Shivashankar
-
కేంద్ర మాజీమంత్రి పి.శివశంకర్ భార్య లక్ష్మీబాయి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, కేరళ, సిక్కిం రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేసిన పి.శివశంకర్ సతీమణి లక్ష్మీబాయి (94) గురువారం కన్నుమూ శారు. లక్ష్మీబాయి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన వయోలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు మేనకోడలు. విశాఖ జిల్లా ఎలమంచిలికి చెందిన ఆమె తండ్రి వృత్తిరీత్యా ఒడిశాకు మారారు. ఒడిశాలో మొదటి గ్రాడ్యుయేట్...ఒడిశా రాష్ట్రానికి చెందిన మొదటి మహిళా గ్రాడ్యుయేట్ లక్ష్మీబాయి. ఆమె ఉత్కల్ యూనివర్సిటీలో బీఏ చేసి, బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి పోస్టల్ కోర్సు ద్వారా ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. 1955లో పి.శివశంకర్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె 80 నుంచి 90 సంవత్సరాల వయస్సు మధ్యలో రెండు పీహెచ్డీ డాక్టరేట్లు సాధించారు. ఆమె చేసిన పీహెచ్‌డీల్లో ఒక దానికి బంగారు పతకంతోపాటు జీవిత సాఫల్య పురస్కారం లభించింది.ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించిన థీసిస్ ’’భగవద్గీత, ఆధునిక కాలపు మనిషికి దాని ఔచిత్యం’పై 5,000 పేజీల ప్రవచనం. ఇది ఆమె పూర్తిగా చేతితో రాసిన వ్రాత ప్రతిని యూనివర్సిటీకి సమర్పించారు. ఆమెకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ డాక్టర్ వినయ్. కాగా, డా.లక్ష్మీబాయి మృతిపట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ దర్శకుడు సీవీ శివశంకర్(90) కన్నుమూశారు. కన్నడలో రచయితగా పలు చిత్రాలకు సినీ గీతాలు అందించారు. ఆయనకు గుండెపోటు రావడంతో జూన్ 27న బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు వెంకట్ భరద్వాజ్ వెల్లడించారు. ఆయన మృతి పట్ల కన్నడ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. (ఇది చదవండి: మొదటి ముద్దు.. డెటాల్‌తో నోరు కడుక్కున్నా: ప్రముఖ నటి) 1962లో తన కెరీర్‌ను ప్రారంభించిన శివశంకర్.. మంజరి చిత్రంలో నటుడిగా, సహాయ దర్శకుడిగా పనిచేశాడు. 1967లో పదవీధార అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత 1968లో ‘నమ్మ ఊరు’ అనే మరో చిత్రానికి దర్శకత్వం వహించారు. అదే ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం. ఆ తర్వాత డైరెక్షన్‌కు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత శివశంకర్ కన్నడలో అనేక పాటలకు సాహిత్యం అందించారు. బెంగుళూరు నగారా, సిరివంతనాదరూ కన్నడ నాదల్లె మెరెవే, ఆనందదా తవరూరు వంటి అనేక పాటలు రాశారు. కాగా.. ఆయనకు భార్య రాధమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన కుమారుల్లో ఒకరైన వెంకట్ భరధ్వాజ్ కూడా సినిమా రంగంలో ఉన్నారు. వెంకట్ రెండు సినిమాల్లో కలిసి పనిచేశారు. శివశంకర్‌ను కన్నడ ప్రభుత్వం కర్ణాటక రాజ్యోత్సవ అవార్డుతో సత్కరించింది. (ఇది చదవండి: ఇప్పుడే బ్రేక్ ఫాస్ట్ కూడా చేశా.. విడాకులపై గజినీ హీరోయిన్!) -
టాలీవుడ్లో వరుస విషాదాలు.. నాలుగు రోజుల్లోనే ముగ్గురు కన్నుమూత
సాక్షి; హైదరాబాద్: టాలీవుడ్లో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో టాలీవుడ్ సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతుంది. అప్పటివరకు తమతో ఉన్న తోటి నటులు, కళకారులు వివిధ కారణాలతో కన్ను మూయడం సినీ ప్రపంచాన్ని కలచివేస్తోంది. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ ఇవాళ(నవంబర్ 30) తుదిశ్వాస విడిచారు. నవంబర్ 28న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఊపిరితిత్తులు పాడవడంతో కన్నుమూశారు. అలాగే ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు నవంబర్ 27న గుండెపోటుతో తిరిగిరాని అనంతలోకాలకు తిరిగి వెళ్లిపోయారు. ఈ ఒక్క నాలుగు రోజుల్లోనే ముగ్గురు టాలీవుడ్ ప్రముఖులు మరణించడంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల కన్నుమూత -
శివశంకర్ మాస్టర్ సేవలు మరువలేనివి : హీరో కార్తి
Hero Karthi Condolences To Late Shivashankar Master: నృత్య దర్శకుడు, నటుడు శివ శంకర్ భారతీయ సినిమాకు చేసిన సేవలు అపారమని నటుడు కార్తీ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూసిన శివ శంకర్ మాస్టర్ భౌతిక కాయానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతి యావత్ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ‘శివశంకర్ భారతీయ సినిమాకు చేసిన సేవలు అపారం..ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం’ అని సోమవారం ట్వీట్ చేశారు. అదేవిధంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ శివశంకర్ మాస్టర్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాస్టర్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పలు చిత్రాలకు శివశంకర్ మాస్టర్‌తో కలిసి పని చేసే అవకాశం తనకు కలిగిందని పేర్కొన్నారు. ఆయన మరణం భారతీయ సినిమాకు తీరని లోటు అని అన్నారు. My heartfelt condolences to the family and friends of Shivashankar master. A man of immense talent and decades of contribution to Indian cinema. pic.twitter.com/rsG45Dbwy0 — Actor Karthi (@Karthi_Offl) November 29, 2021 -
బాబా మంచివాడంటూ టీచర్ల పోస్టులు.. పోలీసులు రంగంలోకి దిగగానే..
సాక్షి, చెన్నై: చదువు, సంస్కారం నేర్పడం వారి వృత్తి. విద్యార్థులను లైంగిక వేధింపులకు ప్రోత్సహించడం వారి ప్రవృత్తి. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న ఐదుగురు ఉపాధ్యాయినులు సీబీసీఐడీ పోలీసుల కళ్లుకప్పి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చెన్నై సమీపం కేళంబాక్కంలోని సుశీల్‌హరి పాఠశాల కరస్పాండెంట్ శివశంకర్‌బాబా అక్రమాలు అన్నీ ఇన్నీ కావనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చదువుకునే రోజుల్లో తమను లైంగికవేధింపులకు గురిచేసినట్లు పూర్వ విద్యార్థిని, విద్యార్థులు వాట్సాప్ ద్వారా బహిర్గతం చేశారు. పలువురు విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇటీవల శివశంకర్ బాబాను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. తరువాత ఈ కేసు సీబీసీఐడీ పోలీసుల చేతుల్లోకి వెళ్లింది. బాబాకు బెయిల్ మంజూరు చేయాలని చెంగల్పట్టులోని పోక్సో ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి తమిళరసి విచారించారు. ఈనెల 13వ తేదీన మరలా విచారణకు రాగా శివశంకర్‌బాబాను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినా బెయిల్ మంజూరు కాకపోగా ఈనెల 27వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. గట్టి పోలీసు బందోబస్తు మధ్య మరలా జైలుకు తరలించారు. అదే పాఠశాలలో పనిచేసే ఐదుగురు ఉపాధ్యాయినులు బాబాను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. బాబా మంచివాడని పేర్కొంటూ వెనకేసుకొస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. బాబా మద్దతుగా వ్యవహరించిన ఐదుగురు ఉపాధ్యాయినులను విచారించాలని సీబీసీఐడీ పోలీసులు నిర్ణయించారు. నేరుగా విచారణకు వివరణ ఇవ్వాల్సిందిగా బాబా ఆశ్రమానికి పక్కనే ఉన్న పళనిగార్డెన్ అపార్టుమెంటులో నివసిస్తున్న ఐదుగురు ఉపాధ్యాయినులకు సమన్లు పంపారు. అయితే ఈ ఐదుగురు హాజరుకాలేదు. ఈనెల 19వ తేదీ తప్పక హాజరుకావాలని ఆదేశిస్తూ సమన్లను స్వయంగా అందజేసేందుకు పోలీసులు శనివారం ఉదయం సదరు అపార్టుమెంటుకు వెళ్లగా ఐదుగురి ఇళ్లు తాళాలు వేసి ఉన్నాయి. పోలీసులు ఐదుగురి ఇళ్ల తలుపులుపై సమన్లను అతికించి వెళ్లిపోయారు. ఐదుగురు ఉపాధ్యాయినులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఈ శాడిస్ట్ వేధింపుల్ని చాలాకాలం ఓర్చుకున్న
-
సీసీకెమెరాలతో భార్యపై నిఘా పెట్టిన భర్త!
సాక్షి, సిటీబ్యూరో: అనుమానం పెనుభూతమై భార్యను సీసీ కెమెరాలతో వేధిస్తున్న శాడిస్ట్ భర్తపై సీసీఎస్ ఆధీనంలోని మహిళా ఠాణాలో బుధవారం కేసు నమోదైంది. మాసబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన శివశంకర్ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకు రూ.80 వేల జీతానికి పని చేస్తున్నాడు. అకారణంగా భార్యను అనుమానించే ఇతగాడు శాడిస్ట్‌గా మారాడు. ఆమెపై కన్నేసి ఉంచాలనే దురుద్దేశంలో ఇంట్లోని బెడ్రూమ్, హాల్, వంటగదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఐపీ పరిజ్ఞానంతో పని చేసే వీటిని తన సెల్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండేవాడు. తాను చూడటమే కాకుండా స్నేహితులకూ చూపిస్తూ భార్య వ్యక్తిగత జీవితాన్ని బజారుకీడ్చాడు. మరోపక్క నిత్యం అదనపు కట్నం కోసం భార్యను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడు. ఈ శాడిస్ట్ వేధింపుల్ని చాలాకాలం ఓర్చుకున్న భార్య ఎట్టకేలకు సీసీఎస్ ఆధీనంలోని మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు