Junior NTR Trying To Learn Japanese Language, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Junior NTR In Japan: జపాన్‌లో యంగ్ టైగర్ సందడి.. వీడియో వైరల్

Published Sun, Oct 23 2022 6:04 PM | Last Updated on Sun, Oct 23 2022 7:26 PM

Junior NTR Trying To Learn Japanese Language Goes Viral On Social Media - Sakshi

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ జపాన్‌లో బిజీగా ఉన్నారు. కుటుంబ సమేతంగా జపాన్ వెళ్లిన యంగ్ టైగర్ ఫ‍్యాన్స్‌తో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు.  జపాన్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎన్టీఆర్ సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా జపనీస్ యువతులతో ఆయన సరదాగా ముచ్చటించారు.  జపనీస్ భాష నేర్చుకుంటూ ఉత్సాహంగా కనిపించారు.  వారితో కలిసి జపానీస్ భాష నేర్చుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. జపాన్‌లో రెండు పదాలు నేర్చుకున్నానంటూ వారితో సరదాగా మాట్లాడారు. 

(చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో ఆర్ఆర్ఆర్ టీమ్.. ఎన్టీఆర్, రామ్‌ చరణ్ ఫోటోలు వైరల్)

ప్రపంచవ్యాప్తంగా రికార్డు సృష్టించిన ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్‌లోనూ ఈనెల 21న విడుదలైంది. ఇందు కోసం చిత్రబృందం జపాన్‌లో పర్యటించింది. ఇటీవలే ఓ హోటల్‌ జూనియర్ వెళ్లగా ఫ్యాన్స్‌ సందడి చేశారు. ఎన్టీఆర్‌తో ఫోటోలు దిగేందుకు జపనీయులు ఎగబడ్డారు. జపాన్‌లోనూ ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్ ఫాలోయింద్ తగ్గలేదు.  వరల్డ్‌ వైడ్‌గా ఈ మూవీ రూ. రూ.1200 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇంతటి ప్రజాధారణ పొందిన ఈ చిత్రం భారతదేశం నుంచి ఆస్కార్‌కు ఎంపికవుతుందని అందరూ భావించారు. హాలీవుడ్‌ ప్రేక్షకులు సైతం ఈ మూవీ ఆస్కార్‌ బరిలో నిలవాలని కోరుకు​న్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా గుజరాతీ మూవీ ఛైల్లో షోను ఆస్కార్స్‌కు నామినేట్ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement