చంద్రబాబు నాయుడి అరెస్ట్ పై సినీ పరిశ్రమలో TDP నేతలు మినహా మిగతా ఎవరూ స్పందించకపోవడం పట్ల బావయ్య బాలకృష్ణకు చాలా కోపంగా ఉంది. ఎవరినో అనుకుని ఏం లాభం తమ కుటుంబానికే చెందిన జూనియర్ ఎన్టీయార్ కూడా బాబు అరెస్ట్ ను ఖండించకపోవడం బాలయ్యక జీర్ణం కావడం లేదు. లోప కుత కుత లాడిపోతున్నారు. కానీ పైకి మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తూ ఐ డోంట్ కేర్ అంటున్నారు. బాబును అరెస్ట్ చేస్తే మొత్తం సినీ పరిశ్రమలోని కళాకారులంతా షూటింగులు ఆపేసి వీధుల్లోకి వచ్చేసి జనజీవనాన్ని స్తంభింపజేస్తారని బాలయ్య అనుకున్నట్లు ఉంది. అలా జరక్క పోవడంతో ఆయనలో ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి చేరిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
రూ.371 కోట్లు లూటీ చేసిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్ అయిన మరుక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చేసి ఎనభైలలో ఎన్టీయార్ ను గద్దె దింపినపుడు ప్రజాఉద్యమం చేసిన తరహాలో ఉద్యమాలు చేస్తారని టీడీపీ నేతలు అనుకున్నారు. అయితే జనం మాట దేవుడెరుగు టీడీపీ నేతలు, కార్యకర్తలే చంద్రబాబు అరెస్ట్‌ను పట్టించుకోలేదు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుడే బట్టబయలు చేసిన సంగతి కూడా అందరికీ తెలుసు.
✍️ఇక సామాన్య ప్రజలతో పాటు తెలుగు సినీ పరిశ్రమలో అయితే బాబు అరెస్ట్ ప్రకంపనలు సృష్టించేస్తుందని ఎన్టీయార్ కుటుంబ సభ్యులు అనుకున్నారు. నందమూరి బాలయ్య కూడా అదే ఆశించారు. అయితే వారి అంచనాలకు విరుద్ధంగా సినీ పరిశ్రమలో టిడిపి కార్యకర్తలయిన ముగ్గురు నలుగురు తప్ప ఎవరూ పట్టించుకోలేదు. బాబు అరెస్ట్ ను ఖండించలేదు. టీడీపీ నేత అశ్వనీ దత్, మురళీ మోహన్, టీడీపీ హయాంలో ప్రభుత్వ పదవి అనుభవించిన కె.రాఘవేంద్రరావు, నిర్మాత కె.ఎస్.రామారావు తప్ప ఎవ్వరూ చంద్రబాబు అరెస్ట్ ను పట్టించుకోలేదు.
✍️ఇక నందమూరి వంశానికి చెందిన జూనియర్ ఎన్టీయార్ సైతం మౌనంగా ఉండిపోవడంతో నందమూరి నారా కుటుంబాలకు పెద్ద షాకే ఇచ్చింది. ఈ వరుస షాక్ లు నందమూరి బాలకృష్ణకు బాగా కోపాన్ని తెప్పించినట్లున్నాయి. అందుకే సినీ పరిశ్రమలో ఎవ్వరూ బాబు అరెస్ట్ కు స్పందించకపోయినా తాను పట్టించుకోనన్నారు బాలయ్య. అదే విధంగా జూనియర్ ఎన్టీయార్ పేరు ప్రస్తావిస్తూ ఆయన స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అనేశారు.
✍️టాలీవుడ్ లో ఎవరూ కూడా చంద్రబాబు అరెస్ట్ ను ఎందుకు ఖండించలేదు? అని నందమూరి నారా కుటుంబ సభ్యులు చిర్రు బుర్రు లాడుతున్నారు. అయితే చంద్రబాబును అవినీతి కేసులో అరెస్ట్ చేస్తే మేమెందుకు స్పందించాలి? అని మెజారిటీ సినీ ప్రముఖులు చాలా క్లారిటీతో ప్రశ్నిస్తున్నారు.
✍️ఇక చంద్రబాబు జైలుకెళ్లిన మర్నాడే టిడిపి ఆఫీసులో చంద్రబాబు కుర్చీలో కూర్చున్నారు బాలయ్య. అది చంద్రబాబు నాయుడికి తెలిసి కోప్పడ్డారని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత బాలయ్యకు అచ్చెంనాయుడి కుర్చీ పక్కన కుర్చీ వేయించారట. అంటే నీ స్థానం అక్కడే తప్ప అధ్యక్ష స్థానంలో కాదని చెప్పకనే చెప్పారని పార్టీ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి.
✍️చంద్రబాబు జైల్లో ఉంటే నారా లోకేష్ 20రోజులకు పైగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇపుడాయన సిఐడీ విచారణకు హాజరవ్వాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో బాలయ్య ఏపీలో పార్టీ వ్యవహారాల్లో తలదూరిస్తే పార్టీకి నష్టం అనుకున్నారో ఏమో కానీ ఆయన్ను తెలంగాణా వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. తాజాగా బాలయ్య మాట్లాడుతూ తెలంగాణాలో పూర్తి స్థాయిలో ఎన్నికల్లో పోరాడతామని అన్నారు. బహుశా తెలంగాణాలో పార్టీ ఎలాగూ లేదు కాబట్టి బాలయ్య ఎలాంటి వేషాలు వేసినా పార్టీకి కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండదు కాబట్టి బాలయ్యను తెలంగాణా చూసుకోమని చంద్రబాబే సంకేతాలు ఇచ్చారేమో అని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య తన బావయ్య అరెస్ట్ అయితే ఎవరూ పట్టించుకోరా? అని అగ్గిమీద ఫైర్ అయిపోతున్నారు.
:::CNS యాజులు
సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment