Jeff Bezos On Space Human Colonies: మనిషి తర్వాతి తరాల పుట్టుక అంతరిక్షంలోనే ఉండబోతుందా? మనిషి మనుగడ అక్కడే కొనసాగనుందా? అప్పుడప్పుడు చుట్టపు చూపుగా భూమ్మీదకు వచ్చి చూసిపోతుంటాడా?.. ఈ ప్రశ్నలన్నీ ఇప్పటికైతే అతిశయోక్తి కావొచ్చు! కానీ, భవిష్యత్తులో ఇదే జరిగి తీరుతుందని అంచనా వేస్తున్నాడు అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్.
ఇగ్నాటియస్ ఫోరమ్ 2021లో ‘స్పేస్ ట్రావెల్, భవిష్యత్తులో దాని సామర్థ్యం’ అంశం మీద బ్లూఆరిజన్ ఓనర్ హోదాలో జెఫ్ బెజోస్ ప్రసంగించాడు. కొన్ని వందల సంవత్సరాలు గడిచాక.. మనిషి పుట్టేది అంతరిక్షంలోనే!. అక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని మనిషి బతుకుతుంటాడు. అప్పటికి భూమి ఒక పరిరక్షక గ్రహంగా ఉంటుంది. దానిని చూసేందుకు మనిషి టూరిస్టుగా మారిపోతాడు. కాబట్టి, భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన వ్యాఖ్యానించాడు.
‘‘భూమి ఎంతో విలువైన గ్రహం. కోట్లలో పెరుగుతున్న జనాభాతో భూమ్మీద ఒత్తిడి ఉంటోంది. ఈ కారణంతోనే రాబోయే రోజుల్లో వృక్ష, జంతు సంపద తగ్గిపోవడం ఖాయం. కాబట్టి, పెరుగుతున్న జనాభాకు తగ్గట్లు నివాసయోగ్యమైన ప్రాంతం వెతుక్కోవడంలో తప్పేముంది?. అంగారకుడి లాంటి గ్రహాల మీద జీవనం ఏర్పరుచుకోవడం వల్ల భూమి భారాన్ని తగ్గించొచ్చు. విలువైన జీవన సంపదతో కూడిన అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా భూమిని తీర్చిదిద్దుకోవచ్చు. అందుకు బీజం వేసిది స్పేస్ టూరిజమే’’ అంటూ వ్యాఖ్యానించాడాయన.
Comments
Please login to add a commentAdd a comment