'ఆమె' జీవితంలో ఓరోజు! | A Day in the Life of a Woman Driver in India | Sakshi
Sakshi News home page

'ఆమె' జీవితంలో ఓరోజు!

Published Thu, Jun 2 2016 4:48 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

'ఆమె' జీవితంలో ఓరోజు! - Sakshi

'ఆమె' జీవితంలో ఓరోజు!

న్యూఢిల్లీః పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ అన్న ఓ సినీకవి మాటలు ఆమె అక్షరాలా పాటించింది. భర్తకు ఉద్యోగం లేకపోయినా కుటుంబ పోషణకోసం తానే నడుం బిగించింది. ఇంటి పనులతో పాటు నాలుగు రాళ్ళు సంపాదించాలనుకున్న ఆమె... ఉద్యోగం కోసం వేచి చూడకుండా ఆర్నెల్లు కష్టపడి కారు డ్రైవింగ్ నేర్చుకుంది. ఇప్పుడు ఎంతో అనుభవం ఉన్న ఓ ప్రైవేట్ డ్రైవర్ గా స్థిరపడి, ఎందరో మహిళల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపుతోంది.

భారత రాజధాని నగరం ఢిల్లీకి చెందిన సోనియా ఓ ప్రైవేట్ కారు డ్రైవర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తోంది. ఆమె ఒక రోజు జీవితంపై తీసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇతరులపై ఆధారపడకుండా తనకాళ్ళపై తాను నిలబడేందుకు సోనియా చేసిన ప్రయత్నంలో విజయం సాధించి మహిళా లోకానికే స్ఫూర్తిగా నిలుస్తోంది. తిండికి లేకపోయినా కోడలు కోడలుగానే తప్పించి, డ్రైవర్ గా ఉండకూడదన్నఅత్తింటివారి అడ్డంకులను అధిగమించి, ఆత్మవిశ్వాసంతో సోనియా అడుగు ముందుకేసింది. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఇద్దరు పిల్లలకు తల్లిగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు...  తాను కలలుగన్న పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement