
లాంతరు నడవటమేంటి? లాంతరు పట్టుకుని మనిషి నడవాలి కదా అనుకుంటున్నారా? ఈ హైటెక్ లాంతరు మాత్రం తనంతట తానే నడుస్తుంది. రాత్రివేళ ఇంట్లో దీపాలార్పేసి, దీన్ని వెలిగించుకుంటే ఇల్లంతా కలియదిరుగుతూ రంగు రంగుల్లో వెలుగులు విరజిమ్ముతుంది.
కొత్తగా చూసేవాళ్లు ఇదేదో కొరివిదెయ్యంలా ఉందనుకుని భయపడే అవకాశాలూ లేకపోలేదు. మామూలుగా చార్జింగ్ చేసుకుని వాడుకునే ఎమర్జెన్సీ దీపాల్లాగానే దీనిని వాడుకోవచ్చు. అయితే, దీనికింద సాలీడు కాళ్లలాంటి రోబోటిక్ కాళ్లను అమర్చడం వల్ల ఇది నడవగలుగుతుంది కూడా.
జపాన్‌కు చెందిన ఐటీ ఇంజనీర్ ఇయానియస్ తన ప్రాజెక్టులో భాగంగా దీనికి రూపకల్పన చేశాడు. దీని తయారీ కోసం త్రీడీ ప్రింటింగ్ ద్వారా ముద్రించిన విడిభాగాలను ఉపయోగించాడు. దీని పనితీరును ప్రత్యక్షంగా చూపడానికి తీసిన వీడియో ‘ట్విట్టర్’లో పెడితే, కొద్ది గంటల్లోనే అది వైరల్‌గా మారింది.
చదవండి: ‘బకరాల్ని చేశాడు.. మస్క్ ట్వీట్‌తో మబ్బులు వీడాయ్’
Comments
Please login to add a commentAdd a comment