పంట పురుగులకు దీపపు ఎరలతో చెక్‌ | Check For Crop Pests With Lamp Baits | Sakshi
Sakshi News home page

రైతుల ప్రయోగం సక్సెస్‌.. సోలార్‌ లైట్‌ట్రాప్‌తో పంట పురుగులకు చెక్..

Published Tue, Aug 30 2022 9:11 AM | Last Updated on Tue, Aug 30 2022 9:11 AM

Check For Crop Pests With Lamp Baits - Sakshi

మోత్కూరు: పంట చేలను ఆశించే కీటకాల నివారణకు రసాయన మందుల పిచికారీ బదులు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం గ్రామంలో కొందరు రైతులు ప్రయోగాత్మకంగా చేపట్టిన సోలార్‌ లైట్‌ట్రాప్‌ (దీపపు ఎర)ల విధానం సత్ఫ­లి­తాలిస్తోంది. వరి, పత్తి, కంది పంటలను ఆశించే కాండం తొలిచే పురుగు, ఆకు ముడత, లద్దె పురుగు, గులాబీరంగు పురుగు, మరూక మచ్చల పురుగు వల్ల నష్టపోతున్న రైతులు... వాటి నిర్మూలనకు సుమారు 50 ఎకరాల్లో ఈ పరికరాలను అమర్చారు.

సౌర వెలుగుల ఆకర్షణకు పరికరం వద్దకు చేరుకుంటున్న పురుగు­లు కాంతిని తట్టుకోలేక దాని కింద ఉండే సబ్బునీళ్ల టబ్‌లో పడి నశిస్తున్నాయి. మార్కెట్లో రూ. 2 వేలకు లభిస్తున్న ఒక్కో సోలార్‌ లైట్‌ ట్రా­ప్‌ పరికరం ద్వారా 2–3 ఎకరాల విస్తీర్ణంలో ఉండే అన్ని రకాల పురుగులను నియంత్రించడం సాధ్య­మ­వుతోందని, ఫలితంగా చీడపీడల ఉధృతి తగ్గి దిగుబడి పెరుగుతుందని రైతులు చెబుతున్నారు.
చదవండి: మునుగోడులో దూసుకుపోతున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌.. మరి కాంగ్రెస్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement