slogans
-
టంగ్ స్లిప్పైన కాంగ్రెస్ కార్యకర్తలు
-
Madhya Pradesh High Court: భారత్ మాతాకీ జై అనాల్సిందే
జబల్పూర్: మాతృదేశాన్ని మరచి శత్రుదేశాన్ని పొగిడిన వ్యక్తికి మధ్యప్రదేశ్ హైకోర్టు తగిన శిక్ష విధించింది. తుది తీర్పు వచ్చేదాకా నెలకు రెండు సార్లు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి అక్కడి జాతీయ జెండాకు 21 సార్లు సెల్యూట్ చేయాలని, రెండు సార్లు భారత్ మాతా కీ జై అని నినదించాలని ఆదేశించింది. భోపాల్‌లోని మిస్రోడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫైజల్ అలియాస్ ఫైజాన్ మే నెలలో ‘పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్తాన్ ముర్దాబాద్’ అని నినదించాడు. దీంతో ఇతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 153బీ సెక్షన్ కింద కేసునమోదుచేశారు. సమాజంలో రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా, దేశ సమగ్రతను దెబ్బతీసేలా వ్యవహరించాడని పోలీసులు కేసు నమోదుచేశారు. దీంతో బెయిల్ కోసం మధ్యప్రదేశ్ హైకోర్టును ఫైజల్ ఆశ్రయించాడు. ఈ కేసును జస్టిస్ డీకే పలివాల్ మంగళవారం విచారించారు. రూ.50వేల వ్యక్తిగత బాండు, మరో రూ.50వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు అంగీకరిస్తూ రెండు షరతులు విధించింది. ‘‘ ప్రతి నెలా తొలి, చివరి మంగళవారాల్లో భోపాల్‌లోని మిస్రోడ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లు. అక్కడి భవంతిపై రెపరెపలాడే త్రివర్ణ పతాకానికి 21 సార్లు సెల్యూట్చేసి రెండు సార్లు భారత్ మాతాకీ జై అని నినదించు. ఈ కేసులో తుదితీర్పు వచ్చేదాకా ఇలా చేయాల్సిందే. ఇలా చేస్తే అయినా నీలో దేశభక్తి కాస్తయినా పెరుగుతుంది’ అని జడ్జి వ్యాఖ్యానించారు. ‘‘ ఇతనికి బెయిల్ ఇవ్వకండి. గతంలోనూ ఇలాగే ప్రవర్తించాడు. ఇతనిపై 14 నేరకేసులు పెండింగ్‌లో ఉన్నాయి’ అని ప్రభుత్వ లాయర్ వాదించారు. -
Parliament Budget Session 2024: మాటల యుద్ధం
న్యూఢిల్లీ: అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదాలు, నినాదాలతో లోక్‌సభ గురువారం దద్దరిల్లింది. పలుమార్లు వాయిదా పడింది. కేంద్ర బడ్జెట్‌పై ప్రారంభమైన చర్చ పూర్తిగా పక్కదారి పట్టింది. తొలుత కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి రవనీత్‌సింగ్ బిట్టూ తాత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్ హత్య ఘటనను ప్రస్తావించారు. దీనిపై బిట్టూ అభ్యంతరం వ్యక్తం చేశారు. చన్నీ, బిట్టూ మధ్య మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్ నేత సోనియా గాం«దీతోపాటు చన్నీపై బిట్టూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. దీంతో విపక్ష ఎంపీలు ఒక్కసారిగా ఆయనపై విరుచుకుపడ్డారు. బిట్టూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యుడు అమరీందర్‌సింగ్ రాజా వెల్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయతి్నంచారు. రాహుల్ గాంధీ ఆయనను ఆపేశారు. బిట్టూతోపాటు పలువురు బీజేపీ ఎంపీలు వెల్‌లోకి ప్రవేశించేందుకు ప్రయతి్నంచగా స్పీకర్ స్థానంలో ఉన్న సంధ్యా రే సభను వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. సభ సజావుగా జరిగేలా చూడాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. సభ్యులంతా సభ గౌరవాన్ని కాపాడాలని స్పీకర్ అన్నారు. నిబంధనలు అతిక్రమించకూడదని చెప్పారు. తర్వాత చన్నీ తన ప్రసంగం కొనసాగించారు. రైతులకు ఇచి్చన హామీలను మోదీ ప్రభుత్వం నిటబెట్టుకోలేదని విమర్శించారు. రైతులను ఖలిస్తానీలు చిత్రీకరించారని బీజేపీ నేతలపై మండిపడ్డారు. సభను చన్నీ తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. చన్నీ మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ చన్నీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆయనపై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని అన్నారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య మళ్లీ వాగ్వాదం కొనసాగింది. తర్వాత సభ రెండుసార్లు వాయిదా పడింది. పార్లమెంట్ బయట బిట్టూ మీడియాతో మాట్లాడారు. చన్నీ జాతి వ్యతిరేక శక్తిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇండియా నుంచి పంజాబ్‌ను విడదీయాలన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ: చన్నీ దేశంలో నరేంద్ర మోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని చరణ్‌జిత్ సింగ్ చన్నీ మండిపడ్డారు. 20 లక్షల మంది ప్రజలు ఎన్నుకున్న ఎంపీని(అమృత్‌పాల్ సింగ్) జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వేసిన ప్రజల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించే అవకాశం ఆయనకు ఇవ్వడం లేదని, ఇది ఎమర్జెన్సీ కాక మరేమిటని ప్రశ్నించారు. చన్నీ లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. అయితే, అమృత్‌పాల్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్‌సాహిబ్ నియోజకవర్గం నుంచి వివాదాస్పద సిక్కు మత బోధకుడు, ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ స్వతంత్ర అభ్యరి్థగా 2 లక్షల మెజారీ్టతో గెలిచిన సంగతి తెలిసిందే. ఆంధ్రా–బిహార్ బడ్జెట్: సౌగతా రాయ్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ లోక్‌సభలో విమర్శలు గుప్పించారు. అది ఆంధ్రా–బిహార్ బడ్జెట్ అని ఆక్షేపించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శిక్షణ పొందిన ఆర్థికవేత్త కాదని అన్నారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా కేవలం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచి్చన సూచనల ఆధారంగా బడ్జెట్ రూపొందించారని విమర్శించారు. గతంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, పి.చిదంబరం హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారని, నిర్మలా సీతారామన్ మాత్రం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకున్నారని సౌగతా రాయ్ వ్యాఖ్యానించారు. -
నూపుర్ శర్మ వ్యతిరేక నినాదాల కేసులో నిందితులకు ఊరట
జైపూర్: బీజేపీ సస్పెండెడ్ నేత నూపుర్ శర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితులకు ఊరట లభించింది. మొయినుద్దీన్ చిష్తీ దర్గా(రాజస్థాన్) పెద్దతో పాటు మరో ఆరుగురిని మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది అజ్మీర్ కోర్టు. రెండేళ్ల కిందట.. మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెపై పలు రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదు అయ్యాయి. అయితే.. మరోవైపు ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలోనూ ఇస్లాం గ్రూపులు విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో.. మొయినుద్దీన్ చిష్తీ దర్గా నిర్వాహకుడు ఖాదీమ్ గౌహర్ చిస్తీ, మరో ఆరుగురు కలిసి నూపుర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి అప్పట్లో వైరల్ కూడా అయ్యింది. దీంతో.. అజ్మీర్ షరీఫ్ దర్గా ఖాదీమ్ గౌహర్ చిస్తీతో పాటు మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత పరారీలో ఉన్న గౌహర్ చిస్తీని పోలీసులు జూలై 14, 2022న హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో అందరినీ కోర్టు నిర్దోషులుగా పేర్కొంటూ విడుదలకు ఆదేశాలిచ్చింది. -
నినాదాల వివాదం.. ఒవైసీపై రాష్ట్రపతికి ఫిర్యాదు
న్యూఢిల్లీ: లోక్‌సభలో ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వివాదాస్పద నినాదాలపై ఇద్దరు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 103 కింద ఒవైసీపై అనర్హత వేటు వేయాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది వినీత్ జిందాల్ ఎక్స్(ట్విటర్)లో తెలిపారు.పార్లమెంటులో ఇతర దేశానికి జై కొట్టినందుకు ఆయను డిస్క్వాలిఫై చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. మంగళవారం(జూన్25) లోక్‌సభలో ఎంపీగా ప్రమాణం ముగిసిన తర్వాత జై తెలంగాణ, జై భీం, జై పాలస్తీనా అని నినాదాలు చేసి ఒవైసీ వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే.ఒవైసీ చేసిన నినాదాలను లోక్‌సభ రికార్డుల నుంచి ప్రొటెం స్పీకర్ ఇప్పటికే తొలగించారు. అయితే పాలస్తీనాలో ప్రజలు అణచివేతకు గురవుతున్నందునే తాను ఆ నినాదం చేశానని ఒవైసీ మీడియాకు తెలిపారు. -
అసదుద్దీన్ నినాదాలతో లోక్‌సభలో దుమారం
సాక్షి,న్యూఢిల్లీ: లోక్‌సభలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ప్రమాణం దుమారం రేపింది. మంగళవారం(జూన్25) తెలంగాణ ఎంపీల ప్రమాణాల్లో భాగంగా అసదుద్దీన్ కూడా ప్రమాణం చేశారు.ఈ ప్రమాణం ముగిసిన తర్వాత అసదుద్దీన్ చేసిన నినాదాలు వివాదాస్పదమయ్యాయి. జై తెంగాణ, జై భీమ్, జై పాలస్తీనా అని అసదుద్దీన్ నినదించారు. దీనిపై అధికారపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ప్రొటెం స్పీకర్ మెహతాబ్ అసదుద్దీన్ నినాదాలను రికార్డుల నుంచి తొలగిస్తామని ప్రకటించారు. స్పీకర్ ప్రకటన అనంతరం వివాదం సద్దుమణిగింది. BREAKING : Huge uproar in the Parliament after Hyderabad MP Asaduddin Owaisi says “ Jai Palestine” at the end of his oath. Your thoughts on this. pic.twitter.com/FQMEIeaFHX— Roshan Rai (@RoshanKrRaii) June 25, 2024 -
రాజ్యాంగం వర్ధిల్లాలి.. ‘ఇండియా’ ఎంపీల నినాదాలు
న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ ప్రారంభమైన తొలి రోజే ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీల నినాదాలతో పార్లమెంట్ ప్రాంగణం దద్దరిల్లింది. సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా పార్లమెంట్ ప్రాంగణంలో గతంలో గాం«దీజీ విగ్రహం ఉన్నచోట విపక్ష ఎంపీలు గుమికూడారు. రాజ్యాంగం ప్రతులను చేతబూని నినాదాలు చేశారు. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, మనమంతా కలిసి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి అంటూ బిగ్గరగా నినదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం జోలికి రావొద్దు: రాహుల్ పవిత్రమైన మన రాజ్యాంగంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా నిస్సిగ్గుగా దాడి చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగం జోలికి రావొద్దని హెచ్చరించారు. ప్రతిపక్ష కూటమి సందేశం ప్రజల్లోకి వెళ్లిందన్నారు. రాజ్యాంగంపై ఎవరు దాడికి దిగినా సహించబోమని తేలి్చచెప్పారు. పార్లమెంట్ ప్రాంగణంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. దేశంలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలకు ప్రధాని మోదీ బాధ్యత వహించాలన్నారు. దేశంలో ఏ శక్తి కూడా రాజ్యాంగాన్ని టచ్ చేయలేదని తేలి్చచెప్పారు. రాజ్యాంగాన్ని కచి్చతంగా కాపాడుకుంటామని స్పష్టంచేశారు. ప్రభుత్వాన్ని నిలదీస్తాం ప్రజా సమస్యలను పక్కనపెట్టి, ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలో ప్రధాని మోదీ బిజీగా ఉన్నారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. రాజ్యాంగంపై దాడి చేయడాన్ని తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని తెలిపారు. ప్రజల గొంతుకను సభలో వినిపిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం నుంచి మోదీ తప్పించుకోలేరని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో తొలి 15 రోజుల్లో ఎన్నో ఘోరాలు, ప్రమాదాలు జరిగాయని, పరీక్షల్లో పేపర్ లీకేజీలు చోటుచేసుకున్నాయని, ధరలు పెరిగిపోయాయని రాహుల్ గాంధీ విమర్శించారు. -
లోక్‌సభలో ధర్మేంద్ర ప్రదాన్‌కు ‘నీట్’ సెగ
న్యూఢిల్లీ: లోక్‌సభలో కొత్త ఎంపీల ప్రమాణస్వీకార కార్యక్రమం సందర్భంగా మోదీ 3.0 ప్రభుత్వానికి నీట్ పరీక్ష అక్రమాల సెగ తగిలింది. సోమవారం(జూన్24) లోక్‌సభలో కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్ ఎంపీగా ప్రమాణం చేసేందుకు సీట్లో నుంచి వెళుతుండగా ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై నిరసన తెలిపారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో సభను హోరెత్తించారు. ఇవేవీ పట్టించుకోకుండా ప్రదాన్ ఆయన ప్రమాణస్వీకారాన్ని పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్ష పేపర్ లీక్‌తో పాటు మార్కులు ఇష్టం వచ్చినట్లుగా వేశారన్న ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. నీట్ అక్రమాలపై దేశవ్యాప్త నిరసనలు జరగడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. సీబీఐ కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది. -
Lok Sabha Election 2024: కటాకట్ ఫటాఫట్
నేతల నినాదాలు ఓట్ల వర్షం కురిపించిన సందర్భాలు దేశ ఎన్నికల చరిత్రలో ఎన్నో! గరీబీ హటావో అంటూ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఇచి్చన నినాదం అప్పట్లో దుమ్ము రేపింది. ఈసారి మాత్రం నినాదాల కంటే కూడా ముఖ్య నేతల నోటి నుంచి వెలువడ్డ వింత పదబంధాలు అందరినీ ఆకర్షించాయి. వాటి అర్థం ఏమై ఉంటుందా అని ఓటర్లలో ఆసక్తి రేపాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీ, సోదరి ప్రియాంక తమ ప్రసంగాల్లో ‘కటాకట్’ అని విరివిగా వాడారు. అదే పదాన్ని ప్రధాని మోదీ తిరిగి కాంగ్రెస్‌పైకి సంధించారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజíస్వీ యాదవ్ కూడా వెరైటీ హిందీ పదాలను ప్రయోగించారు. రాహుల్ ఆద్యుడు కటాకట్ అనే హిందీ పదాన్ని తొలుత ప్రయోగించింది రాహులే. మిగతా వారు దాన్ని అందిపుచ్చుకున్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రతి పేద మహిళకు ఏటా రూ.లక్ష ఇస్తామని, ధనవంతుల సంపదను పేదలకు పంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొనడం తెలిసిందే. రాహుల్ తన ప్రచారంలో ఈ హామీలను తరచూ ప్రస్తావించారు. పేదల బ్యాంకు ఖాతాలకు డబ్బులు ‘కటాకట్ కటాకట్’ బదిలీ చేస్తామని ప్రకటించారు. చకచకా అనే అర్థంలో కటాకట్ పదాన్ని ప్రయోగించారు. దీనిపై ప్రజల్లో బాగా స్పందన రావడంతో ప్రియాంక కూడా అందిపుచ్చుకున్నారు. దాంతో కటాకట్ అంటే ఏమై ఉంటుందా అని గూగుల్‌లో శోధన కూడా పెరిగింది. మోదీ కూడా అదే పదాన్ని తనదైన శైలిలో కాంగ్రెస్‌పైకి తిరిగి ప్రయోగించారు. ‘‘ఈ యువరాజులు ప్యాలెసుల్లో పుట్టారు. కష్టపడిందీ లేదు, ఫలితాలు సాధించిందీ లేదు. అందుకే దేశం తనంతట తానే అభివృద్ధి చెందుతుందని వారు అలవోకగా చెబుతుంటారు. ఎలా? ‘కటాకట్, కటాకట్’’ అని చెప్పుకొచ్చారు. రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు వారిని ‘కటాకట్, కటాకట్’ ఇంటిదారి పట్టిస్తారంటూ రాహుల్‌పై చెణుకులు విసిరారు. తేజస్వి ‘ఫటాఫట్’ తేజస్వీ యాదవ్ కూడా రాహుల్‌తో కలసి ఓ సభలో మాట్లాడుతూ నిరుద్యోగులను ఉద్దేశించి.. ‘‘మీకు ఉద్యోగాలు ఫటాఫట్ వచ్చేస్తాయి. ఫటాఫట్. బీజేపీ సఫాచట్, సఫాచట్ (తుడిచి పెట్టుకుపోతుంది). కాంగ్రెస్, లాంతర్‌కు ఓట్లు తకాతక్ పడిపోతాయి’’ అని చెప్పుకొచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా గమ్మత్తైన పదాలను ప్రయోగించారు. ‘‘తాము అవినీతి చేసేది లేదు, ఎవరినీ చేయనిచ్చేది లేదని గొప్పలు చెప్పేవారు టీకాల తయారీదారుల నుంచి విరాళాలు, ఎన్నికల బాండ్ల రూపంలో భారీ మొత్తాలు అందుకుంటారు. అలాంటి వారు గటాగట్, గటాగట్, అని చెబుతుంటారు. కానీ ప్రజలు ఓటు ద్వారా వారిని ఫటాఫట్ ఫటాపట్ ఇంటికి పంపించేస్తారు’’ అని బీజేపీపై వ్యంగ్యా్రస్తాలు విసిరారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లండన్‌లో బీజేపీ మద్దతుదారుల పాదయాత్ర
ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీకి అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా బ్రిటన్‌లోని ప్రవాస భారతీయులు, బీజేపీ మద్దతుదారులు లండన్‌లో రన్ ఫర్ మోదీ ఈవెంట్‌ను నిర్వహించారు. దీనిలో పెద్ద సంఖ్యలో ఎన్నారైలు పాల్గొని బీజేపీపై, ప్రధాని మోదీపై తమకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు.2019 ఎన్నికల సమయంలోనూ రన్ ఫర్ మోదీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేపీ యూకే ఓవర్సీస్ ఫ్రెండ్స్ ప్రధాన కార్యదర్శి సురేష్ మంగళగిరి తెలిపారు. నాడు కూడా ప్రజలు బీజేపీపై తమ అభిమానాన్ని ఇదే రీతిలో వ్యక్తం చేశారన్నారు. బీజేపీపై, ప్రధాని మోదీపై ఎన్నారైలకు అమితమైన ప్రేమ ఉన్నదన్నారు.అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 తొలగింపు తదితర మంచి పనులను బీజేపీ చేపట్టిందని సురేష్ పేర్కొన్నారు. లండన్‌లో నిర్వహించిన రన్ ఫర్ మోదీ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ మద్దతుదారులు ఆ పార్టీ జెండాలను చేత పట్టుకుని ‘భారత్ మాతా కీ జై’ ‘వందేమాతరం’ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో 400కు పైగా ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. -
Lok sabha elections 2024: స్లోగన్ పేలింది
సినిమాల్లో ‘పంచ్’ పడితే కలెక్షన్ల సునామీ! అదే పొలిటికల్ ‘పంచ్’ పేలితే? గెలుపు గ్యారంటీ! రాజకీయ పార్టీలు అదిరిపోయే నినాదాలతో జనాల్లోకి వెళ్తున్నాయి. సూటిగా, సుత్తి లేకుండా ఉండే ఈ స్లో‘గన్స్’ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. విపరీతంగా వైరలై ప్రజల మనసులతో పాటు ఓటు బ్యాంకులనూ కొల్లగొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో ‘రావాలి జగన్, కావాలి జగన్’ ఎలా ఊపేసిందో తెలిసిందే. భారత ఎన్నికల చరిత్ర తిరగేస్తే లాల్ బహదూర్ శాస్త్రి మొదలుకుని ఇందిరాగాందీ, వాజ్‌పేయి, మోదీ, కేజ్రీవాల్ దాకా ప్రతి ఒక్కరి జమానాలోనూ ఆయా పార్టీల విజయాలకు దన్నుగా నిలిచి, రాజకీయాలను మలుపు తిప్పిన నినాదాలెన్నో... జై జవాన్, జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన ఈ నినాదం ఇప్పటికీ మార్మోగుతూనే ఉంది. 1964లో నెహ్రూ మరణంతో ప్రధాని పదవి చేపట్టిన శాస్త్రికి యుద్ధం స్వాగతం పలికింది. 1965 భారత్–పాక్ వార్‌లో పోరాడుతున్న సైనికుల్లో జోష్ నింపేందుకు, మరోపక్క దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశంలో తిండిగింజల ఉత్ప త్తిని పెంచేలా రైతుల్లో స్థైర్యాన్ని పెంచేందుకు ఆయన ఈ నినాదమిచ్చారు. హరిత విప్లవానికి కూడా ఇది దన్నుగా నిలిచింది. తాషె్కంట్‌లో శాస్త్రి మరణానంతరం 1967లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిర సారథ్యంలో కాంగ్రెస్‌కు మళ్లీ విజయం సాధించిపెట్టిందీ ఇదే నినాదం! గరీబీ హటావో 1971లో ప్రతిపక్షాలు, సొంత పార్టీ చీలిక వర్గం ఏకమై ఎన్నికల పోరుకు దిగినా కూడా ఒంటిచేత్తో కాంగ్రెస్(ఆర్)ను గెలిపించుకున్నారు ఇందిరా గాం«దీ. పేదరికాన్ని నిర్మూలిద్దామంటూ ఆ ఎన్నికల సందర్భంగా ఆమె ఇచ్చిన ఈ స్లోగన్ జనాల్లోకి బలంగా వెళ్లింది. ఇందిర హటావో, దేశ్ బచావో ఎమర్జెన్సీలో అష్టకష్టాలు పడ్డ ప్రతిపక్షాలన్నీ జనతా పార్టీ పేరిట ఏకమై ఇచ్చిన సమైక్య నినాదం. ఇందిరను తొలగించి దేశాన్ని కాపాడాలన్న పిలుపు ఓటర్లను ఆలోచింపజేసింది. దాంతో 1977 సార్వత్రిక ఎన్నికల్లో జనతా పార్టీ ఘనవిజయం సాధించింది. ఇందిరతోపాటు ఆమె తనయుడు సంజీవ్ గాంధీ కూడా ఓటమి చవిచూశారు. దాంతో కాంగ్రెస్ మళ్లీ చీలింది. కాంగ్రెస్(ఐ) సారథిగా 1978 ఉప ఎన్నికలో కర్నాటకలోని చిక్మగుళూరు లోక్‌సభ స్థానం నుంచి ఇందిర ఘన విజయం సాధించారు. ఆ సందర్భంగా ‘ఏక్ షేర్నీ, సౌ లంగూర్; చిక్‌మగళూరు భాయ్ చిక్‌మగళూరు’ (ఇటు ఒక్క ఆడపులి, అటు వంద కోతులు) స్లోగన్ మారుమోగింది. జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా, ఇందిరా తేరా నామ్ రహేగా 1984లో ఇందిర హత్యానంతరం రాజీవ్ ప్రధాని అయ్యారు. వెంటనే లోక్‌సభను రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు. కాంగ్రెస్(ఐ)కి దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తింది. ‘సూర్యచంద్రులు ఉన్నంతదాకా ఇందిర పేరు నిలిచి ఉంటుంది’ అంటూ ప్రజల్లోకి వెళ్లిన రాజీవ్ ఏకంగా 413 సీట్లతో క్లీన్ స్వీప్ చేసి మళ్లీ ప్రధాని అయ్యారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ 1996 సార్వత్రిక ఎన్నికల్లో ‘బారీ బారీ సబ్ కీ బారీ, అబ్ కీ బారీ అటల్ బిహారీ’ (అందరి వంతూ అయింది, ఈసారి అటల్ బిహారీ వంతు) అంటూ బీజేపీ పిలుపునిచ్చింది. దీనికి మచ్చలేని వాజ్‌పేయి ఇమేజ్ తోడై బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి అధికారం దక్కింది. తొలిసారి 16 రోజుల్లో పడిపోయిన వాజ్‌పేయి ప్రభుత్వం రెండోసారి 13 నెలలకే పరిమితమైంది. దేశాన్ని వృద్ధి బాటన నడిపేందుకు వైజ్ఞానిక రంగంలో స్వయం ప్రతిపత్తి సాధించాలంటూ 1998లో పిలుపునిచ్చిన ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్’ నినాదం 1999లో బీజేపీకి విజయాన్ని అందించింది. మూడోసారి ఎన్డీఏ సర్కారును విజయవంతంగా నడిపారు వాజ్‌పేయి. కొంప ముంచిన ‘ఇండియా షైనింగ్’ దేశంలో సెల్ ఫోన్లను ప్రవేశపెట్టడం నుంచి ‘స్వర్ణ చతుర్భుజి’ హైవేల ప్రాజెక్టు తదితరాలతో ప్రగతికి పెద్దపీట వేసిన వాజ్‌పేయి సర్కారు 2004 ఎన్నికల్లో అతి విశ్వాసంతో బొక్క బోర్లా పడింది. ధరాభారం తదితరాలతో తాము సతమతమవుతుంటే ‘ఇండియా షైనింగ్ (భారత్ వెలిగిపోతోంది)’ నినాదంతో ఊరూవాడా ఊదరగొట్టడం జనానికి అస్సలు నచ్చలేదు. దాంతో బీజేపీ కొంప మునిగింది. వాజ్‌పేయి సర్కారు ఇంటిబాట పట్టింది. కాంగ్రెస్ కా హాత్, ఆమ్ ఆద్మీ కే సాత్ దాదాపు ఎనిమిదేళ్ల పాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్‌కు 2004లో పూర్వ వైభవం తీసుకొచ్చిన స్లోగన్. వాజ్‌పేయి సర్కారు పేదలను విస్మరించిందని, తాము సంక్షేమ పథకాలతో వారిని ఆదుకుంటామని చెప్పిన తీరు జనాలకు కనెక్టయింది. కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ సర్కారు గద్దెనెక్కింది. సోనియాగాంధీ విదేశీయత వివాదంతో మన్మోహన్ సింగ్ ప్రధానిగా పదేళ్లు కొనసాగారు. అచ్చే బీతే 5 సాల్, లగే రహో కేజ్రీవాల్ నయా రాజకీయ సంచలనంగా దూసుకొచ్చిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను 2020లో ఢిల్లీ పీఠంపై మరోసారి బంపర్ మెజారిటీతో కూర్చోబెట్టిన స్లోగన్. ‘ఐదేళ్లు బాగా గడిచాయి. సాగిపో కేజ్రీవాల్’ అన్న ప్రచారం ఓటర్లను ఆకర్షించింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 70 సీట్లకు ఏకంగా 67 దక్కించుకున్న కేజ్రీవాల్ 2020లోనూ 62 సీట్లతో ప్రత్యర్థులపై ‘చీపురు’ తిరగేశారు. అబ్ కీ బార్ మోదీ సర్కార్ పదేళ్లపాటు ప్రతిపక్షంలో కూర్చున్న కమలనాథులకు 2014లో మళ్లీ అధికారం కట్టబెట్టిన స్లోగన్. నరేంద్ర మోదీని ప్రధాని అభ్యరి్థగా ప్రకటించి, ‘ఈసారి మోదీ ప్రభుత్వం’ నినాదంతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది. ఇది కార్యకర్తల్లో జోష్ నింపడమే గాక దేశవ్యాప్తంగా మార్మోగి బీజేపీని గెలిపించింది. తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కూడా ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ నినాదంతో ఇండో–అమెరికన్ ఓటర్లను ఆకట్టుకున్నారు. అలాగే ‘అచ్చే దిన్ ఆయేంగే (మంచి రోజులొస్తాయ్)’, ‘చాయ్ పే చర్చ’, సబ్ కా సాత్ సబ్ కా వికాస్ వంటి నినాదాలూ ఆ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ (మరోసారి మోదీ ప్రభుత్వం)’, ‘మోదీ హై తో ముమ్కిన్ హై (మోదీతో సాధ్యం)’ నినాదాలు వైరలయ్యాయి. ఈసారి కమలనాథులు ‘తీస్రీ బార్ మోదీ సర్కార్’ (మూడోసారీ మోదీ సర్కారు), ‘అబ్ కీ బార్ 400 పార్’ (ఈసారి 400 పై చిలుకు)’ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగారు. ఎన్నికల్లో పేలిన మరికొన్ని నినాదాలు... ► జన్‌సంఘ్ కో వోట్ దో, బీడీ పీనా చోడ్ దో; బీడీ మే తంబాకు హై, కాంగ్రెస్‌వాలా డాకూ హై (1967లో భారతీయ జనసంఘ్ నినాదం) ► ప్రోగ్రెస్ త్రూ కాంగ్రెస్ (కాంగ్రెస్‌తోనే అభివృద్ధి. 1960ల్లో నినాదమిది. అయితే, ‘ప్రోగ్రెసా, కాంగ్రెసా’ అంటూ శివసేన ఇచ్చిన కౌంటర్ అప్పట్లో బాగా పేలింది) ► వోట్ ఫర్ కాఫ్ అండ్ కౌ; ఫర్గెట్ అదర్స్ నౌ (ఆవుదూడ గుర్తుకు ఓటేయండి, మిగతా పార్టీలను మర్చిపోండి అంటూ ఇందిరా కాంగ్రెస్ ఇచ్చిన నినాదం. కానీ ఆ గుర్తు ఇందిర, సంజయ్‌లకు ప్రతీక అంటూ వ్యంగ్యా్రస్తాలు పేలాయి) ► జబ్ తక్ రహేగా సమోసా మే ఆలూ, తబ్ తక్ రహేగా బిహార్ మే లాలూ (సమోసాలో ఆలూ ఉన్నంతకాలం బిహార్‌లో లాలూ ఉంటారు) ► జాత్ పర్ నా పాత్ పర్, మొహర్ లగేగీ హాత్ పర్ (కులమతాలకు అతీతంగా హస్తం గుర్తుకు ఓటేద్దామంటూ 1996 ఎన్నికల్లో పీవీ ఇచ్చిన నినాదం) ► సోనియా నహీ, యే ఆంధీ హై; దూస్రీ ఇందిరాగాంధీ హై (సోనియా కాదు, తుఫాను; మరో ఇందిర అంటూ 2009లో కాంగ్రెస్ ఇచ్చిన నినాదం) – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ఇండియా జిందాబాద్’ నినాదాలు చేసిన పాకిస్తానీలు
సనా: అరేబియా మహాసముద్రంలో పైరేట్లు హైజాగ్ చేసిన ఇరాన్‌కు చెందిన అల్ కంబార్ చేపలబోటును భారత నేవీ రక్షించిన విషయం తెలిసిందే. ఈ చేపలబోటులో ఉన్న 23 మంది పాకిస్థాన్‌కు చెందిన సిబ్బందిని భారత నేవీ పైరేట్ల బారి నుంచి కాపాడింది. 23 మంది పాకిస్తాన్ సిబ్బంది తమను రక్షించిన భారత నేవీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వీరంతా ‘ఇండియా జిందాబాద్’ అని నినాదాలు చేశారు. ఐఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ త్రిశూల్‌లు కలిసి 12 గంటల పాటు ఈ ఆపరేషన్ నిర్వహించి శుక్రవారం(మార్చ్ 29) తొమ్మిది మంది పైరేట్లను అదుపులోకి తీసుకున్నారు. ఇదీ చదవండి.. భారత నేవీ మరో సాహసం -
కర్ణాటక అసెంబ్లీలో పాక్ నినాదాలు నిజమే!
బనశంకరి: కర్ణాటక అసెంబ్లీ భవనం విధానసౌధ కారిడార్లలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన కేసులో ముగ్గురిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన ఇల్తాజ్, బెంగళూరు ఆర్టీ నగర వాసి మునావర్, బ్యాడగివాసి మహమ్మద్ షఫీనా శిపుడి అనే వారిని నిర్బంధించారు. ఫిబ్రవరి 27వ తేదీన విధానసౌధలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్, ఫలితాల వెల్లడి జరిగింది. ఆ సమయంలో బళ్లారి కాంగ్రెస్ అభ్యర్థి నాసిర్ హుస్సేన్ గెలిచారు. దీంతో ఆయన మద్దతుదారులు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. విధాన సౌధ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రతిపక్ష బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ప్రదర్శనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆ వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలకు పంపారు. నినాదాలు చేసింది నిజమేనని పరీక్షల్లో తేలడంతో ముగ్గురిని అరెస్టు చేసినట్లు సెంట్రల్ డీసీపీ శేఖర్ తెలిపారు. మంగళవారం కస్టడీలోకి తీసుకుని విచారణ చేపడతామని చెప్పారు. -
పాకిస్తాన్ అనుకూల నినాదాలపై రగడ
బెంగళూరు: కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ నసీర్ హుస్సేన్ గెలుపొందిన తర్వాత ఆయన అనుచరులు పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం పట్ల రాష్ట్ర అసెంబ్లీ బుధవారం అట్టుడికిపోయింది. విపక్ష బీజేపీ సభ్యుల ఆందోళనలతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వారిని అరెస్టు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ సభ్యులు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వెల్‌లోకి దూసుకొచ్చి బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. దీంతో అధికార కాంగ్రెస్ సభ్యులు ఎదురుదాడికి దిగారు. అరుపులు కేకలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పాకిస్తాన్ అనుకూల నినాదాల వ్యవహారంపై హోంమంత్రి జి.పరమేశ్వర అసెంబ్లీలో మాట్లాడారు. దర్యాప్తు కొనసాగుతోందని, ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్న వీడియో అసలైందో కాదో తేలుతుందని అన్నారు. ఇది నిజంగా జరిగినట్లు బయటపడితే దోషులను గుర్తించి, చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. మంగళవారం రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. సయ్యద్ నసీర్ హుస్సేన్ గెలిచిన తర్వాత ఆయన అనుచరులు పాకిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు చేశారంటూ ఓ వీడియో బయటకు వచి్చంది. దాన్ని చానళ్లు ప్రసారం చేశాయి. -
ప్రచార కార్యక్రమాల్లో పిల్లలు వద్దు
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచార పర్వంలో పిల్లజెల్లా ముసలిముతక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి భాగస్వాములను చేసే రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు పంపింది. పోస్టర్లు అతికించడం, కరపత్రాలు పంచడం, ర్యాలీల్లో నినాదాలు ఇవ్వాలంటూ పిల్లలను ఎన్నికల ప్రచారానికి వాడుకోవద్దని పార్టీలకు ఈసీ స్పష్టంచేసింది. ఎన్నికల సంబంధ పనులు, కార్యక్రమాల్లో పార్టీలు పిల్లలను వాడుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనా ఉందంటూ రాష్ట్రాల ఎన్నికల అధికారులు, పోలింగ్ సిబ్బందికి మరోసారి గుర్తుచేసింది. ఎన్నికల పర్వంలో పిల్లలు ఎక్కడా కనిపించొద్దని, వారిని ఏ పనులకూ వాడుకోవద్దని రాజకీయ పార్టీలకు ఈసీ తాజాగా ఒక అడ్వైజరీని పంపింది. ‘‘బాల కార్మిక చట్టాలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత జిల్లా ఎలక్షన్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్లదే. క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా ఈ బాధ్యతలు నెరవేర్చండి’’ అని ఈసీ పేర్కొంది. ‘‘ప్రచారంలో నేతలు చిన్నారులను ఎత్తుకుని ముద్దాడటం, పైకెత్తి అభివాదంచేయడం, వాహనాలు, ర్యాలీల్లో వారిని తమ వెంట బెట్టుకుని తిరగడం వంటివి చేయకూడదు. పిల్లలతో నినాదాలు ఇప్పించడం, పాటలు పాడించడం, వారితో చిన్నపాటి ప్రసంగాలు ఇప్పించడంసహా పార్టీ ప్రచారాల్లో ఎక్కడా చిన్నారులు ఉపయోగించుకోకూడదు. వారు ప్రచార కార్యక్రమాల్లో కనిపించకూడదు’’ అని తన అడ్వైజరీలో స్పష్టంచేసింది. మరి కొద్ది వారాల్లో సార్వత్రిక ఎన్నికల మొదలుకానున్న నేపథ్యంలో ప్రచారపర్వంలో పార్టీలు ప్రజాస్వామ్య విలువలకు పట్టంకట్టాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సంబంధ కార్యకలాపాల్లో మైనర్లను వినియోగించకూడదని, వినియోగిస్తే కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లేనని బాంబే హైకోర్టు 2014లో ఇచ్చిన ఇక ఉత్తర్వును రాజీవ్ కుమార్ పునరుధ్ఘాటించారు. -
మరోసారి హిందూ దేవాలయంపై ఖలిస్తానీ నినాదాలు
కాలీఫోర్నియా: స్వామినారాయణ గుడి ఘటన మరవకముందే అమెరికాలో మరో హిందూ దేవాలయంపై ఖలిస్థానీ అనుకూల గ్రాఫైట్ రాతలు వెలుగు చూశాయి. కాలీఫోర్నియాలోని హేవార్డ్‌లో ఉన్న స్థానిక హిందూ విజయ్ షెరావాలి దేవాలయంపై శుక్రవారం ఖలిస్థానీ గ్రాఫైట్ నినాదాలు వెలుగులోకి వచ్చినట్లు హిందూ అమెరికా ఫౌండేషన్ (HAF)వెల్లడించింది. విజయ్ షెరావాలి దేవాలయానికి సంబంధించిన బోర్డుపై ‘మోదీ టెర్రరిస్టు.. ఖలిస్తానీ జిందాబాద్’ అని ఖలిస్తాన్ అనుకూల నినాదాలు రాశారు. #Breaking: Another Bay Area Hindu temple attacked with pro-#Khalistan graffiti. The Vijay’s Sherawali Temple in Hayward, CA sustained a copycat defacement just two weeks after the Swaminarayan Mandir attack and one week after a theft at the Shiv Durga temple in the same area.… pic.twitter.com/wPFMNcPKJJ — Hindu American Foundation (@HinduAmerican) January 5, 2024 అయితే ఈ ఘటనపై విజయ్ షెరావాలి దేవాలయం అధికారులు, అల్మెడా పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి ఫిర్యాదు చేసినట్టు హెచ్ఏఎఫ్ తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అమ్మెడా పోలీసులు తెలిపారు. కాగా.. 2023 డిసెంబర్ 23న అమెరికాలోని స్వామినారాయణ గుడిపై గ్రాఫైట్‌తో ఖలిస్తానీ అనుకూల నినాదాలు రాసిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: US: పాఠశాలలో కాల్పుల కలకలం -
వరల్డ్ కప్ ముందు ఖలిస్థాన్ నినాదాలు.. పోలీసులు అలర్ట్
ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో జల్ శక్తి డిపార్ట్మెంట్ గోడలపై దుండగులు ఖలిస్థాన్ నినాదాలు రాశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వచ్చే నెలలో క్రికెట్ వన్డే వరల్డ్ కప్ ఐదు మ్యాచ్‌లు ధర్మశాలలో జరగనున్న నేపథ్యంలో ఖలిస్థాన్ నినాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023కి భారత్ ఈసారి ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే నెలలో ధర్మశాలలో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. క్రికెట్ టీమ్‌లు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. ఈ క్రమంలో జల్ శక్తి డిపార్ట్మెంట్ గోడలపై 'ఖలిస్థాన్ జిందాబాద్' అంటూ అల్లరిమూకలు నినాదాలు రాశారు. ఈ అంశాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. జల్ శక్తి డిపార్ట్మెంట్ గోడలపై స్పే పేయింటింగ్ ద్వారా దుండగులు నినాదాలు రాశారని కాంగ్రా ఎస్పీ షాలినీ అగ్నిహోత్రి తెలిపారు. పోలీసు బృందాలు అక్కడి వెళ్లి గోడలకు మళ్లీ పేయింటింగ్ వేసినట్లు కూడా వెల్లడించారు. సీసీటీవీ ఆధారాలతో దుండగుల కోసం గాలింపు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కెనడా-భారత్ మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో ఖలిస్థాన్ నినాదాలు కెనడాలో పెరిగిపోతున్నాయి. ఇటు ఇండియాలోనూ అల్లరిమూకలు ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ ఎక్కడపడితే అక్కడ గోడలపై నినాదాలు రాస్తున్నారు. అదీగాక వచ్చే నెలలో ప్రారంభం కానున్న క్రికెట్ వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో తాజా అంశం ఆందోళన కలిగిస్తోంది. ఇదీ చదవండి: భారీగా పెరిగిన పన్ను వసూళ్లు.. అందుకు తగ్గట్టుగానే అప్పు కూడా.. -
దశాబ్దాల స్వప్నం సాకారమైంది!
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. సిద్దిపేట– సికింద్రా బాద్ రైలును నిజామాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా మంగళవారం సాయంత్రం 4:20 గంటలకు ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి హరీశ్‌రావు జెండా ఊపి ప్రారంభించి.. అనంతరం రైలులో ప్రయా ణించారు. కొండపాక మండలం దుద్దెడ స్టేషన్లో దిగి కొండపాక మండలంలో ప లు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదే రైలులో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు గజ్వేల్ వరకు ప్రయాణించారు. బీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీ నినాదాలు.. రైలు ప్రారంభోత్సవం సందర్భంగా సిద్ది పేట రైల్వే స్టేషన్‌కు బీఆర్ఎస్, బీజేపీ కార్య కర్తలు భారీగా చేరుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు వల్లే సిద్దిపేటకు రైలు వచ్చిందని, బీజేపీ కార్యకర్తలు మోదీ వలనే సిద్దిపేటకు రైలు వచ్చిందని పోటాపోటీగా నినాదాలు చేశారు. ప్ల కార్డులు, తమ పార్టీకి చెందిన జెండాలు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలోనే మంత్రి హరీశ్‌రావు రైలు ప్రారంభించేందుకు అక్కడకు చేరుకున్నారు. ప్లెక్సీలో సీఎం కేసీఆర్, స్థానిక ఎంపీ ఫొటోలను ఏర్పాటు చేయకపోవడంతో రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అహసనం వ్యక్తం చేస్తూ మోదీ చిత్రాలను ప్రదర్శిస్తున్న ఎల్ఈడీ టీవీని పక్కన పెట్టించారు. అప్పటికే బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో ఉద్రి క్తత నెలకొంది. స్టేజీ పైన మోదీ చిత్రంతో ఏర్పాటు చేసిన ప్లెక్సీని చింపేశారు. దీంతో కార్యకర్తలు పరస్పరం బాహాబాహీకి దిగారు. కుర్చీలు, పార్టీల జెండాలను విసురుకోవడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి తదితరులకు స్వల్పంగా గాయాలయ్యాయి. రైల్వే పోలీసు చంద్రశేఖర్‌కు తలకు కూడా గాయమైంది. సొమ్ము ఒకడిది...సోకు ఒకడిది: హరీశ్ సిద్దిపేటకు రైల్వే లైన్ కోసం రూ. 310 కోట్ల వ్య యంతో 2,508 ఎకరాల భూమిని సేకరించి రైల్వే శాఖకు ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.330 కోట్లను చెల్లించామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇంత కష్టపడితే కనీసం సీఎం ఫొటోను పెట్టకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుద్దెడ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత కొండపాక ఐవోసీ బిల్డింగ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. బీజేపీ వాళ్లు రైలు వాళ్ల వల్లే వచ్చిందని చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. -
నాడు పాక్ అనుకూల నినాదాలు.. నేడు సుప్రీంకోర్టులో చుక్కెదురు..
ఢిల్లీ: పాక్ అనుకూల నినాదాలు చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, ఆర్టికల్ 370 రద్దు ప్రధాన పిటీషనర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. భారత రాజ్యాంగానికి విధేయత చూపుతున్నట్లు లిఖితపూర్వకంగా ప్రమాణం చేయాలని మహ్మద్ అక్బర్ లోన్‌ను ధర్మాసనం కోరింది. 2018లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశాడని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆరోపించడంతో సర్వోన్నత న్యాయస్థానం చర్యలకు పూనుకుంది. "జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని, విధేయత చూపుతానని అక్బర్ లోన్ బేషరతుగా అంగీకరిస్తున్నాడని మేము కోరుకుంటున్నాము" అని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది. భారత రాజ్యాంగానికి విధేయత చూపుతున్నానని పేర్కొంటూ జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు రేపటిలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కోరింది. నాయకుల మాటలు సమాజంపై ప్రభావం చూపుతాయని పేర్కొంటూ.. క్షమాపణలు కోరకపోతే ఇలాంటి చర్యలను ప్రోత్సహించినట్లవుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఇది జమ్మూ కశ్మీర్లో శాంతి భద్రతలను కాపాడుతున్న కేంద్రం చర్యలపై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే 370 ఆర్టికల్ రద్దు అంశాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు అయ్యాయి. వీటిపై గత కొన్ని రోజులుగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర హోదా మళ్లీ ఎప్పుడు పునరుద్ధరిస్తారని కేంద్రాన్ని ధర్మాసనం ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఉదయనిధి 'సనాతన ధర్మ' వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన ఏంటంటే..? -
బీజేపీ భారత్ వీడిపో
కోల్‌కతా: మణిపూర్ హింసాకాండ కారకులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అందుకే ప్రస్తుతం దేశంలో ‘‘బీజేపీ భారత్ వీడిపో’’ అన్న నినాదం మారుమోగుతోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అవినీతిపై మాట్లాడే హక్కు లేదన్నారు. పెద్ద నోట్ల రద్దు, రఫేల్ ఒప్పందం, పీఎం కేర్ నిధుల అంశంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీ ప్రభుత్వం అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మమత అన్నారు. కోల్‌కతాలో శనివారం జరిగిన జీ–20 అవినీతి వ్యతిరేక సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. అవిశ్వాస తీర్మానం సమయంలో లోక్‌సభ నుంచి విపక్ష పార్టీ సభ్యులు పారిపోయారని, వారు వ్యాప్తి చేసిన నెగిటివిటీని తాము సమర్థంగా ఎదుర్కొన్నామని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మమత కౌంటర్ ఇచ్చారు. దేశంలో నిరుపేద ప్రజలు బతకడం బీజేపీకి ఇష్టం లేదని, అందుకే ప్రధాని మోదీ ఇష్టారాజ్యంగా నిందలు వేస్తున్నారని అన్నారు. ‘‘‘ప్రధానమంత్రి జాతిని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రతిపక్షాల గురించి మాట్లాడుతున్నారు. దేశంలో నిరుపేదలు బతకడం బీజేపీకి ఇష్టం లేదు’’ అని మమత తాను విడుదల చేసిన ఒక ఆడియో మెసేజ్‌లో ఆరోపించారు. బ్రిటిష్ పాలకుల్ని క్విట్ ఇండియా అంటూ అప్పట్లో మహాత్మా గాంధీ నినదించారని, ఇప్పుడు దేశ ప్రజలు బీజేపీ క్విట్ ఇండియా అంటున్నారని మమత కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
పుంగనూరులో చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసనలు
-
టీడీపీ కార్యాలయంలో జై జగన్ అంటూ నినాదాలు..
చిత్తూరు జిల్లా: టీడీపీలో ఉన్న వర్గవిభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. నాయకులు ఏకంగా పార్టీ కార్యాలయంలోనే చంద్రబాబు వైఖరిపై విమర్శలు కురిపించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. మదనపల్లె టీడీపీ కార్యాలయంలో చంద్రబాబును బూతులు తిడుతూ టీడీపీ నేత విద్యాసాగర్ ఆగ్రహావేశం వ్యక్తం చేశారు. జై జగన్ అంటూ పార్టీ కార్యాలయంలోనే నినాదాలు చేశారు. టీడీపీ నేత విద్యాసాగర్.. తమ పార్టీ అధినేత చంద్రబాబుపై ఈ సందర్భంగా వ్యగ్యాంస్త్రాలు సంధించారు. వయసైపోయాక బాబుకి వేపకాయంత వెర్రి వచ్చిందని మాట్లాడారు. బస్టాండ్‌లో టీడీపీ జెండా తగులబెడతానని అన్నారు. జగన్ మాకేమీ ద్రోహం చేయలేదు.. జై జగన్.. అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోకు సంబంధించిన ఘటన కొన్ని రోజుల క్రితం జరగగా.. ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: పార్లమెంట్ సాక్షిగా బయటికొచ్చిన వాస్తవాలు -
Manipur violence: ఆరని మంటలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో మణిపూర్ హింసాకాండ మంటలు కొనసాగుతున్నాయి. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తక్షణమే సమాధానం ఇవ్వాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, ఆందోళనలు, నిరసనలతో ఉభయ సభలు స్తంభిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వరుసగా మూడో రోజూ సోమవారం సైతం ఇదే అంశంపై విపక్షాలు ఉభయ సభలను అడ్డుకున్నాయి. దీంతో పలుమార్లు సభలను వాయిదా వేయాల్సి వచి్చంది. ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ సస్పెన్షన్ వ్యవహారం రాజ్యసభను మరింత వేడెక్కించింది. డిమాండ్‌పై వెనక్కి తగ్గని విపక్షాలు మణిపూర్ ఘటనలపై చర్చించాలని కోరుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు లోక్‌సభలో సోమవారం వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సభలో సమాధానం ఇవ్వాలని ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరీ డిమాండ్ చేశారు. ఆయనకు మద్దతుగా విపక్ష ఎంపీలు తమ స్థానాల్లోంచి లేచి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్ ఓంబిర్లా స్పందిస్తూ.. దీనిపై సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే కేంద్రం తరఫున ఎవరూ సమాధానమివ్వాలో మీరు ఆదేశించలేరని అన్నారు. ఇదే సమయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నా«థ్ సింగ్ మాట్లాడుతూ.. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోగా మరింత తీవ్రస్వరంతో నినాదాలు చేశారు. ‘ఇండియా ఫర్ మణిపూర్’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. లోక్‌సభలో బీజేపీ ఎంపీలు కూడా ఎదురుదాడికి దిగారు. పశి్చమ బెంగాల్, రాజస్తాన్‌లో మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష ఎంపీల నినాదాల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. నినాదాల హోరు ఆగకపోవడంతో కొద్దిసేపటికే సభను మధ్యాహ్నం 12 గంటల దాకా, ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల దాకా.. అనంతరం మంగళవారానికి వాయిదా వేశారు. నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు–2023, నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కమిషన్ బిల్లు–2023, కానిస్టిట్యూషన్(ఎస్సీలు) ఆర్డర్(సవరణ) బిల్లు–2023ని కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. సంజయ్ సింగ్ సస్పెన్షన్ మణిపూర్ హింసపై రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్), కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా విపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల వరకూ సభ వాయిదా పడింది. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా ఆందోళన కొనసాగించారు. సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్న ‘ఆప్’ ఎంపీ సంజయ్ సింగ్ తీరుపై చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను సభ నుంచి సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. దీంతో సంజయ్ సింగ్‌ను సస్పెండ్ చేయాలనే తీర్మానాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టారు. దీనిని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో వర్షాకాల సమావేశాల్లో సభ జరిగే మిగిలిన దినాలకు సంజయ్ సింగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ‘ఆప్’ ఎంపీని సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. దీంతో సభను చైర్మన్ వాయిదా వేశారు. ఆ తర్వాత అన్ని పారీ్టల సభాపక్ష నేతలతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సభ సక్రమంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్లో సజావుగా చర్చ జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని హోంమంత్రి అమిత్ అన్నారు. ఆయన సోమవారం లోక్‌సభలో మాట్లాడారు. మణిపూర్ అంశంలో నిజాలు బయటకు రావాల్సిందేనని, వాస్తవాలు దేశ ప్రజలకు తెలియాలని పేర్కొన్నారు. పార్లమెంట్ వెలుపల నిరసన మణిపూర్‌లో మహిళలపై అకృత్యాలపై ప్రధాని నరేంద్ర మోదీ సమగ్ర ప్రకటన చేయాలని ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ పార్లమెంట్ ఆవరణలో సోమవారం ఆందోళన చేపట్టింది. ‘మణిపూర్ కోసం భారత్’, ‘భారత్ డిమాండ్ మణిపూర్’ అని రాసి ఉన్న ప్లకార్డులు, బ్యానర్లు చేతపట్టుకుని ప్రతిపక్ష ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేశారు. -
సీఎం సీఎం నినాదాలతో రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ హంగామా
-
వాళ్లు కన్పిస్తే కాల్చి పడేయాలి.. కేంద్ర మంత్రి తీవ్ర వ్యాఖ్యలు..
పట్నా: ఇటీవల హత్యకు గురైన ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌ను పొగుడుతున్న వాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి అశ్విని చౌబె. అలాంటి వాళ్లు కన్పించిన వెంటనే కాల్చి పడేయాలని వ్యాఖ్యానించారు. బిహార్‌లో కూడా యోగి మోడల్ ప్రభుత్వం అవసరం ఉందన్నారు. పట్నాలో శుక్రవారం ప్రార్థనల అనంతరం కొందరు అతీక్ అహ్మద్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన అశ్విని చౌబె వాళ్లపై ఫైర్ అయ్యారు. బిహార్‌లో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, తక్షణమే వాళ్లను కాల్చిపడేయాలన్నారు. మోదీ, యోగికి వ్యతిరేకంగా వాళ్లు నినాదాలు చేసిన తీరు బాధాకరమన్నారు. క్రిమినల్స్, మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న యోగి మార్క్ పాలన బిహార్‌లోనూ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. బిహార్‌లో ప్రస్తుతం కుటంబ, కుల రాజకీయాలు చేసే వారే అధికారంలో ఉన్నారని కేంద్రమంత్రి మండిపడ్డారు. సీఎం నితీశ్ కుమార్ బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వాళ్లకు తగిన రీతిలో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కాగా.. గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అశ్రఫ్‌ను ముగ్గురు యువకులు పోలీసులు, మీడియా ముందే కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముగ్గురు నిందితులు వెంటనే పోలీసులకు లొంగిపోయారు. ఫేమస్ అయ్యేందుకే తాము ఈ హత్యలు చేసినట్లు విచారణలో అంగీకరించారు. చదవండి: 35 రోజులుగా వేట.. అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు! -
చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ సెగ.. ఈడ్చిపడేయాలంటూ ఆదేశాలు
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నం పర్యటనలో చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సెగ తగిలింది. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ ఫోటోలు ప్రదర్శించిన అభిమానులు.. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ బాబు కాన్వాయ్ ఎదుట నినాదాలు చేశారు. జూ.ఎన్టీఆర్, హరికృష్ణ ఫొటోలు చూసి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. నినాదాలు చేసిన వాళ్లను ఈడ్చిపడేయాలంటూ టీడీపీ నేతలను ఆదేశించారు. ఎన్టీఆర్ ఫొటో పట్టుకున్న యువకుడిపై చంద్రబాబు మనుషులు దాడి చేశారు. మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు కనబడకూడదని చంద్రబాబు హుకుం జారీ చేశారు. మచిలీపట్నంలోని మూడు బొమ్మల సెంటర్ వద్ద మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో సాగిన ర్యాలీలో జూ.ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సులు చేస్తున్నవారిని కొల్లు రవీంద్ర, అనుచరులు చెదరగొట్టారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులకు తొపులాటలు జరిగాయి. కాగా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుధవారం సాగిన టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఆసాంతం ఊకదంపుడు ఉపన్యాసాలు.. పరనిందగానే సాగింది. తొలుత విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని రాణిగారితోటలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు షో సైతం జనం లేక వెలవెలబోయింది. అనంతరం పెనమలూరు నియోజకవర్గంలో కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి బయలుదేరిన ఆయన కాన్వాయ్ కృష్ణా జిల్లాలో సాగింది. అనంతరం మచిలీపట్నంలో నిర్వహించిన బహిరంగ సభ సైతం వెలవెలబోయింది. చదవండి: ఇదే చంద్రబాబుకు నా ఛాలెంజ్: సీఎం జగన్ -
పార్లమెంట్లో ఆగని రగడ
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్లో దుమారం కొనసాగుతూనే ఉంది. అధికార, విపక్ష సభ్యుల నినాదాలు, కేకలతో ఉభయసభలు వరుసగా మూడో రోజు బుధవారం సైతం స్తంభించాయి. రాహుల్ క్షమాపణకు బీజేపీ సభ్యులు, అదానీ వ్యవహారంపై జేపీసీకి విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. దాంతో లోక్‌సభ, రాజ్యసభ మళ్లీ వాయిదా పడ్డాయి. ప్రజాస్వామ్యాన్ని అవమానించారు బుధవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. అదానీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) డిమాండ్‌తో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలకు దిగారు. రాహుల్ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు సైతం నినాదాలు ప్రారంభించారు. వెల్‌లోంచి వెళ్లి సభ జరగనివ్వాలని స్పీకర్ ఓం బిర్లా కోరారు. కార్యకలాపాలకు అడ్డు తగులుతున్న విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను మంత్రి పీయూష్ గోయల్ కోరారు. పార్లమెంట్ సభ్యుడైన ఓ వ్యక్తి విదేశాలకు వెళ్లి ఇదే పార్లమెంట్‌ను దారుణంగా కించపర్చారని రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. సభ మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా పడింది. వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్ష ఎంపీలు నినాదాలు కొనసాగించారు. సభ సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత సభ్యులందరిపైనా ఉందని సభాపతి స్థానంలో ఉన్న భర్తృహరి మెహతాబ్ చెప్పారు. సభలో ప్రభుత్వానికి సంబంధించిన పత్రాలకు తప్ప ప్లకార్డులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. గందరగోళం కొనసాగుతుండగానే రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ఇంటర్–సర్వీసెస్(కమాండ్, కంట్రోల్, డిసిప్లిన్) బిల్లు–2023ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ సభకు వచ్చి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ మన దేశాన్ని అవమానించారంటూ ప్రవాస భారతీయుల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని వెల్లడించారు. భారత్ సార్వభౌమత్వ దేశమని, మన దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలంటూ ఇతర దేశాలను రాహుల్ కోరడం ఏమిటని ప్రహ్లాద్ జోషీ ఆక్షేపించారు. అనంతరం సభ గురువారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ గందరగోళం లోక్‌సభలో కనిపించిన దృశ్యాలే రాజ్యసభలోనూ పునరావృతమయ్యాయి. లండన్‌లో చేసిన వ్యాఖ్యల పట్ల రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని అధికారపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీలు ఎదురుదాడికి దిగారు. అరుపులు కేకలతో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మళ్లీ ప్రారంభమైన తర్వాత ఇరుపక్షాల నడుమ వాగ్వాదం కొనసాగింది. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రసంగించేందుకు ప్రయత్నించగా, బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. రాహుల్ క్షమాపణ చెప్పిన తర్వాతే కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడాలంటూ నినాదాలు చేశారు. సభ్యులంతా శాంతించాలని చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పదేపదే కోరినా ఫలితం లేకుండాపోయింది. సభ ముందుకు సాగే అవకాశాలు లేకపోవడంతో మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాహుల్ క్షమాపణ ప్రసక్తే లేదు: ఖర్గే రాహుల్ వ్యాఖ్యలపై ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ నేతలపై గతంలో ప్రధాని మోదీ విదేశాల్లో చేసిన వ్యాఖ్యలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎదురుదాడికి దిగారు. ‘‘భారత్‌లో పుట్టినందుకు గతంలో మీరంతా సిగ్గుతో తలదించుకునేవారు. అదో పాపంగా భావించారు. జీవిస్తున్నారు అని ప్రధాని హోదాలో చైనాలో మోదీ అన్నారు. రాహుల్ మాటల్లో తప్పేంలేదు. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు’’ అని స్పష్టంచేశారు. ‘ భావ ప్రకటనా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రాన్ని అణగదొక్కుతున్నారు. నిజం మాట్లాడితే జైలు పంపుతున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని చంపడం కాదా?’’ అన్నారు. -
హౌరా రైల్వే స్టేషన్ లో హైడ్రామా
-
పార్లమెంట్లో ‘సరిహద్దు’ రగడ.. లోక్‌సభ ఐదుసార్లు వాయిదా
న్యూఢిల్లీ: సరిహద్దులో భారత్, చైనా జవాన్ల ఘర్షణ, చైనా దురాక్రమణ గురించి పార్లమెంట్లో చర్చించాలన్న డిమాండ్‌పై ప్రతిపక్షాలు పట్టువీడడం లేదు. లోక్‌సభలో గురువారం సైతం ఇదే అంశాన్ని విపక్ష సభ్యులు లేవనెత్తారు. సభలో ఇతర వ్యవహారాలను పక్కనపెట్టి, చైనా ఆగడాలపై వెంటనే చర్చ ప్రారంభించాలని తేల్చిచెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు వచ్చి, సమాధానం చెప్పాలని, నిరంకుత్వం చెల్లదని నినాదాలు చేశారు. చర్చకు సభాపతి నిరాకరించడంతో సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. సభ సజావుగా సాగడానికి సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ కోరినా వారు పట్టించుకోలేదు. దీంతో ఐదుసార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో లోక్‌సభను ఒకేరోజు ఐదుసార్లు వాయిదా ఇదే మొదటిసారి. విపక్షాల నినాదాల హోరు కొనసాగుతుండగానే మరోవైపు కేంద్ర వాణిజ్యమంత్రి గోయల్ ‘జన విశ్వాస్ (సవరణ) బిల్లు–2022’ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లును పార్లమెంట్ జాయింట్ కమిటీ పరిశీలనకు పంపాలని సిఫార్సు చేశారు. విపక్షాల ఆందోళన కారణంగా సభా వ్యవహారాలేవీ సాగలేదు. ప్రశ్నోత్తరాల్లో పాల్గొనాలని స్పీకర్ బిర్లా పదేపదే కోరినా కాంగ్రెస్ తదితర పార్టీల ఎంపీలు వినిపించుకోలేదు. సరిహద్దులో ఘర్షణపై చర్చ ప్రారంభించాలని పట్టుబట్టారు. కరోనా వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటన చేస్తున్న సమయంలోనూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించారు. చైనా దురాక్రమణపై చర్చించాలని కోరుతూ పార్లమెంట్ ఉభయ సభల్లో పలువురు విపక్ష సభ్యులు ఇప్పటికే వాయిదా తీర్మానాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకరోజు బహిష్కరించిన విపక్షాలు సరిహద్దు అంశంపై చర్చకు అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ విపక్షాలన్నీ గురువారం రాజ్యసభ కార్యకలాపాలను బహిష్కరించాయి. తొలుత ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చారు. చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నినాదాలు ప్రారంభించారు. సభను అడ్డుకోవద్దంటూ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సూచించారు. అయినా నినాదాలు ఆపలేదు. సరిహద్దు వ్యవహారంపై చర్చకు చైర్మన్ అంగీకరించకపోవడంతో సభను బహిష్కరిస్తున్నట్లు విపక్ష ఎంపీలు చెప్పారు. -
షాకింగ్.. ఇంజనీరింగ్ కాలేజ్‌లో 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు..
బెంగళూరు: కర్ణాటక బెంగళూరులోని న్యూ హారిజన్ ఇంజినీరింగ్ కాలేజీలో ముగ్గురు విద్యార్థులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో చక్కర్లు కొట్టడంతో కళాశాల యాజమాన్యం ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేసింది. వాళ్ల తల్లిదండ్రులుకు కూడా నోటీసులు పంపింది. మరోవైపు కాలేజీ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం ముగ్గురూ బెయిల్‌పై విడుదల అయ్యారు. అయితే వీళ్లు కావాలాని ఈ నినాదాలు చేయలేదని, సరదాగా చేసి ఇబ్బందుల్లో పడ్డారని పోలీసులు తెలిపారు. కాలేజీలో ఫెస్ట్.. అయితే ఈ కాలేజీలో నవంబర్ 25,26 తేదీల్లో ఇంటర్-కాలేజ్ ఫెస్ట్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులంతా తమకు నచ్చిన ఐపీఎల్ జట్లు, వివిధ దేశాల పేర్లతో నినాదాలు చేశారు. ఈ సమయంలోనే ముగ్గురు విద్యార్థులు ఆర్యన్, దినకర్, రియా.. సరదాగా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అరిచారు. మరో విద్యార్థి వీడియో తీస్తున్నా పట్టించుకోకుండా అలాగే నినాదాలు చేశారు. దీంతో కేసులో ఇరుక్కుని ఇబ్బందులపాలయ్యారు. వీరి వయసు 17-18 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. చదవండి: అది మసాజ్ కాదు.. ట్రీట్మెంట్.. జైలు వీడియోపై ఆప్ కౌంటర్.. -
బీజేపీ సభలో రాజాసింగ్ కు అనుకూలంగా స్లొగన్స్
-
ఇరాన్లో హిజాబ్ ఆందోళనల్లో... 50 మందికి పైగా బలి
టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు రోజురోజుకూ ఉధృతం రూపం దాలుస్తున్నాయి. కొత్త నగరాలు, పట్టణాలకు వ్యాపిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో మహిళలు వీధుల్లోకి వచ్చి, నిర్బంధ హిజాబ్ ధారణ వద్దంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు నిరసనలను ఇరాన్ భద్రతా దళాలు అణచివేస్తున్నాయి. భద్రతా సిబ్బంది దాడుల్లో ఇప్పటిదాకా 50 మందికిపైగానే ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ హ్యూమన్ రైట్స్(ఐహెచ్ఆర్) అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీఓ) ప్రకటించింది. ఉత్తర గిలాన్ ప్రావిన్స్‌లోని రెజ్‌వన్‌షాహర్ పట్టణంలో పోలీసుల కాల్పుల్లో ఆరుగురు బలయ్యారని తెలియజేసింది. బబోల్, అమోల్‌లోనూ నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆయా పట్టణాల్లో కాల్పుల్లో పలువురు మృతిచెందారని ఫ్రాన్స్ మీడియా సంస్థ పేర్కొంది. ఇరాన్ అత్యున్నత మతపెద్ద ఖమేనీ విగ్రహాన్ని ఆయన స్వస్థలం మషాద్‌లో నిరసనకారులు దహనం చేశారు. మరోవైపు ప్రభుత్వానికి మద్దతుగా టెహ్రాన్‌లో పలువురు ర్యాలీలు నిర్వహించారు. ఇరాన్లో పరిస్థితులపై ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
అసెంబ్లీలో ఏక్నాథ్ షిండే ఎమ్మెల్యేలు, ఎన్సీపీ ఎమ్మెల్యేల రగడ
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే, ఎన్సీపీకి చెందిన ఒక శాసన సభ్యుడు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బుధవారం విధాన సభలో ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుని వాగ్వాదానికి దిగారు. అధికార శివసేన-బీజేపీ సంకీర్ణాన్ని దూషించే ప్రయత్నంలో ఎన్సీపీ ఎమ్మెల్యేలు శాసనసభ భవనం మెట్ల పై క్యారెట్లను తీసుకువెళ్లారు. షిండే వర్గం ఎమ్మెల్యేలు ఎన్సీపీ ఎమ్మెల్యేల నుంచి క్యారెట్లు లాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇద్దరి మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాసేపటికి ఇరువర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని ఉద్రిక్తత సద్దుమణిగేలా చేశారు. అంతకు ముందు మహారాష్ట్ర మాజీ సీఎం ఉథవ్ థాక్రే, అతని కుమారుడు ఆదిత్య థాక్రేలను లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీ వర్గానికి చెందిన శాసన సభ్యులు, షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు నిరసనలు చేపట్టారు. అంతేకాదు నగదు అధికంగా ఉండే బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో అవినీతి జరిగిందని, థాక్రేలు అధికారం కోసం హిందుత్వవాదంతో రాజీ పడ్డారంటూ వివిధ సందేశాలతో కూడిన బ్యానర్లతో నినాదాలు చేశారు. ఈ మేరకు షిండే పార్టీకి చెందిన ఎమ్మెల్యే భరత్ గోగావాలే విలేకరులతో మాట్లాడుతూ...ఇన్నిరోజులు ప్రతిపక్షాలు నిరసనలు చేస్తున్నప్పుడూ తాము ఒక్కమాట కూడా మాట్లడలేదన్నారు. అయినా నిరసన చేస్తున్నప్పుడు తమ దగ్గరికి రావాల్సిన అవసరం ఏమిటన్ని ప్రశ్నించారు. ఇలా ఇరుపక్షాల సభ్యులు ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ సభకు వెళ్లారు. అదీగాక మహారాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారంతో ముగియనున్నాయి. #WATCH | A scuffle broke out between a few ruling party MLAs and Maha Vikas Aghadi MLAs outside the Maharashtra Assembly, in Mumbai pic.twitter.com/genqozygaU — ANI (@ANI) August 24, 2022 (చదవండి: అఘాడీ కూటమితోనే శివసేన.. ఆ అడ్డంకిని అధిగమిస్తాం: ఉద్ధవ్ థాక్రే) -
విరక్తిలో రష్యన్లు.. పుతిన్‌కు గడ్డుకాలం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు స్వదేశంలో చేదు అనుభవం ఎదురవుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను రష్యన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పుతిన్ తీరును తప్పుబడుతూ వీధులు, రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రష్యాకు చెందిన సెలబ్రేటీలు, మీడియా ప్రముఖులు బహిరంగంగానే పుతిన్ చర్యలను ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే యుద్ధానికి నిరసనగా వేల సంఖ్యలో రష్యన్లు బహిరంగ లేఖలు రాస్తున్నారు. దీంతో, అక్కడి పోలీసులు.. నిరసనకారులను అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంత మందిని అరెస్ట్ చేస్తారంటూ అసభ్యకర పదజాలంతో నిరసనలు తెలిపారు. మరోవైపు.. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ ప్రాంతంలో రష్యన్ భారీ సంఖ్యలో బయటకు వచ్చారు. యుద్దంపై విరక్తితో వెంటనే దాడులను నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. కాగా, ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో రష్యాపై అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యన్లు చాలా వరకు సేవలను కోల్పోతున్నారు. ఇక ఇటీవలే.. అమెరికా ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్ కీలక ప్రకటన చేసింది. రష్యా మార్కెట్ నుంచి పూర్తిస్థాయిలో శాశ్వతంగా నిష్క్రమిస్తున్నట్లు సోమవారం ప్రకటించేసింది. ముప్ఫై ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఓ ప్రకటనలో మెక్‌డొనాల్డ్స్ కార్పొరేషన్ వెల్లడించింది. అంతకుముందు అమెరికన్ పేమెంట్ సంస్థలైన వీసా, మాస్టర్‌కార్డ్ సంస్థలు.. రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తున్నామని వీసా సీఈవో అల్ కెల్లీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో రష్యా బలగాల ఆక్రమణ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమైన దాడులకు ఈరోజుతో మూడు నెలలు గడిచింది. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని చవిచూసింది. దాడుల్లో భాగంగా ఉక్రెయిన్‌లోని పలు నగరాలను రష్యా తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇటీవల ఉక్రెయిన్‌లోనే పెద్దదైన అజోస్తోవ్ స్టీట్ ప్లాంట్ తమ ఆధీనంలోకి తీసుకున్నామని రష్యా ప్రకటించింది. దీంతో, అక్కడ(మరియుపోల్‌లో) యుద్ధం ముగిసిందని రష్యా సైన్యం వెల్లడించింది. Not everyone in #Russia is falling for the Kremlin's lies. During a concert the crowd can be heard chanting "F*ck the war!" "They can't arrest us all!" Inspiring. Please share! 🚜🎼#PuckFutin #Putler#StandWithUkraine #activism #RussiaProtests #Ukraine #Putin #WarCrimes pic.twitter.com/YYg1xv6VPH — TACTICAL STRIKE MEDIA (@tsm3301) May 23, 2022 ఇది కూడా చదవండి: భారత్‌కు మాత్రమే అది సాధ్యమైంది.. వెల్డన్ మోదీ జీ -
గడ్కరీ కార్యక్రమంలో జైశ్రీరామ్ నినాదాలు
హైదరాబాద్: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్న ఓ కార్యక్రమంలో ‘జై శ్రీరామ్’ నినాదాలు హోరెత్తాయి. ఓ కార్యక్రమం కోసం గడ్కరీ హైదరాబాద్‌కు వచ్చారు. మైకులో తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతుండగా.. ‘జై శ్రీరామ్, భారత్‌మాతాకి జై’ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అక్కడే ఉన్న మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకుని అందరూ ప్రశాంతంగా ఉండాలని వారించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు నినాదాలు ఆపేశారు. శుక్రవారం జాతీయ రహదారుల శంకుస్థాపన కార్యక్రమంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. -
పవన్‌కు చేదు అనుభవం.. ‘జై జగన్’ అంటూ ఫ్యాన్స్ నినాదాలు
సాక్షి, కృష్ణా: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం ఏలూరు జిల్లా పర్యటనకు వచ్చారు. రోడ్ షో సందర్భంగా కారులో వెళ్లుండగా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ వేలేరు అడ్డ రోడ్డు దగ్గర అభిమానులు పవన్‌కు పూలతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో జై జగన్.. జై జగన్ అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. -
యూపీలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదం.. ఆ తర్వాత ఏమైందంటే..?
లక్నో: భారత్, పాకిస్తాన్ విషయంలో రెండు దేశాలకు సంబంధించిన స్లోగన్స్ విషయం ఎంతో సున్నితమైనవి. ఏ మాత్రం తేడా వచ్చినా అంతే సంగతి. అలాంటిది.. భారత్‌లో పాకిస్తాన్ జిందాబాద్.. అంటూ స్లోగన్స్‌తో ఉన్న పాటను వింటున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో సింఘై కలాన్ గ్రామంలో ఓ దుకాణదారుడు తన షాపులో ‘పాకిస్తాన్ జిందాబాద్’ పాట ప్లే చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన బీజేపీ నేతలు భూటా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు నిందితులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసులో భాగంగా నిందితులను విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని బరేలీ (రూరల్) ఎస్పీ రాజ్‌కుమార్ అగర్వాల్ వెల్లడించారు. ఈ ఘటన అనంతరం నిందితుడి తల్లి మాట్లాడుతూ.. "ఏం జరిగిందో మాకు తెలియదు. నా చిన్న కొడుకు తన మొబైల్ ఫోన్లో మతపరమైన పాటలు విన్నాడని చెబుతున్నారు. ఫోన్లో అలాంటి నినాదాలు ఉన్నాయని అతనికి తెలియదు. మేము ఎప్పుడూ మొబైల్ ఫోన్లో అలాంటి పాటలు ప్లే చేయలేదు. అతను చదువుకోలేదు. దయచేసి నా కొడుకును విడుదల చేయండి’’ అని పోలీసులను అభ్యర్థించింది. Rojedar Mustakim & Naeem, who were playing the song 'Pakistan Zindabad' in Bareilly, were arrested by the UP Police on complaint of BJP leaders Himanshu Patel and Ashish Patel, in Eid Manegi Jail. pic.twitter.com/SBjwSSsAVo — Raj Karsewak (@rajkarsewak) April 15, 2022 ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి నినాదాలు వినిపించడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది యూపీలోని నోయిడాలో ఓ మతపరమైన ఊరేగింపులో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ అనే నినాదాలు చేసినందుకు ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. -
ప్రధాని మోదీ పేరుతో మార్మోగిన లోక్‌సభ
-
యూపీలో ఆర్ఎల్డీ, కాంగ్రెస్ అభ్యర్థులపై దేశద్రోహం కేసులు
బిజ్నోర్, వారణాసి: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) అభ్యర్థి నీరజ్ చౌదరిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆయన బిజ్నోర్ స్థానం నుంచి బరిలోకి దిగారు. కొన్ని రోజుల క్రితం నీరజ్ ఇంటింటి ప్రచారం కొనసాగిస్తూ ఉండగా ఆయన వెంట ఉన్న కొందరు వ్యక్తులు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారని, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని పోలీసులు శనివారం చెప్పారు. శత్రుదేశానికి అనుకూలంగా నినాదాలు చేసినందుకు గాను నీరజ్ చౌదరితోపాటు మరో 20–25 మందిపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 295ఏతో పాటు పలు సెక్షన్ల కింద గురువారం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అంటువ్యాధుల చట్టం కింద కూడా కేసు పెట్టామన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు. సంబంధిత ఆడియో, వీడియో క్లిప్‌లను క్షుణ్నంగా పరిశీలిస్తామని అన్నారు. తమ పార్టీ అభ్యర్థిపై దేశద్రోహం కేసు నమోదు చేయడం పట్ల ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అకీఫ్ భాయ్ జిందాబాద్ అని నినదించినా కొందరికి పాకిస్తాన్ జిందాబాద్ అన్నట్లుగా వినిపిస్తోందని శనివారం ట్విట్టర్లో ఎద్దేవా చేశారు. తప్పుడు వీడియోలు సృష్టించి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైద్యుడు, పెద్దమనిషి అయిన నీరజ్ చౌదరిని ద్రోహిగా చిత్రీకరిస్తుండడం దారుణమని జయంత్ చౌదరి ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై...: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా ప్రసంగించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్‌పై పోలీసులు శనివారం దేశద్రోహం కేసు నమోదు చేశారు. అజయ్ రాయ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి జిల్లాలోని పిండ్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన జనవరి 31న రాజేతరా గ్రామంలో అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదంతా నిజమేనని నిర్ధారించుకున్న పోలీసులు అజయ్ రాయ్‌పై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 269, 153, 153ఏ, 188 కింద కేసు పెట్టారు. -
పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు.. కేసు నమోదు
గురుగ్రామ్: పాకిస్తాన్‌కు అనుకూలంగా ఓ వ్యక్తి నినాదాలు చేస్తూ.. అపార్టుమెంట్ వాసులకు ఇబ్బంది కలిగించాడు. దీంతో వారు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్ సొసైటీ అపార్టుమెంట్లో నివాసం ఉండే ఓ వ్యక్తి తన ఫ్లాట్ బాల్కానీలో నిలబడి పాకిస్తాన్‌కు అనుకూలంగా.. ‘పాకిస్తాన్ జిందాబాద్.. పాకిస్తాన్ జిందాబాద్..’ నినాదాలు చేశాడు. దీంతో అతని నినాదాలకు ఇబ్బందిగా భావించిన అపార్టుమెంట్ వాసులు స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు. చదవండి: ‘తాలిబన్ ఉగ్రవాద సంస్థా? కాదా? సమాధానం చెప్పాలి’ కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నామని తెలిపారు. అయితే నిందితుని భార్య కూడా అపార్టుమెంట్ వాసులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడని, అందుకోసం చికిత్స తీసుకుంటున్నాడని తెలిపింది. అందువల్లనే నినాదాలు చేశాడని తెలిపింది. కొంతమంది అపార్టుమెంట్ వాసులు తమ ఫ్లాట్ వద్దకు వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొంది. అయితే నిందితుడు ఒత్తిడి ఉండి నినాదాలు చేశాడా? లేదా? ఉద్దేశపూర్వంగా చేశాడా? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: షాకింగ్.. రెస్టారెంట్ యజమానిని కాల్చి చంపిన స్విగ్గీ ఏజెంట్ -
స్వర్ణ దేవాలయంలో ఖలిస్తానీ నినాదాలు
అమృత్సర్: పంజాబ్‌లో సిక్కుల ప్రధాన దేవాలయమైన గోల్డెన్ టెంపుల్లో ఆదివారం ఖలిస్తాన్ నినాదాలు వినిపించాయి. 1984లో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్‌లో భాగంగా గోల్డెన్‌టెంపుల్‌లో నక్కిన ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు 37 ఏళ్లు నిండిన సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో ఖలిస్తాన్ మద్దతు నినాదాలు వినిపించాయి. ఇందులో నినాదాలు చేసిన వారు శిరోమణి అకాలీదళ్ (మన్)కు చెందిన వారు కావడం గమనార్హం. జనవరి 26న రైతుల ట్రాక్టర్ మార్చ్‌లో జరిగిన హింసకు బాధ్యుడని భావిస్తున్న దీప్ సిద్దూ.. మాజీ ఎంపీ సిమ్రాన్‌జిత్ సింగ్ మన్తో కలసి ఈ సమావేశంలో కనిపించారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. ఈ సందర్భంగా జతేదార్ హర్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ బ్లూ స్టార్ గాయాలను సిక్కు వర్గం ఇంకా మర్చిపోలేదన్నారు. -
‘జలశక్తి అభియాన్’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్న మోదీ
న్యూఢిల్లీ: ప్రపంచ జలశక్తి దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం (మార్చి22)న ‘జలశక్తి అభియాన్’ ప్రాజెక్ట్‌ను వీడియో కాన్సరేన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టును కెన్, బెట్వా నదుల మధ్య నిర్మిస్తున్నారు. కేంద్ర జలశక్తి మత్రిత్వశాఖ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లో కరువు, నీటి కోరత ఉన్న ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. కెన్, బెట్వా నదులను అనుసంధానం చేయడంలో భాగంగా ధౌధాన్ డ్యామ్‌ను నిర్మించనున్నారు. వీటి అనుసంధానంతో ఏటా 10.62 హెక్టార్లకు నీటిపారుదల జరగనుంది. 62 లక్షల మందికి సురక్షిత తాగు నీరు లభిస్తుంది. ఈ నీటితో 103 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల బుందేల్‌ఖండ్, పన్నా, టికామ్‌గా, ఛతర్పూర్, సాగర్, దామో, డాటియా ప్రాంతాలకు నీరు లభిస్తుంది. మధ్యప్రదేశ్‌లోని రైసస్, బందా, మహోబా ప్రాంతాలు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్పూర్ ప్రాంతాలు ప్రయోజనం పొందనున్నాయి. ఈ జలశక్తి కార్యక్రమంలో భాగంగా ‘జలశక్తి అభియాన్: క్యాచ్ ది రెయిన్’ నవంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని గ్రామీణా ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు పూర్తి స్థాయిలో అమలు కానుంది. ‘వర్షం ఎక్కడ, ఎప్పుడు పడినా.. ఆ నీటిని ఒడిసి పట్టుకోండి’ అనేది ఈ కార్యక్రమ నినాదం. చదవండి: త్వరలో కుంభమేళ.. ఈ సూచనలు పాటించాలి -
దేశ ప్రధాని ముందే అవమానించారు: మమత
పుర్సురా (పశ్చిమబెంగాల్): ‘మీ ఇంటికి ఎవరినైనా పిలిచి అనంతరం వారిని అవమానిస్తారా ? అలాంటి సంప్రదాయం భారత్‌లోగానీ, బెంగాల్‌లోగానీ ఉందా ? నేతాజీ స్లోగన్లను పలికి ఉంటే నేనే వారికి సెల్యూట్ చేసేదాన్ని. కానీ కార్యక్రమంతో సంబంధంలేని నినాదాలు చేసి నన్ను దేశ ప్రధాని ముందే అవమానానికి గురి చేశారు. ఇలా అవమానించడమే బీజేపీ సంస్కృతి’ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో బీజేపీపై మండిపడ్డారు. బెంగాల్‌లోని పుర్సురాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆమె బీజేపీపై ఈ వ్యాఖ్యలు చేశారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా జరిగిన వేడుకల్లో ప్రధాని ఎదుట మమతా ప్రసంగించే సమయంలో కొందరు వ్యక్తులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేయగా, తాను అవమానానికి గురయ్యానంటూ మమత బెనర్జీ వేదిక నుంచి దిగిపోయిన సంగతి తెలిసిందే. అలాంటి మత నినాదాలు చేసిన వారికి బెంగాల్ సంస్కృతి తెలియదని పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓటేయాల్సిందిగా బీజేపీ కోరవచ్చని, వారి నుంచి డబ్బు తీసుకొని, ఓటు మాత్రం తృణమూల్ కాంగ్రెస్‌కు వేయాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీని బయట నుంచి వచ్చిన పార్టీగా చెబుతూ, భారత్ జలావో పార్టీగా అభివర్ణించారు. వారంతా కావాలంటే తనను అవమానించవచ్చని, కానీ బెంగాల్‌ను అవమానిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నమస్కార్ అనిగానీ, జైశ్రీరాం అనిగానీ అంటే గౌరవాన్ని చూపుతున్నారని అర్థమని చెప్పారు. ఆ నినాదం చేయాల్సిందిగా తామెవరినీ బలవంతం చేయడం లేదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. జై శ్రీరాం నినాదం చేస్తే ఎవరూ నొప్పి పుట్టినట్టు భావించాల్సిన అవసరం లేదని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. -
వైజాగ్.. ది ల్యాండ్ ఆఫ్ లవ్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరం.. సిటీ ఆఫ్ డెస్టినీ.. పర్యాటకుల స్వర్గధామంగా పేరొందిన వైజాగ్.. ప్రకృతి అందాలకు నెలవు. కనుచూపు మేర కనువిందు చేసే పచ్చని కొండలు.. నీలి సంద్రం.. మనసు దోచే సహజ అందాల కలబోత. సాగర తీర సొగసులకు ఫిదా అవ్వని వారంటూ ఎవరూ ఉండరు. అందుకే.. విశాఖ విశ్వనగరిగా మారింది. ఇప్పుడు కార్యనిర్వాహక రాజధానిగా రూపాంతరం చెందుతోంది. ఈ నేపథ్యంలో.. విశాఖ వైభవాన్ని మరింత చాటేందుకు జీవీఎంసీ కమిషనర్ జి.సృజన సోషల్ మీడియాను వేదికగా మలచుకున్నారు. అలరారే సాగరతీర అందాలతో ఉన్న ఫొటోను ట్వీట్ చేసి.. విశాఖపట్నంపై స్లోగన్స్ రాయండి... టాప్ త్రీ స్లోగన్స్‌కు ప్రశంసలు అందిస్తాం. అంటూ పోస్ట్ చేశారు. (విశాఖ విజయీభవ.. రాజధానిగా రాజముద్ర) అసలే వాహ్.. వైజాగ్ అంటూ ట్విటర్లో అత్యధికంగా పోస్టులు వస్తున్న నేపథ్యంలో కమిషనర్ పిలుపునకు విశాఖ ప్రజలతో పాటు రాష్ట్రం నలుదిశల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా.. 1084 లైక్స్‌తో పాటు 154 మంది రీట్వీట్ చేశారు. ఇక 303 మంది తమ కవి హృదయాన్ని వెల్లడిస్తూ.. విశాఖ అందాలపై షార్ట్ అండ్ స్వీట్ కవితలను ఇంగ్లిష్ హిందీ భాషల్లో పోస్ట్ చేశారు. వాటిలో కొన్ని మెచ్చుతునకలివీ... ఎస్జే బాబు– ది ల్యాండ్ ఆఫ్ లవ్.. హోప్ అండ్ డ్రీమ్స్.. ద గేట్ వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్.. వైజాగ్ పట్టణం.. ఆంధ్రుల స్వప్నాల చిహ్నం రాఘవ– విశాల మనసులున్న పట్నం.. విశాఖపట్నం సంతోష్‌బాబు ఎస్ఎస్ఎంబీ – విశాఖపట్నం.. అచీవ్ యువర్ డ్రీమ్స్ లైక్ ద సైలెంట్ వేవ్స్.. చెగువీరా– విశాఖపట్నం.. ద ప్లేస్ ఫర్ పీస్.. ద ప్లేస్ ఫర్ లవ్.. ద ప్లేస్ ఫర్ కామన్ పీపుల్ మోహన్– అమ్మ.. ఆవకాయ్.. వైజాగ్ బీచ్ ఎప్పుడూ బోర్ కొట్టవు త్రిలోక్ చంద్ర– కలలో స్వర్గానికి ఇలలో విశాఖ మార్గం.. వీరబాబు– సాగర తీరాన కార్యనిర్వాహక రాజధాని.. కృష్ణమ్మ చెంత శాసన రాజధాని.. చారిత్రక కర్నూలులో న్యాయ రాజధాని.. ప్రాంతాల మధ్య ఇక చెక్కు చెదరని అనుబంధాలకు తిరుగులేని పునాది. రవికుమార్– విశాఖ సాగరతీరం.. భారత మాతకు మణిహారం ఏఎన్వీఎల్ శ్రీకాంత్– బిల్డింగ్ ఏ బ్యూటిఫుల్ సిటీ నాట్ జస్ట్ బై బ్రిక్ బై బ్రిక్.. బట్ బై హార్ట్ బై హార్ట్.. సాయిప్రదీప్ పోలెపల్లి– సాగరతీర మెరిక.. మన విశాఖ, ప్రకృతి సౌందర్య దీపిక– మన విశాఖ, రమణీయ వీచిక.. మన విశాఖ. శశాంక్ శ్రీధరాల– ల్యాండ్ ఆఫ్ హోప్ అండ్ సిటీ ఆఫ్ డ్రీమ్స్ రైజింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్.. రైజింగ్ స్టార్ సిటీ విశాఖప ట్నం -
అమూల్యపై దేశద్రోహం కేసు
-
నిన్న అమూల్య.. నేడు ఆర్ధ్ర
కర్ణాటక, శివాజీనగర: పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అమూల్య లియోనా నినాదంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి సద్దుమణుగక ముందే మరో యువతి ఫ్రీ కశ్మీర్ అనే కరపత్రాన్ని ప్రదర్శించి ప్రజాగ్రహానికి కారణమైంది. గురువారం ఫ్రీడం పార్కులో అమూల్య వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పలు హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమానికి వచ్చిన ఆర్థ్రా అనే యువతి నిరసనకారుల వెనుక ప్లకార్డును పట్టుకుని నిలబడింది. ఆ ప్లకార్డు పోస్టర్లో ‘ముసల్మాన్, దళిత్ ట్రాన్జ్ ఆదివాసి ముక్త్’ అని రాసి ఉంది. ఆ పోస్టర్‌పై ఆందోళనకారులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిందని పలువురు శ్రీరామ సేన కార్యకర్తలు ఆరోపించారు. ఈ సమయంలోయువతిపై పలువురు దూసుకెళుతుండడంతో పోలీసులు యువతిని రక్షించి ఎస్.జే.పార్కు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీనిపై వివరణ ఇచ్చిన సెంట్రల్ విభాగపు డీసీపీ చేతన్‌సింగ్ రాథోడ్, యువతి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయలేదని, ఆమె చేతిలో ముక్తి కాశ్మీర్, ముక్తి ముస్లిం, ముక్త్ దలిత్ అనే ప్లకార్డు ఉంది. ఆ క్షణంలో యువతిపై దాడికి పలువురు యత్నించారన్నారు. ప్రస్తుతం ఆమె తమ అదుపులో ఉందని తెలిపారు. ఈ యువతి వెనుక ఎవరు ఉన్నారు. ఎక్కడ నుంచి వచ్చారనే విషయంపై తనిఖీ చేపడుతామని చేతన్ సింగ్ రాథోడ్ తెలిపారు. గురువారం జరిగిన ఘటనపై ధర్నా నిర్వాహకులైన శ్రీరామ సేనా రాష్ట్ర కార్యదర్శి హరీశ్ మాట్లాడుతూ... గుర్తుతెలియని యువతి ఎక్కడినుంచి వచ్చారని, ఎందుకు వచ్చారని తెలియదు. తమ ముందు నడచుకొంటూ వచ్చి అందరిలో చేరుకొని దేశ వ్యతిరేక నినాదాలు చేశారని ఆరోపించారు. తాము ఆమెను విచారించే సందర్భంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఆమె మానసిక అస్వస్థతకు గురైన మహిళ అంటూ తీసుకెళ్లారన్నారు. అయితే తాము ఇంతటితో వదలమని, శ్రీరామసేనా రాష్ట్రాధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్‌తో చర్చించి తదుపరి నిర్ధారణ తీసుకొంటామని తెలిపారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయటం సరికాదని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
అమూల్యకు 14 రోజుల కస్టడీ
సాక్షి బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గురువారం బెంగళూరులో జరిగిన సభలో పాక్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన యువతి అమూల్య లియోనాకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అమూల్య వ్యాఖ్యలను ఖండిస్తూ పలు హిందూ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టాయి. తన కూతురు చేసిన తప్పుకు అమూల్య తండ్రి దేశ ప్రజలకు తాను క్షమాపణలు చెప్పారు. అమూల్య బెయిల్ కోసం న్యాయ పోరాటం చేయనని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్ర జరుగుతోందని కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప ఆరోపించారు. ఆమెకు నక్సలైట్లతో సంబంధం ఉన్నట్లు తెలియవచ్చిందన్నారు. -
ఆమె నోట పాక్ పాట
నిరంతరం భారత్‌పై విషంగక్కే శత్రుదేశానికి మద్దతుగా జయధ్వానాలు. అది కూడా చారిత్రక ఫ్రీడంపార్క్‌లో వందలాది మధ్య నినాదాలు. సీఏఏ వ్యతిరేక కార్యకర్త అమూల్య లియోన్ చర్యతో ప్రశాంతత భగ్నమైంది. పోలీసులు తక్షణం ఆమెను నిర్బంధించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రంలో ఈ తరహా సంఘటనలు పెరగడం గమనార్హం. సాక్షి, బెంగళూరు: బెంగళూరు ఫ్రీడంపార్క్‌లో అపచారం చోటుచేసుకుంది. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా గురువారం సాయంత్రం జరిగిన ఆందోళనలో అమూల్య లియోన్ అనే యువతి వేదికపై పాకిస్తాన్ జిందాబాద్ అని నినదించడం సంచలనం కలిగించింది. వెంటనే అక్కడున్న పోలీసులు ఆమెను వేదిక మీద నుంచి కిందకు తీసుకొచ్చి సమీపంలోని ఉప్పారపేట పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడ నుంచి రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. అమూల్య స్వస్థలం చిక్కమగళూరు జిల్లా కొప్పా తాలూకా శివపుర గ్రామవాసిగా గుర్తించారు. అలాగే అమూల్యను ఆ కార్యక్రమానికి ఎవరు ఆహ్వానించారు.. పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాల వెనుక కారణాలేవైనా ఉన్నాయా? ఇలా వివిధ కోణాల్లో విచారణ జరుగుతోంది. సంబంధం లేదు కాగా, అమూల్యకు ఈ కార్యక్రమంతో ఎలాంటి సంబంధం లేదని నిర్వాహకుడు ఇమ్రాన్ పాషా చెప్పారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరూ వ్యాఖ్యలు చేసినా అది నేరమేనన్నారు. ఆమెకు ఆహ్వానమే పంపలేదని, ఆమె వేదికపై ఎలా మాట్లాడిందో అర్థం కాలేదని తెలిపారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కాగా, అమూల్య వ్యాఖ్యలపై నిరసన భగ్గుమంటోంది. పలు చోట్ల ఆందోళనలు జరిగాయి. అమూల్య వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం కర్ణాటక రక్షణ వేదిక నిరసన, ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే అమూల్య ఈ వ్యాఖ్యలు చేసినట్లు అంతా భావిస్తున్నారు. ఇది తాను పాల్గొనబోయే మూడో ఆందోళన, ఈ సభలో మాట్లాడబోతున్నట్లు తన ఫేస్బుక్ ఖాతాలో రాసుకొంది. మరోవైపు కొన్నిరోజుల క్రితమే హుబ్లీలో కేఎల్ఈ ఇంజనీరింగ్ కాలేజీ ముగ్గురు ముస్లిం విద్యార్థులు పాకిస్తాన్ జిందాబాద్ అని వ్యాఖ్యలు చేసి అరెస్టు అయిన విషయం తెలిసిందే. -
సీఏఏ నిరసనల్లో ‘పాక్ జిందాబాద్’ నినాదాలు
బెంగళూరు: కర్ణాటకలో జరిగిన పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు నిర్వాహకులను ఇబ్బందిపెట్టాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సమక్షంలోనే ఒక మహిళ ఈ నినాదాలు చేసింది. ‘సేవ్ కాన్స్టిట్యూషన్’ పేరుతో బెంగళూరులో గురువారం సీఏఏ వ్యతిరేక ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శనకు అసదుద్దీన్ ఓవైసీ కూడా హాజరయ్యారు. ఆయన రాగానే వేదికపైకి వచ్చిన అమూల్య లియోనా అనే మహిళ ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని నినదించడం ప్రారంభించింది. అక్కడ ఉన్న ఆందోళనకారులను కూడా తనతో పాటు నినదించమని కోరింది. నిర్వాహకులు అడ్డుకున్నా.. ఆమె ఊరుకోలేదు. ఈ లోపు ఆమె దగ్గరకు వెళ్లిన అసదుద్దీన్ ఆమె వద్ద నుంచి మైక్‌ను లాగేసుకోవడానికి ప్రయత్నించారు. చివరకు పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై దేశద్రోహం కేసు పెట్టే అవకాశముంది. కాగా, ఆ తరువాత ప్రసంగించిన అసదుద్దీన్.. ఆ మహిళతో, ఆమె అభిప్రాయాలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. నిర్వాహకులు ఆమెను ఈ కార్యక్రమానికి ఆహ్వానించకుండా ఉంటే బావుండేదన్నారు. ‘ఆమె ఇలా ప్రవర్తిస్తారని తెలిస్తే.. నేను ఈ కార్యక్రమానికి వచ్చేవాడిని కాదు. మేం భారతీయులం. శత్రుదేశం పాకిస్తాన్‌కు మద్దతిచ్చే ప్రశ్నే లేదు. భారత్‌ను కాపాడాలనేదే మా ఉద్యమం ఉద్దేశం’ అని ఓవైసీ వివరించారు. ఈ ఘటనపై బీజేపీ స్పందించింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనలన్నీ పాకిస్తాన్, కాంగ్రెస్ నేతృత్వంలోని జాతివ్యతిరేక శక్తుల మధ్య జాయింట్ వెంచర్లో భాగమని ఆరోపించింది. బెంగళూరు ఘటనను కాంగ్రెస్ కూడా ఖండించింది. -
జాతీయ నాయకులు మళ్లీ పుట్టారు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలో జాతీయ నాయకులు మళ్లీ పుట్టారు. చరిత్ర పుటలకే పరిమితమైన వారి చిత్రాలు, బోధనలు ప్లకార్డుల ద్వారా ఆందోళనలో మళ్లీ ఊపరి పోసుకున్నాయి. ముఖ్యంగా యువత వారి బోధనలను నినాదాలుగా ప్రజల్లోకి మళ్లీ తీసుకొచ్చారు. అలాంటి జాతీయ నాయకులో జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్లు ముందున్నారు. జాతి, మత, కుల భేదాలు లేకుండా ముఖ్యంగా హిందూ, ముస్లిలు కలసిమెలసి శాంతి, సామరస్యాలతో జీవించాలంటూ గాంధీ ఇచ్చిన పిలుపును గుర్తు చేస్తున్నారు. ఆయన రామ రాజ్యాన్ని కోరుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దేశ స్వాతంత్య్రానంతరం జరిగిన హిందూ, ముస్లిం అల్లర్లలో బెంగాల్లో బాధితులను పరామర్శించిన గాంధీ ‘ప్రజలు మనసు మార్చుకోవాలి’ అంటూ ఇచ్చిన పిలుపును పునరుద్ఘాటిస్తున్నారు. ఇంతకుముందు లైబ్రరీలకు, వీధి కూడళ్లకు మాత్రమే పరిమితమైన అంబేడ్కర్ ఫొటోలు నేడు యువత చేతుల్లో దర్శనమిస్తున్నాయి. ‘మన అద్భుతమైన రాజ్యాంగం’ అన్న నినాదాలు కనిపిస్తున్నాయి. రాజ్యాంగం ముందు మాటలో పేర్కొన్న ‘లౌకికవాదం’కు నిజమైన అర్థం కావాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఒక్క జాతీయ నాయకులే కాకుండా ఇటీవల ఢిల్లీలో ఓ పోలీసుల లాఠీచార్జి నుంచి తప్పించేందుకు ఓ విద్యార్థి చుట్టూ నలుగురు విద్యార్థినిలు రక్షణ కవచనంలా నిలబడి రక్షించిన ‘హీరోల’ ఫొటోలు కూడా ప్రదర్శనల్లో కనిపిస్తున్నాయి. (చదవండి: ఎవరి పౌరసత్వమూ రద్దు కాదు) -
నిర్ణయాత్మక మోదీనా? గందరగోళ విపక్షాలా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు దీటుగా భారతీయ జనతా పార్టీ సైతం ఆదివారం తన ప్రచార ఇతివృత్తాలను ప్రకటించింది. నిర్ణయాత్మక మోదీ, చిందరవందరగా ఉన్న విపక్షాల మధ్యే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ అని పేర్కొంది. కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్, బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్‌తో కలసి ఆర్థిక మంత్రి జైట్లీ పార్టీ నినాదాలు, ప్రచార వీడియోలను విడుదల చేశారు. ఒక కెప్టెన్ లేదా 11 మంది ఆటగాళ్లు, 40 మంది కెప్టెన్ల ప్రభుత్వాల్లో ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని జైట్లీ అన్నారు. తమ ప్రచార ట్యాగ్‌లైన్ అయిన ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’ మోదీ ఐదేళ్ల పాలనాకాలంలో సాధించిన విజయాలు, తీసుకున్న కీలక నిర్ణయాల చుట్టే తిరుగుతుందని చెప్పారు. పేదలు, మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా ప్రచారం చేస్తామని తెలిపారు. మధ్యతరగతిపై పన్ను భారం పెంచేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని ఆ పార్టీ సలహాదారులే అభిప్రాయపడ్డారని, కానీ గత ఐదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా పన్నులు తగ్గించిందని అన్నారు. ఈసారి కూడా మెజారిటీ ప్రభుత్వం రావాలని, 2014లో వచ్చిన మెజారిటీతో ఎన్డీయే ప్రభుత్వం అవినీతి, నల్లధన నియంత్రణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుందని గుర్తుచేశారు. పన్ను పరిధిని పెంచుతూనే మోదీ ప్రభుత్వ ద్రవ్యోల్బణాన్ని తగ్గించిందని, సంక్షేమానికి వ్యయం పెంచి సామాన్యుల పన్ను భారాన్ని తగ్గించిందని తెలిపారు. -
‘నినాదాలు చేయడం కాదు.. సైన్యంలో చేరి పోరాడండి’
ముంబై: ఇటీవల జమ్ము కశ్మీర్‌లోని బుద్గామ్‌లో ఎంఐ-17 విమానం కూలి ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో భారత వాయుసేన అధికారి నినాద్ ముందావ్‌గనే కూడా మృతిచెందారు. శుక్రవారం రోజున ఆయన మృతదేహానికి ప్రభుత్వ లాంఛానలతో నాసిక్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. నినాద్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో భారత్ మాతా కీ జై, వందేమాతరమ్, వీర జవాన్ అమర్ హై అంటూ అక్కడికి వచ్చిన ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ఈ నినాదాలపై నినాద్ భార్య విజేత ముందావ్‌గనే అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో భారత్‌కు అనుకూలంగా నినాదాలు చేసేవారికి కూడా ఆమె ఓ సూచన చేశారు. సోషల్ మీడియాలో జై భారత్, వందేమాతరమ్ వంటి నినాదాలు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. దేశభక్తి ఉండి.. దేశం ప్రజల కోసం ఎదైనా చేయాలని భావిస్తే త్రివిధ దళాలలో చేరాలని.. లేకపోతే మీ కుటుంబంలో ఎవరినో ఒకరినైనా చేర్చాలని అన్నారు. అది కూడా కుదరని పక్షంలో సమాజంలో మార్పు కోసం ప్రయత్నించాలని.. పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ, అమ్మాయిలపై వేధింపులకు పాల్పడకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఆమె సందేశం విస్తృతంగా ప్రచారంలో ఉంది. -
ఫాసిస్ట్ బీజేపీ డౌన్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్
చెన్నై: పౌర హక్కుల నేతల అరెస్టులపై వివాదం ఇంకా కొనసాగుతుండగానే తమిళనాడు తూత్తుకుడిలో మరో ఉదంతం ఆందోళన రేపింది. తమిళనాడులోని విమానాశ్రయంలో బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ను చూసి ఒక మహిళా స్కాలర్ ఫాసిస్ట్ బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిందంటూ ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం విమర్శలకు దారి దాసింది. ముఖ్యంగా తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే నేత స్టాలిన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిందన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసాయి సౌందర రాజన్ ఫిర్యాదు మేరకు కెనడాలోని మాంట్రియల్ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేస్తున్న తూతుకుడికి చెందిన సోఫియా లూయిస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ, తమిళనాడు పోలీసు చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పబ్లిక్ న్యూసెన్స్, ప్రజల అల్లర్లకు సంబంధించి అభియోగాలు మోపారు. అనంతరం ఆమెను 15రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. డీఎంకే చీఫ్ స్టాలిన్ సోఫియాకు మద్దతుగా స్పందించారు. ఫాసిస్ట్ బీజేపీ డౌన్ డౌన్ అనే మాటలను రిపీట్ చేస్తూ ట్వీట్ చేశారు. తనను కూడా అరెస్ట్ చేయాలని సవాల్ చేశారు. ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే జైల్లో పెడితే..ఎన్ని లక్షల మందిని జైల్లో పెట్టాల్సి వస్తుందో ఊహించుకోవాలని ప్రశ్నించారు. డీఎంకే నాయకులు, శ్రేణులు సోఫియాకు ఇస్తున్న మద్దతు సోషల్‌మీడియాలో వైరల్ గా మారింది. ఫాసిస్ట్ బీజేపీ డౌన్ డౌన్ హ్యాష్ ట్యాగ్ ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. పోలీసు స్టేషన్లో దాదాపు తొమ్మిది గంటల పాటు సోఫియాను నిర్బంధంలో ఉంచారని ఆమె న్యాయవాది అతీసయ కుమార్ చెప్పారు. కెనడాలో ఇలాంటివి చాలా మామూలేనని కానీ మన దేశంలో ఆ స్వేచ్ఛ లేదని పేర్కొన్నారు. తమకు ఎఫ్ఐఆర్ కాపీ అందలేదనీ, ఏ ఏ కేసులు ఉన్నాయో తమకు స్పష్టత లేదని పేర్కొన్నారు. మరోవైపు సోఫియా అక్రమ అరెస్టుకు నిరసననగా ఆమె తండ్రి బీజీపీ, తమిళనాడు పోలీసులకు వ్యతిరేకంగా మరో ఫిర్యాదును దఖలు చేశారు. ஜனநாயக விரோத - கருத்துரிமைக்கு எதிரான தமிழக அரசின் இந்த நடவடிக்கை கடும் கண்டனத்துக்குரியது! உடனடியாக அவரை விடுதலை செய்ய வேண்டும்! அப்படி சொல்பவர்களை எல்லாம் கைது செய்வீர்கள் என்றால் எத்தனை இலட்சம் பேரை சிறையில் அடைப்பீர்கள்? நானும் சொல்கின்றேன்! “பா.ஜ.க வின் பாசிச ஆட்சி ஒழிக!” https://t.co/JoPajdrSW5 — M.K.Stalin (@mkstalin) September 3, 2018 -
ఫరూఖ్ అబ్దుల్లాకు నిరసన సెగ
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీనగర్‌లోని హజరత్‌బాల్ మసీదులో ప్రార్థనలు చేస్తున్న సమ యంలో పలువురు నిరసనకారులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆగస్టు 20న దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సంస్మరణ సభ సందర్భంగా ఆయన ‘భారత్ మాతాకీ జై’అని నినా దాలు చేసిన రెండు రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం. ఆరోగ్యం సహకరించకపోవడంతో కుర్చీలోనే కూర్చుని అబ్దుల్లా ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ఘటన జరుగుతున్నా కూడా అబ్దుల్లా స్పందించకుండా అలాగే ప్రార్థనలను కొనసాగించారు. ‘ఫరూఖ్ అబ్దుల్లా తిరిగి వెళ్లిపోండి. మాకు కావాల్సింది స్వాతంత్య్రం’ అంటూ నిరసనకారుల గుంపు నినాదాలు చేసింది. అందులో కొందరు అబ్దుల్లాకు దగ్గరగా వచ్చే ప్రయత్నం చేశారు. అయితే అబ్దుల్లా అనుచరులు, రక్షక సిబ్బంది ఫరూఖ్‌కు అడ్డుగా నిలబడి వారిని నిలువరించారు. ‘కొందరు ఆందోళన చేశారు. ‘నేను ప్రార్థనా స్థలాన్ని విడిచి వెళ్లలేదు. ప్రార్థనలు పూర్తి చేసుకున్నాను. నిరసన వ్యక్తం చేసిన వారంతా నా మనుషులే. ఎవరో వారిని తప్పు దోవ పట్టించారు. వారి నాయకుడి బాధ్యతల నుంచి నేను తప్పించుకోను. ప్రతి ఒక్కరినీ సమైక్యంగా ఉంచే బాధ్యత నాపై ఉంది’ అని ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు. కశ్మీర్లో ప్రశాంతంగా బక్రీద్ కశ్మీర్ లోయలో ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకొన్నారు. మసీదుల్లో ప్రశాంతంగా సామూహిక ప్రార్థనలు చేశారు. అయితే ప్రార్థనల తర్వాత శ్రీనగర్, అనంత్‌నాగ్‌లోని జంగ్లాట్ మండీ, బారాముల్లాలోని సోపోర్ ప్రాంతాల్లో ఈద్గాల వద్ద దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలు మినహా అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా బక్రీద్ పర్వదినాన్ని ప్రజలు జరుపుకొన్నారని పోలీసులు తెలిపారు. -
చంద్రబాబుకు ప్రత్యేక హోదా సెగ
-
రాజకీయ వాడీ వేడీ
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): విశాఖపట్నం జిల్లా శంకుస్థాపనల సభలో రాజకీయ నినాదాలు హోరెత్తాయి. సీఎం చంద్రబాబు వస్తుండగా మోదీకి జైకొట్టిన బీజేపీ కార్యకర్తలు.. వారిపై టీడీపీ శ్రేణుల ఆగ్రహావేశాలు అధికారిక కార్యక్రమాన్ని అపహాస్యం చేశాయి. చివరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ‘మీరు మౌనం వహిస్తే నేనుంటాను, లేదంటే ఇక్కడ నుంచి వెళ్లిపోతాను. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను’ అంటూ బీజేపీ, టీడీపీ శ్రేణులను వారించాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. ఆంధ్రవిశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్ వేదికగా శుక్రవారం సాయంత్రం జరిగిన 7 ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమం బీజేపీ, టీడీపీ శ్రేణుల మధ్య రగులుతున్న అంతర్గత వైషమ్యాలకు వేదికగా నిలచింది. వారి మధ్య దూరాన్ని కళ్లకు కట్టినట్లు చూపింది. బీజేపీ, టీడీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో తమ పార్టీ కండువాలతో సమావేశ మందిరంలో ఆసీనులయ్యారు. ముఖ్యమంత్రి సమావేశ మందిరంలోనికి అడుగుపెడుతుండగా బీజేపీ కార్యకర్తలు మోది.. మోది అంటూ నినాదాలు చేశారు. దీనితో భిన్నుడైన ముఖ్యమంత్రి కొంత అసహనానికి గురయ్యారు. అయినప్పటికీ బీజేపీ శ్రేణులు భారత మాతాకీ జై, మోదీకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. పరిస్థితి చేయిదాటుతోందని గమనించిన గడ్కరీ స్వయంగా మైక్ అందుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇది తన శాఖ కార్యక్రమమని, తన ఆహ్వానంపై ముఖ్యమంత్రి సమావేశానికి వచ్చారని వివరించారు. సావధానంగా ఉంటే అందరి సమస్యలు తాను వింటానని, మీ ఆవేదన అర్ధం చేసుకోగలనంటూ మాట్లాడారు. దీనితో కొద్దిసేపు ఇద్దరూ శాంతించారు. నిర్వాహకులు తనకు అందించిన పుష్పగుచ్చాన్ని స్వయంగా నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రికి అందజేసి ఆహ్వానం పలికారు. ముఖ్యమంత్రి తనను నిర్వాహకులిచ్చిన పుష్పగుచ్ఛాన్ని గడ్కరీకి ఇచ్చి పరస్పరం అభినందనలు ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రసంగాల సమయంలోనూ ఆగని నినాదాలు ప్రసంగాలు జరుగుతున్నంతసేపూ టీడీపీ, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్యుగ్ధం జరిగింది. పోలవరం మోదీ వరం, మోదీ, మోదీ అంటూ బీజేపీ కార్యకర్తలు పెద్దెత్తున నినాలు చేశారు. వీరికి సమాధానం చెబుతూ చంద్రబాబు జిందాబాద్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినదించారు. హోమ్ మంత్రి చినరాజప్ప, మంత్రి అయ్యన్నపాత్రుడు మైక్ అందుకుని కార్యకర్తలకు సర్దిచెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఎంపీ హరిబాబు మాట్లాడుతున్న సమయంలో రైల్వేజోన్ విషయాన్ని కొంతమంది లేవనెత్తారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పి.రాధక్రిష్ణన్, మన్కుస్ ఎల్ మాండవీయ, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీలు పి.వి.ఎన్ మాధవ్, సోము వీర్రాజు, ఎం.వి.వి.ఎస్ మూర్తి, ఏయూ వీసీ జి.నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూరి రామకృష్ణ బాబు, విష్ణు కుమార్రాజు, పల్లా శ్రీనివాస్, వాసుపల్లి గణేష్ కుమార్, పీలా గోవింద్, పంచకర్ల రమేష్‌బాబు, బండారు సత్యనారాయణ మూర్తి, జెడ్పీ చైర్పర్సన్ లాలం భవాని తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట
సాక్షి, లింగంపేట్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ నల్లమడుగు సురేందర్ చేపట్టిన రాజీవ్ సందేశ్ యాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు సోమవారం అడ్డుకున్నారు. ఎల్లారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సొంత గ్రామంలో ఈ ఘటన జరిగింది. లింగంపేట్ మండలంలో నల్లమడుగు సురేందర్ పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా ఇందులో పాల్గొన్నారు. నిన్న రాత్రి పాదయాత్ర తాడ్వాయి మండలం ఏర్రా పహాడ్‌కు చేరుకున్నప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డగించారు. కాంగ్రెస్ నాయకులతో వాగ్వివాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థతులు తలెత్తాయి. గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కాంగ్రెస్ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక అధికార పార్టీ నేతలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. -
కుదిపేసిన బ్యాంకింగ్ స్కాంలు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనల మధ్య మలిదశ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. ఊహించినట్లే బ్యాంకింగ్ కుంభకోణాలపై విపక్షాలు ఉభయ సభల్ని స్తంభింపచేశాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంపై ప్రత్యేక చర్చ చేపట్టాలని, ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్, తృణమూల్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు లోక్‌సభ, రాజ్యసభల్లో పోడియంను చుట్టుముట్టి నినాదాలతో హోరెత్తించాయి. రిజర్వేషన్ల అంశంపై లోక్‌సభలో టీఆర్ఎస్, కావేరీ నదీ జలాల బోర్డు ఏర్పాటుపై సమాధానం చెప్పాలని పట్టుబడుతూ ఉభయ సభల్లో అన్నాడీఎంకే, డీఎంకేలు ఆందోళన కొనసాగించాయి. ప్రశ్నోత్తరాల్లేకుండానే... పీఎన్బీ కుంభకోణంపై విపక్షాల ఆందోళనలతో లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగింది. దీంతో ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టకుండానే స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక.. కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి పీఎన్బీ కుంభకోణం సూత్రధారి నీరవ్ మోదీ ఎక్కడున్నారో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా అదే అంశంపై నినాదాలు చేస్తూ కాంగ్రెస్‌కు జతకలిసింది. తెలంగాణలో ఎస్టీలు, మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ టీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్రానికే విడిచిపెట్టేలా ఆర్టికల్ 16ను సవరించాలని ఆ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు. ఉదయం లోక్‌సభ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ సభలోకి రాగానే బీజేపీ సభ్యులు చప్పట్లతో స్వాగతం పలికారు. అనంతరం అధికార, ప్రతిపక్ష సభ్యులకు మోదీ అభివాదం చేశారు. మూడు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాల విజయానికి సంకేతంగా బీజేపీ ఎంపీలు అస్సామీ గమోసా(కండువా)లతో దర్శనమిచ్చారు. నిబంధన మేరకు చర్చకు అనుమతిస్తా అటు పీఎన్బీ కుంభకోణంపై రాజ్యసభలోను ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే తృణమూల్ కాంగ్రెస్ బ్యాంకింగ్ కుంభకోణాల్ని ప్రస్తావించగా.. కావేరీ నదీ జలాల నిర్వహణ బోర్డు ఏర్పాటుపై సుప్రీం ఆదేశాల్ని అమలుచేయాలని అన్నాడీఎంకే, డీఎంకేలు పట్టుబట్టాయి. దీంతో చైర్మన్ వెంకయ్య నాయుడు సభను పదినిమిషాలు వాయిదా వేశారు. అనంతరం సమావేశమయ్యాక వెంకయ్య మాట్లాడుతూ.. పీఎన్బీ అంశంపై చర్చించాలని 267 నిబంధన కింద పలువురు సభ్యుల నుంచి నోటీసులు అందాయని తెలిపారు. పీఎన్బీ కుంభకోణం అంశం చాలా ముఖ్యమైందని.. అయితే 267 కింద కాకుండా 176 నిబంధన మేరకు చర్చకు అనుమతి స్తానని చెప్పారు. నీరవ్ మోదీని భారత్‌కు తీసుకురావాలంటూ తృణమూల్ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ మరోసారి సమావేశమైనా ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించడంతో మంగళవారానికి వాయిదా వేశారు. ప్రశ్నోత్తరాల అనంతరం చర్చ చేపట్టాలి: ప్రతిపక్షాలు బ్యాంకింగ్ స్కాంలపై మంగళవారం 4 గంటలపాటు చర్చించా లని లోక్‌సభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన జరిగిన భేటీలో తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ సభ్యులు మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12 గంటలకు చర్చను చేపట్టాలని కోరారు. అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ ఈ భేటీలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. -
తిరుమలలో బాలయ్య అభిమానుల అత్యుత్సాహం
సాక్షి, తిరుమల: తిరుమలలో సినీ నటుడు బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా నినాదాలు చేశారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన బామ్మర్ది బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆయలం వెలిపలికి వచ్చిన చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అక్కడే ఉన్న బాలకృష్ణను చూసిన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు జై బాలయ్య, జై సింహా అంటూ గట్టిగా నినాదాలు చేశారు. కార్యకర్తలు గట్టిగా అరుస్తున్నా ముఖ్యమంత్రి వారించే ప్రయత్నం చేయలేదు. తిరుమల శ్రీవారి సన్నిధానంలో శ్రీవారిని తప్ప ఇతరుల గురించి నినాదాలు చేయరాదని టీటీడీ నిబంధనలు చెబుతున్నాయి. -
ప్రభుత్వానిది డ్రామా... కాంగ్రెస్‌ది అసహనం
సాక్షి, హైదరాబాద్: పంట రుణాల మాఫీ, పంటలకు మద్దతు ధర అంశాలపై బుధవారం శాసనసభలో జరిగిన చర్చ అధికార, విపక్షాల మధ్య కాసేపు మాటల యుద్ధానికి దారి తీసింది. సభలో ప్రభుత్వం డ్రామా చేస్తోందని విపక్ష నేత జానారెడ్డి మండిపడగా కాంగ్రెస్‌లో అసహనం పెరుగుతోందని శాసనసభ వ్యవహా రాల మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రుణ మాఫీ, మద్దతు ధరపై మధ్యాహ్నం రెండు గంటలకు మొదలైన చర్చలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడు తుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆయన ప్రసంగంపై అభ్యంతరం తెలిపారు. రుణమాఫీలో వడ్డీ భారంపై చెప్పకుండా మంత్రి ఏవేవో చెబుతున్నారన్నారు. అన్ని అంశాల గురించి చెబుతామని మంత్రి చెప్పగా తాము ప్రస్తావించిన అంశాలపై నివృత్తికి అవ కాశం ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు కోరారు. మంత్రి మాట్లాడడం పూర్తయ్యాక అవకాశం ఇస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకు అంగీకరించని కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. కాంగ్రెస్ సభ్యుల తీరుపై మండిపడ్డ మంత్రి హరీశ్‌రావు... వారిలో అసహనం పెరుగు తోందని విమర్శించారు. ప్రతిపక్ష సభ్యులు సీట్లలో కూర్చుంటే అవకాశం ఇస్తామన్నారు. ఈ సమయంలో జానారెడ్డి నిల్చుని... ‘ఆయన (స్పీకర్) ఎందుకు వెళ్లారో... మీరెందుకు (డిప్యూటీ స్పీకర్) వచ్చారో మాకు తెల్సు. ఇదొక డ్రామా. ఏం జేస్తరో చూస్త. అధికార పక్షానికి ఓపిక ఉండాలె. నేను ఎవరినీ ఎప్పు డూ తిట్టను. నాకు ఆ అవసరంలేదు. రైతుల పక్షాన ప్రణమిల్లుతున్నాను’ అని వ్యాఖ్యానిం చారు. ఆపై ‘నిరసనల బహిష్కారం’ శీర్షికతో సాక్షి పత్రిక బుధవారం సంచికలో వచ్చిన ఎడిటోరియల్‌ను చదవడం మొదలుపెట్టారు. జానా తీరుపై మంత్రి హరీశ్ మండిపడ్డారు. స్పీకర్ స్థానాన్ని గౌరవించాలనే విషయాన్ని పట్టించుకోకుండా జానారెడ్డి మాట్లాడారని విమర్శించారు. స్పీకర్ స్థానంలో ఉన్న మహిళా డిప్యూటీ స్పీకర్‌ను కించపరిచారని, వెంటనే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాం డ్ చేశారు. జానా మాట్లాడుతూ తాను ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి మాట్లాడలేదని, అలాంటి దేమైనా ఉంటే తన వ్యాఖ్యలను ఉపసం హరించుకుంటున్నానన్నారు. -
బదిలీల్లో నినాదాల హోరు.:!
- కౌన్సెలింగ్‌కు అనుమతి నిరాకరించడంతో అడ్డుకున్న సంఘాలు - స్కూల్ అసిస్టెంట్ ఎల్‌పీలకు ముగిసిన కౌన్సెలింగ్ భానుగుడి(కాకినాడ): ఉపాధ్యాయ బదిలీ కౌన్సెలింగ్ మూడోరోజు నినాదాలు హోరెత్తింది. కౌన్సెలింగ్ హాల్లోకి ఉపాధ్యాయ సంఘాల నేతలను మూడోరోజు అనుమతి నిరాకరించడంతో నేతలు కౌన్సెలింగ్‌ను అడ్డుకుని కమిషనర్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉపాధ్యాయులు ఖాళీలు ఎంచుకునేప్పుడు పొరపాట్లు జరగకుండా ఉండేందుకు నేతల అనుభవం కౌన్సెలింగ్ హాల్లో అవసరమని అందుకే తాము ప్రక్రియలో పాలుపంచుకుంటున్నామన్నారు. ప్రభుత్వ అక్రమాలకు అడ్డుగా ఉన్నందున, తప్పుడు విధానాలను ప్రశ్నిస్తున్నందున తమ హక్కులను కాలరాసేందుకు, ఎన్నడూ లేని విధంగా అనుమతి నిరాకరించారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపించారు. ఇదొక చీకటి కౌన్సెలింగ్ ఉపాధ్యాయ బదిలీ కౌన్సెలింగ్‌ను సంఘాల నేతలు చీకటి కౌన్సెలింగ్‌గా పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌కు గంట ముందు మాత్రమే సినీయారిటీ జాబితాను తప్పుల తడకగా ప్రకటించి ఉపాధ్యాయులకు అవగాహన రాకుండానే మునుపెన్నడూ లేని విధంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని ఉపాధ్యాయులు విమర్శించారు. కమిషనర్ అడ్డగోలు విధానాలతో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని, తొలిరోజు పెద్దాపురం ఖాళీ అడిగితే జగ్గంపేటను బలవంతంగా కట్టబెట్టి, తరువాత వ్యక్తికి పెద్దాపురంలో ఖాళీ చూపించి ఇచ్చారని విమర్శించారు. తెలుగు భాషా పండితులకు సంబంధించి వేకెన్సీ జాబితాలో ఏజేన్సీ ఇందుకూరుపేటను సీఎస్ఈ వెబ్సైట్లో చూపించకపోవడం కారణంగా జాబితా తారుమారై ఉపాధ్యాయులు నష్టపోయారని డీఈఓకు ఉపాధ్యాయులు వినతి పత్రం సమర్పించారు. ఈ పరిణామాలతో కౌన్సెలింగ్‌ను బహిష్కరించి ఉపాధ్యాయ నేతలు గంట సమయం పాటు అడ్డుకున్నారు. ఉపాధ్యాయులను కౌన్సెలింగ్‌కు వెళ్లకుండా నివారించారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు పరచడంలో ఆటంకం కలిగించవద్దంటూ డీఈఓ ఉపాధ్యాయ సంఘాల నేతలను కోరడం, ఉపాధ్యాయులు సైతం కౌన్సెలింగ్‌ను అనుమతించాలని కోరడంతో సంఘాల నేతలు ఆందోళన విరమించారు. కార్యక్రమంలోయూటీఎఫ్ నుంచి టి.కామేశ్వరరావు, బీవీ రాఘ«వులు, వర్మ, ఎస్టీయూ నుంచి పి.సుబ్బరాజు, కేవీ శేఖర్, పీఆర్టీయూ నుంచి చింతాడ ప్రదీప్‌కుమార్, పీఏవీవీ సత్యనారాయణ, ఆపస్ నుంచి నక్కా వెంకటేశ్వరరావు, జయరాజు, వ్యాయామోపాధ్యాయ సంఘం నుంచి లంక జార్జి, ఎస్వీ రంగారావు, వై.బంగార్రాజు పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 389 మందికి కౌన్సెలింగ్ మూడోరోజు బదిలీ కౌన్సెలింగ్ ఆలస్యంగా ప్రారంభమై అర్థరాత్రి వరకు సాగింది. సోమవారం జరిగిన ఈ కౌన్సెలింగ్‌లో స్కూల్‌అసిస్టెంట్, లాంగ్వెజ్ పండిట్లకు సంబంధించి తెలుగు 185, హిందీ –194, ఉర్దూ–3, సంస్కృతం –6 ఖాళీలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆదివారం రాత్రి వర్షం కురవడంతో డీఈఓ కార్యాలయం ప్రాంగణం బురదమయంగా మారి ఉపాధ్యాయులకు తలెత్తిన చిన్నపాటి ఇబ్బందులు మినహా కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. నేడు ఎస్ఏ ఇంగ్లీష్, గణితం కౌన్సెలింగ్ నేడు ఎస్ఏ గణితం 480 ఖాళీలకు గానూ 705 మందికి, ఎస్ఏ ఇంగ్లిష్ 390 ఖాళీలకు గానూ 549 మందికి,44 ఖాళీలకు సంబంధించి 20 మంది పీడీలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 9గంటలకు కౌన్సెలింగ్ కార్యక్రమం ప్రారంభం కానుంది. నేటి కౌన్సెలింగ్‌కు డీఈఓ కార్యాలయంతో పాటు పీఆర్జీ బాలుర ఉన్నత పాఠశాలలో వేరొక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. కౌన్సెలింగ్‌ను డీఈఓ ఎస్.అబ్రహాం, ప్రత్యేకాధికారులు పర్యవేక్షించారు. -
వారిని రప్పించాల్సిందే
నాంపల్లి: ఏపీకి కేటాయించిన తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పించడంలో టీఎన్జీఓ పూర్తిగా వైఫల్యం చెందిందంటూ తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగులు, ఎన్జీఓలు సోమవారం నాంపల్లిలోని టీఎన్జీఓ కేంద్ర కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులందరినీ పావుగా వాడుకున్నారని, ఇప్పుడు అన్యాయం జరిగితే ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ టీఎన్జీఓ కార్యాలయం గేటు తాళాలు పగులగొట్టారు. వెంట తెచ్చుకున్న పెట్రోలు బాటిల్స్‌తో కార్యాలయంలోనికి చొరబడ్డారు. కార్యాలయం పైకి చేరుకుని తమకు న్యాయం చేయకపోతే ఆత్మాహుతి చేసుకుంటామని హెచ్చరించారు. టీఎన్జీఓ కేంద్ర సంఘం నేతలు వెంటనే రావాలంటూ భవనం పై నుంచి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఉదయం 6 గంటలకే అక్కడికి చేరుకొని 8.45 గంటలకు గేటు తాళాలు పగులగొట్టారు. నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నేత కె.రాజు, ధన్‌రాజ్ గౌడ్, సత్యనారాయణ, రావు, మురళిలతో పాటుగా మరో 40 మంది ఉద్యోగులు అక్కడ ఉన్నారు. కార్యాలయంలో బైఠాయించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారవుతాయంటూ ఉద్యోగులందరినీ కలుపుకుని ఉద్యమాలు చేసిన ఉద్యోగ సంఘ నేతలు ఇప్పుడెక్కడికి పోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటం చేసిన వాళ్లకు అన్యాయం జరిగితే మాకేం సంబంధం లేదంటారా అంటూ నిలదీశారు. ఏ ఒక్క ఉద్యోగికీ అన్యాయం జరగనివ్వమంటూ ప్రగల్బాలు పలికిన సీఎం కేసీఆర్ ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదంటూ నిట్టూర్చారు. ఫ్రెండ్లీ ప్రభుత్వమంటే ఇదేనా అని ప్రశ్నించారు. అక్కడికి చేరుకున్న టీఎన్జీఓ నేతలు ఆందోళనను విరమించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామి ఇస్తే తప్ప తాము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చున్నారు. నేతలతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయాన్ని ఎట్టకేలకు టీఎన్జీఓ కేంద్ర సంఘం నాయకులు రాష్ట్ర మంత్రి కేటీఆర్ దష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్ న్యాయం చేస్తానంటూ హామి ఇవ్వడంతో ఆందోళనను విరమించుకున్నారు. దసరా కానుకగా ఏపీ ఉద్యోగులను వెనక్కి రప్పిస్తామని హామీ ఇచ్చినట్లు కేంద్ర సంఘం నేతలు మీడియాకు వెల్లడించారు. అనంతరం పలు ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి మంత్రి కేటీఆర్‌ను కలిసి రెండు దఫాలుగా చర్చలు జరిపారు. త్వరలో తీసుకువస్తాం: కారం రవీందర్‌రెడ్డి ఏపీకి కేటాయించిన అనేకమంది ఉద్యోగులను ఇప్పటికే చాలామందిని రాష్ట్రానికి తీసుకువస్తామని, మిగతా 700 మందిని కూడా త్వరలో తెస్తామని టీఎన్జీఓ కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్‌రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. అంతలోనే కొందరు ఉద్యోగులు టీఎన్జీఓ కేంద్ర సంఘం కార్యాలయం ముందు ఆందోళన చేపట్టడం సరికాదన్నారు. కమలనాధన్ కమిటీ అశాస్త్రీయంగా ఉద్యోగ విభజన చేసిందన్నారు. -
ఐసిస్, పాకిస్తాన్ నినాదాలతో కాశ్మీర్లో ఉద్రిక్తత
శ్రీనగర్ః కాశ్మీర్ లో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఆర్మీ కాలనీకి వ్యతిరేకంగా యాసిస్ మాలిక్ ఆధ్వర్యంలోని వేర్పాటువాదులు ఐసిస్, పాకిస్థాన్ జెండాలను ఎగురవేసి ర్యాలీ నిర్వహించడం ఉద్రిక్తంగా మారింది. కాశ్మీర్లో ఆర్మీ, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులను వేరు చేసి, సాధారణ ప్రజలనుంచి విడిగా వారికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసేందుకు వారికోసం కాలనీలు కట్టించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వేర్పాటు వాదులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో మిర్వైజ్ ఉమా ఫరూఖ్ నాయకత్వంలో జమ్మూకాశ్మీర్ లోని కాశ్మీరీ పండిట్లు, సైనిక కాలనీలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కాశ్మీర్లో వేర్పాటు వాదులు మరోసారి ఆందోళనకు దిగారు. ప్రత్యేక కాలనీలు ఏర్పడితే తమ పట్టు సడలిపోతుందన్న భావనలో ప్రజల్లో విద్వేషాలు రేపే ప్రయత్నాలు చేస్తున్నారు. కాలనీలు నిర్మించడానికి వీల్లేదంటూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కాలనీలకు వ్యతిరేకంగా, భారత్ ను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్, ఐసిస్ లకు అనుకూలంగా జెండాలను ఊపుతూ, జీవ్ జీవ్ పాకిస్తాన్ అన్న నినాదాలతో నిరసనకారులు ర్యాలీ చేపట్టారు. ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్ళు రువ్వారు. దీంతో పోలీసులు భాష్పవాయు గోళాలను వారిపై ప్రయోగించారు. దీంతో ఆ ప్రాంతం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కాలనీల నిర్మాణానికి కావలసిన భూమిలేదంటూ పీపుల్స్ డెమొక్రెటిక్ పార్టీ అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ భారతీయ జనతాపార్టీ సైనిక, పండిట్ కాలనీల ఏర్పాటును సమర్థించడం స్థానికంగా ఆందోళనకు దారి తీసింది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం కూడ కాలనీల ఏర్పాటుకోసం శ్రీనరగ్ పుల్వామా, బడ్గమ్ జిల్లాల్లో భూమి అందుబాటులో లేదని చెప్పినట్లు పేర్కొన్నారు. సైనిక కాలనీకోసం భూమి లేనప్పుడు కాలనీల ఏర్పాటు విషయాన్ని ఎలా అంగీకరిస్తారంటూ ప్రశ్నించారు. -
మంత్రి నారాయణకు ప్రొటోకాల్ తెలియదా?
పెళ్లకూరు: ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ తదితర ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలన్న ప్రొటోకాల్ మంత్రి పి.నారాయణకు తెలియదా? అంటూ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రశ్నించారు. శుక్రవారం పెళ్లకూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన సమావేశానికి తనతో పాటు పలువురు ప్రజాప్రతినిధులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కిలివేటి, ఎంపీపీ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు గునిశెట్టి వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షుడు కట్టా బాలసుబ్రమణ్యం సభా ప్రాంగణంలో నేలమీద కూర్చొని నిరసన తెలిపారు. సభా మర్యాదలు తెలియకుండా వ్యవహరిస్తున్న అధికార పార్టీ నేతలకు కనువిప్పు కలగాలని నినాదాలు చేశారు. 10 మంది ఎంపీటీసీ సభ్యులు, 19 సర్పంచ్‌లతో పాటు జె డ్పీటీసీ సభ్యులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఉన్న ఈ ప్రాంతంలో స్థానికేతరులు పెత్తనం సాగించడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రొటోకాల్ పాటించని నాయకులు సభావేదిక ను ఎక్కి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటే వినేందుకు తామంతా సిద్ధంగా లేమని పేర్కొన్నారు. దీంతో వేదికపై ఉన్న మాజీ ఎమ్మెల్యే పరసారత్నం తన అనుచరులతో కలిసి దూరంగా వెళ్లి నిలబడిపోయారు. స్పందించిన మంత్రి నారాయణ ఎమ్మెల్యే కిలివేటికి సర్దిచెప్పి తదనంతర కార్యక్రమాలు నిర్వహించారు. -
ఉత్తరప్రదేశ్ లో నినాదాల కలకలం
మీరట్: ఓ మతానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ సర్దానా ప్రాంతంలో మళ్ళీ కలకలం సృష్టించింది. ఇప్పటికే జెఎన్ యు కేసుతో దేశం అట్టుడుకుతుండగా మీరట్ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. ఓ సంతాప సభ సమావేశం అనంతరం ఓ గ్రూప్ నకు చెందని కార్యకర్తలు ఓ మతానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాట్ రిజర్వేషన్ల ఆందోళన సందర్భంలో ముజఫర్ నగర్ సోనిపట్ లో మృతి చెందిన దళిత యువకుడు కులదీప్ మృతికి సంతాపంగా సర్దానాలో సభ ఏర్పాటు చేశారు. సభ అనంతరం కార్యకర్తలు ఓ మతానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ఆందోళనకారులు నినాదాలు చేయడంతో పాటు రోడ్లను నిర్బంధించినట్టు రూరల్ ఎస్పీ ప్రవీణ్ రంజన్ తెలిపారు. మత వ్యతిరేక నినాదాలతో ర్యాలీగా వెళ్ళిన కార్యకర్తలు స్థానిక తహశీల్దార్ కు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఆరుగురు కార్యకర్తలు మత మనోభావాలను దెబ్బతీసేవిధంగా నినాదాలు చేశారని, వారిని అరెస్ట్ చేయలేదని రూరల్ ఎస్పీ తెలిపారు. ప్రత్యేక భద్రత బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్టు చెప్పారు. -
హెచ్ సీయూలో వీసీ ఘెరావ్
♦ ముందస్తు సమాచారం లేకుండా దీక్షాస్థలికి వచ్చిన ఇన్చార్జి వీసీ ♦ ఆగ్రహించిన విద్యార్థులు.. గోబ్యాక్ అంటూ నినాదాలు సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ ఇన్చార్జి వీసీగా బాధ్యతలు చేపట్టిన శ్రీవాస్తవ ముందస్తు సమాచారం లేకుండా దీక్షా స్థలికి రావడం ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థి జేఏసీ నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుంటుండగా శ్రీవాస్తవ దీక్షాస్థలానికి వచ్చారు. ఇది తెలుసుకుని పెద్ద సంఖ్యలో విద్యార్థులు దీక్షాస్థలానికి చేరుకున్నారు. వీసీ గోబ్యాక్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇన్చార్జి వీసీ తక్షణమే బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చేవరకూ ఎవరి తోనూ మాట్లాడబోమన్నారు. దీంతో శ్రీవాస్తవ వెనుదిరిగారు. విద్యార్థుల డిమాండ్లపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించగా... అందుకే ఇక్కడికి వచ్చానని, విద్యార్థులు అనుమతించలేదని ముక్తసరిగా సమాధానం చెప్పి వెళ్లిపోయారు. ఇన్చార్జి వీసీ తప్పుకోవాల్సిందే.. తమ డిమాండ్లను నెరవేర్చకుండా, విద్యార్థులను మరింత రెచ్చగొట్టి ఉద్యమాన్ని అణచి వేసే ప్రయత్నంలో భాగంగానే శ్రీవాస్తవ దీక్షాస్థలానికి వచ్చారని విద్యార్థి నాయకులు ఆరోపించారు. ఇద్దరి ఆత్మహత్యలకు కారకుడైన విపిన్ శ్రీవాస్తవ ఎవరూ లేని సమయం చూసుకుని దీక్షాస్థలానికి రావడంలో అర్థమేమిటని విద్యార్థి నాయకురాలు అర్పిత ప్రశ్నించారు. దొంగతనంగా వచ్చి వెళ్లారని మండిపడ్డారు. ఆయనకు దైర్యం ఉంటే తప్పులను ఒప్పుకుని పదవి నుంచి వైదొలగాలని విద్యార్థి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. వర్సిటీల బంద్ విజయవంతం రోహిత్ ఆత్మహత్య అంశంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా విద్యార్థి జేఏసీ నేతలు ఇచ్చిన యూనివర్సిటీల బంద్ పిలుపు విజయవంతమైంది. ఢిల్లీలోని జేఎన్‌యూ, ఢిల్లీ వర్సిటీ, కేరళలోని కాలికట్ యూనివర్సిటీ, చెన్నై వర్సిటీ, ముంబై వర్సిటీ, రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, ఉర్దూ, మహాత్మాగాంధీ, హెచ్‌సీయూ, జేఎన్టీయూ విద్యార్థులు బంద్‌లో పాల్గొన్నారని.. అఖిల భారత స్థాయిలో బంద్ విజయవంతం అయిందని విద్యార్థి నాయకులు అర్పిత, వెంకటేశ్ చౌహాన్ తెలిపారు. అఖిల భారత విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి మొదటి వారంలో చలో ఢిల్లీ కార్యక్రమానికి విద్యార్థి నేతలు పిలుపునిచ్చారు. హెచ్‌సీయూలో బుధవారం సమావేశమైన విద్యార్థి జేఏసీ నేతలు... ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. దీంతోపాటు రోహిత్ తల్లితో కలసి వెళ్లి రాష్ట్రపతిని కలవాలని తీర్మానించారు. ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫోరం రిలే దీక్షలు.. సెలవుపై వెళ్లిన హెచ్‌సీయూ వీసీ అప్పారావును డిస్మిస్ చేయాలని, ఇన్చార్జి వీసీ శ్రీవాస్తవ తక్షణమే బాధ్యతల నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ గురువారం నుంచి ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫోరం సభ్యులు రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు హెచ్‌సీయూ అధ్యాపక బృందం ప్రకటించిం ది. గతంలో సెంథిల్ కుమార్, నేడు రోహిత్ ఆత్మహత్య కు కారణమైన శ్రీవాస్తవ వీసీగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించింది. విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా తాము దీక్షకు ఉపక్రమించినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పదవికి రాజీనామా చేసిన ప్రొఫెసర్ కృష్ణ తెలిపారు. దేశవ్యాప్తంగా ఏబీవీపీ సెమినార్లు రోహిత్ ఆత్మహత్య ఘటనపై గురువారం నుంచి దేశవ్యాప్తంగా సెమినార్లు, చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఏబీవీపీ ప్రకటించిం ది. కాలేజీలు, యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని... ఆ ఘటనకు సంబంధించి జరిగినదేమిటో, వాస్తవాలేమిటో వివరిస్తామని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినయ్ బిద్రే తెలిపారు. మరో ఏడుగురు ఆమరణ దీక్ష గురువారం నుంచి మరో ఏడుగురు విద్యార్థులు ఆమరణ దీక్ష చేయనున్నట్లు విద్యార్థి నాయకులు ప్రకటించారు. దీక్ష చేస్తున్న విద్యార్థుల్లో ఆరుగురి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మంగళవారం వారిని ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. వారితోపాటు గత నాలుగు రోజులుగా దీక్ష కొనసాగిస్తున్న పీహెచ్డీ విద్యార్థి దేవీప్రసాద్ ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం అతడిని ఆసుపత్రికి తరలించారు. ఇక విద్యార్థులకు మద్దతుగా తమిళనాడుకి చెందిన ప్రముఖ రచయిత్రి ప్రొఫెసర్ మీనా కందస్వామి బుధవారం ఒక రోజు దీక్ష చేపట్టారు. హెచ్‌సీయూ కేంద్రంగా ఎగిసిపడిన ఉద్యమం వివక్షకు వ్యతిరేకంగా జరిగే దేశవ్యాప్త ఉద్యమానికి దోహదపడనుందని ఆమె తెలిపారు. వివక్షకు గురవుతున్నది కేవలం విద్యార్థులే కాదని, దళిత ప్రొఫెసర్లు సైతం వివక్ష ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. -
గాంధీ విగ్రహం ధ్వంసం, ఐసిస్ నినాదాలు
జైపూర్: రాజస్తాన్‌లో జాతిపిత మహాత్మాగాంధీకి అవమానం జరిగింది. డుడు లోని ఆయన విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. అహింసకు మారుపేరుగా మారిన గాంధీ విగ్రహంలోని ముఖం, తల భాగాలను చెడగొట్టారు. అనంతరం విగ్రహానికి ముందు, వెనుక భాగాల్లో 'ఐసిస్ జిందాబాద్ ' అని నినాదాలు రాయడం కలకలం రేపింది. జనవరి 26 గణతంత్ర దినోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో ఈ చర్య ఉద్రిక్తతను రాజేసింది. కాగా హింసకు వ్యతిరేకంగా అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహాత్ముడి పట్ల దుండగుల చర్యపై పలువురు మండిపడుతున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. -
కాశ్మీర్లో పాక్ వ్యతిరేక నినాదాలు
-
వారి తీరును టీవీల్లో చూపండి!
