ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృత్యువాత | one person dead in road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృత్యువాత

Published Fri, Jan 1 2016 7:39 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

one person dead in road accident

సంబేపల్లి: ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొన్న ఘటనలో బైక్‌పై వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. వైఎస్సార్ జిల్లా సంబేపల్లి మండలకేంద్రం సమీపంలో కర్నూలు- చిత్తూరు రహదారిపై శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తిరుపతి వైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని తిరుపతి నుంచి రాయచోటి వైపు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తి తల తెగిపోయింది. దీంతో మృతున్ని గుర్తించటం కష్టంగా మారింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement