Colonies
-
ఔటర్ చుట్టూ హౌసింగ్ కాలనీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మధ్య తరగతి ప్రజల కోసం అందుబాటు ధరల్లో ఉండే గృహాలను నిర్మించేందుకు గృహనిర్మాణ మండలి (హౌసింగ్ బోర్డు) సిద్ధమైంది. ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద కాలనీగా కేపీహెచ్‌బీ వంటి భారీ హౌసింగ్ కాలనీలను రూపొందించిన బోర్డు.. ఇప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ కాలనీలు నిర్మించేందుకు చర్యలు చేపడుతోంది. ఉమ్మడి ఏపీ సమయంలో 2013లో హైదరాబాద్ శివార్లలోని రావిర్యాలలో విల్లాల నిర్మాణమే హౌసింగ్ బోర్డు చివరి ప్రాజెక్టు కావడం గమనార్హం. తెలంగాణ ఏర్పాటయ్యాక ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదు. సుమారు పుష్కరకాలం తర్వాత మళ్లీ ఇప్పుడు గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడుతోంది. హౌజింగ్ బోర్డు ఆధ్వర్యంలో అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించేందుకు పాలసీని రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పాలసీ ఎలా ఉండాలి, తక్కువ ధరలో ఇళ్లు అందుబాటులో ఉంచేందుకు అనుసరించాల్సిన పద్ధతులు, ఇళ్ల నమూనాలు, ఖర్చును తగ్గిస్తూ మన్నికను పెంచేందుకు వినియోగించే ఆధునిక పరిజ్ఞానం తదితర అంశాలపై సూచనల కోసం కన్సల్టెన్సీని నియమించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు హౌసింగ్ బోర్డు బుధవారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 28న టెక్నికల్ బిడ్లు, మార్చి 3న ఫైనాన్షియల్ బిడ్లను తెరవనుంది. సిటీలో భూములు అమ్మి.. హైదరాబాద్ నగరంలోపల కాలనీలను నిర్మించాలంటే భారీ వ్యయం అవుతుంది. ఇళ్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. దీనితో అందుబాటులో ఇళ్ల ధరలు ఉండేలా.. ఔటర్ రింగురోడ్డు చుట్టూ కాలనీలు నిర్మించాలని, అవి శాటిలైట్ టౌన్‌షిప్‌ల తరహాలో ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. హౌసింగ్ బోర్డుకు చాలా ప్రాంతాల్లో వందల ఎకరాల స్థలాలు ఉన్నాయి. కానీ వాటిలో దాదాపు 1,200 ఎకరాలు వివాదాల్లో ఉన్నాయి. మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల్లో చిన్న చిన్న స్థలాలు కూడా బోర్డు ఆ«దీనంలో ఉన్నాయి. ఇందులో ఖరీదైన ప్రాంతాల్లోని భూములను వేలం వేసి, ఆ నిధులతో శివార్లలో భూములు సేకరించాలని బోర్డు భావిస్తున్నట్టు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి.. ఉమ్మడి రాష్ట్రంలో హౌసింగ్ బోర్డు అమలు చేసిన విధానాలు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. పలు రాష్ట్రాలు వీటిని అనుసరించాయి కూడా. అయితే అనంతర కాలంలో రాష్ట్రంలో హౌసింగ్ బోర్డు నామమాత్రంగా మారగా.. ఇతర రాష్ట్రాల్లో పురోగతి సాధించాయి. ఈ క్రమంలో కన్సల్టెన్సీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసి, అనుసరించదగిన అంశాలను సూచించనుంది. ప్రస్తుతం హౌసింగ్ బోర్డు వద్ద నిధులు లేవు. అయితే వందల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉన్నందున.. వాటిని తనఖా పెట్టి హడ్కో వంటి సంస్థల నుంచి రుణం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆ నిధులతో కాలనీల నిర్మాణం చేపట్టనుంది. అపార్ట్మెంట్ల నిర్మాణానికి చాన్స్.. గతంలో హౌసింగ్ బోర్డు రూపొందించిన కాలనీల్లో 80శాతం వ్యక్తిగత ఇళ్లే. అప్పట్లో వాటికే డిమాండ్ ఉండటంతో అవే నిర్మించింది. ఎల్ఐజీ కేటగిరీలో మాత్రం అల్పాదాయ వర్గాల కోసం క్వార్టర్ల రూపంలో ఇళ్లను నిర్మించింది. ఇప్పుడు భూముల ధరలు అధికంగా ఉన్నందున వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం కాకుండా.. విస్తృత స్థాయిలో అపార్ట్మెంట్లనే నిర్మించే అవకాశం ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనే.. ఔటర్ రింగు రోడ్డును నిర్మించిన తర్వాత దాని చుట్టూ శాటిలైట్ టౌన్íÙప్స్ నిర్మించాలని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్ నగరంపై జనాభా ఒత్తిడి తగ్గుతుందని భావించి, టౌన్íÙప్లకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ ఆయన అకాల మరణంతో అమల్లోకి రాలేదు, తర్వాతి ప్రభుత్వాలేవీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అదే తరహాలో ఆలోచనతో కసరత్తు ప్రారంభించింది. -
కాలనీల్లో కన్నీళ్లే!
(విజయవాడ ముంపు ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధులు) : ఐదు రోజులు గడిచిపోయినా ముంపు నుంచి బెజవాడ బయటపడలేకపోతోంది. వరద కొంతమేర తగ్గినా లోతట్టు ప్రాంతాలు నీళ్లలోనే నానుతున్నాయి. ఏ బాధితుడిని కదిలించినా వ్యథా భరిత గాథలే. వరద తగ్గడంతో విజయవాడ–నూజివీడు రహదారిపై రాకపోకలు మొదలైనా అది కేవలం ప్రధాన రోడ్లకే పరిమితమైంది. ఆ రోడ్డుకి అనుబంధంగా ఉన్న ముఖ్యమైన ప్రాంతాలన్నింటిలో ఇంకా మోకాల్లోతు నీరుంది. ఇంట్లో సరుకులు, వస్తువులు నీళ్లలో మునిగిపోవడంతో మొత్తం మళ్లీ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితులు వాపోతున్నారు. ముంపు ప్రాంతాల్లో విపరీతమైన దుర్గంధం రావడం, ఇళ్లను వెంటనే బాగు చేసుకునే పరిస్థితి లేకపోవడంతో వేలాది కుటుంబాలు ఆ ప్రాంతాన్ని వీడి వలస వెళ్లిపోతున్నాయి. శుభ్రం చేసుకునేందుకు అవస్థలు వరద ప్రాంతాల్లో అక్కడే ఉంటున్న వారు ఇళ్లలో నీరు బయటకు తోడేందుకు ప్రయతి్నస్తున్నారు. బురదను తొలగించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్లను శుభ్రం చేసేందుకు పెద్దఎత్తున ఫైరింజన్లు తెప్పించామంటూ ప్రభుత్వం చెబుతున్నా చాలా పరిమిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. ప్రధాన ప్రాంతాల్లో కొన్ని ఇళ్లల్లో నీళ్లు చల్లి వెళ్లిపోవడం మినహా ఫైరింజన్ల వల్ల పెద్దగా ఉపయోగం కనిపించడంలేదు. ముంపులో ఉన్న లక్షల ఇళ్లను ఎవరికి వారే శుభ్రం చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. పునరావాసం ఉత్తిమాటే విజయవాడలో ఇంకా నాలుగు లక్షల మందికిపైగా వరద ముంపులో ఉంటే.. కనీసం పది శాతం మందికి కూడా పునరావాసం క ల్పించలేదు. ప్రస్తుతం 42 పునరావాస కేంద్రాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నా అందులో సగం ఎక్కడున్నాయో ఎవరికీ తెలియడం లేదు. అక్కడక్కడా కొన్ని కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లను పునరావాస కేంద్రాలు మార్చినట్లు చెబుతున్నా అరకొరగానే ఉన్నాయి. అధికారికంగా 14 వేల మందికి ఆశ్రయం కల్పించామని ప్రభుత్వం చెబుతుండగా వాస్తవానికి ఆ సంఖ్య రెండు, మూడు వేలు కూడా ఉండదని అధికారవర్గాలే పేర్కొంటున్నాయి. దీంతో బాధితులు ఎవరికి వారు బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. కొందరైతే దూర ప్రాంతాల్లోని బంధువుల ఇంటికి వెళ్లిపోతున్నారు. పునరావాసం ఎలా ఉందో చెప్పడానికి ఇలా బయటకు వెళ్లిపోతున్న వారి సంఖ్యే నిదర్శనం. అందని నిత్యావసరాలు.. ప్రతి బాధిత కుటుంబానికి నిత్యావసరాలు అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినా ఇంతవరకు ఎవరికీ ఇచ్చిన దాఖలాలు కనిపించడంలేదు. 25 కేజీల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, పంచదార, ఆయిల్, బంగాళాదుంపలు, టమాట ఇస్తున్నట్లు చెబుతున్నా అది కూడా ఇంకా కార్యరూపం దాల్చలేదు. ప్రజలు ఎవరి బాధలు వారే పడి నిత్యావసర వస్తువులు కొనుక్కుంటున్నారు. మరోవైపు బాధితుల రవాణా కోసం బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేశామని చెబుతున్నా అదీ ఎక్కడా కనిపించడంలేదు. మహిళల బాధ వర్ణనాతీతం వరద ప్రాంతాల్లో ఐదు రోజులుగా స్నానం చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. నెలసరితో ఇబ్బంది పడుతున్నవారికి శానిటరీ నాప్కిన్స్ కూడా దొరకడం లేదు. మార్చుకునేందుకు మరో చీరగానీ, డ్రస్గానీ లేక కట్టుబట్టలు పాడైపోయి నరకం అనుభవిస్తున్నారు. చిన్న దుకాణాల పరిస్ధితి దారుణంగా ఉంది. వేలాది దుకాణాల్లో సరుకులు పనికిరాకుండా పోయాయి. బియ్యం, కిరాణా, నిత్యావసర సరుకులు, దుస్తులు, పుస్తకాలు, ఫ్యాన్సీ వస్తువులు విక్రయించే దుకాణదారులు ఆ సరుకంతా బయపడేయడం తప్ప వారికి వేరే మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఇంటికీ రూ.లక్షల్లో నష్టం వరద భారీ నష్టం మిగిల్చింది. ఒక్కో ఇంటికీ రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకూ కేవలం సామాన్లకే నష్టం వాటిల్లింది. ఐదు రోజులుగా నీటిలోనే ఇంటిలో సామాన్లు ఉండిపోవడంతో తడిసి పాడైపోయాయి. అక్కడే ఉండక తప్పదనుకున్న వారు వరద నీరు తగ్గడంతో వస్తువులను రోడ్ల మీదకు తెచ్చి ఆరబెట్టుకుంటున్నారు. ఎండ రాకపోవడంతో బియ్యం, మంచాలు, పరుపులు, ఇతర సామగ్రి బురదతో నిండిపోయి పనికి రాకుండా పోయాయి.వాహనాల మరమ్మతులకు పాట్లు వరద నుంచి బయటపడ్డ వాహనాలను బాగు చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మెకానిక్‌లు లేక సొంతంగా రిపేరు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొందరు వాహనాలను అక్కడి నుంచి అష్ట కష్టాలు పడి రబ్బరు ట్యూబుల సాయంతో మెకానిక్‌ల వద్దకు తరలిస్తున్నారు. మరమ్మతులకు ఒక్కో ద్విచక్ర వాహనానికి కనీసం రూ.20 వేలు అడుగుతున్నారు. కంపెనీ షోరూమ్‌కి తీసుకువెళితే రెట్టింపు బిల్లు వేస్తున్నారు. మాది పల్నాడు జిల్లా చిలకలూరిపేట. నా భార్య రెండో కాన్పు కోసం సింగ్‌నగర్ వాంబే కాలనీలోని పుట్టింటికి వచ్చింది. వరదలకు మా మామ ఇల్లు మునిగిపోయింది. నేను మా ఊరి నుంచి రాలేక... ఆమె చంటి బిడ్డతో బయటపడలేక నరకయాతన అనుభవించాం. నాలుగు రోజుల తరువాత అతికష్టం మీద ఇక్కడికి వచ్చి చూస్తే ఇల్లంతా బురదతో నిండిపోయింది. సామానంతా పాడైపోయింది. దీంతో అందరం కలసి మా ఊరికి వెళ్లేందుకు వరద నీటిలో కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వచ్చాం. ప్రభుత్వం ఎలాంటి వాహనాలను ఏర్పాటు చేయలేదు – వెంకటరత్నం -
జ్ఞాపకాల్లో మునిగి తేలారు!
