ఒకటిన్నర శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా పోస్టల్ వ్యవస్థ మనుగడ సాగిస్తోంది. ప్రజల దైనందిన జీవితంలో పోస్టల్ రంగానికున్న పాత్ర, ప్రపంచ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో పోస్టల్ వ్యవస్థ సహకారంపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 9న ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
1874లో స్విట్జర్లాండ్‌లో ప్రారంభమైన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (యూపీయూ) వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ పోస్టల్ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ప్రపంచ కమ్యూనికేషన్ విప్లవంలో యూపీయూ కీలక పాత్ర పోషించింది. ప్రపంచ తపాలా దినోత్సవం 1969లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పోస్టల్ సేవల ప్రాముఖ్యతను తెలియజెప్పేందుకు అక్టోబర్ 9న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి.
యూపీయూ స్థాపించి ఈ సంవత్సరానికి 150 ఏళ్లు పూర్తవుతుంది. ప్రపంచ తపాలా దినోత్సవం ప్రారంభమైనది మొదలు కమ్యూనికేషన్లు, వాణిజ్యం, అభివృద్ధిలో పోస్టల్ సేవల ప్రాముఖ్యత మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఈ-కామర్స్, లాజిస్టిక్స్, ఆర్థిక సేవల విషయంలో పోస్టల్ వ్యవస్థ ప్రముఖమైనదిగా మారింది.
ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా వ్యవస్థగా భారతదేశం గుర్తింపు పొందింది. 1774లో వారెన్ హేస్టింగ్స్ కలకత్తాలో జనరల్ పోస్టాఫీసును ప్రారంభించారు. 1837లో కలకత్తా, మద్రాస్, బాంబేలలో తపాలా సేవలను ఆలిండియా సర్వీసుల్లో చేర్చారు. 1852లో మనదేశంలో తొలిసారిగా సింథ్‌డాక్ అనే తపాలా బిళ్లను విడుదలచేశారు.
పూర్తి కథనం: స్మార్ట్‌గా పోస్టల్ సేవలు
Comments
Please login to add a commentAdd a comment