one
-
ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏ విస్తరణ...
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించనున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన నేపథ్యంలో జీవో 111 అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జంట జలాశయాల పరిరక్షణ కోసం అమల్లోకి తెచ్చిన ఈ జీవో ఇప్పటికే అన్ని విధాలుగా నిర్వీర్యమైంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మహానగర విస్తరణ చేపట్టనున్న దృష్ట్యా జీవో 111పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుందనేది ఆసక్తికరంగా మారింది. రీజనల్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న అన్ని ప్రాంతాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తేనున్నట్లు సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకనుగుణంగా మెగా మాస్టర్ ప్లాన్–2050 రూపొందించాలని ఆయన హెచ్ఎండీఏను ఆదేశించారు. దీంతో ట్రిపుల్ వన్ పరిధిలోని 82 గ్రామాలను మెగా మాస్టర్ ప్లాన్‌లో విలీనం చేస్తారా, లేక త్రిబుల్ వన్ జీవోను యధాతథంగా కొనసాగిస్తారా అనే అంశంపైన సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌తోపాటు, సైబరాబాద్, పాత ఎంసీహెచ్, ఎయిర్‌పోర్టు, జీహెచ్ఎంసీ మాస్టర్ప్లాన్లు అమల్లో ఉన్నాయి. ఈ ఐదింటిని కలిపి ఒకే బృహత్తర మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని, ట్రిపుల్ వన్‌లోని ప్రాంతాలను కూడా మాస్టర్‌ప్లాన్ పరిధిలోకి తేవాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు అప్పట్లో ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేశారు. కానీ హైకోర్టు ఆదేశాలతో తిరిగి యదాతథస్థితి కల్పించవలసి వచ్చింది. ఈ క్రమంలో బృహత్తర మాస్టర్ప్లాన్పైన హెచ్ఎండీఏ ఇప్పటికే కసరత్తు చేపట్టింది. కానీ తాజా ప్రతిపాదనల మేరకు మెగా మాస్టర్‌ప్లాన్–2050పైన దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న 7000 చదరపు కిలోమీటర్ల హెచ్ఎండీఏ పరిధిని మరో 3000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తూ భారీ మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తే ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్న ట్రిపుల్ వన్ జీవోలోకి వచ్చే 82 గ్రామాల్లో ఉన్న సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి కూడా ఈ మాస్టర్‌ప్లాన్‌లో భాగం కానుంది. పరిరక్షణపై నీలినీడలు... ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల పరివాహక ప్రాంతాలను కాపాడేందుకు 1996లో ప్రభుత్వం జీవో 111ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏ పరిధిలోని 82 గ్రామాలు ఈ జీవో పరిధిలో ఉన్నాయి. సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి విస్తరించింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో ఒక స్థాయిలో ఈ జీవో చర్చనీయాంశమవుతూనే ఉంది. మరోవైపు జీవోను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ పర్యావరణ సంస్థలు, సామాజిక కార్యకర్తలు న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. జీవోకు విఘాతం కలిగించే చర్యలపైన కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం మరోసారి ఈ జీవోను కదిలించింది. 82 గ్రామాలకు చెందిన రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జీవోను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దాని స్థానంలో జీవో 69ను కూడా తెచ్చారు. కానీ న్యాయస్థానంలో జీవో 111 అమల్లోనే ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టతనివ్వడంతో తీవ్రమైన సందిగ్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. భారీగా అక్రమ నిర్మాణాలు... ఒకవైపు ఇలా వివిధ రకాలుగా ట్రిపుల్ వన్ జీవోను నిర్వీర్యమవుతున్న పరిస్థితుల్లోనే అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వట్టినాగులపల్లి, పుప్పాలగూడ, తదితర ప్రాంతాల్లో అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోనే అడ్డగోలుగా చేంజ్ ఆఫ్ లాండ్ యూజ్ సర్టిఫికెట్లను ఇచ్చేశారు. మరోవైపు రియల్ఎస్టేట్ వర్గాలు, నిర్మాణ సంస్థలు భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టాయి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ఈ అక్రమ నిర్మాణాలు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. శంషాబాద్, శంకర్పల్లి, తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో బహుళ అంతస్థుల భవనాలు వెలిశాయి. ‘శంషాబాద్ పరిధిలోని శాతంరాయి, పెద్ద తుప్రా, ముచ్చింతల్ వంటి ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. ఆ తరువాత అనుమతులు తీసుకుంటున్నారు.’ అని శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఒక అధికారి విస్మయం వ్యక్తం చేశారు. ఏం చేస్తారు... ఇలా అన్ని విధాలుగా జీవో 111 ప్రమాదంలో పడిన దృష్ట్యా మెగామాస్టర్ ప్లాన్‌పైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కన్జర్వేషన్ జోన్లో ఉన్న ప్రాంతాలను అలాగే ఉంచి మిగతా ప్రాంతాలకు మాస్టర్‌ప్లాన్ విస్తరిస్తారా లేక, ఈ జీవోలోని గ్రామాల కోసం ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారా అనే అంశాలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి. మరోవైపు మెగా మాస్టర్‌ప్లాన్ ఎప్పటి వరకు రూపొందిస్తారనేది కూడా చర్చనీయాంశమే. ట్రిపుల్ ఆర్ వరకు నిర్మాణ రంగానికి అనుమతులపైన కూడా మాస్టర్‌ప్లాన్‌లో ఏ ప్రమాణాలను పాటిస్తారనేది కూడా తాజాగా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం డీటీసీపీ పరిధిలో ఉన్న ప్రాంతాలు భవిష్యత్తులో హెచ్ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. దీంతో భవన నిర్మాణాలకు హెచ్ఎండీఏ అనుమతులు తప్పనిసరి. అలాంటప్పుడు వివిధ రకాల జోన్ల విభజనపైన కూడా మాస్టర్‌ప్లాన్‌లో ఎలా ముందుకెళ్తారనేది కూడా రియల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
అర్ధరాత్రి 1 గంట వరకూ న్యూ ఇయర్
కర్ణాటక: కొత్త ఏడాది అంటే ఐటీ సిటీలో ఉత్సవ వాతావరణం నెలకొంటుంది. డిసెంబరు ఆఖరి రోజు సాయంత్రం నుంచి జనవరి 1వ తేదీ తెల్లవారేవరకూ రోడ్లు, కూడళ్లలో నగరవాసులు మజా చేస్తారు. ఈ నేపథ్యంలో రాబోయే నూతన సంవత్సర సంబరాలపై బీబీఎంపీ, పోలీస్‌శాఖ మార్గదర్శకాలను విడుదల చేశాయి. ► 31వ తేదీ అర్ధరాత్రి 1 గంటలోగా న్యూ ఇయర్ వేడుకలను ముగించాలి. ► బెంగళూరు ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, ఇందిరా నగరలో న్యూ ఇయర్ సంబరాలకు అనుమతి ఉంది. ► ఆ రోజు రాత్రి 10 గంటల అనంతరం 31 తేదీ రాత్రి నగరంలోని ప్రముఖ ఫ్లై ఓవర్లు బంద్. ► ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డులో 200 కు పైగా సీసీటీవీ అమర్చడంతో ఎలాంటి అసాంఘిక ఘటనలు జరగకుండా నియంత్రణ. రాత్రి 8 గంటల నుంచి ఈ రోడ్లలో వాహన సంచారం నిషేధం ► సంబరాలకు వచ్చేవారికి ప్రత్యేక పార్కింగ్ వ్యవస్థ. మహిళల భద్రత కోసం భారీగా మహిళా పోలీసుల మోహరింపు ► అర్ధరాత్రి 1 గంట తరువాత బార్, పబ్‌లను మూసివేయాలి ► సామూహిక న్యూ ఇయర్ విందు వినోదాలకు అనుమతి తప్పనిసరి ► లౌడ్ స్పీకర్లు, టపాసుల కాల్చడంపై ఆంక్షలు ► రాత్రి 1 గంట వరకు మెట్రో రైలు, సిటీ బస్సుల సంచారం. -
‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’ ఏమిటి? ఎవరికి ప్రయోజనం?
దేశంలోని వైద్యులకు సంబంధించిన ‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’ ప్రాజెక్ట్ అమలుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి నేషనల్ హెల్త్ కమిషన్ పూర్తి బ్లూప్రింట్ సిద్ధం చేసిందని, దీని ట్రయల్ రాగల ఆరు నెలల్లో ప్రారంభం కానున్నదని సమాచారం. ట్రయల్ అనంతరం ఈ ప్రాజెక్టును జాతీయ స్థాయిలో అమలు చేయనున్నారు. ‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’ కింద దేశంలోని ప్రతి డాక్టర్‌కి యూనిక్ ఐడీ అందజేస్తారు. ఈ యూనిక్ ఐడీ ద్వారా వైద్యునికి గుర్తింపు కల్పిస్తారు. ఈ ఐడీలో ఆ వైద్యుని శిక్షణ, అతని లైసెన్స్‌కు సంబంధించిన అన్ని పత్రాల గురించిన సమాచారం ఉంటుంది. జాతీయ ఆరోగ్య కమిషన్ ఈ ప్రత్యేక ఐడీని ఐటీ ప్లాట్ఫారమ్నకు లింక్ చేస్తుంది. జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రతినిధి డాక్టర్ యోగేంద్ర మాలిక్ మాట్లాడుతూ ‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’పై ఇప్పటికే చాలా కసరత్తు జరిగిందన్నారు. ఈ ప్రక్రియలో వైద్యునికి రెండుసార్లు యూనిక్ ఐడీ ఇస్తారు. అతను ఎంబీబీఎస్ కోర్సులో అడ్మిషన్ తీసుకున్నప్పుడు మొదటిసారిగా ఇస్తారు. ఆ సమయంలో ఇచ్చిన ఐడీ తాత్కాలికంగా ఉంటుంది. అతని చదువు పూర్తయ్యాక అతనికి శాశ్వత సంఖ్య ఇస్తారు. అదేవిధంగా ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులకు శాశ్వత యూనిక్ ఐడీ ఇస్తారు. ఈ ప్రత్యేకమైన ఐడీని అందుకున్న వైద్యులు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ప్రాక్టీస్ చేసే అవకాశం కలుగుతుంది. అలాగే ఆ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్లో తన పేరు నమోదు చేయించుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో దాదాపు 14 లక్షల మంది నమోదిత వైద్యులు రోగులకు సేవలందిస్తున్నారు. దేశంలోని 200కి పైగా మెడికల్ కాలేజీల్లో 1.08 లక్షలకు పైగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ప్రతి వెయ్యిమంది జనాభాకు ఒక వైద్యుడు ఉండటం అవసరం. అయితే భారతదేశం చాలా కాలం క్రితమే ఈ ప్రమాణాన్ని అధిగమించిందని జాతీయ ఆరోగ్య కమిషన్ చెబుతోంది. ఇది కూడా చదవండి: హోటల్‌కు వచ్చిన మహిళకు ‘వీర్యం నీరు’.. తరువాత జరిగిందిదే! -
‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ అంటే ఏమిటి? మణిపూర్ అల్లర్లను ఎలా నియంత్రించనున్నారు?
దాదాపు నాలుగు నెలలు గడిచినా మణిపూర్‌లో హింసాకాండ ఆగడం లేదు. ఈ హింసాకాండలో ఇప్పటి వరకు 170 మంది ప్రాణాలు కోల్పోగా, కోట్ల విలువైన ఆస్తులు కాలి బూడిదయ్యాయి. మెయిటీ, కుకీ అనే రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు ఇప్పటికీ రాష్ట్రంలో కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ఆందోళనలతో ప్రభుత్వంలో టెన్షన్ పెరిగింది. గత ఆగస్టు 27న ఆందోళనకారులు బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఇద్దరు విద్యార్థినుల హత్య దరిమిలా జనం ఆందోళనకు దిగారు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని, కొండ ప్రాంతాలలో ఆర్మ్డ్ ఫోర్సెస్(స్పెషల్ పవర్స్) యాక్ట్(ఏఎఫ్ఎల్పీఏ)ను మరో 6 నెలల పాటు పొడిగించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో హింసాకాండను నియంత్రించే దిశగా ప్రభుత్వం ‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ విధానం అంటే ఒక పారామిలిటరీ ఫోర్స్ ద్వారా ఒక జిల్లాలో శాంతిభద్రతలు నిర్వహించడం. అంటే ఈ విధానంలో ఒక జిల్లాలో భద్రతా ఏర్పాట్ల బాధ్యతను ఒక దళానికి అప్పగించనున్నారు. జిల్లాలో ఎలాంటి కార్యకలాపాలు జరిగినా దానికి ఆ దళం బాధ్యత వహిస్తుంది. ఇది హింసాయుత ఘటనలను నియంత్రించేందుకు ఉపకరిస్తుంది. ఇప్పటి వరకు మణిపూర్‌లో హింసను అరికట్టడానికి పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలు కృషి చేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వివిధ బలగాల మధ్య సమన్వయాన్ని ఏర్పరచడమే కాకుండా జవాబుదారీతనాన్ని కూడా నిర్ధారిస్తుందని ఢిల్లీకి చెందిన ఒక భద్రతా అధికారి తెలిపారు. ప్రతీ జిల్లాలో ఒక దళం మోహరించినందున, ఆ దళం అధికారి అక్కడ అల్లర్లు జరగకుండా చూస్తాడు. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఘటనకు బాధ్యత వహించడంలో వివిధ దళాలు తమ పరిధి కాదంటూ తప్పించుకుంటున్నాయి. ఆర్పీఎఫ్లో ఎక్కువ మంది సిబ్బంది ఉన్నారని, వారిని అధికశాతం జిల్లాల్లో మోహరించే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు. మణిపూర్‌లో 16 పరిపాలనా జిల్లాలు ఉన్నాయి. 2023 మే 3 నుండి హింస చెలరేగుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్, ఆర్మీని మోహరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 200 కంపెనీలకు పైగా పారామిలటరీ బలగాలు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాయి. ఇందులో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, సీఐఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ సిబ్బంది రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ హింస ఆగడం లేదు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం తాజాగా ‘వన్ ఫోర్స్- వన్ డిస్ట్రిక్ట్’ విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇది కూడా చదవండి: పంజాబ్ విద్యార్థుల ‘కెనడా చదువులు’ ఏం కానున్నాయి? -
ఒక్క పాటతో మారిపోయిన కృతి సనన్ కెరీర్
-
క్రికెట్ లో సరికొత్త రికార్డు... ఒక్క ఓవర్ లో 46 పరుగులు
-
120 మందికి.. ఒకే టాయిలెట్
నిర్మల్: లోకేశ్వరం గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు కనీస వసతులు కరువయ్యాయి. స్థలం సరిపోక కొందరు వెనుదిరుగుతుంటే ఇక్కడ ఉండి చదువుకునే వారికి మూత్రశాలలు, మరుగుదొడ్డి లేక నరకం చూస్తున్నారు. ఉద్యోగ ప్రకటనలు వెలువడిన నుంచి ఇక్కడికి వచ్చే వారిసంఖ్య పెరిగింది. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు గ్రంథాలయం తెరిచే ఉంటోంది. రోజు 120 మందికి పైగా వస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు రాత్రి వరకు ఇక్కడే ఉంటున్నారు. పెద్దసంఖ్యలో యువతులు, మహిళలు వస్తున్నారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఇంత మందికి కేవలం ఒకే మరుగుదొడ్డి ఉంది. సరిపోని గదులు వరుస నోటిఫికేషన్లతో వచ్చే వారి సంఖ్య రెట్టింపైంది. హాలు, చిన్న గదులు ఉన్నాయి. గ్రంథాలయ ఇరుకు గదులోనూ అభ్యర్థులు చదువుకుంటున్నారు. కొద్దిగా ఆలస్యమైన కుర్చీ దొరకని పరిస్థితి. వేసవి ప్రారంభం కావడంతో అందుబాటులో ఉన్న కూలర్లు ఏర్పాటు చేసేందుకు స్థలం లేదు. 2004లో రూ.3 లక్షల గ్రామ పంచాయతీ నిధులతో గ్రంథాలయాన్ని నిర్మించారు. వర్షం కురిస్తే గ్రంథాలయ భవనం ఊరుస్తోంది. ఇంత మందికి ఒకే మరుగుదొడ్డి ఉండడంతో ఆరుబయటకు వెళ్లి మూత్రవిసర్జన చేయాల్సి వస్తోంది. గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకుందని, అధికారులు స్పందించి కొత్తది ఏర్పాటు చేయాలని పాఠకులు కోరుతున్నారు. సౌకర్యాలు కల్పించాలి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఇక్కడకు వస్తున్నాం. మూ త్రశాలలు, మరుగుదొ డ్డి లేక ఇబ్బంది పడుతున్నాం. గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు ఒకే చోటకు వెళ్లడం కష్టంగా ఉంది. అధికారులు స్పందించి కొత్త గ్రంథాలయ భవనం నిర్మించాలని కోరుతున్నాం. – రాజశేఖర్, లోకేశ్వరం పాఠకుడు నివేదించాం లోకేశ్వరం గ్రంథాలయం శిథిలావస్థకు చేరిన మాట వాస్తవమే. కొత్త గ్రంథాలయ భవన నిర్మాణం కోసం ఉన్నతాధికారులకు నివేదించాం. నిధులు మంజూరు కాగానే భవనం పనులు ప్రారంభించి పాఠకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. – పృథ్వీరాజ్, గ్రంథాలయాధికారి, లోకేశ్వరం -
అదుపు తప్పి ద్విచక్రవాహనం బోల్తా
చిన్నమండెం(రాయచోటి రూరల్) : చిన్నమండెం మండల పరిధిలోని పడమటికోన గ్రామం నాగూరివాండ్లపల్లెలో ఆదివారం సాయంత్రం అదుపు తప్పిన ద్విచక్రవాహనం బోల్తా పడింది. ఈ సంఘటనలో దేవగుడిపల్లెకు చెందిన ఎన్. కాళేశ్వరబాబు(24) అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు పడమటికోనకు చెందిన ఏ.వెంకటేష్(22) తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. డిగ్రీ చదువుతున్న సమయంలో కాళేశ్వరబాబు, వెంకటేష్‌లు స్నేహితులు. వీరు ద్విచక్రవాహనంలో చిన్నమండెం వైపు నుంచి కలిబండ వైపు బయలుదేరారు. మార్గమధ్యంలో నాగూరివాండ్లపల్లెలో ఉన్న మలుపు వద్ద మీ సేవ ఎదురుగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బండరాతిని ఢీ కొన్నారు. దీంతో తలకు తీవ్రగాయమైన కాళేశ్వర మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన వెంకటేష్‌ను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నైకు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. చిన్నమండెం ఏఎస్ఐ నాగరాజ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కల్వర్టును ఢీకొన్న బైక్..వ్యక్తి మృతి
కరన్‌కోట్: తాండూరు మండల పరిధిలోని కరన్‌కోట్ గ్రామంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు గ్రామస్తుల కథనం ప్రకారం..మండల పరిధిలోని బెల్కటూర్ గ్రామానికి చెందిన చాకలి వెంకటప్ప(35) కరన్‌కోట్‌లోని సీసీఐ సిమెంటు కర్మాగారంలో గత 13 సంవత్సరాలుగా కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కరన్‌కోట్‌లోని సీసీఐ టౌన్షిప్లో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి స్వగ్రామంలో జరిగిన బంధువుల విందుకు హాజరై తిరిగి బైక్‌పై కరన్‌కోట్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో కరన్‌కోట్ శివారులోని సీసీఐకి వెళ్లే దారి మలుపులో స్పీడ్ బ్రేకర్ పక్కన ఉన్న కల్వర్టును అతివేగంతో ఢీకొన్నాడు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతడిని స్థానికులు గమనించి సీసీఐ అంబులెన్స్‌లో తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే వెంకటప్ప మృతి చెందినట్టు వైద్యులు పేర్కొన్నారు. గురువారం పోస్టుమార్టం అనతరం మృతదేహాన్ని స్వగ్రామనికి తరలించారు. కాగా మద్యం మత్తుతో పాటు అతివేగమే ప్రమాదానికి కారణంగా గ్రామస్తులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కార్మిక సంఘం నాయకుడు శరణప్ప డిమాండ్ చేశారు. -
శతమానం భవతి..
నామినేషన్లతో ఊపందుకున్న సందడి ఒక్కరోజులో వంద నామినేషన్లు వైఎస్సార్ సీపీ, ‘దేశం’సహా దాఖలు నేడు నామినేషన్ల దాఖలకు చివరి తేదీ కాకినాడ : కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల సందడి జోరందుకుంది. మూడో రోజైన బుధవారం ఒక్కరోజులో దాదాపు వంద మంది నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎంతోపాటు అనేక మంది స్వతంత్ర అభ్యర్థులూ నామినేషన్లు వేశారు. మొదటి రెండు రోజుల్లో 12 నామినేషన్లు దాఖలు కాగా, మూడో రోజు దాఖలైన వంద నామినేషన్లతో 112కు చేరాయి. బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్సీపీ నుంచి 41, టీడీపీ తరఫున 33, స్వతంత్య్ర అభ్యర్థులు 14 మంది, కాంగ్రెస్ ముగ్గురు, బీజేపీ నుంచి ఆరు, సీపీఐ నుంచి రెండు, సీపీఎం నుంచి ఒక్కో నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా డివిజన్ల నుంచి కొంతమంది సభ్యులు అట్టహాసంగా బయలుదేరి నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్ సీపీ నుంచి 41 మంది 1వ డివిజన్ : వాసిరెడ్డి అవినాష్భగవాన్, వాసిరెడ్డి సుజాత, 2వ డివిజన్ : పాటి వెంకటసూర్యనారాయణ, 5వ డివిజన్ : వీరంరెడ్డి వెంకటలక్ష్మి, 6వ డివిజన్ : అమలదాసు చిరంజీవి, 13వ డివిజన్ : బొక్కా వెంకటరమణ, 15వ డివిజన్ : బలగం వెంకటేష్ 16వ డివిజన్ : కోనాడ ప్రకాశరావు, 18వ డివిజన్ : కోనాడ సత్యనారాయణ 19వ డివిజన్ : సిద్ధాంతపు రాజు, గళ్ల రాజేంద్రప్రసాద్, పి.భాస్కరరావు 20వ డివిజన్ : పిసంగి మోహనరావు, 24వ డివిజన్ : లంక సంజీవ్‌కుమార్ 26వ డివిజన్ : మత్సా లోకేష్‌వర్మ, 27వ డివిజన్ : వాసిపల్లి వెంకటరమణమ్మ, మన్యం కృష్ణవేణి, 28వ డివిజన్ : వాసిరెడ్డి వరలక్ష్మి, గుండా సత్యవతి 29వ డివిజన్ : సిరియాల చంద్రరావు 32వ డివిజన్ : కోడెల యెల్లయ్యమ్మ, చల్లా మరణ, రోకళ్ల సత్యనారాయణ, కొయ్యా రమణ, చిల్లా లక్ష్మి, కొయ్యా సత్యానందం, చిల్లా శివాజీ, పిల్లా సుదర్శన్ 33వ డివిజన్ : బోర అరుణ 36వ డివిజన్ :బెజవాడ దుర్గాదేవి 37వ డివిజన్ : దండుప్రోలు గంగా, ఓలేటి సుభ ప్రసన్న, 38వ డివిజన్ : గంటగోగుల రామచంద్రజ్యోతి 39వ డివిజన్ : బాదం గంగారత్నం 41వ డివిజన్ : పెద్దిరెడ్డి రామలక్ష్మి 44వ డివిజన్ : వెలిశెట్టి మాధురిదేవి 46వ డివిజన్ : ర్యాలి రాంబాబు, ర్యాలి రాఘవేంద్ర, తిరుమలశెట్టి లక్ష్మీకాంత్ 49వ డివిజన్ : కడియాల కనకలక్ష్మి -
ఒకే గూటిలో పోలీసు కార్యాలయాలు
20 ఎకరాలలో నూతన భవనాల నిర్మాణం అర్బన్ ఎస్పీ, డీఎస్పీలు, సీఐడీ, ఆయుధగారం.. అన్నీ అక్కడే సీఎం చంద్రబాబుతో ప్రారంభించేందుకు యత్నం రాజమహేంద్రవరం పోలీస్ అర్బన్ జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మిస్తున్నారు. లాలాచెరువు వద్ద జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఓఎన్జీసీ బేస్ క్లాంప్లెక్ వద్ద 20 ఎకరాల స్థలంలో అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయం, డిస్ట్రిక్ ఆర్మ్డ్ రిజర్వు పోలీస్ కార్యాలయం (డీఏఆర్), సీఐడీ కార్యాలయం, ఆయుధగారం కార్యాలయాలు కొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటివరకూ కొన్ని డీఎస్పీ, సీఐడీ తదితర కార్యాలయాలు అద్దె భవనాలలో నిర్వహిస్తున్నారు. ఒకేచోటు అన్ని కార్యాలయాలు ఉండడం వల్ల ప్రజలకు సౌలభ్యంతో పాటు, ప్రభుత్వానికీ అద్దెల భారం తగ్గుతుంది. డీఎఆర్ కార్యాలయం, ఆయుధగారాలు నూతన భవనాలు శిథిలావస్థకు చేరాయి. రూ.14 కోట్లతో ఎస్పీ కార్యాలయం, ఆయుధగారం, డీఏఆర్ కార్యాలయాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ కార్యాలయాలను సీఎం చంద్రబాబుతో ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీ) : డిస్ట్రిక్ పోలీస్ ఎస్పీ కార్యాలయాన్ని పూర్తి హంగులతో 27 వేల చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించారు. భవనం ముందు భాగంగా గార్డెనింగ్ ఏర్పాటు చేశారు. ఎస్పీ, ముగ్గురు అడిషినల్ ఎస్పీలకు ప్రత్యేక చాంబర్లు, క్రైం, లా అండ్ ఆర్డర్, స్పెషల్ బ్రాంచి, ఇతర శాఖల డీఎస్పీలకు కూడా చాంబర్లు కేటాయించారు. ఈ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్, పరిపాలనకు సంబంధించిన ఏ,బీ,సీ,డీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. సీఐడీ కార్యాలయం... ప్రస్తుతం ఏవీ అప్పారావు రోడ్డులో అద్దె భవనంలో ఉన్న సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి ఈ ప్రాంగణంలో ఎకరం స్ధలం కేటాయించారు. దీనిలో 17 వేల చదరపు గజాల స్థలంలో జీ ప్లస్-1 తో రూ.3.40 కోట్లతో నిర్మించారు. ఈ కార్యాలయంలో సీఐడీ డీఎస్పీ కార్యాలయం, డీఎస్పీ గదులు, కాన్ఫరెన్స్ హాల్, మల్టీపర్పస్ రూమ్స్, సీఐలు, ఎస్సైలకు ప్రత్యేక గదులు, లాకప్ రూమ్, ఇంటరాగేషన్ రూమ్ నిర్మించారు. డీఏఆర్ కార్యాలయం ఆశోకా థియేటర్ వద్ద శిథిలావస్థలో ఉన్న పురాతన భవనంలో ప్రస్తుతం డిస్ట్రిక్ ఆర్మ్డ్ పోలీస్ కార్యాలయం ఉంది. పోలీస్ కార్యాలయ సముదాయంలో 22 వేల చదరపు గజాల స్థలంలో ఈ కార్యాలయానికి భవనం నిర్మించారు. ఈ భవనంలో డీఏఆర్ డీఎస్పీ, ఎంఆర్, ఆర్ఎస్సైలు, ఆర్ఐల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు పోలీస్ బ్యాండ్ కోసం ప్రత్యేక రూమ్, క్లాస్ రూమ్‌లు నిర్మించారు. వీటిని మహిళా, పురుష పోలీసులకు వేర్వేరుగా ఏర్పాటు చేశారు. ఆయుధగారం... ప్రస్తుతం ఆశోకా థియేటర్ వద్ద పురాతన భవనంలో ఉన్న ఆయుధగారాన్ని నూతన భవనంలోకి మార్చనున్నారు. 8 వేల చదరపు గజాల స్థలంలో నిర్మించిన ఈ భవనానికి సంఘ వ్యతిరేక శక్తులు దాడిని తట్టుకునేలా ఎలక్ట్రానిక్ ఫెన్సింగ్ ఉంటుంది. భవనం కింద భాగంలో ఆయుధాలు ఉంచేందుకు స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది. నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక రూమ్ ఏర్పాటు చేశారు. భవనం పరిసరాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పేరేడ్ గ్రౌండ్, షెడ్లు, ఈ ప్రాంగణంలో ఉన్నాయి. సోలార్ సిస్టమ్... ఈ కార్యాలయాలకు మొత్తం సోలార్ సిస్టం ద్వారా విద్యుత్‌ను అందించనున్నారు. భవనంపైనే సోలార్ పలకలను ఏర్పాటు చేశారు. రూ.65 లక్షలతో 100 కేవీ సోలార్ సిస్టం ఏర్పాటు చేశారు. దీని ద్వారా అన్ని కార్యాలయాలకు విద్యుత్ సరఫరా చేస్తారు. -
వంటంతా ఒకే చోట..!
- 20 కిలోమీటర్లకో పాకశాల ఏర్పాటు యోచన - అక్కడి నుంచే పాఠశాలలకు మధ్యాహ్నభోజనం - జిల్లాలో ఐదు క్లస్టర్లలో అమలుకు సన్నాహాలు రాయవరం (మండపేట) : ‘మెనూ ప్రకారం భోజనం అందడం లేదు. అన్నంలో పురుగులు ఉంటున్నాయి. మెనూ ప్రకారం గుడ్డు వడ్డించడం లేదు..’ ఇలాంటివే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై వినిపిస్తున్న విమర్శలు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అమలు చేస్తున్న ఈ పథకంపై విద్యార్థులు, తల్లిదండ్రులు వివిధ సందర్భాల్లో జిల్లాలో ఏదో ఒక మూల అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజనంలో మార్పులకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఇందుకు ప్రభుత్వం 524339/ప్రోగ్రామ్.1/ఎ1/2017 తేదీ 19–04–2017తో మెమో విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో 4,189 ప్రభుత్వ, మండల పరిషత్, జెడ్పీ, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో దాదాపుగా రోజుకు 2.80 లక్షల మంది మధ్యాహ్న భోజనం తింటున్నారు. జకొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని స్వచ్ఛంద సంస్థలు వండి సరఫరా చేస్తుండగా, చాలా పాఠశాలల్లో మిడ్డే మీల్ వర్కర్లు వండి వడ్డిస్తున్నారు. ప్రతి క్లస్టర్లో 25 వేల మందికి వంట ఇకపై ప్రతి మూడు, నాలుగు మండలాలకు ఒక భారీ వంటశాల ఏర్పాటు చేసి అక్కడి నుంచి అన్ని పాఠశాలలకూ భోజనం సరఫరా చేయాలని ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, పిఠాపురం, అమలాపురం, రామచంద్రపురంలలో క్లస్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ప్రతి క్లస్టర్లో సుమారు 25 వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సిద్ధం చేయనున్నారు. ఉదాహరణకు రామచంద్రపురంలో వంటశాలను ఏర్పాటు చేసి దాని పరిధిలోని 25 వేల మందికి భోజనం తయారు చేసి అక్కడి నుంచి వాహనాల ద్వారా పాఠశాలలకు సరఫరా చేయనున్నారు. ఎప్పుడు తయారైన భోజనం అప్పుడే ప్యాకింగ్ చేసి పంపేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందుకు ప్రతి క్లస్టర్‌కు రెండు ఎకరాల ప్రభుత్వ స్థలం అవసరమని జిల్లా విద్యాశాఖ గుర్తించింది. అవసరమైన స్థలాలను ఐదు క్లస్టర్లలో గుర్తించాలని కలెక్టర్‌కు విద్యాశాఖ నివేదించింది. ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన పథకాన్ని పాఠశాల హెచ్ఎంతో పాటు మండల విద్యాశాఖాధికారి ఒక్కరే పర్యవేక్షిస్తున్నారు. వంటశాలల ఏర్పాటు తర్వాత వాటి సంఖ్య పరిమితంగా ఉంటుంది. ఫలితంగా డివిజన్, జిల్లా స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మెనూ ప్రకారమే భోజనం.. ప్రభుత్వ ఆలోచన పూర్తి స్థాయిలో అమలైతే నిర్దేశించిన మెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనం అందనుంది. వంటశాలలు లేవని, వర్షం కురుస్తోందని, బిల్లులు చెల్లించక పోవడంతో భోజనం అందించడం ఇబ్బందిగా మారుతుందనే మాటలు వినిపించే అవకాశం ఉండదు. ప్రతి వారం తప్పనిసరిగా రెండు గుడ్లు అందించాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణంలో పరిశుభ్రమైన భోజనం తయారవుతుంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి. వర్కర్లకు ప్రత్యామ్నాయమెలా.. మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్న మహిళలు భారీగా ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. ప్రతి పాఠశాలలో మిడ్డే మీల్ వర్కర్లు భోజనం తయారు చేసి వారికి వడ్డిస్తున్నారు. జిల్లాలో సుమారు 8 వేల మంది మిడ్డే మీల్ వర్కర్లు పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.1,000 గౌరవ వేతనం అందజేస్తున్నారు. నూతన విధానం అమలు జరిగితే వారు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా చూపుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే వంటశాలల్లో భోజనం తయారీతో పాటు ప్యాకింగ్, ఇతర పనుల్లో వీరిని వినియోగించుకోనున్నా..అందరికీ ఉపాధి సాధ్యమవుతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. అంచనాలు రూపొందిస్తున్నాం.. ప్రతి 20 కిలోమీటర్లకో వంటశాల ఏర్పాటు చేసేందుకు అవసరమైన అంచనాలు రూపొందిస్తున్నాం. వంట తయారు చేయడానికి అవసరమైన భవనాల నిర్మాణానికి అనువైన స్థలం కోసం జిల్లా కలెక్టర్‌కు నివేదించాం. – ఎస్.అబ్రహాం, జిల్లా విద్యాశాఖాధికారి -
సర్టిఫికేట్ ఒకటే..పోస్టులు రెండు
వేరే వ్యక్తి సర్టిఫికెట్ జత చేసి ఉద్యోగం పొందిన వైనం ఆధార్, రేషన్ కార్డుల్లో కూడా పేరు మార్పు గుడ్డిగా ఓకే చేసిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు బయటపడినా దర్యాప్తు నత్తనడకే ప్రజాధనం వృథా అవుతున్నా కిమ్మనని ఐసీడీఎస్ అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశించినా బేఖాతరు సాక్షి ప్రతినిధి, కాకినాడ : మీరు చదువుకోలేదా...ఎటువంటి సర్టిఫికెట్ లేదా... అయినా ఫర్లేదు మీకు ఉద్యోగం కావాలి అంతే కదా. అయితే ఎవరో ఒకరి సర్టిఫికెట్ తెచ్చుకోండి. మిగతాదంతా మేం చూసుకుంటాం అంటున్నారు స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో కొం దరు ఉద్యోగులు. ఇంకా మీకు అనుమానాలున్నాయా... ఐసీడీఎస్‌లో ఒకే ఎనిమిదో తరగతి సర్టిఫికెట్‌పై వేర్వేరు పోస్టుల్లో ఇద్దరు మహిళలు పనిచేస్తున్నారు. విషయం అధికారుల దృష్టికి వెళ్లినా ‘మేం ఉన్నాం కదా’ అని భరోసా ఇస్తున్నారు. ఈ బాగోతానికి సంబంధించి ‘సాక్షి’ సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో రెండు వేర్వేరు ప్రాజెక్టుల్లో వేర్వేరు అంగన్వాడీ కేంద్రాల్లో ఒకే ఎనిమిదో తరగతి సర్టిఫికెట్ జత చేసి ఇద్దరు మహిళలు పని చేస్తున్నారు. అందులో ఒక మహిళ అంగన్వాడీ కేంద్ర వ ర్కరు, మరో మహిళ ఆయాగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్ర జాధనం వృథా అవుతున్నా ప్రలోభాలకు లోబ డి ఐసీడీఎస్ అధికారులు మిన్నకుండిపోయారనే విమర్శలున్నాయి. రాజ వొమ్మంగి మండలం కొమరాపురం గ్రామానికి చెందిన కోనల రామస్వామి కుమార్తె కోనల వెంకట లక్ష్మి అక్కడ ఉన్న అంగన్వాడీ కేంద్రంలో సుమారు పదేళ్ల నుంచి హెల్పర్ (ఆయా)గా పనిచేస్తోంది. ప్రత్తిపాడు మండలం ఉప ప్రణాళిక ప్రాంతమైన బురదకోట గిరిజన గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి వర్కర్ పోస్టు నియామకం కోసం ఎనిమిదేళ్ల కిందట శంఖవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టు కోసం కోనల అచ్చయ్య కుమార్తె కోనల లక్ష్మి దరఖాస్తు చేసుకుంది. అయినా సరిపడా విద్యార్హత ఆమెకు లేదు. అందుకు ఆమె పెద్ద పథకమే వేసింది. తన ఇంటి పేరుతోపాటు తన పేరుతో దగ్గరగా ఉండి రాజవొమ్మంగిలో అంగన్వాడీ హెల్పర్‌గా పనిచేస్తున్న