Young People Arrested Who Got Into Fight With Pawan Kalyan Bouncers - Sakshi

Hyderabad: పవన్‌ కల్యాణ్‌ బౌన్సర్లతో గొడవ; యువకుల అరెస్ట్‌

Nov 3 2022 7:58 AM | Updated on Nov 3 2022 9:59 AM

Youth Arrested who got into fight with Pawan Kalyan Bouncers - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ రోడ్‌నెం. 35లోని తబలారసా హోటల్‌లో అర్ధరాత్రి విందు ముగించుకొని ఇద్దరు యువకులు కారులో బయల్దేరారు. పక్కనే ఉన్న సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఇంటి ముందు కారు ఆపగా పక్కకు తొలగించాలని చెప్పిన బౌన్సర్లపై దుర్భాషలాడారు. బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ఆ యువకులను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీరాంనగర్‌కు చెందిన చిట్నేని సాయికృష్ణ చౌదరి(32), జవహర్‌నగర్‌కు చెందిన చిట్నేని విజయ్‌ ఆదిత్య(27)లు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి సోమవారం రాత్రి తబలా రసా హోటల్‌కు విందుకు వచ్చారు. అర్ధరాత్రి 12 గంటలకు విందు ముగించుకొని బయటికి వచ్చిన వీరు కారును పవన్‌ కల్యాణ్‌ ఇంటి ముందు ఆపారు. ఇదేమిటని బౌన్సర్లు వెంకటేష్, రాకేష్‌ ప్రశ్నించి అక్కడి నుంచి తొలగించాలని కోరారు.

దీంతో సాయికృష్ణ, విజయ్‌ ఆదిత్య ఇద్దరూ బౌన్సర్లపై గొడవకు దిగారు. తీవ్ర వాగ్వాదం జరిగింది. చెయ్యి చేసుకునేదాకా వెళ్లడంతో ఉధ్రిక్తత ఏర్పడింది. దీంతో బౌన్సర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీలతో పాటు కారు నెంబర్‌ ఆధారంగా సాయికృష్ణ, విజయ్‌ ఆదిత్యలను అదుపులోకి తీసుకొని వీరిపై ఐపీసీ సెక్షన్‌ 341, 323, 506 కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. 

చదవండి: (పవన్‌కళ్యాణ్‌ని అనుసరిస్తున్న అనుమానాస్పద వాహనాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement