
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు చంద్రబాబు సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు.
ఎన్టీఆర్ ఫోటో ఉన్న బ్యానర్లు, జెండాలతో వచ్చిన టీడీపీ కార్యకర్తలు.. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ జెండాలపై రాశారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ రాసిన జెండాలను లాక్కొన్న టీడీపీ నేతలు పక్కన పడేశారు. టీడీపీ నేతల తీరుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, టీడీపీ ఎంపీ కేశినేని నాని.. పార్టీ అధినేత చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా కేశినేని భవన్ నుండి టీడీపీ జెండాను కేశినేని నాని తొలగించారు. మరోవైపు.. చంద్రబాబు సభలో కేశినేని నాని కోసం టీడీపీ నేతలు కుర్చీని కేటాయించారు. ఈ మేరకు చంద్రబాబు సభకు రావాలని కనకమేడలతో నిన్న(శనివారం) కేశినేని నానికి రాయబారం పంపించారు. కాగా, చంద్రబాబు ఆహ్వానాన్ని, రాయబారాన్ని కేశినేని లెక్క చేయలేదు. మరోవైపు.. చంద్రబాబు సభకు కేశినేని వర్గం, మద్దతుదారులు దూరంగా ఉన్నారు.
ఇదీ చదవండి: చంద్రబాబుకు మరో షాకిచ్చిన కేశినేని నాని.. దెబ్బ అదుర్స్!
Comments
Please login to add a commentAdd a comment