శతమానం భవతి..
శతమానం భవతి..
Published Wed, Aug 9 2017 11:08 PM | Last Updated on Sun, Sep 17 2017 5:21 PM
నామినేషన్లతో ఊపందుకున్న సందడి
ఒక్కరోజులో వంద నామినేషన్లు
వైఎస్సార్ సీపీ, ‘దేశం’సహా దాఖలు
నేడు నామినేషన్ల దాఖలకు చివరి తేదీ
కాకినాడ : కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల సందడి జోరందుకుంది. మూడో రోజైన బుధవారం ఒక్కరోజులో దాదాపు వంద మంది నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎంతోపాటు అనేక మంది స్వతంత్ర అభ్యర్థులూ నామినేషన్లు వేశారు. మొదటి రెండు రోజుల్లో 12 నామినేషన్లు దాఖలు కాగా, మూడో రోజు దాఖలైన వంద నామినేషన్లతో 112కు చేరాయి. బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్‌సీపీ నుంచి 41, టీడీపీ తరఫున 33, స్వతంత్య్ర అభ్యర్థులు 14 మంది, కాంగ్రెస్ ముగ్గురు, బీజేపీ నుంచి ఆరు, సీపీఐ నుంచి రెండు, సీపీఎం నుంచి ఒక్కో నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా డివిజన్ల నుంచి కొంతమంది సభ్యులు అట్టహాసంగా బయలుదేరి నామినేషన్లు దాఖలు చేశారు.
వైఎస్సార్ సీపీ నుంచి 41 మంది
1వ డివిజన్ : వాసిరెడ్డి అవినాష్‌భగవాన్, వాసిరెడ్డి సుజాత,
2వ డివిజన్ : పాటి వెంకటసూర్యనారాయణ,
5వ డివిజన్ : వీరంరెడ్డి వెంకటలక్ష్మి,
6వ డివిజన్ : అమలదాసు చిరంజీవి,
13వ డివిజన్ : బొక్కా వెంకటరమణ,
15వ డివిజన్ : బలగం వెంకటేష్
16వ డివిజన్ : కోనాడ ప్రకాశరావు,
18వ డివిజన్ : కోనాడ సత్యనారాయణ
19వ డివిజన్ : సిద్ధాంతపు రాజు, గళ్ల రాజేంద్రప్రసాద్, పి.భాస్కరరావు
20వ డివిజన్ : పిసంగి మోహనరావు,
24వ డివిజన్ : లంక సంజీవ్‌కుమార్
26వ డివిజన్ : మత్సా లోకేష్‌వర్మ,
27వ డివిజన్ : వాసిపల్లి వెంకటరమణమ్మ, మన్యం కృష్ణవేణి,
28వ డివిజన్ : వాసిరెడ్డి వరలక్ష్మి, గుండా సత్యవతి
29వ డివిజన్ : సిరియాల చంద్రరావు
32వ డివిజన్ : కోడెల యెల్లయ్యమ్మ, చల్లా మరణ, రోకళ్ల సత్యనారాయణ, కొయ్యా రమణ, చిల్లా లక్ష్మి, కొయ్యా సత్యానందం, చిల్లా శివాజీ, పిల్లా సుదర్శన్
33వ డివిజన్ : బోర అరుణ
36వ డివిజన్ :బెజవాడ దుర్గాదేవి
37వ డివిజన్ : దండుప్రోలు గంగా, ఓలేటి సుభ ప్రసన్న,
38వ డివిజన్ : గంటగోగుల రామచంద్రజ్యోతి
39వ డివిజన్ : బాదం గంగారత్నం
41వ డివిజన్ : పెద్దిరెడ్డి రామలక్ష్మి
44వ డివిజన్ : వెలిశెట్టి మాధురిదేవి
46వ డివిజన్ : ర్యాలి రాంబాబు, ర్యాలి రాఘవేంద్ర, తిరుమలశెట్టి లక్ష్మీకాంత్
49వ డివిజన్ : కడియాల కనకలక్ష్మి
Advertisement