
సాక్షి, హైదరాబాద్: పొట్టకూటి కోసం కొబ్బరి కాయలు అమ్ముకుంటున్న చిరువ్యాపారిపై ఓ వ్యక్తి దౌర్జన్యం చేశాడు. తన భవనం ఎదురుగా దందా చేసుకుంటున్నందుకు అద్దె చెల్లించాలని డిమాండ్ చేశాడు. వివరాలు.. కర్మన్‌ఘాట్‌లోని రోడ్డు ఫుట్‌పాత్‌పై రామారావు అనే వ్యక్తి కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తున్నాడు. తన భవనం ముందు కొబ్బరి బొండాలు అమ్ముతున్నందుకు నెలకు 5వేల రూపాయలు అద్దె చెల్లించాలని భవన యజమాని కొండూరు లింగయ్య డిమాండ్ చేశాడు. అద్దె ఇవ్వనందుకు కొబ్బరి బొండాలు రోడ్డుపై విసిరికొట్టి హంగామా సృష్టించాడు. దీంతో లింగయ్య దౌర్జన్యంపై కొబ్బరి బోండాల వ్యాపారి రామారావు సరూర్ నగర్ పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ‘సిగ్నల్’ అవస్థలు !)
Comments
Please login to add a commentAdd a comment