Junior NTR fan
-
నిసిగ్గుగా చందబ్రాబు, లోకేష్ శవ రాజకీయాలు.. ఇదీ అసలు వాస్తవం..
సాక్షి, అమరావతి: రాజకీయంగా ఉనికిని కోల్పోతున్న తమ పార్టీని బతికించుకునేందుకు టీడీపీ దిగజారి వ్యవహరిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మృతిపై చంద్రబాబు, లోకేష్ నిసిగ్గుగా శవరాజకీయాలకు తెరలేపారు. ఆ యువకుడి మృతికి వైఎస్సార్సీపీ నేతల ప్రమేయం ఉందంటూ అసత్య ఆరోపణలు చేస్తూ.. ఆత్మహత్యకు లింకు పెట్టే కుట్రకు బీజం వేశారు. అసలేం జరిగింది? తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్యాం.. జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలంటే ప్రాణం. వయస్సు 23 సంవత్సరాలు. శ్యామ్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని కొప్పిగుంట గ్రామం. ఇటీవల చింతలూరు గ్రామానికి వెళ్లిన శ్యామ్ అక్కడే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. తన అభిమాని శ్యాం మరణించినందుకు జూనియర్ ఎన్టీఆర్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తెర లేచిన శవరాజకీయం ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. తెలుగుదేశం, జనసేన రకరకాల కుట్రలు చేస్తున్నాయి. ఎక్కడ లేని క్రైం అంతా ఏపీలోనే జరుగుతున్నట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా.. ఏది జరగకపోయినా.. దాన్ని అధికార పార్టీపై రుద్ది రాజకీయ లబ్ది పొందాలన్నది టిడిపి కుట్రగా మారింది. ఏ క్రైం జరిగినా.. దానికి YSRCPకి అంటగట్టే ప్రయత్నం జరుగుతోంది. తాజాగా శ్యామ్ చనిపోయాడని తెలియగానే.. తెలుగుదేశం రంగంలోకి దిగింది. ఒక వ్యక్తి బాధతో, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే.. దాన్ని అడ్డం పెట్టుకుని శవరాజకీయాలు చేయడానికి ఏకంగా చంద్రబాబు, లోకేష్ రంగంలోకి దిగారు. చంద్రబాబు నిర్వాకం ఇది శ్యాం మరణం వార్త తెలియగానే, చంద్రబాబు దానికి రాజకీయ రంగు పులిమేశారు. ఇది వైఎస్సార్ సిపి పనేనంటూ నిందలు మోపారు. Deeply saddened by the tragic and untimely demise of Shyam in Chintaluru, EG District. The suspicious circumstances surrounding his death are alarming. I strongly urge for a thorough investigation into this matter, ensuring justice is served. It has been alleged that YSRCP… pic.twitter.com/55bpR9cgvR — N Chandrababu Naidu (@ncbn) June 27, 2023 తానా.. తందానా.. తనయుడి కూత ఇది తండ్రి చంద్రబాబు బాటలోనే లోకేష్ నడిచారు. వెంటనే ఓ ట్వీటేశాడు. తన ఆస్థాన విద్వాంసులు రాసిచ్చిన నాలుగు వ్యాఖ్యలను జోడించారు. Pained to learn about the suspicious death of unemployed youngster Shyam. Deepest condolences to his family & friends. A thorough investigation without any bias is needed, even if it involves YCP leaders as alleged by locals. We will fight until justice is delivered to Shyam… pic.twitter.com/C8OvdExVWD — Lokesh Nara (@naralokesh) June 27, 2023 తెలుగుదేశం శవరాజకీయం శ్యాం మృతిపై తీవ్ర ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు తమకు శ్యాం పంపించిన వీడియోలను పోలీసులకు అందించారు. శ్యాం ఆత్మహత్య చేసుకునేముందు ఏం జరిగిందన్నది ఈ వీడియోల్లో స్పష్టంగా ఉంది. శవాన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం తండ్రీ కొడుకులు రాజకీయాలు చేయడంతో వైఎస్సార్సీపీ స్పందించింది. ఇది ఎన్నికల సమయం, రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి కొంత మంది రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులు అని చెప్పుకునే నటులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి విష ప్రచారాలు భవిష్యత్తులో ఇంకా చాలా చేస్తారు. రాష్ట్ర ప్రజలు గమనించాలంటూ వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది. YSRCP ఏం చెప్పింది? సుసైడ్ చేసుకోబోయే ముందు శ్యామ్ మాట్లాడిన వీడియో! శ్యామ్ ఆత్మ కి శాంతి చేకూరాలి, ఈ విషాధ సమయంలో శ్యామ్ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి మరియు శ్యామ్ తోటి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరికి మా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాం 🙏🏻 శ్యామ్ కుటుంబ సభ్యులకి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా… pic.twitter.com/DANeXVEgCm — YSR Congress Party (@YSRCParty) June 27, 2023 ఎన్టీఆర్ అభిమాని మృతిని టీడీపీ అవకాశంగా తీసుకుని నీచ రాజకీయాలు చేస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాని మరణం పట్ల గౌరవంగా, పద్ధతిగా సానుభూతి తెలిపారు. శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన అని, ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసు మనసు కలచివేస్తోందని, ప్రభుత్వం దీనిపై తక్షణమే దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ సెగ.. ఈడ్చిపడేయాలంటూ ఆదేశాలు
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నం పర్యటనలో చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సెగ తగిలింది. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ ఫోటోలు ప్రదర్శించిన అభిమానులు.. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ బాబు కాన్వాయ్ ఎదుట నినాదాలు చేశారు. జూ.ఎన్టీఆర్, హరికృష్ణ ఫొటోలు చూసి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. నినాదాలు చేసిన వాళ్లను ఈడ్చిపడేయాలంటూ టీడీపీ నేతలను ఆదేశించారు. ఎన్టీఆర్ ఫొటో పట్టుకున్న యువకుడిపై చంద్రబాబు మనుషులు దాడి చేశారు. మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు కనబడకూడదని చంద్రబాబు హుకుం జారీ చేశారు. మచిలీపట్నంలోని మూడు బొమ్మల సెంటర్ వద్ద మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో సాగిన ర్యాలీలో జూ.ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సులు చేస్తున్నవారిని కొల్లు రవీంద్ర, అనుచరులు చెదరగొట్టారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులకు తొపులాటలు జరిగాయి. కాగా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుధవారం సాగిన టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఆసాంతం ఊకదంపుడు ఉపన్యాసాలు.. పరనిందగానే సాగింది. తొలుత విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని రాణిగారితోటలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు షో సైతం జనం లేక వెలవెలబోయింది. అనంతరం పెనమలూరు నియోజకవర్గంలో కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి బయలుదేరిన ఆయన కాన్వాయ్ కృష్ణా జిల్లాలో సాగింది. అనంతరం మచిలీపట్నంలో నిర్వహించిన బహిరంగ సభ సైతం వెలవెలబోయింది. చదవండి: ఇదే చంద్రబాబుకు నా ఛాలెంజ్: సీఎం జగన్ -
చిత్తూరు జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని పీలేరులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు టీడీపీలో కలకలం సృష్టిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ ప్లెక్సీలు వెలిశాయి. పీలేరు పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం వరకు ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. అయితే టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు తొలగించాయి. సోమవారం నుంచి లోకేష్ పాదయాత్ర జరగనున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు టీడీపీ శ్రేణుల్లో దడ పుట్టిస్తున్నాయి. చదవండి: చినబాబుకు షాక్.. అనుకున్నదొకటి.. అయ్యింది మరొకటి.. -
న్యూ లుక్‌లో యంగ్ టైగర్.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏం చేసినా ఆ క్రేజే వేరు. తాజాగా న్యూ లుక్‌లో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు యంగ్ టైగర్. తన ఇన్‌స్టా స్టోరీలో ఓ ఫోటో షేర్ చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ కొత్త స్టైల్ అంతా తదుపరి చిత్రం 'ఎన్టీఆర్30' కోసమేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తన ఇన్‌స్టాలో స్టోరీలో పోస్ట్ చేస్తూ..' ఏ న్యూ డే.. ఏ న్యూ వైబ్' అలీమ్హకీంతో మరోసారి అంటూ రాసుకొచ్చారు. ఆ ఫోటోలో ఎన్టీఆర్‌తో పాటు హెయిల్ స్టైలిస్ట్ అలీమ్ హకీం కూడా వెనకవైపు ఉన్నారు. దీనిపై జూనియర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఎన్టీఆర్30 సినిమాలో లుక్ ఇదేనంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్.. త్వరలోనే ప్రారంభం..!) కాగా.. కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్30 మూవీ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 'ఎన్టీఆర్30' పేరుతో విడుదలైన పోస్టర్ అభిమానులకు విపరీతంగా ఆకట్టుకుంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించనున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
జపనీస్ భాష నేర్చుకుంటున్న ఎన్టీఆర్.. యువతులతో సరదా సంభాషణ..!
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ జపాన్‌లో బిజీగా ఉన్నారు. కుటుంబ సమేతంగా జపాన్ వెళ్లిన యంగ్ టైగర్ ఫ్యాన్స్‌తో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. జపాన్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎన్టీఆర్ సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా జపనీస్ యువతులతో ఆయన సరదాగా ముచ్చటించారు. జపనీస్ భాష నేర్చుకుంటూ ఉత్సాహంగా కనిపించారు. వారితో కలిసి జపానీస్ భాష నేర్చుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. జపాన్‌లో రెండు పదాలు నేర్చుకున్నానంటూ వారితో సరదాగా మాట్లాడారు. (చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో ఆర్ఆర్ఆర్ టీమ్.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫోటోలు వైరల్) ప్రపంచవ్యాప్తంగా రికార్డు సృష్టించిన ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్‌లోనూ ఈనెల 21న విడుదలైంది. ఇందు కోసం చిత్రబృందం జపాన్‌లో పర్యటించింది. ఇటీవలే ఓ హోటల్ జూనియర్ వెళ్లగా ఫ్యాన్స్ సందడి చేశారు. ఎన్టీఆర్‌తో ఫోటోలు దిగేందుకు జపనీయులు ఎగబడ్డారు. జపాన్‌లోనూ ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్ ఫాలోయింద్ తగ్గలేదు. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రూ. రూ.1200 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇంతటి ప్రజాధారణ పొందిన ఈ చిత్రం భారతదేశం నుంచి ఆస్కార్‌కు ఎంపికవుతుందని అందరూ భావించారు. హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ మూవీ ఆస్కార్ బరిలో నిలవాలని కోరుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతీ మూవీ ఛైల్లో షోను ఆస్కార్స్‌కు నామినేట్ చేసింది. -
Viral Video: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి వెక్కివెక్కి ఏడ్చిన మహిళా అభిమాని
జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజే వేరు. టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం జపాన్‌లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్న ఎన్టీఆర్‌కు అక్కడ ఘనస్వాగతం లభించింది. ఓ హోటల్లో బస చేసేందుకు వెళ్లగా జపానీయులు ఎన్టీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. విదేశాల్లో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందంటే ఆయనకున్న క్రేజ్ అలాంటిది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ అడగ్గా.. వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ను చూసిన ఓ మహిళ అభిమాని భావోద్వేగానికి గురైంది. జూనియర్‌ను చూసిన ఆనందంలో చిన్న పిల్లలా బోరున ఏడ్చేసింది. ఆ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. (చదవండి:జపాన్‌లో తారక్‌కు అరుదైన స్వాగతం, వీడియో వైరల్) దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సంచలన మూవీ 'ఆర్ఆర్ఆర్'. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం భారీస్థాయిలో వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమాను జపాన్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. అందుకోసం ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రమోషన్లు సైతం ప్రారంభించింది. ఇందుకోసం కుటుంబ సమేతంగా జపాన్‌కు చేరుకున్నారు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి. ఇవాళ జపాన్ రాజధాని టోక్యోలో 'ఆర్ఆర్ఆర్' ప్రీమియం షో ప్రదర్శించనున్నారు. -
కోమాలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని మృతి..
జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆయన అభిమానులకు ఎనలేని ప్రేమ. ఆయన పేరును జపంలా ఉచ్ఛరిస్తారు. తారక్‌ను ఒక్కసారైనా చూడాలని, కలిసి ఫొటో దిగాలని ఎదురుచూసే ఫ్యాన్స్ ఎంతోమంది. అటు ఎన్టీఆర్ కూడా తనను ఎంతగానో ఆరాధించే అభిమానులను అమితంగా ప్రేమిస్తాడు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన తారక్ వీరాభిమాని జనార్ధన్ కోమాలో ఉన్న విషయం తెలిసిందే. కోమాలో ఉన్న జానర్ధన్తో, అతడి తల్లితో ఎన్టీఆర్ మాట్లాడి, అధైర్యపడొద్దని, దేవుడిని నమ్మండని భరోసా ఇచ్చాడు. ఎన్టీఆర్ మాటలతో జనార్ధన్ వేళ్లు కదిలించాడని కూడా అక్కడున్న వాళ్లు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఆ ఎన్టీఆర్ వీరాభిమాని జనార్ధన్ ఇక లేడు. మంగళవారం (జులై 5) సాయంత్రి జనార్ధన్ తుదిశ్వాస విడిచాడు. ఎన్టీఆర్‌తో పాటు ఆయన అభిమానులు జనార్ధన్ కోలుకోవాలని ప్రార్థించినా.. చివరికి అనంతలోకాలకు వెళ్లిపోయాడు. దీంతో ఎన్టీఆర్ అభిమాన లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనార్ధన్ కోమాలోకి వెళ్లిన విషయం తెలిసిందే. చదవండి: ఏ దేశపు మహారాణి.. గొడుగు కొనుక్కోడానికి డబ్బులు లేవా ? 72 ఏళ్ల వయసులో NTR పైనుంచి దూకారు: View this post on Instagram A post shared by Jr NTR Fans™ (@jrntrfans55) -
ఎన్టీఆర్‌పై పరోక్షంగా మీరా చోప్రా పోస్ట్.. ఫ్యాన్స్ చురకలు
Jr Ntr Fans Counter To Meera Chopra For Indirect Post On NTR: వాన, బంగారం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్ మీరా చోప్రా. అయితే అంతకన్నా ఎక్కువగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను కించపరిచేలా పెట్టిన ట్వీట్లతో ఆమె మరింత పాపులర్ అయింది. రెండేళ్ల క్రితం తారక్‌ను ఉద్దేశిస్తూ పెట్టిన మీరా చోప్రా ట్వీట్లు తెగ వైరల్ అయ్యాయి. ఆ ట్వీట్లు చూసిన ఎన్టీఆర్ అభిమానులు మీరాపై ఆగ్రహంతో ఊగిపోయారు. సోషల్ మీడియాలో ఆమెను దూషిస్తూ కామెంట్లు కూడా పెట్టారు. ఈ విషయంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులను ఆశ్రయించింది మీరా చోప్రా. అయితే తాజాగా ఈ అమ్మడు పెట్టిన ఒక పోస్ట్ మళ్లీ తారక్ ఫ్యాన్స్ మండిపోయేలా చేసింది. చదవండి: ప్రియాంక వల్ల సినిమా ఛాన్స్‌లు రాలేదు : మీరా చోప్రా 'సౌత్ ఇండియన్ యాక్టర్స్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. వారి టాలెంట్, వినయం, ప్యాషన్‌ను చూసి ఒకరు కచ్చితంగా నేర్చుకోవాలి.' అంటూ ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పేర్లకు హ్యాష్‌ట్యాగ్ ఇచ్చింది. ఈ పోస్టులో కావాలనే ఎన్టీఆర్‌ను మెన్షన్ చేయలేదని తారక్ ఫ్యాన్స్ ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీపికా పదుకొణె, అలియా భట్ వంటి స్టార్ హీరోయిన్లే జూనియర్ ఎన్టీఆర్‌తో నటించేందుకు ఇష్టపడుతున్నారని, అవుట్ డేటెడ్, జూనియర్ ఆర్టిస్ట్‌గా కూడా పనికిరాని వారి మాటలు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తారక్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక సమయంలో ఎన్టీఆర్‌కు జోడీగా మీరా చోప్రాకు నటించే అవకాశం వచ్చి చేజారిపోయింది. ఈ అక్కసుతోనే తారక్‌ను మీరా చోప్రా టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెడుతుందని సమాచారం. I feel so happy to see South indian actors getting pan india recognition. One should learn from their talent, their humility, their passion.#prabhas #alluarjun #ramcharan #yash. So proud 👏👏👏👏 — meera chopra (@MeerraChopra) April 9, 2022 BOLLYWOOD Superstar Deepika About Jr. NTR . Character Artist kuda paniki rani Vallaki attention Evvakandi 🤭🤭 pic.twitter.com/Opc2taw7w9 — ...... 🐐 (@SK_Tarock) April 9, 2022 -
జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్రీనిధి కన్నుమూత
హైదరాబాద్: గతకొద్ది రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్రీనిధి కన్నుమూసింది. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి శ్రీనిధి గత కొద్దిరోజులుగా హైదరాబాద్ కూకట్పల్లి రాందేవ్రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విష యం తెలిసిందే. ఈ నెల 12వ తేదీన శ్రీనిధి కోరిక మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఆమెను పరామర్శించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన శివాజి కుమార్తె శ్రీనిధి(10) ఆరో తరగతి చదువుతోంది. మూడేళ్ల క్రితం శ్రీనిధికి నడుమునొప్పి రావడంతో తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా బ్లడ్‌క్యాన్సర్ అని తేల్చారు. దీంతో ఆ చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోగా మరింత పరిస్థితి విషమించింది.