కర్ణాటక: కొత్త ఏడాది అంటే ఐటీ సిటీలో ఉత్సవ వాతావరణం నెలకొంటుంది. డిసెంబరు ఆఖరి రోజు సాయంత్రం నుంచి జనవరి 1వ తేదీ తెల్లవారేవరకూ రోడ్లు, కూడళ్లలో నగరవాసులు మజా చేస్తారు. ఈ నేపథ్యంలో రాబోయే నూతన సంవత్సర సంబరాలపై బీబీఎంపీ, పోలీస్‌శాఖ మార్గదర్శకాలను విడుదల చేశాయి.
► 31వ తేదీ అర్ధరాత్రి 1 గంటలోగా న్యూ ఇయర్ వేడుకలను ముగించాలి.
► బెంగళూరు ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, ఇందిరా నగరలో న్యూ ఇయర్ సంబరాలకు అనుమతి ఉంది.
► ఆ రోజు రాత్రి 10 గంటల అనంతరం 31 తేదీ రాత్రి నగరంలోని ప్రముఖ ఫ్లై ఓవర్లు బంద్.
► ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డులో 200 కు పైగా సీసీటీవీ అమర్చడంతో ఎలాంటి అసాంఘిక ఘటనలు జరగకుండా నియంత్రణ. రాత్రి 8 గంటల నుంచి ఈ రోడ్లలో వాహన సంచారం నిషేధం
► సంబరాలకు వచ్చేవారికి ప్రత్యేక పార్కింగ్ వ్యవస్థ. మహిళల భద్రత కోసం భారీగా మహిళా పోలీసుల మోహరింపు
► అర్ధరాత్రి 1 గంట తరువాత బార్, పబ్‌లను మూసివేయాలి
► సామూహిక న్యూ ఇయర్ విందు వినోదాలకు అనుమతి తప్పనిసరి
► లౌడ్ స్పీకర్లు, టపాసుల కాల్చడంపై ఆంక్షలు
► రాత్రి 1 గంట వరకు మెట్రో రైలు, సిటీ బస్సుల సంచారం.
Comments
Please login to add a commentAdd a comment