విపక్ష సభ్యులు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు * లోక్‌సభను అడ్డుకుంటున్న సభ్యులపై స్పీకర్ కన్నెర్ర న్యూఢిల్లీ: నిరసనలు, నినాదాలు, ప్లకార్డులతో సభలో గందరగోళం సృష్టిస్తూ, సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న విపక్ష సభ్యులపై మంగళవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మండిపడ్డారు. వారి వైఖరి ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనన్నారు.నిరసనలకు పాల్పడుతున్న 40, 50 మంది ప్రతిపక్ష సభ్యులు సభలోని 440 మంది ఇతర సభ్యుల హక్కులను హైజాక్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, స్పీకర్ పోడియం వద్ద కెమెరాలకు కనిపించేలా వరకు ప్లకార్డులను ఎత్తి పట్టుకోవడంపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే. నేను సభను వాయిదా వేయను. లోక్‌సభ టీవీని కోరుతున్నా. టీవీలో కనిపించాలన్న కోరిక నాకు లేదు. టీవీల్లో వారిని కనిపించనివ్వండి. సభలో వారి తీరు ఎలా ఉందో ప్రజలను చూడనివ్వండి. వారి బాధ్యతారాహిత్యాన్ని దేశమంతా చూడాలి’ అంటూ నిప్పులు చెరిగారు. విపక్ష సభ్యుల తీరుపై అంతకుముందు మంత్రి వెంకయ్య నాయుడు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘సభను కేవలం 20 మంది సభ్యులు తమ అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలనుకుంటున్నారా?’ అంటూ మండిపడ్డారు. యథావిధిగా.. లలిత్ మోదీ వ్యవహారంలో విదేశాంగమంత్రి సుష్మ, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే, వ్యాపమ్ స్కామ్‌కు సంబంధించి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్లు రాజీనామా చేయాలనే డిమాండ్‌తో విపక్షాలు కార్యక్రమాలను మంగళవారమూ అడ్డుకున్నాయి. కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులతో వెల్‌లో నిరసన తెలిపారు. తమ వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడంతో వారు నిరసనలను తీవ్రం చేశారు. డిప్యూటీ స్పీకర్ తంబిదురై సభాపతి స్థానంలో ఉన్న సమయంలో.. వారు తమ చేతిలోని కాగితాలను చింపి, ఆయనపై విసిరారు. దాంతో తొలుత రెండు సార్లు వాయిదా పడిన సభ, పరిస్థితిలో మార్పు రాకపోవడంతో బుధవారానికి వాయిదా పడింది. కాగితాలు విసరడం క్షమార్హం కాదని సుమిత్ర మండిపడ్డారు. -
సారా అమ్మకాలపై సమరభేరి
ఆమనగల్లు (మహబూబ్‌నగర్ జిల్లా): ఆమనగల్లు మండలం కడ్తాల గ్రామంలో అక్రమ సారా అమ్మకాలను నిషేధించాలని డిమాండ్ చేస్తూ, యువజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున్న ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సారాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, యువజన సంఘాలతో పాటు విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. సారా, బెల్ట్‌షాపుల నిర్వాహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఊరేగింపు చేపట్టారు. శ్రీశైలం-హైద్రాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన సంఘాల ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ, గ్రామంలో నాటుసారా సేవించి ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయని, గ్రామంలో నాటు సారా అమ్మకందారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సారా మహమ్మారి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు ఏర్రోళ్ల రాఘవేందర్, ఎమ్మార్పీఎస్ నాయకులు మంకి శ్రీను, అంజి, రాఘవేందర్, నాయకులు మహేశ్, రమేశ్, వినోద్, బిక్షపతి, రాము, రాజు,శీరీషా,మనీషా తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రా జడ్జి గో బ్యాక్
మంచిర్యాల టౌన్ : ఆంధ్రా జడ్జి గో బ్యాక్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో మంచిర్యాల కోర్టు మారుమోగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కో ర్టులో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ప్ర త్యేక తెలంగాణ హైకోర్టు కోసం మంగళవారం సు ప్రీం కోర్టులో విచారణకు రానుండటంతో మద్దతుగా మంచిర్యాల బార్ అసోసియేషన్ న్యాయవాదులు ని రాహార దీక్షకు దిగారు. న్యాయవాదులు నిరాహార దీ క్షలో ఉండగా కోర్టులోని న్యాయమూర్తులు కేసు విచారణలు చేపడుతుండటంతో న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టులోకి దూసుకెళ్లారు. అయి నా.. కేసుల విచారణ కొనసాగుతుండటంతో న్యాయవాదులు కోర్టు గదులకు తాళాలు వేశారు. న్యాయమూర్తులు ఏఎస్పీ ఎస్.ఎం.విజయ్‌కుమార్‌కు సమాచారం తెలియజేయడంతో పోలీసులు కోర్టుకు వచ్చా రు. అయితే.. కేసుల విచారణ సాగేది లేదని ఆందోళన చేపట్టగా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. న్యాయమూర్తుల విధులకు ఆటంకం కలిగించకుండా పోలీసులు కక్షిదారులను, సాక్షులను న్యాయస్థానంలోకి పంపుతున్న క్ర మంలో ఎస్సై వెంకటేశ్వర్లుకు, న్యాయవాదులకు మ ధ్య తోపులాట జరిగింది. తోపులాటలో ఎస్సై వెంకటేశ్వర్లును న్యాయవాదులు కిందకు తోసేయగా చేతి వాటం కూడా చోటుచేసుకుంది. పోలీసులు మంచి ర్యాల ఏఎస్పీ విజయ్‌కుమార్‌కు సమాచారం అందించడంతో కోర్టుకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. న్యాయవాదులను బయటకు పంపించి కేసుల విచారణ కొనసాగేలా చేశారు. మరింత ఆగ్రహించిన న్యా యవాదులు ‘ఆంధ్రా జడ్జి గో బ్యాక్, న్యాయవాదుల నిరసనను అడ్డుకున్న ఆంధ్రా ఎస్సై గో బ్యాక్’ అం టూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. కేసులు విచారణ జరుగుతుండటంతో మరోసారి మద్దతుదారులగా వచ్చిన ఇతర ప్రాంతాల బార్ అ సోసియేషన్ న్యాయవాదులు ఒక్కసారిగా న్యాయస్థానంలోకి దూసుకెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. మంచిర్యాల కోర్టులో పనిచేస్తున్న ఆంధ్రప్రాంతానికి చెందిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అహంకార పూరిత, తెలంగాణ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరోమారు రిలే నిరాహార దీక్షలకు దిగారు. ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిలు న్యాయవాదులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని రిలే నిరాహార దీక్షలు కొనసాగించేలా తీర్మానించారు. కాగా న్యాయమూర్తులు విధులు ముగిసిన అనంతరం భారీ పోలీస్ బందోబస్తు మధ్య బయటకు వెళ్లిపోయారు. ఏఎస్పీ ఆధ్వర్యంలో సీఐలు సురేశ్, వేణుచందర్, ప్రవీణ్‌కుమార్‌తోపాటు మంచిర్యాల సబ్‌డివిజన్‌లోని ఎస్సైలు, బెల్లంపల్లి రిజర్వ్ పోలీస్‌లు, సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన న్యాయవాదులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. రిలే దీక్షలో కూర్చున్న న్యాయవాదులు... న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలో న్యాయవాదు లు కర్రె లచ్చన్న, పి.నారాయణ, ఆర్.లక్ష్మణ్, దేవి నవీన్శ్రీనివాస్, శరత్‌బాబు, బి.శ్రీరాములు, సరేందర్ఉపాధ్యాయ, జెల్ల రాజయ్య, పి.అశోక్, సునీల్, పూదరి రమేశ్, దేవి శ్రీధర్, ఎన్.లక్ష్మీరాజం, ఎ.శ్రీనివాస్ కూర్చున్నారు. వీరికి మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మున్సిపల్ చైర్ పర్సన్ మామిడిశెట్టి వసుంధర, వైస్ చైర్మన్ నల్ల శంకర్, ఎంపీపీ బేర సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు గోనె శ్యాంసుందర్‌రావు. ముల్కల్ల మల్లారెడ్డి, పీవోడబ్ల్యూ జిల్లా నాయకురాలు అందె మంగ తదితరులు దీక్షలకు సంఘీభావం తెలిపారు. కాగా.. మంచిర్యాల కోర్టులో తలెత్తిన సంఘటనపై వివిధ జిల్లాల నుంచి న్యాయవాద సంఘాలు పెద్ద ఎత్తున తరలివచ్చారుు. నిజామాబా ద్, కరీంనగర్, జగిత్యాల, సుల్తానాబాద్, గోదావరి ఖని, మంథని, ఆదిలాబాద్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, చెన్నూర్ కోర్టులకు చెందిన బార్ అసోసియేషన్ న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. -
పేదింటి పిల్లల పెద్ద విజయం!
వీధుల్లో విద్యార్థులు ఊరేగింపుగా వెళ్లడం ఆ గ్రామప్రజలకు కొత్తేమీ కాదు. ‘భారత్‌మాతాకు జై’ ‘జై జవాన్ జై కిసాన్’ ఇలా ఎప్పుడూ వినవచ్చే నినాదాలు కాకుండా ఎప్పుడూ వినబడని నినాదాలు వినిపించాయి. దీంతో ఆ గ్రామస్థులకు ఆసక్తి పెరిగింది. ‘చదువుకునే హక్కు మాకు ఉంది. చదువు చెప్పేవారు మాత్రం లేరు’... ఈ తరహా నినాదాల నేపథ్యంలో ‘టీచర్లు కావాలంటున్నారు. మరి ఇప్పుడు స్కూల్లో ఎలా చదువుకుంటున్నారు?’ అనే సందేహం రావచ్చు. ఈ సందేహనివృత్తి కోసం మనం రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న భిమ్ అనే ఆ ఊరికి వెళ్ళొద్దాం... భిమ్లో ఉన్న గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్లో మొత్తం 700 మంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు. ఉపాధ్యాయులు మాత్రం ముగ్గురే! ఇక ప్రిన్సిపల్ పోస్ట్ ఎనిమిది ఏళ్లుగా ఖాళీగా ఉంది. మొత్తం 11 ఫస్ట్ గ్రేడ్ టీచర్ పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితి గురించి తెలిసి కూడా తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ స్కూల్లో ఎలా చదివిస్తున్నారు? ‘‘ప్రైవేట్ స్కూల్లో చదివించే స్తోమత ఉంటే అక్కడెందుకు చదివిస్తాం?!’’ అంటారు చాలామంది. అదనపు ఉపాధ్యాయుల నియామకం కోసం పెద్దవాళ్లు చేసిన ప్రయత్నాలను దగ్గరి నుంచి గమనించిన పిల్లలు తమ కోసం తామే ఉద్యమించాలనుకున్నారు. దానికి ‘గాంధీజయంతి’ని ముహూర్తంగా పెట్టుకున్నారు. గాంధీ జయంతి రోజున స్కూలు గేటుకు తాళం వేసి, బ్యానర్లు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు పిల్లలు. ఆ తరువాత బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్ ముందు ఎండలో ధర్నాకు కూర్చున్నారు. అక్టోబర్ 7లోపు కొత్త ఉపాధ్యాయుల నియామకం జరగకపోతే స్కూల్‌కు తాళం వేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయుల నియామకం జరగకపోవడంతో అక్టోబర్ 8న స్కూలు గేటుకు తాళం వేసి విద్యార్థులందరూ బయటకి వచ్చారు. పిల్లల ధర్నా విషయం కలెక్టర్ కార్యాలయం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, సీయం కార్యాలయాలకు చేరింది. కదలిక మొదలైంది. ఒకేరోజు...నలుగురు టీచర్ల నియామకం జరిగింది. మరుసటి రోజు ఏడుగురు ఉపాధ్యాయులూ స్కూలుకొచ్చారు. అయితే ఈ సత్యాగ్రహం ఇక్కడితో ఆగలేదు. పొరుగున ఉన్న ఊళ్లలో కూడా భీమ్ తరహా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఫలితం ఇంకా రాలేదు. వస్తుందనే నమ్మకం మాత్రం వారిలో చాలా గట్టిగా ఉంది. దీనికి కారణం భిమ్ పిల్లల సత్యాగ్రహ విజయమే! -
మళ్లీ తెరపైకి భీమ్రావ్ బాడా వివాదం
మంత్రి కాన్యాయ్‌ను అడ్డుకున్న బస్తీవాసులు సమస్యపై భిన్నస్వరాలు విన్పించిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి ఈటెల నాంపల్లి: గతంలో హామీ ఇచ్చిన మేరకు భీమ్రావ్బాడా బస్తీవాసులకు న్యాయం చేయాలని కోరుతూ స్థానికులు గురువారం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. నాంపల్లిలోని గృహకల్ప ప్రాంగణంలో ఓ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి ఈటెల, డిప్యూటీ సీఎం వస్తున్నారని తెలుసుకున్న బస్తీ వాసులు సాయంత్రం 4 గంటలకు అక్కడికి చేరుకున్నారు. సమావేశం ముగియగానే మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి ఈటెల బస్తీవాసుల వద్దకు వచ్చి మాట్లాడారు. గతంలో బస్తీని ఖాళీ చేయించిన సమయంలో టీఆర్ఎస్ తరపున మీరే హాజరయ్యారని, బాధితులకు భరోసా ఇచ్చారని, ఈ మేరకు ఇప్పుడు అధికారంలో ఉన్నందున న్యాయం చేయాలని బస్తీవాసులు మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన ఈటెల.. బస్తీ వాసులకు న్యాయం చేసేందుకు టీఆర్ఎస్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. దీంతో బస్తీవాసులు శాంతించి మంత్రికి జిందాబాద్‌లు కొట్టారు. డిప్యూటీ సీఎం వర్సెస్ మంత్రి భీమ్రావ్ బాడా వివాదం గురువారం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి ఈటెల రాజేందర్ల మధ్య వాగ్వివాదానికి దారితీసింది. బస్తీవాసుల ముందే ఈఅంశంపై ఇరువురు భిన్నస్వరాలు విన్పించారు. భీమ్రావ్ బాడాలో పేదలకు ఇళ్లను నిర్మించాలని ఈటె ల రాజేందర్ రెవెన్యూ మంత్రి కూడా అయిన మహమూద్ అలీని కోరారు. అయితే ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్న స్థలంలో పేదలకు ఇళ్లు ఎలా ఇస్తారంటూ ఆయన ప్రశ్నించారు. దీనిపై ఈటెల మాట్లాడుతూ ముఖ్యమైన ప్రాంతాల్లో పేదలు ఉండకూడదనడం సబబుకాదన్నారు. ఈ దశలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ జోక్యం చేసుకుని వాదనలకు తెరదించారు. కాగా బస్తీ వివాదంపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరో రెండు నెలలు సమయం ఇస్తున్నామని, న్యాయం చేయకుంటే ఉద్యమిస్తామని గంగపుత్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.కొమురయ్య హెచ్చరించారు. -
సీఎంలు వద్దు, పీఎంలు వద్దు.. తాగడానికి మంచినీళ్లు కావాలి
-
దద్దరిల్లిన అసెంబ్లీ
జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాల హోరు జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలతో అసెంబ్లీ దద్దరిల్లింది. శుక్రవారం ఉదయం పది గంటలకు సభ ప్రారంభం కావడానికి ముందుగానే వివిధ పార్టీల సభ్యులు పోడియంలోకి వెళ్లి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేయడం ప్రారంభించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర కోసం నినాదాలు చేయగా, టీఆర్ఎస్, టీడీపీ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. అంతలోనే అధికార పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు కూడా ప్లకార్డులు పట్టుకుని పోడియంలోకి దూసుకొచ్చారు. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని నినాదాలు చేశారు. వివిధ పార్టీలు వాయిదా తీర్మానాలను ఇచ్చాయని, వాటి గురించి వివరిస్తానని సభ్యులంతా తమతమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ పదేపదే విజ్ఞప్తి చేశారు. అయినా సభ్యులు నినాదాలు కొనసాగించారు. గందరగోళం కొనసాగుతుండగానే స్పీకర్.. వివిధ పార్టీల వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించి సభను అరగంట వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో స్పీకర్ సభను రెండోసారి వాయిదా వేశారు. మధ్యాహ్నం 1.45 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత కూడా గందరగోళం కొనసాగింది. దీంతో సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క.. సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో బిల్లుల పత్రాలు సభలో ప్రవేశపెట్టినట్లు భావించాలంటూ, సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ‘జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర’ నినాదాలతో శుక్రవారం శాసనమండలి హోరెత్తింది. సభ్యులు పార్టీలకతీతంగా ప్రాంతాలవారీగా విడిపోయి ఆందోళనకు దిగటంతో మండలి సోమవారానికి వాయిదా పడింది. -
హ్యూమరం: కైసే బనేగా ప్రధాని?
ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం హడావుడిగా ఉంది. నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ మైక్ తీసుకుని, ‘‘మిత్రులారా! ఇప్పుడు కౌన్ బనేగా ప్రధాని కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. పురాతన సంస్కృతిని మనం అభిమానిస్తాం కాబట్టి, మొదట ఏనుగుకి పూలమాల ఇచ్చి అది ఎవరి మెడలో వేస్తే వారినే ప్రధానిని చేద్దాం’’ అన్నాడు. మాలతో గజం ప్రవేశించింది. అందరి మెడలు నిక్కబొడుచుకున్నాయి. ఏనుగు కాసేపు ఆలోచించి, అటూ ఇటూ తిరిగింది. ‘గజరాజు జిందాబాద్’ అని అందరూ కేకలు పెట్టారు. తనకేదో అపాయం జరుగుతుందని భయపడి ఏనుగు ఘీంకరిస్తూ పారిపోయింది. ‘‘గజం మిథ్య, పలాయనం మిథ్య. ఇదంతా కాంగ్రెస్ కుట్ర. ఏనుగు పారిపోయినంత మాత్రాన ప్రజలు పారిపోరు. ప్రజాస్వామ్యం పారిపోదు. ఎలక్షన్, సెలక్షన్ వల్లే పార్టీ రిసరెక్షన్. మా నిర్ణయానికి లేదు కరెక్షన్. కాంగ్రెస్ సొత్తు కరప్షన్. ప్రజలకు మేము తప్ప లేదు మరో ఆప్షన్’’ అన్నాడు వెంకయ్యనాయుడు. రాజ్‌నాథ్‌సింగ్ లేచి, ‘‘మన దేశంలో గోచీ లేకపోయినా ప్రతివాడి దగ్గర సెల్‌ఫోన్ ఉంటుంది. ఎస్ఎంఎస్ల ద్వారా ఓటింగ్ పెడతాం. ప్రధానిగా ఎవరు ఉండాలో ఎస్.ఎం.ఎస్. పంపండి’’ అన్నాడు. సుష్మా స్వరాజ్ మైక్ తీసుకుని, ‘‘ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే మాట్లాడే హక్కు ఉంటుంది. ప్రధానికి ఎంత మాత్రం ఉండదని మన్మోహన్సింగ్ రుజువు చేశారు. పీఎం అంటే పర్ఫెక్ట్లీ మైమ్ అని అర్థం. అందుకే ఆయన సైగలు చేస్తారు తప్ప మాట్లాడరు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఈ మెయిల్ పంపి ప్రధానిని సెలక్ట్ చేయండి’’ అంది. బండారు దత్తాత్రేయ ఉత్సాహంగా లేచి, ‘‘కార్డులు రాయడంలో నేను రికార్డు. ఉత్తరానికి మించిన ప్రజాపత్రం లేదు. లెటరే బెటర్. అందువల్ల పోస్ట్ ద్వారా ప్రధాని పోస్టుని ఎంచుకోండి’’ అన్నాడు. గడ్కరి లేచి, ‘‘ఫేస్ వాల్యూ తెలుసుకోవాలంటే ఫేస్‌బుక్‌ని మించింది లేదు. సోషల్ నెట్వర్క్ ద్వారా పార్టీ నెట్వర్క్ తెలుసుకుందాం’’ అన్నాడు. అటుగా వెళుతున్న ఒక సామాన్యుడికి ఈ హడావుడి చూసి అనుమానమొచ్చి, ‘‘ఏం జరుగుతోంది ఇక్కడ?’’ అని అడిగాడు. ‘‘ప్రధాని ఎవరుండాలనే విషయంపై పోటీ’’ అని చెప్పాడో కార్యకర్త. ‘‘ఎన్నికలు ఇంకా రాలేదు కదా!’’ అనుమానంగా అడిగాడు సామాన్యుడు. ‘‘ఎన్నికలు వస్తే మా పార్టీ గెలిస్తే మాకు మద్దతిచ్చే పార్టీలు గెలిస్తే అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడే క్లారిఫికేషన్.’’ ‘‘నిచ్చెనలు వేసి వేసి కింద నేల లేకుండా చేసుకున్నారు. ఆలూ చూలూ లేకుండా కొడుకు పేరు సోమలింగమంటే ఇదే!’’ అని గొణుక్కుంటూ సామాన్యుడు వెళ్లిపోయాడు. - జి.ఆర్.మహర్షి మహర్షిజం రాజకీయమంటే ఎలుకల కళాశాలకు పిల్లిని ప్రిన్సిపాల్‌గా నియమించడం రుద్రాక్ష మాలల్ని పులి అమ్మడం నీతిచంద్రిక పుస్తకాన్ని నక్క రాయడం కప్పల సమూహానికి పాముతో ఉపదేశాలు వినిపించడం భవిష్యత్తు అద్భుతమని... బలికి వెళ్లే గొర్రెని నమ్మించడం హింస మానాలని సింహం సత్యాగ్రహం చేయడం నిజాయితీ గురించి తోడేలు తొడగొట్టడం -
వాన జోరు.. ఉద్యమ హోరు
ఎక్కడ చూసినా వినూత్న ఉద్యమాలతో మెరుపులు మెరుస్తున్నాయి. జై సమైక్యాంధ్ర నినాదాలు పిడుగులై గర్జిస్తున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయంపై జనం భగ్గుమనడంతో వాతావరణం వేడెక్కిపోతోంది. ఉద్యమ మెరుపులు.. నినాదాల పిడుగుల్ని చూసిన వరుణుడు ఉలిక్కిపడ్డాడు. మేఘాలు లేకపోయినా ‘పశ్చిమ’పై జలధారలు కురిపించాడు. అయినా వేడి తగ్గలేదు. జనం చలించలేదు. జోరు వానలోనూ రోడ్లపైనే నిలబడి సమైక్యాంధ్ర పరిరక్షణ పోరును ముందుకు నడిపించారు. ధర్నాలు, ర్యాలీలు, దీక్షలు, వివిధరూపాల్లో వినూత్న ప్రదర్శనలు 28వ రోజైన మంగళవారం కూడా పెద్దఎత్తున సాగాయి. ఏలూరు/ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంలో భాగంగా జిల్లాలో బంద్‌లు, ధర్నాలు, రాస్తారోకోలతోపాటు వినూత్న పద్ధతుల్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన ప్రకటనను వెనక్కి తీసుకునే వరకు పోరాటాన్ని విరమించేది లేదని అధికార, ఉద్యోగ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యార్థులు ర్యాలీలు, వినూత్న ప్రదర్శనలు, దేశ నాయకుల వేషధారణలు, విభిన్న ప్రదర్శనలతో ఉద్యమానికి వన్నె తెస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో రెవెన్యూ ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టులు రిలే దీక్షలో పాల్గొన్నారు. వారికి డీఆర్వో కె.ప్రభాకర్‌రావు, ఆర్డీవో కె.నాగేశ్వరరావు సంఘీభావం ప్రకటించారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా జెడ్పీ కార్యాలయం వద్ద పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి.శ్రీధర్‌రాజు ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. మహిళా కండక్టర్ల దీక్ష రెండో రోజుకు చేరింది. నగరంలో విద్య, వ్యవసాయ, పంచాయతీరాజ్, ఆడిట్, ట్రెజరీ శాఖల ఉద్యోగులు, సంక్షేమ వసతి గృహాల అధికారులు, డీఆర్డీఏ, ఐకేపీ ఉద్యోగులు, ప్రైవేటు విద్యాసంస్థలు, సర్వేయర్ల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నడి రోడ్డుపై దుస్తులు కుట్టి.. తాడేపల్లిగూడెంలో మహిళా దర్జీలు రోడ్డుపై దుస్తులు కుట్టి నిరసన తెలిపారు. భీమవరం డీఎన్నార్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో జోరు వానలో వేలాది విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఎస్ఆర్కేఆర్ విద్యార్థులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉండిలో ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజు మోకాళ్లపై నడిచారు. తణుకు, పాలకొల్లు, నరసాపురం, జంగారెడ్డిగూడెం, అత్తిలి, బుట్టాయగూడెం, భీమడోలు, ఆకివీడులలో బంద్ విజయవంతమైంది. ఆటోలను కూడా తిరగనివ్వలేదు. చంటిబిడ్డలతో రిలే దీక్షల్లో... జంగారెడ్డిగూడెంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మహిళలు చంటిబిడ్డలతో రిలే దీక్షల్లో పాల్గొన్నారు. బోసుబొమ్మ సెంటర్లో కళాకారుడు ఎల్ఆర్ కృష్ణబాబు ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర గీతాల ఆలాపన ఉద్యమకారుల్లో చైతన్యం నింపింది. విద్యార్థి నిరవధిక నిరాహార దీక్ష.. నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ ఫైనలియర్ విద్యార్థి పాలకొల్లుకు చెందిన శెట్టి దుర్గాసతీష్ పాలకొల్లులో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాడు. గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సబితా జూనియర్ బాలికల కళాశాలలో కవు లు, రచయితలు, కళాకారుల సదస్సు నిర్వహించారు. కొవ్వూరులో ముస్లింలు రిలే దీక్షలో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో... సీమాంధ్ర ప్రజలు, రైతులు నష్టపోతున్నా.. విద్యార్థుల భవిష్యత్ అంధకారంగా మారే ప్రమాదం ఉందని తెలిసినా కాంగ్రెస్, దానికి కొమ్ముకాస్తున్న టీడీపీ స్పందించకపోవడం దారుణమని వైఎస్సార్ సీపీ దెందులూరు నియోజకవర్గ సమన్వకర్త చలుమోలు అశోక్‌గౌడ్ విమర్శించారు. కలపర్రు వద్ద జాతీయ రహదారిపై పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్లజెండాలు పట్టుకుని రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. తణుకులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బం ధం చేశారు. దొమ్మేరులో రాష్ట్ర ఎంపీటీసీల సం ఘం మాజీ అధ్యక్షుడు ముదునూరి నాగరాజు దీక్ష చేపట్టారు. మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు సంఘీభావం తెలిపారు. పాలకొ ల్లులో మాజీ ఎంపీ చేగొండి హరరామ జోగయ్య దీక్ష చేశారు. గోపాలపురంలో మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత, ద్వారకాతిరుమలలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరారుు. వారి ఆరోగ్యం క్షీణించింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం సమన్వయకర్త తోట గోపి ఆధ్వర్యంలో సంఘీ భావ దీక్షలు కొనసాగుతున్నారుు. మాజీ ఎమ్మె ల్యే గ్రంధి శ్రీనివాస్ నాయకత్వాన భీమవ రంలో జాతీయ రహదారిపై వర్షంలోనూ రాస్తారోకో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో ఉండి, ఆకివీ డులలో రిలే దీక్షలు నిర్వహించారు. ఉండి దీక్షా శిబిరంలో పాస్టర్స్ ఫెలోషిప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడిది జాన్సన్ పాల్గొన్నారు. దేవరపల్లి మండలం దుద్దుకూరు నుంచి యర్నగూడెం వద్ద సింగమ్మతల్లి ఆలయానికి వైఎస్సార్ సీపీ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. కొవ్వూరు బస్టాండ్, కొవ్వూరు మెరక వీధిలో రిలే దీక్షలు కొనసాగాయి. -
శైలజానాథ్‌కు సమైక్యసెగ
టీడీపీ ఎమ్మెల్యేలు కేశవ్, అశోక్‌లనూ నిలదీసిన ఉద్యమకారులు సాక్షి నెట్వర్క్: అనంతపురంలో మంత్రి సాకే శైలజానాథ్‌కు సమైక్యసెగ తగిలింది. పీఆర్‌ఉద్యోగ సంఘాల జేఏసీ, మునిసిపల్ ఉద్యోగుల జేఏసీ నేతలు ‘గోబ్యాక్ శైలజానాథ్’ అంటూ నినాదాలు చేశారు. బహిరంగసభలో ప్రసంగిస్తున్న సమయంలోనూ ‘శైలజానాథ్ డౌన్ డౌన్.. సమైక్యాంధ్ర వర్ధిల్లాలి’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇదే జిల్లా కళ్యాణదుర్గంలో జేఏసీ నేతలు చేపట్టిన రిలేదీక్షలకు ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సంఘీభావం తెలపడానికి వెళ్లగా.. ‘గో బ్యాక్’ అంటూ నిరసన వ్యక్తం చేశారు. విజయనగరం పట్టణంలోని కోట జంక్షన్ వద్ద రిలే దీక్షలు చేపడుతున్న ఉపాధ్యాయులకు సంఘీభావం ప్రకటించేందుకు టీడీపీ ఎమ్మెల్యే అశోక గజపతిరాజు వెళ్లగా, ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. -
ఒకే జాతి.. ఒక్కటే రాష్ట్రం
ఒకే జాతి.. ఒక్కటే రాష్ట్రం అనే నినాదంతో వెల్లువెత్తిన సమైక్యాంధ్ర పరిరక్షణ పోరాటం ఇసుమంతైనా సడలకుండా జోరుగా సాగుతోంది. 24రోజుల కిందట సీమాంధ్రలో ఎగసిన సమైక్యఉద్యమం రోజురోజుకూ బలపడుతూ తీవ్రతరమవుతోంది. సకలజనుల సమ్మెతో జీవనం స్తంభిస్తున్నా ప్రజలు ఏమాత్రం లెక్కచేయక సమైక్యమే లక్ష్యంగా ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. రాజకీయపార్టీలు, కులాలు, వర్గాలకతీతంగా జనం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి వినూత్నరీతిల్లో సమైక్యభావనను ప్రకటిస్తున్నారు. - సాక్షి నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్‌ను యథాతథంగా ఉండాలనే డిమాండ్‌తో రోజూ మాదిరిగానే శుక్రవారం కూడా కోస్తా, రాయలసీమ జిల్లాలు ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసన ప్రదర్శనలతో దద్దరిల్లాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించటానికి ఈ నెల 27న సీమాంధ్రలోని 13 జిల్లాల విద్యార్థి జేఏసీ నేతలు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోసమావే శం కానున్నారు. తాడేపల్లిగూడెంలో 72 గంటల బంద్‌లో భాగంగా రెండో రోజు శుక్రవారం బంద్ సంపూర్ణంగా సాగింది. విద్యుత్ ఉద్యోగులు బైక్ ర్యాలీ చేసి ఆశ్రం ఆస్పత్రి సమీపంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. టీడీపీ నేత, మాజీ మంత్రి మాగంటి బాబు భీమవరంలో వైఎస్సార్ సీపీ దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో జరిగిన రాజీవ్ విద్యామిషన్ వీడియో కాన్ఫరెన్స్‌ను జేఏసీ నేతలు అడ్డుకున్నారు. కలిగిరిలో జరుగుతున్న రిలే దీక్షలలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. రోడ్లు ఊడ్చిన న్యాయవాదులు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రాష్ట్ర విభజనను నిరసిస్తూ న్యాయవాదులు పుష్కరాల రేవు వద్ద రోడ్లు ఊడ్చారు. కాకినాడలో న్యాయశాఖ ఉద్యోగులు కోర్టు వద్ద వినూత్నంగా గంజి వార్పు కార్యక్రమం చేపట్టి గంజి తాగారు. రాష్ట్ర విభజన చేపడితే తమకు గంజే గతి అంటూ నిరసన తెలిపారు. జిల్లావ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ మండల గోదాముల్లో పనిచేసే హమాలీలు శుక్రవారం నుంచి ఈ నెల 26 వరకూ విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. యూటీఎఫ్ సమైక్యాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదంటూ ఏలేశ్వరంలో 16మంది ఉపాధ్యాయులు ఆ సంఘానికి రాజీనామా చేశారు. ఐదు కిలోమీటర్ల పొడవున వాహనాల ర్యాలీ కోనసీమ ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్ల జేఏసీ అమలాపురంలో ఆటోలు, మినీ వ్యాన్లు, లారీలు, ట్యాక్సీలు, ఆర్టీసీ అద్దెబస్సులు, ఇతర వాహనాలతో భారీ ర్యాలీ చేపట్టింది. సుమారు ఐదు కిలోమీటర్ల పొడవున వాహనాలు సాగాయి. పిఠాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో రహదారులు దిగ్బంధం చేసి బంద్ పాటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ వరుపుల సుబ్బారావు ఏలేశ్వరం బాలాజీ సెంటర్లో అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. రాజానగరంలో సమైక్యవాదులు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను ఉద్యమంవైపు నడిపిస్తున్న అధికారులు వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో అధికారులు స్వయంగా రంగంలోకి దిగి గ్రామాల్లో పర్యటిస్తూ సమైక్య ఉద్యమంలో పాల్గొనేలా ప్రజలను చైతన్య పరుస్తున్నారు. శుక్రవారం సాయంత్రం జమ్మలమడుగు మండల పరిధిలోని మోరగుడి, ఎస్.ఉప్పలపాడు గ్రామాల్లో తహశీల్దార్ శివరామయ్య, ఎంపీడీఓ మల్లయ్య, ఎంఈఓ గంగిరెడ్డి, వ్యవసాయాశాఖాధికారి రాంమోహన్‌రెడ్డి పర్యటించి రాష్ట్ర విభజన వల్ల జరిగే పరిణామాలు, నష్టాల గురించి ప్రజలకు వివరించారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఇటువంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. నల్లదుస్తులతో వైద్యుల నిరసన విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రి వైద్యులు నల్ల దుస్తులు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. ఎన్జీఓ జేఏసీ ఆధ్వర్యంలో కోట జంక్షన్ వద్ద 10 వేల మంది ఉద్యోగులు,విద్యార్థులు సమైక్య నినాదాలతో హోరెత్తించారు. గెజిటెడ్ ఉద్యోగులు కలెక్టరేట్ జంక్షన్లో ఒంటికాలిపై నిలుచొని నిరసన తెలిపారు. ముస్లింల శాంతి యాత్ర కర్నూలు నగరంలో ముస్లిం ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో శాంతి యాత్ర చేపట్టారు. నగరంలోని వివిధ కాలనీల నుంచి భారీగా తరలివచ్చిన ముస్లిం యువకులు.. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ అసెంబ్లీ ఆహూతులను ఆకట్టుకుంది. ఉద్యోగానికి రాజీనామా చేసిన వాణిజ్యపన్నుల శాఖ డీసీ వాణిజ్యపన్నుల శాఖ డీసీ వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.లింగారెడ్డి ఉద్యోగానికి రాజీనామా చేసి సమైక్యాందోళనలో పాల్గొన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం అల్లూరు గ్రామానికి చెందిన లింగారెడ్డి.. హైదరాబాద్‌లోని వాణిజ్య పన్నుల శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. మరో మూడేళ్ల పాటు సర్వీసు ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన నిర్ణయంతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విద్యుత్ ఉద్యోగులు రోడ్డుకు అడ్డంగా పడుకొని వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వేలాదిమంది విద్యార్ధులు బెజవాడ బెంజిసర్కిల్ వద్ద మానవహారం చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. పర్యాటక హోటళ్లు మూత విశాఖ జిల్లా అరకులో గిరిజన మ్యూజియం, గిరిజన గార్డెన్ మూసివేశారు. ఎక్కడికక్కడ పర్యాటక హోటళ్లు మూతపడ్డాయి. దీంతో అరకులో పర్యాటకం పూర్తిగా పడకేసింది. పాడేరు పట్టణంలో ఎన్జీవోలు బిక్షాటన చేశారు. విశాఖలో ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడును కేజీహెచ్‌కు తరలించారు. చిత్తూరు ఎమ్మెల్యే సీకేబాబు మహాపాదయాత్ర శుక్రవారం తిరుపతికి చేరుకుంది. ఏడుగంటలపాటు హైవేపై వాహనాల అడ్డగింత చంద్రగిరిలో 36 గంటలపాటు బంద్ కొనసాగింది. జాతీయ రహదారిలో 7 గంటలపాటు రాకపోకలను అడ్డుకున్నారు. అనంతపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థులకు రోడ్లపైనే చదువులు చెప్పి..నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆర్టీసీ కార్మికులు బైక్‌ర్యాలీ చేయగా, వినుకొండలో ఏపీఎన్జీవోస్ సమైక్య జేఏసీ కాగడాల ప్రదర్శన నిర్వహించింది. తెనాలిలో మున్సిపల్ కమిషనర్ల సమావేశం జరగ్గా.. తాము కూడా ఉద్యోగుల సమ్మెకు సంఘీభావంగా విధులు బహిష్కరించాలని తీర్మానించారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకలెక్టరేట్ వద్ద అన్ని ప్రభుత్వవిభాగాల ఉద్యోగులు ధర్నా చేపట్టారు. విభజన కలతతో మరో 9మంది మృత్యువాత తూ.గో.జిల్లాలో ఉరేసుకుని యువకుడి బలవన్మరణం సాక్షి నెట్వర్క్: రాష్ర్టం ముక్కలవుతుందనే భయంతో ప్రాణాలొదిలేస్తున్న వారి సంఖ్య ఇంకా తగ్గడం లేదు. శుక్రవారం ఒక్కరోజే సీమాంధ్ర జిల్లాల్లో గుండెపోటుతో ఎనిమిదిమంది మృత్యువాతపడగా, తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామానికి చెందిన లంకే సత్తిబాబు (27) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషిస్తున్న సత్తిబాబుకు తల్లిదండ్రులు, భార్య, ఏడాదిన్నర పాప ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భిణిగా ఉంది. రాష్ట్ర విభజనను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటానంటూ చెప్పిన సత్తిబాబు చివరికి అన్నంత పనీ చేశాడని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా అమడగూరులో గుండం హరి(37), కనగానపల్లె మండలం పర్వతదేవరపల్లెకు చెందిన నారాయణప్ప (50) రాష్ట్ర విభజనను తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందారు. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఉద్యోగి డీవీ ఇంద్రశేఖర్ (54) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. నరసాపురం మండలం ఎల్బీ చర్ల గ్రామానికి చెందిన అడ్డాల రామలక్ష్మి (51) విభజన వార్తలు చూస్తూ గుండె ఆగి మరణించింది. ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన కల్లూరి శ్రీనివాసరావు (33) రాష్ట్రం విడిపోతే పిల్లల భవిష్యత్ దెబ్బతింటుందన్న బెంగతో గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలం కొండప్పగారిపల్లెకు చెందిన సమైక్యవాది లేబాకు వెంకటేశు(35) శుక్రవారం టీవీ చూస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. వెంకటేశు మృతితో శనివారం జరగాల్సిన అతని చెల్లెలు దామోదరమ్మ వివాహం ఆగిపోయింది. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం వనదుర్గాపురం గ్రామానికి చెందిన రమణ య్య(33) శుక్రవారం ఇంట్లో టీవీలో సమైక్యఉద్యమం.. విభజన నేపథ్యం వార్తలు ఉద్వేగానికి లోనై అక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఆత్మకూరు డిపో గ్యారేజ్ ఇన్చార్జ్ వెంకటేశ్వర్లు(54) శుక్రవారం రాత్రి కర్నూలు జిల్లా ఆదోనిలో గుండె పోటుతో మృతి చెందారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో తీవ్ర వేదనకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ నేతలపై జనాగ్రహం సాక్షి నెట్వర్క్: వేర్పాటు ప్రకటన వచ్చిన దరిమిలా కాంగ్రెస్, టీడీపీ నేతలపై వ్యక్తమవుతున్న జనాగ్రహం ఇప్పట్లో చల్లారేలా లేదు. శుక్రవారం సీమాంధ్రలోని పలు జిల్లాల్లో కాంగ్రెస్, టీడీపీ నేతలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావును అడ్డుకుని ఇంకా రాజీనామా చేయనందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో సోనియా, దిగ్విజయ్, కేసీఆర్, బొత్స, కిల్లికృపారాణి, పళ్లంరాజు, రాహుల్, చిరంజీవి మాస్కులు ధరించిన వారిని కర్రలతో కొడుతూ, కాళ్లతో తంతూ సమైక్యవాదులు నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో న్యాయవాదులు సోనియా చిత్రపటాన్ని కొరడాతో కొట్టి నిరసన తెలిపారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ దిష్టి బొమ్మకు శవ యాత్ర నిర్వహించి దహనం చేశారు. శ్రీకాకుళం రిమ్స్ వైద్యాధికారులు, ఉద్యోగులు పట్టణంలోని డేఅండ్‌నైట్ కూడలి వద్ద సోనియా, కేసీఆర్ వేషధారణలతో ఉన్న వ్యక్తులను స్ట్రెచర్‌పై తీసుకొచ్చి మెదడు, మోకాలు శస్త్ర చికిత్సలు చేస్తున్నట్టు ప్రదర్శన నిర్వహించారు. ఆంటోనీ కమిటీ అనుకూలంగా లేకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కావూరి శుక్రవారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి వచ్చిన కేంద్రమంత్రి కావూరి సాంబశివరావును సమైక్యవాదులు అడ్డుకుని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు కావూరి స్పందిస్తూ తాను ఎప్పుడూ సమైక్యవాదినేనని, ఆంటోని కమిటీ సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం వెలువరించకుంటే వెంటనే రాజీనామా చేస్తానని చెప్పడంతో నిరసనకారులు శాంతించారు. తొలుత ఆయన తిరుమలలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్జీవోల సమ్మెను తాను సమర్థిస్తున్నానన్నారు. విభజన దుష్పరిణామాలను వివరించడంవల్ల కేంద్రం పునరాలోచనలో పడిందన్నారు. ఉద్యమకారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అనుచరుల దాడి సమైక్యాంధ్ర ఉద్యమకారులపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు అనుచరులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులో ధర్నా చేపట్టిన ఉపాధ్యాయులకు సంఘీభావం పలికేందుకు ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు రాగా, రాజీనామా చేసిన తర్వాతే ఉద్యమంలో పాల్గొనాలని ఆయనకు సమైక్యవాదులు సూచించారు. దీంతో రెచ్చిపోయిన బత్యాల అనుచరులు శ్రీనివాసరాజు అనే సమైక్యవాదిపై పిడిగుద్దులతో చితకబాదారు. ఇదంతా చూస్తున్నా ఎమ్మెల్సీ వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. కాగా, ఈ దాడిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి నుంచి వెళ్లే ప్రైవేటు బస్సులు బంద్ సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతి నుంచి వివిధ పట్టణాలకు వెళ్లే ప్రైవేటు బస్సులనూ శనివారం నుంచి రద్దు చేసినట్లు శ్రీవెంకటేశ్వర ట్రావెల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బీ.మునిరాజా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం సమైక్యాంధ్ర ఉద్యమ జేఏసీ నేతలు శ్రీకాంత్‌రెడ్డి, అవుల ప్రభాకర్, చల్లా చంద్రయ్య ట్రావెల్స్ అసోసియేషన్ నాయకులతో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి నుంచి బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై వెళ్లే ప్రైవేటు బస్సుల టికెట్లు రిజర్వేషన్ చేయకుండా నిలుపుదల చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా ముందస్తుగా ఆయా నగరాలకు టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకుని ఉంటే వెంటనే రద్దు చేసుకోవాలని కోరారు. -
అందరి నోటా సమైక్యాంధ్ర నినాదమే
స్వార్థ రాజకీయాల్లో భాగంగా చోటు చేసుకున్న రాష్ట్ర విభజనపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. చిన్నా.. పెద్ద తేడా లేకుండా ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. సమైక్యమే ముద్దు.. తెలంగాణ వద్దే వద్దనే నినాదం హోరెత్తుతోంది. ప్రధాన పట్టణాలతో పాటు పల్లెల్లోనూ ఉద్యమం రగులుకుంటోంది. రోజుకో రీతిలో ఉద్యమకారులు నిరసన తెలియజేస్తున్నారు. కదం తొక్కుతూ.. పదం కలుపుతూ తెలుగుతల్లికి నీరాజనాలు అర్పిస్తున్నారు. సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. మున్సిపల్ ఉద్యోగుల సమ్మెతో పౌరసేవలు పూర్తిగా స్తంభించాయి. న్యాయవాదుల రిలే దీక్ష యథాతథంగా కొనసాగింది. ఉద్యోగ జేఏసీ ఆందోళనలు, మున్సిపల్ ఉద్యోగుల నిరసనలు, ట్రాక్టర్ అసోసియేషన్ యజమానులు, ఎల్పీజీ గ్యాస్ డీలర్లు, సిబ్బంది.. లైటింగ్, ఫ్లవర్ డెకొరేషన్ అసోసియేషన్ కార్మికుల ప్రదర్శనలతో నగరంలో ఎటుచూసినా ఉద్యమ వాతావరణమే కనిపించింది. యువత ద్విచక్ర వాహనాలతో ర్యాలీలు చేపట్టగా.. పశుసంవర్ధక శాఖ ఉద్యోగుల నేతృత్వంలో పాతబస్టాండ్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రదర్శన నిర్వహించారు. చెన్నమ్మ సర్కిల్లో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి జాతీయ రహదారిని దిగ్భందించారు. కర్నూలులో కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కె.వి.సుబ్బారెడ్డి, సురక్ష హాస్పిటల్ అధినేత డాక్టర్ బి.ప్రసాద్‌ల ఆమరణదీక్ష కొనసాగిస్తుండగా.. వీరి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు సమీక్షిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ కర్నూలులో కాంగ్రెస్ పార్టీ కారా్యాలయం వద్ద 10 గంటల పాటు నిరవధిక దీక్ష చేపట్టారు. ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. పైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు వారం రోజులుగా ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్పంచుకుంటుండటంతో పాఠశాలలు మూతపడ్డాయి. ఆళ్లగడ్డ పట్టణంలో గుండా రవికుమార్ అనే వికలాంగుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు సకాలంలో స్పందించి అతన్ని రక్షించారు. నంద్యాలలో నేషనల్ విద్యాసంస్థల సిబ్బంది, విద్యార్థులు శ్రీనివాసనగర్ జంక్షన్ నుండి సంజీవనగర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి సోనియాగాంధీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ఆత్మకూరు పట్టణంలోనూ జేఏసీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పట్టణ కన్వీనర్ ఇస్కాల రమేష్ రిలే నిరాహారదీక్షలు ప్రారంభమయ్యాయి. కోడుమూరు నియోజకవర్గ పరిధిలో సి.బెళగల్, పోలకల్, కంబదహాల్, ముడుమాల గ్రామాల్లో ఉద్యోగులు, విద్యార్థులు, పట్టభద్రులు సోనియా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గూడూరు పట్టణంలో జేఏసీ నాయకులు మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. కోడుమూరులో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు మొదలయ్యాయి. కాంగ్రెస్ నాయకులు పట్టణ ంలో దుకాణాలు బంద్ చేయించి, మధ్యాహ్నం 2గంటల వరకు వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. అన్ని వర్గాల ప్రజలు కోట్ల సర్కిల్లో మానవహారంగా ఏర్పడ్డారు. హోలియ దాసరి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ వర్గానికి చెందిన ప్రజలు కేసిఆర్ దిష్టిబొమ్మతో శవయాత్రను నిర్వహించారు. సమైక్యాంద్ర నినాదాలతో ఎమ్మిగనూరు పట్టణం అట్టుడికింది. పట్టణ వ్యాపార సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పట్టణ బంద్ విజయవంతమైంది. కేసీఆర్‌కు చీరకట్టించిన ఫ్లెక్సీలతో వ్యాపారులు మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రైవేట్ స్కూల్స్ అసోషియేషన్ నాయకులు యు.యు.ఉరుకుందు, మహానందయ్యల ఆధ్వర్యంలో దాదాపు 10వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ కొనసాగింది. పట్టణంలోని ఎద్దులమార్కెట్ వద్ద ఆందోళనకారులు మూడు ఆర్టీసీ బస్సుల అద్దాలు పగులగొట్టారు. 72గంటల సమ్మెలో భాగంగా మున్సిపల్ ఉద్యోగులు పెన్‌డౌన్ చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బి.వి.జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆదోనిలో సమక్య ఉద్యమం మరింత జోరందుకుంది. ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రకాంత్ రెడ్డి, ప్రసాద్‌రావు, వెంకటేశ్వర రెడ్డి, మునిస్వామి, కాంగ్రెస్ నాయకులు విట్టారమేష్, నీలకంటప్ప, జేఏసీ నాయకులు విరుపాక్షి, సునీల్ రాజ్‌కుమార్ తదితరులు పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. హిజ్రాలు సైతం ర్యాలీలో పాల్గొన్నారు. కొలిమిగుండ్లలో వ్యాపార వర్గాలు రహదారిపై వంటావార్పు నిర్వహించారు. డోన్‌లో ఫొటోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన జరిగింది. కోవెలకుంట్లలోని గ్రామ పంచాయతీ సర్కిల్లో ప్రధాన రోడ్డుపై వంటావార్పు చేపట్టి 5వేల మంది సహపంక్తి భోజనం చేశారు. వైఎస్ఆర్సీపీ జిల్లా స్టీరింగ్ సభ్యులు ఎర్రబోతుల వెంకటరెడ్డి, మండల కన్వీనర్ గాండ్ల పుల్లయ్య తదితరులు సంఘీభావం ప్రకటిం చారు. ఇదిలాఉండగా సమైక్యాంధ్రకు మద్ద తుగా మంగళవారం జాతీయ రహదారులను దిగ్బంధించనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి తెలిపారు. సమైక్యాంధ్ర జేఏసీ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.