కలకత్తా:కలకత్తాలోని ఓ నైట్‌క్లబ్‌లో గొలుసుతో కట్టిన కోతి కనిపించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామిక్ కాలనీ ప్రాంతంలోని ఓ నైట్‌క్లబ్ టాయ్ రూమ్‌లో కోతి కనిపించడంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు. క్లబ్ నిర్వహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కోరారు.
అటవీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్ 16న సర్కస్ థీమ్‌తో కూడిన పార్టీని టాయ్ రూమ్‌లో నిర్వహించదలచారు. ఈ క్రమంలో ఓ కోతిని గొలుసుతో కట్టడం ద్వారా జంతువుల పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.
కోతికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా కనిపించడంతో బెంగాళీ యాక్టర్ శ్వాస్తికా ముఖర్జీ స్పందించారు. వీడియోలను షేర్ చేస్తూ కోతిని గొలుసుతో బంధించడాన్ని ఆక్షేపించారు. మనుషులు ఇలా క్రూరంగా ఎలా మారతారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి వెళ్లిన వ్యక్తులు కూడా ఆ దృశ్యాలను చూస్తూ ఆపకుండా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. టీఎంసీ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాకు ఆ వీడియోలను ట్యాగ్ చేశారు.
So #ToyRoomKolkata brought in this tiny monkey for its circus-themed night. Nothing, absolutely nothing can be more inhumane than this. @PetaIndia @Manekagandhibjp @AnushkaSharma @swastika24 @KolkataPolice @MamataOfficial @ParveenKaswan @ToyRoomLondon @PTI_News @ttindia pic.twitter.com/g57qZv12Q9
— Deblina Halder (@StoriesbyD) June 17, 2023
గొలుసుతో కోతి కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా క్షణాల్లో వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేయడంతో టాయ్ రూమ్ నిర్వహకులు వెంటనే స్పందించారు. నైట్ క్లబ్‌లోకి ఎలాంటి కోతులను అనుమతించలేదని స్పష్టం చేశారు. క్లబ్‌లోకి రాదలచిన మదారీ(కోతులను ఆడించే వ్యక్తులు)లకు అనుమతి నిరాకరించిన తర్వాత వారు రెస్టారెంట్ ప్రాంగణంలో కనిపించారని చెప్పారు. మదారీలు గ్రౌండ్ ఫ‍్లోర్‌కు వెళ్లి వారి జీవన పోషణను చేసుకున్నారని పేర్కొన్నారు. ఇందులో కోతులకు ఎలాంటి హానీ జరగలేదని యాజమాన్యం చెప్పుకొచ్చింది. ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.. క్షమాపణలు కోరుతున్నట్లు ఓ పోస్టును విడుదల చేసింది.
ఇదీ చదవండి:వడగాల్పుల దెబ్బకు 54 మంది మృతి.. ఆస్పత్రుల్లో స్ట్రెచర్లు లేక భుజాలపైనే..
Comments
Please login to add a commentAdd a comment