![Explosion In jammu Kashmir Soldiers lost lives](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/Soldiers_12.jpg.webp?itok=HNjtXViP)
జమ్ము:జమ్ముకశ్మీర్‌లో మంగళవారం(ఫిబ్రవరి11) ఐఈడీ(మందుపాతర) పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇద్దరు సైనికులు మృతి చెందారు. మరో ముగ్గురు సైనికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులకు తీవ్ర గాయాలైనట్లు అధికారులు తొలుత తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతంలో భద్రతాదళాల కూంబింగ్ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment