
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ప్రత్యేక ఆర్ట్ ఎగ్జిబిషన్
సిరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ ఆధ్వర్యంలో మహిళా ఆర్టిస్టుల కళాఖండాలు
మార్చి 8- 15వ తేదీ వరకు ప్రదర్శన
సిరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగా ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. ‘సిరి శక్తి’ పేరుతో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిత్రకళలో ప్రతిభను చాటుకుంటున్న మహిళల నైపుణ్యాన్ని గుర్తిస్తూ హైదరాబాద్‌లోని మసాబ్ ట్యాంక్‌లో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. మార్చి 8 నుంచి 15వ తేదీవరకు జరుగుతున్న ఈ ప్రదర్శనలో ఎనిమిదేళ్లనుంచి 88 ఏళ్ల వయస్సున్న 118 మంది మహిళా ఆర్టిస్ట్‌లు తమ పెయింటింగ్స్‌ను ప్రదర్శిస్తున్నారు.
అంతేకాదు ఈ ఎనిమిది రోజుల వేడుకలో ఒక్కో రోజును ఒక్కో ప్రత్యేకతగా ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నారు. కళారంగంలో నిష్ణాతులైన విశిష్ట అతిధులను ఆహ్వానిస్తున్నామని సిరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ సారధులు, డైరెక్టర్ స్వామి, శివ కుమారి దంపతులు వెల్లడించారు. ఇప్పటివరకు వరకు సందర్శకుల నుంచి మంచి ఆదరణ లభించిందని, రానున్న మూడు రోజుల ప్రదర్శనను కూడా విజయవంతం చేయాలని శివ కుమారి విజ్ఞప్తి చేశారు.
వీరిలో ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి, ప్రొ. పద్మావతి, నటి గీతా భాస్కర్, ప్రముఖ ఆర్టిస్ట్ శిల్పి డా. స్నేహలతా ప్రసాద్, డా. హిప్నో పద్మా కమలాకర్ తదితరులున్నారని తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమం సృజనాత్మకత, ప్రతిభా, నైతిక విలువలను ప్రతిబింబించేలా, విశేషమైన ప్రాముఖ్యతను సంతరించుకునేలా కృషి చేశామని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ‘8’ అనే ప్రత్యేక సంఖ్యను ప్రాతిపదికగా రూపకల్పన చేయడం మరో విశేషమని పేర్కొన్నారు.

గత 30 ఏళ్లుగా హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో సిరి ఇన్స్టిట్యూట్ ద్వారా అనేకమందికి శిక్షణనిస్తున్నామని, ఇందులో మహిళలు, ఉద్యోగాలు చేసుకుంటున్నవారు, పదవీ విరమణ చేసినవారు, విద్యార్థులు ఇలా అన్ని వయసుల వారికి చిత్రకళను బోధిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు వేలాది మంది విద్యార్థులకు ఆయిల్, అక్రిలిక్, సాండ్ పెయింటింగ్, తంజావూర్ పెయింటింగ్, 3డీ క్లే ఆర్ట్, స్కెచింగ్ తదితర వివిధ మాధ్యమాల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు, అనేక చిత్ర ప్రదర్శనలను విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు.
వేదిక : JNAF ALU కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మసాబ్ ట్యాంక్, హైదరాబాద్
వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు.
ఫోన్: 3643419662, 9948887211
Comments
Please login to add a commentAdd a comment