టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అభిమానితో దురుసుగా ప్రవర్తించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ఒక అభిమాని హార్దిక్‌తో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో అతని చేయి పాండ్యా భుజంపై వేశాడు. ఇది చూసిన పాండ్యా కోపంతో అభిమాని చేయిని కిందకు తోశాడు. అదే సమయంలో పక్కనే ఉన్న అమ్మాయికి మాత్రం నవ్వుతూ ఫోజివ్వడం విశేషం. అయితే హార్దిక్ ప్రవర్తనపై వినూత్నరీతిలో కామెంట్ చేశారు. '' కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని హర్దిక్ ఇలా చేశాడంటూ కొందటే.. '' హార్దిక్ కావాలనే అభిమాని చేయిని కిందకు తోశాడు.. అసలే చోటు పోయిందన్న ఫ్రస్టేషన్‌లో ఉన్నాడు.. అందుకే చిరాకుతో ఆ పని చేశాడు'' అంటూ ఎవరికి నచ్చిన రీతిలో కామెంట్స్ చేశారు.
చదవండి: IND vs SA 1st Test: రహానే తుది జట్టులో ఉంటాడా!.. పరోక్షంగా ద్రవిడ్ హింట్
ఇక గత కొద్దికాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న హార్దిక్ పాండ్యా ప్రస్తుతం టీమిండియాలో స్థానం కోల్పోయాడు. టి20 ప్రపంచకప్‌కు ఆల్‌రౌండర్‌గా టీమిండియాకు ఎంపికైన పాండ్యా ఘోరంగా ఫెయిలయ్యాడు. ఆల్‌రౌండర్‌గా సేవలందించాల్సిన పాండ్యాను కేవలం బ్యాటింగ్‌కే పరిమితం చేయడం.. ఫామ్‌లో లేకున్నా ఎందుకు ఆడిస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో సౌతాఫ్రికా టూర్‌కు తనను ఎంపిక చేయొద్దంటూ పాండ్యానే స్వయంగా బీసీసీఐకి అభ్యర్థన పెట్టుకున్నాడు. ప్రస్తుతం పాండ్యా బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో రీహాబిటేషన్‌లో ఉన్నాడు. ఫిట్‌నెస్‌ను నిరూపించుకొని త్వరలోనే టీమిండియాలో అడుగుపెడతానని పాండ్యా ఇటీవలే ధీమా వ్యక్తం చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా టీమిండియా తరపున 62 వన్డేల్లో 1267 పరుగులు..56 వికెట్లు, 11 టెస్టుల్లో 532 పరుగులు.. 17 వికెట్లు, 49 టి20ల్లో 484 పరుగులు.. 42 వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment