nightclub
-
అర్ధరాత్రి 1 గంట వరకూ న్యూ ఇయర్
కర్ణాటక: కొత్త ఏడాది అంటే ఐటీ సిటీలో ఉత్సవ వాతావరణం నెలకొంటుంది. డిసెంబరు ఆఖరి రోజు సాయంత్రం నుంచి జనవరి 1వ తేదీ తెల్లవారేవరకూ రోడ్లు, కూడళ్లలో నగరవాసులు మజా చేస్తారు. ఈ నేపథ్యంలో రాబోయే నూతన సంవత్సర సంబరాలపై బీబీఎంపీ, పోలీస్‌శాఖ మార్గదర్శకాలను విడుదల చేశాయి. ► 31వ తేదీ అర్ధరాత్రి 1 గంటలోగా న్యూ ఇయర్ వేడుకలను ముగించాలి. ► బెంగళూరు ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, ఇందిరా నగరలో న్యూ ఇయర్ సంబరాలకు అనుమతి ఉంది. ► ఆ రోజు రాత్రి 10 గంటల అనంతరం 31 తేదీ రాత్రి నగరంలోని ప్రముఖ ఫ్లై ఓవర్లు బంద్. ► ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డులో 200 కు పైగా సీసీటీవీ అమర్చడంతో ఎలాంటి అసాంఘిక ఘటనలు జరగకుండా నియంత్రణ. రాత్రి 8 గంటల నుంచి ఈ రోడ్లలో వాహన సంచారం నిషేధం ► సంబరాలకు వచ్చేవారికి ప్రత్యేక పార్కింగ్ వ్యవస్థ. మహిళల భద్రత కోసం భారీగా మహిళా పోలీసుల మోహరింపు ► అర్ధరాత్రి 1 గంట తరువాత బార్, పబ్‌లను మూసివేయాలి ► సామూహిక న్యూ ఇయర్ విందు వినోదాలకు అనుమతి తప్పనిసరి ► లౌడ్ స్పీకర్లు, టపాసుల కాల్చడంపై ఆంక్షలు ► రాత్రి 1 గంట వరకు మెట్రో రైలు, సిటీ బస్సుల సంచారం. -
నైట్‌క్లబ్‌లో కోతికి గొలుసు కట్టి..వీడియో వైరల్..నెటిజన్ల ఆగ్రహం
కలకత్తా:కలకత్తాలోని ఓ నైట్‌క్లబ్‌లో గొలుసుతో కట్టిన కోతి కనిపించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామిక్ కాలనీ ప్రాంతంలోని ఓ నైట్‌క్లబ్ టాయ్ రూమ్‌లో కోతి కనిపించడంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు. క్లబ్ నిర్వహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కోరారు. అటవీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్ 16న సర్కస్ థీమ్‌తో కూడిన పార్టీని టాయ్ రూమ్‌లో నిర్వహించదలచారు. ఈ క్రమంలో ఓ కోతిని గొలుసుతో కట్టడం ద్వారా జంతువుల పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శించినట్లు ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Swastika Mukherjee (@swastikamukherjee13) కోతికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా కనిపించడంతో బెంగాళీ యాక్టర్ శ్వాస్తికా ముఖర్జీ స్పందించారు. వీడియోలను షేర్ చేస్తూ కోతిని గొలుసుతో బంధించడాన్ని ఆక్షేపించారు. మనుషులు ఇలా క్రూరంగా ఎలా మారతారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి వెళ్లిన వ్యక్తులు కూడా ఆ దృశ్యాలను చూస్తూ ఆపకుండా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. టీఎంసీ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాకు ఆ వీడియోలను ట్యాగ్ చేశారు. So #ToyRoomKolkata brought in this tiny monkey for its circus-themed night. Nothing, absolutely nothing can be more inhumane than this. @PetaIndia @Manekagandhibjp @AnushkaSharma @swastika24 @KolkataPolice @MamataOfficial @ParveenKaswan @ToyRoomLondon @PTI_News @ttindia pic.twitter.com/g57qZv12Q9 — Deblina Halder (@StoriesbyD) June 17, 2023 గొలుసుతో కోతి కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా క్షణాల్లో వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేయడంతో టాయ్ రూమ్ నిర్వహకులు వెంటనే స్పందించారు. నైట్ క్లబ్‌లోకి ఎలాంటి కోతులను అనుమతించలేదని స్పష్టం చేశారు. క్లబ్‌లోకి రాదలచిన మదారీ(కోతులను ఆడించే వ్యక్తులు)లకు అనుమతి నిరాకరించిన తర్వాత వారు రెస్టారెంట్ ప్రాంగణంలో కనిపించారని చెప్పారు. మదారీలు గ్రౌండ్ ఫ్లోర్‌కు వెళ్లి వారి జీవన పోషణను చేసుకున్నారని పేర్కొన్నారు. ఇందులో కోతులకు ఎలాంటి హానీ జరగలేదని యాజమాన్యం చెప్పుకొచ్చింది. ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.. క్షమాపణలు కోరుతున్నట్లు ఓ పోస్టును విడుదల చేసింది. View this post on Instagram A post shared by Toyroom kolkata (@toyroomkolkata) ఇదీ చదవండి:వడగాల్పుల దెబ్బకు 54 మంది మృతి.. ఆస్పత్రుల్లో స్ట్రెచర్లు లేక భుజాలపైనే.. -
నైట్‌క్లబ్ వద్ద రచ్చ.. ఐటీ యువతులతో అసభ్యకర ప్రవర్తన..
Nightclub Viral Video.. బౌన్సర్లు ఓ నైట్ క్లబ్ వద్ద హల్చల్ చేశారు. పబ్‌కు వచ్చిన మహిళతో అనుచితంగా ప్రవర్తించారు. ఓ మహిళను అసభ్యకరంగా తాకడంతో ఇదేంటని అడిగిన పాపానికి బాధితులను బౌన్సర్లు చితకబాదారు. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నగరంలోని ఉద్యోగ్ విహార్ ప్రాంతంలోని ఓ నైట్ క్లబ్‌కు కొంత మంది ఐటీ ఉద్యోగులు వెళ్లారు. వారిలో కొందరు మహిళ ఉద్యోగులు కూడా ఉన్నారు. కాగా, వారు క్లబ్‌లోని ప్రవేశిస్తున్న క్రమంలో ఓ బౌన్సర్ యువతితో అనుచితంగా ప్రవర్తించి.. తాకరాని చోట చేతి తగిలించాడు. ఈ విషయం ఆమె.. తన సహచరులకు చెప్పడంతో వారు.. బౌన్సర్లతో వాగ్వాదానికి దిగారు. Gurugram -: Bouncers brutally beat up girl and her manager friend for resisting molestation, case registered pic.twitter.com/8ri6FTwiFM — UP Model/பெண்கள் பாதுகாப்பு உபி மாடல் (@UPModel2022) August 10, 2022 ఈ క్రమంలో బౌన్సర్లు వారిపై దాడి దిగారు. మహిళలు అని కూడా చూడకుండా ఉద్యోగులందర్నీ చితకబాదారు. వారి దాడిలో కొంత మందికి రక్తం కారడంతో ఆపండి అని మహిళలు ఎంతో అరుస్తున్నా బౌన్సర్లు మాత్రం పట్టించుకోలేదు. బౌన్సర్ల దాడిలో బాధితులు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. దాడి చేస్తున్న సమయంలో బౌన్సర్లు ఓ వ్యక్తి చేతి ఉన్న వాచ్, రూ. 10వేలను తీసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Visuals from #Gurugram :Bouncers Assaulted Guests Outside Pub pic.twitter.com/C3mOEstwXh — Sonu Kanojia (@NNsonukanojia) August 10, 2022 ఇది కూడా చదవండి: గ్రూప్‌హౌస్‌లో వ్యభిచారం.. మేడపైకి ఇద్దరేసి యువతులను తీసుకొచ్చి.. -
బ్రెజిల్ నైట్‌క్లబ్‌లో కాల్పులు
రియో డీ జనీరో: ఈశాన్య బ్రెజిల్‌లోని ఫోర్టలేజా నగరంలోని ఓ నైట్ క్లబ్లో ఆగంతకులు కాల్పులు జరపటంతో 14 మంది మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి తీవ్రంగా ఉందని ప్రభుత్వాధికారులు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) 1.30 గంటలకు మూడు వాహనాల్లో వచ్చిన కొందరు సాయుధులు పార్టీలో ఉన్న వారిపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. గాయపడిన వారిలో ఓ పన్నెండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ‘ఇది కిరాతకమైన చర్య. ఇంత క్రూరమైన ఘటన ఎప్పుడూ చూడలేదు’ అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కొంతకాలంగా స్థానికంగా ఉండే రెండు డ్రగ్స్ అక్రమరవాణా బృందాల మధ్య ఘర్షణ నెలకొందని.. ఈ ఘటన కూడా ఈ రెండు వర్గాల మధ్య గొడవేనని స్థానిక మీడియా పేర్కొంది. వీరి ఘర్షణలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. జనవరి 7న ఫోర్టలేజా శివార్లలోనూ ఓ పార్టీలో జరిగిన ఘర్షణలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. -
‘గే’ క్లబ్లో ఉన్మాది కాల్పులు
-
మగవాళ్లు ముద్దుపెట్టుకోవడం నచ్చకే!
అమెరికాలోని గే నైట్ క్లబ్బులో నరమేథం సృష్టించిన సాయుధుడి గురించి మరిన్ని వివరాలు వెలుగుచూశాయి. ఫ్లోరిడా ఓర్లాండోలోని నైట్ క్లబ్బులో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 50మందిని పొట్టనబెట్టుకున్న సాయుధుడిని ఒమర్ మతీన్ (29)గా గుర్తించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు విధేతయ ప్రకటిస్తూ అతడు ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోందని స్థానిక పోలీసులు తెలిపారు. దారుణానికి ముందు అతడు 911 నంబర్‌కు ఫోన్ చేసి.. ఐఎస్ఐఎస్ మద్దతుగానే కాల్పుల తెగబడబోతున్నట్టు చెప్పాడని ప్రాథమిక దర్యాప్తును ఉటంకిస్తూ నిఘా హౌస్ సెలెక్ట్ కమిటీ డెమొక్రాట్ సభ్యుడు యాడం షిఫ్ తెలిపారు. అఫ్ఘాన్ దంపతులకు జన్మించిన ఒమర్ ఓ సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడని, గతంలో అతడికి ఎలాంటి నేరచరిత్ర లేదని పోలీసులు తెలిపారు. ఒమర్‌కు హోమోఫొబియా (స్వలింగ సంపర్క వ్యతిరేకత) ఉందని, అందువల్లే రంజాన్ నెలలో గే నైట్ క్లబ్బు లక్ష్యంగా అతడు ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. ఒమర్ తండ్రి మిర్ సిద్ధిఖీ ఎన్బీసీ చానెల్‌తో మాట్లాడుతూ తన కొడుకు గత నెలలో మియామిలో ఇద్దరు పురుషులు ముద్దు పెట్టుకుంటుంటే చూసి చాలా ఆగ్రహానికి గురయ్యాడని, అతడి వ్యతిరేకత మత సంబంధమైనది కాదని చెప్పారు. అతడు పాల్పడిన చర్య యావత్ దేశాన్ని దిగ్భ్రాంత పరిచిందని, అతడు ఇంతటి దారుణానికి పాల్పడుతాడని తాము ఊహించలేదని, ఇందుకు తాము క్షమాపణలు చెప్తున్నామని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో అత్యంత దారుణమైన కాల్పుల ఘటనగా పేరొందిన ఈ ఘటన ఐఎస్ఐఎస్ ఉగ్రవాద ప్రేరేపితమేనని ప్రాథమిక దర్యాప్తులో అందిన సమాచారం బట్టి తెలుస్తోంది. -
అమెరికా గే నైట్‌క్లబ్‌లో నరమేధం
అమెరికా చరిత్రలో మరో పాశవిక నరమేధం. ఫ్లోరిడా రాష్ట్రం ఓర్లాండోలోని పల్స్ గే నైట్ క్లబ్ లోకి చొరబడ్డ సాయుధుడు 50 మందిని కాల్చి చంపాడు. ఈ ఘటనలో మరో 53 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు పల్స్ నైట్ క్లబ్ లోకి మారణాయుధాలతో ఓ సాయుధుడు చొరబడ్డాడని, పలువురిపై కాల్పులు జరిపి, ఇంకొందరిని బందీలుగా పట్టుకున్నాడని ఓర్లాండో పోలీసులు తెలిపారు. నాలుగు గంటల ఉత్కంఠత అనంతరం పోలీసులు దుండగుణ్ని మట్టుపెట్టారు. రెండు రోజుల కిందట పాప్ సింగర్ క్రిస్టినా గ్రిమ్మీని కాల్చిచంపిన ఓర్లాండో సిటీలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. (చదవండి: ఆటోగ్రాఫ్ ఇస్తుండగా సింగర్‌పై కాల్పులు) గే నైట్ క్లబ్ లో కాల్పులపై స్థానిక మీడియా పెద్ద ఎత్తున వార్తలు ప్రసారం చేసింది. కాల్పులు ప్రారంభమైన వెంటనే ఆ ప్రదేశాన్ని విడిచి దూరంగా పారిపోండంటూ క్లబ్ నిర్వాహకులు కస్టమర్లకు మెసేజ్ లు పెట్టారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఘటన తీవ్రత దృష్ట్యా క్లబ్ వద్దకు భారీగా చేకున్న పోలీసులు.. 4 గంటల తర్వాత దుండగుణ్ని అంతం చేశారు. నిందితుడు ఏ కారణంతో కాల్పులకు పాల్పడింది తెలియాల్సి ఉంది. (చదవండి: పిచ్చి అభిమానంతోనే చంపేశాడా!) -
క్లబ్ ముందు బౌన్సర్ల కొట్లాట!
నైట్ క్లబ్‌కు వచ్చినవారిని బిత్తరపోయేలా చేస్తూ ఇద్దరు బౌన్సర్లు కొట్లాటకు దిగారు. తమకున్న భుజబలాన్ని, కండబలాన్ని చాటుతూ పరస్పరం పంచులు విసురుకున్నారు. కొట్లాట విడిపించడానికి వచ్చిన వారిని సైతం పక్కకునెట్టి ఒకరినొకరు చితకబాదుకున్నారు. గత నెల డిసెంబర్లో ఆస్ట్రేలియా లివర్‌పూల్‌లోని వాకబౌట్ క్లబ్ వద్ద జరిగిన ఈ దాడి ఇప్పుడు ఆన్లైన్లో హల్‌చేస్తోంది. పబ్లిగ్గానే ఇద్దరు బౌన్సర్లు దాడికి దిగి పంచులు విసురుకోవడం.. ఒక బౌన్సర్‌ను కిందపడేసి.. మరొకడు వానిపై కూర్చొని కొట్టడం వంటి భీతావహ దృశ్యాల్ని అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరా బంధించింది. ఈ వికృత కొట్లాటను కొందరు బిత్తరపోతే.. మరికొందరు రెవెలర్స్ షాక్ తిన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియో తాజాగా పోలీసులు విడుదల చేశారు. క్లబ్బుల వద్ద దురుసుగా ప్రవర్తించి.. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే బౌన్సర్లు ఈసారి తమలో తామే కొట్లాడుకున్నారని, ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా డోర్ భద్రత సిబ్బంది అయిన ఈ ఇద్దరు బౌన్సర్లపై వాకబౌట్ క్లబ్ వేటు వేసింది. అలాగే తమకు బౌన్సర్లను సరఫరా చేసే ఫోర్టిస్ సెక్యూరిటీతో తమ కాంట్రాక్టును రద్దు చేసుకుంది. -
రొమేనియాలో ఘోర ప్రమాదం 27 మంది మృతి