పెళ్లిళ్లు, జాతర్లు, ఊరేగింపుల్లో బలిష్ఠమైన పురుషులు పెద్ద పెద్ద విద్యుత్తు దీపాలను తలపై పెట్టుకుని మోస్తూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. చాలాసార్లు అలాంటి దృశ్యాలను అలా చూసి వెళ్లిపోతాం. చిన్న చిన్న పిల్లలు, ఆడవాళ్లు ఇలాంటి దీపాల్ని మోస్తున్నపుడు.. మహా అయితే... అయ్యో అనుకుంటాం. కూటి కోసం కోటి విద్యలు అనుకుంటాం. మరుక్షణం ఆ విషయాన్ని మర్చిపోతాం. ఇంతకుమించి పెద్దగా పట్టించుకోం. లేదంటే సాయానికి ముందు కెళ్లదామని అనిపించినా.. ఏదో తెలియని మొహమాటం వెంటాడుతుంది.. కదా. కానీ ఒక వ్యక్తి మాత్రం మానవత్వంతో ఆలోచించి, చురుగ్గా స్పందించారు. అంతేకాదు ఆయన చేసిన పని మరో నలుగురికి ఆదర్శప్రాయమైంది. విషయం ఏమిటంటే..
తన స్నేహితుడి కుమారుడి వివాహ వేడుకలో తలపై దీపాన్ని మోస్తున్న గర్భిణీని చూశారు తన్వీర్ మహ్మద్. అది చూడగానే ఆయనకు తల్లి గుర్తొచ్చిందో ఏమో గానీ, వెంటనే స్పందించారు. ఆమె నెత్తిపై ఉన్న దీపాన్ని తన నెత్తిపైకి తీసుకున్నారు.
At a wedding event of my friend’s son, I noticed a pregnant lady carrying light on her head. I offered to carry it for her. Inspired by my gesture, my friends also took turns carrying it and gave her three times payment and twice to the group. No heroism greater than Mother. pic.twitter.com/OkWkVJYOnN
— Tanveer Ahmed 🇮🇳 (@TheTanveerAhmed) June 18, 2024
ఆగండి..ఆగండి..కథ ఇక్కడితో అయిపోలేదు..తన్వీర్‌ను చూసిన ఆయన స్నేహితులు కూడా ముందు కొచ్చారు. వంతుల వారీగా ఆమె బరువును తమ నెత్తికెత్తుకున్నారు.
అంతేకాదు స్నేహితులంతా కలిసి ఈ పనికోసం చెల్లించే దానికంటే రెండు రెట్లు ఎక్కువ చెల్లించారట ఆ బృందానికి. ‘తల్లిని మించిన హీరో లేరు’ అంటూ తన్వీర్ ఈ విషయాన్ని వీడియోతోపాటు ఎక్స్‌లో షేర్ చేశారు. దీంతో పలువురు మంచి పని చేశారు భయ్యా అంటూ అభినందించారు. ఆయన ఆలోచనలు, భావాలతో విభేదించేవారు కూడా తన్వీర్ స్పందించిన తీరుపై ప్రశంసలు కురిపించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment