rude behaviour
-
నాకే కెమెరా పెడతారా?.. జానీ భార్య చిందులు
హైదరాబాద్, సాక్షి: కొరియోగ్రాఫర్ జానీ పోలీసులకు పట్టుబడ్డానన్న వార్తల తర్వాత ఆయన భార్య అయేషా అలియాస్ సుమలత బయటకు వచ్చారు. గురువారం మధ్యాహ్నాం నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆమె మీడియాపై చిందులు తొక్కారు.ఓ ఫేక్ కాల్ రావడంతో తాను పీఎస్‌కు రావాల్సి వచ్చిందని ఆమె మీడియాకు తెలిపారు. అయితే.. భర్త లైంగిక వేధింపుల వ్యవహారంపై స్పందించాలని అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు ఆమెను కోరారు. ఏం సమాధానం ఇవ్వాలో అర్థంకాని అయేషా.. ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. నాకే కెమెరా పెడతారా? అంటూ వాళ్ల మీద ఫైర్ అయ్యారు.మరోవైపు మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జానీ అలియాస్ షేక్ జానీ బాషాను పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. గోవా కోర్టు పీటీ వారెంట్‌కు అనుమతి ఇస్తూ.. 24 గం.లో ఉప్పరపల్లి కోర్టులో హాజరుర్చాలని తెలంగాణ ఎస్‌వోటీని ఆదేశించింది. ఇక ఈ కేసులో.. తనపై అయేషా సైతం దాడికి పాల్పడిందని బాధితురాలు ఆరోపించడం గమనార్హం. ఇదీ చదవండి: ఆపరేషన్ జానీ.. సాగిందిలా! -
వార్నర్‌పై రెచ్చిపోయిన సిరాజ్.. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన సాల్ట్
-
పరిటాల సునీతకు చేదు అనుభవం
-
Hyderabad: పవన్ కల్యాణ్ బౌన్సర్లతో గొడవ; యువకుల అరెస్ట్
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 35లోని తబలారసా హోటల్లో అర్ధరాత్రి విందు ముగించుకొని ఇద్దరు యువకులు కారులో బయల్దేరారు. పక్కనే ఉన్న సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇంటి ముందు కారు ఆపగా పక్కకు తొలగించాలని చెప్పిన బౌన్సర్లపై దుర్భాషలాడారు. బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ఆ యువకులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీరాంనగర్‌కు చెందిన చిట్నేని సాయికృష్ణ చౌదరి(32), జవహర్‌నగర్‌కు చెందిన చిట్నేని విజయ్ ఆదిత్య(27)లు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి సోమవారం రాత్రి తబలా రసా హోటల్‌కు విందుకు వచ్చారు. అర్ధరాత్రి 12 గంటలకు విందు ముగించుకొని బయటికి వచ్చిన వీరు కారును పవన్ కల్యాణ్ ఇంటి ముందు ఆపారు. ఇదేమిటని బౌన్సర్లు వెంకటేష్, రాకేష్ ప్రశ్నించి అక్కడి నుంచి తొలగించాలని కోరారు. దీంతో సాయికృష్ణ, విజయ్ ఆదిత్య ఇద్దరూ బౌన్సర్లపై గొడవకు దిగారు. తీవ్ర వాగ్వాదం జరిగింది. చెయ్యి చేసుకునేదాకా వెళ్లడంతో ఉధ్రిక్తత ఏర్పడింది. దీంతో బౌన్సర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీలతో పాటు కారు నెంబర్ ఆధారంగా సాయికృష్ణ, విజయ్ ఆదిత్యలను అదుపులోకి తీసుకొని వీరిపై ఐపీసీ సెక్షన్ 341, 323, 506 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. చదవండి: (పవన్‌కళ్యాణ్‌ని అనుసరిస్తున్న అనుమానాస్పద వాహనాలు) -
Amnesia Pub Case: ‘హోంమంత్రి పీఏ.. అమ్మాయిని లోపలికి పంపాడు’
-
Amnesia Pub Case: ‘హోంమంత్రి పీఏ.. అమ్మాయిని లోపలికి పంపాడు’
సాక్షి, హైదరాబాద్: ఆమ్నేషియా పబ్ కేసులో ఎమ్మెల్యే రఘునందన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పబ్‌లో పార్టీ బుక్ చేసింది హోంమంత్రి మనవడేనంటూ రఘునందన్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హోంమంత్రి పీఏ అమ్మాయిని లోపలికి పంపాడు. హోంమంత్రి మనవడు, వక్ఫ్‌బోర్డ్ ఛైర్మన్ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు, ఓల్డ్ సిటీకి చెందిన ప్రముఖ దినపత్రిక డైరెక్టర్ కొడుకు ఇందులో ఉన్నారన్నారు. లైంగిక దాడి కోసం వాడిన కారును ఎందుకు సీజ్ చేయలేదని రఘునందన్ ప్రశ్నించారు. బాధితురాలి కుటుంబసభ్యులకు బెదిరింపులు వస్తున్నాయని ఆయన అన్నారు. చదవండి: బంజారాహిల్స్: బాలికను కారులో తీసుకెళ్లి అసభ్యకర ప్రవర్తన -
బాలికతో అసభ్య ప్రవర్తన కేసులో ఎమ్మెల్యే కుమారుడు?
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా అండ్ ఇన్సోమియా పబ్ నుంచి బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడితో పాటు పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్న అధికారులు సూరజ్, హాదీలను అదుపులోకి తీసుకుని ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. గత నెల 28న బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో నివసించే రుమేనియా దేశానికి చెందిన బాలిక (16) ఓ పార్టీకి హాజరయ్యేందుకు తన ఇంటి సమీపంలో ఉండే హాదీతో కలిసి ఆయన బెంజ్ కారులో (టీఎస్ 09 ఎఫ్ఎల్ 6460)లో అమ్నేషియా పబ్‌కు వెళ్లింది. పథకం ప్రకారం అప్పటికే హాదీ స్నేహితుడు సూరజ్ పబ్‌లో ఉన్నాడు. పార్టీ ముగిసిన తర్వాత తిరిగి వచ్చే సమయంలో తానంతట తాను వెళ్లిపోతానని బాలిక చెప్పినా వినిపించుకోని హాదీ, సూరజ్ బలవంతంగా కారులో ఎక్కించుకుని బయలుదేరారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె కేకలు పెట్టేందుకు యత్నించగా సూరజ్, హాదీలతో పాటు మరో యువకుడు బెంజ్ కారును అక్కడే ఉంచి ఇన్నోవా కారులో బాలికను బలవంతంగా కూర్చొబెట్టుకుని పబ్ వద్దకు తీసుకువచ్చి వదిలి వెళ్లారు. ఇంటికి వెళ్లిన బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు హదీ, సూరజ్‌లతో పాటు మరో ముగ్గురు యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పబ్ నుంచి వెళ్లిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో ఆ కారులో ఓ ఎమ్మెల్యే కుమారుడు ఉన్నట్లు తేలింది. అక్కడే వదిలేసిన బెంజ్ కారును తీసుకువచ్చి సీజ్ చేశారు. అయితే.. పబ్‌లోకి బాలికను ఎలా అనుమతించారనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోపక్క నిందితుల్లోనూ ముగ్గురు మైనర్లుగా తెలుస్తోంది. (చదవండి: వివాహేతర సంబంధం: ఇంట్లో నుంచి బయటకు వెళ్లి..) -
పోలీసులపై కోపం.. టౌన్ మొత్తం కరెంట్‌కట్
సాక్షి,పలమనేరు(తిరుపతి): ఓ కేసు విచారణలో భాగంగా పోలీసులు అవమానించారని ఆగ్రహించిన ట్రాన్స్‌కో సిబ్బంది పట్టణం మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిపేయడం శుక్రవారం పలమనేరులో చర్చనీయాంశంగా మారింది. వివరాలివీ.. ఇటీవల పట్టణంలో జరిగిన గంగజాతరలో స్థానిక ముత్తాచారిపాళ్యానికి చెందిన రజని(58) కరెంట్ షాక్‌తో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో భాగంగా స్థానిక లైన్‌మన్ ప్రకాష్, సచివాలయ పరిధిలో సిబ్బందిని శుక్రవారం స్థానిక స్టేషన్‌కు పిలిపించారు. వారు వెళ్లగానే వారి సెల్ఫోన్లను తీసిపెట్టుకుని అక్కడే వేచిఉండమని చెప్పారు. దీంతో వారు తమకి, కేసుకు ఏంటి సంబంధంమంటూ అడిగినట్టు తెలిసింది. దీంతో పోలీసులు కాస్త దురుసుగా మాట్లాడడంతో, వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. పోలీసులు తమను అవమానించారని భావించిన ట్రాన్స్‌కో సిబ్బంది పట్టణంలో కరెంట్ సరఫరాను నిలిపేశారు. దీంతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆపై ట్రాన్స్‌కో ఏడీ చిన్నబ్బ, డీఎస్పీ గంగయ్య చర్చించి, ఈ విషయం పెద్దది కాకుండా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిసింది. ఈవిషయమై ట్రాన్స్‌కో ఏడీ చిన్నబ్బను ‘సాక్షి’ వివరణ కోరగా తమ సిబ్బందిపట్ల పోలీసుల తీరు బాగోలేకనే వారు కరెంటు ఆఫ్ చేసినట్టు తెలిసిందన్నారు. ఇదే విషయమై స్థానిక సీఐ భాస్కర్ స్పందిస్తూ.. విద్యుత్ షాక్‌తో మహిళ మృతి నేపథ్యంలో విచారణ నిమిత్తం ట్రాన్స్‌కో సిబ్బందిని పిలిపించిన మాట వాస్తవమేనన్నారు. అయితే నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో కాసేపు స్టేషన్లోనే కూర్చోబెట్టుకున్నామన్నారు. దీన్ని అవమానంగా భావించి పట్టణం మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిపేయడం ఎంత వరకు సమంజసమన్నారు. చదవండి: Indian Paper Currency History: సముద్రం పాలైన ‘హైదరాబాద్’ కరెన్సీ.. నాసిక్‌లో నోట్ల ముద్రణ -
Kalamata Venkataramana: మాజీ ఎమ్మెల్యే కలమట వీరంగం
పరాజయాలతో కాలు నిలవని అసహనం.. ప్రజాక్షేత్రంలో ఎదురవుతున్న పరాభావాలను తట్టుకోలేని మనస్తత్వం.. ఏం చేయాలో పాలుపోని భయం. ఇవన్నీ టీడీపీ నాయకుల్లో రోజురోజుకీ అసహనాన్ని రేకెత్తిస్తున్నాయి. అందుకే వారేం చేస్తున్నారో.. ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియకుండా పోతోంది. తాజాగా శనివారం రాత్రి పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. సాక్షి, శ్రీకాకుళం: పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వీరంగా సృష్టించారు. ఎప్పుడో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించేందుకు వెళ్లిన అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. నోటికి వచ్చినట్లు పరుష పదజాలంతో మాట్లాడుతూ బెదిరింపులకు దిగారు. తన మద్దతుదారులతో గుంపుగా వెళ్లి, అధికారులపై దాడి చేసేలాగా ప్రయత్నం చేశారు. వివరాల్లోకి వెళ్తే... గత నెలలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాతపట్నంలో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం పూర్తయి, కొన్ని వారాలు గడుస్తున్నా నేటికీ వాటిని తీయలేదు. వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఎక్కడ ప్రజలకు ఇబ్బందికరంగా, ప్రమాదకరంగా మారుతాయనే ముందస్తు జాగ్రత్తలతో ఫ్లెక్సీలు తొలగించేందుకు ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, పంచాయతీ ఈఓ శనివారం రాత్రి ఉపక్రమించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కలమట, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చి, అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఒకానొక సందర్భంలో వారి విధులకు ఆటంకం కలిగిస్తూ పైకి దూసుకు వచ్చేలా వ్యవహరించారు. అధికారులు స్పష్టంగా చెబుతున్నప్పటికీ వినకుండా మాజీ ఎమ్మెల్యే పదే పదే అనుచితంగా వ్యవహరించారు. ఫ్లెక్సీలు ఎలా తొలగిస్తావో చూస్తామంటూ, మిమ్మల్ని వదలేది లేదంటూ.. మరికొన్ని దురుసు మాటలతో బెదిరింపులకు దిగారు. అక్కడికి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధికారులను ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అసభ్య పదజాలంతో దూషించారు. ఆ సమయంలో అక్కడ లేని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. -
అభిమానితో హార్దిక్ పాండ్యా దురుసు ప్రవర్తన.. వీడియో వైరల్
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అభిమానితో దురుసుగా ప్రవర్తించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ఒక అభిమాని హార్దిక్‌తో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో అతని చేయి పాండ్యా భుజంపై వేశాడు. ఇది చూసిన పాండ్యా కోపంతో అభిమాని చేయిని కిందకు తోశాడు. అదే సమయంలో పక్కనే ఉన్న అమ్మాయికి మాత్రం నవ్వుతూ ఫోజివ్వడం విశేషం. అయితే హార్దిక్ ప్రవర్తనపై వినూత్నరీతిలో కామెంట్ చేశారు. '' కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని హర్దిక్ ఇలా చేశాడంటూ కొందటే.. '' హార్దిక్ కావాలనే అభిమాని చేయిని కిందకు తోశాడు.. అసలే చోటు పోయిందన్న ఫ్రస్టేషన్లో ఉన్నాడు.. అందుకే చిరాకుతో ఆ పని చేశాడు'' అంటూ ఎవరికి నచ్చిన రీతిలో కామెంట్స్ చేశారు. చదవండి: IND vs SA 1st Test: రహానే తుది జట్టులో ఉంటాడా!.. పరోక్షంగా ద్రవిడ్ హింట్ ఇక గత కొద్దికాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న హార్దిక్ పాండ్యా ప్రస్తుతం టీమిండియాలో స్థానం కోల్పోయాడు. టి20 ప్రపంచకప్‌కు ఆల్‌రౌండర్‌గా టీమిండియాకు ఎంపికైన పాండ్యా ఘోరంగా ఫెయిలయ్యాడు. ఆల్‌రౌండర్‌గా సేవలందించాల్సిన పాండ్యాను కేవలం బ్యాటింగ్‌కే పరిమితం చేయడం.. ఫామ్‌లో లేకున్నా ఎందుకు ఆడిస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో సౌతాఫ్రికా టూర్‌కు తనను ఎంపిక చేయొద్దంటూ పాండ్యానే స్వయంగా బీసీసీఐకి అభ్యర్థన పెట్టుకున్నాడు. ప్రస్తుతం పాండ్యా బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో రీహాబిటేషన్‌లో ఉన్నాడు. ఫిట్నెస్ను నిరూపించుకొని త్వరలోనే టీమిండియాలో అడుగుపెడతానని పాండ్యా ఇటీవలే ధీమా వ్యక్తం చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా టీమిండియా తరపున 62 వన్డేల్లో 1267 పరుగులు..56 వికెట్లు, 11 టెస్టుల్లో 532 పరుగులు.. 17 వికెట్లు, 49 టి20ల్లో 484 పరుగులు.. 42 వికెట్లు తీశాడు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
మత్తు అలవాటు పడితే.. భవిష్యత్తు చిత్తు
సాక్షి, ఆల్విన్‌కాలనీ( హైదరాబాద్): మాదక ద్రవ్యాలకు, గంజాయికి బానిసలుగా మారి యువత మత్తులో తూగుతూ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నది. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. మాదకద్రవ్యాలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా ముఠాలుగా ఏర్పడి జన సంచారం లేని ప్రాంతాలను ఎంచుకొని గంజాయి, మాదక ద్రవ్యాలను పీలుస్తున్నారు. యువతే ప్రధాన లక్ష్యంగా తీసుకొని ఈ చీకటి వ్యవహారాన్ని నిర్వహిస్తుండటంతో యువత రోగాల బారిన పడుతుండటంతో పాటు చెడుదారి పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ► కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని పలు కాలనీలు, బస్తీలు, ఫ్లై ఓవర్లు, చెరువు కట్టలు, నిర్మానుష ప్రదేశాలు ఎంచుకొని యువత మాదకద్రవ్యాలు సేవిస్తూ అటుగా వెళ్లే వారిపై