కోనల వెంకటలక్ష్మి ఎనిమిదో తరగతి సర్టిఫికెట్‌ను జతచేసి అంగన్వాడీ వర్కర్ పోస్టుకు దరఖాస్తు చేసింది. ఆ దరఖాస్తును కనీసం క్షేత్రస్థాయిలో పరిశీలన జరపకుండా స్త్రీశిశు సంక్షేమ అధికారులు లక్ష్మీకి అంగన్వాడీ వర్కర్ ఉద్యోగాన్ని కట్టబెట్టేశారు. అన్నింటా పేరు మార్చేసి... అంగన్వాడీ వర్కర్‌గా నియామకానికి ముందు కోనల లక్ష్మి ప్రత్తిపాడు మండలం బురదకోట పంచాయతీ పరిధిలోని భాపన్నధారలో చిన్నారుల నివాస కేంద్రంలో సహాయకురాలిగా పనిచేసింది. అంగన్వాడీ వర్కర్‌గా నియామకం అనంతరం కోనల లక్ష్మి తన పేరును రేషన్‌కార్డు, ఆధార్‌కార్డుల్లో కోనల వెంకట లక్షి్మగా నమోదు చేయించుకుంది. ఎనిమిదేళ్ల నుంచి కోనల లక్ష్మి ... కోనల వెంకట లక్షి్మగా బురదకోట అంగన్వాడీ కేంద్రంలో వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. కలెక్టర్ ఆదేశించినా... రాజవొమ్మంగి అంగన్వాడీ హెల్పర్ కోనల వెంకట లక్ష్మి తన సర్టిఫికెట్లతో మరో మహిళ ఉద్యోగం చేస్తోందని తెలుసుకొని రెండేళ్ల క్రితం జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓలకు ఫిర్యాదు చేశారు. తన సర్టిఫికేట్‌తో బురదకోట అంగన్వాడీ కేంద్రంలో వర్కర్‌గా పని చేస్తున్న లక్షి్మపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినా ఇంతవరకు విచారణ చేయలేదు. గత ఏడాది శంఖవరం మండలం పెదమల్లాపురంలో నిర్వహించిన గిరిజన సదస్సులో కూడా విచారణ నిర్వహించి చర్య తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. బురదకోట పంచాయతీ పరిధిలో బాపన్నధార సహా పలు గ్రామాల గిరిజనులు ఐటీడీఏ పీఓకు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై రెండు పర్యాయాలు కాకినాడ కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్సులో కూడా స్థానికులు ఫిర్యాదు చేశారు. విచారణ నిర్వహించాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఇది జరిగి కూడా ఏడాది దాటిపోయినా పట్టించుకున్న నాథుడే లేడు. విచారణ నిర్వహించినా... బురదకోట అంగన్వాడీ వర్కర్ వి«ధి నిర్వహణలో అలక్ష్యం చేస్తోందని, తొమ్మిది నెలల్లో కేవలం 28 రోజుల మాత్రమే కేంద్రాన్ని తెరిచారని మూడేళ్ల క్రితమే 2014 జూన్ 16న పిల్లల తల్లిదండ్రులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పటి శంఖవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి టి.నాగమణి స్థానిక గిరిజనుల సమక్షంలో విచారణ నిర్వహించినా ఇప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని గిరిజనం ఆరోపిస్తోంది. ఏ విద్యార్హతలతో పోస్టింగ్ ఇచ్చారో తెలియజేయాలని బాపన్నధార గ్రామానికి చెందిన ముర్ల రాజబాబు, విప్లవకుమార్ గత నెలలో సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై ఇటీవల బురదకోటలో శంఖవరం, రాజవొమ్మంగి ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులను, అంగన్వాడీ వర్కర్, హెల్పర్ తదితరులను ఐసీడీఎస్ అధికారులు విచారించారని తెలిసింది. -
గూగుల్ ప్లే స్టోర్‌లో నెం.1 యాప్ ఇదే!
-
గూగుల్ ప్లే స్టోర్‌లో నెం.1 యాప్ ఇదే!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన 'భీమ్' యాప్ రికార్డులు బద్దలు కొడుతోంది. డిసెంబర్ 30న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభించిన 'భీమ్' (భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ) యాప్ దూసుకుపోతోంది. అత్యంత ప్రజాదారణ పొందిన వాట్సాప్, మై జియో, మెసెంజర్ , ఫేస్ బుక్ వంటి ప్రముఖ యాప్ లను తలదన్ని డోన్ లోడ్ అవుతోంది. ప్రారంభం అయిన మూడు రోజుల్లోనే గూగుల్ ప్లే స్టోర్ చార్ట్ నెంబర్ 1 ప్లేస్ కొట్టేసింది. అత్యంత ప్రజాదారణ పొందిన వాట్సాప్, మై జియో, మెసెంజర్ , ఫేస్బుక్ వంటి ప్రముఖ యాప్‌లను పక్కకు నెట్టేసింది. భీమ్ యాప్... గూగుల్ ప్లే స్టోర్ లో ఇప్పటికే ఇరవై లక్షల (రెండుమిలియన్ల) డౌన్ లోడ్స్ సాధించింది. వినియోగదారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, చాలా తక్కువ సమయంలో రెండు మిలియన్లమంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. దీంతో భీమ్ విజయంపై ఆధార్ మాజీ ఛైర్మన్ నందన్ నీలేకని ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేశారు. సులభ డిజిటల్ లావాదేవీల కోసం ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం, (డిసెంబర్ 30) ఆధార్ ఆధారిత మొబైల్ చెల్లింపు అప్లికేషన్ భీమ్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ పేరిట రూపుదిద్దుకుని, ఆయనకు ఘన నివాళిగా అమలులోకి వచ్చిన భీమ్ ప్రజలు వారి బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా డిజిటల్ చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది. ఈ యాప్ అద్భుతాలు సృష్టిస్తుందని మోదీ కొనియాడిన సంగతి తెలిసిందే. #BHIM from @NPCI_NPCI races to the top of the charts! Dream debut! https://t.co/I9t2C3G5cV — Nandan Nilekani (@NandanNilekani) January 1, 2017 -
సైన్స్, సమాజం రెండూ ఒక్కటే
భానుగుడి (కాకినాడ): సైన్స్ , సమాజం వేరు కాదని అవి రెండూ విడివిడిగా అభివృద్ధి చెందవని, సైన్స్ ఫలితాలు సమాజ పరం చేయాలనే కృతనిశ్చయంతో జేవీవీ పనిచేస్తుందని చెకుముకి జిల్లాస్థాయి సై¯Œ్స సంబరాల్లో వక్తలు అభిప్రాయపడ్డారు. జిల్లా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం శ్రీనగర్ ఆదిత్య పాఠశాలలో నిర్వహించిన చెకుముకి పరీక్షలో వివిధ మండలాల నుంచి తెలుగు మీడియంలో 50, ఇంగ్లిషు మీడియంలో 60 బృందాలు పాల్గొన్నాయి. తొలి ఐదు స్థానాలలో ఉన్న విద్యార్థులకు క్విజ్ నిర్వహించి మొదటి మూడు స్థానాలలో నిలిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తెలుగు మీడియంలో విజేతలు : జెడ్పీ హైస్కూల్ కామరాజుపేట మొదటి, రవీంద్ర భారతి హైస్కూల్ ముమ్మిడివరం, మురమళ్ల జెడ్పీ హైస్కూల్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇంగ్లిష్ మీడియం : ఆదిత్య హైస్కూల్ అమలాపురం విజేతగా నిలువగా, శ్రీప్రకాష్, శ్రీమతి జీఎండీ హైస్కూల్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇంగ్లిషు, తెలుగు విభాగాల్లో తొలిరెండు స్థానాల్లో నిలిచినవారు ఈ నెల 12, 13 తేదీలలో నెల్లూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని కేఎంఎంఆర్ ప్రసాద్ తెలిపారు. సభకు జనవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు కేఎమ్ఎమ్ ఆర్.ప్రసాద్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ స్టాలిన్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సీహెచ్ రవికుమార్, జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్ పి.చిరంజీవినికుమారి, సీనీయర్ నాయకులు బి.అనంతరావు, పి.నరసింహారావు, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎ¯ŒS.శృతిరెడ్డి, జేవీవీ సై¯Œ్స అండ్ టెక్నాలజీ కన్వీనర్ శ్రీకృష్ణసాయి, జి.వసంతకుమార్, కేసరి శ్రీనివాస్, రామారావు పాల్గొన్నారు. -
ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
ఒకరు మృతి కామేపల్లి: ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని తాళ్లగూడెం పెద్దమ్మతల్లి గుడి సమీపంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సంధ్య (19) తీవ్రంగా గాయపడటంతో ఆమెను హైదరాబాద్ తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందింది. ఆటో డ్రైవర్ ఎస్కే దస్తగిరితో పాటు ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామేపల్లికి చెందిన ఆటో ఖమ్మం వెళ్తోంది. ఆ ఆటోలో వచ్చవాయి వీరయ్య, దొడ్డిగొర్ల కోటయ్య, కొప్పుల సంధ్య వెళ్తున్నారు. తాళ్ళగూడెం స్టేజీ వద్ద ఆ గ్రామానికి చెందిన పుచ్చకాయల కనకదుర్గ, బస్వమ్మ, మండ గోపి, ఎల్లబోయిన మల్లమ్మ ఖమ్మం వెళ్ళేందుకు ఎక్కారు. ఆటో పెద్దమ్మ తల్లి గుడి సమీపంలోకి రాగానే ఇల్లెందు నుంచి ఖమ్మం వెళ్తున్న బస్సు వేగంగా దూసుకొచ్చింది. ఆటోను క్రాస్ చేసే సమయంలో బస్సు వెనుక భాగం ఆటోకు తగిలింది. వెంటనే ఆటో పల్టీలు కొట్టింది. కొప్పుల సంధ్యకు తీవ్రగాయాలై స్పృహ కోల్పోయింది. ఆటో డ్రైవర్‌తో పాటు 7 గురికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు ఆగకుండానే వెళ్ళిపోయింది. తీవ్రగాయాలపాలైన క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంధ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కామేపల్లి ఎస్సై జి.రంజిత్‌కుమార్ ఘటనాస్థలికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఆటోను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆగకుండా వెళ్ళిన బస్సును పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. బస్సు డ్రైవర్ చాగంటి సురేష్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
ప్రతి మండలానికి గురుకుల పాఠశాల
అక్టోబర్ నాటికి భక్త రామదాసు నీళ్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోచారం (కూసుమంచి): విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని, ఇందులో భాగంగానే ప్రతి మండలంలో గురుకుల పాఠశాల నెలకొల్పాలని భావిస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. పోచారం గ్రామ పంచాయతీలో ఐదుకోట్ల రూపాయల వ్యయంతో బీటీ రహదారుల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అక్కడ జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. పాలేరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధే తన ధ్యేయమని అన్నారు. నియోజకవర్గంలోని 70వేల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో చేపట్టిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకం పూర్తికావచ్చిందన్నారు. అక్టోబర్ నాటికి నియోజకవర్గంలోని చెరువులను సాగర్ జలాలతో నింపుతామని హామీ ఇచ్చారు. పాలేరుకు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను తరలించే ప్రయత్నం జరుగుతోందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రహదారి, తాగునీరు, సాగునీరు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇవన్నీ ఉగాది నాటికి ప్రజల అందుబాటులోకి వస్తాయన్నారు. చింతలతండా–చేగొమ్మ రహదారి నిర్మాణానికి హామీ ఇచ్చారు. పాలే రు పాత కాలువ నీటి విడుదలపై ఎటువంటి అపోహలు వద్దని, కాలువ కింద పంటలను ఎట్టి పరిస్థితుల్లో ఎండిపోనివ్వమని హామీ ఇచ్చారు. పాలేరు పాత కాలువ ఆయకట్టుపై అపోహలను నమ్మవద్దని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మ¯ŒS మువ్వా విజయ్‌బాబు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు వడ్తియ రాంచంద్రునాయక్, సర్పంచ్ పోలంపల్లి అప్పారావు, జడ్పీ సీఈఓ మారుపాక నాగేష్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బేగ్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులపై తోటి పోలీసు కాల్పులు ఒకరు మృతి
-
ఒకేరోజు లక్ష మెుక్కలు..
మిర్యాలగూడ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగాచేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడలో మహా హరితహారం నిర్వహించడానికి సర్వం సిద్ధమైంది. పట్టణంలో ఒకేరోజు లక్ష మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని అన్ని కాలనీలలో ఉదయం 11 గంటల ఒకేసారి ఉద్యమంలా హరితహారం కార్యక్రమం నిర్వహించడానికి వారం రోజుల క్రితమే గుంతలు తీయడంతోపాటు మొక్కలు పంపిణీ చేశారు. అంతే కాకుండా మున్సిపాలిటీ నుంచి మెప్మా ఆధ్వర్యంలో ప్రచారం సైతం నిర్వహించారు. ఉదయం 10:30 రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు హాజరు కానున్నారు. అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై వై జంక్షన్ వద్ద అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహల వద్ద, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం వద్ద, తెలంగాణ అమరవీరు ల స్థూపం వద్ద మొక్క లు నాటనున్నారు. ఇండోర్ స్టేడియం ప్రారంభం స్థానిక ఎన్ఎస్పీ క్యాం పులో నిర్మాణం పూర్తయిన ఇండోర్ స్టేడియా న్ని మంత్రి జగదీశ్‌రెడ్డి ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. స్టేడియం నిర్మాణానికి గాను సహకరించిన దాతలు అనిరెడ్డి వీరారెడ్డి, సమ్మిడి వీరారెడ్డిలను మంత్రి సన్మానిస్తారు. ఉదయం 11గంటలకు బహిరంగసభ హరితహారం కార్యక్రమంలో భాగంగా లక్ష మొక్కలు నాటే కార్యక్రమం అనంతర స్థానిక ఎన్ఎస్పీ క్యాంపులో ఉదయం 11:30 గంటలకు బహిరంగసభ నిర్వహించనున్నారు. బహిరంసభకు అన్ని వర్గాల ప్రజలు హాజరయ్యే విధంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు చేపట్టారు. పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆశవర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల ప్రతినిధులు హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టారు. -
స్వచ్ఛందంగా మెుక్కలు నాటాలి
మెట్పల్లి : పర్యావరణ పరిరక్షణకోసం ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సూచించారు. పట్టణంలోని ఖాదీ ప్రతిష్టాన్‌లో సోమవారం హరితహారం నిర్వహించారు. ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మర్రి ఉమారాణి, నాయకులు మర్రి సహదేవ్, ద్యావత్ నారాయణ, సోమిడి శివ, ఖాదీ జీఎం వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలందరికీ ఒకటే టూత్ బ్రష్!
