
ప్రస్తుతం ప్రేక్షకులు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది తేడా లేకుండా ఏ సినిమా నచ్చితే ఆ సినిమా చూస్తున్నారు. కాబట్టి చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్ అవుతున్నాయి. మా ల్యాంప్ సినిమాలో మంచి కంటెంట్ ఉంది. ఈసినిమా అందరికి నచ్చుతుందని, పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు హీరో వినోద్. వినోద్, మధుప్రియ, కోటి కిరణ్, అవంతిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ల్యాంప్’. రాజశేఖర్ రాజ్ దర్శకుడు. ఈ నెల 14న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో తాజాగా వినోద్ మీడియాతో మాట్లాడారు.
→ ల్యాంప్ సినిమా ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.వరుస హత్యలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని హీరో ఎలా ఛేదించాడు అనేది కామెడీగా చూపిస్తూనే ఫైనల్ గా అసలు ఏం జరిగింది? ఎలా వాటిని ఆపాడు అనేది ఆసక్తికరంగా చూపించాం. సస్పెన్స్ మెయింటైన్ చేస్తూనే కామెడీ పండించడం నా పాత్ర హైలెట్.
→ ప్రేక్షకులు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటు ఉంటారు .ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొత్త రకంగా నటించే నేను , కొత్తగా నటించాలనుకునే యువతీ యువకుల్ని ప్రోత్సహిస్తూ ఉంటాను . కొత్తగా సినిమా తీయాలనుకునే యువ దర్శకులు ,ప్రొడ్యూసర్స్ కి సహకారం అందించడం కోసం మా అకాడమీ నుంచి స్టూడెంట్స్ ని కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఆర్టిస్టులుగా ఇస్తూ ఉంటాను.
→ ప్రస్తుతం నేను బార్బరీక్ అనే సినిమా రిలీజ్ రెడీగా ఉంది . అలాగే శాసనమా చట్టమా అనే సినిమాలో హీరో సుమన్ గారి కొడుకు క్యారెక్టర్ చేస్తున్నాను మెయిన్ లీడ్ అలాగే డైరెక్టర్ హర్ష గారు డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ గారి కాంబినేషన్లో రెండు సినిమాల్లో లీడ్ గా నటిస్తూ ఉన్నాను .
→ నటుడుగా సినిమాలు వెబ్ సిరీస్ లు రంగస్థలంలో విభిన్నమైన పాత్రలు చేయడానికి నేనెప్పుడూ రెడీ గానే ఉంటాను చేస్తున్నను కూడా అలాగే నిర్మాతగా షార్ట్ ఫిలింలు వెబ్ సిరీస్ లు మా వినోద్ ఫిలిం అకాడమీ తరుపున చాలా చేశాం త్వరలో ఒక సినిమా కూడా మొదలుపెట్టబోతున్నాం.
→ అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో మా సినిమా టికెట్ రేట్ ని 110 రూపాయలుగా నిర్ణయించాం. కాబట్టి అందరూ వచ్చి మా సినిమా చూడండి. మీరు పెట్టిన 110 రూపాయలకి రెండు వందల పది రూపాయల ఎంటర్టైన్మెంట్ మేము అందిస్తామని గ్యారెంటీ ఇస్తున్నాం
Comments
Please login to add a commentAdd a comment