Bouncers
-
బరిలో బౌన్సర్లు
సాక్షి, అమరావతి: సంక్రాంతి బరిలో పందెం కోళ్లతోపాటు బౌన్సర్లు సైతం దిగబోతున్నారు. సెలబ్రిటీలకు రక్షణ కవచంగా ఉండే బౌన్సర్లను షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలు, వివాహాలు, వేడుకల సందర్భాల్లో మాత్రమే బౌన్సర్లను ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇకపై ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పెద్దఎత్తున సాగే కోడి పందాల జాతరలో ప్రైవేటు సైన్యంగా బౌన్సర్లు సైతం రంగంలోకి దిగనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో ప్రధాన జిమ్ సెంటర్ల నిర్వాహకుల పర్యవేక్షణలో ఏజెన్సీలు సిద్ధమయ్యాయి. శిక్షణ పొందిన బౌన్సర్లు సిద్ధంగా ఉన్నారని, కోడి పందాల నిర్వాహకులు అవసరమైతేనే తమను సంప్రదించాలని సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి తెరలేపారు. బలిష్టమైన శరీరాకృతి, ప్రత్యేక డ్రెస్ కోడ్‌తో బరుల్లో కలియ తిరిగే వారిని చూస్తే పందాల రాయుళ్లు సైతం గొడవలకు వెనుకడుగు వేస్తారు. వారి సహకారంతో బరుల్లో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా ప్రశాంతంగా కోడి పందేలు నిర్వహిస్తారు. ప్రధానంగా భీమవరంలో 70 మంది, పాలకొల్లులో 20 మంది, రాజమండ్రిలో 300 మంది, విజయవాడలో 200 మంది, విశాఖపట్నంలో 300 మంది శిక్షణ పొందిన బౌన్సర్లు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారు. వీరికి రోజువారీ వేతనాన్ని మాట్లాడుకుని బరిలో దించితే ఖరీదైన కోడి పందాల్లో సైతం గలీజు గొడవలకు అడ్డుకట్ట పడుతుంది. ఏడాదిపాటు కఠోర తర్ఫీదు సంక్రాంతి కోడి పందేల కోసం పుంజులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పుంజుల పోరులో శాంతిభద్రతల సమస్య రాకుండా బౌన్సర్లను వినియోగిస్తున్నారు. ఇందుకోసం బౌన్సర్లకు కూడా ఏడాదిపాటు కఠోర శిక్షణ ఇస్తాం. వారికి ప్రత్యేకమైన ఆహారం, క్రమశిక్షణతో కూడిన జీవనం, తర్ఫీదులో కూడా అత్యంత శ్రద్ధ తీసుకుంటాం. – ఎస్కే ఖాసీం, కే12 జిమ్ అధినేత, భీమవరం స్టేటస్ సింబల్‌గా బౌన్సర్ సెలబ్రిటీ అయినా, ఎటువంటి ఈవెంట్ అయినా నలుగురు బౌన్సర్లు ఒకేచోట యూనిఫామ్‌తో క్రమశిక్షణతో నడిచి రావడం స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. బాడీ బిల్డింగ్ పోటీల కోసం తర్ఫీదు పొందుతున్న యువత ఇప్పుడు కోడి పందాల బరుల్లో పహారా కాసేందుకు కూడా వెళ్తున్నారు. సంక్రాంతి మూడు రోజులు పందాల బరుల్లో గస్తీ కాస్తూ ఉపాధి పొందుతారు. – షేక్ నాగూర్, బౌన్సర్, ఉండి బరిలో బౌన్సర్లకు ఉపాధి బౌన్సర్ వృత్తిని యువత ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. పెళ్లిళ్లు, వేడుకల్లో రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 ఇస్తున్నారు. సెలబ్రిటీల రక్షణకు వెళితే రూ.2,500 నుంచి రూ.3 వేలు ఇస్తున్నారు. తాజాగా కోడి పందాల బరుల్లో బౌన్సర్ల కోసం ఏజెన్సీలను సంప్రదించి ఒప్పందాలు చేసుకుంటున్నారు. వీటిలో చిన్న పందాల బరిలో రోజుకు రూ.1,500, భారీ పందాల్లో అయితే రూ.3 వేల చొప్పున ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. – అడిదెల రిచీ, సీనియర్ కోచ్, భీమవరం -
టమాటా వ్యాపారికి బౌన్సర్లంటూ తప్పుడు వార్తా కథనం.. పీటీఐ క్షమాపణలు
వారణాసి: టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో షాపు ముందు ఓ వ్యాపారి ఇద్దరు బౌన్సర్లను నియమించాడనే వార్త పీటీఐకి చిక్కులు తెచ్చిపెట్టింది. ఎట్టకేలకు ఆ వార్త అవాస్తవమైనదని పీటీఐ తెలిపింది. ఇలాంటి సమాచారాన్ని ప్రసారం చేసినందుకు క్షమాపణలు చెప్పింది. నిజనిర్ధారణ చేయడంలో విఫలమయ్యామని వెల్లడించింది. ఆ షాపు ఓనర్‌ను సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తగా గుర్తించామని పీటీఐ తెలిపింది. టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రశ్నించే ఉద్దేశంతోనే ఆ సమాచారాన్ని తమకు అందించినట్లు పీటీఐ భావించింది. వార్తల ఉన్నత ప్రమాణాలను చేరడంలో ఈ సారికి తప్పు జరిగిందని స్పష్టం చేసింది. ఆ ట్వీట్‌ను వెంటనే తొలగించినట్లు పేర్కొంది. ఉన్నత విలువలతో కూడిన నిష్పాక్షిమైన వార్తలను అందించడానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇస్తున్నట్లు ట్వీట్ చేసింది. Earlier today, PTI tweeted a story about a vegetable vendor in Varanasi hiring bouncers in light of high price of tomatoes. It has since come to our notice that the vendor is a worker of the Samajwadi Party, and his motive for giving us the information was questionable. We have,… — Press Trust of India (@PTI_News) July 9, 2023 దేశంలో టమాటా ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కేజీ ధర రూ.160 పైనే ఉంది. దీంతో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే యూపీలోని వారణాసిలో ఓ షాపు యజమాని తన టమాటా షాపు ముందు వినియోగదారులను అదుపు చేయడానికి ఇద్దరు బౌన్సర్లను పెట్టుకున్నట్లు పీటీఐ వార్తను ప్రసారం చేసింది. దొంగలు షాపు నుంచి టమాటాను ఎత్తుకుపోతున్నట్లు ఆ యజమాని పేర్కొన్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ అంశం తప్పు అని చెబుతూ ప్రసారం చేసినందుకు క్షమాపణలు చెప్పింది. ఇదీ చదవండి: టమాటాలు తెచ్చిన తంటాలు.. బౌన్సర్లను పెట్టుకున్న వ్యాపారి.. -
టమాటాలు తెచ్చిన తంటాలు.. బౌన్సర్లను పెట్టుకున్న వ్యాపారి..
వారణాసి: యూపీలోని ఓ కాయగూరల వ్యాపారి తన షాపు ముందు ఇద్దరు బౌన్సర్లను నియమించాడు. ఉన్నట్టుండి టమాటాల ధర ఆకాశాన్నంటడంతో కస్టమర్లతో ఇబ్బంది అవుతోందని బౌన్సర్లను పెట్టుకున్నట్లు చెబుతున్నాడు షాపు యజమాని. ఆ కాయగూరల వ్యాపారి మాట్లాడుతూ.. ప్రస్తుతం కిలో టమాటా ధర రూ. 160కి చేరింది. దీంతో టమాటాలు కొనడానికి వచ్చేవారు ఇక్కడ ఘర్షణలకు పాల్పడుతున్నారు. కొంత మంధైతే టమాటాలను దొంగతనంగా ఎత్తుకుపోతున్నారని తెలిపాడు. టమాటాల ధర ప్రస్తుతం కిలో రూ.160గా ఉంది. షాపుకి వచ్చేవారు కూడా 50 గ్రాములు, 100 గ్రాములు మాత్రమే కొంటున్నారని, మా షాపులో టమాటాలు దండిగా ఉన్నందున ఇక్కడ ఎలాంటి హింసాత్మక సంఘటనలు చెలరేగకుండా చూసేందుకు ఇద్దరు బౌన్సర్లను నియమించానని తెలిపాడు. కూరగాయల షాపు ముందు బౌన్సర్లు విధులు నిర్వహిస్తున్న ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో స్వైర విహారం చేస్తోంది. నెటిజన్లు కూడా అందుకు తగ్గట్టుగానే చిత్ర విచిత్రమైన కామెంట్లతో స్పందిస్తున్నారు. VIDEO | A vegetable vendor in Varanasi, UP has hired bouncers to keep customers at bay when they come to buy tomatoes, whose price has increased massively over the past few days. "I have hired bouncers because the tomato price is too high. People are indulging in violence and… pic.twitter.com/qLpO86i9Ux — Press Trust of India (@PTI_News) July 9, 2023 ఇది కూడా చదవండి: మంత్రిని ఆహ్వానించడానికి విద్యార్థులే దొరికారా? -
వలెంటైన్స్ డే అలర్ట్.. అడ్డుకుంటామంటున్న సంస్థలు
వలెంటైన్స్ డే బహిష్కరణ పిలుపులు... ప్రేమికులకు కౌన్సెలింగ్ ఇస్తామంటున్న కొన్ని సంస్థలు... ఈ పరిణామాల నేపథ్యంలో ఘర్షణలకు తావు లేకుండా హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. మంగళవారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పార్క్‌లు, యూనివర్సిటీలు, పబ్స్, హోటళ్లు, మాల్స్, నెక్లెస్‌రోడ్ తదితర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయనున్నారు. నగరంలో అయిదు జోన్లలో చేయాల్సిన ఏర్పాట్లపై సన్నాహాలు ప్రారంభించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోపక్క ప్రైవేటు బౌన్సర్లకూ మంచి గిరాకీ ఏర్పడింది. నగరంలోని పబ్స్, మాల్స్, రెస్టారెంట్స్ యాజమాన్యాలు దినసరి వేతనంపై వీరిని నియమించుకుంటున్నాయి. హెచ్చరికలు చేసిన వారిపై నిఘా ఉంచడం, అవసరమైతే ముందస్తు అరెస్టు చేయడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో అయిదు జోన్లలో పశ్చిమ మండలం అతి కీలకమైంది. అనేక పబ్స్, రెస్టారెంట్స్‌తో పాటు మాల్స్, పార్కులు ఇతర కీలక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. దీంతో దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు నిబంధనలు, సమయాలను అతిక్రమించకుండా చర్యలు తీసుకుంటున్నారు. బౌన్సర్లకు గిరాకీ.. బౌన్సర్... ఈ పేరు పబ్స్, బార్స్లకు తరచు వెళ్లే వారికి సుపరిచితమే. మితిమీరి ప్రవర్తించే వారిని, హద్దు మీరి మద్యం సేవించి గొడవలు చేసే వారిని కట్టడి చేయడానికి శాశ్వత ప్రాతిపదికన యాజమాన్యాలు వీరిని నియమించుకుంటాయి. కండలు తిరిగిన శరీరం, కళ్లల్లో చురుకుతనం, చిరునవ్వు కూడా కనిపించని ముఖం, నల్లటి యూనిఫాంలతో వీరు దర్శనమిస్తుంటారు. అయితే.. వలంటైన్ డే నేపథ్యంలో అనేక రెస్టారెంట్లు, మాల్స్ యాజమాన్యాలు సైతం వీరిని నియమించుకుంటున్నాయి. ఎవరికి వారు స్వీయ రక్షణ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా పబ్స్, మాల్స్ తదితర సంస్థల యాజమాన్యాలకు పోలీసులు ఆదేశాలు జారీ చేయడంతో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులతో పాటు బౌన్సర్లనూ ఏర్పాటు చేసుకుంటున్నారు. శాశ్వత ప్రాతిపదికన బౌన్లర్లు కలిగిన సంస్థలు సైతం మంగళవారం ఒక్క రోజుకూ అదనంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ బౌన్సర్లను అందించడానికి ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలతో పాటు జిమ్స్ సైతం ముందుకు వస్తున్నాయి. ఒక్కొక్కరికి రోజుకు రూ.2 వేల వరకు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తంలో 60 శాతం బౌన్సర్‌కు, 40 శాతం ఆయా సంస్థలు/జిమ్‌లకు చెందుతాయి. చదవండి: ఒకే ఒక లోకం నువ్వే.. లోకంలోన అందం నువ్వే.. -
Hyderabad: పవన్ కల్యాణ్ బౌన్సర్లతో గొడవ; యువకుల అరెస్ట్
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 35లోని తబలారసా హోటల్లో అర్ధరాత్రి విందు ముగించుకొని ఇద్దరు యువకులు కారులో బయల్దేరారు. పక్కనే ఉన్న సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇంటి ముందు కారు ఆపగా పక్కకు తొలగించాలని చెప్పిన బౌన్సర్లపై దుర్భాషలాడారు. బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ఆ యువకులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీరాంనగర్‌కు చెందిన చిట్నేని సాయికృష్ణ చౌదరి(32), జవహర్‌నగర్‌కు చెందిన చిట్నేని విజయ్ ఆదిత్య(27)లు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి సోమవారం రాత్రి తబలా రసా హోటల్‌కు విందుకు వచ్చారు. అర్ధరాత్రి 12 గంటలకు విందు ముగించుకొని బయటికి వచ్చిన వీరు కారును పవన్ కల్యాణ్ ఇంటి ముందు ఆపారు. ఇదేమిటని బౌన్సర్లు వెంకటేష్, రాకేష్ ప్రశ్నించి అక్కడి నుంచి తొలగించాలని కోరారు. దీంతో సాయికృష్ణ, విజయ్ ఆదిత్య ఇద్దరూ బౌన్సర్లపై గొడవకు దిగారు. తీవ్ర వాగ్వాదం జరిగింది. చెయ్యి చేసుకునేదాకా వెళ్లడంతో ఉధ్రిక్తత ఏర్పడింది. దీంతో బౌన్సర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీలతో పాటు కారు నెంబర్ ఆధారంగా సాయికృష్ణ, విజయ్ ఆదిత్యలను అదుపులోకి తీసుకొని వీరిపై ఐపీసీ సెక్షన్ 341, 323, 506 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. చదవండి: (పవన్‌కళ్యాణ్‌ని అనుసరిస్తున్న అనుమానాస్పద వాహనాలు) -
మహిళ దుస్తులు చింపి, అనుచిత దాడి...కాదు దోపిడి అంటున్న యజమాని
న్యూఢిల్లీ: ఒక క్లబ్‌లోని బౌన్సర్లు ఒక మహిళ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారు. సదరు మహిళ బట్టలు చింపి, దారుణంగా దాడి చేశారు. దీంతో సదరు మహిళ ఇద్దరు బౌన్సర్లు తన పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారంటూ పోలీసులకు ఫిర్యాదులు చేసింది. సెప్టంబర్ 18న ఢిల్లీలోని సౌత్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... సదరు బాధిత మహిళ నుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. తాము సంఘటన స్థలానికి వచ్చేటప్పటికీ మహిళ దుస్తులు చిందరవందరగా ఉన్నట్లు గుర్తించామన్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కి తరలించామని తెలిపారు. అలాగే సదరు క్లబ్‌లోని బౌన్సర్ల వివరాలను సేకరించడమే కాకుండా సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. బాధిత మహిళ స్నేహితులతో కలిసి క్లబ్‌కి వచ్చానని, ఎంట్రీపై వాగ్వాదం చోటు చేసుకోవడంతో బౌన్సర్లు ఈ ఘటనకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కానీ విచారణలో క్లబ్ యజమాని సురేంద్ర్ సింగ్ చౌదరి మరో కథ చెబుతన్నాడు. తాము ప్రతినెల స్థానిక పోలీస్ సిబ్బందికి దాదాపు రూ. 5 లక్షలు చెల్లించాల్సి వస్తుందని తెలిపాడు. ఐతే తాను చెల్లించడానికి ప్రస్తుతం నిరాకరించడంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నాడు. రాత్రి ఒంటి గంట సమయంలో ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా పోడియం వద్ద నుంచి బలవంతంగా సుమారు రూ. 1.5 లక్షలు తీసుకుని పోలీసులకు ఫోన్ చేశారని తెలిపాడు. చచ్చిన ఆ పోలీసులు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని, ఇవ్వకపోతే తీవ్ర పరిణామలు ఎదుర్కొవాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారని వివరిస్తూ..స్పెషల్ సీపీకి లేఖ రాశాడు. అలాగే పోలీసులు తమ క్లబ్ సిబ్బందిలో ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అంతేగాదు సదరు క్లబ్ యజమాని తమ క్లబ్లో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేయాలని పోలీసులను అభ్యర్థించారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: ఆస్పత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం) -
హీరోయిన్ తమన్నా బౌన్సర్ల దాడి.. వీడియో వైరల్
టాలీవుడ్ బ్యూటీ తమన్నా బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులపై రెచ్చిపోయారు. కొందరు తమన్నా ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించగా.. మీడియా ప్రతినిధులతో బౌన్సర్లు వాగ్వావాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కెమెరామెన్లకు గాయాలయ్యాయి. తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రెస్మీట్లో ఈ సంఘటన జరిగింది. అనంతరం విషయం తెలుసుకున్న చిత్ర బృందం మీడియాకు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. (చదవండి: Tamannaah Bubbly Bouncer: కోటీశ్వరుడికి ‘బబ్లీ బౌన్సర్’గా తమన్నా..) హీరోయిన తమన్నా టైటిల్ రోల్ పోషించిన చిత్రం 'బబ్లీ బౌన్సర్'. ఈ సినిమాలో సౌరభ్ శుక్లా, అభిషేక్ బజాజ్ కీలక పాత్రల్లో నటించారు. వాస్తవిక సంఘటన ఆధారంగా దర్శకుడు మధుర్ భండార్కర్ తెరకెక్కించిన ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో సెప్టెంబరు 23న విడుదలవుతోంది. విశేషమేమిటంటే ఇది హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా ఉంటుంది. మధూర్ బండార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా లేడీ బౌన్సర్‌గా నటించారు. ఇది కామెడీతో కూడిన యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ మూవీ నేరుగా ఓటీటీ విడుదల చస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. -
కొండాపూర్ పబ్‌లో రెచ్చిపోయిన బౌన్సర్లు.. కస్టమర్‌పై పిడిగుద్దులు
గచ్చిబౌలి(హైదరాబాద్): పబ్‌లలో బౌన్సర్లు రెచ్చిపోతున్నారు. కస్టమర్లకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చూడాల్సిన బౌన్సర్లే సహనం కోల్లోయి విచక్షణ రహితంగా దాడులుకు తెగబడుతున్నారు. వివరాలివీ... కూకట్పల్లి లోధా టవర్స్‌లో నివాసం ఉండే సంజీవ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు కొండాపూర్‌లోని కోమా పబ్‌కు వెళ్లారు. రాత్రి 1.30 సమయంలో టైం ముగిసిందని బయటకు వెళ్లాలని ఓ బౌన్సర్ సూచించారు. 5 నిమిషాల్లో వెళతానని చెప్పిన కొద్ది సేపటికే మరో బౌన్సర్ వచ్చి బయటకు వెళ్లాలని గద్దించాడు. బాధితుడు సంజీవ దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. ఆ తరువాత పబ్ నుంచి బయటకు వెళ్లగా బౌన్సర్లు వెంబడించారు. బౌన్సర్లు పట్టుకోగా మరో వ్యక్తి ముఖంపై పిడి గుద్దులు కురించాడు. దీంతో సంజీవ ముఖంపై తీవ్ర రక్త స్రావం జరిగింది. శనివారం ఉదయం మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బౌన్సర్లు, నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుఖేందర్ రెడ్డి తెలిపారు. బయటకు వెళుతుండగా పార్కింగ్ వద్ద నలుగురు బౌన్సర్లు నన్ను పట్టుకోగా ఓ వ్యక్తి ముఖంపై దాడి చేశాడన్నారు. -
నైట్ క్లబ్లో కాల్పుల కలకలం...ప్రమాదవశాత్తు స్నేహితుడిని కాల్చిన వ్యక్తి
ఇటీవలకాలంలో క్లబ్లో కాల్పులు జరపడం సర్వసాధారణం అయిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా నైట్ క్లబ్‌లను తెల్లవార్లు తెరిచే ఉంచుతున్నారు కొంతమంది యజమానులు. అక్కడకు వచ్చిన కొంతమంది పీకలదాక తాగి ఆ మత్తులో చిన్న తగాదాకే ఒకరినొకరు చంపుకునేంత వరకు వెళ్లిపోతున్నారు. నిజానికి అక్కడ ఎలాంటి కారణం ఉండదు. ఆ మత్తులో తూలుతూ ఒళ్లుమరిచి ఇలాంటి దారుణాలకు తెగబడుతుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి కూడా అలాంటి దారుణానికే ఒడిగట్టాడు. వివరాల్లోకెళ్తే...హర్యానాలో నైట్ క్లబ్లో ఒక వ్యక్తి మహిళతో కలిసి పబ్ నుంచి బయటకు వచ్చాడు. వాళ్లతోపాటు మరికొంతమంది కూడా వస్తున్నారు. వారంతా కారు పార్కింగ్ వద్దకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏమైందో ఏమో ఇంతలో ఒక వ్యక్తి ఒక్కసారిగా జేబులోంచి పిస్టల్ తీసి అక్కడే ఉన్న క్లబ్ బౌన్సర్ల పై కాల్పులు జరపడం ప్రారంభించాడు. అంతే అతడు జరిపిన కాల్పుల్లో ప్రమాదవశాత్తు ఒక బుల్లెట్ అతని స్నేహితుడి శరీరంలోకి వెళ్లింది. దీంతో అతని స్నేహితుడి బాధతో విలవిలలాడుతూ కింద పడిపోయాడు. ఆ వ్యక్తి పక్కనే ఉన్న మహిళా స్నేహితురాలు నివారించేందుకు యత్నించినా ఆమె పై కూడా కాల్పులు జరిపాడు. దీంతో అక్కడే ఉన్న క్లబ్ బౌన్సర్లు అతన్ని అడ్డుకోవడమే కాకుండా అతని వద్ద ఉన్న పిస్టల్ని లాక్కున్నారు. ఐతే కాసేపటికి గాయపడిన వ్యక్తితో సహా నలుగురు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన మొత్తం సమీపంలో ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజాము వరకు క్లబ్ తెరిచి ఉన్నందుకు యజమాని పైనా, కాల్పులకు పాల్పడిన వ్యక్తి పైనా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. #WATCH | Panchkula, Haryana| At around 4.30am accused open-fired outside Coco cafe in wee hours of July 3. He injured his friend & a bouncer. We've registered a case against accused & another against cafe for keeping it open till so late: PS sector 5 incharge Sukhbir Singh pic.twitter.com/C53n0uDE1p — ANI (@ANI) July 5, 2022 (చదవండి: రాహుల్ గాంధీ ఫేక్ వీడియో కేసులో న్యూస్ యాంకర్ అరెస్టు!) -
జూబ్లీహిల్స్: తాళాలు పగలగొట్టి.. దౌర్జన్యంగా ప్రవేశించి..
సాక్షి, బంజారాహిల్స్: పబ్ నిర్మాణం కోసం సిద్ధం చేస్తున్న భవనంలోకి తాళాలు పగలగొట్టి దౌర్జన్యంగా ప్రవేశించడంతోపాటు బౌన్సర్లను తీసుకొచ్చి బీభత్సం సృష్టించిన ముగ్గురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. జూబ్లీహిల్స్‌రోడ్ నెం. 36లోని ఎఫ్‌హౌజ్ భవనాన్ని రామ్ నరేష్ దండా అనే వ్యక్తి గత ఏడాది నవంబర్‌లో ఎం.రోహిత్‌రెడ్డి అనే వ్యక్తి నుంచి లీజుకు తీసుకున్నారు. దీనిలో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ పబ్ ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాది నవంబర్ నుంచి రామ్ నరేష్ దండా ఆధీనంలో ఉన్న ఈ భవనంలో రినోవేషన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 11న జెట్టి సంతోష్‌రెడ్డి, భరత్, రాజేష్ అనే వ్యక్తులు ఏడుగురు బౌన్సర్లను తీసుకొచ్చి పబ్ పనులు నడుస్తున్న భవనం తాళాలు పగలగొట్టి దౌర్జన్యంగా లోనికి ప్రవేశించారు. అక్కడున్న సీసీ కెమెరాలను ఆపేయడంతో పాటు డీవీఆర్‌తోపాటు మేనేజర్ క్యాబిన్‌లోని డెస్క్‌లో ఉండాల్సిన రూ. లక్షను తస్కరించారు. చదవండి: సర్కారు గొర్రెల్ని తీసుకొని.. లాభాలు పంచుకుందామంటూ.. గతంలో ఈ పబ్‌ను నడిపించేందుకు ప్రయత్నించిన సంతోష్‌రెడ్డి తదితరులు భాగస్వాములతో విభేదాల కారణంగా దీన్ని రాంనరేష్‌కు విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే మరిన్ని డబ్బులు డిమాండ్ చేసేందుకు భవనాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు బాధితుడు రాంనరేష్ దండా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై ఐపీసీ 455, 380 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు -
బౌన్సర్లు ఎదుర్కోలేమంటే ఆడడం ఎందుకు?
లండన్: జూనియర్ క్రికెట్ స్థాయిలో బౌన్సర్లు నిషేధించాల్సి వస్తే సీనియర్ స్థాయి క్రికెట్లోనూ దానిని వర్తింపజేయాలని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ షార్ట్‌పిచ్ బంతులను బ్యాన్ చేయాలనుకుంటే ముందు సీనియర్ స్థాయి క్రికెట్లో బ్యాన్ చేయాలని తెలిపాడు. కాగా కంకషన్ స్పెషలిస్ట్‌గా ఉన్న మైఖెల్ టర్నర్ అనే వ్యక్తి 18 ఏళ్ల వయసులోపు ఉన్న వారికి షార్ట్ పిచ్ బంతులను బ్యాన్ చేయాలంటూ ఇటీవలే అధికారుల వద్ద ప్రతిపాధన తీసుకొచ్చాడు. మేరీలెబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసిసి)లో బౌలర్లు షార్ట్ పిచ్ బంతులు వేయాలా? వద్దా? అన్న చర్చలో భాగంగా టర్నర్ ఈ విషయాన్ని ప్రస్తవించాడు. అయితే ఇదే విషయమై వాన్ తనదైన శైలిలో స్పందించాడు.చదవండి: కొత్త ఇల్లు కొనమని వెంటపడుతున్నారు 'టర్నర్ చేసిన ప్రతిపాధన హాస్యాస్పదంగా ఉంది. బౌన్సర్లు ప్రమాదకరమని తెలిసినా జూనియర్ స్థాయి నుంచి వాటిని ఎదుర్కొనే నైపుణ్యం అలవరచుకోవాలి. జూనియర్ క్రికెట్ స్థాయిలోనే ఆటగాళ్లు తమ ఆటకు పదును పెట్టుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అండర్ -19లో షార్ట్ పిచ్ బంతులను బ్యాన్ చేయాలనేది కరెక్ట్ కాదు. చిన్న పిల్లల స్థాయి క్రికెట్లో మొదటసారి మాత్రమే బౌన్సర్ ఎదుర్కొనేటప్పుడు మాత్రమే ప్రమాదకరంగా కనిపిస్తుంది. జూనియర్ స్థాయిలో నా పిల్లలు కూడా క్రికెట్లో శిక్షణ పొందుతున్నారు. అంతమాత్రానా షార్ట్‌పిచ్ బంతులను బ్యాన్ చేయాలని నేను చెప్పలేను. ఒకవేళ బ్యాన్ చేయాలనుకుంటే జూనియర్ స్థాయితో పాటు సీనియర్ స్థాయి క్రికెట్లో ఎప్పుడో షార్ట్ పిచ్ బంతుల్ని బ్యాన్ చేయాల్సింది. ఎందుకంటే సీనియర్ స్థాయి క్రికెట్లో ఇప్పటికే బౌన్సర్లు ఎదుర్కొని ఎందరో గాయాలపాలు కాగా.. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాంటి బౌన్సర్లను ఎదుర్కోలేనప్పుడు క్రికెట్ ఆడడంలో అర్థం ఉండదు' అని వెల్లడించాడు.చదవండి: ధోని తరహాలో.. చివరి బంతికి సిక్స్ కొట్టి కాగా 2014లో ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూజ్ షార్ట్ పిచ్ బంతికి బలవడం క్రికెట్ ప్రపంచంలో పెను విషాదంగా నిలిచిపోయింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా బౌలర్ సీన్ అబాట్ వేసిన షార్ట్ పిచ్ బంతి హ్యూజ్ మెడకు బలంగా తగిలింది. దీంతో మైదానంలోనే కూలబడిన హ్యూజ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి హ్యూజ్ కన్నుమూయడం విషాదంగా మారింది. -
బీకేర్ ఫుల్.. మరిన్ని బౌన్సర్లు దూసుకొస్తాయి
సిడ్నీ : టీమిండియాతో జరగనున్న నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ఆసీస్ యువ ఆటగాడు విల్ పుకోవిస్కిపై జట్టు మేనేజ్మెంట్ మంచి అంచనాలు ఉండేవి. డేవిడ్ వార్నర్ గైర్హాజరీలో పుకోవిస్కి రాణిస్తాడని ఆశలు పెట్టుకుంది. కానీ అనూహ్యంగా టీమిండియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో కార్తిక్ త్యాగి వేసిన బౌన్సర్ విల్ పుకోవిస్కి హెల్మెట్ భాగాన్ని బలంగా తాకింది. (చదవండి : 'ఐదు రోజులు ఒక్కపాటనే వినిపించారు') దీంతో కొన్ని నిమిషాల పాటు మొకాళ్లపై నిల్చుండిపోయిన పుకోవిస్కి.. తర్వాత ఫిజిమో సూచన మేరకు 23 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. వెంటనే మెడికల్ టీమ్‌ను సంప్రదించగా.. గాయం తీవ్రత అంతగా లేదని తేల్చి చెప్పింది. మరోవైపు ఆసీస్ మేనేజ్మెంట్ డిసెంబర్ 17 నుంచి ఆరంభం కానున్న మొదటి టెస్టుకు అందుబాటులో ఉంటాడని స్పష్టం చేసింది. అయితే పుకోవిస్కి ఆడడంపై ఇంకా అనుమానాలు తొలిగిపోలేదు. ఈ నేపథ్యంలో లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ పుకోవిస్కిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఇలాంటివి జరుగుతాయని నేను ముందే ఊహించా. సాధారణంగానే ఆసీస్ పిచ్‌లు పేసర్లకు స్వర్గధామంగా ఉంటాయి.ఒకవేళ బ్యాట్స్‌మన్ మైదానంలోకి దిగాడంటే.. దేశం, రాష్ట్రం, క్లబ్.. ఇలా దేనికి ప్రాతినిధ్యం వహించినా బౌన్సర్లు ఆడాల్సిందే. రానున్న టెస్టు సిరీస్‌లో పుకోవిస్కి ఆడితే ఇలాంటి బౌన్సర్లు మరిన్ని రానున్నాయి.. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. నాకు తెలిసి టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ బౌన్సర్లు వేయడంలో దిట్ట.. అతని నుంచి మంచి బౌన్సర్లను ఇదివరకే చూశా' అంటూ తెలిపాడు. కాగా అడిలైడ్ వేదికగా డిసెంబర్ 17 నుంచి ఆసీస్‌తో మొదటి డే నైట్ టెస్టు మ్యాచ జరగనుంది. (చదవండి : త్యాగి బౌన్సర్.. ఆసీస్‌కే ఎందుకిలా?) -
‘ఓవర్లో రెండు బౌన్సర్లకు అనుమతించాలి’
న్యూఢిల్లీ: టి20 క్రికెట్లో ప్రస్తుతం ఉన్న నిబంధనలను ఉన్నపళంగా మార్చాల్సిన అవసరం లేదని, అయితే బ్యాట్‌కు, బంతికి మధ్య సమతూకం ఉంచే చర్యలు మాత్రం తీసుకోవాలని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అన్నారు. ఈ ఫార్మాట్లో బౌలర్‌కు కూడా కాస్త అనుకూలత ఉండేందుకు ఓవర్లో రెండు బౌన్సర్లను అనుమతించాలని ఆయన సూచించారు. ‘టి20 క్రికెట్ ఇప్పుడు అన్ని రకాలుగా బాగుంది. అయితే బ్యాట్స్‌మన్ ఆధిపత్యం బాగా పెరిగిపోయింది. కాబట్టి బౌలర్ కోసం ఓవర్‌కు రెండు బౌన్సర్లు అనుమతించాలి. మైదానాల్లో ఉన్న అవకాశాన్ని బట్టి బౌండరీ దూరం కూడా పెంచాలి’ అని సన్నీ చెప్పారు. మరోవైపు నోబాల్‌లను మూడో అంపైర్లు పర్యవేక్షిస్తున్న విధంగానే బంతి వేయక ముందే క్రీజ్ దాటి ముందుకు వచ్చే నాన్స్ట్రయికర్ల విషయంలో కూడా ఒక కన్నేయాలని అభిప్రాయపడ్డారు. అలా చేస్తే బ్యాట్స్‌మన్ ఖాతాలోంచి ఒక పరుగు తగ్గించాలని వ్యాఖ్యానించిన గావస్కర్... గత మ్యాచ్‌లో ఫించ్‌ను అశ్విన్ మన్కడింగ్ చేయకపోవడాన్ని అభినందించారు. ‘అశ్విన్ చాలా తెలివైన క్రికెటర్. ఇలా చేయడం ద్వారా అతను జట్టు కోచ్ పాంటింగ్ మాటకు విలువిచ్చినట్లు, గౌరవించినట్లు అయింది. ఆపై మళ్లీ చేస్తే వదిలిపెట్టనంటూ హెచ్చరిక జారీ చేయడం కూడా చెప్పుకోదగ్గ విషయం’ అని భారత మాజీ కెప్టెన్ విశ్లేషించారు. -
ఎవరు గన్మన్లు.. ఎవరు బౌన్సర్లు?
నల్లగొండ జిల్లాలో ఓ మాజీ జెడ్పీటీసీ ఆత్మరక్షణ కోసం తీసుకున్న తుపాకీని ఓ రియల్ఎస్టేట్ గొడవలో చూపించి ప్రత్యర్థులను బెదిరించి జైలు పాలయ్యాడు. ములుగు జిల్లాల్లో తన తండ్రికి కేటాయించినగన్మన్లను, బౌన్సర్లను చూపించి పలువురిని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఓ నేత కుమారుడు. ఆత్మరక్షణ మాటున బెదిరింపులపర్వం సాగుతోంది. లైసెన్స్డ్ గన్ ‘గురి’తప్పింది. ప్రభుత్వం కేటాయించిన గన్మన్లను, లైసెన్స్డ్ తుపాకులను కొందరు మాజీ ప్రజాప్రతినిధులు దుర్వినియోగం చేస్తున్నారు. వ్యక్తిగత వ్యవహారాల్లో తుపాకులు, గన్మెన్లను చూపి తమ ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇంకొందరైతే ప్రైవేటు గన్మన్లను పోలీసులుగా చెప్పుకుంటూ ఎదుటివారిని భయపెడుతున్నారు. దీంతో గన్మన్లు, లైసెన్స్డ్ గన్స్, ప్రైవేటు బౌన్సర్ల విషయంలో కొందరు నేతలు మితిమీరి ప్రవర్తిస్తున్నారన్న ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ఇటీవల నల్లగొండ జిల్లాలో ఓ నేత ప్రైవేటు వ్యవహారంలో లైసెన్స్డ్ గన్ చూపి బెదిరింపులకు దిగడం కలకలం రేపింది. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఎంతమందికి గన్‌మెన్ సౌకర్యం? రాష్ట్రంలో ఎవరెవరికి గన్‌మెన్ సౌకర్యం కల్పించారు? వారికి ఎంత వ్యయం అవుతుంది? ఈ సేవలు పొందుతున్నందుకు వారేమైనా రుసుము చెల్లిస్తున్నారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ కోదాడకు చెందిన జలగం సుధీర్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనిపై స్పందించిన పోలీసుశాఖ ఆ వివరాలు సెక్షన్ 24 (4) ప్రకారం వెల్లడించలేమంటూ సమాధానం ఇచ్చింది. బౌన్సర్లను పోలీసులుగా.. ప్రాణ భయం ఉన్న పలువురు మాజీ ప్రజాప్రతినిధులకు పోలీసుశాఖ గన్మన్లను కేటాయించింది. లైసెన్స్డ్ గన్స్ మంజూరు చేసింది. ఇంకొందరు తమ వెంట ప్రైవేటు బౌన్సర్లను పెట్టుకుంటున్నారు. వారినే పోలీసులుగా చూపిస్తూ ప్రత్యర్థులను బెదిరిస్తున్నారన్న ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. హెయిర్ కటింగ్, సఫారీలు వేసుకోవడం, బాడీ లాంగ్వేజ్, నడుముకు తుపాకులు ఉండటంతో వీరు కూడా పోలీసులేనని జనాలు భ్రమపడిపోతున్నారు. స్పష్టత, పర్యవేక్షణ అవసరం.. ప్రభుత్వం ఎంతమందికి గన్మన్లతో రక్షణ కల్పించారన్న విషయం జిల్లాల వారీగా విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రైవేటు బాడీగార్డులు, బౌన్సర్లకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉండాలని, వారి కదలికల సమాచారం సంబంధిత పోలీసుస్టేషన్‌కు ఉండేలా మార్పులు చేయాలని సూచిస్తున్నారు. పారదర్శకత, పోలీసుల పర్యవేక్షణ పెరిగితే అమాయకులపై బెదిరింపులు అంతగా తగ్గుతాయని అభిప్రాయపడుతున్నారు. -
‘వారికి రోజుకు రూ. 7000 ’
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశ రాజధానిలో బాడీబిల్డర్లకు భారీ డిమాండ్ నెలకొంది. అభ్యర్ధులకు భద్రతగా వెన్నంటి నిలవడంతో పాటు, ప్రత్యర్ధుల నుంచి దాడుల ముప్పును తిప్పికొట్టేందుకు బౌన్సర్లను నియమించుకునేందుకు అభ్యర్ధులు మొగ్గుచూపుతున్నారు. పోలింగ్ ముగిసేవరకూ ఆరు నుంచి ఏడుగురు బౌన్సర్లను తమ చుట్టూ తిప్పుకునేందుకు అభ్యర్ధులు, కీలక నేతలు ఆసక్తి కనబరుస్తుండటంతో జిమ్‌లు, సెక్యూరిటీ ఏజెన్సీల వద్ద సందడి నెలకొంది. పోలింగ్ తేదీ వరకూ రోజూ 24 గంటల పాటు అభ్యర్ధుల వెన్నంటి ఉండేలా కండలుతీరిన దేహం కలిగిన వారిని రిక్రూట్ చేసుకుంటున్నామని, దీనికోసం వారికి రోజుకు ఆరు నుంచి ఏడు వేల రూపాయల వరకూ ముట్టచెపుతున్నామని ఓ పార్టీ కీలక నేత చెప్పుకొచ్చారు. బాడీబిల్డర్లు ఆహారం కోసమే రోజుకు రూ 3000 నుంచి 3500 వెచ్చిస్తారని, దాంతో పాటు ఏరియా, అతని రేటింగ్స్‌ను బట్టి బౌన్సర్‌కు రోజుకు రూ 2000 నుంచి 3000 వరకూ చెల్లిస్తామని వెల్లడించారు. మరోవైపు అభ్యర్ధులు, రాజకీయ నేతల చుట్టూ చేరిన బౌన్సర్లతో పోలీసులకు పెనుసవాల్ ఎదురవుతోంది. రాజకీయ పార్టీల ర్యాలీల సందర్భంగా బౌన్సర్ల ఆగడాలు పెరగడం, ఓటర్లు, ప్రత్యర్ధి పార్టీల కార్యకర్తలపై దురుసు ప్రవర్తనతో హింసాత్మక ఘటనలు చెలరేగుతాయనే ఆందోళన ఖాకీలను వెంటాడుతోంది. బౌన్సర్లకు చెక్ పెట్టేందుకు పోలీసులు ఢిల్లీ సహా పరిసర ప్రాంత జిమ్‌లపై తనిఖీ చేపట్టారు. జిమ్‌లకు రోజూ వచ్చే వ్యక్తుల జాబితాను పరిశీలిస్తూ వరుసగా రెండు రోజులు జిమ్‌కు హాజరుకాని బాడీబిల్డర్లను గుర్తించి వారిపై ఆరా తీస్తున్నారు. బౌన్సర్ల కారణంగా పోలింగ్ ఏజెంట్లపై దాడులు, ఎన్నికల సందర్భంగా అల్లర్లు తలెత్తకుండా నిరోధించేందుకు చర్యలు చేపట్టామని ఢిల్లీ పోలీస్ ప్రతినిధి మాధుర్ వర్మ వెల్లడించారు. కాగా ఏప్రిల్ 11న ఏడు దశల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుండగా, ఢిల్లీలో ఆరో విడత మే 12న పోలింగ్ జరగనుంది. -
వాలెంటైన్స్ అలర్ట్! బౌన్సర్లకు భలే గిరాకీ...
సాక్షి, సిటీబ్యూరో: వాలంటైన్స్ డే బహిష్కరణ పిలుపు, ప్రేమికులను అడ్డుకుంటామని, కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామంటూ కొన్ని సంఘాల హెచ్చరికల నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పార్కులు, యూనివర్శిటీలు, పబ్స్, హోటళ్లు, మాల్స్, నెక్లెస్‌రోడ్ తదితర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయనున్నారు. నగరంలో ఐదు జోన్లలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై సన్నాహాలు ప్రారంభించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోపక్క ప్రైవేటు బౌన్సర్లకూ మంచి గిరాకీ ఏర్పడింది. నగరంలోని అనేక పబ్స్, మాల్స్, రెస్టారెంట్స్ యాజమాన్యాలు రోజు వేతనంపై వీరిని నియమించుకుంటున్నాయి. హెచ్చరికలు చేసిన వారిపై నిఘా ఉంచడం, అవసరమైతే ముందస్తు అరెస్టు చేయడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని ఐదు జోన్లలో పశ్చిమ మండలం అతి కీలకమైంది. అనేక పబ్‌లు, రెస్టారెంట్స్‌తో పాటు మాల్స్, పార్కులు ఇతర కీలక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. దీంతో అధికారులు ఈ జోన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓ పక్క సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటంతో పాటు నిర్వాహకులు సైతం నిబంధనలు, సమయాలను అతిక్రమించకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోపక్క నెక్లెస్‌రోడ్, ఐమాక్స్, ఎన్టీఆర్ మార్గ్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. బౌన్సర్లకు భలే గిరాకీ... బౌన్సర్... ఈ పేరు పబ్‌లు, బార్లకు తరచు వెళ్లే వారికి సుపరిచితమే. మితిమీరి ప్రవర్తించే వారిని, హద్దు మీరి మద్యం సేవించి గొడవలు చేసే వారిని కట్టడి చేయడానికి శాశ్వత ప్రాతిపదికన యాజమాన్యాలు వీరిని నియమించుకుంటాయి. కండలు తిరిగిన శరీరం, కళ్లల్లో చురుకుతనం, చిరునవ్వు కూడా కనిపించని ముఖం, నల్లటి యూనిఫాం (సాధారణంగా షర్టు, టీషర్టు మాత్రమే నల్లవి ధరిస్తారు)లతో వీరు దర్శనమిస్తుంటారు. అయితే వాలెంటైన్ డే నేపథ్యంలో అనేక రెస్టారెంట్లు, మాల్స్ యాజమాన్యాలు సైతం వీరిని నియమించుకుంటున్నాయి. ఎవరికి వారు స్వీయ రక్షణ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా పబ్స్, మాల్స్ తదితర సంస్థల యాజమాన్యాలకు పోలీసులు ఆదేశాలు జారీ చేయడంతో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులతో పాటు బౌన్సర్లనూ ఏర్పాటు చేసుకుంటున్నారు. శాశ్వత ప్రాతిపదికన బౌన్సర్లు కలిగిన సంస్థలు సైతం గురువారం ఒక్కరోజుకూ అదనంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ప్రైవేట్ బౌన్సర్లను అందించడానికి ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలతో పాటు జిమ్స్ సైతం ఆసక్తి చూపుతున్నాయి. ఒక్కొక్కరికి రోజుకు రూ.2 వేల వరకు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తంలో 80 శాతం బౌన్సర్‌కు, 20 శాతం అతడిని ఏర్పాటు చేసిన సంస్థకు చెందుతాయని సమాచారం. -
నిరసనలపై బౌన్సర్!
బౌన్సర్లు.. ఒకప్పుడు బార్ వద్ద కనిపించేవారు.. ఎన్నికల పుణ్యమాని ఇప్పుడు ప్రతిచోటా కనిపిస్తున్నారు. ఆశావహుల అసంతృప్తి, నిరసనల నేపథ్యంలో భద్రత కోసం ఇప్పుడు పార్టీ కార్యాలయాలు, నేతల వద్ద వీళ్లే దర్శనమిస్తున్నారు. గాంధీ భవన్ వద్ద అయితే పోలీసుల కంటే రెట్టింపు సంఖ్యలో బౌన్సర్లను మోహరించిన విషయం తెలిసిందే. నగరవ్యాప్తంగా పలువురు అభ్యర్థులు, ఛోటామోటా నేతల వెంట తిరగడానికి ఇతర ప్రాంతాల నుంచీ బౌన్సర్లు ‘దిగుమతి’ అవుతున్నారు. అయితే, బౌన్సర్ల కారణంగా స్థానికంగా ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు వారిపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. సాక్షి, హైదరాబాద్ బౌన్సర్... ఈ పేరు పబ్బులు, బార్లకు వెళ్లేవారికి సుపరిచితమే. మితిమీరి ప్రవర్తించేవారిని, హద్దు మీరి మద్యం సేవించి గొడవలు చేసేవారిని కట్టడి చేయడానికి శాశ్వత ప్రాతిపదికన యాజమాన్యాలు ఈ బౌన్సర్లను నియమించుకుంటాయి. కండలు తిరిగిన శరీరం, చిరునవ్వు కూడా కనిపించని ముఖం, నల్లటి యూనిఫాం(సాధారణంగా టీ–షర్ట్, జీన్స్)లో వీరు కనిపిస్తుంటారు. ఎన్నికల నేపథ్యంలో వారి వస్త్రాలు నలుపు డ్రస్ నుంచి సఫారీకో, ఖద్దరుకో మారుతున్నాయి. కొందరు బాడీ బిల్డర్లయితే ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వీరికి రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు ‘జీతం’లభిస్తోందని తెలిసింది. గన్‌మెన్ ముచ్చట తీరుతోంది... ఈ బౌన్సర్లను సఫారీ దుస్తుల్లో తమ వెంట తిప్పుకుంటున్న నాయకులు గన్‌మెన్ ముచ్చట తీర్చుకుంటున్నారు. సాధారణంగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులకు పోలీసు విభాగం వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కేటాయిస్తుంది. మిగిలినవారికి, అభ్యర్థుల వెంట ఉండే కీలక వ్యక్తులకు, స్వతంత్రులుగా పోటీ పడేవారికి ఆ అవకాశం లేకపోవడంతో వారంతా బౌన్సర్లను సమకూర్చుకుంటున్నారు. బౌన్సర్లను ఏర్పాటు చేయడానికి నగరంలో అనేక సెక్యూరిటీ ఏజెన్సీలతోపాటు జిమ్‌లు సైతం సిద్ధంగా ఉన్నాయి. కరుకుదనం తగ్గితే చాలంటూ... దేహదారుఢ్యంతోపాటు కాస్త చురుకుదనం, సమయస్ఫూర్తి మాత్రమే ప్రధాన అర్హతలు కావడంతో జిమ్స్తో టచ్‌లో ఉండే అనేకమంది యువకులు తాత్కాలిక బౌన్సర్లుగా ఉండటానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే, ప్రచారం నేపథ్యంలో ఎక్కడా కరుకుదనం ప్రదర్శించవద్దని ఆయా నేతలు ముందే వారికి షరతు విధిస్తున్నారు. పోలింగ్‌కు ముందు మూడు రోజులు ప్రతి అభ్యర్థికీ కీలకమైనవి. ఆ సమయంలో ఈ బౌన్సర్లకు గిరాకీ మరింత పెరగనుంది. మరోపక్క పోలీసులు సైతం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కొత్తవారి కదలికలపై కన్నేసి ఉంచుతున్నారు. నాయకుల వెంట ఉన్నవారిలో నిజమైన అనుచరులు ఎవరు? బౌన్సర్లు ఎవరు? ప్రచారం నేపథ్యంలో వారు ఏం చేస్తున్నారు? తదితర అంశాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు. ఎవరి ఆగడాలు శృతిమించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఉత్తమ్ ఇంటివద్ద బౌన్సర్లు మహాకూటమిలో అసంతృప్త జ్వాల రగులుతుండగా ఏ క్షణంలో ఎవరొచ్చి మీదపడతారో తెలియని పరిస్థితుల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి బంజారాహిల్స్‌లోని తన నివాసం వద్ద 25 మంది బౌన్సర్లను నియమించారు. మంగళవారంరాత్రి నుంచే వీరంతా ఇంటి చుట్టూ కాపలాగా ఉన్నారు. పొత్తుల్లో సీట్లు కోల్పోయిన నేతలంతా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఇంటి ముట్టడికి యత్నిస్తున్నారన్న నిఘావర్గాల హెచ్చరికలతో ఆయన ఇంటి వద్ద ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పవన్ కల్యాణ్ బౌన్సర్లకు గాయాలు
సాక్షి, తూర్పుగోదావరి : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బౌన్సర్లు ప్రయాణిస్తున్న వాహనం గురువారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. రంగంపేట వద్ద వీరి వాహనం ఓ లారీని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. రాజానగరంలో ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్ బహిరంగ సభకు వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన 9 మందిని జీఎస్ఎల్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఇదిలాఉండగా.. రాజానగరం సభ అనంతరం పవన్ కల్యాణ్ హైదరాబాద్ వెళ్లిపోయినట్టు సమాచారం. -
ఖైదీ నెంబర్ 150 ఫంక్షన్లో స్వల్ప అపశృతి
-
అల్లు అర్జున్ కాన్వాయ్‌లో అపశ్రుతి
ఎస్కార్ట్ వాహనం ఢీకొని ఒకరికిస్వల్ప గాయం నిర్వాహకులపై త్రీ టౌన్లో కేసు నమోదు విశాఖపట్నం: నగరంలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం నగరానికి వచ్చిన ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టడంతో చినవాల్తేరు ప్రాంతానికి చెందిన చెన్నా సంగీతరావు స్వల్పంగా గాయపడ్డారు. బీచ్‌రోడ్డులోని తన తాత అల్లు రామలింగయ్య విగ్రహానికి పూల మాల వేయడానికి అల్లు అర్జున్ తన అభిమానులతో కలిసి ర్యాలీగా వెళుతున్న సమయంలో ఏడాదిన్నర పసిపాపతో వెళుతున్న సంగీతరావు ద్విచక్రవాహనాన్ని కాన్వాయ్ వాహనం ఢీకొంది. అయినప్పటికీ కాన్వాయ్ ఆగకుండా వెళ్లిపోవడంతో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. బాధితుడితోపాటు స్థానికులు ప్రైవేట్ కార్యక్రమం జరుగుతున్న నోవోటెల్ హోటల్ ముందు ఆందోళన చేపట్టారు. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని బౌన్సర్లు అడ్డుకోవడంతో కాసేపు ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న ఏసీపీ నర్సింహమూర్తితోపాటు వన్ టౌన్, టూటౌన్, త్రీ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని అరుణ్‌బాబు అలియాస్ ఆర్య, కరుకు మోహన్‌కృష్ణ, తోట రమేష్‌లను త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పి పంపించారు. అనంతరం బాధితుడు చెన్నా సంగీతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాన్వాయ్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. -
బౌన్సర్స్ అసోసియేషన్ సమావేశం
తాడితోట (రాజమహేంద్రవరం) : తూర్పుగోదావరి జిల్లా బౌన్సర్స్ అసోసియేషన్ సమావేశాన్ని రాజమహేంద్రవరంలోని దానవాయిపేట వద్ద గల పవర్ ఫ్లెక్స్ గేమ్‌లో శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి డీసీసీ మాజీ వైస్ ప్రెసిడెంట్ తగరం సురేష్ బాబు అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి అడ్డూరి వెంకట రమణ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తగరం సురేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా బౌన్సర్లు ఉపాధి సంపాదించుకోవాలన్నారు. కార్యదర్శి పసుపులేటి సంతోష్ వందన సమర్పణ చేశారు. కోడూరి సునీల్, బొండు విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
పబ్‌లోకి అనుమతించలేదని బౌన్సర్‌పై..
బంజారాహిల్స్: పీకలదాక మద్యం తాగి ఉన్న తొమ్మిది మంది యువకులు పబ్‌లోకి అనుమతించాలని గొడవ చేసి.. బౌన్సర్‌పై దాడి చేసి పరారయ్యారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లో ఉన్న కాక్టైల్ పబ్‌లో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... మల్లేపల్లికి చెందిన వసీంఖాన్, చాంద్రాయణగుట్ట కేశవగిరికి చెందిన బీ.ఫార్మసీ విద్యార్థి ఎండీ అబ్దుల్లా మరో ఏడుగురితో కలిసి గురువారం అర్ధరాత్రి 12.30కి కాక్టైల్ పబ్‌కు వచ్చారు. తమను లోనికి అనుమతిం చాలని కోరగా.. సమయం అయిపోయిందని, పబ్‌ను మూసివేస్తున్నారని బౌన్సర్ పురుషోత్తం తెలిపారు. దీంతో వీరంతా అతడితో వాగ్వాదానికి దిగి, లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. అడ్డుకు న్న బౌన్సర్‌పై దాడి చేసి గాయపర్చడంతో పాటు ఫర్నీచర్‌ను ధ్వం సం చేశారు. దీంతో పబ్‌లో మద్యం తాగుతున్న పలువురు యువతీయువకులు భయాందోళనతో అక్కడి నుంచి బయటకు పరుగుతీశారు. మిగతా బౌన్సర్లు వచ్చి వారిని పట్టుకొనేందుకు యత్నించగా పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దాడికి పాల్పడ్డవారిపై ఐపీసీ సెక్షన్ 452, 307, 427, 506, 143ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కస్టమర్‌ను చితక్కొట్టిన బౌన్సర్లు
న్యూఢిల్లీ: పబ్‌కు వచ్చిన ఓ కస్టమర్‌ను వెంటాడి మరీ చితక్కొట్టిన వైనం ఢిల్లీని గుర్గావ్లో చోటుచేసుకుంది. బౌన్సర్ల సాయంతో వినియోగదారుడిపై యాజమాన్యం వాళ్లే దాడికి దిగి తీవ్రంగా గాయపర్చిన వీడియో ఒకటి నెట్లో హల్ చల్ చేస్తోంది. దాదాపు గంట పాటు కొనసాగిన ఈ అమానుషం హాట్ టాపిక్ గా మారింది. మార్చి 17వ తేదీ రాత్రి ఇయాన్ పబ్‌కి వెళ్లిన రాకీ (24) డ్యాన్స్ చేస్తున్న క్రమంలో తూలి పక్కనే ఉన్న బౌన్సర్లపై పడ్డాడు. అంతే అగ్రహానికి గురైన బౌన్సర్లు రాకీపై పంచ్‌లతో విరుచుకుపడ్డారు. ఆరుగురు వ్యక్తులు అతనిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. దెబ్బలకు తాళలేక కిందపడిపోయినా వాళ్ల అరాచకం ఆగలేదు. విచక్షణరహితంగా దాడిచేశారు. పారిపోవడానికి ప్రయత్నించిన రాకీని కొంత దూరం పాటు వెంటాడి మరీ దాడి కొనసాగించారు. షాపింగ్ మాల్ ఆవరణలో 50 నిమిషాల పాటు కొనసాగిన వారి ఆగడాలు సీసీ టీవీ ఫుటేజిలో రికార్డయ్యాయి. ఈ సంఘటనపై రాకీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని సమాచారం. అయితే పబ్ యాజమాన్యం వాదన మరోలా ఉంది. రాకీ, అతని స్నేహితులు మద్యం సేవించి అమర్యాదకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తోంది. -
క్లబ్ ముందు బౌన్సర్ల కొట్లాట!
నైట్ క్లబ్‌కు వచ్చినవారిని బిత్తరపోయేలా చేస్తూ ఇద్దరు బౌన్సర్లు కొట్లాటకు దిగారు. తమకున్న భుజబలాన్ని, కండబలాన్ని చాటుతూ పరస్పరం పంచులు విసురుకున్నారు. కొట్లాట విడిపించడానికి వచ్చిన వారిని సైతం పక్కకునెట్టి ఒకరినొకరు చితకబాదుకున్నారు. గత నెల డిసెంబర్లో ఆస్ట్రేలియా లివర్‌పూల్‌లోని వాకబౌట్ క్లబ్ వద్ద జరిగిన ఈ దాడి ఇప్పుడు ఆన్లైన్లో హల్‌చేస్తోంది. పబ్లిగ్గానే ఇద్దరు బౌన్సర్లు దాడికి దిగి పంచులు విసురుకోవడం.. ఒక బౌన్సర్‌ను కిందపడేసి.. మరొకడు వానిపై కూర్చొని కొట్టడం వంటి భీతావహ దృశ్యాల్ని అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరా బంధించింది. ఈ వికృత కొట్లాటను కొందరు బిత్తరపోతే.. మరికొందరు రెవెలర్స్ షాక్ తిన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియో తాజాగా పోలీసులు విడుదల చేశారు. క్లబ్బుల వద్ద దురుసుగా ప్రవర్తించి.. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే బౌన్సర్లు ఈసారి తమలో తామే కొట్లాడుకున్నారని, ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా డోర్ భద్రత సిబ్బంది అయిన ఈ ఇద్దరు బౌన్సర్లపై వాకబౌట్ క్లబ్ వేటు వేసింది. అలాగే తమకు బౌన్సర్లను సరఫరా చేసే ఫోర్టిస్ సెక్యూరిటీతో తమ కాంట్రాక్టును రద్దు చేసుకుంది. -
పొలిటికల్ ‘బౌన్సర్లు’!
♦ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో నేతాశ్రీల వెంట ప్రత్యక్షం ♦ సరఫరాకు కీలక కేంద్రాలుగా జిమ్‌లు ♦ ఇతర ప్రాంతాల నుంచీ బౌన్సర్ల ‘దిగుమతి’ ♦ అపశ్రుతులకు తావులేకుండా పోలీసుల చర్యలు ఎలక్షన్లో ఎన్నెన్నో వింతలు..విశేషాలు. ప్రచారంలో వింత పోకడలు. గల్లీగల్లీలో అభ్యర్థుల చక్కర్లు. వారి వెంట నయా నయా వ్యక్తులు. ఆరా తీస్తే...వారు బౌన్సర్లు. అవును..గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఆయా పార్టీల ముఖ్యనేతలు కొందరు ఇప్పుడు ప్రచారంలో వారి వెంట బౌన్సర్లను నియమించుకుంటున్నారు. పర్యటనలు, ప్రచారంలో ఎలాంటి అపశ్రుతులు లేకుండా..జనాలను అదుపు చేయడంతోపాటు కాస్త హంగు ఆర్భాటాలను ప్రదర్శించేందుకూ బౌన్సర్లు ఉపయోగపడుతున్నారు. ఎలక్షన్ గిరాకీతో నగరంలో బౌన్సర్ల కొరత సైతం ఏర్పడిందట. ఇతర ప్రాంతాల నుంచీ వీరిని రప్పిస్తున్నట్లు వినికిడి. - సాక్షి, సిటీబ్యూరో ‘గ్రేటర్’ ఎన్నికల నేపథ్యంలో కేవలం ప్రచార సామాగ్రికి మాత్రమే కాదు... బౌన్సర్లకూ మంచి గిరాకీ ఏర్పడింది. వీరు నగర వ్యాప్తంగా అనేక మంది అభ్యర్థులు, చోటా మోటా నేతల వెంట తిరగడానికి ఇతర ప్రాంతాల నుంచీ ‘దిగుమతి’ అవుతున్నారు. హంగుఆర్భాటం కోసం ఆయా నేతలు సైతం వీరిని వెంటేసుకుని తిరుగుతున్నారు. ఈ బౌన్సర్ల కారణంగా ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు ఓ కన్నేసి ఉంచుతున్నారు. సాధారణంగా నల్లరంగు దుస్తుల్లో కనిపించే ఈ బౌన్సర్లు ఎలక్షన్ నేపథ్యంలో పొలిటికల్ టచ్ కోసం ఖద్దరు, సఫారీల్లోకి మారుతున్నారు. బార్ల నుంచి బహిరంగ ప్రదేశాలకు... బౌన్సర్... ఈ పేరు పబ్స్, బార్లకు తరచూ వెళ్లే వారికి సుపరిచితమే. మితిమీరి ప్రవర్తించే వారిని, హద్దు మీరి మద్యం సేవించి గొడవలు చేసే వారిని క ట్టడి చేయడానికి శాశ్వత ప్రాతిపదికన యాజమాన్యాలు వీరిని నియమించుకుంటాయి. కండలు తిరిగిన శరీరం, చిరునవ్వు కూడా కనిపించని ముఖం, నల్లటి యూనిఫాంలో వీరు దర్శనం ఇస్తుంటారు. అయితే ఎన్నికల నేపథ్యంలో చోటా స్థాయి నుంచి ఓ మాదిరి నాయకుడి వరకు వీరిని నియమించుకున్నారు. యూనిఫాం మాత్రం నలుపు డ్రస్ నుంచి సఫారీకో ఖద్దరుకో మారుతోంది. కొందరు బాడీ బిల్డర్లయితే ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వీరికి రోజుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ‘జీతం’ లభిస్తోందని వినికిడి. గన్‌మెన్ ముచ్చట తీరుతోంది... ఈ బౌన్సర్లను సఫారీ దుస్తుల్లో తమ వెంట తిప్పుకుంటున్న నేతలు గన్‌మెన్ ముచ్చట తీర్చుకుంటున్నారు. సాధారణంగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులకు పోలీసు విభాగం వ్యక్తిగత భద్రతాధికారుల్ని కేటాయిస్తుంది. జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌గా పోటీ పడేవారికి ఆ చాన్స్ లేకపోవడంతో ఇలా సర్దుకుపోతున్నారు. ఎన్నికలు లాంటి సందర్భాలతో పాటు ప్రముఖుల రాక, భారీ స్థాయిలో సాంసృ్కతిక కార్యక్రమాల ఏర్పాటు తదితర సందర్భాల్లో రక్షణ కోసం బౌన్సర్లను ఏర్పాటు చేయడానికి నగరంలో అనేక సెక్యూరిటీ ఏజెన్సీలతో పాటు జిమ్స్ సైతం సిద్ధంగా ఉంటున్నాయి. ముఖ్యంగా సినీ తారల స్టేజ్ షోలు, నటీ నటుల చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవాలు వంటి కార్యక్రమాల్లో జనాన్ని అదుపు చేయడానికి వీరి అవసరం ఎక్కువగా ఉంటోంది. కరుకుదనం తగ్గితే చాలంటూ... దేహదారుఢ్యంతో పాటు కాస్త చురుకుదనం, సమయస్ఫూర్తి మాత్రమే ప్రధాన అర్హతలు కావడంతో జిమ్స్తో టచ్‌లో ఉండే అనేక మంది యువకులు తాత్కాలిక బౌన్సర్లుగా ఉండటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి వారినే ప్రస్తుతం రాజకీయ నాయకులు నియమించుకున్నారు. అయితే ప్రచారం నేపథ్యంలో ఎక్కడా కరుకుదనం ప్రదర్శించవద్దని ఆయా నేతలు ముందే షరతు విధిస్తున్నారట. పోలింగ్‌కు ముందు మూడు రోజులూ ప్రతి అభ్యర్థికీ కీలకమైనవి. ఆ సమయంలో ఈ బౌన్సర్లకు గిరాకీ మరింత పెరగనుంది. మరోపక్క పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కొత్త వారి కదలికలపై కన్నేసి ఉంచుతున్నారు.