దురుసుగా ప్రవర్తిస్తూ దాడులకు పాల్పడుండటం గమనార్హం. అదేమిటని ప్రశ్నిస్తే ఏమి చేసుకుంటావో చేసుకో మేము స్థానికులమంటూ దుర్భాషలాడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. కొన్ని రోజుల క్రితం కూకట్పల్లి నుంచి జగద్గిరిగుట్టకు వెళ్లే చిత్తారమ్మ ఆలయ రోడ్డులో ఓ దుకాణం సమీపంలో యువత మాదకద్రవ్యాలను సిగరెట్లో నింపుకొని సేవిస్తూ చిందులేస్తూ రహదారిపై వెళ్లేవారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో వారిని మందలించగా ఎదురుదాడికి దిగారని స్థానికులు, ప్రయాణికులు వాపోయారు. ► కూకట్పల్లి సర్కిల్ ధరణినగర్ సమీపంలో పరికి చెరువు కట్టపై నిత్యం పగలు, రాత్రి అనే తేడా లేకుండా మత్తుపదార్థాలు సేవించటమే కాకుండా మందుబాబులకు కూడా అడ్డాగా మారింది. స్థానికులు వారిని ప్రశ్నిస్తే మత్తులో ఉండి బెదిరింపులకు పాల్పడుతున్నారని రాత్రి వేళల్లో అరుపులు, కేకలతో అలజడి సృష్టిస్తున్నారని స్థానికులు తెలుపుతున్నారు. ► ఎల్లమ్మబండ చౌరస్తాలో, ఎన్టీఆర్నగర్, రైతు బజార్, మహదేవ్‌పురం చౌరస్తాలోని సిక్కుల కాలనీల్లో గంజాయి వ్యాపారం విరివిగా జరుగుతుందని యువతను టార్గెట్ చేసి గంజాయిని విక్రయిస్తూ యువతను చెడు అలవాట్లకు బానిసలుగా మారుస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ► భరత్‌నగర్ బ్రిడ్జి నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో సైతం యువత గంజాయి మాదకద్రవ్యాలను సేవిస్తున్నారు. ఈ విషయమై స్థానికులు గమనించి అటుగా వెళ్లాలంటేనే జంకుతున్నారు. మత్తులో ఉన్నవారు ఎప్పుడు ఏ అఘాయిత్యానికి పాల్పడతారో అని ఆందోళన చెందుతున్నారు. ► జగద్గిరిగుట్ట, ఆస్బెస్టాస్ కాలనీ, హుడా పార్కు ప్రాంతాలను ఆసరాగా తీసుకొని రాత్రి వేళల్లో యువత గంజాయి సేవిస్తూ ఆ ప్రాంతవాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ► కేపీహెచ్‌బీ కాలనీ కళామందిర్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం, పద్మావతి ప్లాజా ప్రాంతం, జనసంచారం లేని ప్రాంతాలను ఎంచుకొని యువత జోరుగా మత్తుమందులు సేవిస్తున్నారు. ► ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో ప్రత్యేకంగా పెట్రోలింగ్ పెంచి మాదక ద్రవ్యాలు సేవించే వారిపై దృష్టి సారించి వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తే తప్ప వారిలో మార్పు రాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు సేవిస్తూ యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్నారు. పరికి చెరువు కట్టపై రోజూ యువత గుంపులుగా వచ్చి సిగరెట్లలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన మందును నింపుకొని పీలుస్తూ దాడులకు దిగుతున్నారు. పోలీసు వారు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో వారికి ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు. వారు వెళ్లిపోగానే తిరిగి గంజాయి పీలుస్తున్నారు. ప్రశ్నించే వారిపై దాడులు కూడా చేస్తున్నారు. వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి. – గోపాల్, ధరణినగర్ జనరల్ సెక్రటరీ కఠిన చర్యలు తథ్యం నిర్జన ప్రాంతాల్లో యువత గంజాయి తాగుతూ పెడదారిన పడుతున్నారని తమకు ఫిర్యాదు రావటంతో వెంటనే స్పందించి వారిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశాము. ఇటీవల మూసాపేటలో గంజాయి విక్రయిస్తుండగా ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం. ఎక్కడి నుంచైతే ఫిర్యాదులు వస్తాయో ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిఘా ఏర్పాటు చేస్తు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. – నర్సింగరావు, ఇన్స్పెక్టర్, కూకట్పల్లి ( చదవండి: టీలో పొడి ఎక్కువైందని తిట్టిన అత్త, దీంతో కోడలు.. ) -
ఫుట్‌పాత్‌పై దందా.. రూ.5 వేలు డిమాండ్!
సాక్షి, హైదరాబాద్: పొట్టకూటి కోసం కొబ్బరి కాయలు అమ్ముకుంటున్న చిరువ్యాపారిపై ఓ వ్యక్తి దౌర్జన్యం చేశాడు. తన భవనం ఎదురుగా దందా చేసుకుంటున్నందుకు అద్దె చెల్లించాలని డిమాండ్ చేశాడు. వివరాలు.. కర్మన్‌ఘాట్‌లోని రోడ్డు ఫుట్‌పాత్‌పై రామారావు అనే వ్యక్తి కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తున్నాడు. తన భవనం ముందు కొబ్బరి బొండాలు అమ్ముతున్నందుకు నెలకు 5వేల రూపాయలు అద్దె చెల్లించాలని భవన యజమాని కొండూరు లింగయ్య డిమాండ్ చేశాడు. అద్దె ఇవ్వనందుకు కొబ్బరి బొండాలు రోడ్డుపై విసిరికొట్టి హంగామా సృష్టించాడు. దీంతో లింగయ్య దౌర్జన్యంపై కొబ్బరి బోండాల వ్యాపారి రామారావు సరూర్ నగర్ పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ‘సిగ్నల్’ అవస్థలు !) -
ఇలాంటి డ్రెస్ వేసుకొని పార్క్‌కు వస్తారా?
బెంగుళూరు : పార్క్‌కు జాగింగ్ చేద్దామని వచ్చిన ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ దంపతులకు చేదు అనుభవం ఎదురైన ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి మహిళ ధరించిన దుస్తులపై అభ్యంతరం తెలుపుతూ నానా రభస చేశాడు. అయితే ఆ దంపతులు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న బందువుకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బెంగుళూరులోని జేపీ పార్క్‌కు ఆదివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఒక మహిళ తన భర్తతో కలిసి జాగింగ్‌కు వచ్చింది. ఆమె జిమ్‌లో ఫిట్నెస్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన వార్మ్ప్ ప్రారంభించగా, తన భర్త జాగింగ్‌కు వెళ్లాడు. తన వార్మప్ పూర్తయిన తర్వాత స్వెటర్‌ను విప్పేసి ఆమె భర్త కోసం ఎదురుచూస్తుంది. కాగా సదరు మహిళ ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ కావడంతో తన వర్కౌట్లను ఆమె భర్త వీడియాలు తీసి యూట్యూబ్‌లో షేర్ చేస్తుంటాడు. ఇదే సమయంలో టూ వీలర్‌పై ఒక యాబై ఏళ్ల వయసున్న వ్యక్తి పార్క్‌కి వచ్చాడు. మహిళ వేసుకున్న దుస్తులను గమనించి తన బండిని పార్క్ చేసి ఆ వ్యక్తి మహిళ దగ్గరకు వచ్చాడు. 'ఇలాంటి దుస్తులు వేసుకొని ఎవరైనా పార్క్‌కు వస్తారా.. ఇది క్లబ్ కాదు ప్యామిలీలు వచ్చే చోటు' అంటూ ఆమెపై విరుచుకుపడ్డాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మహిళ భర్త వ్యక్తి దగ్గరకు వచ్చి తన భార్య ఏమి అభ్యంతరకరమైన దుస్తులు వేసుకోలేదని పేర్కొన్నాడు. అయితే ఇదేమి వినకుండా సదరు వ్యక్తి వారిద్దరిపై దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్యంగా మాట్లాడాడు.అంతటితో ఊరుకోకుండా పక్కనున్న వారి దగ్గరికి వెళ్లి మహిళ వేసుకొచ్చిన దుస్తులపై చర్చించాడు. అయితే ఇదే విషయమై మహిళ మాట్లాడుతూ.. 'ఒక ఫిట్నెస్ ఇన్‌స్ట్రక్టర్‌గా నేను వేసుకొచ్చిన దుస్తులు అంత అసభ్యకరంగా ఏమి లేవు. అయినా ఇన్ని రోజులుగా పార్క్‌కు వస్తున్నా ఎవరు తన దుస్తులపై అభ్యంతరం చెప్పలేదు. కానీ ఆ వ్యక్తి ఎందుకలా ప్రవర్తించాడో మాకు అర్థం కాలేదంటూ' తెలిపారు. ఆ వ్యక్తి ప్రవర్తనపై సదరు మహిళ పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న బందువుకు తెలిపింది. దీంతో అతను ఈ విషయాన్ని డీసీపీ ఎన్ శశికుమార్‌కు చెప్పడంతో పోలీసులు వెళ్లి ఆ వ్యక్తిని తీసుకొచ్చారు. అయితే ఆ వ్యక్తి మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించి అసౌకర్యం కలిగించినందుకు క్షమాపణ చెప్పడంతో ఎలాంటి కేసు నమోదు చేయకుండానే వివాదం సద్దుమణిగింది. -
క్షమాపణ చెబితే గౌరంగా ఉంటుంది..
-
ఆ వీడియో అతని ఉద్యోగానికి ఎసరు పెట్టింది
-
ఆ వీడియో అతని ఉద్యోగానికి ఎసరు పెట్టింది
అమేథి : జిల్లా కలెక్టర్‌గా ప్రజా సమస్యను పరిష్కరించాల్సిన వ్యక్తి తన బాధ్యతను విస్మరించిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రశాంత్ కుమార్ శర్మ అమేథి జిల్లా మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్‌కుమార్ సింగ్ అలియాస్ సోనుసింగ్ అనే వ్యక్తి మంగళవారం రాత్రి గుర్తు తెలియని యువకుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. కాగా, సోనుసింగ్ మృతదేహానికి ఇంకా పోస్టుమార్టం ఎందుకు నిర్వహించలేదో తెలుసుకుందామని అతని బంధువు, ట్రైనీ పీసీఎస్ ఆఫీసర్ సునీల్ సింగ్ బుధవారం ప్రశాంత్‌కుమార్‌ను కలిసేందుకు వచ్చారు. 'సోనూసింగ్ మృతదేహానికి పోస్టుమార్టమ్ ఎందుకు నిర్వహించలేదని, తన కజిన్‌ను చంపిన వ్యక్తులను ఎందుకు పట్టుకులేదో చెప్పాలని' సునీల్ సింగ్ ప్రశ్నించారు. ఈ విషయం తన పరిధిలో లేదని, అయినా అది అడగానికి నువ్వెవరు అంటూ ప్రశాంత్ కుమార్ సునీల్ కాలర్ పట్టుకొని దౌర్జన్యంగా బయటికి ఈడ్చుకువచ్చాడు. అయితే ఈ ఘటన మొత్తం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఈ వీడియోను సునీల్ సింగ్ సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ ..' ప్రశాంత్ కుమార్ ! నీవు ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్నావన్న విషయాన్ని మరిచిపోయావు. న్యాయం అడగడానికి వచ్చిన వ్యక్తి పట్ల నువ్వు ప్రదర్శించిన తీరు ఆగ్రహం తెప్పించింది. మనం ప్రజలకు సేవకులగా పని చేయాలే తప్ప నియంతలా వ్యవహరించకూడదంటూ' ట్వీట్ చేశారు. కాగా, ఉన్నతస్థాయి అధికారి పదవిలో ఉంటూ ప్రశాంత్ వ్యవహరించిన తీరును పలువురు నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. మొరాదాబాద్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న అరుణ్‌కుమార్‌ను ప్రశాంత్ కుమార్ స్థానంలో అమేథి జిల్లా మెజిస్ట్రేట్‌గా నియమించారు. 'మంగళవారం రాత్రి హత్యకు గురైన సోనూసింగ్ స్థానికంగా ఇటుక బట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతని తండ్రి శివనాయక్ సింగ్ స్థానిక బీజేపీ నేతగా ఉన్నారు. కాగా, మంగళవారం రాత్రి కొంతమంది దుండగులు అతన్ని అడ్డగించి రూ. 2లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించారు. ఈ నేపథ్యంలో వారి మధ్య గొడవ జరిగి జిల్లా ఎస్పీ కార్యాలయానికి 500 మీటర్ల దూరంలో సోనూసింగ్ను హత్య చేసి పారిపోయారు. అయితే సోనూను హత్య చేసిన ఐదుగురిపై ఎప్ఐఆర్ నమోదు చేశామని' పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సోనూ హత్యకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వచ్చిన సునీల్‌కుమార్‌పై జిల్లా మెజిస్ట్రేట్ ప్రశాంత్ కుమార్ దౌర్జన్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. विनय शील एवं संवेदनशील बने हम यही प्रयास होना चाहिए । जनता के हम सेवक है , शासक नहीं @DmAmethi 🙏 — Smriti Z Irani (@smritiirani) November 13, 2019 -
చేతకాకపోతే చెప్పండి.. వెళ్లిపోతాం!
