
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ మూవీ దేవర పార్ట్-1. గతేడాది దసరా ముందు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో దేవర-2 కూడా ఉంటుందని డైరెక్టర్ కొరటాల ఇప్పటికే ప్రకటించారు.
అయితే గతంలో మన తెలుగు చిత్రాలు చాలా వరకు జపాన్‌లో కూడా విడుదలై ఘన విజయం సాధించాయి. మన టాలీవుడ్ సినిమాలకు జపాన్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. గతంలో ఆర్ఆర్ఆర్‌తో పాటు పలు చిత్రాలు సైతం జపాన్ భాషలో కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీని కూడా ఈ ఏడాది అక్కడ విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగానే దేవర ప్రమోషన్స్ ప్రారంభించారు యంగ్ టైగర్.
జపాన్ అభిమానులు, అక్కడి మీడియాతో వర్చువల్ ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటోలను దేవర టీమ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. మూవీ ప్రమోషన్లతో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చే నెల మార్చి 22న జపాన్‌లో పర్యటించనున్నారని తెలిపింది. ఈ సినిమాను మార్చి 28న జపాన్‌లో విడుదల కానుందని మేకర్స్ వెల్లడించారు.
Man of Masses @Tarak9999 has kick started #Devara promotions with interviews for Japanese media ahead of his visit on March 22nd 🌊
The countdown begins for the grand release in Japan on March 28th. pic.twitter.com/UwPJLNrQ1I— Devara (@DevaraMovie) February 25, 2025
Comments
Please login to add a commentAdd a comment