
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నం పర్యటనలో చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సెగ తగిలింది. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ ఫోటోలు ప్రదర్శించిన అభిమానులు.. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ బాబు కాన్వాయ్ ఎదుట నినాదాలు చేశారు.
జూ.ఎన్టీఆర్, హరికృష్ణ ఫొటోలు చూసి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. నినాదాలు చేసిన వాళ్లను ఈడ్చిపడేయాలంటూ టీడీపీ నేతలను ఆదేశించారు. ఎన్టీఆర్ ఫొటో పట్టుకున్న యువకుడిపై చంద్రబాబు మనుషులు దాడి చేశారు. మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు కనబడకూడదని చంద్రబాబు హుకుం జారీ చేశారు. మచిలీపట్నంలోని మూడు బొమ్మల సెంటర్ వద్ద మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో సాగిన ర్యాలీలో జూ.ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సులు చేస్తున్నవారిని కొల్లు రవీంద్ర, అనుచరులు చెదరగొట్టారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులకు తొపులాటలు జరిగాయి.
కాగా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుధవారం సాగిన టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఆసాంతం ఊకదంపుడు ఉపన్యాసాలు.. పరనిందగానే సాగింది. తొలుత విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని రాణిగారితోటలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు షో సైతం జనం లేక వెలవెలబోయింది. అనంతరం పెనమలూరు నియోజకవర్గంలో కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి బయలుదేరిన ఆయన కాన్వాయ్ కృష్ణా జిల్లాలో సాగింది. అనంతరం మచిలీపట్నంలో నిర్వహించిన బహిరంగ సభ సైతం వెలవెలబోయింది.
చదవండి: ఇదే చంద్రబాబుకు నా ఛాలెంజ్: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment