anajipuram
-
పంట పురుగులకు దీపపు ఎరలతో చెక్
మోత్కూరు: పంట చేలను ఆశించే కీటకాల నివారణకు రసాయన మందుల పిచికారీ బదులు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం గ్రామంలో కొందరు రైతులు ప్రయోగాత్మకంగా చేపట్టిన సోలార్ లైట్ట్రాప్ (దీపపు ఎర)ల విధానం సత్ఫలితాలిస్తోంది. వరి, పత్తి, కంది పంటలను ఆశించే కాండం తొలిచే పురుగు, ఆకు ముడత, లద్దె పురుగు, గులాబీరంగు పురుగు, మరూక మచ్చల పురుగు వల్ల నష్టపోతున్న రైతులు... వాటి నిర్మూలనకు సుమారు 50 ఎకరాల్లో ఈ పరికరాలను అమర్చారు. సౌర వెలుగుల ఆకర్షణకు పరికరం వద్దకు చేరుకుంటున్న పురుగులు కాంతిని తట్టుకోలేక దాని కింద ఉండే సబ్బునీళ్ల టబ్‌లో పడి నశిస్తున్నాయి. మార్కెట్లో రూ. 2 వేలకు లభిస్తున్న ఒక్కో సోలార్ లైట్ ట్రాప్ పరికరం ద్వారా 2–3 ఎకరాల విస్తీర్ణంలో ఉండే అన్ని రకాల పురుగులను నియంత్రించడం సాధ్యమవుతోందని, ఫలితంగా చీడపీడల ఉధృతి తగ్గి దిగుబడి పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. చదవండి: మునుగోడులో దూసుకుపోతున్న బీజేపీ, టీఆర్ఎస్.. మరి కాంగ్రెస్? -
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
భువనగిరి అర్బన్ : గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన శుక్రవారం భువనగిరి మండలంలోని అనాజిపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 55ఏళ్ల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మండలంలోని అనాజిపురం గ్రామ శివారులోని బస్‌షెల్టర్ వద్ద అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిపారు. స్థానికులు గమనించి వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనస్థలానికి వెళ్లి పరిశీలించారు. మృ తదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు రూరల్ ఏఎస్ఐ ఎం.బాసు తెలిపారు. మృతుడి కుడి చేతిపై శ్రీ అని రాసి ఉంది. ఒంటిపై సిమెంట్ కలర్ అంగీ, లూంటీ ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని ఏఎస్ఐ కోరారు. -
మృతుని కుటుంబానికి ఆర్థికసాయం
అనాజిపురం (పెన్‌పహాడ్) : మండల పరిధిలోని అనాజిపురం గ్రామానికి చెందిన యర్కచర్ల సైదులు ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. ఇతడు పీఏసీఎస్‌లో సభ్యుడిగా ఉండడంతో ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో మృతుని కుటుంబ సభ్యులకు గురువారం రూ. 10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో సూర్యాపేట ఎన్డీసీసీబీ సహకార బ్యాంకు మేనేజర్ సుగుణ్, సింగిల్ విండో చైర్మన్ నాతాల జానకిరాంరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ముదిరెడ్డి రమణారెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ దేవిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు అనుములపురి శ్రీలత, సీఈఓ ఆలకుంట్ల సైదులు, అనుములపురి శ్రీనివాస్, చెన్ను శ్రీనివాస్‌రెడ్డి, మేకల నర్సిరెడ్డి, సైదులు తదితరులు పాల్గొన్నారు.