అంగవైకల్యంతో అవస్థలు పడే పిల్లలకు ఆసరా అందించాల్సిన ప్రభుత్వ హాస్టళ్లు, జీవిత చరమాంకంలో పట్టించుకునేవారు లేక పడరాని పాట్లు పడే వృద్ధుల ఆశ్రమాల పరిస్థితి దయనీయంగా ఉందని జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఛైర్మన్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిడెడ్ హోమ్స్‌లో సుమారు 50 మంది పిల్లలు ఒకే టూత్ బ్రష్ వాడుతున్నవైనం తనను ఎంతో బాధిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాధీనంలో కొనసాగుతున్న వికలాంగ బాలల హాస్టళ్ళు, వృద్ధాశ్రమాల్లో పరిస్థితిపై.. ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్ హెచ్ఎల్ దత్తు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధాశ్రమాలను, హాస్టళ్ళను ప్రతిరోజూ సందర్శిస్తున్న ఆయన... వారికి సరైన సహకారం అందించి వారిలో విశ్వాసాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గత డిసెంబర్ లో భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉద్యోగ విరమణ చేసిన అనంతరం ఎన్ హెచ్ ఆర్సీ ఛైర్మన్ గా నియమితులైన తర్వాత.. ప్రతిరోజూ బెంగళూరు సమీపంలోని వృద్ధాశ్రమాలను సందర్శించి వారితో కొంత సమయం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వృద్ధుడి కథ విన్నానని చెప్పారు. ఆయనకు ఇద్దరు బాగా సంపాదిస్తున్న, ఉన్నత స్థాయిలో ఉన్న కొడుకులు ఉన్నారని, అయితే వారితో కలసి తనకు ఉండే భాగ్యం మాత్రం కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం తనను ఎంతో బాధించిందని, అటువంటి వారికి రోజూ కౌన్సెలింగ్ ఇప్పించి, వారిలో విశ్వాసాన్ని నింపాల్సిన అవసరం ఉందని జస్టిస్ దత్తు అభిప్రాయపడ్డారు. జస్టిస్ దత్తు ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు తీసుకున్న తరువాత... ఇరత సభ్యులు జస్టిస్ సిరియాక్ జోసెఫ్, డి. మురుగేశన్, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఎస్సి సిన్హాలతో అనేకసార్లు సమావేశాలు నిర్వహించి.. రాష్ట్రాల్లోని వికలాంగ పిల్లల హాస్టళ్లు, వృద్ధాశ్రమాలను సందర్శించి, ప్రాథమిక సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని కోరారు. వాటి పరిస్థితులను మెరుగు పరిచేందుకు కావలసిన సలహాలు, సూచనలను ఇచ్చేందుకు ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేశారు. ప్రభుత్వ వృద్ధాశ్రమాల్లో, వికలాంగ హాస్టళ్ళలో ఉండేవారి జీవితాలు ఆనందమయంగా ఉండేట్టు మార్పులు జరిగితే తన జీవితంలో అదే అత్యంత సంతోషకర సన్నివేశం అవుతుందని జస్టిస్ దత్తు అభిప్రాయం వ్యక్తం చేశారు. -
వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి
-
ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృత్యువాత
సంబేపల్లి: ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొన్న ఘటనలో బైక్‌పై వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. వైఎస్సార్ జిల్లా సంబేపల్లి మండలకేంద్రం సమీపంలో కర్నూలు- చిత్తూరు రహదారిపై శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తిరుపతి వైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని తిరుపతి నుంచి రాయచోటి వైపు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తి తల తెగిపోయింది. దీంతో మృతున్ని గుర్తించటం కష్టంగా మారింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. -
కాల్‌మనీ వ్యవహారంలో కొత్త కోణాలు
-
ఒక్కరికి ఒకటే ఓటు: భన్వర్‌లాల్
సోమందేపల్లి: ఓటరు కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేయడం వల్ల ఒక్క వ్యక్తికి దేశ వ్యాప్తంగా ఒకే ఓటు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. శుక్రవారం అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం జూలకుంట గ్రామంలో వెలసిన భైలాంజనేయస్వామి విగ్రహాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కొంతమంది మూడు నాలుగు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారని, దీనిని నివారించాలనే ముఖ్య ఉద్దేశంతో ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం చేస్తున్నామన్నారు. ఇలా చేయడం వల్ల ఓటరు కార్డు ఉన్న వ్యక్తి ఏ ప్రాంతానికి నివాసం వెళ్లినా అతని ఓటు కూడా అక్కడకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫర్ అవుతుందన్నారు. -
మంగళూరులో హంగామా
షర్ట్ లేకుండా ఏ సినిమాలోనూ కనిపించని మహేష్‌బాబు... ‘1’ సినిమా కోసం ఏకంగా సిక్స్ ప్యాక్ చేసేశారు. ఇక్కడున్న మహేష్ స్టిల్ చూడండి... సిక్స్‌ప్యాక్ సూచా యగా కనిపిస్తోంది. సాధారణంగా సిక్స్ ప్యాక్ చేస్తే... ఫేస్‌లో బ్యూటీ పోతుందంటారు. చాలామంది హీరోల విషయంలో అది జరిగింది కూడా. కానీ మహేష్ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఏ మాత్రం గ్లామర్ చెడ కుండా... ఎప్పటిలాగే మిల్కీబోయ్లా ఉన్నారు ప్రిన్స్. ఏడాదిన్నర నుంచి ఈ సినిమా కోసమే అహర్నిశలూ శ్రమిస్తున్నారాయన. దీన్ని బట్టి... ‘1’ సినిమాపై మహేష్ ఎన్ని ఆశలు పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే.. ప్రతిష్టాత్మకంగా సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కథానాయకుడి పాత్రలను భిన్నంగా మలిచే సుకుమార్ ఈ సినిమాలో కూడా మహేష్ పాత్రను చాలా కొత్తగా డిజైన్ చేసినట్లు తెలిసింది. ఇందులోని మహేష్ పాత్ర ప్రవర్తించే తీరు ఊహలకు అతీతంగా ఉంటుందట. మహేష్ కెరీర్లో ఇప్పటివరకూ చేయని పాత్రను ఇందులో చేస్తున్నట్లు వినికిడి. కథ, కథనాల విషయంలో హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ సినిమా ఉండనుందని సమాచారం. లండన్‌లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించారు సుకుమార్. ఈ నెల 25 నుంచి మంగళూరులోని డాక్‌యార్డ్, బీచ్ ప్రాంతాల్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. సినిమాకే హైలైట్‌గా నిలిచేలా ఈ సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. ఎట్టిపరిస్థితుల్లో నవంబర్ చివరికల్లా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర కృతనిశ్చయంతో ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను డిసెంబర్ రెండో వారంలో విడుదల చేసి, సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. మహేష్ తనయుడు గౌతమ్‌కృష్ణ బాలనటునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో కీర్తి సనన్ కథానాయిక. నాజర్, సయాజీ షిండే, కెల్లీ డోర్జీ, విక్రమ్ సింగ్, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణమురళి, శ్రీనివాసరెడ్డి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్.రత్నవేలు, కూర్పు: కార్తీక శ్రీనివాస్, నిర్మాణం: 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్.