సాక్షి, అనంతపురం న్యూసిటీ: ‘వైద్యో నారాయణో హరి’ అని వైద్యులను దేవుడితో సమానంగా పోల్చుతాం. ప్రాణం పోసేది దేవుడైతే.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని రక్షించేది వైద్యుడే. అటువంటిది వైద్యులపై రోగి సహాయకులు రెచ్చిపోతున్నారు. నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతున్నారు. వివరాల్లోకెళ్తే.. పుట్టపర్తి మండలం పెడబల్లికి చెందిన సునీత అపెండిసైటీస్ సమస్యతో ఈ నెల 25న అనంతపురం సర్వజనాస్పత్రిలోని ఎఫ్ఎస్ 4లో అడ్మిట్ అయ్యింది. డ్యూటీ డాక్టర్ ఉజ్జునేశ్వరి వైద్య పరీక్షలకు రెఫర్ చేసి, ఈ నెల 26న సర్జరీ చేస్తామని చెప్పారు. అదే రోజున ఆపరేషన్ థియేటర్లో వైద్యులకు ఎస్ఆర్ క్యానులాపై శిక్షణ జరిగింది. అనస్తీషియా వైద్యులు టేబుల్స్ ఖాళీ లేవని, ఉన్న వాటిలో ఎమర్జెన్సీ కేసులు చేస్తున్నామని చెప్పారు. నివారం డాక్టర్ ఉజ్జునేశ్వరి వచ్చి ఆందోళన చెందాల్సిన పనిలేదని, త్వరలో సర్జరీ చేస్తామని సునీత కుటుంబీకులకు తెలిపారు. అయితే సర్జరీ జాప్యం జరిగిందని సునీత బంధువులు శ్రీనివాస్ నాయక్ ఊగిపోయాడు. ఏడో నంబరు ఓపీ గదిలో రోగులకు సేవలందిస్తున్న డాక్టర్ ఉజ్జునేశ్వరిపై చిందులు వేశాడు. ‘ఏం నీకు చేతకాకపోతే చెప్పు.. ఇక్కడి నుంచి వెళ్లిపోతాం. వేరే ఆస్పత్రిలో చూపించుకుంటాం’ అంటూ కేస్‌షీట్‌ను ముఖంపై విసిరాడు. దీంతో ఒక్కసారిగా ఓపీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైద్యులపై ఎక్కడ దాడి జరుగుతుందోనని హౌస్సర్జన్లు ఆందోళన చెందారు. శ్రీనివాస్ నాయక్ మాటలకు వైద్యురాలు కన్నీటి పర్యంతమయ్యారు. సూపరింటెండెంట్ ఆగ్రహం విషయం ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్‌కు తెలియడంతో ఆయన రోగి సహాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షణం తీరిక లేకుండా సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందిపై నోరుపారేసుకోవడం సరికాదన్నారు. సర్జరీకి టేబుళ్లు ఖాళీ లేకపోతే ఎక్కడ చేయాలో మీరే చెప్పండి అంటూ ప్రశ్నించారు. చివరకు శ్రీనివాస్ నాయక్ వైద్యురాలికి క్షమాపణ చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
మహిళా డాక్టర్‌పై టీడీపీ కార్పొరేటర్ వీరంగం
-
అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల భూకబ్జా
-
టీడీపీ మాజీ ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన
అనంతపురం జిల్లా: అధికారం అండ చూసుకుని రాష్ట్రంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ అధికారులపై తమ ప్రతాపం కొనసాగిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా కదిరిలో దళిత వర్గానికి చెందిన తహసీల్దార్‌పై నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కందికుంట వెంకటప్రసాద్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. నోరు తెరిచావో.. చెయ్యి చేసుకోవాల్సి వస్తుందంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మండల మేజిస్ట్రేట్ అని కూడా చూడకుండా తహసీల్దార్‌పై బండబూతులకు దిగారు. ఈ తతంగమంతా సీఐ సమక్షంలోనే కొనసాగడం గమనార్హం. నాపైన డెకాయిట్ కేసుంది.. నీకు తెలీదేమో.. తన వర్గీయులకు ఇళ్ల పట్టాలిచ్చేందుకు జాప్యం చేయడమేగాక ఎమ్మెల్యే చాంద్‌బాషాను కలవమంటున్నారనే ఆగ్రహంతో కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కందికుంట తన వర్గీయులతో కలసి శనివారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కందికుంటతోపాటు ఆయన వర్గీయులు దళిత వర్గానికి చెందిన తహసీల్దార్ పీవీ రమణను నోటికొచ్చినట్లు మాట్లాడారు. ‘‘నువ్వు నా కన్నా తక్కువ చదువుకున్నావు. నిన్ను ఏసీబీకి పట్టించడం నాకు రెండు నిమిషాలు పట్టదు. ఇంటిపట్టాలు ఇవ్వమంటే ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లమంటావా? నాకు అనుకూలంగా ఉన్నాడని ఇక్కడున్న ఓ వీఆర్ఓను బదిలీ చేసి బ్రోకర్‌ను తెచ్చుకుంటావా? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నాపైన డెకాయిట్ కేసు నమోదైంది.. నీకు తెలీదేమో..’’ అంటూ కందికుంట తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తహసీల్దార్ అది కాదు సార్ అనబోగా.. ‘‘ఏందివయ్యా.. మళ్లీ అది కాదంటావు.. ఇంగ నేను బూతులే మాట్లాడతా.. నువ్వు నోరు తెరిచావనుకో.. నేను చెయ్యి చేసుకోవాల్సి ఉంటుంది’’ అని బెదిరింపులకు దిగారు. ‘‘ఇక్కడి రాజకీయాల్ని అనుకూలంగా మార్చుకుని మమ్మల్ని ఇబ్బంది పెడతావా? నా మనుషులొస్తే ఎమ్మెల్యే దగ్గరకు పొమ్మంటావా? వాడెవడు?’’ అని రెచ్చిపోయారు. ఇదే అదనుగా కందికుంట అనుచరుడు హరి మాట్లాడుతూ తాను వీఆర్వో అఖిలేష్‌కు రూ.70 వేలు, మీకు రూ.50 వేలు లంచమిచ్చానని అనగా.. తహసీల్దార్ అబద్ధాలు చెప్పొద్దని బదులిచ్చారు. ఇంతలో మున్సిపల్ చైర్పర్సన్ సురయాభాను అందుకుంటూ.. నీ దగ్గరకొస్తే ఎమ్మెల్యే దగ్గరకు పొమ్మంటావా? నువ్వు ఎమ్మార్వోనా లేక రాజకీయ బ్రోకర్‌వా? అంటూ రెట్టించారు. బలవంతంగా ఆయనతో కందికుంటకు క్షమాపణలు చెప్పించారు. -
నాన్ సెన్స్.. మూసుకుని కూర్చో పో!
దిస్పూర్: కేంద్ర మంత్రి రాజన్ గోహేన్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. ఓ కార్యక్రమంలో వృద్ధుడితో దురుసుగా వ్యవహరించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. స్థానిక సమస్యలపై సదరు వ్యక్తి మాట్లాడుతున్న సమయంలో.. మంత్రి అతన్ని ప్రసంగించకుండా అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. మంగళవారం నాగోన్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగోన్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ అభియాన్ తరపున ఓ కార్యక్రమం నిర్వహించారు. దీనికి కేంద్ర మంత్రి రాజన్ గోహేన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న ఓ రిటైర్డ్ టీచర్ మైక్ అందుకుని అమెలాపట్టి ప్రాంతంలో రోడ్ల పరిస్థితి అస్సలు బాగోలేదని, ఎమ్మెల్యే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మాట్లాడసాగారు. వెంటనే తన కుర్చీల్లోంచి లేచిన రాజన్.. మైక్ ముందు చెయ్యి అడ్డం పెట్టి సదరు వృద్ధుడ్ని అడ్డుకున్నారు. ‘నాన్ సెన్స్. ఏం మాట్లాడుతున్నావ్. ఈ విషయంపై సంబంధిత అధికారితో మాట్లాడాలేగానీ, ఇక్కడ మాట్లాడటం ఏంటి? కార్యక్రమాన్ని చెడగొట్టడానికి వచ్చావా? అంటూ ప్రశ్నించారు. దానికి ప్రతిగా ఆ రిటైర్డ్ టీచర్‘నేను నాగోన్‌లో నివసించే ఓ వ్యక్తిగా మాట్లాడుతున్నా. కావాలంటే నాతో రా... సమస్యలు ఎలా ఉన్నాయో చూపిస్తా. నేనేం అబద్ధాలు చెప్పటం లేదు’ అని ఆయన మంత్రికి అదే స్థాయిలో బదులిచ్చారు. వెంటనే మంత్రి ‘సమస్య ఏదైనా ఉంటే నన్ను వ్యక్తిగతంగా కలవాలి. అంతేగానీ ఇలా పబ్లిక్ మీటింగ్‌లో లేవనెత్తటం ఏంటి? బుద్ధుందా నీకు. ఇలా మాట్లాడినంత మాత్రాన సమస్యలు పరిష్కారం అవుతాయనుకుంటున్నావా? మూసుకుని కూర్చో’ అంటూ గోహేన్ ఆ వృద్ధుడిపై అరిచారు. దీంతో ఆ వ్యక్తి వెళ్లి వెనుక వరుసలో కూర్చుండి పోయారు. కార్యక్రమం తర్వాత గోహేన్ను మీడియా ఈ వ్యవహారంపై ప్రశ్నించింది. ఆ వ్యక్తికి క్షమాపణలు చెప్పదల్చుకున్నారా? అని అడగ్గా.. దానికి ఆయన నేనెందుకు చెప్పాలి అంటూ గోహేన్ బదులిచ్చారు. ఈ ఘటనపై కొందరు విద్యార్థులు నాగోన్‌లోని మంత్రి ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. సదరు రిటైర్డ్ టీచర్‌కు గోహేన్ క్షమాపణలు చెప్పే వరకు ఆందోళన విరమించమని విద్యార్థులు తేల్చి చెప్పారు. -
అగ్రిగోల్డ్ బాధితుల పట్ల దురుసుగా ప్రవర్తించిన నారా లోకేశ్
-
ప్రయాణీకులను ఇలా డీల్ చేస్తారా..
-
ప్రయాణీకులను ఇలా డీల్ చేస్తారా..
సాక్షి, న్యూఢిల్లీ : ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇటీవల ఓ ప్రయాణీకుడిపై దౌర్జన్యం చేసిన ఘటనకు సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఘాటుగా స్పందించింది. విమానయాన సంస్థల సిబ్బంది ప్రయాణీకులతో స్నేహపూర్వకంగా మెలగాలని, గౌరవంగా వ్యవహరించడం నేర్చుకోవాలని హితవు పలికింది. విమానయాన సిబ్బంది ప్రయాణీకులపై దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం, దురుసుగా ప్రవర్తించడం వంటి ఘటనలు ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్నాయని కమిటీ తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఎయిర్‌లైన్స్ సిబ్బంది దురుసు ప్రవర్తన ఘటనలు కొన్ని మీడియాలో వస్తున్నా పలు సంఘటనలు వెలుగు చూడటం లేదని పేర్కొంది. ఇటీవల ఇండిగో సిబ్బంది ప్రయాణీకుడిపై దౌర్జన్యానికి పాల్పడిన తీరును తీవ్రంగా ఖండించింది.దురుసుగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నంత మాత్రాన విమానయాన సంస్థలు తమ తప్పిదాల నుంచి బయటపడలేవని 26 పేజీల నివేదికలో కమిటీ స్పష్టం చేసింది. ఎయిర్‌లైన్స్‌లో చోటుచేసుకుంటున్న ఘటనలు వ్యక్తిగతమైనవి కావని..ఇవి సంస్ధాగతమైనవని పేర్కొంది. ఇండిగో వంటి సంస్థలు ప్రయాణీకులతో వ్యవహరించే పద్ధతిలో సానుకూల మార్పులు ప్రవేశపెట్టాల్సి ఉందని స్పష్టం చేసింది. తమ సిబ్బంది దురుసు ప్రవర్తనపై ఇండిగో కన్నేసి ఉంచాలని, వారి దుందుడుకు ప్రవర్తనను సరిచేయాలని సూచించింది. పలు విమానయాన సంస్థల సీఈఓలతో, సిబ్బంది, ప్రయాణీకులతో కమిటీ విస్తృతంగా చర్చలు జరిపిన మీదట ఈ నివేదికను రూపొందించింది. -
యూపీలో కొడుకుపై తండ్రి కిరాతకం
-
దీపా మలిక్ పట్ల దురుసు ప్రవర్తన
న్యూఢిల్లీ: పారా ఒలింపిక్ రజత పతక విజేత దీపా మలిక్ పట్ల ఎయిర్ లైన్స్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. వీల్ చైర్ సర్వీస్, క్యాబిన్ క్రౌ సిబ్బంది తన పట్ల దురుసుగా వ్యవహరించిన తీరుపై ఆమె డొమెస్టిక్ విమానయాన సంస్థ విస్తారాకు ఫిర్యాదు చేశారు. టాటా గ్రూప్, సింగపూర్ కు చెందిన సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న యూకే 902 విమానంలో ఢిల్లీ నుంచి ముంబైకి మంగళవారం బయలుదేరారు. ఫిజికల్ హ్యాండీక్యాప్ వ్యక్తులను వీల్ చైర్ నుంచి సీట్లోనికి చేరవేయడం సరిగాలేదని, ఫ్లైట్ ఆలస్యంపై సిబ్బందిని అడగ్గా గట్టిగా అరిచి సమాధానం చెప్పారని దీపా పేర్కొన్నారు. ఈవిషయంలో విస్తారా తగుచర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆమె ఫీడ్ బ్యాక్ బుక్కులో రాశారు. దీనిపై స్పందించిన విస్తారా సీఈఓ మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని దీనిపై పర్సనల్ గా విచారణ జరుపుతానని ఆమెకు హామీ ఇచ్చారు. -
నా బైక్‌నే ఆపుతావా...
-
పోలీసులా... జులాయిలా?
గుంటూరు: మహిళా ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించడమమే కాకుండా ఆమె భర్తను పోలీసులు చితకబాదిన దారుణ ఘటన గుంటూరు రైల్వేస్టేషన్లో బుధవారం చోటుచేసుకుంది. ఓ మహిళ పట్ల కానిస్టేబుల్ ఒకరు అసభ్యంగా ప్రవర్తించాడు. అడ్డుకున్న ఆమె భర్తపై మరో పది మంది పోలీసులు దాడి చేశారు. దీనిపై బాధితులు చేసినా స్థానిక సీఐ శరత్‌బాబు కేసు నమోదు చేయలేదు. బాధితుల మీదే ఎదురు కేసు పెడతానంటూ బెదిరించాడు. ప్రజల మానప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే జులాయిల్లా ప్రవర్తిస్తే ఎవరితో చెప్పుకోవాలని బాధితులు వాపోయారు. -
ఇండిపెండెంట్లను తనవైపు తిప్పుకున్న జెసి
-
కడప రచ్చబండలో పోలీసుల ఓవర్యక్షన్
-
మహిళను ఈడ్చిపడేసిన SI సూర్యచంద్ర మౌళి
-
కరీంనగర్ జిల్లా గంగాధరలో ఖాకీల కాఠిన్యం