సీసీకెమెరాలతో భార్యపై నిఘా పెట్టిన భర్త! | sadist husband arrested at masabtank police station | Sakshi
Sakshi News home page

సీసీకెమెరాలతో భార్యపై నిఘా పెట్టిన భర్త!

Published Wed, Sep 28 2016 10:11 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

sadist husband arrested at masabtank police station

సాక్షి, సిటీబ్యూరో: అనుమానం పెనుభూతమై భార్యను సీసీ కెమెరాలతో వేధిస్తున్న శాడిస్ట్‌ భర్తపై సీసీఎస్‌ ఆధీనంలోని మహిళా ఠాణాలో బుధవారం కేసు నమోదైంది. మాసబ్‌ట్యాంక్‌ ప్రాంతానికి చెందిన శివశంకర్‌ ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో నెలకు రూ.80 వేల జీతానికి పని చేస్తున్నాడు. అకారణంగా భార్యను అనుమానించే ఇతగాడు శాడిస్ట్‌గా మారాడు.  ఆమెపై కన్నేసి ఉంచాలనే దురుద్దేశంలో ఇంట్లోని బెడ్‌రూమ్, హాల్, వంటగదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు.

ఐపీ పరిజ్ఞానంతో పని చేసే వీటిని తన సెల్‌ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకుని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండేవాడు. తాను చూడటమే కాకుండా స్నేహితులకూ చూపిస్తూ భార్య వ్యక్తిగత జీవితాన్ని బజారుకీడ్చాడు. మరోపక్క నిత్యం అదనపు కట్నం కోసం భార్యను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడు. ఈ శాడిస్ట్‌ వేధింపుల్ని చాలాకాలం ఓర్చుకున్న భార్య ఎట్టకేలకు సీసీఎస్‌ ఆధీనంలోని మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement