అదే గ్రామానికి చెందిన దరావత్ రాజ్‌కుమార్, అతడి తల్లి తులసీ, చెల్లి కళావతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో బాధితులు మూడురోజుల క్రితం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమపైనే ఫిర్యాదు చేస్తారా..? అంటూ చత్రునాయక్, వెంకుబాయి, కిరణ్, వారి బంధువులు కలిసి కళావతి కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. విషయాన్ని రాజ్‌కుమార్ ఎస్సై మొగిళికి ఫోన్‌లో సమాచారం అందించారు. ఎస్సై పోలీస్‌స్టేషన్‌కు రావాలని చెప్పడంతో అంద రూ కలిసి వెళ్లారు. చత్రునాయక్ కుటుంబసభ్యులు కూడా వచ్చారు. పెద్దల సమక్షంలో మాట్లాడుదామని, అంతవరకు గొడవలు పడొద్దని ఎస్సై ఇరువర్గాలకు చెప్పి ఇంటికి పంపించాడు.
ఇంటికెళ్లాక చత్రునాయక్ కుటుంబం రాజ్‌కుమార్ కు టుంబంపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కళావతికి గాయాలయ్యాయి. తీవ్ర మనస్తాపానికి గురైన కళావతి పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు 108లో బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మం చిర్యాల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. న్యాయం చేయకపోవడంతో ఆత్మహత్యకు యత్నించిందని ఆమె కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment