గాజాలో భారీ పేలుడు.. 8 మంది ఇజ్రాయెల్‌ సైనికులు మృతి | Gaza: 8 Israeli soldiers deceased in Rafah explosion | Sakshi
Sakshi News home page

గాజాలో భారీ పేలుడు.. 8 మంది ఇజ్రాయెల్‌ సైనికులు మృతి

Published Sun, Jun 16 2024 7:42 AM

Gaza: 8 Israeli soldiers deceased explosion

ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య గాజాలో యుద్ధం కొనసాగుతోంది. దక్షిణ గాజాలో చోటు చోసుకున్న పేలుడులో 8 మంది ఇజ్రాయెల్‌ సైనికులు మరణించినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. దక్షిణ గాజాలోని రఫా నగరానికి సమీపంలో ఇజ్రాయెల్‌ సైనికులు ప్రయాణిస్తున్న నేమర్‌ వాహనం పేలటంతో ఈ ఘటన జరిగినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది.

ఈ పేలుడు భారిగా సంభవించడంతో వాహనం పూర్తిగా దగ్ధం అయిదని, అదే విధంగా మృత దేహాలను గుర్తించటంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇజ్రాయెల్‌ సైనిక అధికారులు తెలిపారు.  ఈ పేలుడు ఎవరు జరిపారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అయితే ఆ ప్రాంతంలో హమాస్‌ మిలిటెంట్లు పేలుడు పరికరం అమర్చా? లేదా యాంటీ ట్యాంక్‌ మిసైల్‌ను నేరుగా ప్రయోగించారా? అని ఇజ్రాయెల్‌ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

శనివారం జరిగిన పేలుడులో 8మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందటం భారీ నష్టమని తెలిపారు. ఇక.. ఇప్పటివరకు 306 మంది ఇజాయెల్‌ సైనికులు మృతి చెందారని అ‍న్నారు. 

మృతి చెందిన సైనికులకు ప్రధానమంత్రి  బెంజమిన్‌ నెతన్యాహు నివాళులు అర్పించారు. సైనికుల భారీ నష్టంతో తన హృదయం ముక్కలైందని అన్నారు.  అస్థిరమైన పరిస్థితులు నెలకొన్నా.. భారీ నష్టం జరిగినా యుద్ధ లక్ష్యాలకు కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement