japanes language
-
దేవర ప్రమోషన్లతో బిజీగా జూనియర్ ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ మూవీ దేవర పార్ట్-1. గతేడాది దసరా ముందు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో దేవర-2 కూడా ఉంటుందని డైరెక్టర్ కొరటాల ఇప్పటికే ప్రకటించారు.అయితే గతంలో మన తెలుగు చిత్రాలు చాలా వరకు జపాన్‌లో కూడా విడుదలై ఘన విజయం సాధించాయి. మన టాలీవుడ్ సినిమాలకు జపాన్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. గతంలో ఆర్ఆర్ఆర్తో పాటు పలు చిత్రాలు సైతం జపాన్ భాషలో కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీని కూడా ఈ ఏడాది అక్కడ విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగానే దేవర ప్రమోషన్స్ ప్రారంభించారు యంగ్ టైగర్.జపాన్ అభిమానులు, అక్కడి మీడియాతో వర్చువల్ ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటోలను దేవర టీమ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. మూవీ ప్రమోషన్లతో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చే నెల మార్చి 22న జపాన్‌లో పర్యటించనున్నారని తెలిపింది. ఈ సినిమాను మార్చి 28న జపాన్‌లో విడుదల కానుందని మేకర్స్ వెల్లడించారు. Man of Masses @Tarak9999 has kick started #Devara promotions with interviews for Japanese media ahead of his visit on March 22nd 🌊The countdown begins for the grand release in Japan on March 28th. pic.twitter.com/UwPJLNrQ1I— Devara (@DevaraMovie) February 25, 2025 -
జపాన్‌లో సాహో
‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఇంటర్నేషనల్ లెవల్‌కి చేరిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హిందీ వెర్షన్‌ను బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలో రిలీజ్ అయిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ సినిమాను జపనీస్‌లో కూడా రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు నిర్మాతలు. ఆల్రెడీ జపాన్‌లోని ఓ లోకల్ డిస్ట్రిబ్యూటర్‌కు ‘సాహో’ రైట్స్‌ను కూడా ఇచ్చేశారని తెలిసింది. ‘బాహుబలి’ చిత్రం కూడా జపాన్‌లో విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక... ‘సాహో’ చిత్రం షూటింగ్ విశేషాలకు వస్తే.... ఈ చిత్రంలో ఆస్ట్రేలియన్–బ్రిటిష్ పాప్ సింగర్, నటి కైలీ మినాగ్ ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. దాదాపు పదేళ్ల క్రితం అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘బ్లూ’ సినిమాలోని ‘చిగ్గీ.. విగ్గీ’ అనే స్పెషల్ సాంగ్‌లో కనిపించారు కైలీ. ‘సాహో’ చిత్రంలో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. జాకీష్రాఫ్, మందిరాబేడీ, నీల్‌నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు శంకర్–ఎహాసన్–లాయ్ సంగీతం అందిస్తున్నారు. -
వేషమూ మార్చమంటారేమో!
సింగపూర్, జపాన్ పర్యటనకు వెళ్ళొచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు చెబుతున్న మాటలకు, చేస్తున్న చేష్టలకు ఐఏఎస్‌లు విస్తుబోతున్నారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు వెంటనే ‘30 రోజుల్లో జపనీస్ భాష’ నేర్చుకోవాలని బాబు చెబుతున్నారట. దీంతో రెండు రకాల ఉపయోగాలున్నాయని ఉద్బోధ చేశారట. జపాన్ వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో... తెలుసుకోవడంతో పాటు వారి భాషను మనం గౌరవిస్తున్నామన్న భావన వారిలో కలిగించాలని ప్రభుత్వ కార్యదర్శులకు సుదీర్ఘంగా క్లాసు తీసుకున్నారు. ‘ఏం చేస్తారో.. నాకు తెలియదు.. మీరు నేర్చుకోవాల్సిందే..! జపాన్ వారిని మంత్రముగ్దుల్ని చేయాల్సిందే!’ అని బాబుగారు అధికారులకు గీతోపదేశం చేయడంతో ఇద్దరు ముగ్గురు ముఖ్య కార్యదర్శులు జపనీస్ భాష నేర్చుకునేందుకు కోచింగ్ సెంటర్లు వెతుక్కునే పనిలో పడ్డారు. జపనీస్ భాషను కొండ నాలుకతో మాట్లాడాల్సి ఉంటుందని నిపుణులు చెప్పడంతో ఇన్నే ళ్ల సర్వీసు తర్వాత ఇవేం కష్టాలని తలలు పట్టుకుంటున్నారు. ఇంకా నయం..! వేషం కూడా మార్చాలని చెప్పలేదని కొందరు సరిపెట్టుకుంటున్నారట.