క్లబ్‌ ముందు బౌన్సర్ల కొట్లాట! | nightclub bouncers begin brawling between themselves | Sakshi
Sakshi News home page

క్లబ్‌ ముందు బౌన్సర్ల కొట్లాట!

Published Sun, Mar 6 2016 12:28 PM | Last Updated on Sun, Sep 3 2017 7:09 PM

క్లబ్‌ ముందు  బౌన్సర్ల కొట్లాట!

క్లబ్‌ ముందు బౌన్సర్ల కొట్లాట!

నైట్‌ క్లబ్‌కు వచ్చినవారిని బిత్తరపోయేలా చేస్తూ ఇద్దరు బౌన్సర్లు కొట్లాటకు దిగారు. తమకున్న భుజబలాన్ని, కండబలాన్ని చాటుతూ పరస్పరం పంచులు విసురుకున్నారు. కొట్లాట విడిపించడానికి వచ్చిన వారిని సైతం పక్కకునెట్టి ఒకరినొకరు చితకబాదుకున్నారు. గత నెల డిసెంబర్‌లో ఆస్ట్రేలియా లివర్‌పూల్‌లోని  వాకబౌట్‌ క్లబ్‌ వద్ద జరిగిన ఈ దాడి ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చేస్తోంది.

పబ్లిగ్గానే ఇద్దరు బౌన్సర్లు దాడికి దిగి పంచులు విసురుకోవడం.. ఒక బౌన్సర్‌ను కిందపడేసి.. మరొకడు వానిపై కూర్చొని కొట్టడం వంటి భీతావహ దృశ్యాల్ని అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరా బంధించింది. ఈ వికృత కొట్లాటను కొందరు బిత్తరపోతే.. మరికొందరు రెవెలర్స్ షాక్ తిన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియో తాజాగా పోలీసులు విడుదల చేశారు.

క్లబ్బుల వద్ద దురుసుగా ప్రవర్తించి.. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే బౌన్సర్లు ఈసారి తమలో తామే కొట్లాడుకున్నారని, ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా డోర్ భద్రత సిబ్బంది అయిన ఈ ఇద్దరు బౌన్సర్లపై వాకబౌట్‌ క్లబ్ వేటు వేసింది. అలాగే తమకు బౌన్సర్లను సరఫరా చేసే ఫోర్టిస్ సెక్యూరిటీతో తమ కాంట్రాక్టును రద్దు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement