Space Tourism
-
నేడు సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
న్యూఢిల్లీ : భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సమయం ఆసన్నమైంది. భారత కాల మానం ప్రకారం ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి బోయింగ్ స్టార్‌లైనర్ రాకెట్లో ఈ రోజు రాత్రి 10 గంటల సమయంలో అంతరిక్షంలోకి బయలు దేరనున్నారు. అంతరిక్షంలో లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కి వ్యోమగాములను చేరవేసే ప్రాజెక్ట్‌పై బోయింగ్ స్టార్‌లైనర్ పనిచేస్తోంది.ప్రాజెక్ట్‌లో భాగంగా బోయింగ్ స్టార్‌లైన్ రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్లే సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు ఐఎస్ఎస్కు చెందిన హార్మోనీ మాడ్యుల్ సబ్‌సిస్టమ్స్ పనితీరుపై వారం రోజుల పాటు పనిచేయనున్నారు. ఈ పర్యటన విజయవంతమైతే అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో కూడిన మిషన్ల కోసం స్టార్ లైనర్ను సర్టిఫై చేసే ప్రక్రియను నాసా ప్రారంభిస్తుంది. ఇప్పటివరకు ఎలోన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ నాసా సర్టిఫై అయింది. స్టార్ లైనర్ వ్యోమనౌక అంతరిక్ష యాత్ర కూడా విజయవంతమైతే స్పేస్ ఎక్స్ జాబితాలో చేరిపోనుంది.బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక ప్రయోగం గత నెల 7న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆ రాకెట్‌ను నింగిలోకి పంపే రెండుగంటల ముందు వాల్వ్‌లో సమస్య తలెత్తడంతో.. కౌంట్‌డౌన్‌ను నిలిపివేశారు. దీంతో భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీతా, బుచ్ విల్ మోర్ల అంతరిక్షయానం వాయిదా పడింది. తాజాగా భారత కాలమానం ప్రకారం ఈ రోజు సాయంత్రం 10గంటలకు ప్రారంభం కానుంది. 2006లో సునీతా విలియమ్స్ తన తొలి రోదసి యాత్రను చేపట్టారు. ఆ తర్వాత 2012లో రెండో సారి అంతరిక్షంలోకి వెళ్లారు. తాజాగా మరోసారి వెళ్లేందుకు సన్నద్దం అవుతున్నారు. -
రోదసీలోకి తెలుగు తేజం (ఫొటోలు)
-
రూ.6 కోట్లు ఉంటే.. అంతరిక్షంలోకి! నెరవేరనున్న భారతీయుల కల
అంతరిక్షంలో పర్యటించాలనుకునే భారతీయుల కల నెరవేరనుంది. ఈ కల సాకారానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయత్నాలు ప్రారంభించింది. 2030 నాటికి స్పేస్ టూరిజం ప్రాజెక్టును పట్టాలెక్కిస్తామని.. దీనికి సంబంధించిన పని జరుగుతోందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇటీవల ప్రకటించారు. ఇందుకోసం సొంతంగాఒక మాడ్యూల్ తయారు చేస్తున్నట్టు తెలిపారు.టికెట్ ధర రూ.6 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సబ్ ఆర్బిటలా.. ఆర్బిటలా... అంతరిక్ష పర్యటన ఆర్బిటల్గా ఉంటుందా లేక సబ్ ఆర్బిటల్గా ఉంటుందా అనే దానిపై స్పష్టత లేదు. టికెట్ ధర రూ.6 కోట్లు అంటున్నారు కాబట్టి.. ఇది సబ్ ఆర్బిటల్ పర్యటనే అయి ఉండవచ్చని భావిస్తున్నారు. స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణించే వేగాన్ని బట్టి ఆర్బిటల్ పర్యటనా.. సబ్ ఆర్బిటల్ పర్యటనా అనేది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఆర్బిటల్ స్పేస్ క్రాఫ్ట్.. ఆర్బిటల్ వెలాసిటీ (కక్ష్య వేగం)తో ప్రయాణిస్తుంది. సబ్ ఆర్బిటల్ రాకెట్ దాని కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. సబ్ ఆర్బిటల్ ట్రిప్ అయితే స్పేస్ క్రాఫ్ట్‌లో తిరిగి భూమ్మీదకు వచ్చేప్పుడు అంతరిక్షం అంచుల్లో కొద్ది నిమిషాలు తక్కువ గ్రావిటీ వాతావరణంలో (గాల్లో తేలియాడేలా) ఉన్న అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బ్లూ ఆరిజిన్ కంపెనీ సబ్ ఆర్బిటల్ రాకెట్ టూర్‌ను విజయవంతంగా నిర్వహించింది. 2021లో బ్లూ ఆరిజిన్ అధినేత (అమెజాన్ వ్యవస్థాపకుడు) జెఫ్ బెజోస్ మరో ముగ్గురితో కలిసి అంతరిక్షంలో పర్యటించి వచ్చారు. సబ్ ఆర్బిటల్ రాకెట్లు ఆర్థికంగా అందుబాటులో ఉండటంతోపాటు వాటిని రెండోసారి కూడా వినియోగించే అవకాశం ఉంటుంది. పర్యాటక మాడ్యూల్ కోసం ప్రయత్నాలు సబ్ ఆర్బిటల్ స్పేస్ టూరిజం మిషన్ సాధ్యాసాధ్యాలపై ఇస్రో అధ్యయనం చేస్తోందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్ మంత్రి జితేంద్రప్రసాద్ రాజ్యసభలో ఇటీవల వెల్లడించారు. అంతరిక్ష పర్యాటక మాడ్యూల్‌ను తయారు చేసేందుకు నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఐఎన్–స్పేస్) ద్వారా ఇస్రో ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ ఘనత టిటోదే అంతరిక్ష పర్యాటకం చాలాకాలం క్రితమే మొదలైంది. ఆర్బిటల్ స్పేస్ టూరిజాన్ని రష్యన్ స్పేస్ ఏజెన్సీ గతంలోనే ప్రారంభించింది. 2001లో అమెరికన్ మిలియనీర్ డెన్నిస్ టిటో రష్యన్ స్పేస్ ఏజెన్సీకి రూ.165 కోట్లు చెల్లించి స్పేస్ టూరిస్ట్‌గా అంతరిక్షంలో 8 రోజులు గడిపి తిరిగి వచ్చారు. ప్రపంచంలో మొట్టమొదటి స్పేస్ టూరిస్ట్ ఆయనే. కానీ.. 2010లో రష్యన్ స్పేస్ ఏజెన్సీ స్పేస్ టూరిజం కార్యకలాపాలను నిలిపివేయడంతో అంతరిక్ష పర్యాటకం అక్కడితోనే ఆగిపోయింది. అంతరిక్ష పర్యాటకానికి ఎంతో క్రేజ్ అంతరిక్ష పర్యాటకానికి ఎంతో క్రేజ్ ఉంది. అందుకే అంతర్జాతీయంగా వర్జిన్ గెలాక్టిక్, స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్, ఆరిజిన్ స్పాన్, బోయింగ్, స్పేస్ అడ్వెంచర్స్, జీరో టు ఇన్ఫినిటీ వంటి ప్రైవేట్ స్పేస్ టూరిజం కంపెనీలు వాణిజ్యపరంగా స్పేస్ ఫ్లైట్స్‌ను నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాయి. రష్యన్ స్పేస్ ఏజెన్సీ నిలిపివేసిన స్పేస్ టూ రిజం కాన్సెప్ట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్ని స్తున్నాయి. ఆ ప్రయత్నంలో జెఫ్ బెజోస్ విజయం సాధించారు కూడా. వర్జిన్ గెలాక్టిక్ తన స్పేస్ ఫ్లైట్ వీఎస్ఎస్ యూనిటీని 2018లో పరీక్షించడం మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ కంపెనీ స్పేస్ టూరిస్టులు వెయిటింగ్ లిస్ట్ చాలా ఉంది. వాళ్లంతా డిపాజిట్లు కట్టి పర్యటన కోసం ఎదురుచూస్తున్నారు. రాబోయే కాలంలో వాటి సరసన మన ఇస్రో స్పేస్ రాకెట్లు కూడా ఉండే అవకాశం ఉంది. - సాక్షి, అమరావతి -
ఆకాశ వీధి నుంచి.. అందాల వీక్షణం
బుధవారం ఉదయం 6 గంటలు.. అది హైదరాబాద్‌కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలోని వికారాబాద్ ప్రాంతం.. ఆకాశం నుంచి ఏదో భారీ వస్తువు.. మెల్లగా ఖాళీ ప్రదేశంలో దిగింది. చూస్తుంటే ఏదో వ్యోమనౌకలా ఉంది. ఆదిత్య 369 సినిమాలోని ‘టైమ్ మెషీన్’లా ఉందని కొందరు.. ఏదో గ్రహాంతర నౌక కావొచ్చని కొందరు.. ఒక్కసారిగా కలకలం రేగింది. అదేమిటో చూద్దామని పెద్ద సంఖ్యలో జనం అక్కడికి వచ్చారు. మరి అక్కడ ల్యాండ్ అయింది ఏమిటో తెలుసా..? అంతరిక్షంలో చక్కర్లు కొట్టి వచ్చే స్పేస్ క్యాప్సూల్. అది ఇక్కడెందుకు దిగింది? మనకు ఏమిటి సంబంధం? ఆ వివరాలు మీకోసం.. సాక్షి, హైదరాబాద్/ వికారాబాద్/మర్పల్లి: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేపుతున్న స్పేస్ టూరిజం అవకాశాన్ని అందిపుచ్చుకొనేందుకు స్పెయిన్‌లోని మాడ్రిడ్‌కు చెందిన హాలో స్పేస్ సంస్థ ప్రయోగాలు చేస్తోంది. తక్కువ ఖర్చుతో, సులువుగా కొన్ని గంటల పాటు అంతరిక్షంలో తిరిగి వచ్చేందుకు వీలుగా హాట్ ఎయిర్ బెలూన్ స్పేస్ క్యాప్సూల్‌ను రూపొందించింది. సుమారు ఎనిమిది మనుషులు, కొంత సామగ్రి దీనిద్వారా ఆకాశంలో సుమారు 40 కిలోమీటర్ల ఎత్తుకు పంపవచ్చు. అక్కడే ఐదారు గంటల పాటు మెల్లగా ప్రయాణిస్తూ.. భూమి అంచులను, దిగువన మేఘాలను, వందలు–వేల కిలోమీటర్ల కొద్దీ దూరాలను వీక్షించవచ్చు. టీఐఎఫ్ఆర్ కేంద్రం నుంచి.. హైదరాబాద్‌లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) సహకారంతో హాలో స్పేస్ సంస్థ తమ ప్రయోగాన్ని చేసింది. మంగళవారం సాయంత్రం టీఐఎఫ్ఆర్లోని నేషనల్ బెలూన్ ఫెసిలిటీ నుంచి హాలో స్పేస్ హాట్ ఎయిర్‌బెలూన్ క్యాప్సూల్‌ను ప్రయోగించారు. అది అంతరిక్షంలో చాలా ఎత్తుకు చేరి, చక్కర్లు కొట్టిన తర్వాత.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగిద్ద గ్రామ శివార్లలో బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ల్యాండ్ అయింది. అలా పెద్ద పరికరం ఆకాశం నుంచి వస్తుండటంతో మొగిలిగిద్దతోపాటు సమీప గ్రామాల ప్రజలు ఆసక్తిగా తిలకించారు. చాలా మంది తమ సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు కూడా. శాస్త్రవేత్తలు వచ్చి రికవరీ చేసుకుని.. హాట్ ఎయిర్ బెలూన్ స్పేస్ క్యాప్సూల్‌ను ప్రయోగించిన హాలోస్పేస్, టీఐఎఫ్ఆర్ శాస్త్రవేత్తలు దానిని నిరంతరం పరిశీలిస్తూ వచ్చా రు. భూమి నుంచి ఎంత ఎత్తుకు వెళ్లింది, ఎలా సంచరించినదీ ప్రత్యేక పరికరాలతో ట్రాక్ చేశారు. లక్ష్యం మేరకు ప్రయాణం పూర్తయ్యాక నిర్జన ప్రదేశంలో ల్యాండ్ చేశా రు. సాధారణంగా ఈ క్యాప్సూల్‌లో మనుషు లు వెళ్లవచ్చు. అయితే ఇది ప్రయోగాత్మక పరిశీలన కావడంతో వెయ్యి కిలోల బరువున్న వస్తువులను పెట్టి ప్రయోగం చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రయోగం కావడంతో క్యాప్సూల్ 10 కిలోమీటర్లకుపైగా ఎత్తులో 40 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి ల్యాండ్ అయిందని వివరించారు. స్పేస్ క్యాప్సూల్‌లోని పరికరాల డేటాను విశ్లేశించాల్సి ఉందని.. ఆ తర్వాత వాతావరణ పరిస్థితులు అనుకూలించాయా? అంత ఎత్తులో క్యాప్సూల్‌లో పరిస్థితి ఎలా ఉంటుంది, మనుషులను పంపేందుకు ఏమేం మార్పులు అవసరం అనేది తేల్చుతామని వెల్లడించారు. తొలి ప్రయోగం మన వద్దే.. హాలో స్పేస్ సంస్థ వ్యవస్థాపకుడు కార్లోస్ మీరా. స్పేస్ క్యాప్సూల్ రూపకల్పన, ప్రయోగాలకు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కాస్ట్రిల్లో ఆధ్వర్యంలోని 22 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ సంస్థ అంతరిక్ష పర్యాటక రంగంలో తనదైన ముద్ర వేసే దిశగా ప్రయోగాలు చేస్తోంది. ఈ సంస్థ రూపొందించిన స్పేస్ క్యాప్సూల్‌ను తొలిసారిగా హైదరాబాద్‌లోనే ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గుర్తించే డేటా ఆధారంగా మరింతగా అభివృద్ధి/ మార్పులు చేస్తారు. తర్వాత స్పెయిన్‌లో మరో ప్రయోగం చేస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగాలు విజయవంతమైతేఅంతరిక్షంలోకి మనుషులను పంపుతామని వెల్లడించారు. ఒక్కొక్కరికి రూ.కోటిపైనే.. హాలో స్పేస్ క్యాప్సూల్ 800 కిలోల బరువుతో 5 మీటర్ల వ్యాసం, 3.5 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. హాట్ ఎయిర్ బెలూన్ సాయంతో అంతరిక్షంలోకి ఎగుస్తుంది. దీనికితోడుగా ప్యారాచూట్ సాయంతో ల్యాండ్ అవుతుంది. స్పేస్ క్యాప్సూల్‌కు చుట్టూ పెద్ద పెద్ద గాజు అద్దాలను బిగించారు. ఇందులో ప్రయాణించేవారు చుట్టూరా అంతరిక్షాన్ని, భూమిని వీక్షించవచ్చు. ఇందులో మొత్తంగా ఎనిమిది మంది ప్రయాణికులు, ఒక పైలట్ ప్రయాణించవచ్చు. అత్యవసర సామగ్రి, ఆక్సిజన్, రక్షణ ఏర్పాట్లు ఉంటాయి. ఇందులో ప్రయాణించేందుకు ఒక్కొక్కరికి లక్ష నుంచి రెండు లక్షల యూరోలు (మన కరెన్సీలో సుమారు రూ.కోటి నుంచి రూ.2 కోట్లు) ఖర్చవుతుందని హాలో స్పేస్ సంస్థ చెప్తోంది. 2025లో వాణిజ్యపరంగా పర్యటనలను ప్రారంభిస్తామని పేర్కొంది. 2029 నాటికల్లా 400 అంతరిక్షల యాత్రలతో 3 వేల మందిని అంతరిక్షంలోకి తీసుకెళతామని అంటోంది. ఇందులో టూరిస్టులు ఆరు గంటల పాటు ప్రయాణించే వీలుంటుందని హైదరాబాద్ నేషనల్ బెలూన్ ఫెసిలిటీ టెక్నికల్ టీం లీడర్ ప్రసాద్ తెలిపారు. హాట్ ఎయిర్ బెలూన్‌తో ఎలా? వేడిగాలి చల్లటి గాలి కంటే తేలికగా ఉంటుంది. అందువల్ల వాతావరణంలో పైకి వెళ్తుంది. ఈ సూత్రం ఆధారంగానే హాట్ ఎయిర్ బెలూన్ పనిచేస్తుంది. భారీ బెలూన్‌లో వేడి గాలిని నింపి, ఆ వేడిని నియంత్రిస్తూ ఉండటం వల్ల.. ఆకాశంలోకి వెళ్లే ఎత్తు, ప్రయాణాన్ని నియంత్రించవచ్చు. నాణ్యమైన, భారీ బెలూన్లు వందల కిలోల బరువును అంతరిక్షంలోకి కొన్ని కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లగలవు. తర్వాత బెలూన్‌లో గాలిని చల్లార్చడం, తగ్గించడం ద్వారా మెల్లగా కిందికి దిగివచ్చేలా చేయవచ్చు. హాలో స్పేస్ క్యాప్సూల్ ఈ విధానంలోనే పనిచేస్తుంది. మన హైదరాబాదే ఎందుకు? హాలో స్పేస్ సంస్థ రూపొందించిన క్యాప్సూల్ హాట్ ఎయిర్ బెలూన్ సాయంతోనే అంతరిక్షంలోకి వెళుతుంది. అంత ఎత్తులోకి బెలూన్లను ప్రయోగించగల సదుపాయం ఆసియా ఖండం మొత్తంలో మన హైదరాబాద్‌లోనే ఉంది. ఇక్కడి బెలూన్ ఫెసిలిటీ సెంటర్లో మాత్రమే ఉంది. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్)లో ఈ కేంద్రం ఉంది. మన దేశంతోపాటు వివిధ దేశాల వాతావరణ, భూసమీప అంతరిక్ష ప్రయోగాల కోసం ఈ ఫెసిలిటీని వినియోగించుకుంటారు. -
అంతరిక్ష యాత్రకు ఛలో ఛలో.. అది కూడా ఓ బెలూన్‌లో!
Space Tourism: బెలూన్‌లో విలాసంగా విహరించాలని ఉందా? అలాగైతే, ఈ ఫొటోలో కనిపిస్తున్నదే అందుకు సరైన బెలూన్. అలా పైకెగిరి, నాలుగు చక్కర్లు కొట్టేసి నేలకు దిగిపోయే ఆషామాషీ బెలూన్ కాదిది. సరిగా చెప్పాలంటే, ఇదొక కొత్తతరహా వ్యోమనౌక. స్పేస్టూరిజంలో ఇదొక కొత్త ప్రయోగం. ఇందులో కులాసాగా కూర్చుంటే, అంతరిక్షం అంచుల వరకు వెళ్లవచ్చు. నేల మీద నుంచి ఏకంగా లక్ష అడుగుల పైకి వెళ్లి, అక్కడి నుంచి బంతిలా కనిపించే భూగోళాన్ని కళ్లారా తిలకించవచ్చు. ఇదొక్కటే ఇందులోని విశేషం కాదు. ఇందులో స్టార్ హోటళ్లలో ఉండే సమస్త విలాసాలూ సౌకర్యాలూ ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ విలాసాల వ్యోమనౌక పేరు ‘స్పేస్‌షిప్ నెప్ట్యూన్’. అమెరికాకు చెందిన ప్రైవేట్ స్పేస్ టూరిజం సంస్థ ‘స్పేస్ పెర్స్పెక్టివ్’ 2024లో దీని ద్వారా పర్యాటకులను అంతరిక్ష యాత్రకు తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రపంచంలోనే తొలిసారిగా పర్యాటకులకు విలాసవంతమైన అంతరిక్ష యాత్రానుభూతి కల్పించనున్నామని ఈ కంపెనీ చెప్పుకుంటోంది. ‘స్పేస్‌క్రాఫ్ట్ నెప్ట్యూన్’ విస్తీర్ణంలో పూర్తిగా ఒక ఫుట్‌బాల్ మైదానమంత ఉంటుంది. దీని పొడవు ఏడువందల అడుగులు కాగా, పూర్తిగా విస్తరిస్తే, దీని ఘన పరిమాణం 1.8 కోట్ల ఘనపుటడుగులు ఉంటుంది. దీనిలో ప్రయాణిస్తే, 360 డిగ్రీల కోణంలో భూగోళాన్ని పూర్తిగా తిలకించవచ్చునని కంపెనీ వర్గాల సమాచారం. ఇందులో ప్రయాణించాలంటే, 1.25 లక్షల డాలర్లు (రూ.99.61 లక్షలు) చెల్లించి, సీటును బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చదవండి: Scam 1992: '1992 స్కాం' వెబ్ సిరీస్‌లో రాకేష్ ఝున్‌ఝున్ వాలా క్యారక్టర్ ఎవరిదో తెలుసా? -
అంతరిక్షయానం టికెట్ ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
అంతరిక్షంలోకి ప్రయాణించాలనే వారి కోసం అమెరికాకు చెందిన వర్జిన గెలాక్టిక్ అనే సంస్థ టికెట్లను తిరిగి అమ్మడం ప్రారంభించింది. ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో కమర్షియల్ ఫ్లైట్లను నడపాలని నిర్ణయించినట్లు సంస్థ ప్రకటించింది. గత ఏడాది జూలైలో వర్జిన్ గెలాక్టిక్ పూర్తి సిబ్బందితో అంతరిక్షయానం చేసిన ఆరుగురిలో కంపెనీ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ కూడా ఉన్నారు. ఆ అంతరిక్షయానం విజయవంతం కావడంతో ఆసక్తి గల పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకొని వెళ్లాలని నిర్ణయించింది. ఈ టికెట్ ధరను 4.5 లక్షల డాలర్లు(సుమారు రూ. 3.37 కోట్లు)గా నిర్ణయించినట్లు పేర్కొంది. టికెట్ కావాలనుకున్న వారు ముందుగా 1.5 లక్షల డాలర్లను డిపాజిట్ చేయాలని.. మిగిలిన మెుత్తాన్ని ప్రయాణానికి ముందు చెల్లించవచ్చని వర్జిన్ గెలాక్టిక్ స్పష్టం చేసింది. "ఈ సంవత్సరం చివరి నాటికి 1000 మంది ప్రయాణికులను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు" సీఈఓ మైఖెల్ కాల్ గ్లాజియెర్ అన్నారు. గత ఏడాది నవంబర్ నాటికి కంపెనీ 700 టికెట్స్ విక్రయించినట్లు తెలిపింది. 2004లో స్థాపించబడిన వర్జిన్ గెలాక్టిక్ గత జూలైలో హై ప్రొఫైల్ టెస్ట్ మిషన్ విజయవంతం అయిన సంగతి తెలిసిందే. 2022 చివరి నాటికి తన మొదటి చెల్లింపులు చేసిన వినియోగదారులను అంతరిక్షంలోకి తీసుకొని వెళ్లాలి అనేది సంస్థ లక్ష్యం. There are few things as transformative as seeing Earth from above. Reserve your seat to experience something extraordinary. Spaceflight reservations are now open at https://t.co/5UalYT7Hjb. pic.twitter.com/9hnrjwBdG7 — Virgin Galactic (@virgingalactic) February 16, 2022 అంతరిక్షయానం కోసం టికెట్ బుక్ చేసుకునే టూరిస్టులకు న్యూ మెక్సికో, యూఎస్ఏలోని స్పేస్ పోర్ట్ అమెరికా హోటల్ లో కొన్ని రోజుల పాటు విడిధి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ విడిధి పర్యటనకు ముందు మాత్రమే అందిస్తున్నట్లు తెలిపింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో మెుదటి స్పెస్ ఫ్లైట్ టూర్ ఉంటుందని వెల్లడించింది. ఈ ప్రయాణం సుమారు 90 నిమిషాలు పాటు కొనసాగుతుందని వెల్లడించింది. ఈ సమయంలో కొన్ని నిమిషాల పాటు ప్రయాణికులు వెయిట్ లెస్ నెస్ స్థితిని అనుభూతి చెందుతారని వర్జిన్ గెలాక్టిక్ వెల్లడించింది. ఇప్పటికే వాణిజ్య ప్రయాణీకులను అంతరిక్షంలోకి తీసుకొని వెళ్లాలని జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్, ఎలోన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థలు స్పేస్ టూరిజం రంగంలో ఒకదాని వెనుక మరొకటి పోటీ పడుతున్నాయి. (చదవండి: హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్లకు శుభవార్త..!) -
మరో ఐదేళ్లకు మార్స్‌పై జెండా ఎగరేద్దాం
స్పేస్ టూరిజం.. ఇప్పుడు ఇది సర్వసాధారణంగా మారిపోయింది. భూమి నుంచి 100 కిలోమీటర్లు దాటితే వచ్చే.. ఖర్మాన్ లైన్‌ను అంతరిక్షంగా ఫీలైపోతున్నారు. ఈ విషయంలో పోటీ స్పేస్‌ఏజెన్సీలకు దీటైన సమాధానమిస్తూ సిసలైన స్పేస్ యాత్రను.. అదీ సాధారణ పౌరులకు రుచి చూపించి శెభాష్ అనిపించుకున్నాడు ఎలన్ మస్క్. ఈ స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఇప్పుడు ఆసక్తికర ప్రకటన చేశాడు. రాబోయే ఐదేళ్లలో మనిషి మార్స్ మీదకు చేరడం ఖాయమని, అందుకు తనది హామీ అని, అదీ స్పేస్ఎక్స్ ద్వారానే సాధ్యమవుతుందని ధీమాగా చెప్తున్నాడు. ‘రాబోయే ఐదేళ్లలోనే మార్స్ మీదకు మనిషిని తీసుకెళ్లడం మా బాధ్యత. ఒకవేళ వరెస్ట్ సినారియో ఎదురైతే మాత్రం.. మరో పదేళ్లు పట్టొచ్చు. కానీ, ఆ పదేళ్ల నడుమ మార్స్ యాత్ర జరిగి తీరుతుంది. అందుకు నాదీ హామీ’అని ప్రకటించాడు ఎలన్ మస్క్. పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు మస్క్. అయితే డెడ్లైన్లను మిస్ కావడం ఎలన్ మస్క్‌కి కొత్తేం కాదు. గతంలో టెస్లా, స్పేస్ఎక్స్ సహా చాలా ప్రయోగాల విషయంలో ఇదే జరిగింది. కానీ, మార్స్ మీదకు మనిషి ప్రయాణం అనేది ఎలన్ మస్క్ చిన్ననాటి కల. ఆ కలే అతనితో రాకెట్ ఇంజినీరింగ్‌తో పాటు స్పేస్ఎక్స్ ప్రయోగానికి బీజం వేయించింది. మరి అలాంటిదాన్ని తప్పే ప్రసక్తే లేదనుకోవచ్చు మరి. -
అందుకోసమైనా భూమిని కాపాడుకుందాం.. బెజోస్ ఆసక్తికర వ్యాఖ్యలు
Jeff Bezos On Space Human Colonies: మనిషి తర్వాతి తరాల పుట్టుక అంతరిక్షంలోనే ఉండబోతుందా? మనిషి మనుగడ అక్కడే కొనసాగనుందా? అప్పుడప్పుడు చుట్టపు చూపుగా భూమ్మీదకు వచ్చి చూసిపోతుంటాడా?.. ఈ ప్రశ్నలన్నీ ఇప్పటికైతే అతిశయోక్తి కావొచ్చు! కానీ, భవిష్యత్తులో ఇదే జరిగి తీరుతుందని అంచనా వేస్తున్నాడు అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్. ఇగ్నాటియస్ ఫోరమ్ 2021లో ‘స్పేస్ ట్రావెల్, భవిష్యత్తులో దాని సామర్థ్యం’ అంశం మీద బ్లూఆరిజన్ ఓనర్ హోదాలో జెఫ్ బెజోస్ ప్రసంగించాడు. కొన్ని వందల సంవత్సరాలు గడిచాక.. మనిషి పుట్టేది అంతరిక్షంలోనే!. అక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని మనిషి బతుకుతుంటాడు. అప్పటికి భూమి ఒక పరిరక్షక గ్రహంగా ఉంటుంది. దానిని చూసేందుకు మనిషి టూరిస్టుగా మారిపోతాడు. కాబట్టి, భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన వ్యాఖ్యానించాడు. ‘‘భూమి ఎంతో విలువైన గ్రహం. కోట్లలో పెరుగుతున్న జనాభాతో భూమ్మీద ఒత్తిడి ఉంటోంది. ఈ కారణంతోనే రాబోయే రోజుల్లో వృక్ష, జంతు సంపద తగ్గిపోవడం ఖాయం. కాబట్టి, పెరుగుతున్న జనాభాకు తగ్గట్లు నివాసయోగ్యమైన ప్రాంతం వెతుక్కోవడంలో తప్పేముంది?. అంగారకుడి లాంటి గ్రహాల మీద జీవనం ఏర్పరుచుకోవడం వల్ల భూమి భారాన్ని తగ్గించొచ్చు. విలువైన జీవన సంపదతో కూడిన అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా భూమిని తీర్చిదిద్దుకోవచ్చు. అందుకు బీజం వేసిది స్పేస్ టూరిజమే’’ అంటూ వ్యాఖ్యానించాడాయన. చదవండి: భూమ్మీద కాదు, అంతరిక్షంపై ఆదిపత్యం కోసమే! -
‘నువ్వింక మారవా?’.. ఎలన్ మస్క్ రిప్లై ఇది
సంపాదించడంలోనే కాదు.. అందులోంచి దానాలు చేయడం ద్వారా కూడా ధనికులు కొందరు శెభాష్ అనిపించుకుంటున్నారు. బిల్‌గేట్స్, వారెన్ బఫెట్, మార్క్ జుకర్‌బర్గ్ లాంటి అపర కుబేరులు సైతం ఈ లిస్ట్‌లో ఉన్నారు. కానీ, ఈ జాబితాలో టాప్ 2 పొజిషన్లో ఉన్నవాళ్లు మాత్రం.. చాలా వెనుకంజలో ఉన్నారు. పైగా వీళ్లిద్దరి వ్యవహార శైలిపై తోటి కుబేరులతో పాటు ప్రముఖులు సైతం మడిపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా స్పేస్ టూరిజంలో పోటీతో అపర కుబేరులు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్‌లు అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారు. భూమి మీద ఎన్నో సమస్యల్ని పరిష్కరించే అవకాశం ఉన్నా.. అంతరిక్ష ప్రయోగాల పేరుతో వృధా ఖర్చు చేస్తున్నారనే విమర్శ ఈమధ్య బాగా వినిపిస్తోంది. బిల్‌గేట్స్‌తో పాటు ప్రిన్స్ విలియమ్ లాంటి ప్రముఖులు సైతం విమర్శించిన వాళ్లలో ఉన్నారు. అయితే ఈ విమర్శలపై తాజాగా ఓ రేడియో ఇంటర్వ్యూలో స్పేస్ఎక్స్ బాస్ ఎలన్ మస్క్ స్పందించాడు. ‘విమర్శల నేపథ్యంలో మార్పు ఆశించొచ్చా’ అని రేడియో జాకీ అడిగిన ప్రశ్నకు.. ‘ఆసక్తి-అవకాశం ఉన్నప్పుడు విమర్శలను ఎందుకు పట్టించుకోవడం’ అంటూ సింగిల్ లైన్లో విమర్శలకు తన బదులు ఇచ్చాడు. Hopefully enough to extend life to Mars — Elon Musk (@elonmusk) October 16, 2021 ఇక క్రిప్టో యూట్యూబర్ మ్యాట్ వాలేస్ ట్విటర్లో ఎలన్ మస్క్ సంపద గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ఎలన్ మస్క్ ప్రస్తుత ఆస్తి 861 బిలియన్ డోజ్కాయిన్లకు సమానం. బిల్‌గేట్స్, వారెన్ బఫెట్ల ఆస్తి కలిస్తే ఎంతో.. అంత ఆస్తి ఇప్పుడు ఎలన్ మస్క్ ఒక్కడికే ఉందన్నమాట అంటూ వాలేస్ ట్వీట్ చేశాడు. అయితే ఆ ట్వీట్‌కు ఎలన్ మస్క్ ‘బహుశా.. అంగారకుడి మీద జీవనాన్ని విస్తరించడానికి ఇది సరిపోతుందేమో!’ అంటూ రిప్లై ఇచ్చాడు. అయితే మాట్లాడితే మార్స్ పేరెత్తే ఎలన్ మస్క్.. చిన్నప్పటి కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తున్నాడు . టెక్ మేధావిగా ఎదిగినప్పటికీ మార్స్ మీద మనిషి మనుగడ ధ్యేయంగా స్పేస్‌ఎక్స్‌ను నెలకొల్పి అందుకోసమే కోటాను కోట్ల డాలర్లను వెచ్చిస్తున్నాడు. ఈ క్రమంలో విమర్శలను తాను పట్టించుకోనని చెబుతున్నాడు. అంతేకాదు ఈ వ్యవహారంలో వచ్చే మీమ్స్‌ను సైతం ఆస్వాదిస్తుంటాడు. చదవండి: మస్క్, బెజోస్.. భూమ్మీద ఏక్ నెంబర్ 'పిసినారులు' -
స్పేస్ టూరిజం.. ప్రిన్స్ విలియమ్ ఘాటు వ్యాఖ్యలు
అంతరిక్ష పర్యాటకం.. ఇప్పుడు దీని మీదే ప్రపంచ అపర కుబేరుల ఫోకస్ ఉంది. వరుస ప్రయోగాలతో ప్రపంచానికి ఈ టూరిజం మీద నమ్మకం కలిగించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎవరి స్ట్రాటజీలను వాళ్లు ఫాలో అవుతునారు. అయితే ఈ వ్యవహారంపై Duke of Cambridge ప్రిన్స్ విలియమ్ అసహనం వ్యక్తం చేశారు. స్పేస్ టూరిజం మీద రెండో క్వీన్ ఎలిజబెత్ మనవడు ప్రిన్స్ విలియమ్ మండిపడ్డాడు. వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్ సంస్థలు ప్రైవేటు వ్యక్తుల రోదసి యాత్రలను చేపడుతున్న విషయం తెలిసిందే..! ఈ క్రమంలో స్పేస్ టూరిజం దిశగా రిచర్డ్ బ్రాన్సన్, జెఫ్ బెజోస్, ఎలన్ మస్క్ అడుగులు వేస్తున్నారు. అయితే ఈ గొప్ప బుర్రలు ఆకాశం వైపు చూడడం మానేసి.. ముందుకు నేల మీద ఫోకస్ పెట్టాలంటూ ప్రిన్స్ విలియం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇతర గ్రహాల మీదకు వెళ్లడం, అక్కడ బతకడం లాంటి విషయాలపై దృష్టిపెట్టడం కంటే.. ముందు భూమిని పరిరక్షించుకోవడం, భూమి గాయాలను మాన్పించేందుకు ప్రయత్నించాలని ఆయన కోరారు. విలువైన మేధాసంపత్తిని సంపాదన కోసం కాకుండా.. సమాజ హితవు కోసం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే నెలలో సీవోపీ26 క్లైమేట్ సమ్మిట్ జరగనుంది.. ఈ నేపథ్యంలో విలియమ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గురువారం రాత్రి బీబీసీ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు ప్రసారం అయ్యాయి. 90 ఏళ్ల నటుడు షాట్నర్, బ్లూఆరిజిన్ అంతరిక్ష యానం పూర్తి చేసిన కొద్దిగంటలకే ప్రిన్స్ పై వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇక అంతరిక్ష యాత్రలతో స్పేస్ టూరిజంను అభివృద్ధిచేస్తున్న ధనికులపై.. మైక్రోసాఫ్ట్ అధినేత ఓ అమెరికన్ షోలో ఘాటు వ్యాఖ్యలను చేశారు. బిల్ గేట్స్ షోలో మాట్లాడుతూ... ‘భూమ్మీద మనం ఎన్నో సమస్యలతో సతమతమౌతుంటే...రోదసీ యాత్రలపై దృష్టి పెట్టడం సరికాదన్నారు. మలేరియా, హెచ్ఐవీ లాంటి వ్యాధులుఇంకా అంతంకాలేదు. నాకు వాటిని భూమ్మీద నుంచి ఎప్పుడు రూపుమాపుతామనే భావన నన్ను ఎప్పుడు వేధిస్తూనే ఉంది. ఈ సమయంలో స్పేస్ టూరిజంపై దృష్టిపెట్టడం సరి కాదని బిల్ గేట్స్ సందేశం ఇచ్చారు. చదవండి: ఆ కంపెనీకి భారీగా నిధులను అందిస్తోన్న బిల్‌గేట్స్, జెఫ్‌బెజోస్..! -
మాటల్లో వర్ణించలేని అనుభూతి: లెజెండరీ నటుడు
అప్పుడు రీల్ లైఫ్‌లో.. ఇప్పుడు రియల్ లైఫ్‌లో.. సేమ్ సీన్ రిపీట్ అయ్యింది!. అందుకే ఆ పెద్దాయన భావోద్వేగానికి గురయ్యారు. 11 నిమిషాల అంతరిక్షయానాన్ని తన జీవితంలో కలకాలం గుర్తుండిపోయే అనుభవమని వ్యాఖ్యానించారు. కెనడియన్ నటుడు విలియమ్ షాట్నర్ సహా నలుగురు బ్లూ ఆరిజిన్ ద్వారా అంతరిక్షయానం విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగొచ్చారు. తద్వారా తొంభై ఏళ్ల వయసులో అంతరిక్ష యానం చేసిన అత్యంత వయస్కుడిగా కొత్త చరిత్ర సృష్టించాడాయన. జెఫ్ బెజోస్‌కు చెందిన ప్రైవేట్ స్పేస్‌ఏజెన్సీ సంస్థ బ్లూ ఆరిజిన్ చేపట్టిన రెండో మానవసహిత అంతరిక్ష ప్రయాణ ప్రయోగం విజయవంతంగా పూర్తైంది. నటుడు విలియమ్ షాట్నర్తో పాటు బ్లూ ఆరిజిన్ ఎగ్జిక్యూటివ్ ఆడ్రే పవర్స్, ప్లాంట్ లాబ్స్ కో ఫౌండర్ క్రిస్ బోషుజెన్, మెడిడేటా సొల్యూషన్కు చెందిన గ్లోన్ డె వ్రైస్ 11 నిమిషాల అంతరిక్ష యానంలో పాల్గొన్నారు. ‘‘ఇదొక అద్భుతమైన అనుభూతి. మాటల్లో వర్ణించలేను. అంతరిక్షం నుంచి చూస్తే మన గ్రహం ఎంతో అందంగా కనిపించింది. అదేటైంలో ప్రమాదంలో ఉన్నట్లు అనిపించింది. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది” ఎమోషనల్ అయ్యారు షాట్నర్. పశ్చిమ టెక్సాస్ నుంచి అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం 9.49నిమిషాల సమయంలో బ్లూ ఆరిజిన్ సబ్‌ఆర్బిటల్ రాకెట్(ఎన్ఎస్-18) నింగిలోకి ఎగిసింది. దాదాపు 66 మైళ్ల ఎత్తులో అంతరిక్షంలో గడిపాక.. తిరిగి భూమ్మీదకు చేరుకుంది. ఇదిలా ఉంటే క్యాప్సూల్ దగ్గరికి స్వయంగా వెళ్లి వాళ్లను బయటకు ఆహ్వానించాడు జెఫ్ బెజోస్. అత్యంత వయస్కుడు 60వ దశకలో ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన ‘స్టార్ ట్రెక్’ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నాడు కెనడియన్ నటుడు విలియమ్ షాట్నర్. కెప్టెన్ జేమ్స్ క్రిక్ రోల్లో ఆయన నటన అమోఘం. అయితే ఈయన్ని అంతరిక్ష ప్రయాణం చేయించడం ద్వారా బ్లూ ఆరిజిన్ స్పేస్ టూరిజం బిజినెస్ పెంచాలని భావించారు సదరు ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ బాస్ జెఫ్ బెజోస్. గతంలో నాసా అంతరిక్ష వ్యోమగామి జాన్ గ్లెన్ 77 ఏళ్ల వయసులో డిస్కవరీ షటిల్(1998) ద్వారా యానం పూర్తి చేయగా, అమెరికన్ ఏవియేటర్ వాలీ ఫంక్(82) ఈ ఏడాది జులైలో బ్లూ ఆరిజిన్ విజయవంతంగా పూర్తి చేసిన అంతరిక్ష యానం ద్వారా ఆ ఫీట్ బ్రేక్ చేశారు . అయితే వాలీఫంక్ వెళ్లొచ్చింది.. ఇప్పుడు 90 ఏళ్ల వయసున్న షాట్నర్ వెళ్లొచ్చేది కార్మన్ లైన్ దాకా మాత్రమే. ఇది భూమ్మీద నుంచి 100 కిలోమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది. వీరాభిమాని స్టార్ ట్రెక్కు వీరాభిమాని అయిన జెఫ్ బెజోస్.. తన తొమ్మిదేళ్ల వయసులో ఈ టీవీ సిరీస్ మీద గీసిన ఓ బొమ్మను అపురూపంగా దాచుకోవడం విశేషం. అంతేకాదు స్పేస్ డ్రామాలను ఇష్టపడే బెజోస్.. 2016 స్టార్ టెక్ బియాండ్‌లో ఏలియన్ రోల్లో తళుక్కున మెరిశాడు కూడా. ప్రస్తుత బ్లూ ఆరిజిన్ ప్రయోగం ద్వారా ఇప్పటిదాకా 600 మంది అంతరిక్షయానం పూర్తి చేసుకున్నట్లు అయ్యింది. ఈ ప్రయోగం(బ్లూ ఆరిజిన్ మొదటిది జులైలోనే పూర్తైంది) సక్సెస్ కావడంతో స్పేస్టూరిజంలో బలమైన పోటీ ఇవ్వనుందనే సంకేతాలు పంపింది బ్లూ ఆరిజిన్. చదవండి: దేశీ స్పేస్ పోటీ.. ఆసక్తికరం -
నటుడి అంతరిక్ష ప్రయాణం.. వాయిదా!
ఆయనొక లెజెండరీ నటుడు. ఓ టెలివిజన్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ డమ్ సంపాదించుకున్నారు. అదీ అంతరిక్షానికి ముడిపడిన కథతో నడిచే సిరీస్ కావడం విశేషం. అలాంటి నటుడితో.. స్పేస్ టూరిజం బిజినెస్‌ను పెంచుకోవాలన్న బ్లూ ఆరిజిన్ ప్రయత్నానికి స్పీడ్ బ్రేకర్ ఎదురైంది ఇప్పుడు. 60వ దశకలో ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన ‘స్టార్ ట్రెక్’ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నాడు కెనడియన్ నటుడు విలియమ్ షాట్నర్. కెప్టెన్ జేమ్స్ క్రిక్ రోల్లో ఆయన నటన అమోఘం. అయితే ఈయన్ని అంతరిక్ష ప్రయాణం చేయించడం ద్వారా బ్లూ ఆరిజిన్ స్పేస్ టూరిజం బిజినెస్ పెంచాలని భావించారు సదరు ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ బాస్ జెఫ్ బెజోస్. అక్టోబర్ 12న బ్లూ ఆరిజిన్ సబ్‌ఆర్బిటల్ రాకెట్(ఎన్ఎస్-18) ద్వారా అంతరిక్ష ప్రయాణానికి అంతా సిద్ధం కూడా చేశారు. ఈ దశలో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. బలమైన ఈదురుగాలులతో రాకెట్ లాంఛింగ్‌కు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మంగళవారం ప్రయోగం ఉండబోదని బ్లూ ఆరిజిన్ మిషన్ ఆపరేషన్స్ టీం ప్రకటించింది. బుధవారానికి మిషన్‌ను వాయిదా వేశామని, అయితే వాతావరణం అనుకూలించకపోతే ఆరోజు కూడా ప్రయోగం ఉండదని స్పష్టం చేసింది. చదవండి: బెజోస్.. కొంపముంచిన అంతరిక్ష యాత్ర! ఒకవేళ 90 ఏళ్ల షాట్నర్ అంతరిక్షంలోకి గనుక వెళ్లొస్తే.. అంతరిక్ష యానం పూర్తిచేసిన అత్యధిక వయసు ఫీట్ దక్కించుకున్న వ్యక్తి అవుతారు. గతంలో నాసా అంతరిక్ష వ్యోమగామి జాన్ గ్లెన్ 77 ఏళ్ల వయసులో డిస్కవరీ షటిల్(1998) ద్వారా యానం పూర్తి చేయగా, అమెరికన్ ఏవియేటర్ వాలీ ఫంక్(82) ఈ ఏడాది జులైలో బ్లూ ఆరిజిన్ విజయవంతంగా పూర్తి చేసిన అంతరిక్ష యానం ద్వారా ఆ ఫీట్ బ్రేక్ చేశారు . అయితే వాలీఫంక్ వెళ్లొచ్చింది.. ఇప్పుడు షాట్నర్ వెళ్లొచ్చేది కార్మన్ లైన్ దాకా మాత్రమే. ఇది భూమ్మీద నుంచి 100 కిలోమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది. చదవండి: 10 నిమిషాల అంతరిక్ష యాత్ర.. ఖర్చు రూ.205 కోట్లు! -
అప్పుడు సినిమాలో...ఇప్పుడు నిజజీవితంలో...సీన్ రిపీట్..!
చిత్ర పరిశ్రమలో సరికొత్త శకానికి నాంది పలుకుతూ రష్యా చిత్ర బృందం అక్టోబర్ 5 న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు బయల్దేరిన విషయం తెలిసిందే. తాజాగా మరో నటుడు అంతరిక్ష యాత్రకు సిధ్దమయ్యాడు. స్పేస్ టూరిజం పరుగులు..! పలు అంతరిక్ష సంస్థలు బ్లూ ఆరిజిన్, స్పేస్ఎక్స్, వర్జిన్ గెలాక్టిక్ స్పేస్టూరిజం కోసం అడుగులు వేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్, వర్జిన్ గెలాక్టిక్ సంస్థలు ప్రైవేటు వ్యక్తులతో అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. తాజాగా జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ రెండో అంతరిక్ష యాత్రను త్వరలోనే చేపట్టనుంది. ఈ యాత్రలో ప్రముఖ హాలీవుడ్ నటుడు విలియమ్ షట్నర్ పాలుపంచుకొనున్నాడు. విలియమ్ షట్నర్ స్పందిస్తూ..ఈ అంతరిక్ష యాత్ర పట్ల ఎంతో థ్రిల్‌గా ఫీల్ అవుతున్నాను. అంతేస్థాయిలో కొంచెం భయం కూడా వేస్తోందని విలియమ్ షట్నర్ పేర్కొన్నారు. ఈ అంతరిక్ష యాత్ర అక్టోబర్ 12 న జరగనుంది. చదవండి: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1120కిమీ ప్రయాణం..! భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే.. స్టార్ ట్రెక్ సినిమాతో ఫేమస్...! స్టార్ ట్రెక్ సినిమాలో కెప్టెన్ జేమ్స్ టి. కిర్క్ పాత్రను విలియమ్ షట్నర్ పోషించాడు. అంతరిక్షానికి సంబంధించిన సినిమాలో స్టార్ ట్రెక్ అప్పట్లో గణనీయమైన విజయాన్ని సాధించింది. విలియమ్ షట్నర్ సినిమాలో పొందిన అనుభూతిని ఇప్పుడు నిజజీవితంలో అంతరిక్ష యాత్రను చేపట్టనున్నాడు. అతి పెద్ద వయస్కుడిగా రికార్డు...! ఒకవేళ బ్లూ ఆరిజిన్ చేపట్టనున్న ప్రయోగం విజయవంతమైతే రోదసీ యాత్రను చేపట్టిన అతి పెద్ద వయస్కుడిగా విలియమ్ షట్నర్ రికార్డును నెలకొల్పనున్నాడు. ప్రస్తుతం విలియమ్ షట్నర్ వయసు 90. గతంలో ఇదే సంస్థ నిర్వహించిన అంతరిక్షయాత్రలో పాల్గొన్న 82 ఏళ్ల వాలీ ఫంక్ అత్యంత పెద్ద వయసురాలిగా రికార్డును నమోదుచేసింది. We can’t wait for your mission to space on #NewShepard @williamshatner. See you at Launch Site One. https://t.co/4MLt2yaKh4 — Blue Origin (@blueorigin) October 5, 2021 చదవండి: ఇంధన ధరలతో సామాన్యులకు చుక్కలు..! ఆ కంపెనీకి మాత్రం కాసుల వర్షమే..! -
అంతరిక్ష రంగంలో మరో సంచలనం..! సరికొత్త ఒరవడికి శ్రీకారం..ఎలన్ మస్క్..!
Elon Musk Inspiration 4 Is Streaming On Netflix: అంతరిక్ష రంగంలో తనదైన మార్క్‌ను చూపించడంలో ఎలన్ మస్క్ ఎప్పుడు ముందుంటాడు. ఒకానొక సమయంలో రాకెట్లకు వాడే బూస్టర్లను తిరిగి వాడేలా చేయవచ్చునని ఫాల్కన్ రాకెట్‌ను ఉపయోగించి విజయవంతంగా నిరూపించాడు. రాకెట్ బూస్టర్లను తిరిగి వాడడంతో రాకెట్ ప్రయోగాలకు అయ్యే ఖర్చును గణనీయంగా తగ్గించగలిగాడు ఎలన్‌మస్క్. అంతరిక్ష రంగంలో వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్ సంస్థలు ప్రైవేటు వ్యక్తులతో అంతరిక్షయాత్రలను విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. లేట్‌గా ఐనా అంతరిక్ష యాత్ర అంటే ఇది అన్నట్లుగా స్పేస్ఎక్స్ ఇన్సిపిరేషన్4 రాకెట్ ద్వారా నలుగురు ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షరంగంలోకి పంపిన విషయం తెలిసిందే. ఇన్సిపిరేషన్4 ప్రయోగంలోని వ్యక్తులను రెండు రోజులపాటు అంతరిక్షంలో ఉండేలా చేసి, ప్రయోగాన్ని స్పేస్ఎక్స్ ద్విగ్విజయంగా పూర్తి చేసింది. తాజాగా ఎలన్‌మస్క్ అంతరిక్ష రంగంలో మరో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్నాడు. నెట్‌ఫ్లిక్స్ లో సందడి.. ఇన్సిపిరేషన్4 లాంచ్ ప్రయోగాన్ని నెట్ఫ్లిక్ ఓటీటీలో స్ట్రీమ్ చేశారు. ఇన్పిపిరేషన్4కు సంబంధించిన పూర్తి ప్రయోగాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయ్యే ఏర్పాట్లను ఎలన్‌మస్క్ చేశాడు. ఇన్సిపిరేషన్4 సిబ్బంది ట్రైనింగ్ నుంచి ల్యాండింగ్ వరకు ఆరు ఎపిసోడ్లను నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్ అవుతోంది. ఈ విధంగా చేయడంతో అంతరిక్షయాత్రల పట్ల మరింత అవగాహన వస్తోందని ఎలన్ మస్క్ భావిస్తున్నాడు. Amazing show about @Inspiration4x mission! https://t.co/0nQua4jGiz — Elon Musk (@elonmusk) October 2, 2021 చదవండి: ఆనంద్ మహీంద్రా, రాకేశ్ జున్‌జున్‌వాలా..అతని తర్వాతే..! -
ప్రపంచ రికార్డును నెలకొల్పనున్న నటుడు...!
పలు అంతరిక్ష సంస్థలు బ్లూ ఆరిజిన్, స్పేస్ఎక్స్, వర్జిన్ గెలాక్టిక్ స్పేస్టూరిజం కోసం అడుగులు వేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్, వర్జిన్ గెలాక్టిక్ సంస్థలు ప్రైవేటు వ్యక్తులతో అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. తాజాగా జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ ద్వారా ప్రముఖ హాలీవుడ్ నటుడు విలియమ్ షట్నర్ రోదసీ యాత్రకు సిద్దమైతున్నట్లు తెలుస్తోంది. చదవండి: గంటన్నర పాటు భారీ ప్రకంపనలతో ఊగిపోయిన మార్స్...! ఒకవేళ బ్లూ ఆరిజిన్ చేపట్టనున్న ప్రయోగం విజయవంతమైతే రోదసీ యాత్రను చేపట్టిన అతి పెద్ద వయస్కుడిగా విలియమ్ షట్నర్ రికార్డును నెలకొల్పనున్నాడు. ప్రస్తుతం విలియమ్ షట్నర్ వయసు 90. గతంలో ఇదే సంస్థ నిర్వహించిన అంతరిక్షయాత్రలో పాల్గొన్న 82 ఏళ్ల వాలీ ఫంక్ అత్యంత పెద్ద వయసురాలిగా రికార్డును నమోదుచేసింది. స్టార్ ట్రెక్ హాలీవుడ్ సినిమాలో కెప్టెన్ జేమ్స్ టి. కిర్క్ పాత్రను విలియమ్ షట్నర్ పోషించాడు. అంతరిక్షానికి సంబంధించిన సినిమాలో స్టార్ ట్రెక్ అప్పట్లో గణనీయమైన విజయాన్ని సాధించింది. గత జూలైలో బ్లూఆరిజిన్ సంస్థ అధినేత జెఫ్‌బెజోస్ కూడినఅతని సోదరుడు మార్క్ బెజోస్, 82 ఏళ్ల వాలీ ఫంక్, 18 ఏళ్ల ఫిజిక్స్ విద్యార్థి ఆలివర్ డెమెన్ కలిసి అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఆలివర్ డెమెన్ అతి తక్కువ వయసులో రోదసీ యాత్రను పూర్తి చేసుకున్న వ్యక్తిగా నిలిచి రికార్డు సృష్టించాడు. చదవండి: Jeff Bezos: జెఫ్‌బెజోస్ దెబ్బకు దిగివచ్చిన నాసా..! -
అమెజాన్, టెస్లా అధినేతలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన బిల్‌గేట్స్...!
Bill Gates Takes A Dig At Jeff Bezos And Elon Musk: గత కొన్ని రోజుల క్రితం వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్ సంస్థలు ప్రైవేటు వ్యక్తుల రోదసి యాత్రలను చేపట్టిన విషయం తెలిసిందే..! ఈ సంస్థల అధినేతలు స్పేస్ టూరిజంను అభివృద్ధి చేయాలనే ఉద్ధేశ్యంతో అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా ఈ సంస్థలు తదుపరి అంతరిక్షయాత్రల కోసం వడివడిగా పనులను జరుపుతున్నాయి. ప్రపంచంలోని బిలియనీర్స్ రోదసి యాత్రలను చేయడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. చదవండి: బిలియనీర్ల కొంపముంచిన చైనా సంక్షోభం.. ! వందల కోట్లు ఆవిరి..! భూమ్మీద ఎన్నో సమస్యలున్నాయి..వాటిపై..! అంతరిక్ష యాత్రలతో స్పేస్ టూరిజంను అభివృద్ధిచేస్తున్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌పై మైక్రోసాఫ్ట్ అధినేత ఓ అమెరికన్ షోలో ఘాటు వ్యాఖ్యలను చేశారు. బిల్ గేట్స్ షోలో మాట్లాడుతూ... ‘భూమ్మీద మనం ఎన్నో సమస్యలతో సతమతమౌతుంటే...రోదసీ యాత్రలపై దృష్టి పెట్టడం సరికాదన్నారు. మలేరియా, హెచ్ఐవీ లాంటి వ్యాధులుఇంకా అంతంకాలేదు. నాకు వాటిని భూమ్మీద నుంచి ఎప్పుడు రూపుమాపుతామనే భావన నన్ను ఎప్పుడు వేధిస్తూనే ఉంది. ఈ సమయంలో స్పేస్ టూరిజంపై దృష్టిపెట్టడం సరి కాదు ’ అని అన్నారు. లేట్ లేట్ షో విత్ జేమ్స్ కోర్డాన్ షోలో పలు అంశాలపై బిల్‌గేట్స్ చర్చించారు . భూగ్రహాన్ని వదిలిపెట్టి ఎప్పుడు ఇతర గ్రహాలకు వెళ్దామనే తపన మీలో లేదని బిల్‌గేట్స్‌ను ఉద్దేశించి షో వ్యాఖ్యత జేమ్స్ కోర్డాన్ పేర్కొన్నారు. Tonight on our special #ClimateNight episode, Bill Gates shares a very good reason for why you haven’t seen him in a rocket ship 🚀 pic.twitter.com/7C8cKarJl0 — The Late Late Show with James Corden (@latelateshow) September 23, 2021 చదవండి: బ్యాంకులకు భారీ షాక్ ? అప్పులు చెల్లించలేని స్థితికి చేరిన మరో సంస్థ ! -
ఇన్స్పిరేషన్–4 ప్రయోగం సక్సెస్: అంతరిక్షం ఇక అందరిదీ
కేప్ కెనవెరాల్: మూడు రోజుల పాటు ముచ్చటగా సాగిన ప్రైవేటు వ్యక్తుల రోదసి యాత్ర విజయవంతంగా ముగిసింది. అపర కుబేరుడు జేర్డ్ ఐసాక్‌మ్యాన్ నేతృత్వంలో నలుగురు పర్యాటకులతో 3 రోజుల క్రితం అంతరిక్షంలోకి వెళ్లిన స్పేస్ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక సురక్షితంగా భూమికి చేరింది. ఫ్లోరిడా తీరంలోని అట్లాంటిక్ మహా సముద్రంలో శనివారం సాయంత్రం స్పేస్ఎక్స్ క్యాప్సుల్ సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇన్స్పిరేషన్–4 పేరుతో నిపుణులైన వ్యోమగాములెవరూ లేకుండా సాధారణ పౌరులతో కూడిన ఈ యాత్ర విజయవంతం కావడంతో భవిష్యత్‌లో మరిన్ని పర్యాటక రోదసి యాత్రలకు బాటలు వేసినట్టయింది. ఈ యాత్రని స్పాన్సర్ చేసిన ఐసాక్ మ్యాన్ స్పేస్ఎక్స్కు ఎంత చెల్లించారో వెల్లడించలేదు. స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ తమ కంపెనీ రాకెట్ ద్వారా మొదటిసారి పర్యాటకుల్ని పంపిన ఘనతని సాధించారు. స్పేస్ఎక్స్ క్యాప్సుల్ సురక్షితంగా భూమ్మీదకి చేరగానే ‘‘మీ మిషన్‌తో అంతరిక్షం మన అందరిదీ’’అన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పినట్టయిందని స్పేస్ఎక్స్ మిషన్ కంట్రోల్ నినదించింది. ఈ ప్రయాణంలో వారు తినడానికి కోల్డ్ పిజ్జా, శాండ్విచెస్, పాస్తా, గొర్రె మాంసం తీసుకువెళ్లారు. పారాచ్యూట్ల సాయంతో నీటిపైకి దిగుతున్న క్యాప్సుల్ అంతరిక్షం ఓ అద్భుతం అమెరికాలోని ఫ్లోరిడాలో కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం రాత్రి స్పేస్ఎక్స్కు చెందిన వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లింది. 585 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ చక్కర్లు కొట్టింది. ఈ క్యాప్సుల్‌కి అతిపెద్ద బబుల్ ఆకారంలో ఉన్న కిటికీని అమర్చారు. ఈ గాజు కిటికీ ద్వారా అందులో ప్రయాణించిన జేర్డ్ ఐసాక్‌మ్యాన్, కేన్సర్ నుంచి కోలుకున్న హేలి అర్సెనాక్స్, డేటా ఇంజనీర్ క్రిస్ సెంబ్రోస్కీ, జియో సైంటిస్ట్ సియాన్ ఫ్రాక్టర్లు అంతరిక్షాన్ని తనివితీరా చూశారు. అలా అంతరిక్షాన్ని చూడడం ఒక అద్భుతమని ఐసాక్‌మ్యాన్ చెప్పారు. రోదసి యాత్ర ముగించుకొని తిరిగి వచ్చాక వారి ఆరోగ్యం బాగానే ఉందని స్పేస్ ఎక్స్ సీనియర్ డైరెక్టర్ బెంజి రీడ్ తెలిపారు. చదవండి: చరిత్ర సృష్టించనున్న ఎలన్ మస్క్..! క్రూ– 3 లేడీ ఇలా వచ్చి అలా వెళ్తోంది -
అప్పుడే అయిపోలేదు.. ఇప్పుడే మొదలైంది
గ్రహరాశులనధిగమించి ఘనతారల పథము నుంచి గగనాంతర రోదసిలో... గంధర్వగోళ తతుల దాటి చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు.. తల్చుకుంటే మనిషి సాధించలేనిది ఏదీ లేదు. గత కొన్నేళ్లుగా పోటాపోటీ అంతరిక్ష పరిశోధనలతో అగ్రపథాన దూసుకుపోతున్నాడు. తాజాగా ప్రైవేట్ ఏజెన్సీ స్పేస్ఎక్స్ ‘ఇన్స్పిరేషన్4’.. చరిత్ర సృష్టించింది. నలుగురు.. అదీ వ్యోమగాములు కానీ వాళ్లు, ఎలాంటి శిక్షణ లేనివాళ్లతో అంతరిక్ష యానం పూర్తి చేయించి.. సురక్షితంగా భూమికి చేర్చడం ద్వారా అంతరిక్షయానంలో కొత్త అధ్యయం లిఖించింది. క్లిక్: బ్రాన్సన్, బెజోస్‌లది ఉత్తుత్తి ఫీట్.. మస్క్ దమ్మున్నోడు! సర్వత్రా ఉత్కంఠ రేకెత్తించిన SpaceX Inspiration ప్రయోగం విజవంతంగా పూర్తైంది. స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా బుధవారం రాత్రి 8గం.2ని. అంతరిక్షంలోకి దూసుకెళ్లిన #Inspiration4 బృందం.. మూడు రోజులపాటు అంతరిక్షంలోనే గడిపింది. తిరిగి డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఫ్లోరిడా సముద్ర భాగాన ల్యాండ్ అయ్యింది క్రూ. బృందంలోని నలుగురు ఆరోగ్యవంతంగా ఉండగా.. వాళ్లను మరికొన్ని గంటలు అబ్జర్వేషన్లోనే ఉంచనున్నారు. అయితే ఏమాత్రం శిక్షణ లేని ఈ నలుగురిని అంతరిక్షంలోకి పంపి.. తద్వారా స్పేస్ టూరిజానికి కొత్త తోవ చూపించాడు ఎలన్ మస్క్. Liftoff of @Inspiration4X! Go Falcon 9! Go Dragon! pic.twitter.com/NhRXkD4IWg — SpaceX (@SpaceX) September 16, 2021 There's the #Inspiration4 crew getting their first taste of natural air after spending about 71 hours in orbit pic.twitter.com/unJXs5TT1A — Joey Roulette (@joroulette) September 18, 2021 Splashdown! Welcome back to planet Earth, @Inspiration4x! pic.twitter.com/94yLjMBqWt — SpaceX (@SpaceX) September 18, 2021 200 మిలియన్ల డాలర్లు.. స్పేస్ఎక్స్ ఇన్స్పిరేషన్4కి ఎంత ఖర్చు అయ్యిందనేది స్పష్టత లేదు. కానీ, ఈ ప్రయోగ ముఖ్యోద్దేశం.. సెయింట్ జూడ్ ఆస్పత్రి క్యాన్సర్ పరిశోధనల కోసం 200 మిలియన్ డాలర్ల సేకరణ. ఫండ్ రైజింగ్ ద్వారా ఈ మొత్తాన్ని రాబట్టాలన్నది ఎలన్‌మస్క్, ఆ నలుగురు స్పేస్ టూరిస్టుల ఉద్దేశం. ప్రస్తుతం అది 154 మిలియన్ డాలర్లకు చేరినట్లు తెలుస్తోంది. బిలియనీర్, షిఫ్ట్ పేమెంట్స్ వ్యవస్థాపకుడు జేర్డ్ ఐసాక్‌మాన్ నేతృత్వంలోని క్రిస్ సెంబ్రోస్కి(యూఎస్ ఎయిర్‌ఫోర్స్ వెటరన్), సియాన్ ప్రోక్టర్(జియోసైంటిస్ట్), హాయిలే ఆర్కేనాక్స్(అంతరిక్షంలోకి వెళ్లిన యంగెస్ట్ అమెరికన్)లతో కూడిన టీం 71గంటల అంతరిక్ష యానం పూర్తి చేసుకుంది. వీళ్లంతా స్ఫూర్తిదాయకమైన నేపథ్యం ఉన్నవాళ్లే. అందుకే ఈ ప్రయోగానికి ఇన్స్పిరేషన్ అనే పేరు పెట్టాడు ఎలన్ మస్క్. అనంతరం డ్రాగన్ క్యాప్సూల్స్ ద్వారా భూమికి చేరుకున్న బృందం.. రెండు సెట్ల పారాషూట్స్తో సురక్షితంగా సముద్ర భాగంలో ల్యాండ్ అయ్యింది. పాటలు వింటూ.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS) కంటే దూరంలో (సుమారు 575 కిలోమీటర్ల) వీళ్లు స్పేస్‌షిప్‌లో గడిపారు. అంతరిక్షంలో ఉన్నంతసేపు.. సైంటిఫిక్ చేసింది ఇన్స్పిరేషన్4 టీం. స్పేస్‌లో మనిషి శరీరం ఎలా ఉంటుదనే అంశంపై ఫోకస్ చేస్తూ పరిశోధనలు చేశారు వాళ్లు. మధ్యమధ్యలో సంగీతం వింటూ.. కుపోలా(క్యాప్సూల్స్‌లోని స్పెషల్ విండో) ద్వారా కుటుంబ సభ్యులతో ఛాటింగ్ చేస్తూ సరదాగా గడిపారు. ప్రోక్టర్ ఏకంగా మెటాలిక్ మార్కర్స్‌తో ఆర్ట్ వర్క్ వేయడం విశేషం. ఇక సెంబ్రోస్కి ఏకంగా గిటార్ వాయించారు. వీటిని ఫండ్ రైజ్‌లో భాగంగా వేలం వేయనున్నారు కూడా. The Inspiration4 crew were all smiles as they gave a tour of the Dragon capsule and zoomed with patients from St. Jude. The mission is raising funds for the children’s hospital and cancer research.@LesterHoltNBC shares this story. pic.twitter.com/LoZF3vgDlx — NBC Nightly News with Lester Holt (@NBCNightlyNews) September 18, 2021 స్పేస్ టూరిజంలో కొత్త ఒరవడి సృష్టించిన స్పేస్ఎక్స్.. ఇన్స్పిరేషన్4 ప్రయోగంతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతోంది. తాజాగా మరో ఐదు ప్రైవేట్ మిషన్ల కోసం కాంట్రాక్ట్ చేసుకుంది. వీటితో పాటు నాసాకు సంబంధించిన మిషన్స్ సైతం ఉండగా.. ప్రత్యర్థి బ్లూ ఆరిజిన్‌తో కలిసి పని చేయాల్సి వస్తుండడం విశేషం. చదవండి: జెఫ్‌బెజోస్ దెబ్బకు దిగివచ్చిన నాసా..! -
అంతరిక్ష పర్యాటకంలో మరో ముందడుగు
-
అంతరిక్ష పర్యాటకంలో మరో ముందడుగు
కేప్ కనావెరల్ (అమెరికా): వ్యోమగాములు లేకుండా, ఎలాంటి అంతరిక్ష యాత్రల అనుభవంలేని సాధారణ పౌరులతో తొలిసారిగా స్పేస్ టూరిజానికి స్పేస్ఎక్స్ రాకెట్‌తో శ్రీకారం చుట్టారు. ఇన్స్పిరేషన్–4 పేరిట మూడు రోజుల పాటు కొనసాగే ఈ అంతరిక్ష యాత్ర పూర్తి వ్యయ ప్రయాసల బాధ్యతలను అమెరికా కుబేరుడు, ఫిష్ట్4 పేమెంట్స్ సంస్థ అధినేత జేర్డ్ ఐసాక్‌మ్యాన్ తన భుజాలకెత్తుకున్నారు. ముగ్గురు ప్రయాణికులతోపాటు తానూ స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌లో కూర్చుని అంతరిక్ష యాత్రకు పయనమయ్యారు. ప్రొఫెషనల్ వ్యోమగాములే లేని ఈ ప్రయోగానికి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మెరిట్ ద్వీపంలో ఉన్న కెన్నడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం వేదికగా నిలిచింది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం గం.5.32 నిమిషాలకు ధవళవర్ణ స్పేస్సూట్లు ధరించిన క్రిస్ సెమ్‌బ్రోస్కీ, జేర్డ్ ఐసాక్‌మ్యాన్, సియాన్ ప్రోక్టర్, హేలే ఆర్సేనెక్స్లతో స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్–9 రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. చదవండి: బిడ్డకు భర్త పేరు పెట్టుకున్న యూఎస్ అమర సైనికుని భార్య ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలతో మొదలైన ఈ ప్రయాణంలో రాకెట్ ఆకాశంలో దాదాపు 160 కి.మీ.ల ఎత్తులో భూమి చుట్టూ పరిభ్రమించనుంది. మూడు రోజులపాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ రాకెట్ గమనాన్ని ఆటోపైలట్‌మోడ్‌లో భూమి మీద నుంచే నియంత్రిస్తారు. తన స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా కేవలం సాధారణ పౌరులనే నింగిలోకి పంపి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం అంతరిక్ష టూరిజం రంగంలోకి అడుగుపెట్టినట్లయింది. నేరుగా అంతరిక్ష ప్రయాణం చేసిన మూడో బిలియనీర్‌గా ఈ–కామర్స్ దిగ్గజం ఐసాక్‌మ్యాన్ చరిత్రలకెక్కారు. ఈ జూలై నెలలోనే ఇప్పటికే తమ సొంత రాకెట్లలో వర్జిన్ గెలాక్టిక్ యజమాని రిచర్డ్ బ్రాన్సన్, బ్లూ ఆరిజిన్స్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్షయానం చేసి అంతరిక్ష పర్యాటక యాత్రల పరంపరను మొదలుపెట్టడం తెల్సిందే. తర్వాతి ప్రయాణాలకు మార్గదర్శకంగా.. ఈ ప్రయాణం విజయవంతమైతే దీనిని తదుపరి సాధారణ ప్రయాణికుల పర్యాటక యాత్రలకు మార్గదర్శకంగా భావించనున్నారు. మూడు రోజుల యాత్రలో భాగంగా ఈ నలుగురి ఆరోగ్య స్థితిని అంతరిక్షంలో పరీక్షించనున్నారు. వారి గుండె కొట్టుకునే వేగం, మేథో శక్తి, నిద్ర, రక్త ప్రసరణ తదితర అంశాలనూ పరిశీలించనున్నారు. ప్రయాణాన్ని వారు మరింతగా ఆస్వాదించేందుకు వీలుగా స్పేస్ఎక్స్ రాకెట్ పై భాగంలో తొలిసారిగా అతిపెద్ద డోమ్ విండోను ఏర్పాటుచేశారు. ‘ఇది అద్భుతం’ అని ఐసాక్‌మ్యాన్ వ్యాఖ్యానించారు. డ్రాగన్ క్యాప్సూల్‌లో ప్రయాణంలో సమస్యలొస్తే ఎలా ఎదుర్కోవాలో వివరిస్తూ వీరందరికీ వాషింగ్టన్లో ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. వచ్చే ఏడాది తొలినాళ్లలో మరో ట్రిప్ ముగ్గురు అత్యంత ధనవంతులైన ప్రయాణికులు, ఒక మాజీ నాసా వ్యోమగామితో వారంపాటు కొనసాగే మరో అంతరిక్ష పర్యాటక యాత్ర వచ్చే ఏడాది తొలినాళ్లలో ఉంటుందని స్పేస్ఎక్స్ వెల్లడించింది. రష్యాకు చెందిన నటి, దర్శకుడు, జపాన్‌కు చెందిన వ్యాపార దిగ్గజం ఈ యాత్రలో పాలుపంచుకుంటారని పేర్కొంది. చదవండి: చైనా మరో కుతంత్రం..! ఏకంగా 30 విమానాశ్రయాల నిర్మాణం..! ఇద్దరు విజేతలు, ఒక హెల్త్‌కేర్ వర్కర్, ఒక కుబేరుడు నలుగురితో మొదలైన ఈ ఇన్స్పిరేషన్–4 యాత్రలో హేలే ఆర్సేనెక్స్ అనే 29 ఏళ్ల మహిళా హెల్త్‌కేర్ వర్కర్ ఉన్నారు. ఎముక క్యాన్సర్ బారినపడి కోలుకున్న ఈమె తాను చికిత్సపొందిన టెన్నెస్సీలోని పరిశోధనా వైద్యశాలలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. నింగిలోకి దూసుకెళ్లిన అత్యంత పిన్న అమెరికన్‌గా ఈమె రికార్డు సృష్టించారు. ప్రయాణికుల్లో ఒకరైన ఐసాక్‌మ్యాన్ ఈ ఆస్పత్రికి 10 కోట్ల డాలర్ల విరాళం ఇచ్చారు. వాషింగ్టన్లో డాటా ఇంజనీర్‌గా పనిచేస్తున్న క్రిస్ సెమ్‌బ్రోస్కీ(42) సైతం యాత్రలో పాలుపంచుకున్నారు. ఆరిజోనాలోని కాలేజీలో జియాలజీ ప్రొఫెసర్ అయిన ఆఫ్రికన్ అమెరికన్ మహిళ సియాన్ ప్రోక్టర్(51) సైతం ఈ యాత్రకు ఎంపికయ్యారు. ప్రయాణికుల ఎంపిక కోసం జరిగిన పోటీలో క్రిస్, ప్రోక్టర్లు విజేతలుగా నిలిచారు. నింగిలోక దూసుకెళ్తున్న ఫాల్కన్ రాకెట్ -
SpaceX: ఇన్స్పిరేషన్ 4.. ఎలన్ మస్క్ దమ్మున్నోడు
SpaceX Inspiration4: తన ఇష్ట సామ్రాజ్యం స్పేస్ఎక్స్ ద్వారా అరుదైన ఘనతలు సాధించాలన్న కలలను సాకారం చేసుకుంటూ పోతున్నాడు అపరకుబేరుడు ఎలన్ మస్క్. మిగతా బిలియనీర్స్లా ఆకాశం హద్దు దాటొచ్చి అంతరిక్ష ప్రయాణం చేశానని గప్పాలు కొట్టుకోవడం లేదు. సరికదా నలుగురు స్ఫూర్తిదాయక వ్యక్తులను తన రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించి.. స్పేస్టూరిజంలో సంచలనానికి తెర లేపాడు. #Inspiration4 ప్రయోగం ద్వారా ఆసక్తికర చర్చకు దారితీశాడు. ఇన్స్పిరేషన్ 4.. ఎలన్ మస్క్ తన స్పేస్ఎక్స్ తాజా అంతరిక్షయానానికి పెట్టిన పేరు. నలుగురు పౌరులను అంతరిక్షంలోకి పంపడం స్పేస్ఎక్స్ ఇప్పుడు అరుదైన ఘనతను దక్కించుకుంది. భారత కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 8గం.2ని. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ఈ నలుగురు స్పేస్ టూరిస్టులను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. 12 నిమిషాల తర్వాత రాకెట్ నుంచి డ్రాగన్ క్యాప్సూల్ విడిపోయింది. దీంతో ఆ క్రూ ఆర్బిట్‌లోకి ప్రవేశించడంతో స్పేస్ఎక్స్ బృందం ఆనందంలో మునిగింది. విశేషం ఏంటంటే.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS) కంటే దూరంలో (సుమారు 575 కిలోమీటర్ల) వీళ్లు స్పేస్‌షిప్‌లో తిరుగాడుతుండడం. 🚀Congratulations, #Inspiration4! Proud to provide the launchpad from @NASAKennedy for the first orbital spaceflight with an all-private crew. Today's launch represents a significant milestone in the quest to make space for everybody. https://t.co/8a37VzN3Xl — NASA (@NASA) September 16, 2021 మూడురోజుల తర్వాత స్పేస్ఎక్స్ ఇన్స్పిరేషన్4లో పాల్గొంటున్న ఈ బృందం.. ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ కానుంది. ఇదిలా ఉంటే ఇన్స్పిరేషన్ 4 ఖర్చు ఎంత అయ్యిందనే విషయాల్ని స్పేస్ఎక్స్ ఫౌండర్ ఎలన్ మస్క్ వివరించకపోయినా.. బిలయన్ల ఖర్చు అయినట్లు తెలుస్తోంది. హైస్కూల్ డ్రాప్ అవుట్ అయిన జేర్డ్ ఐసాక్‌మాన్(38).. షిఫ్ట్4 పేమెంట్స్ ద్వారా బిలియనీర్‌గా ఎదిగాడు. ఈ ఇసాక్మాన్తో పాటు మరో ముగ్గురు ఇన్స్పిరేషన్లో పాల్గొన్నారు. ఈ నలుగురి ఆసక్తికరమైన ప్రస్థానం గురించి నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే ఓ డాక్యుమెంటరీ రూపొందించింది కూడా. క్రిస్ సెంబ్రోస్కి, సియాన్ ప్రోక్టర్, జేర్డ్ ఐసాక్‌మాన్, హాయిలే ఆర్కేనాక్స్(ఎడమ నుంచి.. ) క్రిస్ సెంబ్రోస్కి(42) యూఎస్ ఎయిర్‌ఫోర్స్ వెటరన్. ప్రస్తుతం ఈయన ఎయిరోస్పేస్‌లో డాటా ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. సియాన్ ప్రోక్టర్(51) జియోసైంటిస్ట్. అంతరిక్షంలోకి వెళ్లిన నాలుగో ఆఫ్రో-అమెరికన్‌గా రికార్డు సృష్టించారు. తొలి ఫస్ట్ స్పేస్‌క్రాఫ్ట్ పైలట్‌గా రికార్డు సృష్టించారు. The crew of #Inspiration4 is go for launch. pic.twitter.com/xou4rJJnjp — Inspiration4 (@inspiration4x) September 15, 2021 హాయిలే ఆర్కేనాక్స్(29).. క్యాన్సర్‌ను జయించిన యువతి, ఫిజీషియన్ అసిస్టెంట్ కూడా. అంతరిక్షంలోకి వెళ్లిన యంగెస్ట్ అమెరికన్. అంతేకాదు ప్రొస్తెసిస్(తొడ ఎముక భాగం)తో ఆర్బిట్‌లోకి వెళ్లిన వ్యక్తిగా ఘనత సాధించింది కూడా. ఇక స్పేస్ ఎక్స్ సాధించిన ఈ ఘనతపై అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసాతో పాటు అమెరికా మాజీ ఫస్ట్ లేడీ మిషెల్లీ ఒబామా కూడా హర్షం వ్యక్తం చేశారు. చదవండి: మంచి కోసమే ఇన్స్పిరేషన్ 4.. తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు! -
నింగిలోకి దూసుకుపోవాలనుందా? అయితే మీకో ఆఫర్!
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్ వ్యాపారవేత్త సర్ రిచర్డ్ బ్రాన్సన్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ బృందం రోదసీ యానాన్ని విజయవంతంగా ముగించుకొని వచ్చిన తరువాత స్పేస్ టూరిజంపై ఏర్పడిన క్రేజ్ అంతా ఇంతా కాదు. నింగిలోకి దూసుకెళ్లి అక్కడినుంచి భూమిని చూడాలన్న ఉత్సాహం, ఉత్సుకత అందరిలోనూ ఏర్పడింది. అయితే ఇది సామాన్య మానవుడికి అందని ద్రాక్షే. కోట్ల ఖరీదు చేసే ఈ అనుభవాన్ని సొంతం చేసుకోవడం ఒక్క శ్రీమంతులకే సాధ్యం. అంతరిక్షయానం చేయాలంటే 3 కోట్ల రూపాయలకు పైమాటే అంటోంది. వర్జిన్ గెలాక్టిక్. తమ స్పేస్ షిప్లో సీటు రిజర్వ్ చేసుకోవాలని పిలుపు నిస్తోంది. అంతరిక్ష యాత్ర చేయాలనుకునేవారికోసం బ్రిటన్ బిలియనీర్ స్పేస్ షిప్ కంపెనీ వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ తాజాగా ఈ ఆఫర్ ప్రకటించారు. చరిత్రాత్మక రోదసీయాత్ర విజయవంతంగా ముగించుకున్న కొన్ని వారాల తర్వాత స్పేస్ విమాన టికెట్ల విక్రయాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.ఈ విమానంలో సీటు దక్కించుకోవాలంటే 450,000 (సుమారు రూ.3,33,82,682) డాలర్లు చెల్లించు కోవాలి. అంతేకాదు ఇందుకు మూడు ప్యాకేజీలను కూడా ప్రకటించింది. సింగిల్ సీట్, మల్టీ-సీట్ ప్యాకేజీ, ఫుల్ ఫ్లైట్ బై అవుట్ ఆఫర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. సో.. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కింద టికెట్లు అందబాటులో ఉంటాయి. వచ్చే ఏడాది రెవెన్యూ విమానాలను ప్రారంభించే దిశగా పురోగతి సాధిస్తున్నట్లు స్పేస్-టూరిజం కంపెనీ గురువారం తెలిపింది.వర్జిన్ గెలాక్టిక్ తదుపరి అంతరిక్ష ప్రయాణం సెప్టెంబర్ చివరలో ఉండనుందని అంచనా. తాజా ప్రకటనతో కంపెనీ షేర్లు 5 శాతం దూసుకెళ్లడం విశేషం. కాగా జూలై 11న అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన మానవ సహిత వ్యోమ నౌక వీఎస్ఎస్ యూనిటీ-22లో బ్రాన్సన్ రోదసీలోకి దూసుకెళ్లాడు. ఈ యాత్రలో భాగంగా తెలుగు తేజం గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష మరో నలుగురున్నారు. ఆ తరువాత జూలై 20న అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ బృందం కూడా 'న్యూ షెపర్డ్' రాకెట్లో రోదసి యాత్ర పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో వర్జిన్ గెలాక్టిక్ ప్రజలను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు యుఎస్ ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ నుండి వర్జిన్ గెలాక్టిక్ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.