
విద్యార్థి దశలో నేర్చుకున్న అంశాల ఆధారంగానే పిల్లలు ఉత్తమ పౌరులుగా రూపొందుతారు. మనిషి జీవితంలో విద్యార్థి దశ అత్యంత కీలకమైనది. ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని ప్రతియేటా అక్టోబర్ 15న నిర్వహిస్తుంటారు.
ఈరోజు (అక్టోబర్ 15) దేశ మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి. ఆ మహనీయుని గౌరవార్థం ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అబ్దుల్ కలాం విద్యార్థులకు స్ఫూర్తిదాయకునిగా నిలిచారు. ఆయన విద్యారంగంలో ప్రశంసనీయమైన కృషి చేశారు. డాక్టర్ ఏపీ జె కలాం ప్రజా రాష్ట్రపతిగా గుర్తింపు పొందారు.
ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రత్యేక థీమ్‌తో జరుపుకుంటారు. ఈ సంవత్సరం (2024) థీమ్ 'విద్యార్థుల భవిష్యత్తు కోసం సంపూర్ణ విద్య'. విద్యను కేవలం అకడమిక్ అచీవ్‌మెంట్‌లకే పరిమితం చేయకుండా, విద్యార్థుల సమగ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టడమే లక్ష్యంగా ఈ ఏడాది ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2010 (అబ్దుల్ కలాం 79వ జయంతి) నుంచి ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. ఆయన 2002, జూలై 18న దేశానికి 11వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
ప్రపంచ విద్యార్థుల దినోత్సవం రోజున కలాం సాధించిన విజయాలు, విద్యార్థులకు అందించిన స్ఫూర్తిని గుర్తుచేసుకుంటారు. కలాం 2002 నుండి 2007 వరకు దేశానికి 11వ రాష్ట్రపతిగా ఉన్నారు. తన పదవీకాలంలో ఆయన విద్యార్థులు, యువతపై తనకున్న ప్రేమ, ఆప్యాయతలను వివిధ కార్యక్రమాల్లో వ్యక్తం చేశారు. కలాం అందించిన స్ఫూర్తిదాయకమైన మాటలు ఇప్పటికీ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
ఇది కూడా చదవండి: చేతులు కడుక్కుందాం..ఆరోగ్యంగా ఉందాం..!
Comments
Please login to add a commentAdd a comment