కేంద్ర మాజీమంత్రి పి.శివశంకర్‌ భార్య లక్ష్మీబాయి కన్నుమూత | Former Union min Shiv Shankar’s wife Laxmi Bai passes away at 94 | Sakshi
Sakshi News home page

కేంద్ర మాజీమంత్రి పి.శివశంకర్‌ భార్య లక్ష్మీబాయి కన్నుమూత

Published Fri, May 31 2024 6:00 AM | Last Updated on Fri, May 31 2024 6:06 AM

Former Union min Shiv Shankar’s wife Laxmi Bai passes away at 94

80 – 90 సంవత్సరాల వయసు మధ్యలో రెండు పీహెచ్‌డీ డాక్టరేట్‌లు

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర మాజీ మంత్రి, కేరళ, సిక్కిం రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేసిన పి.శివశంకర్‌ సతీమణి లక్ష్మీబాయి (94) గురువారం కన్నుమూ శారు. లక్ష్మీబాయి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన వయోలిన్‌ విద్వాంసుడు  ద్వారం వెంకటస్వామి నాయుడు మేనకోడలు. విశాఖ జిల్లా ఎలమంచిలికి చెందిన ఆమె తండ్రి వృత్తిరీత్యా ఒడిశాకు మారారు. 

ఒడిశాలో మొదటి గ్రాడ్యుయేట్‌...
ఒడిశా రాష్ట్రానికి చెందిన మొదటి మహిళా గ్రాడ్యుయేట్‌ లక్ష్మీబాయి. ఆమె ఉత్కల్‌ యూనివర్సిటీలో బీఏ చేసి, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ నుంచి పోస్టల్‌ కోర్సు ద్వారా ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. 1955లో పి.శివశంకర్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె 80 నుంచి 90 సంవత్సరాల వయస్సు మధ్యలో రెండు పీహెచ్‌డీ డాక్టరేట్‌లు సాధించారు. ఆమె చేసిన పీహెచ్‌డీల్లో ఒక దానికి బంగారు పతకంతోపాటు జీవిత సాఫల్య పురస్కారం లభించింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించిన థీసిస్‌ ’’భగవద్గీత, ఆధునిక కాలపు మనిషికి దాని ఔచిత్యం’పై 5,000 పేజీల ప్రవచనం. ఇది ఆమె పూర్తిగా చేతితో రాసిన వ్రాత ప్రతిని యూనివర్సిటీకి సమర్పించారు. ఆమెకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు సీనియర్‌ సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్‌ డాక్టర్‌ వినయ్‌. కాగా, డా.లక్ష్మీబాయి మృతిపట్ల హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్‌ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement