పురాతన కాలం నుంచి పత్తిని దుస్తుల తయారీతోపాటు వివిధ ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో పత్తికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించేందుకు ప్రపంచ పత్తి దినోత్సవాన్ని తొలిసారిగా 2019లో ప్రపంచ ఆహార సంస్థ, అంతర్జాతీయ పత్తి సలహా కమిటీలు సంయుక్తంగా నిర్వహించాయి.
ప్రతి సంవత్సరం అక్టోబర్ 7న ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జరుపుకుంటారు. పత్తిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తుంటారు. పత్తి ఉత్పత్తి కోట్లాది మందికి ఉపాధిని అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పత్తి ఉత్పత్తి రంగంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడం ప్రపంచ పత్తి దినోత్సవ లక్ష్యం. పత్తిని ఫైబర్ దుస్తుల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. ఆహార పదార్థాల తయారీలో కూడా పత్తిని వినియోగిస్తారు.
2019లో సహజ ఫైబర్ పత్తి ఉత్పత్తి, వాణిజ్యం, ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని అక్టోబర్ ఏడున ప్రపంచ పత్తి దినోత్సవం నిర్వహించడం మొదలుపెట్టారు. ప్రపంచ పత్తి దినోత్సవం సందర్భంగా పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పత్తి ఉత్పత్తికి సంబంధించిన పలు విషయాలను చర్చించేదుకు పరిశోధకులు, రైతులు, బడా వ్యాపారవేత్తలు ఒక చోట సమావేశం అవుతుంటారు.
ఇది కూడా చదవండి: నవరాత్రి సందడిలో కారు ప్రమాదం.. 12 మందికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment