జెరూసలెం: రెండు నెలలుగా హమాస్‌తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ సైనికులకు కాస్త ఆటవిడుపు లభించింది. గాజా సమీపంలో అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని పోలి ఉన్న ఒక వస్తువు వారికి దొరికింది. దీనిని 1500 సంవత్సరాల కిందటి బైజెంటీన్ కాలం నాటి దీపంగా గుర్తించారు.
‘ఫీల్డ్‌లో తిరుగుతున్నపుడు కింద ఒక పురాతన వస్తువు దొరికింది. దాని గుండ్రటి ఆకారం నన్ను ఆకర్షించింది. ఆ వస్తువు పై భాగం బురదతో కప్పి ఉంది. దానిని శుభ్రం చేశాను. వెంటనే ఆ వస్తువను ఇజ్రాయెల్ ఆంటిక్విటీస్ అథారిటీ(ఐఏఏ)కి చెందిన ఆర్కియాలజిస్ట్‌కు అప్పగించాను’ అని సైనికుడు తెలిపాడు.
‘పురాతన వస్తువును పరిశీలించిన ఐఏఏ అది 5 లేదా 6వ శతాబ్దానికి చెందిన బైజెంటీన్ కాలం నాటి ‘సాండల్ క్యాండిల్’ అని వెల్లడించింది. క్యాండిల్ దొరికిన వెంటనే తమకు ఇచ్చిన సైనికులకు ఐఏఏ ధన్యవాదాలు తెలిపింది. ఇజ్రాయెల్ చుట్టు పక్కల ప్రాంతాల్లో గొప్ప సంస్కృతి, పురాతన కాలం నాటి విలువైన సంపద ఉందని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment