Lamp
-
అయోధ్య: దీపోత్సవానికి ముస్తాబు.. పుష్ఫ వర్షానికి ఏర్పాట్లు
అయోధ్య: యూపీలోని రామనగరి అయోధ్య దీపోత్సవానికి ముస్తాబవుతోంది. తాజాగా అవధ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తన బృందంతో కలిసి రామ్ కీ పైడీ, దీపోత్సవ్ సైట్లను పరిశీలించారు. అక్టోబరు 22న అయోధ్యలో దీపోత్సవం జరగనుంది. దీనికిముందు అవధ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రతిభా గోయల్, ఆమె బృందం రామ్ కీ పైడీ వద్ద వేద పండితుల సమక్షంలో భూమి పూజ చేయనున్నారు. నూతన రామాలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత జరిగే మొదటి దీపాల పండుగ ఇదే కావడంతో, దీనిని అద్భుతంగా నిర్వహించాలని రామాలయ ట్రస్టు భావిస్తోంది.ఈసారి అయోధ్యలో 25 లక్షల దీపాలు వెలిగించి, నూతన రికార్డు సృష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 40 స్వచ్ఛంద సంస్థలతో పాటు అవధ్ యూనివర్సిటీ, కాలేజీ, 36 ఇంటర్ కాలేజీలకు చెందిన 30 వేల మందికి పైగా విద్యార్థులు దీపాలు వెలిగించనున్నారు. రామ్ కీ పైడీ సహా 55 ఘాట్లపై 28 లక్షల దీపాలు వెలిగించనున్నారు. ఇందుకోసం దాదాపు 90 వేల లీటర్ల నూనెను వినియోగించనున్నారు. అక్టోబర్ 28 నాటికి ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తికానున్నాయి. ఈ ఏడాది దీపోత్సవం నిర్వహిస్తున్న సమయాన హెలికాప్టర్ల నుంచి పూలవర్షం కురిపించనున్నారు. అలాగే అయోధ్య నగరాన్ని పూలతో అందంగా అలంకరించనున్నారు.ఇది కూడా చదవండి: ధర్మ చక్రం: నాలుగు ఆశ్రమాలలో ఏది గొప్పది? -
పెళ్లిలో గర్భిణీని అలా చూసి ‘నెత్తికెత్తుకున్నాడు’: తరువాత ఏమైందంటే..!
పెళ్లిళ్లు, జాతర్లు, ఊరేగింపుల్లో బలిష్ఠమైన పురుషులు పెద్ద పెద్ద విద్యుత్తు దీపాలను తలపై పెట్టుకుని మోస్తూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. చాలాసార్లు అలాంటి దృశ్యాలను అలా చూసి వెళ్లిపోతాం. చిన్న చిన్న పిల్లలు, ఆడవాళ్లు ఇలాంటి దీపాల్ని మోస్తున్నపుడు.. మహా అయితే... అయ్యో అనుకుంటాం. కూటి కోసం కోటి విద్యలు అనుకుంటాం. మరుక్షణం ఆ విషయాన్ని మర్చిపోతాం. ఇంతకుమించి పెద్దగా పట్టించుకోం. లేదంటే సాయానికి ముందు కెళ్లదామని అనిపించినా.. ఏదో తెలియని మొహమాటం వెంటాడుతుంది.. కదా. కానీ ఒక వ్యక్తి మాత్రం మానవత్వంతో ఆలోచించి, చురుగ్గా స్పందించారు. అంతేకాదు ఆయన చేసిన పని మరో నలుగురికి ఆదర్శప్రాయమైంది. విషయం ఏమిటంటే..తన స్నేహితుడి కుమారుడి వివాహ వేడుకలో తలపై దీపాన్ని మోస్తున్న గర్భిణీని చూశారు తన్వీర్ మహ్మద్. అది చూడగానే ఆయనకు తల్లి గుర్తొచ్చిందో ఏమో గానీ, వెంటనే స్పందించారు. ఆమె నెత్తిపై ఉన్న దీపాన్ని తన నెత్తిపైకి తీసుకున్నారు.At a wedding event of my friend’s son, I noticed a pregnant lady carrying light on her head. I offered to carry it for her. Inspired by my gesture, my friends also took turns carrying it and gave her three times payment and twice to the group. No heroism greater than Mother. pic.twitter.com/OkWkVJYOnN— Tanveer Ahmed 🇮🇳 (@TheTanveerAhmed) June 18, 2024ఆగండి..ఆగండి..కథ ఇక్కడితో అయిపోలేదు..తన్వీర్‌ను చూసిన ఆయన స్నేహితులు కూడా ముందు కొచ్చారు. వంతుల వారీగా ఆమె బరువును తమ నెత్తికెత్తుకున్నారు.అంతేకాదు స్నేహితులంతా కలిసి ఈ పనికోసం చెల్లించే దానికంటే రెండు రెట్లు ఎక్కువ చెల్లించారట ఆ బృందానికి. ‘తల్లిని మించిన హీరో లేరు’ అంటూ తన్వీర్ ఈ విషయాన్ని వీడియోతోపాటు ఎక్స్‌లో షేర్ చేశారు. దీంతో పలువురు మంచి పని చేశారు భయ్యా అంటూ అభినందించారు. ఆయన ఆలోచనలు, భావాలతో విభేదించేవారు కూడా తన్వీర్ స్పందించిన తీరుపై ప్రశంసలు కురిపించడం విశేషం. -
Israel: సైనికులకు దొరికిన ‘అల్లావుద్దీన్’ దీపం !
జెరూసలెం: రెండు నెలలుగా హమాస్‌తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ సైనికులకు కాస్త ఆటవిడుపు లభించింది. గాజా సమీపంలో అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని పోలి ఉన్న ఒక వస్తువు వారికి దొరికింది. దీనిని 1500 సంవత్సరాల కిందటి బైజెంటీన్ కాలం నాటి దీపంగా గుర్తించారు. ‘ఫీల్డ్‌లో తిరుగుతున్నపుడు కింద ఒక పురాతన వస్తువు దొరికింది. దాని గుండ్రటి ఆకారం నన్ను ఆకర్షించింది. ఆ వస్తువు పై భాగం బురదతో కప్పి ఉంది. దానిని శుభ్రం చేశాను. వెంటనే ఆ వస్తువను ఇజ్రాయెల్ ఆంటిక్విటీస్ అథారిటీ(ఐఏఏ)కి చెందిన ఆర్కియాలజిస్ట్కు అప్పగించాను’ అని సైనికుడు తెలిపాడు. ‘పురాతన వస్తువును పరిశీలించిన ఐఏఏ అది 5 లేదా 6వ శతాబ్దానికి చెందిన బైజెంటీన్ కాలం నాటి ‘సాండల్ క్యాండిల్’ అని వెల్లడించింది. క్యాండిల్ దొరికిన వెంటనే తమకు ఇచ్చిన సైనికులకు ఐఏఏ ధన్యవాదాలు తెలిపింది. ఇజ్రాయెల్ చుట్టు పక్కల ప్రాంతాల్లో గొప్ప సంస్కృతి, పురాతన కాలం నాటి విలువైన సంపద ఉందని వెల్లడించింది. ఇదీచదవండి..హౌతీ రెబెల్స్‌పై అమెరికా కీలక ప్రకటన -
తిరువణ్ణామలైలో ఘనంగా కార్తీక దీపోత్సవం
తమిళనాడులోని తిరువణ్ణామలైలో కార్తీక మాస దీపోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలు ఈనెల 17న ప్రారంభమయ్యాయి. పూలతో అందంగా అలంకరించిన వాహనాల్లో ప్రతిరోజూ అన్నామలైయార్, నిమ్ములై అమ్మన్లను వీధుల్లో ఊరేగిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే పంజరథ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లోని పలు ఘట్టాలు భక్తులను అమితంగా అలరిస్తాయి. భరణి దీపం: కార్తీక దీపోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన భరణి దీపం వేడుకను ఈరోజు (ఆదివారం) ఉదయం 5 గంటలకు నిర్వహించారు. అన్నామలైయార్ గర్భగుడి ఎదుట శివాచార్యులు వేద మంత్రోచ్ఛారణలతో పారాణి దీపం వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన అనేకత్వంలోని ఏకత్వాన్ని వివరించారు. అనంతరం అరుణాచలేశ్వర ఆలయం లోపలి ప్రాకారం చుట్టూ తిరుగుతూ నిన్నములైయమ్మన్‌తోపాటు అన్ని సన్నిధానాల్లో పారాణి దీపం వెలిగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకున్నారు. మహాదీపం: ఉత్సవాల్లో ‘మహాదీపం’ వేడుక ఉత్కృష్టంగా నిలుస్తుంది. ఆలయం వెనుకవైపు ఉన్న 2,668 అడుగుల ఎత్తయిన కొండపై నేటి (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు మహాదీపం వెలిగిస్తారు. గిరివాలం: కార్తీక దీపోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి దర్శనం కోసం ఇప్పటికే 30 లక్షల మందికి పైగా భక్తులు గిరివాలానికి (ప్రదక్షిణ) తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కొండపై 7 అడుగుల పొడవు, 200 కిలోల బరువు కలిగిన జ్యోతిని వెలిగిస్తారు. 3500 లీటర్ల నెయ్యి వినియోగం: మహాదీపం వెలిగించేందుకు భక్తుల నుంచి స్వీకరించిన 3500 లీటర్ల నెయ్యి, వెయ్యి మీటర్ల ఖాదీ వస్త్రాన్ని ఇంతకుముందే కొండపైకి తీసుకెళ్లారు. మహా దీపాన్ని వీక్షించేందుకు 2,500 మందిని మాత్రమే కొండపైకి ఎక్కేందుకు అనుమతించనున్నారు. కార్తీక దీపోత్సవం సందర్భంగా తిరువణ్ణామలై దీపాల వెలుగులతో మెరిసిపోతోంది. ఇది కూడా చదవండి: నాడు కసబ్‌ను గుర్తించిన బాలిక ఇప్పుడేం చేస్తోంది? -
అదిరిపోయే గ్యాడ్జెట్.. కొత్తగా చూసేవాళ్లు కొరివిదెయ్యమని భయపడతారు!
లాంతరు నడవటమేంటి? లాంతరు పట్టుకుని మనిషి నడవాలి కదా అనుకుంటున్నారా? ఈ హైటెక్ లాంతరు మాత్రం తనంతట తానే నడుస్తుంది. రాత్రివేళ ఇంట్లో దీపాలార్పేసి, దీన్ని వెలిగించుకుంటే ఇల్లంతా కలియదిరుగుతూ రంగు రంగుల్లో వెలుగులు విరజిమ్ముతుంది. కొత్తగా చూసేవాళ్లు ఇదేదో కొరివిదెయ్యంలా ఉందనుకుని భయపడే అవకాశాలూ లేకపోలేదు. మామూలుగా చార్జింగ్ చేసుకుని వాడుకునే ఎమర్జెన్సీ దీపాల్లాగానే దీనిని వాడుకోవచ్చు. అయితే, దీనికింద సాలీడు కాళ్లలాంటి రోబోటిక్ కాళ్లను అమర్చడం వల్ల ఇది నడవగలుగుతుంది కూడా. జపాన్‌కు చెందిన ఐటీ ఇంజనీర్ ఇయానియస్ తన ప్రాజెక్టులో భాగంగా దీనికి రూపకల్పన చేశాడు. దీని తయారీ కోసం త్రీడీ ప్రింటింగ్ ద్వారా ముద్రించిన విడిభాగాలను ఉపయోగించాడు. దీని పనితీరును ప్రత్యక్షంగా చూపడానికి తీసిన వీడియో ‘ట్విట్టర్’లో పెడితే, కొద్ది గంటల్లోనే అది వైరల్‌గా మారింది. చదవండి: ‘బకరాల్ని చేశాడు.. మస్క్ ట్వీట్‌తో మబ్బులు వీడాయ్’ -
సోలార్ హెడ్‌ల్యాంప్ ఉపయోగాలు ఎన్నో.. ఎన్నెన్నో
హెడ్‌ల్యాంప్‌లు కొత్తవేమీ కాదు గాని, సౌరశక్తితో పనిచేసే హెడ్‌ల్యాంప్‌లు మాత్రం కొత్తే! అమెరికాకు చెందిన సోలార్ వస్తువుల తయారీ సంస్థ ఎంపవర్డ్ ‘లూసిబీమ్’ పేరుతో సౌరశక్తితో పనిచేసే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది హెడ్‌ల్యాంప్‌గానే కాదు, ఫ్లాష్‌లైట్‌గా కూడా ఉపయోగపడుతుంది. క్యాంపులు, పిక్నిక్లు వెళ్లేటప్పుడు, చీకటి ప్రదేశాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. చుట్టూ చీకటి ఉన్నా, దీనికి ఉండే ఎలాస్టిక్ హెడ్‌బ్యాండ్‌ను తలకు తగిలించుకుని, దీపిపి ఆన్ చేసుకుంటే చాలు. దీని నుంచి వెలువడే వెలుతురులో హాయిగా పుస్తకాలు చదువుకోవచ్చు. దీని నుంచి 300 ల్యూమెన్స్ వెలుతురు నిరంతరాయంగా వెలువడుతుంది. దీనికి ఉన్న యూఎస్బీ పోర్ట్‌తో సెల్ఫోన్లు వంటి ఎలక్ట్రిక్ పరికరాలను కూడా చార్జ్ చేసుకోవచ్చు. దీని ధర 35.68 డాలర్లు (రూ.2,920) మాత్రమే! -
పంట పురుగులకు దీపపు ఎరలతో చెక్
మోత్కూరు: పంట చేలను ఆశించే కీటకాల నివారణకు రసాయన మందుల పిచికారీ బదులు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం గ్రామంలో కొందరు రైతులు ప్రయోగాత్మకంగా చేపట్టిన సోలార్ లైట్ట్రాప్ (దీపపు ఎర)ల విధానం సత్ఫలితాలిస్తోంది. వరి, పత్తి, కంది పంటలను ఆశించే కాండం తొలిచే పురుగు, ఆకు ముడత, లద్దె పురుగు, గులాబీరంగు పురుగు, మరూక మచ్చల పురుగు వల్ల నష్టపోతున్న రైతులు... వాటి నిర్మూలనకు సుమారు 50 ఎకరాల్లో ఈ పరికరాలను అమర్చారు. సౌర వెలుగుల ఆకర్షణకు పరికరం వద్దకు చేరుకుంటున్న పురుగులు కాంతిని తట్టుకోలేక దాని కింద ఉండే సబ్బునీళ్ల టబ్‌లో పడి నశిస్తున్నాయి. మార్కెట్లో రూ. 2 వేలకు లభిస్తున్న ఒక్కో సోలార్ లైట్ ట్రాప్ పరికరం ద్వారా 2–3 ఎకరాల విస్తీర్ణంలో ఉండే అన్ని రకాల పురుగులను నియంత్రించడం సాధ్యమవుతోందని, ఫలితంగా చీడపీడల ఉధృతి తగ్గి దిగుబడి పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. చదవండి: మునుగోడులో దూసుకుపోతున్న బీజేపీ, టీఆర్ఎస్.. మరి కాంగ్రెస్? -
మీకు తెలుసా?
♦ వత్తిని నూనెలో తడిపి వెలిగించి, దానితో రెండు వత్తులను (దీపారాధన) వెలిగించాలి. ♦ ఉదయం పూట తూర్పు దిశగా రెండు వత్తులు ఉండేటట్లు దీపం ముఖం ఉండాలి. ♦ సాయంత్రం పూట ఒక వత్తి తూర్పుగా, రెండవది పడమటగా ఉండాలి. ♦ శివునికి అభిషేకం, సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకునికి తర్పణం, అమ్మవారికి కుంకుమ పూజ ఇష్టం. ఇవి చేస్తే మంచి జరుగుతుంది. ♦ దైవప్రసాదాన్ని పారవేయరాదు. ♦ దీపాన్ని నోటితో ఆర్పరాదు. ♦ ఒక దీపం వెలుగుతుండగా, రెండవ దీపాన్ని మొదటి దీపంతో వెలిగించరాదు. ♦ దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు. ♦ దేవుని పూజకు ఉపయోగించే ఆసనాన్ని వేరొక పనికి వాడరాదు. ♦ దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం, స్తోత్రాలు చదవకూడదు. పక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి. -
వెలగని దీపం!
► నియోజకవర్గానికి 5వేల చొప్పున ► గ్యాస్ కనెక్షన్ల కేటాయింపు ► రెండేళ్లుగా కొనసాగుతున్న ప్రక్రియ ► ఉన్నతాధికారుల ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుచేయని వైనం ► లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ► ఇవ్వడంలో తీవ్రజాప్యం ► ఇదే అదునుగా సీఎస్ఆర్ కనెక్షన్లు ► ఇస్తున్న గ్యాస్ కంపెనీలు మహబూబ్‌నగర్ న్యూటౌన్ కట్టెలపొయ్యితో పొగచూరిన మహిళలకు విముక్తి కల్పించి వారి ఆరోగ్యాలను కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం గ్యాస్ కనెక్షన్ల పథకం జిల్లాలో అర్హుల దరి చేరడం లేదు. ఈ పథకం గ్రౌండింగ్ విషయంలో సమావేశాలు నిర్వహించి పురోగతిని పెంచాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా కిందిస్థాయి అధికారులకు పట్టడం లేదు. సరైన సిబ్బంది లేరనే సాకు వారికి తోడైంది. దీంతో గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైంది. ఫలితంగా ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. దీపం పథకం కింద నియోజకవర్గానికి 5 వేల చొప్పున పేదలకు గ్యాస్ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసి రెండేళ్లు గడుస్తోంది. అయినా క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం పట్ల ఉన్నతాధికారులు సైతం పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. అమలులో ఎలాంటి లోపాలున్నాయో ఇప్పటివరకు స్పష్టత రాని పరిస్థితి నెలకొంది. లబ్ధిదారుకు ఇష్టం లేకపోతే రాతపూర్వకంగా రాయించుకొని రద్దు చేసి ఆ స్థానంలో వేరొకరికి అవకాశవిువ్వాలని దీపం పథకం గ్రౌండింగ్‌పై గత నెల క్రితం నిర్వహిం చిన సమావేశంలో పౌరసరఫరా ల అధికారులు, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులకు జిల్లా జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు నెల రోజులు గడిచినా పురోగతిలో మాత్రం అడుగు ముందుకు పడలేదు. పర్యవేక్షణా లోపం కారణంగా గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు ఈ పథకం అమలుపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది. అడ్డంకిగా మారిన సీఎస్ఆర్ దీపం పథకం అమలుకు సీఎస్ఆర్ (కంపెనీ సోషల్ రెస్సా¯Œ్సబుల్) విధా నం అడ్డంకిగా మారింది. దీపం పథకంలో లబ్ధిదారుల ఎంపిక రాజకీయ నాయకులు, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల ప్రమేయంతో జరుగుతోంది. దీంతో కనెక్షన్లు మంజూరై రెండేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు ఇప్పటివరకు మంజూరు ప్రొసీడింగులు అందలేదు. లబ్ధిదారుల అవసరాలను ఆసరాగా చేసుకున్న గ్యాస్ ఏజెన్సీలు.. కంపెనీలు ఇచ్చే సీఎస్ఆర్ కనెక్ష¯ŒSలపై దృష్టి సారించాయి. దీపం లబ్ధిదారులకు సీఎస్ఆర్ కనెక్ష¯ŒSలు ఇస్తున్నాయి. అప్పటికే కనెక్ష¯ŒS తీసుకోవడంతో దీపం పథకం కింద మంజూరైన కనెక్షన్ల గ్రౌండింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోంది. గ్యాస్ కంపెనీల లాభాల్లోనుంచి 2 శాతం ఖర్చు చేయాలని ప్రభుత్వ నిబంధనల ప్రకారం... సీఎస్ఆర్ కనెక్షన్లను పేద లబ్ధిదారులకు డిపాజిట్ లేకుండా గ్యాస్ కంపెనీలు అందజేయడం గమనార్హం. లక్ష్యం 27,262 దీపం కనెక్షన్లు ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 5 వేల చొప్పున దీపం కనెక్షన్లు మం జూరు చేసింది ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజన తర్వాత తాజా మహబూబ్‌నగర్ జిల్లాకు 27,262 దీపం కనెక్షన్లను లక్ష్యంగా నిర్దేశిం చారు. అందులో 20,846 మంది లబ్ధిదారులను గుర్తించగా 20,406 మందికి అనుమతులు మంజూరు చేశారు. మొత్తం 18,077 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగులను జారీ చేశారు. ఇప్పటివరకు అందులో 9,624 మందికి కనెక్షన్లు ఇచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. అనుమతులు జారీ చేసిన వాటిలో ఇంకా 8,453 కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. మంజూరు చేసిన దీపం పథకం కనెక్షన్లకు డిపాజిట్ రూపేణ రూ.1600 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ కంపెనీలకు చెల్లించింది. దీపం పథకం లబ్ధిదారుల పేరిట డిపాజిట్ రూపేణ గ్యాస్ కంపెనీలకు దాదాపు రూ.4.36 కోట్లు వెచ్చించింది. రాజకీయ పట్టువిడుపులు రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఈ పథకం పురోగతి సాధించకపోవడానికి క్షేత్రస్థాయిలో రాజకీయాల పట్టువిడుపులు ఒక కారణమైతే, కంపెనీలు ఇస్తున్న సీఎస్ఆర్ కనెక్షన్లు మరో కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎస్ఆర్ కనెక్షన్లు నిలిపివేయాలని అధికారుల సిఫారసు మేరకు ప్రజాప్రతినిధులు సంబంధిత గ్యాస్ కంపె నీలపై ఒత్తిడి తెచ్చారు. పథకం పురోగతిలో ఎదురవుతున్న ఇబ్బందులపై అధికారులతో రెండుమూడు సార్లు స మీక్షలు నిర్వహించి చర్చించారు. సీ ఎస్ఆర్ కనెక్షన్లకు అనుమతులు ఎందుకిస్తున్నారని, గతంలో ఇచ్చి న వాటికి కచ్చితంగా అనుమతి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు.. అధికారులకు హుకూం జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన సీఎస్ఆర్ కనెక్షన్లకు అనుమతుల కోసం గ్యాస్‌డీలర్లు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అప్పటికే దీపం పథకం లబ్ధిదారులు సీఎస్ఆర్ కనెక్షన్లు పొం దడం, గ్యాస్ ఏజెన్సీలను టార్గెట్ చేసి ప్రజాప్రతినిధులు టెక్నికల్‌గా ఇబ్బందులు పెట్టడం, అధికారులు, ప్రజా ప్రతినిధులు శ్రద్ధచూపకపోవడం కారణాలు దీపం పథకం అమలుకు అడ్డంకిగా మారాయని తెలుస్తోంది. -
టమాట దీపం
టమాట దీపం ఏమిటనుకుంటున్నారా.. అయితే తిమ్మనాయినపేటకు వెళ్లాల్సిందే. గ్రామానికి చెందిన రమేష్ శెట్టి బుధవారం టమాట గంప కొనుగోలు చేశాడు. ఇంటికి చేరుకున్నాక వేరు చేస్తుండగా దీపం ఆకారంలో టమాట పండు ఒకటి కనిపించింది. దానిని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కార్తీక మాసంలో ఈ తరహా టమాట లభించడం అదృష్టంగా రమేష్ శెట్టి భావిస్తున్నారు. - కొలిమిగుండ్ల -
చిదిమి దీపం పెట్టుకోగలం చీకటి దీపాన్ని పెట్టుకోలేం!
అందమైన లోకం వెలుగునివ్వని మనిషి కారణంగా సాటి మనిషి జీవితం చీకటిమయం అవుతుంది తప్ప ఏ దేవుడో పైనుంచి చీకటి బాణాన్ని సంధించి మానవ జీవితాన్ని దుఃఖమయం చెయ్యడు. దీపం పక్కన దీపం... దీపం పక్కన దీపం... చూడ్డానికి ఆ వరుస ఎంతో బాగుంటుంది. దీపాలు గ్యాప్‌లు ఇస్తూ ఆరి వెలిగి, ఆరి వెలుగుతుంటే ఇంకా బాగుంటుంది. ఆ వరుసలో, ఆ గ్యాప్‌లో జీవితానికి అవసరమైన సందేశం ఏదో మనసుకు అందుతుంటుంది. సంతృప్తి ఏదో మనసు నిండా పరచుకుంటుంది. అందుకే ఒకటే దీపం ఉంటే సరిపోదు. పక్క దీపం ఉండాలి. దీపాలన్నీ అలా వెలుగుతూ ఉండిపోతే ఏం అనిపించదు. ఆరి వెలుగుతుండాలి. చీకటి వెలుగులు అంటుంటాం కానీ, నిజానికి లోకంలో చీకటనేదే లేదు. వెలుగు మాత్రమే ఉంది. వెలుగు లేకపోవడమే చీకటి. ఇది తాత్వికులు చెప్పవలసిన మాటే అయినా, మామూలు మనుషులను కూడా అప్పుడప్పుడు అధాటున ఈ చీకటి నిర్వచనం అకస్మాత్తుగా వెలుగై కమ్ముకుంటుంది. లోకంలోని చీకటైనా, మనసులోని చీకటైనా వెలుగు లేకపోవడం వల్ల వచ్చేదే! వెలుగునివ్వని మనిషి కారణంగా సాటి మనిషి జీవితం చీకటిమయం అవుతుంది తప్ప ఏ దేవుడో పై నుంచి చీకటి బాణాన్ని సంధించి జీవితాన్ని దుఃఖమయం చెయ్యడు. భర్త ప్రేమ లేకపోవడం భార్యకు చీకటి. తండ్రి లాలన పాలన లేకపోవడం బిడ్డలకు చీకటి. రెక్కలొచ్చిన పిల్లల ఆదరణ లేకపోవడం వృద్ధులైన తల్లిదండ్రులకు చీకటి. ఈ చీకటి ఎవరికివాళ్లు పోగొట్టుకోగలిగినది కాదు. వెలుగునిచ్చే బాధ్యత ఉన్నవాళ్లు పోగొట్టవలసినది. సృష్టిలో వెలుగునివ్వని ప్రాణీ ఏదీ లేదు. సూర్యచంద్రులు, నక్షత్రాలకు మాత్రమే ఆ శక్తి పరిమితం కాదు. అప్పుడే పుట్టిన పసికందు సైతం కన్ను తెరిచి, వంశవృక్షం మొత్తానికీ సీరియల్ సెట్‌లా వెలుగునిస్తుంది. అదే పసికందు నవ్వి వెలుగునిస్తుంది. నడిచి వెలుగునిస్తుంది. తొలి పలుకుతో వెలుగునిస్తుంది. చదివి, వృద్ధిలోకి వచ్చి తను పుట్టిన కుటుంబానికి, తనకు ఏర్పడిన కుటుంబానికి తన రిలేషన్ ఏమిటో ఆ రిలేషన్‌తో వెలుగును ఇస్తుంది. సమాజంతో తనకెలాంటి బంధం ఏర్పడుతుందో ఆ బంధంతో సమాజానికి వెలుగును ఇస్తుంది. సైనికుడు బోర్డర్లో భద్రతతో దేశానికి వెలుగును ఇస్తాడు. నాయకుడు ఒక ఆర్డర్లో దేశాన్ని ఉంచి ప్రజలకు వెలుగునిస్తాడు. శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, ఆధ్మాతికవేత్తలు, వైద్య నిపుణులు, కళాకారులు.. ఇంకా.. కార్మికులు, కర్షకులు, శ్రామికులు.. పరిశోధనలతో, బోధనలతో, ప్రబోధనలతో, కళానివేదనలతో, చికిత్సలతో, కష్టఫలితంతో లోకాన్ని వెలిగిస్తూ ఉంటారు. సరే. వీళ్లంతా లోకహితులు. కాబట్టి వెలుగుల్ని పంచుతారు. మరి లోకకంటకులు? ఈ ఉగ్రవాదులు, యుద్ధవాదులు.. లోకం పుట్టినప్పటి నుంచీ వీళ్లు పంచినదీ, పంచుతున్నదీ చీకటినే కదా! కాదు. చీకటిని ఎవరూ పంచలేరు. చీకటిని ఎవరూ పరచలేరు. విస్తరించే శక్తి చీకటికి లేదు. చిదిమి దీపం పెట్టుకోగలమే కానీ, చీకటి దీపం పెట్టుకోలేం. లోక కంటకులు నడిచేదారి చీకటి దారి కావచ్చు. ఎటు తిరిగీ వాళ్లు వెలుగులోకి రావలసిందే. వేరే దారిలేదు. లోకహితులన్న వాళ్లు కూడా.. ఈ లోక కంటకులన్న వాళ్లకు వెలుగు దారి చూపించవలసిందే. తప్పుకుని వెళ్లేదారి లేదు. తప్పుకుని వెళ్లారా... వీళ్లు... ప్రేమ ఇవ్వలేని భర్తతో, లాలన పాలన చూడని తండ్రితో, వృద్ధ తల్లిదండ్రులను వదిలేసి వెళ్లిన పిల్లలతో సమానం! చీకటిని చూసి భయపడతాం కానీ, నిజానికి వెలుగును పంచనివాళ్లను చూసి భయపడాలి. వరుస దీపాలు, వెలిగి ఆరుతుండే దీపాలు ఇచ్చే సందేశం కూడా ఇదే. చిన్న నవ్వుతోనైనా నీ చుట్టూ ఉన్నవాళ్లను వెలిగించమనీ, నువ్వు వెలిగించని క్షణమే... నీ వాళ్లకది చీకటి క్షణమనీ!! రైటీగా ఈసారి దీపావళికి తీసుకుందాం. బరువు తగ్గి... వచ్చే దీపావళిని మరింత తేలిగ్గా, ఆహ్లాదంగా జరుపుకుందాం. మాధవ్ శింగరాజు -
వేములవాడ ఆలయంలో లక్షదీపోత్సవం
-
వెలగనీకుమా ఈ దీపం...
కోటిలింగాలఘాట్ (రాజమండ్రి) : దీపం ఆర్పడం అమంగళమని అంతా భావిస్తారు. కానీ పుష్కర ఘాట్లలో మాత్రం దీపాలు ఆర్పడం కూడా సేవే అవుతోంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కోటిలింగాలఘాట్ లో ఈ దీపాలు ఆర్పడం మనం గమనించవచ్చు. వాలంటీర్లు చేస్తున్న ఈ పని ఖచ్చితంగా సేవే అవుతోంది. ఎలా అంటే, పుష్కర స్నానాలకు వచ్చిన భక్తులు గోదావరిలో వదిలేందుకు దీపాలు వెలిగించి ఘాట్ల మెట్లపై విడిచి పెడుతున్నారు. వీటివల్ల రద్దీ ఘాట్ల మెట్లపై రాకపోకలు సాగించే భక్తులు ప్రమాదాలకు గురవుతున్నారు. పుష్కర ఘాట్ల వద్ద వాలంటీర్లు ఈ విషయాన్ని గుర్తించి భక్తులు వెలిగించి వదిలేసిన దీపాలను ఆర్పి తొలగిస్తున్నారు. ఈ విధంగా పరోక్షంగా ప్రమాదాలను నివారిస్తున్నారు. -
లాంతరు విక్రయిస్తూ అరెస్ట్
విజయనగరం: అది ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నాటి లాంతరు. అలాంటి హరికేన్ లాంతరును 10 లక్షలకు విక్రయిస్తూ ఒక ముఠా పోలీసులకు రెడ్ హాండెడ్ గా పోలీసులకు పట్టుబడింది. ఈ సంఘటనలో ముఠాకు చెందిన అయిదుగురిని బొబ్బిలి పోలీసులు అరెస్ట్ చేశారు. -
దీపం పెడదాం వస్తారా...?
మళ్ళీ పండగొచ్చింది. అదే.. జనవరి ఒకటి. క్యాలెండర్ మారింది. పార్టీ ఫ్యాషన్స్ మారాయి. ఈ ఏడు అర్ధరాత్రి పార్టీల రూల్స్ మారాయి. అన్నీ మారినా.... మారనిది కొంతమంది జీవితాలు. ఇటీవల సరూర్‌నగర్‌లోని ఓ మురికివాడకి వెళ్ళాను. వృత్తిపరంగా విలేకరిని, ఆర్.జె.ని కావడం వల్ల ఆ బస్తీ వాసులతో కొంతసేపు గడిపి, వాళ్ళ సంగతులను రేడియోలో వినిపిద్దామని వెళ్ళాను. సాయంత్రం ఐదున్నర కావొస్తోంది. బండి దిగి యధేచ్చగా పారుతున్న చిన్న చిన్న మురికి కాలవలని దాటుకుంటూ బస్తీలోకి అడుగుపెట్టాను. పది అడుగులు వేయగానే పాకలు మొదలయ్యాయి. అవి వాళ్ళ ఇళ్ళట! ఇది గతంలో ఎప్పుడూ మురికివాడలని చూడని అమాయకత్వం కాదు సుమా! మరోసారి మనతో కలిసి జనజీవన స్రవంతిలో నివసిస్తున్న వారిని గమనించిన నిట్టూర్పు! రెండు మూడు ఇలాంటి ‘ఇళ్ళు’ దాటాక, అక్కడే కాలువల సరసన ఓ ముప్ఫైమంది చిన్నారులు అమాయకపు చిరునవ్వుతో స్వాగతం చెప్పారు. ఒంటరి కరెంటుతీగకి వేలాడుతున్న బల్బు వెలుతురులో పుస్తకాల్లో మొహాలని దూర్చి చదువుకుంటున్నారు. చీకటి పడింది కనుక దోమల స్వైరవిహారం మొదలైంది. ఓడోమాస్లూ, గుడ్నైట్లూ లేవు. నేను తప్ప అందరూ దోమలతో దోస్తీ చేసినట్టున్నారు. కాబట్టి ఎవరికీ ఇబ్బంది కాలేదు. అక్కడే వారికి పాఠాలు నేర్పుతూ ఇంకొంచెం పెద్దపిల్లలు, వాలంటీర్లు కలిసారు. ఈ పెద్ద పిల్లలు అదే వాడలో పెరిగి ఇంటర్ వరకూ ఎలాగోలా నెట్టుకొచ్చారు. వారి వంతు కృషిగా చిన్నపిల్లలకి పాఠాలు చెప్తుంటే, ఈ వాలంటీర్లు నడిపే స్వచ్ఛంద సంస్థ- ‘‘అక్షయ విద్య’’ద్వారా వారి ఇంటర్ ఫీజులు భర్తీ అవుతున్నాయి. ఈ వాలంటీర్లేమో రోజంతా ఉద్యోగాలు చేసి సాయంత్రాలు అక్కడి పిల్లతో గడుపుతారు. సంవత్సరంలో ఒక్కరోజు కూడా మిస్కారు. ‘‘పక్క క్లాసుకి వెళ్దామా’’ అని మధు అనే వాలంటీర్ అన్నది. అతుక్కున్న రెండు గుడిసెల మధ్య నుండి కట్టెపుల్లలు వీపుకి గీస్కుంటూ ఆ క్లాసుకి వెళ్తుండగా ఎన్నో జీవరాసులు దర్శనమిచ్చాయి. బల్లులు, తేళ్ళు ఇంకా ఏవేవో! ‘‘ఇక్కడా వాళ్ళు రోజు నిద్రపోతున్నది’’ అని అడిగాను. ‘‘ఇది చాలా మేలు. కొన్ని మురికివాడల్లో అయితే దుర్గంధం మధ్యలో వాళ్ళు ఆడతారు, తింటారు, ఉంటారు. మనం రెండు నిమిషాలు కూడా నిలబడలేని పరిసరాల్లో వారి జీవితాలే గడిచిపోతాయి’’ అని వాస్తవాన్ని వివరించింది - మధు. కూర్చున్న చోటి నుండి లేచి రెండడుగులు వేస్తే - మరికొన్ని ఇళ్ళు. ఈ పిల్లలకి అమ్మానాన్నలు నామ్కేవాస్తే ఉన్నారు. కానీ చాలా వరకూ అమ్మ పనికి వెళ్ళిపోతుంది. నాన్న సాయంత్రాలు తాగొస్తాడు. మరి బడి తరువాత వాళ్ళేం చేయాలి? సాయంత్రాలు దిక్కు తోచకుండా, దిక్కులేకుండా గడిచిపోతున్నాయి. నాన్నొకవేళ ముందే ఇంటికొస్తే - పిల్లలకి తాగుడు అలవాటు చేస్తాడు. అలా కాకపోతే, వీధిలో పెద్ద పిల్లల పక్కన చేరి చిన్నపిల్లలు బూతులు నేర్చుకుంటారు. అవసరం కొద్దీ దొంగతనాలు మొదలుపెడతారు. ఆడపిల్లలు పన్నెండేళ్ళకే ప్రేమ పేరుతో లైంగిక వేధింపులకు లోనవుతారు. ఇది - వారి ఫ్యామిలీ! ఇది వారి స్టోరీ. ఇక్కడ హైదరాబాదులోనే ఇటువంటి మురికివాడలు 1400 ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఏంటి? మన హైటెక్ స్మార్ట్‌సిటీ గురించే చెబుతున్నాను. ఇంతకీ నేను వెళ్ళిన పని - అక్కడ పిల్లలకి సోలార్ దీపాలు పంచిపెట్టడానికి. చీకటి పడ్డాక అమ్మ లేటుగా వచ్చి, నాన్న రాలేని పరిస్థితిలో ఉంటే - కనీసం ఈ దీపం మాటున, కళ్ళనిండా వాళ్ళ స్వప్న లోకాన్ని చూస్కుంటూ - ఓ పుస్తకం పట్టుకుని వాళ్ళ సాయంత్రం గడిచిపోతుందన్న చిన్న ఆశ. మనసు పీకుతోంది. మళ్ళీ వెళ్ళాలని - ఆ బంగారు తల్లులు, తండ్రులతో పండగవేళ గడపాలని. మీరూ వస్తారా? -
దీపం వెలిగించాడు!
సొంత విజయంతోనే సంతృప్తి పడకుండా... పేద విద్యార్థులకు సహాయం అందించాలనే ఉద్దేశంతో ‘దీపం’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించి సేవారంగంలోకి అడుగుపెట్టాడు కార్తికేయన్. కార్తికేయన్ విజయకుమార్ చెన్నైలో స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో సీనియర్లు బిట్స్ పిలాని గురించి గొప్పగా మాట్లాడుతుండేవారు. అక్కడ చదవాలనే కోరిక అలా మొదటిసారిగా కలిగింది. కేవలం కల కనడానికే పరిమితం కాకుండా దాన్ని నిజం చేసుకున్నాడు కార్తికేయన్. అక్కడ తనకొక విశాల ప్రపంచం పరిచయం అయింది. సీనియర్లు ఎందరో తనకు స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పేవాళ్లు. ‘‘భవిష్యత్‌లో నేను విజయవంతమైన వ్యాపారిని కావాలి’’ అనుకోవడానికి ఈ మాటలు తోడ్పడ్డాయి. చదువు పూర్తయిన తరువాత తన మిత్రుడితో కలిసి అరవైవేల రూపాయలతో ‘ఎక్సెడోస్’ పేరుతో బిజినెస్ కన్సల్టింగ్ సంస్థను ప్రారంభించాడు. సంవత్సర కాలంలోనే లాభాలు చేతికందాయి. వ్యాపారం ప్రారంభించిన కొత్తలో ఆఫీసు ఉండేది కాదు. రెండు ల్యాప్‌టాప్‌లతో తమ గది నుంచే వ్యాపారాన్ని కొనసాగించేవారు. సంవత్సరం తరువాత మాత్రం వివిధ ప్రాజెక్ట్‌లలో తమ దగ్గర వందమంది ఉద్యోగులు పనిచేశారు. తన విజయంతోనే సంతృప్తిని పడకుండా... పేద విద్యార్థులకు సహాయం అందించాలనే ఉద్దేశంతో ‘దీపం’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించి సేవారంగంలోకి అడుగుపెట్టాడు కార్తికేయన్. ‘‘కొందరికి ప్రతిభ ఉన్నా సౌకర్యాలు ఉండవు. వాటిని అందేలా చేస్తే గొప్ప విజయాలు సాధించగలరు’’ అంటాడు కార్తికేయన్. పేద విద్యార్థులకు కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్లలో తగిన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. తన తీరిక సమాయాన్ని వినోదానికో, విహారానికో వెచ్చించకుండా పేద విద్యార్థులతో గడపడానికి వెచ్చించేవాడు. ‘దీపం’కు సంబంధించి మరెన్నో కార్యక్రమాల రూపకల్పనలో తలమునకలై ఉన్నాడు ముప్పైరెండు సంవత్సరాల కార్తికేయన్ విజయకుమార్. -
చనిపోయినవారి తల దగ్గర దీపమెందుకు?
నివృత్తం ప్రాణాలతో ఉన్న వ్యక్తికి చీకటిలో దారి చూపించి ముందుకు నడిపిస్తుంది దీపం. అలాగే జీవాన్ని కోల్పోయిన తరువాత ఆత్మకు కూడా సరైన దారి చూపమని కోరుతూ ఇలా తల దగ్గర దీపం పెడతారు. మరణించిన వ్యక్తి ఆత్మ బ్రహ్మకపాలం ద్వారా బయటకు వస్తే, ఆ వ్యకి ్తకి మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. బయటకు వచ్చిన ఆత్మ పైలోకాలకు చేరడానికి రెండు మార్గాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఉత్తర మార్గం, రెండోది దక్షిణ మార్గం. ఉత్తర మార్గం వెలుగుతోను, దక్షిణ మార్గం చీకటితోను నిండి ఉంటుందట. ఉత్తమ గతులు కలగాలంటే వెలుగు మార్గలోనే ప్రయాణించాలి. కాబట్టి బ్రహ్మకపాలం నుంచి వచ్చిన ఆత్మకు వెలుగు మార్గం చూపించే ఉద్దేశంతోనే ఆ స్థానంలో దీపాన్ని ఉంచుతారు. పనిగల మేస్త్రి పందిరేస్తే... కుక్కతోక తగిలి కూలిపోయిందట! ఓ ఆసామి ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. ఊళ్లో బోలెడంతమంది మేస్త్రీ లున్నా అద్భుతంగా కట్టేవాడు కావాలంటూ వెతకసాగాడు. అంతలో ఒక తాపీమేస్త్రి తారసపడి, తాను ఎంతమంది పెద్ద పెద్ద వాళ్లకి ఇళ్లు కట్టిపెట్టాడో చెప్పుకొచ్చాడు. దాంతో అతడికే పని అప్పగించాడు ఆసామి. అతడు కళ్లుమూసి తెరిచేలోగా ఇల్లు కట్టేసి, పెద్ద మొత్తంలో డబ్బు పుచ్చుకుని పోయాడు. అయితే ఉన్నట్టుండి గాలివాన రావడంతో ఆ ఇల్లు కూలిపోయింది. చుట్టూ ఉన్న ఇళ్లన్నీ బాగున్నా తన ఇల్లు కూలిపోవడం చూసి ఆసామి ఘొల్లుమన్నాడు. అతడిని చూసిన వాళ్లు... ‘మనోళ్లు బోలెడంతమంది ఉంటే గొప్పలకు పోయి ఎవడినో పట్టుకొచ్చాడు, ఇప్పుడు బాగా బుద్ధొచ్చి ఉంటుంది’ అంటూ పరిహాసం చేశారు. అప్పుడు పుట్టుకొచ్చింది ఈ సామెత. -
మాటలను ట్వీట్‌గా మార్చే ల్యాంప్
లండన్: మీ సన్నిహితులతో కలసి డిన్నర్ కోసం ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లారా? అయితే మీ టేబుల్‌కు పక్కనే ఉన్న ల్యాంప్‌ను ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే.. ఆ ల్యాంప్ మీ సంభాషణలను రహస్యంగా విని.. మీ మాటలను యథాతథంగా ట్వీట్ చేసే అవకాశం ఉంది. ల్యాంప్ ఏంటి.. సంభాషణలను ట్వీట్ చేయడం ఏమిటీ? అని ఆశ్చర్యపోకండి.. అమెరికాకు చెందిన పరిశోధకులు కైల్ మెక్‌డోనాల్డ్, బ్రియాన్ హౌస్.. సంభాషణలను వినీ వాటిని ట్వీట్ చేసే సామర్థ్యం ఉన్న ల్యాంప్‌ను అభివృద్ధిపరిచారు. ఇది తనకు సమీపంలోని శబ్దాలను సంగ్రహించి.. వాటిని తనకు దగ్గరలోని వై-ఫై ఇంటర్నెట్ ద్వారా ఓ ట్విటర్ అకౌంట్‌కు ట్వీట్ల రూపంలో అప్లోడ్ చేస్తుంది. ఒక ప్లాస్టిక్ కుండీలో ఉండే ఈ ల్యాంప్ ధర రూ. 6 వేలు. ఈ ల్యాంప్‌లో మినీ కంప్యూటర్, మైక్రోఫోన్, ఎల్ఈడీ ఉంటాయి. వీటి సహాయంతోనే ఇది సంభాషణలను ట్వీట్ చేయగలుగుతుంది.