శ్రీనగర్ః కాశ్మీర్ లో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఆర్మీ కాలనీకి వ్యతిరేకంగా యాసిస్ మాలిక్ ఆధ్వర్యంలోని వేర్పాటువాదులు ఐసిస్, పాకిస్థాన్ జెండాలను ఎగురవేసి ర్యాలీ నిర్వహించడం ఉద్రిక్తంగా మారింది. కాశ్మీర్లో ఆర్మీ, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులను వేరు చేసి, సాధారణ ప్రజలనుంచి విడిగా వారికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసేందుకు వారికోసం కాలనీలు కట్టించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వేర్పాటు వాదులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో మిర్వైజ్ ఉమా ఫరూఖ్ నాయకత్వంలో జమ్మూకాశ్మీర్ లోని కాశ్మీరీ పండిట్లు, సైనిక కాలనీలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.
కాశ్మీర్లో వేర్పాటు వాదులు మరోసారి ఆందోళనకు దిగారు. ప్రత్యేక కాలనీలు ఏర్పడితే తమ పట్టు సడలిపోతుందన్న భావనలో ప్రజల్లో విద్వేషాలు రేపే ప్రయత్నాలు చేస్తున్నారు. కాలనీలు నిర్మించడానికి వీల్లేదంటూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కాలనీలకు వ్యతిరేకంగా, భారత్ ను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్, ఐసిస్ లకు అనుకూలంగా జెండాలను ఊపుతూ, జీవ్ జీవ్ పాకిస్తాన్ అన్న నినాదాలతో నిరసనకారులు ర్యాలీ చేపట్టారు. ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్ళు రువ్వారు. దీంతో పోలీసులు భాష్పవాయు గోళాలను వారిపై ప్రయోగించారు. దీంతో ఆ ప్రాంతం తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
కాలనీల నిర్మాణానికి కావలసిన భూమిలేదంటూ పీపుల్స్ డెమొక్రెటిక్ పార్టీ అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ భారతీయ జనతాపార్టీ సైనిక, పండిట్ కాలనీల ఏర్పాటును సమర్థించడం స్థానికంగా ఆందోళనకు దారి తీసింది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం కూడ కాలనీల ఏర్పాటుకోసం శ్రీనరగ్ పుల్వామా, బడ్గమ్ జిల్లాల్లో భూమి అందుబాటులో లేదని చెప్పినట్లు పేర్కొన్నారు. సైనిక కాలనీకోసం భూమి లేనప్పుడు కాలనీల ఏర్పాటు విషయాన్ని ఎలా అంగీకరిస్తారంటూ ప్రశ్నించారు.
ఐసిస్, పాకిస్తాన్ నినాదాలతో కాశ్మీర్లో ఉద్రిక్తత
Published Fri, Jun 17 2016 5:18 PM | Last Updated on Thu, Mar 28 2019 6:26 PM
Advertisement
Advertisement