బోయినపల్లి(చొప్పదండి) : ప్రాజెక్టు నిర్మాణ సమయంలో బరువెక్కిన హృదయాలతో కన్నతల్లిలాంటి ఊరు విడిచి వెళ్లిన గ్రామస్తులు...ఇప్పుడు మళ్లీ ఆ మధుర స్మతులను నెమరువేసుకుంటున్నారు. రాజన్నసిరిసిల్ల బోయినపల్లి మండలం మాన్వాడలో 27.55 టీఎంసీల సామర్థ్యంతో మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మించారు. నిర్మాణ సమయంలో బోయినపల్లి, వేములవాడ, తంగళ్లపల్లి మండలాలకు చెందిన 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టులోకి 2019లో పూర్తిస్థాయిలో 25 టీఎంసీల నీరు చేరడంతో నిర్వాసితులు పునరావాస కాలనీలకు తరలివెళ్లారు. 2022లో ప్రాజెక్టులో నీటిమట్టం 8 టీఎంసీలకుచేరగా.. పాత ఊళ్ల ఆనవాళ్లు కనిపించాయి.తిరిగి రెండేళ్ల అనంతరం కొద్ది రోజులుగా మిడ్‌మానేరులో 7.69 టీఎంసీల మేర నీరు మాత్రమే ఉండడంతో ముంపునకు గురైన ఇళ్ల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. వాటిని చూసేందుకు నిర్వాసితులు తరలివస్తున్నారు. మునిగితేలిన ముంపు గ్రామాలు బోయినపల్లి మండలం కొదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి, వేములవాడ మండలం అనుపురం, కొడుముంజ, శాభా‹Ùపల్లి, రుద్రవరం, తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతలఠాణా గ్రామాలు తేలాయి. పాత ఇళ్లు, ఆలయాలు, మొండి గోడలు కనిపిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి మా పాత గ్రామం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పుట్టి పెరిగిన ఊరును చూడడానికి వెళితే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. నీట తేలిన ఇళ్లలో కూలిన గోడలు.. దర్వాజాలు కనిపించడంతో గుండెలు బరువెక్కుతున్నాయి. – కొనుకటి హరీశ్, నీలోజిపల్లి పాతూరు చూసేందుకు వచ్చిన.. పాత ఊర్లు తేలడంతోఅందరం కలిసి చూసేందుకు వచ్చాం. సెల్ఫీలు దిగాం.ఇంట్లో ఉన్న పెద్ద వాళ్లకు.. పిల్లలకు పాత ఊరి ఫొటోలు చూపిస్తాం. – పెంజర్ల మల్లయ్య, కొదురుపాక 60 ఏళ్లయినా చెక్కు చెదరని రోడ్లు, వంతెనలు బాల్కొండ /సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంటోంది. గత ఏడాది మే నెలలో కనిష్టంగా 21 టీఎంసీల నీటిమట్టం నిల్వ ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలోనే నీటిమట్టం 12.5 టీఎంసీలకు పడిపోయింది. దీంతో ముంపునకు గురైన గ్రామాల ఆనవాళ్లు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. గాదేపల్లి– బర్దిపూర్ గ్రామాల మీదుగా నందిపేట్ మండల కేంద్రం వరకు గల రోడ్డు బయట పడింది. 60 ఏళ్లుగా నీటిలో ఉన్నా, ఆ రోడ్డుపై నిర్మించిన వంతెనలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ప్రాజెక్టు నడి మధ్యలో ఉన్న రత్నాపూర్ గుట్ట, ఆ గుట్ట వరకు ఉన్న దారి కూడా బయట పడింది. మరో 10 రోజుల్లో గుట్టపైకి వెళ్లి అక్కడ ఉన్న మల్లన్న దేవుడిని దర్శించుకోవచ్చని చెబుతున్నారు. జనవరి నుంచే సంగమేశ్వర దర్శనం సాక్షి, నాగర్‌కర్నూల్ : శ్రీశైలం రిజర్వాయర్‌లో ఏటా మార్చి, ఏప్రిల్ నెలలో నీరు తగ్గుముఖం పట్టాక సంగమేశ్వర ఆలయం బయటపడుతుంది. అయితే ఈ ఏడాది రిజర్వాయర్‌లో నీరు లేక జనవరి నెలలోనే సంగమేశ్వర ఆలయం బయటపడింది. ఇక్కడి శివలింగం రాయితో కాకుండా వేప వృక్షపు కలప(వేపదారు శివలింగం)తో ఉండటం విశేషం. కృష్ణా, వేణి, తుంగ, భద్ర, మలపహరని, భీమరతి, భవనాశిని నదులు కలిసే చోటు కావడంతో ఈ క్షేత్రాన్ని సప్తనదుల సంగమంగా పేర్కొంటారు. తెలంగాణ నుంచి భక్తులు కొల్లాపూర్ మండలంలోని సోమశిల వద్దనున్న కృష్ణాతీరం నుంచి బోట్ల ద్వారా సంగమేశ్వరానికి చేరుకుంటారు. -
దేశానికే ఆదర్శంగా జగనన్న కాలనీల్లో ఇంధన పొదుపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్–జగనన్న కాలనీల్లో పేదల కోసం నిర్మిస్తున్న గృహాల్లో ఇంధన సామర్థ్య చర్యలను దేశానికే రోల్ మోడల్‌గా అమలు చేయనున్నట్లు ఏపీ గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) సీఈవో విశాల్ కపూర్ తరఫున సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు అనిమేష్ మిశ్రా, నితిన్భట్, సావిత్రిసింగ్, పవన్‌లు అజయ్ జైన్‌ను కలిసినట్లు ఈఈఎస్ఎల్ దక్షిణాది రాష్ట్రాల సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం... హౌసింగ్ ఎండీ లక్ష్మీశా, జేడీ శివప్రసాద్, హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్ గురించి ఈఈఎస్ఎల్ అధికారులకు వివరించారు. అజయ్ జైన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈఈఎస్ఎల్, కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అతిపెద్దదైన ఇంధన సామర్థ్య కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించనుందని తెలి పారు. సీఎం జగన్ సూచన మేరకు వైఎస్సార్–జగ నన్న కాలనీల్లోని ఇళ్లకు అత్యంత నాణ్యమైన స్టార్ రేటెడ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ పరికరాలను గృహనిర్మాణశాఖ ఆధ్వర్యంలోనే ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అందించనుందని తెలిపారు. ప్రతి ఇంటికి 4 ఎల్ఈడీ బల్బులు, 2 ఎల్ఈడీ ట్యూబ్‌లైట్లు, 2 ఎనర్జీ ఎఫిషియెన్సీ బీఎల్డీసీ ఫ్యాన్లను మార్కెట్ ధర కన్నా తక్కువకు ఈఈఎస్ఎల్ సహకారంతో సమకూర్చనున్నట్లు చెప్పారు. అయితే ఇది స్వచ్చందమేనని, లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ పరికరాలు తీసుకోవాలని లేదన్నారు. ఈ పరికరాలను వినియో గించడం వల్ల ప్రతి ఇంట్లో ఏటా 734 యూనిట్ల ఇంధనం ఆదా అవుతుందని ఈఈఎస్ ఎల్ అంచనా వేసిందని తెలిపారు. దాని ప్రకారం ఫేజ్–1లోని 15.6 లక్షల ఇళ్లకు రూ.352 కోట్ల వార్షిక ఇంధనం ఆదా అవుతుందని అజయ్ జైన్ వివరించారు. -
కాలనీలను భారీగా ముంచెత్తిన వరద నీరు
-
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. పలు కాలనీల్లోకి చేరిన వర్షపు నీరు
-
సీసీటీవీ కెమెరాలతో మెరుగైన భద్రత
సాక్షి, అమరావతి : నేరాల నియంత్రణ, మెరుగైన భద్రతకు సీసీటీవీ కెమెరాలు అత్యావశ్యకమని దేశంలోని పట్టణ ప్రాంత ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు మొగ్గుచూపుతున్నారు. కాలనీలు, అపార్ట్మెంట్లు, ఇతర నివాస ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవడం ఐదేళ్లుగా భారీగా పెరుగుతోందని ఫోర్బ్స్ సంస్థ ‘పోలీసింగ్ ఇన్ ఇండియా–2023’ నివేదిక వెల్లడించింది. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తతితో భద్రత, వ్యక్తిగత ప్రైవసీ అనే రెండింటిలో ఎటువైపు మొగ్గుచూపాలి అనే అంశంపై ఐదేళ్ల క్రితం వరకు దేశ ప్రజల్లో ఓ సందిగ్థత ఉండేదని ఆ నివేదిక పేర్కొంది. కాలనీలు, నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడం తమ వ్యక్తిగత గోప్యతకు భంగకరమని భావించేవారు. బహిరంగ ప్రదేశాల్లో పోలీసు, మున్సిపల్ శాఖలు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నారు. కాబట్టి తమ నివాస ప్రాంతాల్లో ఇవి వద్దనే భావన ఉండేది. కానీ, నగర, పట్టణ ప్రాంత ప్రజల్లో ఆలోచనా దృక్పథం ఐదేళ్లలో మారిందని ఆ నివేదిక వెల్లడించింది. ప్రజలు తమ నివాసాలకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసుకుంటున్నారని తెలిపింది. నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ.. దేశంలో నగరాలు, ప్రధాన పట్టణ ప్రాంతాల్లో 51 శాతం మంది ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసుకున్నారు. నగరాల్లో 61 శాతం, ప్రధాన పట్టణాల్లో 46 శాతం ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని కాలనీల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో కర్ణాటక మొదటిస్థానంలో ఉండగా రెండు, మూడు స్థానాల్లో హరియాణా, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. కర్ణాటకలో 68శాతం, హరియాణాలో 67శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 33శాతం ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేసుకున్నారు. ప్రభుత్వం అత్యధికంగా ఈ కెమెరాలు ఏర్పాటుచేసిన వాటిలో ఢిల్లీ మొదటిస్థానంలో ఉంది. ఇక్కడ 54 శాతం ప్రాంతాల్లో ప్రభుత్వమే వీటిని ఏర్పాటుచేసింది. అలాగే, అత్యధిక ఆదాయ వర్గాల ప్రాంతాల్లో 73 శాతం, ఎగువ మధ్యతరగతి వర్గాల ప్రాంతాల్లో 63 శాతం, మధ్య తరగతి వర్గాలుండే చోట 45 శాతం, అంతకంటే తక్కువ ఆదాయ వర్గాల ప్రాంతాల్లో 28శాతం వరకు ఈ కెమెరాలు ఉన్నాయి. సీసీటీవీ కెమెరాలతో ‘ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ (ఎఫ్‌ఆర్‌టీ) పోలీసులకు అందుబాటులోకి వస్తోంది. దాంతో నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు మరింత సమర్థంగా నిర్వర్తించేందుకు ఆ శాఖకు ఇది ఉపయోగపడుతోంది. ఈ కెమెరాలు లేని ప్రాంతాల్లో కంటే ఉన్న ప్రాంతాల్లో నేరాలు 30 శాతం తగ్గినట్లు.. కేసుల ఛేదన 28 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. -
గ్రేటర్ వరంగల్ పరిధిలో 40 కాలనీలు జలమయం
-
అందుకోసమైనా భూమిని కాపాడుకుందాం.. బెజోస్ ఆసక్తికర వ్యాఖ్యలు
Jeff Bezos On Space Human Colonies: మనిషి తర్వాతి తరాల పుట్టుక అంతరిక్షంలోనే ఉండబోతుందా? మనిషి మనుగడ అక్కడే కొనసాగనుందా? అప్పుడప్పుడు చుట్టపు చూపుగా భూమ్మీదకు వచ్చి చూసిపోతుంటాడా?.. ఈ ప్రశ్నలన్నీ ఇప్పటికైతే అతిశయోక్తి కావొచ్చు! కానీ, భవిష్యత్తులో ఇదే జరిగి తీరుతుందని అంచనా వేస్తున్నాడు అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్. ఇగ్నాటియస్ ఫోరమ్ 2021లో ‘స్పేస్ ట్రావెల్, భవిష్యత్తులో దాని సామర్థ్యం’ అంశం మీద బ్లూఆరిజన్ ఓనర్ హోదాలో జెఫ్ బెజోస్ ప్రసంగించాడు. కొన్ని వందల సంవత్సరాలు గడిచాక.. మనిషి పుట్టేది అంతరిక్షంలోనే!. అక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని మనిషి బతుకుతుంటాడు. అప్పటికి భూమి ఒక పరిరక్షక గ్రహంగా ఉంటుంది. దానిని చూసేందుకు మనిషి టూరిస్టుగా మారిపోతాడు. కాబట్టి, భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన వ్యాఖ్యానించాడు. ‘‘భూమి ఎంతో విలువైన గ్రహం. కోట్లలో పెరుగుతున్న జనాభాతో భూమ్మీద ఒత్తిడి ఉంటోంది. ఈ కారణంతోనే రాబోయే రోజుల్లో వృక్ష, జంతు సంపద తగ్గిపోవడం ఖాయం. కాబట్టి, పెరుగుతున్న జనాభాకు తగ్గట్లు నివాసయోగ్యమైన ప్రాంతం వెతుక్కోవడంలో తప్పేముంది?. అంగారకుడి లాంటి గ్రహాల మీద జీవనం ఏర్పరుచుకోవడం వల్ల భూమి భారాన్ని తగ్గించొచ్చు. విలువైన జీవన సంపదతో కూడిన అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా భూమిని తీర్చిదిద్దుకోవచ్చు. అందుకు బీజం వేసిది స్పేస్ టూరిజమే’’ అంటూ వ్యాఖ్యానించాడాయన. చదవండి: భూమ్మీద కాదు, అంతరిక్షంపై ఆదిపత్యం కోసమే! -
చెంగిచెర్లలో నీట మునిగిన కాలనీలు
-
ఓ వైపు వర్షం, నిర్లక్ష్యం వహిస్తే.. కొంపలు మునుగుతాయ్ సారు
సాక్షి, హయత్‌నగర్( హైదరాబాద్): నాలుగు రోజులగా కురుస్తున్న వర్షాలకు హయత్‌నగర్‌లోని పలు కాలనీలు నీట మునిగిన సంగతి తెలిసిందే. శనివారం మరో మరోసారి భారీ వర్షం కురవడంతో ఫైర్‌స్టేషన్, బస్ డిపోల్లోకి నీరు చేరింది. అదే విధంగా కుమ్మరికుంట నిండి పొంగిపొర్లి దిగువనున్న బాతుల చెరువులోకి భారీగా నీరు చేరుతోంది. బాతుల చెరువు సైతం శనివారం అర్ధరాత్రి నుంచి అలుగు పారుతోంది. ఏ క్షణమైన కాలనీలను ముంచెత్తే ప్రమాదం ► నీటి ప్రవాహం పెరిగితే ఏ క్షణమైనా అలుగు నీరు కింది కాలనీలను మంచెత్తే ప్రమాదం ఉంది. అదే జరిగితే బాతుల చేరువు కట్ట కింద ఉన్న కాలనీలు మరోసారి ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఎగువనున్న కాప్రాయ్ చెరువు ఏ క్షణమైనా అలుగు పారవచ్చు. అదే జరిగితే ఇప్పటికే నిండి పొంగిపొర్లుతున్న కుమ్మరికుంటలోకి ఆ నీరు వచ్చే అవకాశం ఉంది. అక్కడి నుంచి వరద నీరు నేరుగా బాతుల చెరువులోకి చేరుతుంది. ఈ మూడు చెరువుల నీటితో పాటు నిండు కుండలా ఉన్న మాసబ్ టాంక్ చెరువు కూడా అలుగు పారేందుకు సిద్ధంగా ఉంది. ఆ చెరువు అలుగు పారితే రెండు వైపుల నీరు మంజారా కాలనీ, అంబేడ్కర్‌నగర్‌లలోకి వస్తుంది. ఇదే జరిగితే ఆయా కాలనీల ప్రజలు పెను ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ► బాతుల చెరువు అలుగు ప్రవాహం అంతకంతకు పెరుగుతూ ఉండటంతో దిగువనున్న వసుందర కాలనీ, కట్టమైసమ్మకాలనీ, తిరుమలకాలనీ, ఆ ర్టీసీ మజ్దూర్‌కాలనీతో పాటు అంబేడ్కర్‌నగర్, రంగనాయకుల గుట్ట, బీజేఆర్ కాలనీ, బంజారా కాలనీలలోకి నీరు చేరుతోంది. గత అక్టోబర్‌లో వర్షాలకు ప్రజలు నిరాశ్రయులైన సంఘటన మరువక ముందే మరోసారి ముంపు ప్రమా దం పొంచి ఉండటంతో బిక్కుబిక్కుమంటున్నారు. ► చెరువులు నిండినప్పుడు అలుగు నీరు వెళ్లేందుకు గతంలో ఉన్న కాలువలు ఆక్రమణలకు గురి కావడంతో అలుగు నుంచి వచ్చే నీటికి దారి లేక కాలనీలను మంచెత్తుతోంది. గత అక్టోబర్‌లో వచ్చిన వరద సమయంలో కాలవల ఆక్రమణలను తొలగిస్తామన్నారు. కాలువలను పునరుద్ధరిస్తామని అధికారులు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో ఈ వర్షాకాలంలో వరదలు వస్తే గతేడాది పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ► మరోసారి బాతుల చెరువు పొంగితే మా గతి ఏంటని లోతట్టు ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు. వరద ప్రవాహం ఎప్పుడు తమను మంచెత్తుతుందో అని వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. రానున్న ప్రమాదాన్ని గుర్తించి అధికారులు మందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కట్టలకు మరమ్మతులు ఏవి? ► గతేడాది కురిసిన వర్షాలకు కుమ్మరికుంట కోతకు గురై కట్ట బలహీనంగా మారింది. దానికి తాత్కాలిక మరమ్మతులు చేసిన అధికారులు తిరిగి అటువైపు చూడలేదు. బాతుల చెరువు నిండి ప్రమాదకర స్థాయిలో వరద రావడంతో ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని ఆ చెరువుకట్ట బలహీనంగా మారింది. ► గత కొంత కాలంగా కట్టకు లీకేజీలు ఏర్పడి నీరు కిందికి వెళ్తోంది. తూములకు కూడా మరమ్మతులు చేయకపోవడంతో వాటి నుంచి కూడా నీరు దిగువకు వెళ్తోంది. ఇప్పటి వరకు కట్ట లీకేజీలను అరికట్టేందుకు, తూములకు మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. కంటిమీద కునుకు లేదు.. వర్షం వస్తుందంటే కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఏ క్షణంలో వరద ముంచెత్తుతుందోనని భయంగా ఉంది. బాతుల చెరువు అలుగు నీరు నేరుగా మా కాలనీ గుండా వెళ్తోంది. అలుగు నీరు వస్తుండటంతో ఇళ్ల నుంచి నుంచి బయటికి కూడా రాలేకపోతున్నాం. – రాములు, కట్టమైసమ్మ కాలనీ భయంగా ఉంది.. బాతులు చెరువు అలుగు పారుతుండటంతో ఏ క్షణంలో వరద నీరు మంచెత్తుతందోనని భయంగా ఉంది. గత అక్టోబర్‌లో వచ్చిన వరదకు ఇళ్లు మునగడంతో పైకప్పు ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నాం. అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి హెచ్చరికలు చేయలేదు. ఇప్పుడు ఇంటిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. – బాబూలాల్, రంగనాయకుల గుట్ట -
రూ.34 వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం(గృహనిర్మాణశాఖ)పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణ ప్రగతి, జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై కార్యాచరణ ప్రణాళిక, టిడ్కో ఇళ్లపై సీఎం సమగ్ర సమీక్ష జరిపారు. ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. కాలనీల్లో మ్యాపింగ్, జియో ట్యాగింగ్, జాబ్‌కార్డుల జారీ, రిజిస్ట్రేషన్ పనులు అన్నిచోట్ల దాదాపుగా పూర్తికావొచ్చాయని అధికారులు తెలిపారు. 3.03 లక్షల ఇళ్లు ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. జులై 10 కల్లా మొత్తం 7 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ఆప్షన్లో భాగంగా ప్రభుత్వం కట్టే ఇళ్లు శ్రావణ మాసం ప్రారంభంకాగానే మొదలుపెడతామని అధికారులు తెలిపారు. జూన్ 2022 నాటికల్లా మొదటి విడత ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. నాణ్యత నిర్ధారణ కోసం ఇంజనీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఐఐటీలు ఇతర సంస్ధల సహకారంతో శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. అలాగే లే అవుట్ల వద్ద నీటి సదుపాయం, తదితర మౌలిక వసతుల కల్పనపైనా సీఎం సమీక్షించారు. రూరల్, అర్బన్ కలిపి 9,024 లే అవుట్లలో తాగునీరు, కరెంటు సదుపాయాలపై సీఎం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే...: ►ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నీళ్లు, కరెంటు సౌకర్యాలు ఏర్పాటులో ఏమైనా సమస్యలు ఉంటే శరవేగంగా పరిష్కరించాలని సీఎం ఆదేశం.. ►దీనిమీద మరింత ధ్యాస పెట్టండి. ►వారంరోజుల్లో అన్ని లే అవుట్లలో పనులు పూర్తికావాలి. ►ఇళ్ల నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని రవాణా ఛార్జీలు సహా ఇతరత్రా రేట్లు అమాంతంగా పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ►రూ.34వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం అన్నది ఒక కల. ►గతంలో రాష్ట్రంలోకాని, దేశంలోకాని మౌలిక సదుపాయాల కల్పనకు ఇలా ఖర్చు చేసిన దాఖలాలు లేవు ►ఇంత పెద్ద లక్ష్యాన్ని గతంలో ఎవరూ ఆలోచన చేయలేదు ►దేవుడి దయ వల్ల ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టాం. ►అవినీతికి తావుండకూడదు. ►నాణ్యతకు పెద్ద పీట వేయాలి. ►మనసా, వాచా, కర్మేణా ఈ పనుల పట్ల అధికారులు అంకితభావాన్ని ప్రదర్శించాలి. ►అప్పుడే ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతాం. ►ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టాలన్న ఆలోచన కూడా గతంలో ఎవరూ చేయలేదు. ►దీన్ని నిజం చేయాలని నేను తపన పడుతున్నాను. ►నా కల నిజం కావాలంటే మీ అందరి సహకారం కావాలి. మనందరి కల - పేదవాడి కల కావాలి ►నా కల మీ అందరి కల కావాలి. ►మనందరి కల పేదవాడి కల కావాలి. ►అప్పుడే ఈ కార్యక్రమం సాకారమవుతుంది. ►పేదవాడికి అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందించాలన్నది మన లక్ష్యం. ►దేశం మొత్తం మనవైపు చూస్తోంది. ►పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా ఏర్పాటవుతున్న కాలనీలను మురికివాడలుగా కాదు, పేదవాళ్లకు మంచి ప్రమాణాలున్న ఆవాసాలుగా తీర్చిదిద్దాలి. ►దీనికి పై స్థాయి నుంచి కిందిస్థాయి అధికారి వరకూ సంకల్పంతో ముందుకు సాగాలి: నాణ్యత పై ఫిర్యాదులు, సలహాలకు ప్రత్యేక నెంబరు ►అవినీతికి తావులేని, నాణ్యతతో కూడిన పనులు చేయాలి: ►నాణ్యతపై ఫిర్యాదులు, సలహాలకు ఒక ప్రత్యేక నెంబరు ఏర్పాటు చేయాలి. ►దీనికి సంబంధించి ప్రతి లేఅవుట్లో ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. ►దీని ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్‌పై కూడా ఎప్పటికప్పుడు సమీక్షించాలి. టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్ష ►18 నెలల కాలంలో 2,08,160 యూనిట్లు పూర్తిచేస్తామన్న అధికారులు ►దాదాపు రూ.10వేల కోట్లు వీటికోసం ఖర్చు చేస్తామన్న అధికారులు. ఈ సమీక్షా సమావేశానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, ఆర్ధిక శాఖ కార్యదర్శి కెవివి సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ కార్యదర్శి రాహుల్ పాండే, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నారాయణ భరత్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: దిశ యాప్‌పై మరింత చైతన్యం కలిగించాలి -
ఇంకా.. మునకలోనే!
సాక్షి, హైదరాబాద్: చినుకు రాలితే నగరవాసి గజగజ వణికిపోతున్నాడు. వారం రోజులుగా హైదరాబాద్‌ను ముంచె త్తిన వర్షాలు ఇంకా వీడటం లేదు. వరుణుడు శాంతించడం లేదు. బస్తీ ల్లోని పేదలకు ఉపశమనం కనిపించ డం లేదు. రాబోయే మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవ కాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరి కలు జారీ చేయ డంతో హైదరాబాద్ మహానగరంలోని ముంపు ప్రాంతాల ఇళ్లన్నీ ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే వరద వణికిస్తుండగా, మళ్లీ భారీ వర్షాలు పడితే పరిస్థితి ఏంటనే ఆందోళన నెలకొంది. గత వారం రోజులుగా నీళ్లలో నానుతున్న కాలనీలు, బస్తీల్లోని ఇళ్లు, బహుళ అంతస్తుల్లోని కుటుంబాలన్నింటినీ జీహెచ్ ఎంసీ, డీఆర్ఎఫ్ అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. కొత్తగా ముప్పు పొంచివున్న లోతట్టు ప్రాంతాలను కూడా గుర్తించి... ఖాళీ చేయిస్తున్నారు. కొన్ని కుటుంబాలు ఇళ్లు విడిచివచ్చేం దుకు సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. జీవితాన్ని ధారపోసి కొన్నా మని.. ఎలా ఖాళీ చేయాలంటూ బాధితులు కన్నీటిపర్యంతమవు తున్నారు. భారీ వర్షం, వరద నీటితో నానిన భవనాల పునాదులు, గోడలు బలహీనపడి దెబ్బతినే అవకాశం ఉం దని, వాటిల్లో ఉండటం సురక్షితం కాదని అధికారులు అవగాహన కల్పి స్తున్నారు. ఇంకా 200కు పైగా కాలనీలు నీటిలోనే నానుతు న్నాయి. సోమవారం నగరమంతటా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. 37 వేల కుటుంబాలు... నగరంలో నీట మునిగిన కాలనీలకు చెందిన సుమారు 37 వేల కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలినట్లు అధికారగణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో కొందరు పునరావాస కేంద్రాలకు చేరుకోగా, మరికొందరు తమ బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. వాస్తవానికి ముంపునకు గురైన కుటుంబాలు దీనికి రెట్టింపు ఉన్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనను బట్టి తెలుస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలతో వరద చేరి గుర్రంచెరువు, పల్లెచెరువు, అప్పా చెరువులు తెగిపోగా, మరికొన్ని చెరువులు నిండుకుండలుగా మారి ప్రమాదకరంగా తయారయ్యాయి. కొత్తగా గుర్తించిన ముంపు ప్రాంతాలపై సైతం అధికార యంత్రాంగం దృష్టి సారించింది. నీట మునిగిన కాలనీల నుంచి బాధిత కుటుంబాలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రస్తుతం జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ అధికారులు సుమారు 20 బోట్లను వినియోగిస్తుండగా, మరో 30 బోట్లను ఏపీ, కర్ణాటకల నుండి తెప్పించే చర్యలు చేపట్టారు. గడ్డిఅన్నారం డివిజన్లోని కోదండరాంనగర్, శారదానగర్, సీసలబస్తీ, న్యూగడ్డిఅన్నారం కాలనీ, కమలానగర్ ప్రాంతాల్లో వరద నీరు తగ్గకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నీట మునిగిన ఇండ్లలోని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. మల్లికార్జున్‌నగర్, అయ్యప్పకాలనీ వాసులను మాన్సూరాబాద్‌లోని ఎంఈ రెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసి పునరావాస కేంద్రానికి తరలించారు. కాలనీలో పై అంతస్తుల్లో ఉన్నవారికి జీహెచ్ఎంసీ సిబ్బంది కొంత మేరకు పడవల ద్వారా వెళ్లి సహాయం అందించారు. మరోవైపు పలు స్వచ్ఛంద సంస్థలు సైతం వారం రోజులుగా బాధితులను çసురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యాయి. ఎల్బీనగర్ ప్రాంతంలోని కోదండరాం నగర్లో వరద బాధితులను తరలిస్తున్న సహాయక సిబ్బంది పురానాపూల్ బ్రిడ్జికి స్వల్పంగా పగుళ్లు భారీ వర్షం, వరద ఉధృతికి పాతబస్తీలోని పురానాపూల్ కొత్త వంతెనకు స్వల్పంగా పగుళ్లు వచ్చాయి. మూడు దశాబ్ధాల క్రితం నిర్మించిన వంతెన కింది భాగం కొంత శిధిలావస్ధకు చేరుకున్నట్లు కనిపిస్తోంది.సోమవారం జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సీఈ, అధికారులు వంతెనను పరిశీలించారు. వంతెన పైనుంచి భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. 33 మంది మృత్యువాత ఎడతెరిపిలేని భారీ వర్షాలు, వరదలతో రాజధానిలో వారం రోజుల వ్యవధిలో సుమారు 33 మంది మృత్యువాతపడ్డారు. అందులో హైదరాబాద్ నగరానికి చెందిన 18 మంది, శివారు ప్రాంతాలకు చెందిన 15 మంది ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు 29 మందికి సంబంధించిన ఎక్స్‌గ్రేషియా బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. చెరువులు ఇలా.. ♦నగర శివారులోని మీర్‌పేట పెద్ద చెరువుకు వరద ఉ«ధృతి పెరిగి ప్రమాదకరంగా తయారైంది. కట్టతెగే ప్రమాదం ఉన్నందున జనప్రియ మహానగర్, న్యూబాలాజీనగర్, టీఎస్ఆర్నగర్, ఎంఎల్ఆర్నగర్, ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీలు ఖాళీ చేశారు. ఇప్పటికే మంత్రాల చెరువు కట్ట తెగడంతో దిగువన గల మిథులానగర్, సత్యసాయినగర్ కాలనీలు కూడా ఖాళీ అయ్యాయి. ♦తాజాగా మన్సూరాబాద్ చిన్నచెరువు నిండుకుండలా మారి ప్రమాదకరంగా తయారైంది. దీంతో సోమవారం కింది భాగంలోకి కాలనీలు ముంపునకు గురికాకుండా చెరువుకు గండికొట్టి నీటిని డ్రైనేజీ నాళాలోకి మళ్లించే ఏర్పాట్లు చేశారు. ♦జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ చెరువు నిండడంతో కాలువలు తవ్వి వరదనీటిని బయటకు వదిలారు. గంపలబస్తీ, సుభాష్‌నగర్, హనుమాన్ ఆలయం ప్రాంతాల్లో రోడ్లపై వరదనీరు ఏరులై పారింది. ♦టోలిచౌకిలోని నదీమ్‌కాలనీ, విరాసత్‌నగర్ కాలనీ, జమాలి కుంట, వలీ కాలనీ, నీరజా కాలనీలు ఇంకా నీటిలో నానుతూనే ఉన్నాయి. భక్తావర్ గూడ నుండి నిజాం కాలనీ మీదుగా వరద నీరు టోలిచౌకి వచ్చి చేరుతోంది. హకీంపేట్ బుల్కాపూర్ నాలా, హీరానగర్ నాలాలు పొంగిపొర్లుతున్నాయి. వీడని అంధకారం నగరంలో నీట మునిగిన కాలనీలు వారం రోజులుగా చీకటిలోనే మగ్గుతున్నాయి. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా పునరుద్ధరించినా... ఎల్బీనగర్, చార్మినార్ జోన్లలో ఇంకా చాలాచోట్ల కరెంటు లేదు. అపార్ట్మెంట్ సెల్లార్లు,, వీధుల్లో ముంపు కారణంగా ట్రాన్స్ఫార్మర్లకు విద్యుత్ సరఫరా నిలివేశారు. ముంపు ప్రాంతాల్లో వందల కొద్ది విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినగా ఇప్పటివరకు 920 పునరుద్ధరించారు. వరద ఉధృతి తగ్గగానే మిగిలిన ట్రాన్స్ఫార్మర్లకు సరఫరా పునరుద్ధరిస్తామని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు. సహాయక చర్యలు వరద సహాయక, పునరావాస చర్యలను జీహెచ్ఎంసీ చేపట్టింది. ముంపు బాధితులను సహాయ కేంద్రాలకు తరలించి భోజన వసతి కల్పిస్తున్నారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారు. బాధితులకు సీఎం రిలీఫ్ కిట్లను పంపిణీ చేస్తున్నారు. వారం రోజులుగా నీటిలోనే వారం రోజులుగా వరద నీటిలో ఉన్నాం. ఇంట్లో సామగ్రి నీటిలో మునిగిపోయింది. మళ్లీ వర్షం పడే అవకాశం ఉంది... పునరావాస కేంద్రానికి వెళ్లిపోవాలని అధికారులు సూచిస్తున్నారు. చిన్న పిల్లతో ఎక్కడికి పోవాలి. పట్టించుకునేవారు కరువయ్యారు. – విజయ (బాలింత), మల్లికార్జున్‌నగర్ ఇంటిని ఎలా వదిలి వెళ్లాలి జీవితాన్ని ధారపోసి ఇంటిని కొన్నాం. ఖాళీ చేసి ఎలా వెళ్లాలి. వారం రోజులుగా మోకాలి లోతు వరదనీరు ఇళ్లలోకి చేరడంతో నరకం కనిపిస్తోంది. కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నాం. రాత్రంతా జాగారం తప్పడం లేదు. బురద నీటిలో పాములు, విష పురుగులు వస్తున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు పరామర్శలకు పరిమితమవుతన్నారు. కానీ పరిష్కారం చూపించడం లేదు. – మల్లికార్జున్, అయ్యప్పనగర్ -
ప్రాణాలు అరచేతిలో పట్టుకొని...
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరద ఉధృతి హైదరాబాద్ మహానగరాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఆరురోజులుగా సుమారు 90 పైగా కాలనీలు నీట మునిగి నరకయాతన అనుభవిస్తుండగా... తాజాగా శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో పలు చెరువులు తెగి మరో వందకు పైగా కాలనీలు జలదిగ్బంధం అయ్యాయి. ఆదివారం దాదాపు 200 కాలనీలు మునకలోనే ఉన్నాయి. ఇంకా సుమారు 230 వీధులు అంధకారంలోనే మగ్గుతుండగా, తాజాగా మరో 20 కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శివారు ప్రాంతాల చెరువులు సుమారు 70కు పైగా కాలనీలకు ప్రాణ సంకటంగా మారాయి. ఇప్పటికే ముంపు ప్రాంతాల కాలనీ వాసులు సగానికి పైగా ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోగా, మిగతా సగం కుటుంబాలు జల దిగ్బంధానికి గురై బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి నీరు చేరడంతో పాటు నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకుండా పోయాయి. తినడానికి లేక, కంటినిండా కునుకు కరువై జనం విలవిలలాడుతున్నారు. స్నానాల మాట దేవుడెరుగు కనీసం తాగడానికి మంచి నీరు కూడా కరువైంది. గూడు చెదిరి, గుండె చెరువై... సురక్షితంగా బయటపడిన వారు సైతం ఆదుకునే వారు లేక తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. మరోవైపు నాలాలు పొంగిపొర్లుతూ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీలు ఏరులైపారుతూ దుర్గంధంతో వీధులు కంపుకొడుతున్నాయి. శనివారం రాత్రి సరూర్‌నగర్, మేడిపల్లి, చార్మినార్లల్లో భారీ వర్షం నమోదైంది. గుర్రం చెరువు తెగి వరద ఉధృతికి భారీగా వాహనాలు కొట్టుకొని పోగా, ఘట్కేసర్ వెంకటాపూర్‌లోని తాళ్లకుంటకు గండి పడి వరద నీరు పంట పొలాల్లోకి చేరి తీరని నష్టాన్ని మిగిల్చింది. ఉప్పుగూడలోని శివాజీ నగర్లో.. శనివారం అర్ధరాత్రి బాబానగర్ గుర్రం చెరువు తెగి అల్లకల్లోలం సృష్టించింది. ఒక్కసారిగా ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉరుకులు పరుగులు తీశారు. కొందరు ఇంటి పైకప్పుల పైకెక్కి ప్రాణాలను కాపాడుకుంటే.. మరికొందరు సురక్షితప్రాంతాలకు పరుగులు తీశారు. నీటి ఉధృతికి రోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు సైతం నేలమట్టమయ్యాయి. ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు, పెద్ద ఎత్తున గేదెలు కూడా కొట్టుకుపోయాయి. రాత్రంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని చీకట్లో బిక్కుబిక్కుమని గడిపిన ప్రజలు ఉదయాన్నే బతుకుజీవుడా అంటూ రోడ్లపైకి చేరుకునే ప్రయత్నం చేశారు. వరద ధాటికి దిగువ బస్తీలలో ఇళ్లు, ప్రహ రీలు సైతం కూలాయి. గత మంగళవారం కురిసిన భారీ వర్షంతో గుర్రం చెరువు పూర్తిగా నిండి ఎఫ్టీఎల్లో ఉన్న నబీల్ కాలనీ, సయీద్ కాలనీ, రాయల్ కాలనీ, మెట్రో సిటీ, వీఐపీ కాలనీ, అలీ గుల్షన్, మరియం మజీద్ కాలనీ, బార్కాస్ బస్తీలు నీట మునగగా, తాజాగా శనివారం రాత్రి చెరువు తెగడంతో దిగువ గల హఫీజ్‌బాబానగర్ ఎ, బి, సి బ్లాక్‌లతో పాటు నసీబ్‌నగర్, నర్కీపూల్ బాగ్, సాయిబాబానగర్, శివాజీనగర్, అరుంధతి కాలనీ, లలితాబాగ్‌లు జలమయమయ్యాయి. ఉప్పుగూడలోని అరుంధతి కాలనీ.. పెరిగిన వరద... నాలుగు అడుగుల లోతు నీళ్లలో ఉన్న ముంపు కాలనీల కష్టాలను శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం మరింత పెంచింది. కుదుటపడుతున్న వేళలో ముంపు కాలనీల వాసులపాలిట వర్షం పిడుగులా పడింది. అర్ధరాత్రి ముంపు కాలనీలలో ఒకేసారి నీటిమట్టం పెరిగింది. నదీమ్ కాలనీ, విరాసత్‌నగర్ కాలనీ, నీరజా కాలనీ, జమాలి కుంట తదితర ప్రాంతాల్లో సైతం రోడ్లపై ఐదారు అడుగుల మేర వరదనీరు చేరింది. పలుచోట్ల జనం గ్రౌండ్ ఫ్లోర్ ఖాళీ చేసి ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లలోకి మారారు. హీరానగర్ నాలా, బుల్కాపూర్ నాలాలు పొంగిపొర్లాయి. షేక్‌పేట్ బాలాజీనగర్, ఎంజి నగర్లలో కూడా వరదనీరు బీభత్సం సృష్టించింది. చంపా పేట పరిధిలోని మల్రెడ్డి రంగారెడ్డి, ఉదయ్‌నగర్, సూర్యానగర్ కాలనీలో సుమారు 40 ఇండ్లు వరదనీటి ప్రవాహంలో మునిగిపోయాయి. హరిహరపురం కాలనీలో ట్రాక్టర్ల సహాయంతో ఇళ్లలోని సామాన్లను బయటికి తీసుకొచ్చారు. కొన్ని కుటుంబాలు ఇళ్లు వదలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయాయి. మృత్యువాత భారీవర్షాలకు కరెంట్ షాక్‌కు గురై ముగ్గురు మృతి చెందగా, మరోమూడు గుర్తుతెలియని మృతదేహాలు వరద నీటిలో కొట్టుకువచ్చాయి. చిలుకానగర్‌లో సెల్లార్లో నిండిన వరద నీటిని తోడడానికి విద్యుత్ మోటార్‌ను అన్ చేయబోయి ఇంటి యజమాని శ్రీనివాస్ విద్యుత్ షాక్‌తో మృతి చెందగా, నసీబ్‌నగర్‌లో ఓ వ్యక్తి ఇన్వర్టర్ వద్ద షాక్‌కు గురై మృత్యువాత పడ్డాడు. ఫతేనగర్ శోభనాకాలనీలో ఇంజనీరింగ్ వర్కు షాపులో ఎల్.వెంకటనాయుడు (31) విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. బహదూర్‌పురా, దేవిబాగ్, డబీర్‌పురా ఓవైసీ బ్రిడ్జి (నాలా)లో మూడు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి. వణికిస్తున్న చెరువులు ►మీర్‌పేటలోని పెద్ద చెరువుకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో కట్టకింది భాగంలో పలుచోట్ల లీకేజీలు ఏర్పడి ప్రమాదపు అంచుల్లో ఉంది. ►బాతుల చెరువు అలుగు ఉధృతితో పలు కాలనీల్లోకి విషపూరిత పాములు చేరుతున్నాయి. ►బండ్లగూడ చెరువు పూర్తిగా నిండిపోయి ప్రమాదస్థాయికి చేరుకుంది. ►నగరశివార్లలోని జల్పల్లి, బురాన్‌ఖాన్ చెరువులు నిండు కుండలా మారాయి. ఉస్మాన్‌నగర్‌లోని బురాన్‌ఖాన్ చెరువు కట్ట తెగితే నీరు నేరుగా నబీల్ కాలనీ మీదుగా గుర్రం చెరువులోకి....అక్కడి నుంచి తిరిగి పాతబస్తీని ముంచెత్తే అవకాశం ఉంది. ►కొంపల్లిలోని ఫాక్స్‌సాగర్ చెరువు పొంగిపొర్లడంతో సమీపంలోని ఉమామహేశ్వర కాలనీ నీట మునిగింది. ►అంబర్‌పేట నుండి నాగోల్ మెట్రో వరకు రామంతాపూర్ ద్వారా ప్రవహించే అతిపెద్ద వరదనీటి కాలువ కట్టతెగిపోవడంతో కేసీఆర్‌నగర్‌లోని పలు బస్తీల్లో నీళ్లు చేరాయి. ►నాచారం పటేల్‌కుంట చెరువు ప్రమాదకర స్థాయికి చేరి దిగువ ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీరు నిలిచింది. -
జంట నగరాల కాలనీలలో కంపు!
జంట నగరాలంటేనే కాలనీల మయం. ప్రపంచంలోనే అతి పెద్ద కాలనీలు ఇక్కడ ఉన్నా యని గర్వంగా చెప్పుకుంటారు. ప్రతి పెద్ద రోడ్డు పక్కనా కొమ్మల్లా రెమ్మల్లా కాలనీలు మొలుస్తాయ్. ఇవన్నీ బల్దియా పాలనలోనే వర్ధిల్లుతుంటాయి. వాటి సౌలభ్యాన్నిబట్టి మేడలు, మిద్దెలు, బహుళ అంత స్తుల భవనాలతో నిండిపోతుంది. ఇక్కడకూడా పన్నులు భారీగానే పిండుకుంటారు. కానీ, అంతగా పట్టించు కోరు. కార్పొరేటర్ల పాలన, అజమాయిషీ వీటిమీదే అధి కంగా ఉంటుంది. ఇలా నగరం వేగంగా వృద్ధి చెందడం ఆనందంగానే ఉంటుంది. కానీ, ఆరోగ్యంగా మాత్రం ఉండదు. కాలనీ రూపుదిద్దుకునేటపుడే ముందుచూపు, ఆర్థిక స్తోమత ఉన్నవారు ఒకటికి నాలుగు ప్లాట్లు కొని పడేస్తారు. ఒక దాంట్లో ఇల్లు కట్టుకుంటారు. మిగిలిన నాలుగు స్థలాలు ఓ పక్కన పడుంటాయ్. కాలనీ చిక్క పడినకొద్దీ స్థలాల రేట్లు ఆకాశంవైపు చూస్తుంటాయి. అవి మధ్య మధ్యలో ఖాళీగా ఉండి, అందరికీ ‘డంపింగ్ యార్డ్’లుగా మారతాయి. ఇవి కాలక్రమంలో భయంకర మైన అపరిశుభ్ర కేంద్రాలుగా మారతాయ్. ఈగలు, దోమలు, వీధికుక్కలు అక్కడే పుట్టి పెరుగుతుంటాయి. ఈ కరోనా టైంలో వాటిని నిత్యం శుభ్రం చేసేవారు లేక, శానిటేషన్ లేక కాలనీవాసులకు ఎన్ని సమస్యలు తెచ్చి పెట్టాయో అందరికీ తెలుసు. సీజనల్ అంటువ్యాధులు ప్రబలినపుడు మాత్రం కార్పొరేషన్ కుంభకర్ణుడిలా ఒక్క సారి మేల్కొంటుంది. నాలుగు ఫాగింగ్‌లతో ఆవలించి, మళ్లీ నిద్రకి ఉపక్రమిస్తుంది. ఎక్కడైనా కాలనీలలో ఇసుక, కంకర దిగిన ఆనవాళ్లు కనిపిస్తే కార్పొరేటర్లు హడావుడిగా వచ్చేస్తారు. కొలతల ప్రకారం, లెక్కల ప్రకారం ఉందా? లేదా? అంటూ ఇంటి యజమాని ప్రాణం తీస్తారు. ఇది నిత్యం మనం చూసే తంతు. ఈ ఖాళీ ప్లాట్ల యజమానులు తెలియకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపారులైపోతారు. అక్కడ ఏమీ కట్టరు. వాటిని అమ్మరు. వారు ఎక్కడో ఉండి తమ ప్లాట్లని పర్య వేక్షిస్తూ, ధరలు తెలుసుకుంటూ, లాభాలు లెక్కించు కుంటూ ఉంటారు. వాళ్ల ఖాళీ ప్లాట్లు ఎంత అశుభ్రంగా చెత్త నిలయంగా ఉన్నాయో వారికి తెలిసినా పట్టించు కోరు. కాలనీవాసులకి ఈ ఖాళీ స్థలాలు నానారకాల చెత్తల్ని వదిలించుకోవడానికి చేతివాటంగా అందు బాటులో ఉంటాయి. ఇదంతా కార్పొరేషన్ వారే బాధ్యత తీసుకుని బాగు చేస్తారని, బాగు చేయాలని అనుకుంటారు. ఎవ్వరూ ఏమీ పట్టించుకోరు. నిత్యం రకరకాల బయో వ్యర్థాలు ఆ గుట్టల్లో పడి ఎంత అనా రోగ్యాన్ని సృష్టిస్తాయో అందరికీ తెలుసు. ఇక మధ్య మధ్య పడే వానజల్లులు మరింత అపకారం కలిగిస్తాయి. చిన్న ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ వేస్తారు. అందు లోకి కావల్సినంత చెత్తపడుతుంది. ఇది మనవాళ్ల నైజం. దీన్ని పూర్తిగా అరికట్టాలి. ఇది ఒక జంట నగరాల లోనే కాదు రెండు రాష్ట్రాల పెద్ద నగరాలన్నింటిలో ఉన్న సమస్య. విజయవాడ, గుంటూరు, ఏలూరు, తెనాలి ఏదైనా కావచ్చు ఇలాంటి భయంకరమైన అశుభ్ర దృశ్యాలతోనే ఎదురవుతాయి. కార్పొరేషన్లు ముందు వాటిపై నిఘాపెట్టాలి. ధరలొస్తాయని కొనిపడేసిన స్థలా లపై అజమాయిషీ చాలా ముఖ్యం. పరోక్షంగా రియల్ ఎస్టేట్ చేస్తున్న వారిపై పన్ను అధికం చేయండి. లేదా జప్తు చేయండి. ఫలానా సమయంలోగా నిర్మాణాలు చెయ్యండని చెప్పండి. లేదంటే ఆ స్థలాలని తీసుకుని సద్వినియోగం చెయ్యండి. మనం పదేపదే ‘విశ్వనగరం’ చేస్తామని కబుర్లు చెబితే చాలదు. స్వచ్ఛ భారత్ ఉద్యమానికి ఇవి ఎంతగా అడ్డుతగిలాయో అందరికీ తెలుసు. చాలామంది స్థలాలు కొని, పడేసి ఏ దేశమో వెళ్లిపోతారు. వారికి దోమల బాధ, ఈగల బెడద, పురుగు చెదల గొడవ ఏదీ ఉండదు. ధర వచ్చినపుడు ఫోన్‌మీద అమ్మకాలు సాగిస్తారు. లేదా వాటిని సక్రమంగా పరిశుభ్రంగా నిర్వహించి మిగిలినవారికి ఇబ్బంది లేకుండా చేయ డానికి వాటి యజమానుల నించే అధిక పన్ను వసూలు చేయండి. కార్పొరేటర్లు బాధ్యత వహించాలి. జగన్ మోహన్‌రెడ్డి గ్రామ పంచాయతీల్లో ప్రారంభించిన వ్యవస్థ లాంటి దాన్ని ప్రతి వార్డులోనూ పెట్టాలి. పదవి కోసం కాకుండా, ఎంతో కొంత సేవ చేయడానికి వార్డు లీడర్లు ఉండాలి. స్వచ్ఛ భారత్ ఉద్యమం ఇక్కడ నించే ప్రారంభం కావాలి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ముజఫర్‌నగర్‌లో మారని బాధితుల పరిస్థితి
-
తేరుకుంటున్న నగరం
ఇంకా ముంపులోనే పలు కాలనీలు * సహాయక చర్యలు ముమ్మరం * బాధితులకు ఆహారం, నీరు అందిస్తున్న ఆర్మీ, జీహెచ్ఎంసీ బృందాలు సాక్షి, హైదరాబాద్: కుండపోత వర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్ నగరంలో ఆదివారం వర్షం కాస్త తెరిపినిచ్చింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం తొలగి కాస్త ఉపశమనం లభించింది. భారీ వర్షాలకు నిండా మునిగిన నిజాంపేట్‌లోని భండారీ లే అవుట్లో ఇంకా 25 అపార్ట్మెంట్లు వరద నీటిలోనే ఉన్నాయి. విద్యుత్ సరఫరా ఇంకా పునరుద్ధరించకపోవడంతో వాటిల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్వచ్ఛంద సంస్థలు ఆహారం, మంచినీరు, మందులు అందజేస్తున్నాయి. ఇక దూలపల్లి, కొంపల్లి, గుండ్లపోచంపల్లి చెరువులు అలుగుపోస్తుండడంతో కొంపల్లి పరిధిలోని ఉమామహేశ్వర కాలనీ నుంచి 500 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఫాక్స్ సాగర్‌కు ఎగువ భాగంలో ఉన్న ప్రాంతంలో 160 ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. ఇక అల్వాల్‌లోని రెడ్డి ఎన్క్లేవ్, శ్రీనివాసనగర్, భారతినగర్, వెంకటాపురం, భూదేవినగర్, శివనగర్, తుర్కపల్లి ప్రాంతాల్లో వరద నీరు నిలిచే ఉంది. బేగంపేట్ నాలాకు ఆనుకుని ఉన్న అల్లంతోట బావి ప్రాంతం ముంపులోనే ఉంది. ఆర్మీ, జీహెచ్ఎంసీ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. మరిన్ని రోజులు వానలు.. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా అల్పపీడన ప్రభావంతో ముసురు వీడలేదు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు పలు చోట్ల కుండపోత వాన కురిసింది. హకీంపేట్‌లో అత్యధికంగా 7.7 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 4.1, కుత్బుల్లాపూర్‌లో 4, బొల్లారంలో 3.5, చిలకలగూడలో 2.1, బేగంపేట్‌లో 1.7, సరూర్‌నగర్‌లో 1.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో సోమ, మంగళవారాల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. ఇక హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోయింది. నగరానికి ఆనుకుని ఉన్న గండిపేట్ (ఉస్మాన్‌సాగర్) జలాశయం గరిష్ట మట్టం 1790 అడుగులకుగాను ఆదివారం సాయంత్రానికి 1779 అడుగుల నీటిమట్టం నమోదైంది. హిమాయత్‌సాగర్ జలాశయం గరిష్ట మట్టం 1763.5 అడుగులకుగాను 1743 అడుగుల వరకు నీరు చేరింది. ఎగువన వర్షాలు తగ్గడంతో వరద క్రమంగా తగ్గుముఖం పడుతోందని జలమండలి అధికారులు తెలిపారు. -
కాలనీలు.. కన్నీళ్లు
-
వానలే.. వానలు
భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం - నిండుతున్న ప్రాజెక్టులు.. నిండుకుండల్లా చెరువులు - ఉరకలెత్తుతున్న వాగులు, వంకలు పలుచోట్ల స్తంభించిన రవాణా - వేలాది ఎకరాల్లో పంట మునక - మెదక్ జిల్లాలో నలుగురు మృతి - నిజామాబాద్‌లో తల్లీకొడుకులు, వరంగల్‌లో మరొకరు గల్లంతు - ఘణపురం ఆనకట్ట పరిశీలించి వస్తూ నీటిలో చిక్కుకుపోయిన మంత్రి హరీశ్, డిప్యూటీ స్పీకర్ పద్మ.. ప్రత్యేక బస్సు ద్వారా తీసుకొచ్చిన వైనం సాక్షి, నెట్వర్క్: ప్రాజెక్టులు నిండుతున్నాయి.. చెరువులన్నీ నిండు కుండల్లా మారాయి.. వాగులు, వంకలు ఉరకలెత్తుతున్నాయి.. జిల్లాలన్నీ తడిసిముద్దవుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. అనేకచోట్ల వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. రహదారులు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లు కూలాయి. పట్టణ ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. మెదక్ జిల్లాలో ఘణపురం ఆనకట్ట పొంగి పొర్లుతోంది. 20 ఏళ్ల తర్వాత మంజీర నది ఏడు పాయల వద్ద దుర్గమ్మ పాదాలను తాకింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఏడుపాయల వద్ద మంజీరకు హారతి, పసుపు కుంకుమలు సమర్పించారు. ఘణపురం ఆనకట్టను పరిశీలించారు. అనంతరం తిరిగి మెదక్ వస్తుండగా హరీశ్‌రావు, పద్మా దేవేందర్‌రెడ్డి పసుపులేరుకు ఆవల చిక్కుకుపోయారు. దీంతో ప్రత్యేక బస్సులో వారిని ఏరు దాటించాల్సి వచ్చింది. మెదక్.. రాకపోకలు బంద్ మెదక్ జిల్లాలో చెరువులు, కుంటలు, రోడ్లు తెగిపోరుు రాకపోకలు స్తంభించారుు. జిల్లాలో అత్యధికంగా చిన్న శంకరంపేటలో 21.1 సెం.మీ. కుండపోత వర్షం కురిసింది. మెదక్‌లోని గోల్కొండ వీధిలో గుడిసెలో నిద్రిస్తున్న వారిపై పక్కనే ఉన్న పాడుపడిన ఇల్లు పడడంతో అస్తర్గల్ల కళావతి(35), ఆమె కూతురు తులసి భార్గవి(8) అక్కడికక్కడే మరణించారు. సదాశివపేట మండలం ముబారక్‌పూర్‌లో పాత ఇల్లు కూలి శాంతమ్మ(60) అనే వృద్ధురాలు మృతి చెందింది. మెదక్‌కు చెందిన నారుుని స్వామి(52) అల్లవాగులో మునిగి దుర్మరణం చెందాడు. హత్నూర మండలం పల్పనూర్ శివారులో పెద్ద చెరువు వాగులో ఇన్నోవా కారు వరదలో చిక్కుకుపోరుుంది. అందులోని వ్యక్తులు కారును వదిలేసి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలైన నర్సన్నపేట, ఎర్రవల్లి మధ్య రోడ్డు తెగిపోరుుంది. ఘణపురం ఆనకట్ట పొంగి పొర్లుతోంది. డిప్యూటీ స్పీకర్ పద్మ, ఆమె భర్త దేవేందర్‌రెడ్డితో కలసి 101 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఘణపురం పొంగితే 101 టెంకాయలు కొడతానని నాలుగేళ్ల కిందట వనదుర్గకు మొక్కుకున్నట్లు ఆమె తెలిపారు. నల్లగొండ.. ‘జల’గొండ నల్లగొండ జిల్లాలో భారీ వర్షాలకు పెద్దఎత్తున పంట, ఆస్తి నష్టం సంభవించింది. భువనగిరి నుంచి సూర్యాపేట వరకు పెద్ద ఎత్తున చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. ప్రధాన జలాశయాలన్నీ జలకళతో నిండుకుండను తలపిస్తున్నాయి. పులిచింతల ప్రాజెక్టుకు పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మూసీ ఉగ్రరూపం దాల్చింది. కేతేపల్లి మూసీ ప్రాజెక్టులో 9 గేట్లను ఎత్తి 45 వేల క్యూసెక్కులను కిందికి వదులుతున్నారు. ఉదయసముద్రం, పెద్దదేవులపల్లి రిజర్వాయర్లు నిండుకుండను తలపిస్తున్నాయి. రోడ్లు, చెరువులు, కుంటలు తెగిపోవడంతో జిల్లాలోని దాదాపు 10 మండలాల్లోని పలు గ్రామాల నడుమ రాకపోకలు స్తంభించిపోయాయి. జిల్లా వ్యాప్తంగా వర్షాలతో ఇప్పటివరకు ముగ్గురు చనిపోయారని అధికారులు ధ్రువీకరించారు. 285 ఇళ్లు కూలిపోయాయి. 320 మూగజీవాలు చనిపోయాయి. వరంగల్.. కుండపోత కుండపోత వర్షాలకు వరంగల్ జిల్లా మొత్తం అతలాకుతలమైంది. దాదాపు 12 మండలాల్లో 12 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదు అయింది. అత్యధికంగా ధర్మసాగర్ మండలంలో 18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 56 చెరువులకు గండ్లు పడ్డారుు. 17 ఇళ్లు పూర్తిగా, 168 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నారుు. సుమారు 6 వేల మందిని 17 పునరావాస కేంద్రాలకు తరలించారు. నర్సంపేట మండలం మాదన్నపేటకు చెందిన కృష్ణ అనే వ్యక్తి చేపలు పట్టడానికి వెళ్లి వరదలో గల్లంతయ్యాడు. రంగారెడ్డి.. అతలాకుతలం.. రంగారెడ్డి జిల్లాలో చెరువులు, కుంటలు అలుగు పోస్తున్నాయి. వాగులు ఉరకలెత్తుతున్నాయి. చేవెళ్ల, మొరుునాబాద్, షాబాద్, శంకర్పల్లి, నవాబుపేట మండలాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నారుు. మూసీవాగు ఉధృతికి చేవెళ్ల- శంకర్పల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయారుు. ఇబ్రహీంపట్నం మండలంలో 11 ఇళ్లు కూలిపోయాయి. మంచాల మండలం లోయపల్లిలో మొండికుంటవాగు, దర్మారుు చెరువు నీరు రోడ్డుపైకి వచ్చింది. ఆ నీటి ఉధృతికి ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కనున్న వాగులోకి వెళ్లి దిగబడింది. జేసీబీతో దానిని బయటకు లాగారు. బషీరాబాద్ మండలంలో సుమారు 2,500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నారుు. పెద్దేముల్ మండలం మన్ సాన్ పల్లి వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో తాండూరు- హైదరాబాద్ మధ్య రాకపోకలు స్తంభించారుు. కీసర మండలం యాద్గార్పల్లి చౌరస్తా వద్ద గల వాగులో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని మృతదేహం కొట్టుకు వచ్చింది. మహబూబ్‌నగర్.. నీటమునిగిన పంటలు మహబూబ్‌నగర్ జిల్లాలో శుక్రవారం తలకొండపల్లి, కొడంగల్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఆత్మకూర్ మండలంలో 26 ఇళ్లు కూలిపోయాయి. చాలాచోట్ల పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. ఆము దానికి తెగుళ్లు సోకుతున్నా యి. మరికొన్నిచోట్ల ఉల్లి భూమిలోనే మొలకెత్తుతోంది. చేతికొచ్చిన పంట నీట మునిగింది. కరీంనగర్.. పొంగుతున్న చెరువులు కరీంనగర్ జిల్లాలో కరువుతో అల్లాడిన మెట్ట ప్రాంతాల్లో చెరువులు, కుంటలు జలకళ సంతరించున్నాయి. హుస్నాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండడంతో నాలుగు గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి నీటిని వదిలారు. శనిగరం ప్రాజెక్టు నిండి మత్తడి దూకుతోంది. మోయతుమ్మద వాగు పొంగడంతో కోహెడ మండలం బస్వాపూర్ వద్ద హుస్నాబాద్-సిద్దిపేట మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. 24 టీఎంసీల సామర్థ్యం గల ఎల్ఎండీలో ప్రస్తుతం ఆరు టీఎంసీలు ఉండగా భారీగా నీరు వచ్చి చేరుతోంది. 32 అడుగుల సామర్థ్యమున్న ఎగువ మానేరులో 24 అడుగుల వరకు నీరు చేరింది. ఎస్సారెస్పీ నుంచి వరద కాలువకు 16 వేల క్యూసెక్కుల నీరు వదిలారు. కరీంనగర్-సిరిసిల్ల రూట్లో వెళ్లే వాహనాలను బోరుునపల్లి మీదుగా దారి మళ్లించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ముస్తాబాద్‌లోని వెంకట్రావ్‌పల్లిలో వరద ఉధృతితో సిద్దిపేట-ముస్తాబాద్ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం..లోతట్టు ప్రాంతాలు జలమయం ఖమ్మంలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఖమ్మం నగరంతో పాటు ఇల్లెందు, పాలేరు, భద్రాచలం నియోజకవర్గాల్లో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట చేలు మునిగిపోయారుు. చెరువులు, వాగులు అలుగు పోస్తున్నారుు. ఇల్లెందు నియోజకవర్గంలో మూడు ఇళ్లు కూలిపోయారుు. ఇల్లెందు తహసీల్దార్ కార్యాలయం వరండా కూలింది. ఖమ్మం నగరంలో మున్నేరులోకి వరద ఉధృతి ఎక్కువగా ఉంది. బయ్యారం పెద్ద చెరువు అలుగుపారుతోంది. కిన్నెరసాని రిజర్వాయర్‌లోకి భారీగా వర్షపు నీరు వస్తోంది. ప్రస్తుతం నీటిమట్టం 406 అడుగులకు చేరుకుంది. రెండు గేట్లు ఎత్తి 6 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. నిజామాబాద్.. పొంగుతున్న వాగులు, వంకలు నిజామాబాద్ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలో 85 చెరువులు పూర్తి స్థాయిలో నిండాయి. కౌలాస్‌నాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో బిచ్కుంద మండలం పెద్దతొక్కడ్, చిన్నతొక్కడ్ పల్లి, దేవడ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జుక్కల్ మండలంలో నల్లవాగు ప్రధాన రహదారిపై నుంచి ప్రవహిస్తోంది. రాకపోకలు నిలిచిపోయాయి. భిక్కనూరు మండలంలో ఆరేళ్ల తర్వాత ఎడ్లకట్టవాగు ప్రవహించింది. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. వేల్పూర్ మండలం పడకల్ వద్ద లో లెవల్ వంతెనను దాటే ప్రయత్నంలో వరద ఉధృతికి ఓ కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న తల్లీకొడుకులు గల్లంతయ్యారు. కుటుంబంలోని మిగతావారు క్షేమంగా బయటపడ్డారు. కోటగిరి మండలంలో 8, వర్ని మండలంలో 7 ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. బాన్సువాడలో 640 హెక్టార్లలో సోయా పంట దెబ్బతింది. బోధన్, బాన్సువాడ, ఆర్మూర్, గాంధారి ప్రాంతాల్లో పంటలు బాగా దెబ్బతిన్నాయి. మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. దీంతో జిల్లాలోని కందకుర్తి వద్ద నదిలోని శివాలయం మునిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1081.70 అడుగులకు చేరింది. -
కాలనీలు.. కన్నీళ్లు
- హైదరాబాద్‌లో నీట మునిగిన ప్రాంతాల్లో జనం అవస్థలు - నాలుగు రోజులుగా జల దిగ్బంధం నాలుగు రోజులుగా కురుస్తున్న కుండపోత వాన జన జీవితాన్ని అతలాకుతలం చేసింది. హైదరాబాద్‌లోని పలు కాలనీల్లో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మూడు రోజులుగా కరెంటు లేక.. తాగడానికి నీళ్లు లేక.. తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు. అపార్ట్మెంట్ల సెల్లార్లలో నీరు చేరడంతో బయటకు వెళ్లే దారిలేక.. ఆదుకునే వారు కనిపించక.. ఏ క్షణంలో ఏ ఉపద్రవం జరుగుతుందో తెలియక భయాందోళనలో మునిగిపోతున్నారు. నిండా నీటిలో మునిగిపోయిన భండారి లేఅవుట్, నిజాంపేట్ల నుంచి అల్వాల్, కాప్రా, మల్కాజిగిరి, ఉప్పల్, రామంతాపూర్‌ల దాకా చాలా కాలనీలు, బస్తీల ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు. - సాక్షి, హైదరాబాద్ తుర్క చెరువు ఉగ్రరూపానికి వరద నీరు కాలనీల్లోకి చేరడంతో భయానక వాతావరణం నెలకొంది. అపార్ట్మెంట్లలోని సెల్లార్లలో నీరు ఒకవైపు తోడి పోస్తుండగా.. మరోవైపు వరదనీరు వచ్చి చేరుతుండటంతో దిక్కుతోచని స్థితి నెలకొంది. భండారీ లేఅవుట్లోని 47 అపార్ట్మెంట్లలో 3 రోజులుగా కరెంట్ లేదు. పగటిపూట కూడా గాలి, వెలుతురు లేక బాల్కనీల్లోనే ఉంటున్నారు. తాగేందుకు నీళ్లు లేవు. ఇక్కడి ఓ అపార్ట్మెంట్లో పరిస్థితులను ‘సాక్షి’ స్వయంగా పరిశీలించింది. ఆ సమయంలో ఓ ఫ్లాట్‌లో సంగీతా మిశ్రా అనే గృహిణి కొవ్వొత్తుల వెలుగులో కూరగాయలు తరుగుతున్నారు. 4 రోజులుగా తమ కుటుంబం చీకట్లోనే మగ్గుతున్నట్లు ఆమె ఆవేదన వెలిబుచ్చారు. కరెంట్ లేక దోమలతో అవస్థలు పడుతున్నామన్నారు. మరో అపార్ట్మెంట్లోని రెండో అంతస్తులో ఉంటున్న కరుణను పలకరించగా.. బోరున విలపించారు. తనకు భర్త లేడని, ఇద్దరు ఆడపిల్లలని.. ఇంట్లోంచి బయటకు వెళ్లే పరిస్థితి లేక అవస్థలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నాలుగో అంతస్తులో ఉంటున్న సుజాత అనే మహిళ ఫ్లాట్‌లోకి వెళ్లి చూడగా.. చీకట్లోనే పిల్లలకు భోజనాలు పెట్టి వారితో కూర్చున్నారు. బయటకు వెళ్లే పరిస్థితి కూడా లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఖానాజీ గూడ శివనగర్‌లో నివాసం ఉండే సాదుల్లా లక్ష్మమ్మ (60) అనే వృద్ధురాలు శుక్రవారం రాత్రి ఇంటి పక్కనే ఉన్న నాలాలో పడి గల్లంతైంది. దుర్గంధం.. అనారోగ్యాలు: ఇతర ప్రాంతాల నుంచి వచ్చే డ్రైనేజీ నీరంతా వర్షం, వరదల కారణంగా భండారీ లేఅవుట్లోని ఇళ్లలోకి, సెల్లార్లలోకి చేరడంతో భయంకరమైన దుర్గంధం వ్యాపిస్తోంది. కొందరు ఇప్పటికే జ్వరం వంటి అనారోగ్యాల పాలయ్యారు. దీంతో చాలా మంది ఇళ్లను, ఫ్లాట్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. నగర వ్యాప్తంగా.. ► అల్వాల్ ప్రాంతంలోని భారతినగర్, శ్రీనివాసనగర్, ఆనంద్‌రావునగర్, వెస్ట్ వెంకటాపురం, రాంచంద్రయ్యకాలనీ, దినకర్‌నగర్, జోషినగర్, ఆర్బిఐ కాలనీ, పాలమూరు బస్తీ తదితర ప్రాంతాల్లో ప్రజలు నాలుగు రోజులుగా వరద నీటిలోనే గడుపుతున్నారు. ఇల్లు విడిచి బయటకు వెళ్లలేని పరిస్థితి. ► మల్కాజిగిరిలోని బండ చెరువుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద రావడంతో ఎన్ ఎండీసీ కాలనీ, షిర్డీనగర్ తదితర ప్రాంతాలు నీట మునిగిపోయాయి. రహదారుల పై మూడు అడుగులకు పైగా నీరు ప్రవహించింది. ఇళ్లలోకి నీరు చేరడంతో శుక్రవారం రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా గడిపారు. ► ఉప్పల్‌లో చిలుకానగర్, స్వరూప్‌నగర్ రహదారి నీటితో నిండిపోయింది. నాలా ఉప్పొంగడంతో కావేరీనగర్, స్వరూప్‌నగర్, కేకేగార్డెన్ ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో అక్కడి జనం తాళాలు వేసి వెళ్లిపోయారు. ► కాప్రా చెరువు నిండి, దిగువకు నీరు పోటెత్తడంతో దాబాగార్డెన్ , అశోక్ మనోజ్ కాలనీ, సాధన విహార్, గ్రీన్ పార్క్ కాలనీ, ఎస్టీ కాలనీల్లోని రోడ్లు జలమయం అయ్యాయి. అశోక్ మనోజ్ కాలనీలో మూడు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ► కూకట్పల్లి సర్కిల్ ధరణినగర్ నీటితో నిండిపోయింది. నీరు ఇళ్లలోకి చేరి వస్తువులన్నీ తడిసిపోయాయి. ఆల్విన్ కాలనీ, సారుునగర్, తులసీనగర్, దత్తాత్రేయనగర్ కాలనీలూ జలదిగ్బంధమయ్యాయి. ఎప్పుడేం జరుగుతుందోననే భయం వేస్తోంది ‘‘మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మా కాలనీలోని అపార్ట్మెంట్ల సెల్లార్లన్నీ వరదనీటితో నిండిపోయాయి. కరెంటు, తాగేనీరు లేకపోవటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాత్రి పూట కరెంటు లేకుండానే ఉండాల్సి రావడంతో ఎప్పుడేం జరుగుతుందోనని భయం వేస్తోంది..’’ - అనూష, భండారీ లేఅవుట్ నివాసి తాగేందుకు నీళ్లూ లేవు ‘‘మా అపార్ట్మెంట్లో అందరూ తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. మాది వేరే రాష్ట్రం కావడంతో ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి. రెండు రోజులుగా కరెంట్, తాగేనీళ్లు లేవు. పిల్లల కోసమైనా పాలు, నీళ్లు, ఇతర వస్తువులు తెచ్చుకోవడం ఇబ్బందికరంగా మారింది..’’ - పింకీ స్వెరుున్ , భండారీ లేఅవుట్ నివాసి అసలు నగరంలోనే ఉన్నామా...? ‘‘అసలు మేం ఉంటున్నది హైదరాబాద్‌లోనా లేక సముద్రం పక్కనా అనిపిస్తోంది. ఎటు చూసినా నీళ్లే. మా బాధను పట్టించుకున్న వారెవరూ లేరు. ఇంట్లో వస్తువులన్నీ నీటిలో మునిగి పోయాయి. తిండి లేదు, నీళ్లు లేవు. అంతా దుర్గంధం వస్తోంది..’’ - పెంటమ్మ, అల్వాల్ -
ఐసిస్, పాకిస్తాన్ నినాదాలతో కాశ్మీర్లో ఉద్రిక్తత
శ్రీనగర్ః కాశ్మీర్ లో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఆర్మీ కాలనీకి వ్యతిరేకంగా యాసిస్ మాలిక్ ఆధ్వర్యంలోని వేర్పాటువాదులు ఐసిస్, పాకిస్థాన్ జెండాలను ఎగురవేసి ర్యాలీ నిర్వహించడం ఉద్రిక్తంగా మారింది. కాశ్మీర్లో ఆర్మీ, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులను వేరు చేసి, సాధారణ ప్రజలనుంచి విడిగా వారికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసేందుకు వారికోసం కాలనీలు కట్టించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వేర్పాటు వాదులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో మిర్వైజ్ ఉమా ఫరూఖ్ నాయకత్వంలో జమ్మూకాశ్మీర్ లోని కాశ్మీరీ పండిట్లు, సైనిక కాలనీలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కాశ్మీర్లో వేర్పాటు వాదులు మరోసారి ఆందోళనకు దిగారు. ప్రత్యేక కాలనీలు ఏర్పడితే తమ పట్టు సడలిపోతుందన్న భావనలో ప్రజల్లో విద్వేషాలు రేపే ప్రయత్నాలు చేస్తున్నారు. కాలనీలు నిర్మించడానికి వీల్లేదంటూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కాలనీలకు వ్యతిరేకంగా, భారత్ ను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్, ఐసిస్ లకు అనుకూలంగా జెండాలను ఊపుతూ, జీవ్ జీవ్ పాకిస్తాన్ అన్న నినాదాలతో నిరసనకారులు ర్యాలీ చేపట్టారు. ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్ళు రువ్వారు. దీంతో పోలీసులు భాష్పవాయు గోళాలను వారిపై ప్రయోగించారు. దీంతో ఆ ప్రాంతం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కాలనీల నిర్మాణానికి కావలసిన భూమిలేదంటూ పీపుల్స్ డెమొక్రెటిక్ పార్టీ అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ భారతీయ జనతాపార్టీ సైనిక, పండిట్ కాలనీల ఏర్పాటును సమర్థించడం స్థానికంగా ఆందోళనకు దారి తీసింది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం కూడ కాలనీల ఏర్పాటుకోసం శ్రీనరగ్ పుల్వామా, బడ్గమ్ జిల్లాల్లో భూమి అందుబాటులో లేదని చెప్పినట్లు పేర్కొన్నారు. సైనిక కాలనీకోసం భూమి లేనప్పుడు కాలనీల ఏర్పాటు విషయాన్ని ఎలా అంగీకరిస్తారంటూ ప్రశ్నించారు. -
శివార్లకు ‘జల’క్!
- దాహార్తితో అల్లాడుతున్న 154 కాలనీలు - మంచినీటి సరఫరా లేక ఇబ్బందులు - నిధుల విడుదలలో గ్రేటర్ నిర్లక్ష్యం - 30 శాతం చెల్లించేందుకు 870 కాలనీలు సిద్ధం - స్పందించని యంత్రాంగం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ శివార్లలోని కాలనీలు, బస్తీల దాహార్తిని తీర్చడంలో జీహెచ్ఎంసీ దారుణంగా విఫలమవుతోంది. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు ఎంపిక చేసిన 154 కాలనీల్లో మంచినీటి సరఫరాకు పైప్లైన్లు, స్టోరేజి రిజర్వాయర్లు నిర్మించేందుకు అవసరమైన రూ.30.62 కోట్ల (70 శాతం వాటా) నిధుల విడుదలలో ఏడాదిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ఇప్పటికే 13.70 కోట్లు (సుమారు 30 శాతం) నిధులను జలమండలికి చెల్లించిన స్థానికులు మంచినీటి కోసం అవస్థలు పడుతున్నారు. 70:30 పథకానికి చెల్లుచీటీ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన జలమండలికి శివారు ప్రాంతాల్లో దాహార్తిని తీర్చేందుకు అవసరమైన మంచినీటి నెట్‌వర్క్‌ను విస్తరించడం ఆర్థికంగా భారంగా పరిణమించింది. దీంతో ఈ బాధ్యతలను జీహెచ్ఎంసీ స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనికోసం స్థానిక కాలనీల ప్రజలు 30 శాతం నిధులు చెల్లిస్తే.. మిగిలిన 70 శాతం జీహెచ్ఎంసీ విడుదల చేయాలని ఏడాది క్రితం నిర్ణయించింది. దీంతో రంగంలోకి దిగిన జోనల్ కమిషనర్లు ఈ పథకం కింద శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో సుమారు 154 కాలనీలను ఎంపిక చేశారు. అక్కడి ప్రజలు ఈ పథకం ద్వారా మంచినీరుపొందేందుకు తమ వాటాగా 30 శాతం నిధులను జలమండలికి డిపాజిట్ చేశారు. కానీ ఏడాదిగా జీహెచ్ఎంసీ 70 శాతం నిధుల విడుదల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఈ పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. 870 కాలనీలకు ఇదే దుస్థితి.. గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల పరిధిలోని 870 కాలనీలు, బస్తీల్లో తాగునీటి సరఫరా నెట్వర్క్ లేకపోవడంతో స్థానికులు ఫిల్టర్ ప్లాంట్లు, బోరుబావులు, ట్యాంకర్ నీళ్లపైనే ఆధారపడుతున్నారు. ఈ కాలనీ వాసుల నుంచి ఏటా ఠంఛనుగా ఆస్తిపన్ను వసూలు చేసుకొని ఖజనా నింపుకుంటున్న జలమండలి దాహార్తిని తీర్చడంలో విఫలమౌతోందని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఏటా జలమండలికి ఆస్తిపన్ను వాటాగా రూ.125 కోట్లు విడుదల చేయడంలోనూ జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో శివార్ల గొంతెండుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
గ్రేటర్ వార్
మేయర్-కమిషనర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సోమేష్‌కుమార్ నిర్ణయాలను తప్పుబట్టిన మాజిద్ సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ మేయర్ మాజిద్ హుస్సేన్.. కమిషనర్ సోమేశ్‌కుమార్ మధ్య పొసగడం లేదా? పైకి బాగానే ఉన్నా.. లోలోన ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోందనే అనిపిస్తోంది. కమిషనర్ రూ. 5కే భోజన పథకాన్ని ప్రారంభించగా, మేయర్ రూపాయికే టిఫిన్ పథకాన్ని అమలు చేసే యోచన ఉందన్నారు. కమిషనర్ తన చాంబర్ నుంచి కనిపించేలా సీ త్రూ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకోగా.. మేయర్ సైతం తన చాంబర్‌కు మెరుగులు దిద్దించుకుంటున్నారు. ఇప్ప టి వరకు ఇలా ఒకరి దారిలో ఒకరు నడిచిన వీరు తాజాగా, ఒకరి నిర్ణయాలతో మరొకరు విభేదించే పరిస్థితి నెలకొంది. బుధవారం మేయర్ విలేకరులతో మాట్లాడిన అంశాలు దీనినే నిరూపిస్తున్నాయి. మేయర్ స్పందించారిలా.. ‘రోజుకొక సంక్షేమ పథకాలను ప్రకటించడం సరికాదు. ఇప్పటికే ప్రకటించిన వాటిని పూర్తిగా అమలు చేయడంతో పాటు వర్షాకాలం మొదలైనందున చెత్త, పూడికతీత పనులపై శ్రద్ధ చూపాలి. ఎన్నికైన ప్రజాప్రతినిధుల ఆమోదం పొందాకే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలి. ఓ వైపు నాలాల్లో పూడిక పేరుకుపోయింది. మరోవైపు ప్రతిష్టాత్మక మెట్రోపొలిస్ సదస్సు పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. మొదట వాటిపై శ్రద్ధ చూపాలి’ అని పరోక్షంగా కమిషనర్ తీరుపై మేయర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికంగా అవసరమైన పనులను ఆయా కాలనీలు, బస్తీల సంఘాలకే అప్పగించే యోచన ఉందని, స్టాండింగ్ కమిటీలో అనుమతి పొందాక దీనిని అమలు చేయనున్నట్లు కమిషనర్ సోమేష్‌కుమార్ ఇటీవల ప్రకటించారు. ఈ విషయాన్ని తనతో ప్రస్తావించకుండా ప్రకటించడం మేయర్‌కు రుచించి నట్లు లేదు. దీంతో బుధవారం జీహెచ్ఎంసీలో టీడీపీ పక్ష నాయకుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ మేయర్.. కమిషనర్ నిర్ణయాలను తప్పుబట్టారు. డీసిల్టింగ్ పనులు పూర్తయినట్టు స్థానిక కార్పొరేటర్ల నుంచి సంతృప్తికర లేఖలు పొందాలని సూచిస్తే, పది శాతం కార్పొరేటర్ల నుంచే అందాయన్నారు. డీసిల్టింగ్ పూర్తయిందని ఇంజినీర్లు చెబితే చాలదని, స్థానిక ప్రజాప్రతినిధు లు, ప్రజలు సంతృప్తి చెందాలన్నారు. కార్పొరేటర్ల బడ్జెట్ నుంచి ఒక్కొక్కరు రూ.75 లక్షల మేర జలమండలి చేపట్టే పనుల కోసం విడుదల చేస్తున్నందున సదరు పనులపై శ్రద్ధ చూపాలన్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల్ని ఎవరూ కాదనరని, కానీ అంతకంటే ముందు ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే ప్లాస్టిక్, రసాయన, తుక్కు నిల్వ పరిశ్రమల వంటి ప్రమాదకర అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టాలంటూ పరోక్షంగా కమిషనర్ చర్యలను తప్పుబట్టారు. భూసేకరణ అంశాలు త్వరగా పరిష్కా రం కావడం లేవని, జీహెచ్ఎంసీ న్యాయవిభాగం నిద్రపోతోందన్నారు. ఆర్ అండ్ బీ రోడ్లు జీహెచ్ఎంసీకి అప్పగించే వరకు ఆ రోడ్లు బాగుపడవని, అధికారులు ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. వచ్చే వారం నుంచి వరుస సమీక్షలు అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మేయర్ మాజిద్ హుస్సేన్ వచ్చే వారం నుంచి విభాగాల వారీగా వరుస సమీక్షలకు సిద్ధమయ్యారు. సోమవారం : స్టాండింగ్ కమిటీ, జనరల్ కౌన్సిల్ తీర్మానాల అమలు మంగళవారం : {పజావాణిలో అందిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం బుధవారం : ‘ఫేస్ టూ ఫేస్’లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం గురువారం : స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి యూసీడీ పనులపై సమీక్ష శుక్రవారం : పౌరసరఫరాల శాఖ మంత్రిని కలిసి దీపం కనెక్షన్లు, ఇతర అంశాలపై చర్చ. వీలైతే సీఎంను కలిసే యోచన శనివారం : మెట్రోపొలిస్ సదస్సు ఏర్పాట్లు.. పనుల నివేదిక పరిశీలన. వీలునుబట్టి ట్రేడ్ లెసైన్సు ఫీజుల పెంపు, తీర్మాలనాలపై సమీక్ష -
పునరావాస కాలనీ ఆదర్శంగా ఉండాలి
హుజూర్నగర్, న్యూస్‌లైన్ : పులిచింతల పునరావాసులకు నిర్మిస్తున్న కాలనీలు దేశానికి ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాలని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక లక్ష్మీనర్సింహగార్డెన్ ఫంక్షన్హాల్లో పులిచింతల బాధితుల సమస్యలపై అధికారులతో నిర్వహిం చిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. పులిచింతల ముంపుబాధితుల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పునరావాస కాలనీలలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన మౌలిక వసతుల ఏర్పాటు పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. దేశ చరిత్రలో ఏ ప్రాజెక్టు పరిధిలోని ముంపు బాధితులకు కూడా అందని పరిహారా న్ని పులిచింతల బాధితులకు అందజేస్తున్నట్లు తెలిపారు. అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ బాధితుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. గృహనిర్మాణాలకు గాను ఎస్సీ, ఎస్టీలకు లక్షా 18వేలు, ఓసీ, బీసీలకు రూ. 98వేల చొప్పున అందజేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు పరిధిలో భూసేకరణకు రూ.164 కోట్లు, ముంపు బాధితులకు రూ. 43 కోట్ల పరిహారం చెల్లించినట్లు తెలిపారు. రూ. 147 కోట్ల వ్యయంతో లిఫ్ట్‌ల నిర్మాణం చేపట్టి మేళ్లచెరువు, మఠంపల్లి మండలాల భూములకు పులిచింతల ప్రాజెక్టు నుంచి 1.6 టీఎంసీల నీటిని అందజేయనున్నట్లు తెలిపారు. మరో 6 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు మరో లిఫ్ట్ ఏర్పాటు ప్రతిపాదనలో ఉందన్నారు. ప్రతి 15, 20 రోజులకు ఒక సారి పులిచింతల బాధితులతో సమావేశం నిర్వహించి నష్టపరిహార చెక్కులను అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం నేరేడుచర్ల మండలం గుండెబోయినగూడెం ముంపు బాధితులకు రూ.75లక్షలు, సుల్తాన్‌పూర్‌తండా ముంపుబాధితులకు రూ.91 లక్షల చెక్కులను మంత్రి అందజేశారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ చిరంజీవులు, జేసీ హరిజవహర్‌లాల్, హౌ సింగ్ పీడీ శరత్‌బాబు, మిర్యాలగూడ, సూర్యాపేట ఆర్డీఓలు శ్రీనివాసరెడ్డి, నాగన్న, ఏపీఎస్ఐడీసీ డెరైక్టర్ సాముల శివారెడ్డి, ఎన్డీసీఎంఎస్ చైర్మన్ జిల్లేపల్లి వెంకటేశ్వర్లు, పులిచింతల అధికారులు, వివిధ శాఖల డీఈలు, ఏఈలు, ముంపు బాధితులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.