masabtank
-
టెన్షన్... టెన్షన్..
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగానికి ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాలు, సామూహిక నిమజ్జనం ఓ సవాల్ లాంటివి. బందోబస్తు నేపథ్యంలో వీటిని అధికారులు ఫైనల్స్‌గా పిలుస్తుంటారు. ఎలాంటి అపశ్రుతులు, వదంతులు షికార్లు చేయడం తదితరాలు చోటు చేసుకోకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పహారా కాస్తుంటారు. అయినప్పటికీ చిన్న చిన్న ఉదంతాలు, టెన్షన్లు మామూలే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి దుర్గా నవరాత్రులు పోలీసులకు చెమటలు పట్టించాయి. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, మాసబ్‌ట్యాంక్‌ల్లో శుక్ర, శనివారాల్లో చోటు చేసుకున్న ఘటనలతో పోలీసులు పరుగులు పెట్టారు. నగర వాసులు పూర్తి సంమయనం పాటించడంతో ఏ చిన్న అపశ్రుతి లేకుండా ఈ రెండూ గట్టెక్కాయి. దీంతో పోలీసుల ఊపిరి పీల్చుకున్నారు. డిప్రెషన్ రోగి నిర్వాకం.. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన దేవీమాత విగ్రహం చేతిని శుక్రవారం మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి ధ్వంసం చేశాడు. ఈ విషయం తెలియడంతో పోలీసు విభాగం అత్యంత అప్రమత్తమైంది. ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. ఎట్టకేలకు అదే రోజు రాత్రి 8.15 గంటలకు నాగర్ కర్నూలుకు చెందిన కృష్ణయ్యను ఫీల్‌ఖానా చౌరస్తా వద్ద పట్టుకున్నారు. గురువారం రాత్రి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సద్దుల బతుకమ్మ పండగ జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆకలితో ఉన్న కృష్ణయ్య ఆహారం కోసం గ్రౌండ్స్‌లోకి వచ్చాడు. తినేందుకు ఏదైనా దొరుకుతుందేమోనని వెతికే ప్రయత్నాల్లోనే మండపం చిందరవందర కావడంతో పాటు విగ్రహం చేయి ధ్వంసమైందని పోలీసులు తేల్చారు. మండపం వద్ద నిర్వాహకులు ఎవరు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవరించడంతో పోలీసులు వారి పైనా కేసు నమోదు చేశారు. ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో వదంతులు షికారు చేశాయి. వీధికుక్క చేసిన పనికి... మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి మరో కలకలం రేగింది. ఓ ప్రార్థన స్థలం ఎదురుగా రోడ్డుపై ఓ ప్రాణి మాంసం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయం బయటకు రావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వెంటనే అప్రమత్తమై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సమీపంలో ఉన్న చెత్త పదార్థాల నుంచి ఓ వీధికుక్క మాంసం ముక్కను నోటితో కరుచుకుని రావడం వీటిలో కనిపించింది. కొద్దిదూరం ఆ ముక్కను అలాగే తీసుకువెళ్లిన శునకం నోటి నుంచి ఓ ముక్క ప్రార్థన స్థలం సమీపంలో పడిపోయింది. శునకం తిరిగి ఆ ముక్కను తీసుకోకుండా వదిలేసి వెళ్లిపోయిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. వీటిని వెంటనే మీడియాకు విడుదల చేసిన పోలీసులు ఈ అంశంపై వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుర్గా నవరాత్రుల్లో పోలీసులకు ఉత్కంఠ -
ఈ శాడిస్ట్ వేధింపుల్ని చాలాకాలం ఓర్చుకున్న
-
సీసీకెమెరాలతో భార్యపై నిఘా పెట్టిన భర్త!
సాక్షి, సిటీబ్యూరో: అనుమానం పెనుభూతమై భార్యను సీసీ కెమెరాలతో వేధిస్తున్న శాడిస్ట్ భర్తపై సీసీఎస్ ఆధీనంలోని మహిళా ఠాణాలో బుధవారం కేసు నమోదైంది. మాసబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన శివశంకర్ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకు రూ.80 వేల జీతానికి పని చేస్తున్నాడు. అకారణంగా భార్యను అనుమానించే ఇతగాడు శాడిస్ట్‌గా మారాడు. ఆమెపై కన్నేసి ఉంచాలనే దురుద్దేశంలో ఇంట్లోని బెడ్రూమ్, హాల్, వంటగదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఐపీ పరిజ్ఞానంతో పని చేసే వీటిని తన సెల్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండేవాడు. తాను చూడటమే కాకుండా స్నేహితులకూ చూపిస్తూ భార్య వ్యక్తిగత జీవితాన్ని బజారుకీడ్చాడు. మరోపక్క నిత్యం అదనపు కట్నం కోసం భార్యను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడు. ఈ శాడిస్ట్ వేధింపుల్ని చాలాకాలం ఓర్చుకున్న భార్య ఎట్టకేలకు సీసీఎస్ ఆధీనంలోని మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు -
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
మాసబ్‌ట్యాంక్: ప్రధాని నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే మాట్లాడతాడని అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అమరేందర్ సింగ్ రాజ బరార్ అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద గల కట్టమైసమ్మ దేవాలయం నుంచి ఆర్టీసీ కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు సమష్టిగా కృషి చేయాలన్నారు. కార్యక్రమం రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్‌కుమార్ యాదవ్, సిటీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సంఘి రెడ్డి పాల్గొన్నారు. -
ముగిసిన ‘మనసారా’
-
రేపటి నుంచి బోస్టన్ కప్ క్రికెట్
సాక్షి, హైదరాబాద్: బోస్టన్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 19 నుంచి జరగనుంది. బోస్టన్ మిషన్ స్కూల్ (తాడ్బన్) ఆధ్వర్యంలో ఈ టోర్నీ మ్యాచ్‌లు మాసబ్‌ట్యాంక్‌లోని స్పోర్ట్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్సీఎఫ్) గ్రౌండ్స్‌లో నిర్వహిస్తారు. అండర్-12, 14, 16 విభాగాల్లో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో మ్యాచ్‌లు జరుగుతాయి. సోమవారం జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐఏఎస్ అధికారి రవికుమార్ నర్రా ముఖ్య అతిథిగా విచ్చేసి టోర్నీని ఆరంభిస్తారు. 15 ఏళ్లుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఈ ఏడాది జంటనగరాల నుంచి సుమారు 100 క్రికెట్ జట్లు పోటీ పడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎస్సీఎఫ్ రెడ్, సూపర్ క్యాట్ క్రికెట్ అకాడమీ, గోవింద్‌రాజు సీఏ, అర్షద్ అయూబ్ సీఏ, తులసీ హైస్కూల్, లెజెండ్ స్పోర్ట్స్ అసోసియేషన్, జూబీ సీఏ, సీసీఓబీ, ఎం.ఎల్. జయసింహ సీఏ, సులేమాన్ హైస్కూల్, మిషన్ హైస్కూల్, నోబుల్ హైస్కూల్, గౌతమ్ స్కూల్ తదితర జట్లు పాల్గొననున్నాయి. మరిన్ని వివరాలకు బోస్టన్ మిషన్ హైస్కూల్ కరస్పాండెంట్ షకీర్ అహ్మద్‌ను 9246362299 ఫోన్నంబర్లో సంప్రదించవచ్చు. -
సమాచార శాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం
సమాచార పౌర సంబంధాల కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్ ప్రాంతంలో ఉన్న ఈ కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. అవి ఇంకా ఎగసిపడుతూనే ఉన్నాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక దళ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు.